
సాక్షి, అమరావతి: రాష్ట్రాధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ, సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తోందన్నారు. ప్రతి రాష్ట్రం ఏపీని అనుసరిస్తుందని.. కేంద్రం ఇప్పటికే ప్రశంసించిందని ఆయన తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో కూడా ఆరా తీస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
ట్రూనాట్ కిట్స్ తోనే కరోనా వైరస్ టెస్టులు చేస్తున్న విషయం చంద్రబాబుకు తెలియనట్టుందని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. వాటి గురించి కొత్తగా విని ఉంటారని.. టెస్టులు మొదలైనప్పటి నుంచి ట్రూనాట్ కిట్లనే వాడుతున్నారని పేర్కొన్నారు. కరోనా గురించి తన వద్ద సమాచారం ఉందని బిల్డప్ ఇవ్వడానికి ఇలాంటివి పేలుస్తుంటాడని చంద్రబాబుకు చురకలు అట్టించారు.
‘‘కరోనా సమయంలో రాజకీయాలు వద్దని బాబు అంటుంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద మనసు చాటుకోవాల్సిన టైం వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరివిగా విరాళాలివ్వాలని తను ఇన్నాళ్లు రాసుకు పూసుకు తిరిగిన వ్యాపార మిత్రులకు నచ్చచెప్పాలని’’ విజయసాయిరెడ్డి సూచించారు. ఇన్ సైడర్ ట్రేడింగుతో బాగుపడ్డవాళ్లు తప్పించుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
‘‘పప్పు నాయుడూ.. ఇంతకీ నువ్వు...మీ నాన్న ఇల్లు కదలకుండా కాపలా ఉన్నావా? లేక నీకు నువ్వు క్వారంటైన్‌లో ఉన్నావా?’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మీ ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ పిలుస్తోంది..రండి. అప్పుడప్పుడైనా కదలిరండి అంటూ ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి చలోక్తులు విసిరారు.
పప్పు నాయుడూ- ఇంతకీ నువ్వు...మీ నాన్న ఇల్లు కదలకుండా కాపలా ఉన్నావా? లేక నీకు నువ్వు క్వారంటైన్‌లో ఉన్నావా? మీ ఇద్దర్నీ ఆంధ్రప్రదేశ్ పిలుస్తోంది. రండి. అప్పుడప్పుడైనా కదలిరండి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 25, 2020
కరోనా సమయంలో రాజకీయాలు వద్దని బాబు అంటుంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద మనసు చాటుకోవాల్సిన టైం వచ్చింది. సిఎం రిలీఫ్ ఫండుకు విరివిగా విరాళాలివ్వాలని తను ఇన్నాళ్లు రాసుకు పూసుకు తిరిగిన వ్యాపార మిత్రులకు నచ్చచెప్పాలి. ఇన్ సైడర్ ట్రేడింగుతో బాగుపడ్డవాళ్లు తప్పించుకుంటే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 25, 2020