బేసిన్‌లో 115 టీఎంసీలు ఉంటుందని 2017లో తేల్చిన వంశధార ట్రిబ్యునల్
ఏటా 166 టీఎంసీల లభ్యత ఉంటుందని తాజాగా వెల్లడించిన సీడబ్ల్యూసీ
ట్రిబ్యునల్ తేల్చినదాని కంటే 51 టీఎంసీలు అధికం
20 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై అధ్యయనం
వంశధారలో ఏటా సగటున 166 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. నదీ పరీవాహక ప్రాంతంలో 2003–04 నుంచి 2022–23 మధ్య 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని వంశధారలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇటీవల అధ్యయనం చేసింది.
వంశధార ట్రిబ్యునల్ 2017లో బేసిన్‌లో 115 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. ట్రిబ్యునల్ తేల్చిన దానికంటే వంశధారలో లభ్యత 51 టీఎంసీలు అధికంగా ఉన్నట్టు సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైంది. వంశధారలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. - సాక్షి, అమరావతి
సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలివీ..
వంశధార బేసిన్‌లో 2003–04 నుంచి 2022–23 మధ్య 20 ఏళ్లలో సగటున ఏటా 1,342 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 498.02 టీఎంసీలు
బేసిన్‌లోని జలాశయాల్లో ఏటా ఆవిరి నష్టాలు సగటున 1.06 టీఎంసీలు
తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, జంతువులకు తాగునీటి అవసరాల కోసం 2022–03లో 0.71 టీఎంసీలు వినియోగించుకున్నారు
వంశధార ప్రస్థానం ఇదీ..
జన్మస్థానం: ఒడిశాలో ఉమ్మడి పూల్‌భణి జిల్లాలో బెలగడ్ వద్ద సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో
ఒడిశాలో ప్రవాహ మార్గం: కంధమాల్, కలహండి, రాయగడ, గజపతి జిల్లాల్లో 125 కి.మీ.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాహ మార్గం: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 96 కి.మీ.
సముద్ర సంగమం: కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో
వంశధార బేసిన్ పరిధి: మొత్తం 10,504 చదరపు కిలోమీటర్ల వైశాల్యం
Comments
Please login to add a commentAdd a comment