ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో బుధవారం నుంచి సమైక్యాంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సద్భావన సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కే ఓబుళపతి తెలిపారు.
ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోస్తా, రాయలసీమల్లోని 13 జిల్లాల్లో బుధవారం నుంచి సమైక్యాంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సద్భావన సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కే ఓబుళపతి తెలిపారు. సదస్సు నిర్వహణ కరపత్రాలను స్థానిక పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సీజీసీ సభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని, ప్రాధాన్యతను వివరిస్తూ రోజుకు రెండు జిల్లాల చొప్పున ఉపాధ్యాయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం 18న వైఎస్సార్ జిల్లా కేంద్రంలో తొలి సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 27 వరకూ జరిగే సదస్సులు అనంతపురంలో ముగుస్తాయన్నారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెడరేషన్ సారథ్య సంఘం సభ్యులు కె.జాలిరెడ్డి, పి.అశోక్‌కుమార్‌రెడ్డి, పి.వి.రమణారెడ్డి, రియాజ్ హుస్సేన్ పాల్గొన్నారు.