water availability
-
ట్రిబ్యునల్ అంచనా కంటే అధికంగా వంశధార
వంశధారలో ఏటా సగటున 166 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. నదీ పరీవాహక ప్రాంతంలో 2003–04 నుంచి 2022–23 మధ్య 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని వంశధారలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇటీవల అధ్యయనం చేసింది. వంశధార ట్రిబ్యునల్ 2017లో బేసిన్లో 115 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. ట్రిబ్యునల్ తేల్చిన దానికంటే వంశధారలో లభ్యత 51 టీఎంసీలు అధికంగా ఉన్నట్టు సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైంది. వంశధారలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. - సాక్షి, అమరావతిసీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలివీ..వంశధార బేసిన్లో 2003–04 నుంచి 2022–23 మధ్య 20 ఏళ్లలో సగటున ఏటా 1,342 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 498.02 టీఎంసీలుబేసిన్లోని జలాశయాల్లో ఏటా ఆవిరి నష్టాలు సగటున 1.06 టీఎంసీలుతాగునీరు, పారిశ్రామిక అవసరాలు, జంతువులకు తాగునీటి అవసరాల కోసం 2022–03లో 0.71 టీఎంసీలు వినియోగించుకున్నారు వంశధార ప్రస్థానం ఇదీ.. జన్మస్థానం: ఒడిశాలో ఉమ్మడి పూల్భణి జిల్లాలో బెలగడ్ వద్ద సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఒడిశాలో ప్రవాహ మార్గం: కంధమాల్, కలహండి, రాయగడ, గజపతి జిల్లాల్లో 125 కి.మీ.ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాహ మార్గం: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 96 కి.మీ. సముద్ర సంగమం: కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో వంశధార బేసిన్ పరిధి: మొత్తం 10,504 చదరపు కిలోమీటర్ల వైశాల్యం -
పెన్నాలో 367.98 టీఎంసీల లభ్యత
సాక్షి, అమరావతి:పెన్నా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో కావాల్సినన్ని నీళ్లు ఉన్నాయంటోంది కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ). అధునాతన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బేసిన్లో 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనంలో పెన్నాలో 367.98 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఎఆర్‌ఎస్‌సీ) సహకారంతో 2019లో 25 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా పెన్నాలో 395.53 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ లెక్కకట్టింది. అప్పటి కంటే ఇప్పుడు చేసిన అధ్యయనంలో నీటి లభ్యత 27.55 టీఎంసీల తగ్గిందని తేల్చింది. వర్షఛాయ ప్రాంతం (రెయిన్ షాడో ఏరియా)లో పుట్టి, ప్రవాహించే పెన్నాలో ఈ స్థాయిలో నీటి లభ్యత ఉంటుందా? అని జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ఇంజినీర్లు, నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తుపాన్లు, కుండపోత వానలు.. వాటి ప్రభావం వల్ల వచ్చే నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని నీటి లభ్యతపై చేసే అధ్యయానికి శాస్త్రీయత ఉండదని చెబుతున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో నంది కొండల్లో పుట్టిన పెన్నా నది కర్ణాటకలోని కోలార్, తుమకూరు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల మీదుగా 697 కిమీల దూరం ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమ వైపు నుంచి జయమంగళి, కుందేరు.. కుడి వైపు నుంచి చిత్రావతి, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు ప్రధాన ఉప నదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్ 54,905 చదరపు కిలోమీటర్ల (ఆంధ్రప్రదేశ్ 87 శాతం, కర్ణాటక 13 శాతం) పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ప్రధానాంశాలు» పెన్నా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో ఏటా సగటున 752.72 మిమీల వర్షపాతం కురిసింది. ఈ వర్షపాతం పరిమాణం 1,459.56 టీఎంసీలు. బేసిన్లో గరిష్టంగా వర్షపాతం 2020–21లో 1,265 మి.మీ.లు కురిసింది. దీని పరిమాణం 2,452.96 టీఎంసీలు.. బేసిన్ కనిష్ట వర్షపాతం 2018–19లో 395 మి.మీ.లు నమోదైంది. దీని పరిమాణం 765.27 టీఎంసీలు.» బేసిన్లో 1996–97లో గరిష్టంగా నీటి లభ్యత 1,067.57 టీఎంసీలు ఉండగా.. 2011–12లో కనిష్టంగా 94.29 టీఎంసీల లభ్యత ఉంది. 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చూస్తే ఏటా సగటున 367.98 టీఎంసీల లభ్యత ఉంది. » 1985–86 నుంచి 2022–23 మధ్య సాగునీటి కోసం ఏటా 212.60 టీఎంసీలను వినియోగించారు. » బేసిన్లో రిజర్వాయర్లలో ఏటా సగటున నీటి ఆవిరి నష్టాలు 17.66 టీఎంసీలు.» 2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, జంతువులకు తాగునీటి అవసరాల కోసం 17.30 టీఎంసీలు ఉపయోగించారు. -
గోదావరి.. అపార జలసిరి
సాక్షి, అమరావతి: గోదావరిలో జలసిరులు అపారంగా ఉన్నాయని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) స్పష్టంచేసింది. ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని తాజాగా తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని సీడబ్ల్యూసీ వెల్లడించింది. గోదావరిలో ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించిన అధ్యయనాల్లో నిర్ధారించిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉందని ప్రకటించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరులు, బచావత్ ట్రిబ్యూనల్ సమయంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం గల ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయాలంటే వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకోవాలని చెబుతున్నారు. బేసిన్లో కొంతకాలం అధిక వర్షపాతం కురవడం... ఆ సమయంలో ఒకేసారి గరిష్టంగా వరద రావడం తదితర కారణాల వల్లే గోదావరిలో నీటి లభ్యత పెరగడానికి కారణమని నీటిపారుదలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోదావరి బేసిన్ ఇదీ.. దేశంలో రెండో అతి పెద్ద నది గోదావరి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్‌లో సముద్రమట్టానికి 1,067 మీటర్ల ఎత్తులో జని్మంచిన గోదావరి... మహారాష్ట్ర, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో 1,465 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏపీలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.గోదావరికి ప్రవర, పూర్ణ, మంజీర, పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ప్రధాన ఉప నదులు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పుదుచ్చేరిలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ..» గోదావరిలో 1985–86 నుంచి 2022–23 వరకు ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉంది. » 2013–14లో గరిష్టంగా 8,664.82 టీఎంసీల లభ్యత ఉండగా... 2009–10లో నీటి లభ్యత కనిష్టంగా 2,066.62 టీఎంసీల లభ్యత ఉంది. » బేసిన్లో సగటున 1,167 మి.మీ. వర్షపాతం కురుస్తుంది. దీనివల్ల గోదావరిలో ఏటా సగటున 12,869.74 టీఎంసీల ప్రవాహం ఉంటుంది. 1994–95లో గరిష్టంగా 1,484 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గరిష్టంగా 17,054.89 టీఎంసీల ప్రవాహం ఉంది. 2015–16లో బేసిన్లో కనిష్టంగా 914 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గోదావరిలో కనిష్టంగా 9,608.43 టీఎంసీల ప్రవాహం ఉంది. » 1985–2023 మధ్య ఏటా సగటున 850.38 టీఎంసీలను మాత్రమే సాగునీటి కోసం వినియోగించుకున్నారు. » 2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, పశువులకు తాగునీటి కోసం 70.28 టీఎంసీలు వాడుకున్నారు. » బేసిన్లో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటున 181.52 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ నిర్ధారించింది. -ఆలమూరు రామగోపాలరెడ్డి -
ఆదమరిస్తే జల సంక్షోభమే!
సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే ప్రమాదముందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తంచేసింది. గ్రీన్హౌస్ ప్రభావంవల్ల భూతాపం క్రమేణా పెరుగుతుండటం.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంవల్ల రుతుపవనాల గమనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని దేశంలో నీటి లభ్యతపై ఇటీవల చేసిన తన అధ్యయనంలో పేర్కొంది. పర్యవసానమే అతివృష్టి.. అనావృష్టి పరిస్థితులతోపాటు వర్షపాత విరామాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని తెలిపింది. అతివృíÙ్ణ పరిస్థితులు ఏర్పడినప్పుడు వరద జలాలను ఒడిసిపట్టి జలాశయాలు నింపుకోలేకపోవడం.. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టకపోవడంవల్ల నీటి ఎద్దడికి దారితీస్తోందని వెల్లడించింది. ఫలితంగా సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. కర్ణాటక రాజధాని బెంగుళూరులో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడిని ఇందుకు ఉదహరిస్తోంది.ఇలాగైతే కష్టమే..! పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తంచేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వచేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చని కేంద్రానికి సూచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టంచేసింది. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేలి్చచెప్పింది. అలాగే, ఏటా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగకుంటే ఆహార సంక్షోభానికి కూడా దారితీస్తుందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది.తలసరి నీటి లభ్యత తగ్గుముఖం.. ఇక దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడంలేదనే అంశాన్ని కూడా సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (ఒక క్యూబిక్ మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయిందని వెల్లడించింది. అలాగే, నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది.సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే..దేశంలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన అంశాలేమిటంటే.. » దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. » ఈ వర్షపాతంవల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. » ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే.. వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్లు వెల్లడవుతోంది. » దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటినిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వచేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను వాడుకుంటున్నాం. » ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. -
పెన్నాలో అన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో పురుడుపోసుకుని ప్రవహించే పెన్నానదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నానది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1,412.58 టీఎంసీలని లెక్కగట్టింది.వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటిలభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదంటున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా..పెన్నాలో నీటిలభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటిలభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది.75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని పేర్కొంది. కానీ బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. 1993తో పోలిస్తే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటిలభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటిరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటిలభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో వర్షఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నందికొండల్లోని చెన్నకేశవ పర్వతశ్రేణుల్లో పుట్టిన పెన్నానది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడివైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉపనదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్‌లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్‌లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇలాగైతే ‘నీళ్లు నమలాల్సిందే’
సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడం లేదనే అంశాన్ని స్పష్టంచేసింది. తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (ఒక క్యూబిక్ మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోవడాన్ని గుర్తు చేసింది. నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే.. 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది. ఇలాగైతే.. కష్టమే! పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వ చేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చనని కేంద్రానికి సూచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టం చేసింది. నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేల్చింది. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించింది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే ♦ దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ♦ వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. ♦ ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్టు వెల్లడవుతోంది. ♦ దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నాం. ♦ ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. అన్ని జిల్లాల్లో కలిపి 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. -
గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం!
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నీటి లభ్యతపై స్పష్టత లేనందున కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)తో అధ్యయనం జరిపించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నిర్ణయించింది. ఇందుకు సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపించనుంది. గోదావరి బోర్డు చైర్మన్ ముఖేష్‌కుమార్ సిన్హా అధ్యక్షతన మంగళవారం జలసౌధలో జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్రాల తరఫున వాదనలు వినిపించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్(హైడ్రాలజీ) నిత్యానంద రాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మళ్లీ అధ్యయనం అనవసరం: సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో 2020–21 నాటి వరకు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం జరిపించగా, గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 1430–1480 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేలిందని నిత్యానంద రాయ్ వెల్లడించారు. ఐదేళ్ల మూవింగ్ యావరేజీ ప్రకారం1,430–1,600 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధ్యయనం జరపాల్సిన అవసరం లేదని హైడ్రాలజీ డైరెక్టర్‌గా తన అభిప్రాయమని స్పష్టం చేశారు. ఏపీ అధికారులు ఢిల్లీకి వస్తే అధ్యయన నివేదికలు చూపిస్తామన్నారు. మళ్లీ అధ్యయనం జరపాలని ప్రతిపాదనలు పంపితే సీడబ్ల్యూసీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పోలవరంతో సహా ఏపీ ప్రాజెక్టులకు 484.5 టీఎంసీల జలాలు అవసరమని, ఈ మేరకు ఏపీలోని అన్ని ప్రాజెక్టుల అవసరాలను పరిరక్షిస్తూనే తెలంగాణలోని ఒక్కో ప్రాజెక్టు క్లియరెన్స్ విషయంలో సీడబ్ల్యూసీ ముందుకు వెళ్తుందన్నారు. ఈ విషయంలో ఏపీకి ఆందోళన అవసరం లేదన్నారు. ఏపీ ప్రాజెక్టులకు ఢోకా లేదన్నారు. 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా గోదావరిలో మిగులు జలాలు లేవని తేలిందన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం జరిపించే అధికారం, పరిధి గోదావరి బోర్డుకు లేదని, సీడబ్ల్యూసీతో అధ్యయనం జరిపిస్తే తమకు అభ్యంతరం ఉండదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటి లభ్యతపై మాత్రమే కాకుండా గోదావరి పరీవాహకంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యతపై సైతం అధ్యయనం చేస్తేనే సరైన ఫలితం ఉంటుందని ఆయన సూచించారు. అయితే కేవలం తెలంగాణ, ఏపీకి లభ్యతపైనే అధ్యయనం జరపాలని ఏపీ ఈఎన్సీ కోరారు. అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ఏపీ ఈఎన్సీ ‘ఏ విషయాల్లో మా అభిప్రాయాలు అడగడం లేదు. అడిగినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మేము లేవనెత్తిన అంశాలను తేల్చకుండానే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇస్తున్నారు. సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఎంసీ) ఇటీవల సమావేశమై తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ సమావేశానికి ఏపీని అహ్వానించలేదు. ఇకపై టీఏసీ సమావేశాలకు ఏపీని పిలవాలి. మేము లేవనెత్తిన ప్రతి అంశాన్ని తేల్చిన తర్వాతే ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలి’అని ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ లేవనెత్తిన అంశాలపై సాంకేతికంగా గోదావ రి బోర్డు చైర్మన్ అధ్యయనం జరపాలని, ఆ తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్ విషయంలో ముందుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేయగా, గోదావరి బోర్డు చైర్మన్ అంగీకరించలేదు. ప్రాజెక్టుల డీపీఆర్‌లను మదింపు చేయడం వరకే తన బాధ్యత అని ఆయన బదులిచ్చారు. ఏపీవి అన్నీ అపోహలేనన్న తెలంగాణ ఈఎన్సీ ఏపీ లేవనెత్తిన అన్ని అంశాలనూ సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుందని, ప్రతి అంశాన్ని తేల్చిందని, ఏపీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం లేకుండా చూసుకున్న తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇచ్చిందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ బదులిచ్చారు. ఏపీవి అన్నీ అపోహలే అని కొట్టిపారేశారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లకు క్లియరెన్స్‌ల జారీలో జాప్యం కారణంగా ఆయా ప్రాజెక్టుల అంచనా వ్యయం 20–25 శాతం పెరిగిందని రజత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు జీ–5 సబ్ బేసిన్‌తో ఏపీకి సంబంధం లేదు.. రాష్ట్రంలోని కడెం–గూడెం, మొడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఏపీ, తెలంగాణ అభిప్రాయాలతో సీడబ్ల్యూసీలోని టీఏసీ క్లియరెన్స్ కోసం పంపించాలని ఈ సమావేశంలో గోదావరి బోర్డు నిర్ణయం తీసుకుంది. కడెం ప్రాజెక్టుకు 14.75 టీఎంసీలు అవసరం కాగా 15 టీఎంసీల లభ్యత ఉన్నందున గూడెం ఎత్తిపోతల అవసరం లేదని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అంతకు ముందు జరిగిన చర్చలో అభ్యంతరం తెలిపారు. గోదావరిలోని జీ–5 సబ్ బేసిన్ పరిధిలో కడెం ప్రాజె క్టు వస్తుందని, ఏపీలోని ప్రాజెక్టులకు జీ–5 సబ్ బేసిన్ నుంచి నీళ్లు వెళ్లవని, తెలంగాణ అవసరాలకే సరిపోతాయని .. కడెం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతుల్లో సీడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ బదులిచ్చారు. జీ–1 నుంచి జీ–6 సబ్ బేసిన్ల నీళ్లు ఏపీకి పోవని, జీ–7 నుంచి జీ–12 సబ్ బేసిన్ల నీళ్లను ఆధారంగా చేసుకుని పోలవరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ అభ్యంతరాలకు విలువ లేదని కొట్టిపారేశారు. అయినా, కడెం–గూడెం ఎత్తిపోతలకు అంగీకరించమని ఏపీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో 5 టెలిమెట్రీ స్టేషన్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు తక్షణ మరమ్మతులు చేపట్టడానికి రెండు రాష్ట్రాలు ఈ సమావేశంలో అంగీకరించాయి. గోదావరిపై 23 చోట్ల టెలిమెట్రీ స్టేషన్లు పెట్టాలని ప్రతిపాదనలు రాగా, తొలుత ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని పెద్దవాగు, పెద్దవాగు ఎడమ కాల్వ, పెద్దవాగు కుడి కాల్వ, కిన్నెరసానితో పాటు మరో వాగుపై మాత్రమే ఏర్పాటు చేయాలని తెలంగాణ సూచన మేరకు ఈ సమావేశంలో నిర్ణయించారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో పెట్టాలని ఏపీ కోరింది. టెలిమెట్రీ స్టేషన్ల ద్వారా రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను నమోదు చేస్తారు. -
‘కృష్ణా’లో నీటి లభ్యత 2,048 టీఎంసీలే
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో ఏటా సగటున నీటి లభ్యత సామర్థ్యం 3,144.41 టీఎంసీలు ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఇందులో వాడుకోదగినవి 2,048.25 టీఎంసీలు మాత్రమేనని తేల్చింది. ‘కృష్ణా’లో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు (పునరుత్పత్తి జలాలు 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు)గా 1976లో బచావత్ ట్రిబ్యునల్ తేల్చింది. బచావత్ ట్రిబ్యునల్ లెక్కగట్టిన దానికంటే ప్రస్తుతం ‘కృష్ణా’లో వాడుకోదగినవిగా సీడబ్ల్యూసీ తేల్చిన జలాలు 12 టీఎంసీలు తక్కువగా ఉండటం గమనార్హం. కృష్ణా నదిలో వరద రోజులు తగ్గడం.. వరద వచ్చినప్పుడు ఒకేసారి గరిష్టంగా రావడం.. ఆ స్థాయిలో వరదను ఒడిసిపట్టి మళ్లించే సదుపాయాలు లేకపోవడంవల్ల కడలిలో కలిసే జలాల పరిమాణం అధికంగా ఉందని.. అందువల్లే ‘కృష్ణా’లో వాడుకోదగిన జలాల పరిమాణం తగ్గుతోందని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలోని నదులలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది. అందులో ముఖ్యాంశాలు ఏమిటంటే.. వాడుకోడానికి అవకాశం ఉన్నది 34.51 శాతమే ► దేశంలోని నీటి లభ్యతలో గంగా నది మొదటి స్థానంలో నిలిస్తే. గోదావరి రెండో స్థానంలో ఉంది. ‘కృష్ణా’ మూడో స్థానంలోనూ.. మహానది, నర్మద నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. పెన్నా నది 15వ స్థానంలో నిలిచింది. ► హిమాలయ నదులు, ద్వీపకల్ప నదుల్లో ఏడాదికి సగటున 70,601.08 టీఎంసీల లభ్యత సామర్థ్యం ఉంది. ఇందులో వినియోగించుకోవడానికి అవకాశమున్నది 24,367.12 టీఎంసీలే(34.51 శాతం). వరదలను ఒడిసిపట్టి, మళ్లించే సామర్థ్యం లేకపోవడంవల్ల 65.49 శాతం (46,233.96 టీఎంసీలు) జలాలు కడలిలో కలుస్తున్నాయి. ► గంగా నది పరివాహక ప్రాంతం (బేసిన్) 8,38,803 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. గంగాలో నీటి లభ్యత సామర్థ్యం ఏటా 17,993.53 టీఎంసీలు ఉంటుంది. ఇందులో ప్రస్తుతానికి వినియోగించుకోవడానికి అవకాశమున్నది 8,828.66 టీఎంసీలు. ► అలాగే, గోదావరి బేసిన్ 3,12,150 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇందులో నీటి లభ్యత సామర్థ్యం ఏడాదికి సగటున 4,157.94 టీఎంసీలు. ప్రస్తుతానికి వినియోగించుకోవడానికి అవకాశమున్నది 2,694.5 టీఎంసీలే. పెన్నాలో జలరాశులు అపారం ఇక పెన్నా నది వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతమైన కర్ణాటకలోని నందిదుర్గం కొండల్లో పురుడుపోసుకుని.. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల మీదుగా ప్రవహించి 597 కి.మీల దూరం ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్నా బేసిన్ 54,905 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. దేశంలో అతిపెద్ద నదుల్లో పెన్నాది 15వ స్థానం. ఈ నదిలో ఏటా సగటున నీటి లభ్యత సామర్థ్యం 389.16 టీఎంసీలని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇందులో వాడుకోదగిన జలాలు 243.67 టీఎంసీలని తేల్చింది. గత నాలుగేళ్లుగా పెన్నా బేసిన్లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటం వల్ల నీటి లభ్యత పెరిగిందని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
మూడేళ్లుగా.. అదే జోరుగా..
సాక్షి, అమరావతి: నీటి లభ్యతలో కృష్ణాతో ఉప నది తుంగభద్ర పోటీ పడుతోంది. చరిత్రలో లేని విధంగా జూలై మూడో వారానికే తుంగభద్ర డ్యామ్‌లోకి 172.89 టీఎంసీల ప్రవాహం వచ్చింది. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల కురిసే వర్షాలతో అక్టోబర్ వరకు డ్యామ్‌లోకి వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది తుంగభద్రలో నీటి లభ్యత అధికంగా ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది తుంగభద్ర డ్యామ్, దిగువన ప్రాజెక్టులపై ఆధారపడ్డ మూడు రాష్ట్రాల్లోని 17,33,878 ఎకరాల ఆయకట్టు రైతులకు మేలు చేస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర 1958లో పూర్తయింది. డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రపద్రేశ్‌కు 72 టీఎంసీలు (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 29.5, కేసీ కెనాల్‌కు అసిస్టెన్స్), తెలంగాణకు 6.51 (ఆర్డీఎస్కు అసిస్టెన్స్), కర్ణాటకకు 151.49 టీఎంసీలు పంపిణీ చేసింది. 1980–81లో మాత్రమే ట్రిబ్యునల్ కేటాయించిన దానికంటే 1.383 టీఎంసీలు అధికంగా అంటే 231.383 టీఎంసీలను డ్యామ్ ద్వారా మూడు రాష్ట్రాలు వినియోగించుకొన్నాయి. డ్యామ్‌లో పూడిక పేరుకుపోతుండటంతో నిల్వ సామర్థ్యం తగ్గింది. దీంతో బోర్డు నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేస్తోంది. గత మూడేళ్లుగా తుంగభద్ర డ్యామ్, దాని దిగువన ఉన్న రాయబసవన, విజయనగర చానల్స్, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం), కేసీ కెనాల్‌కు నీటిని సరఫరా చేసే సుంకేశుల బ్యారేజీ వద్ద నీటి లభ్యత మెరుగ్గా ఉంది. డ్యామ్ చరిత్రలో ఈ ఏడాదే అధికంగా ప్రవాహం వచ్చింది. డ్యామ్‌లో గరిష్ట స్థాయిలో 104.5 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న సుమారు వంద టీఎంసీలను దిగువకు విడుదల చేశారు. ఈ జలాలు సుంకేశుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నాయి. పంటల సాగులో రైతులు నిమగ్నం తుంగభద్ర డ్యామ్‌పై నేరుగా ఆధారపడి ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లెల్సీ (దిగువ కాలువ) 1,57,062 ఎకరాలు, హెచ్చెల్సీ (ఎగువ కాలువ) కింద 2,84,992 ఎకరాలు, కర్ణాటకలో 8,96,456 ఎకరాలు.. మొత్తం 13,38,510 ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యామ్ దిగువన రాయబసవన, విజయనగర చానల్స్ కింద కర్ణాటకలో 30,368 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో కేసీ కెనాల్ కింద 2,78,000 ఎకరాలు, తెలంగాణలో ఆర్డీఎస్ కింద 87,000 ఎకరాలు వెరసి 3,95,368 ఎకరాల ఆయకట్టు ఉంది. అంటే.. డ్యామ్‌పై ఆధారపడిన మొత్తం ఆయకట్టు 17,33,878 ఎకరాలు. డ్యామ్ ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసం ధానం చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ తేల్చిచెప్పింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశం బుధవారం వర్చువల్ విధానంలో జరి గింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నా గార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదు గా కావేరికి తరలించడానికి సమగ్ర ప్రాజెక్టు నివేది కను (డీపీఆర్‌ను) రాష్ట్రాలకు అందజేశామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ చెప్పారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి గోదావరి–కావేరి అను సంధానంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకే గోదా వరి జలాలు సరిపోతాయని, నీటిలభ్యత ఎక్క డుందని జవహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు లను పరిగణనలోకి తీసుకోకుండానే డీపీఆర్ రూపొందించారని ఆక్షేపించారు. గోదావరి వరద (మిగులు) జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్‌కే గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిం దని గుర్తుచేశారు. ఏపీ అవసరాలు తీర్చాకే మిగిలి న జలాలను తరలించాలని స్పష్టం చేశారు. దీనిపై పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. ఆ తర్వాతే బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో అనుసంధానంపై చర్చించాలని చెప్పారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాకే అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేశారు. కొత్త రిజర్వాయర్లు లేకుండా అనుసంధానమా? ఇచ్చంపల్లి నుంచి తరలించే గోదావరి జలాలను నాగార్జునసాగర్, సోమశిల రిజర్వాయర్లలో నిల్వ చేసి.. కావేరి బేసిన్‌కు తరలించేలా డీపీఆర్‌ను రూపొందించడంపై ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం తెలిపారు. నాగార్జునసాగర్, సోమశిలలో నిల్వచేసే జలాలు వాటి ఆయకట్టుకే సరి పోవడం లేదన్నారు. గోదావరి జలాల నిల్వకు కొత్త రిజర్వాయర్లు నిర్మించకుండా అనుసంధానం అసాధ్యమని చెప్పారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ కొత్త రిజర్వాయర్ల నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏకు సూచించారు. నీటి లభ్యత తేల్చాకే చర్చించాలి : తెలంగాణ గోదావరిలో నీటిలభ్యతను శాస్త్రీయంగా తేల్చా కే, కావేరికి నీటి తరలింపుపై చర్చించాలని తెలంగాణ కూడా అభిప్రాయపడింది. గోదావ రి జలాల్లో తమ వాటా నీటిని కావేరి బేసిన్‌కు తరలించడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌ఘడ్ స్పష్టం చేసింది. కావేరి బేసిన్లో కర్ణాటకలోనే కరవు పీడిత ప్రాంతాలు ఎక్కువని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందువల్ల గోదావరి జ లాల్లో వాటా ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఏపీ తో పోల్చితే కృష్ణా బేసిన్లో తమ రాష్ట్రంలోనే కరవు పీడిత ప్రాంతాలు అధికమైనందున కృష్ణా బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకు బదులు కృష్ణాజలాల్లో అదనపు వాటా ఇవ్వాల ని కోరింది. మహారాష్ట్ర కూడా కృష్ణాజలాల్లో అద నపు వాటా ఇవ్వాలని కోరింది. కావేరి బేసి న్కు గోదావరి జలాలను తరలిస్తున్నందున, కావేరి జలాల పంపకంలో న్యాయం చేయాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధా నంపై ఎలాంటి అభ్యంతరం లేదని ఒడిశా తెలిపింది. తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను తరలించి ఆదుకోవాలని తమిళనాడు కోరింది. -
ఇదేం లెక్క.. కృష్ణా?
సాక్షి, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతం (బేసిన్)లో సరాసరి నీటి లభ్యత 3,144.42 టీఎంసీలని తాజాగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 2,522.52 టీఎంసీలని లెక్కగట్టింది. అయితే కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేయగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2,173 టీఎంసీల లభ్యత ఉంటుందని వెల్లడించింది. సీడబ్ల్యూసీ 1993లో తొలిసారి నిర్వహించిన అధ్యయనంలో కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,069.08 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కగట్టింది. బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్లు, సీడబ్ల్యూసీ తొలిసారి జరిపిన అధ్యయనాల్లో తేల్చిన దానికంటే కృష్ణాలో సుమారు 20 శాతం నీటి లభ్యత అధికంగా ఉన్నట్లు తాజాగా సీడబ్ల్యూసీ తేల్చడం గమనార్హం. కృష్ణాలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోవడంతో ట్రిబ్యునళ్ల అంచనాల మేరకు కూడా నీళ్లు రావడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ సంస్థలు, ట్రిబ్యునళ్లు తేల్చిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉన్నట్లు తాజాగా సీడబ్ల్యూసీ వెల్లడించడంపై అపార అనుభవం కలిగిన ఇంజనీర్లు, అంతరాష్ట్ర జలవనరుల విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారు లు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కించడం అశాస్త్రీయమని, వీటిని కచ్చితమైన లెక్కలుగా పరిగణించలేమని స్పష్టం చేస్తున్నారు. బేసిన్లో కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యత లెక్కించడం శాస్త్రీయమని, బచావత్ ట్రిబ్యునల్, 1993లో సీడబ్ల్యూసీ ఇదే రీతిలో అధ్యయనం చేశాయని గుర్తు చేస్తున్నారు. వర్షపాతం పెరగడం వల్లే..!! దేశవ్యాప్తంగా 1985 నుంచి 2015 మధ్య వరద ప్రవాహాల ఆధారంగా నదుల్లో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇటీవల హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీతో కలిసి అధ్యయనం చేసింది. కృష్ణా బేసిన్లో వర్షపాతం, వరద ప్రవాహం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఆవిరి, ఆయకట్టు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నీటి లభ్యత లెక్కగట్టింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలు ఇవీ.. ► 1955–84 మధ్య కృష్ణా బేసిన్లో సగటు వర్షపాతం 842 మిల్లీమీటర్లు. 1965–84 మధ్య కాలంలో సగటు వర్షపాతం 797 మిల్లీమీటర్లకు తగ్గింది. 1985–2015 మధ్య బేసిన్లో సగటు వర్షపాతం 841 మిల్లీమీటర్లకు పెరిగింది. ► 2010–11లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో 9,607.85 టీఎంసీలు వచ్చాయి. ఇందులో నదిలో 4,164.81 టీఎంసీల లభ్యత వచ్చింది. 2002–03లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో 5,457.16 టీఎంసీలే వచ్చాయి. ఇందులో నదిలో 1,934.63 టీఎంసీల లభ్యత వచ్చింది. ► 1985–2015 మధ్య కాలంలో సగటు వర్షపాతం 841 మిల్లీమీటర్ల వల్ల ఏడాదికి 226 బిలియన్ క్యూబిక్ మీటర్లు (7,980.96 టీఎంసీలు) వచ్చాయి. ఇందులో కృష్ణా నదిలో సరాసరి సగటున 3,144.42 టీఎంసీల లభ్యత ఉంటుంది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 2,522.52 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. ► గతంతో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం పెరగడం వల్లే కృష్ణాలో నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. 8,070 చ.కి.మీ. పెరిగిన బేసిన్ విస్తీర్ణం.. ► మహారాష్ట్రలోని సతారా జిల్లా మహాబలేశ్వర్కు సమీపంలో పశ్చిమ కనుమల్లో సముద్ర మట్టానికి 1,337 మీటర్ల ఎత్తున జోర్ గ్రామం వద్ద పురుడు పోసుకునే కృష్ణమ్మ 1,400 కి.మీ. ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణాకు మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, బీమా, వేదవతి, మూసీ తదితర 12 ఉపనదులున్నాయి. ► కృష్ణా పరీవాహక ప్రాంతం 2,59,439 చదరపు కిలోమీటర్లలో విస్తరించిందని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. 1993లో సీడబ్ల్యూసీ అధ్య యనం జరిపినప్పుడు కృష్ణా బేసిన్ 2,51,369 చదరపు కిలోమీటర్లలో ఉంది. తాజాగా జియో స్పేషియల్ డేటా ఆధారంగా సర్వే చేయడం వల్ల బేసిన్ విస్తీర్ణం 8,070 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. ► 1985–86లో కృష్ణా బేసిన్లో 70,72,365 హెక్టార్ల ఆయకట్టు ఉండగా 2014–15 నాటికి 81,69,157 హెక్టార్లకు పెరిగింది. ► బేసిన్లో ఏటా 72.39 టీఎంసీలు ఆవిరవు తాయి. ఇందులో గరిష్టంగా శ్రీశైలం, నాగార్జున సాగర్‌లోనే ఎక్కువగా ఆవిరవుతాయి. పదేళ్లలో ఏడేళ్లు తీవ్ర నీటి కొరత.. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రపదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. అయితే గత పదేళ్లలో ఏడేళ్లు ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు జలాలు రాలేదు. శ్రీశైలం జలాశయానికి 2011–12లో 733.935, 2012–13లో 197.528, 2014–15లో 614.07 టీఎంసీలు వస్తే 2015–16లో కేవలం 58.692 టీఎంసీలే వచ్చాయి. 2016–17లో శ్రీశైలం జలాశయానికి 337.95 టీఎంసీలు రాగా 2017–18లో 423.93, 2018–19లో 541.31 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. అంటే 2011–12 నుంచి 2020–21 వరకూ గత పదేళ్లలో ఏడేళ్లు తెలుగు రాష్ట్రాలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొన్నట్లు స్పష్ట మవుతోంది. బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున ల్లు కేటాయించిన మేరకు కూడా కృష్ణా జలాలు రాష్ట్రాన్ని చేరలేదు. వీటిని పరిగణలోకి తీసుకుంటే సీడబ్ల్యూసీ తాజాగా చేసిన అధ్యయనం శాస్త్రీయం కాదని నీటిపారుదల నిపుణులు చేస్తున్న వాదన వంద శాతం వాస్తవమని స్పష్టమవుతోంది. -
25న కన్నెపల్లిలో వెట్‌రన్!
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరాయి. ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ పనులను క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించిన సీఎం కేసీఆర్ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. వర్షాలు రాకముందే పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఖరీఫ్‌కు నీరందించాలంటే అత్యంత కీలకమైన మేడిగడ్డ(కన్నెపల్లి) పంపుహౌస్‌లో మోటార్ల బిగింపులో వేగం పెంచి ఈ నెల చివర, జూన్ మొదటి వారంలోగా వెట్‌రన్ నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతో ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల ప్రతినిధులు పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో ఈ నెల 24 లేదా 25న వెట్‌రన్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బిగించిన 8 మోటార్లలో 5 మోటార్లకు దశల వారీగా వెట్‌రన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తరలింపు కన్నెపల్లి పంపుహౌస్ నిర్మాణానికి దిగువన 400 మీటర్ల దూరంలో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. వెట్‌రన్ చేయడానికి వేసవి కాలం కావడంతో నీటి లభ్యత తక్కువగా ఉంది. గోదావరికి అడ్డంగా తాత్కాలికంగా కాఫర్ డ్యాంను 20 రోజుల క్రితం నిర్మించారు. ఆదివారం సీఎం పర్యటన ముగిశాక కాఫర్ డ్యాం కట్టను తెంపడంతో నీటి ప్రవాహం ఫోర్‌బేకు చేరింది. సోమవారం వరకు కాఫర్ డ్యాంకు మళ్లీ అప్రోచ్‌కెనాల్ వద్ద కట్టను మూసీ వేసి వెట్‌రన్ కోసం నీటిని నిల్వ ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకు 2 టీఎంసీలు కన్నెపల్లి పంపుహౌస్‌లో మొత్తం 11 మోటార్లు బిగించాలి. ఇప్పటికే 8 మోటార్లు బిగించగా, మరో 2 మోటార్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఖరీఫ్‌లో కనీసం 5 మోటార్లకు వెట్‌రన్ పరీక్షలు నిర్వహించి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని రివర్స్ పంపింగ్ విధానం ద్వారా ఎగువకు తరలించడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఈఈ, డీఈఈ, జేఈఈలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పనుల ప్రగతిపై ఆరా తీస్తున్నారు. -
గోదారమ్మకు ఏమైంది?
సాక్షి, అమరావతి: గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా లేకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో నాలుగేళ్లుగా వరద ప్రవాహం తగ్గడంపై నివ్వెరపోతున్నారు. అక్టోబర్ మూడో వారం నుంచి ఫిబ్రవరి వరకు నదీలో కనీసం 75 నుంచి 80 టీఎంసీల లభ్యత ఉండేది. సీలేరు, డొంకరాయి జలాశయాల్లో నిల్వ ఉన్న నీటితోనే గోదావరి డెల్టాలో రబీ సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.నాలుగేళ్లుగా గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. రబీ పంటల సాగు సవాల్‌గా మారింది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గోదావరిలో 23 నుంచి 25 టీఎంసీల నీటిలభ్యత మాత్రమే ఉండడంతో డెల్టాలో పూర్తిస్థాయిలో పంటలు సాగుచేయలేని దుస్థితి నెలకొంది. పోలవరం పూర్తయితే తప్ప డెల్టాలో పూర్తిస్థాయిలో రబీ పంటల సాగుకు అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించిన ఒకట్రెండు వారాల్లోనే పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటం వల్ల గోదావరి నదిలో వరద ప్రారంభమవుతుంది. గోదావరి నదీ జలాలు ధవశేళ్వరం బ్యారేజీ మీదుగా ఏటా సగటున 2,500 నుంచి మూడువేల టీఎంసీలు సముద్రంలో కలిస్తే.. సింహభాగం జూలై నుంచి సెప్టెంబరు వరకు వచ్చే వరద కావడం గమనార్హం. గత నాలుగేళ్లలో 2016–17లో మినహా మిగతా మూడేళ్లలో వరద జలాలు పెద్దగా సముద్రంలో కలవలేదు. నదీ పరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా ఏకరీతిలో వర్షాలు కురిస్తే.. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ..ఊట ద్వారా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గోదావరి డెల్టాలో రబీ సాగుకు అవసరమైన 83 టీఎంసీలు సహజసిద్ధంగా లభించేవి. సమృద్ధిగా వర్షాలు కురకపోవడం వల్ల అక్టోబర్ నుంచి సహజసిద్ధంగా లభించే జలాలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది 25 టీఎంసీలకు మించి నీటి లభ్యత లేకపోవడంలో రబీ పంటల సాగు సవాల్‌గా మారింది. సీలేరు, డొంకరాయి జలాశయాల్లోని జలాలతోపాటు డ్రెయిన్ల నుంచి నీటిని ఎత్తిపోసినా పంటలను కాపాడుకోలేని పరిస్థితి ఉంది. సంవత్సరం సముద్రంలో కలిసిన జలాలు(టీఎంసీల్లో) 2008–09 1,819.196 2009–10 742.865 2010–11 4,014.772 2011–12 1,538.065 2012–13 2,968.816 2013–14 5,827.475 2014–15 2,006.205 2015–16 1,611.490 2016–17 2,896.056 2017–18 1,024.978 -
దాహం తీర్చనున్న ‘దేవాదుల’
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నిండు వేసవిలోనూ గోదావరి జలాల లభ్యత పెరగనుంది. దేవాదుల దిగువన తుపాకులగూడెం బ్యారేజీలో భాగంగా నిర్మించిన కాఫర్ డ్యామ్ వల్ల లభ్యత జలాలు మరింత పెరిగాయి. జనవరి చివరి నుంచి ఇప్పటికి 16 కిలోమీటర్ల మేర గోదావరి నీరు నిలవడంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల తాగునీటి ఇక్కట్లు తొలగనున్నాయి. కాఫర్ డ్యామ్‌తో నిలిచిన నీటిలో ఒక టీఎంసీ మేర నీటిని తరలించగా, జూలై నాటికి కనిష్టంగా నాలుగైదు టీఎంసీలు తరలించి రిజర్వాయర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. తొలిసారి వేసవిలో మళ్లింపు.. ఏటా గోదావరిలో జూలై నుంచి నవంబర్ వరకు 120 నుంచి 130 రోజుల పాటే నీటి లభ్యత ఉంటుంది. ఆ రోజుల్లోనే దేవాదుల నుంచి పంపింగ్ సాధ్యపడుతుంది. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు వీలుగా తుపాకులగూడెం వద్ద కాఫర్ డ్యామ్ నిర్మించారు. నిజానికి దేవాదుల పంపుల ద్వారా తుపాకులగూడెంలో నిల్వ చేసే నీటిని తీసుకోవాలంటే 72 మీటర్ల వద్ద గోదావరి నీటిని ఆపాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 71 మీటర్ లెవల్లో 3 వేల క్యూసెక్కుల మేర గోదావరి ప్రవహిస్తోంది. ఇలాగే జూన్, జూలై వరకు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 72 మీటర్ల వద్ద నీటిని ఆపేలా జనవరిలో రెండో వారంలోనే కాఫర్ డ్యాం నిర్మించారు. జనవరి 30న దేవాదుల ఇన్‌టేక్ పంపులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. దేవాదుల, మొదటి, రెండో దశలోని మోటార్ల ద్వారా ఇప్పటికే ధర్మసాగర్ (1.5 టీఎంసీ) రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోశారు. ధర్మసాగర్ నుంచి గండిరామారం (0.4 టీఎంసీ), బొమ్మకూరు (0.19 టీఎంసీ) రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం కాగా, మార్చిలో బొమ్మకూరు నుంచి బోయినగూడెం (0.12 టీఎంసీ), లద్దనూరు (0.29 టీఎంసీ) రిజర్వాయర్లకు పంప్ చేయాలని నిర్ణయిం చారు. ఆ వెంటనే వెల్దండ (01.5 టీఎంసీ), తపాసుపల్లి (0.3 టీఎంసీ) రిజర్వాయర్లకూ వేసవిలో నీటిని తరలించి తాగునీటి లభ్యత పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.ర 300 చెరువులు.. 1.5 లక్షల ఎకరాలు.. ధర్మసాగర్ చెరువు నుంచే ఆర్ఎస్ ఘణపురం రిజర్వాయర్ అక్కడినుంచి అశ్వరావుపల్లి (0.71 టీఎంసీ), చిట్టకోడూర్ (0.30 టీఎంసీ) రిజర్వాయర్లను నింపే చర్యలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ వేసవికి 4 నుంచి 5 టీఎంసీలు మళ్లించుకునే వెసులుబాటు కలగనుంది. ఈ నీటితో దేవాదుల కింద 300 చెరువులను నింపడంతో పాటు రొటేషన్ పద్ధతిన సుమారు 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని అధికారులు చెబుతున్నారు. గతంలో 2014లో 4.15 టీఎంసీ, 2015లో 7.3 టీఎంసీ, 2016లో 6.83 టీఎంసీ, 2017లో 7.93 టీఎంసీల నీటిని దేవాదుల నుంచి ఎత్తిపోయగా, ఈ ఏడాది ప్రథమార్ధంలోనే 4 నుంచి 5 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉంది. అది ఈ ఏడాది చివరికి కనిష్టంగా 20 టీఎంసీలకు చేరే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు గరిష్టంగా 319 చెరువులకు నీరివ్వగా, అది 500కు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నాయి. -
మరికొద్ది రోజుల్లో మరణమృదంగం!
న్యూఢిల్లీ: కాలచక్రం గతితప్పిందా? మనిషి మనుగడ ప్రమాదంలో పడిందా? సమయానికి ప్రకృతి సహకారం లభించకపోవడం దేనికి సంకేతం? రావాల్సిన 'అచ్ఛే దిన్'.. మనుషులు చచ్చాక వస్తే ఫలితం ఉంటుందా? శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేస్తూ, జనంపై కరుణ చూపకుండా, ముఖం చాటేస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఇంకెప్పుడు? అవి రాకుంటే, వర్షం కురవకుంటే మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా క్లిష్టపరిస్థితులు ఖాయంగా కనిపిస్తోంది. సాగు సంగతి పక్కనపెడితే, కనీసం తాగునీరైనా దొరకని పరిస్తితి తలెత్తనుంది. దేశంలోని 91 భారీ నీటి ప్రాజెక్టుల్లో నీటి నిలువలు అడుగంటిపోయాయంటూ కేంద్ర జలమండలి(సీడబ్ల్యూసీ) శుక్రవారం విడుదల చేసిన నివేదిక మున్ముందు మోగబోయే మరణమృదంగానికి సూచికలా ఉంది. సీడబ్ల్యూసీ నిర్వహిస్తోన్న 91 భారీ నీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత జూన్ 16 నాటికి 15 శాతానికి పడిపోయింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు 26.81 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) నుంచి 23.78 బీసీఎంలకు పడిపోయింది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు వర్షాలు కురిపించకుంటే దేశం దుర్భిక్షపుటంచుల్లోపడే ప్రమాదం ఉందని సీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే దక్షిణాదిన నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ నిర్వహిస్తోన్న 31 ప్రాజెక్టుల్లో జూన్ 16 నాటికి నీటి నిల్వలు 4.86 బీసీఎంలు (9శాతం నీటి లభ్యత) మాత్రమే ఉండటం శోచనీయం. ఇప్పటికే భారత భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మదగమనంతో సాగుతుండటంతో వర్షాలు అంతకంతకూ ఆలస్యం అవుతున్నాయి. ఈ కారణంగా గత ఏడాదితో పోల్చుకుంటే 2016 సంవత్సరంలో ఖరీఫ్ సాగు 10 శాతం తగ్గిపోనుదని సీడబ్ల్యూసీ నివేదిక చెప్పింది. సాగుకు వినియోగంగా ఉన్న 93.63 లక్షల హెక్టార్లలో ఈ ఏడాదికిగానూ కేవలం 84.21 లక్షల హెక్టార్లలోనే రైతులు పనులు మొదలుపెట్టినట్లు పేర్కొంది. 2014లో 12 శాతం, 2015లో 14 శాతం లోటు వర్షం కురిసినట్లే ఈ ఏడాది కూడా వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నట్లు నివేదికనుబట్టి తెలుస్తోంది. నీటి నిలువలు తగ్గిపోవడంతో ఇప్పటికే కొండెక్కి కూర్చున్న కాయగూరలు, పప్పుదినుసుల ధరలు.. వర్షాలు కురవకపోతే ఇంకా పైపైకి వెళతాయి. అదే జరిగితే దేశంలోని 40 కోట్ల మంది పేదల జీవితాలు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది! -
కరువు ప్రాంతాల్లో నీరందిచండి
- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సేన - కృత్రిమ వర్షాలు కురిపించాలని సూచన ముంబై: కరువు అధికంగా ఉన్న ప్రాంతాలకు నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. కృత్రిమ వర్షాలు కురిసేందుకు రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన మేఘ మథనం ప్రాజెక్టుపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అలాగే గురువారం సేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది కూడా వర్షాలు సరిగ్గా కురవకపోతే రాష్ర్టంలో వరుసగా ఇది 4వ కరువు సంవత్సరమవుతుందని పేర్కొంది. మేఘమథనం ప్రాజెక్టుపై ఎటువంటి అభ్యంతరాలు లేవని, అయితే ఈ ప్రాజెక్టు వల్ల కచ్చితంగా ఎంత వర్షాపాతం నమోదవుతుందనే విషయం వెల్లడించాలని డిమాండ్ చేసింది. కేవలం కృత్రిమ వర్షాలు కురిపించే అంశంపైనే కాకుండా కరువు పీడిత ప్రాంతాల్లో నీటి వసతులు ఏర్పాటు చేయడంపై కూడా దృష్టి పెట్టాలని సూచించింది. ఆకాశంలో మేఘాలు కనుమరుగయ్యాయని ఇక వర్షం ఎక్కడ పడుతుందని వ్యాఖ్యానించింది. ఈ సమస్య నుంచి రైతులు, రాష్ట్రాన్ని కాపాడాలంటే కృత్రిమ వర్షాలతో పాటు నీరు అందుబాటులో ఉండేలా చేయడంపై తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ముంబై, కొంకణ్, విదర్భ ప్రాంతాల్లోనే రుతుపవనాలు కేంద్రీకృతమయ్యాయని, రాష్ట్రమంతటా విస్తరించలేదని పేర్కొంది. రుతుపవనాల రాక కోసం ఎదురు చూస్తున్న రైతులు దీని వల్ల తీవ్రంగా ఇబ్బందిపడతారని చెప్పింది. రాష్ట్రంలో వర్షాకాలం మొదటి నెలలో 35-40 శాతం సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైందని వెల్లడించింది. గతనెలలో రాష్ట్ర ప్రభుత్వం మేఘమథనానికి రూ. 10 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించినట్లు పేర్కొంది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. జూలై- ఆగస్టు నెలలో విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువ నమోదైతే ఆ ప్రాంతాల్లో మేఘమథనం చేపడతామన్నారు. ఇందుకోసం ఖడ్సే నేతృత్వంలో విపత్తు నిర్వహణ శాఖ టెండర్లకు ఆహ్వానించింది. -
జనం జనం... జలం గగనం!
- విస్తుగొల్పుతున్న జలమండలి అంచనాలు - 2015 నాటికి గ్రేటర్ జనాభా కోటి... నీటి డిమాండ్ 732.43 ఎంజీడీలు - 2021 నాటికి జనాభా 1.50 కోట్లు...నీటి డిమాండ్ 986.82 ఎంజీడీలు - 2041 నాటికి జనాభా 3 కోట్లు...నీటి డిమాండ్ 1908.39 ఎంజీడీలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో నీటి లభ్యతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భవిష్యత్తులో జనాల అవసరాలకు సరిపడే స్థాయిలో నీరు దొరికే అవకాశాలు లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి. జనాభాతో పాటే నీటి కొరత కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. తాగునీటి ముఖచిత్రంపై జలమండలి రూపొందించిన తాజా అంచనాలు విస్తుగొల్పుతున్నాయి. ప్రస్తుతం మహా నగర జనాభా సుమారు కోటికి చేరువైంది. గృహ, వాణిజ్య అవసరాలకు నిత్యం నీటి డిమాండ్ 732.43 మిలియన్ గ్యాలన్లు కాగా.. కొరత 130.43 ఎంజీడీలుగా ఉంది. ఇక 2021 నాటికి నగర జనాభా 1.50 కోట్లకు చేరువకానుంది. అప్పుడు నీటి డిమాండ్ 986.82 ఎంజీడీలకు చేరనుంది. కొరత 384.82 ఎంజీడీలు అవుతుందని అంచనా. ఇదే రీతిన లెక్కిస్తే 2041 నాటికి గ్రేటర్ జనాభా మూడుకోట్లకు చేరుకోనుంది. అప్పుడు రోజువారీ 1908.39 ఎంజీడీల నీరు అవసరమవుతుంది. కొరత కూడా 1306.39 ఎంజీడీలకు చేరుతుందని అంచనా. దీన్నిబట్టిపెరుగుతున్న జనాభాకు అవసరమైన తాగునీరు అందించడం భవిష్యత్లోనూసాధ్యపడదన్న సంకేతాలు వెలువడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాగునీటి సరఫరాలో నిత్యం లీకేజీలు, చౌర్యం కారణంగా ఏర్పడుతున్న 33 శాతం నష్టాలను గణనీయంగా తగ్గించుకుంటే ప్రజల దాహార్తిని తీర్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తాగునీటికి మహా డిమాండ్... ప్రస్తుతం గ్రేటర్లో 8.64 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 385 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. త్వరలో కృష్ణా మూడోదశ ద్వారా మరో 45 ఎంజీడీలు, ఈ ఏడాది ఆగస్టు నాటికి గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ద్వారా మరో 172 ఎంజీడీల నీరు సిటీకి అందనున్నాయి. దీంతో మొత్తం 602 ఎంజీడీలు అందుబాటులోకి రానున్నాయి. ఇంకా 130.43 ఎంజీడీలకు కొరత తప్పదని జలమండలి వర్గాలు ‘సాక్షి'కి తెలిపాయి. గ్రేటర్లో విలీనమైన శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రామచంద్రాపురం, పటాన్చెరు, కాప్రా, అల్వాల్, కూకట్పల్లి, ఎల్బీనగర్, గడ్డిఅన్నారం, ఉప్పల్, రాజేంద్రనగర్ మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.3195 కోట్ల వ్యయంతో మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లు, తాగునీటి పైప్‌లైన్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తేనే ఆ ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల దాహార్తి తీరనుందని జలమండలి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసింది. నిధులు విదిలిస్తేనే ఈ ప్రాంతాల దాహార్తి తీరనుందని సర్కారుకునివేదించింది. తలసరి నీటి వినియోగంలో శివార్ల వెనుకంజ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తలసరి నీటి వినియోగం (ఎల్పీసీడీ-లీటర్ పర్ క్యాపిటా డైలీ) 150 లీటర్లు. ఈ విషయంలో ప్రధాన నగరం శివార్ల కంటే ముందంజలో ఉంది. కోర్‌సిటీలో ప్రతి వ్యక్తికి రోజువారీ సరాసరి 150 లీటర్ల జలాలు సరఫరా చేస్తున్నట్లు జలమండలి తాజా నివేదిక వెల్లడించింది. శివార్లలోని వివిధ ప్రాంతాల్లో తలసరి నీటి వినియోగం 90 నుంచి 120 లీటర్ల మధ్యనే ఉందని స్పష్టం చేసింది. అక్కడ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ నెట్వర్క్స్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని తేల్చింది. -
‘కృష్ణా బోర్డు’తో డెల్టాకు లబ్ధి చేకూరేనా?
విజయవాడలో బోర్డు ఏర్పాటుకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదన ఉపయోగం ఉండదంటున్న నిపుణులు సాక్షి, విజయవాడ : కృష్ణానదీ జలాల బోర్డును విజయవాడలో ఏర్పాటుచేయాలని ఇరిగేషన్ శాఖ పంపిన ప్రతిపాదనలపై నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు. కృష్ణాడెల్టాకు దీనివల్ల ఏమేరకు లబ్ధి చేకూరుతుందనేది చర్చనీయాంశమైంది. కృష్ణానదిపై అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పరిమితమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు నీటి లభ్యతను బట్టి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపు, వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. బోర్డు విధివిధానాలు, పరిధి, నీటి లెక్కింపు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సాంకేతిక అనుమతులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణ, వరద నిర్వహణ, నీటి యాజమాన్యానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు కృష్ణాడెల్టా అవసరాలు, సాగర్ నుంచి ఎంత నీటిని విడుదల చేయాలి, దిగువన ఎంత నీరు వస్తుందన్న అంశాలపై లెక్కలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంక్షోభంలో కృష్ణా డెల్టా... 13 లక్షల ఎకరాల్లో వరి సాగవుతూ దక్షిణ భారతదేశపు అన్నపూర్ణగా పేరొందిన కృష్ణాడెల్టా.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోతోంది. ఒక్క చుక్క కూడా ఉపయోగపడని మునేరు, పాలేరు జలాలను నికర జలాలుగా బ్రిజేష్ ట్రిబ్యునల్ లెక్కల్లో చూపించిన సంగతి తెలిసిందే. నాగార్జునసాగర్ దిగువ భాగంలోని పరీవాహక ప్రాంతంలో మునేరు, పాలేరు నదుల నుంచి వచ్చే 50 టీఎంసీల నీటిని నికర జలాలుగా లెక్కగట్టారు. కృష్ణా నదిలో వరదలు వచ్చే సమయంలోనే మునేరు, పాలేరు ఉపనదుల నుంచి వరద ప్రవాహం కృష్ణానదిలో చేరుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు టీఎంసీల కన్నా ఎక్కువ నీరు నిల్వ చేసే అవకాశం లేకపోవడం వల్ల వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదలడం మినహా డెల్టాకు ఉపయోగించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో పులిచింతలలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే కృష్ణాడెల్టాకు జూన్, జూలై నెలల్లో నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పులిచింతలలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉంచాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. మిగులు జలాలపై పూర్తి హక్కు ఉన్నప్పుడే 2002, 2003 సంవత్సరాల్లో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో 20 లక్షల ఎకరాల్లో పంట పండని పరిస్థితి ఏర్పడింది. ఆల్మట్టి ఎత్తు పెంచడం కృష్ణా డెల్టా రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. 2003-04లో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆల్మట్టిలో 137 టీఎంసీల నీరు ఉన్నా 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదు. భవిష్యత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉండదని గ్యారెంటీ లేదు. పైనుంచి నీరు రాకపోతే ఇక్కడ బోర్డు ఉన్నా నీటిని సర్దుబాటు చేయడం సాధ్యం కాదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది.