COVID-19
-
బతికాను.. బతికించాను
దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగింది కోవిడ్ కాలం! నిజంగానే ఫ్రంట్‌లైన్ వారియర్స్ ధైర్యంగా మనకు అండగా నిలబడకపోయుంటే ఎలా ఉండేదో మన జీవనం! ఆ టాస్క్‌లో వైద్యులది కీలకపాత్ర. ట్రాన్స్‌పోర్టేషన్ దగ్గర్నుంచి మందుల దాకా ఎదురైన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ తమను తాము మోటివేట్ చేసుకుంటూ స్టాఫ్‌ని ముందుకు నడిపిస్తూ పేషంట్స్‌కి భరోసా ఇచ్చి, ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంచిన డాక్టర్లలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్.. ఇప్పుడు మహేశ్వరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ ఒకరు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పిన విషయాలు..‘‘కోవిడ్ ప్రకృతి వైపరీత్యంలా వచ్చింది. దీని గురించి ప్రజలకే కాదు.. డాక్టర్స్కీ అవగాహన లేదప్పుడు. నేనప్పుడు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఉన్నాను. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్‌గా మార్చారు. అందుకని జనరల్ పేషంట్స్ అందరూ ఉస్మానియా కే వచ్చేవాళ్లు. వాళ్లకు కోవిడ్ ఉండొచ్చు.. లేకపోవచ్చు. టెస్ట్‌లో వాళ్లకు కోవిడ్ నిర్ధారణైతే గాంధీకి పంపేవాళ్లం. అప్పటికే అది ఎందరికో వ్యాపించేసేది. ఏదో ఒక జబ్బుతో వచ్చిన వాళ్లకు కోవిడ్ అని తేలితే కోవిడ్‌తో పాటు వాళ్లకున్న జబ్బుకూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఉదాహరణకు అపెండిక్స్తో జాయిన్ అయిన వాళ్లకు కోవిడ్ అని తేలితే వాళ్లను గాంధీకి పంపలేకపోయేవాళ్లం. ఎందుకంటే గాంధీలో అప్పుడు అపెండిక్స్ ట్రీట్మెంట్ లేదు.. కేవలం కోవిడ్కే! దాంతో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పేషంట్‌కి ఉస్మానియాలోనే అపెండిక్స్‌కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లం. ఈ మొత్తం సర్వీస్‌లో నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. వాళ్లు చాలా ధైర్యంగా నిలబడ్డారు. మా బలాన్ని పెంచింది.. లాక్డౌన్ ఎంత గడ్డు పరిస్థితో అందరికీ తెలుసు. రవాణా కూడా ఉండేది కాదు. హాస్పిటల్ స్టాఫ్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వాళ్లకోసం ఆర్టీసీ సంస్థ వాళ్లతో మాట్లాడి స్పెషల్ బస్‌లు, పాస్‌లను ఏర్పాటు చేయించాం. ఫుడ్ కూడా సమస్య కూడా ఉండేది. కొన్ని మందుల కొరత వల్ల దొంగతనాలూ జరిగేవి. అన్ని సమస్య ల్లో.. అంత కోవిడ్ తీవ్రతలోనూ సర్జరీలు చేశాం. సరైన చికిత్స చేస్తూ రోగులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోగలిగాం. ముగ్గురు పేషంట్లకు న్యూరో సర్జరీ అయిన వెంటనే కోవిడ్ సోకింది. వాళ్లను ఆరోగ్యవంతులను చేసి పంపాం. చికిత్సతోపాటు కౌన్సెలింగ్ చేస్తూ వాళ్లకు ధైర్యమిచ్చే వాళ్లం. పేషంట్స్ చూపించిన కృతజ్ఞత మా స్ట్రెంత్‌ను పెంచింది. ఐసీయూలో పేషంట్లను చూస్తుండటం వల్ల నాకూ కోవిడ్ వచ్చింది. గాంధీలో అడ్మిట్ అయ్యాను. తీవ్రమయ్యేసరికి నిమ్స్ లో చేరాల్సి వచ్చింది. నా పక్క బెడ్ అతని కండిషన్ సడెన్‌గా సీరియస్ అయి చనిపోయాడు. చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను వీక్ అయితే నా స్టాఫ్ కూడా వీక్ అయిపోతారని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. డిశ్చార్జ్ అవగానే డ్యూటీలో చేరాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ భయపడుతుంటే నేనే ముందు వ్యాక్సిన్ తీసుకుని మిగతావాళ్లను మోటివేట్ చేశాను. సమర్ధంగా, సమన్వయంతో పనిచేసి... కోవిడ్ టైమ్‌లో మేము అందించిన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులకి మంచి పేరొచ్చింది. గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం కోవిడ్ పరిస్థితులను చక్కగా మేనేజ్ చేసింది. వైద్యరంగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయడం వల్ల సమర్థంగా కోవిడ్ సిట్యుయేషన్‌ను ఎదుర్కొన్నాం. కోవిడ్‌ను మానవ చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. గుణపాఠంగా మలచుకోవచ్చు. ఆరోగ్యాన్ని మించింది లేదని కరోనా మహమ్మారి నిరూపించింది. శుభ్రత నేర్పింది. మంచి జీవనశైలి అవసరాన్ని తెలియజెప్పింది. మానవ సంబంధాల విలువ చూపించింది’’ అంటూ నాటి గడ్డు రోజులను తాను అధిగమించిన తీరును గుర్తు చేసుకున్నారు డాక్టర్ నాగేందర్. – సరస్వతి రమ -
ఇళ్లకు వెళ్లి మరీ సేవలు చేశాం
క్యాన్సర్‌తో పోరాడుతూ చివరిదశలో ఉన్నవారికి స్వస్థత చేకూర్చుతుంది హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్. కోవిడ్ టైమ్‌లో క్యాన్సర్ పేషంట్లకు సేవలు అందించడానికి, బయటి నుంచి వచ్చిన పేషంట్లను అడ్మిట్ చేసుకోవడానికి, భయాందోళనలో ఉన్న వారికి ధైర్యం చెప్పడానికి ఒక బృందంగా తామంతా ఎలా సిద్ధమయ్యారో హాస్సిస్ అడ్మినిస్ట్రేటర్ శారద లింగరాజు వివరించారు.‘‘ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే ఒకరికొకరు ఉన్నామా, మన వరకే బతుకుతున్నామా.. అనే నిజాలు వెలుగులోకి వచ్చేది. మేం అందించేది ఎమర్జెన్సీ కేర్ కాదు. చనిపోయేదశలో ఉన్నవారికి ఉపశమనాన్ని ఇవ్వడం. కోవిడ్ సమయంలో అప్పటికే అంతటా భయాందోళనలు. ఎవరి వల్ల ఎవరికి కోవిడ్ వస్తుందో చెప్పలేం. ఎవరికి ఎవరు సాయంగా ఉంటారో తెలియదు. అలాంటప్పుడు రిస్క్ ఎందుకని, మేం ‘చేయలేం’ అని చెప్పవచ్చు. చేయూతనివ్వలేమని వదిలేయచ్చు. హాస్పిస్ తలుపులు మూసేయచ్చు. కానీ, మానవతా ధర్మంగా చూస్తే వారిని అలా వదిలేయడం సరికాదు అనిపించింది. అందుకే, క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ కొన ఊపిరితో ఉన్నవారిని తీసుకువస్తే వారికి ‘లేదు’ అనకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మాకు చేతనైన సేవలు అందించాం.నేరుగా వారి ఇళ్లకే..క్యాన్సర్ పేషంట్స్‌కి వారి స్టేజీలను బట్టి పెయిన్ ఉంటుంది. సరైన మందులు అందక వారు బాధపడిన సందర్భాలు ఎన్నో. వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ మందులను వారి ఇళ్లకే వెళ్లి అందజేశాం. వారికి కావల్సిన స్వస్థతను ఇంటికే వెళ్లి అందించాం. ఈ సేవలో పాలిచ్చే తల్లులైన నర్సులూ పాల్గొన్నారు. ఆయాలు పేషంట్స్‌కు దగ్గరగా ఉండి, సేవలు అందించారు. పేషంట్స్ చనిపోతే అప్పటికప్పుడు బాడీ తీసేయమని చెప్పినవారున్నారు. కనీసం వారి పిల్లలు వచ్చేంత టైమ్ ఇవ్వమన్నా కుదరదనేవారు. వాళ్లు కోవిడ్‌తో కాదు క్యాన్సర్‌తో చనిపోయారు అని కన్విన్స్ చేయడానికి టైమ్ పట్టేది.వీడియోలలో దహన సంస్కారాలు.. ఒక బెంగాలియన్ క్యాన్సర్ చివరి దశలో చనిపోయాడు. మృతదేహాన్ని హాస్పిస్ నుంచి వారి స్వస్థలానికి తీసుకువెళ్లాలి. కోవిడ్ కాకుండా క్యాన్సర్‌తో చనిపోయాడనే లెటర్‌తో పాటు అంబులెన్స్‌ను సిద్ధం చేయించి పంపాం. వాళ్లు కూడా ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు వెళ్లి దహనసంస్కారాలు చేయించి వచ్చారు. మా దగ్గర సేవ పొందుతున్న వారు చనిపోతే కనీసం చివరి చూపు చూడటానికి కూడా వారి పిల్లలు రాలేని పరిస్థితి. అందువల్ల దహన సంస్కారాలు చేసే సమయంలోనూ, ఆ తర్వాత వారికి వీడియోలు చూపించేవాళ్లం. పసుపు, కుంకుమలు, చెట్లకు ఉన్న కాసిన్ని పూలు పెట్టి సాగనంపేవాళ్లం. వారి ఏడుపులు, మేం సమాధాన పరచడం.. ఆ బాధ.. ఆ సందర్భంలో ఎలా తట్టుకున్నామో.. ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఒక యజ్ఞంలా చేశామనిపిస్తోంది.ప్రతి వారిలోనూ మంచితనాన్నే చూశాం..ఒక తల్లి చనిపోయే చివరి దశ. ఆమె కొడుకు తల్లిని చూడటానికి జార్ఖండ్ నుంచి వచ్చాడు. గచ్చిబౌలిలో ఉండేవాడు. రెండు మూడుసార్లు బైక్ మీద వచ్చాడు. కొడుకును చూడాలని ఆ తల్లి ప్రాణం కొట్టుకులాడేది. కొడుకు చూసి వెళ్లిన పది నిమిషాల్లో ఆమె చనిపోయింది. నిజంగా జబ్బు ముదిరిపోయి చివరిదశలో ఉంటే ఆ కష్టాన్ని ఒకలా చూస్తాం. కానీ, కోవిడ్ భయంతో చుట్టూ ఉన్న మానవసంబంధాల కష్టం అప్పుడే చూశాం. తమ వారిని చూసుకోవడానికే కాదు, బాడీని తమ స్వస్థలాలకు చేర్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. డబ్బు కాదు బంధాలే ముఖ్యం అనిపించాయి ఆ రోజులు. చివరి రోజుల్లో ఉన్న క్యాన్సర్ పేషంట్లకు కోవిడ్ టైమ్‌లో ఏ దారీ లేదనే పరిస్థితుల్లో కూడా ‘మేం ఉన్నాం’ అనే ధైర్యాన్ని ఇచ్చాం. ప్రతి వాళ్లలో మంచితనాన్ని చూశాం’ అని గడిచిన కాలపు జ్ఞాపకాలలోని మానవతను కళ్లకు కట్టారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
COVID-19: ఐదేళ్ల క్రితం గడగడలాడించిన కోవిడ్
మునుపెన్నడూ చూడని.. వినని విపత్తు జనాన్ని అతలాకుతలం చేసింది. ఎవరిని తాకితే ఏమవుతుందో.. ఏం తింటే ఏమైపోతామో అన్న భయం అందరినీ వెంటాడింది. చికిత్స ఎలా, మందులు ఏమిటి అన్న విషయం తెలియక వైద్యులు సతమతమైన తరుణాన ప్రజలైతే బెంబెలేత్తిపోయారు. ఆ వైరస్ పేరు కరోనా. ఆ భయానక అనుభవం ఎదురై ఐదేళ్లు కావొస్తుండగా.. ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకొస్తే వైరస్ బారిన పడిన కుటుంబాలు విలవిల్లాడిపోతున్నాయి. జిల్లాలో తొలి కరోనా కేసు 2020 ఏప్రిల్ 6ననమోదైంది. అంతకుముందు మార్చి 24వ తేదీ నుంచే ప్రభుత్వం లాక్డౌన్ విధించగా జనజీవనం స్తంభించింది. రాకపోకల నిలిపివేతతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోగా.. ఉపాధి కరువై, ఇళ్లలో సామగ్రి లేక పలువురు అర్ధాకలితో అలమటించారు. సుమారు 40 రోజులు రవాణా వ్యవస్థ స్తంభించిన ఆ సమయంలో... ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్ధలు నిత్యావసరాలు పంపిణీ చేసినా అవి ఏ మాత్రం సరిపోక ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పిట్టల్లా రాలిన జనంఒపక్క పనిలేక తిండికి ఇబ్బంది పడుతున్న ప్రజలను కోవిడ్ వ్యాప్తి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎవరి ద్వారా ఎవరికి వ్యాపిస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు. కోవిడ్ మొదటి వేవ్‌లో ప్రభుత్వం మాత్రమే ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు నిర్వహించేది. దీంతో ఏ చిన్న లక్షణం కనిపించినా పరీక్ష చేయించుకోవడం.. ఆపై ప్రభుత్వం ఇచ్చే కిట్‌లో మందులు వాడేవారు. కొందరైతే సొంతంగా ఐసోలేషన్‌లో ఉంటూ కుటుంబాలకు దూరంగా గడిపారు. ఏడాది పాటు తొలి వేవ్కరోనా మొదటి వేవ్ 2020 ఏప్రిల్ నుండి 2021 మార్చి వరకు కొనసాగింది. యంత్రాంగం ఎంత కష్టపడినా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడలేదు. లాక్డౌన్ సడలింపు వేళలో ప్రజలు నిత్యవసరాల కోసం రావడం, ఇతర ప్రాంతాలకు వెళ్తుండడం.. ఆ సమయాన జాగ్రత్తలు పాటించకపోవడంతో కేసులు గణనీయంగా పెరిగాయి. మొదటి వేవ్‌లో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులు 3,02,156మందికి నిర్వహించగా 23,789 మందికి కరోనా నిర్ధారణ అయింది. అయితే ఇంటి వద్ద చికిత్స చేయించుకున్న వారు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకున్న వారితో కలిపితే ఈ లెక్కలు మరింత పెరుగుతాయి. కాగా, మొదటి వేవ్‌లో కరోనా వ్యాక్సిన్ రావడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం.. ఆతర్వాత అందరికీ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది. రెండో వేవ్‌లో అల్లాడిన జనంకోవిడ్ రెండో వేవ్ 2021 ఏప్రిల్‌లో ప్రారంభం కాగా డిసెంబర్ వరకు కొనసాగింది. ఈ వేవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ఖమ్మం జిల్లానే ఎక్కువ తల్లడిల్లింది. కోవిడ్ సోకిన రెండు, మూడు రోజులకే కొందరు మృతి చెందడమే కాక వృద్ధుల మరణాలు గణనీయంగా నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు సరిపోక చికిత్స అందకపోవడంతో గంటల్లోనే ప్రాణాలు వదలడం సాధారణంగా మారింది. దీనికి తోడు చాలాచోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఇదే సమయాన కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో మృతుల అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబీకులు సైతం ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండో వేవ్‌లో కరోనాకు రెమిడిసివర్ ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే సరఫరా చేసినా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.50 వేల నుండి రూ.70 వేల వరకు వసూలుచేశారు. అధికారికంగా మరణాలు.. 1,185కరోనా రెండో వేవ్‌లో ప్రభుత్వ పరంగా 14,06,253 మందికి ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా 68,030మంది కోవిడ్ బారిన పడినట్లు తేలింది. ఇందులో 1,185మంది మాత్ర మే మృతి చెందినట్లు అధికారికంగా లెక్కలు చూపారు. కానీ ఈ మరణాల సంఖ్య రెండింతలు ఉంటుందని చెబుతారు. ఇక 2022 కరోనా మూడో వేవ్ వచ్చినా 4,01,743 మందికి పరీక్షలు చేసి 18,359 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. ఇందులో 52 మంది మృతి చెందారు. అలాగే, 2023లో 25,200 మందికి పరీక్షలు చేయగా 216 మందికి కోవిడ్ సోకగా ఎవరూ మృతి చెందలేదు. అప్పటికే అందరూ రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేసుకుని ఉండడం.. కరోనాకు అన్ని వ్యాధుల మాదిరి చికిత్స సాధారణంగా మారడంతో 2024 నుండి కోవిడ్ ప్రభావం పూర్తిగా క్షీణించింది. ప్రసవాలు ఆపలేదు..కోవిడ్ సమయాన ఎంసీహెచ్‌లో గైనిక్ హెచ్ఓడీగా ఉన్నా. వైద్యులు, సిబ్బంది కోవిడ్ బారిన పడినా ప్రసవాలు నిర్వహించాం. కోవిడ్ బారిన పడిన 500మంది గర్భిణులకు ప్రసవాలు చేశాం. ఖమ్మం కేంద్రంగా అందించిన గైనిక్ సేవలకు మన్ననలు అందాయి.– కృపా ఉషశ్రీ, గైనిక్ హెచ్ఓడీ, తిరుమలాయపాలెంసంతృప్తి మిగిలింది..పెద్దాస్పత్రిలో కరోనా మొదటి, రెండో వేవ్ సమయాన పడకలు సరిపోకపోయేవి. బాధితుల తాకిడి దృష్ట్యా కిందే బెడ్లు వేసి వైద్యం చేశాం. ఎందరో ప్రాణాలు నిలిపామన్న సంతృప్తి మాకు మిగిలింది. వైద్యులు, సిబ్బంది అలాంటి అనుభవం మరెప్పుడూ రాదు.– డాక్టర్ రాజశేఖర్ గౌడ్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారివేలాది మృతదేహాలకు అంత్యక్రియలుకుటుంబీకులు మరణించినా అంత్యక్రియలు నిర్వహించడానికి చాలా మంది ముందుకు రాలేదు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రాంతాల్లో 3వేల మృతదేహలకు అంత్యక్రియలు నిర్వహించాం. మానవధర్మం ప్రకారం పనిచేశాం.– శ్రీనివాసరావు, అన్నం ఫౌండేషన్ చైర్మన్ -
ప్రతి పేషెంట్ కోసం మొక్కుకునేదాన్ని!
కోవిడ్ టైమ్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా నిలబడ్డ నర్స్‌లు, డాక్టర్లు, పోలీసులు అందించిన సేవలు, చేసిన సాయం గురించి మపం గుర్తు చేసుకుంటున్నాం... అందులో భాగంగా నేడు కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో తెలంగాణలోనే ఏకైన కోవిడ్ వైద్యశాలగా సేవలందించిన గాంధీ ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తించిన మహిళ కానిస్టేబుల్ వేలుపుల ప్రమీల అప్పటి వాతావరణాన్ని తలుచుకుంటూ చెప్పిన విషయాలు..ఉదయం మాట్లాడి వెళ్లిన పేషేంట్ చికిత్స పొందుతూ చనిపోయాడని సాయంత్రానికి వినాల్సి వచ్చేది. అప్పటివరకు గేటు దగ్గర పేషెంట్ కోసం ఎదురు చూస్తూ మాతో మాట్లాడిన కుటుంబీకులు, సంబంధీకులు ఆ వార్త విని ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయేది. – వేలుపుల ప్రమీలనేను పుట్టి, పెరిగిందంతా సికిందరాబాద్‌లోనే! మొదటి నుంచీ యూనిఫామ్ అంటే రెస్పెక్ట్. అందుకే పోలీస్ జాబ్‌లోకి వచ్చాను. 2003లో సిటీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ లో పని చేస్తున్నా. కరోనా టైమ్‌లో బేగంపేట ఠాణాలో పని చేసేదాన్ని.అప్పుడు గాంధీ హాస్పిటల్‌కి తెలంగాణ వివిధప్రాంతాల నుంచి రోగులు వచ్చేవారు. ఇందుకోసం పోలీసు విభాగం అక్కడ పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. దానికోసం ప్రతి స్టేషన్ నుంచి సిబ్బందిని తీసుకున్నారు. అలా బేగంపేట పోలీసుస్టేషన్ నుంచి నేనూ గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర ఐదు వారాలకు పైగా డ్యూటీలో ఉన్నా. అక్కడ పని చేయడానికి ఎస్సై నేతృత్వంలో పని చేసిన ఐదుగురు సభ్యుల్లో భాగమయ్యా. వాళ్లూ మన లాంటి మనుషులే కదా అనుకున్నా..ఓపక్క విజృంభిస్తున్న కరోనా.. మరోపక్క గాంధీ హాస్పిటల్‌కి రోజూ రోగుల తాకిడి. అలాంటి సమయంలో అక్కడ డ్యూటీ ఓ అరుదైన అవకాశంగానే భావించా. ఎంత కరోనా బారినపడితే మాత్రం వాళ్లూ మనలాంటి మనుషులే కదా! వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి విషయంలోనూ వారికి సహాయం చేయాలనుకున్నా. నడుస్తూ కొందరు, నడవలేని స్థితిలో మరికొందరు, అసలు స్పృహలోనే లేకుండా ఇంకొందరు.. చూస్తే బాధనిపించేది. కుటుంబ సభ్యుల సాయంతో వచ్చేవాళ్లు. అయితే గేట్ లోపలికి పేషెంట్స్‌కి తప్ప మిగిలిన వారికి ప్రవేశం ఉండేది కాదు. పేషంట్స్ని గేట్ దగ్గరే వదిలేయాల్సి వచ్చేది. దాంతో కొందరు వాదనకు దిగేవాళ్లు. వారిని సముదాయించి, పరిస్థితి వివరించి పంపడం పెద్ద సవాల్‌గా ఉండేది.రోజూ విషాద వార్త వినాల్సి వచ్చేది..గాంధీ హాస్పిటల్ మెయిన్‌గేట్ దగ్గర రోజూ ఎనిమిది గంటల డ్యూటీ. చికిత్స కోసం వచ్చే రోగులు అనేక మంది తారసడేవాళ్లు. అప్పుడు లాక్డౌన్ అమలులో ఉండటంతో వారితో పాటు సహాయకులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్లం. ఇలా చాలామందితో మాట్లాడాల్సి వచ్చేది. ఉదయం మాట్లాడి వెళ్లిన పేషేంట్ చికిత్స పొందుతూ చనిపోయాడని సాయంత్రానికి వినాల్సి వచ్చేది. ఒకోసారి అప్పటివరకు గేటు దగ్గర పేషెంట్ కోసం ఎదురు చూస్తూ మాతో మాట్లాడిన కుటుంబీకులు, సంబంధీకులు ఆ వార్త విని ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయేది. ఆ పేషంట్‌తో తమకున్న జ్ఞాపకాలను వాళ్లు మాతో పంచుకుంటుంటే మనసు భారమయ్యేది. ఓదార్చడం తప్ప ఏమీ చేయలేని నిన్సహాయ స్థితి మాది. ప్రతి పేషెంట్ క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకునేదాన్ని.నాకూ కరోనా..గాంధీ హాస్పిటల్ దగ్గర ఐదు వారాల డ్యూటీ అయిపోయిన తర్వాత తిరిగి బేగంపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లిపోయా. అప్పుడు ఇతర రాష్ట్రాలు,ప్రాంతాల వారిని తరలించే ప్రక్రియ మొదలైంది. ప్రతిరోజూ ఏరియాల వారీగా బయటి వారిని గుర్తించడం, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ్రపాధాన్య క్రమంలో అక్కడ నుంచి బస్సుల్లో రైల్వే స్టేషన్ కు తరలించడం మా డ్యూటీగా మారింది. దీనికోసం వారితో సంప్రదింపులు జరపాల్సి వచ్చేది. ఆ సందర్భంలో నాకూ కరోనా సోకింది.నా నుంచి నా హజ్బెండ్కీ వచ్చింది. ముగ్గురు పిల్లల్ని బంధువుల ఇంటికి పంపించినప్పటికీ మా అత్తగారిని మాత్రం మేమే చూసుకోవాల్సి వచ్చింది. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, ఆ మహమ్మారి ఆమెకు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నా. పీపీఈ కిట్, మాస్క్, గ్లోవ్స్ వేసుకుని వంట చేసేదాన్ని. వైద్యుల సలహాలు, సూచనలు పాటించడంతో పదిహేను రోజులకు నాకు, నా హజ్బెండ్‌కి నెగటివ్ వచ్చింది. అప్పటివరకు పిల్లల్ని కంటితో కూడా చూడలేదు. ఆ రోజులు, ఆ అనుభవాలు గుర్తొస్తే ఇప్పటికీ భయమేస్తుంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. – శ్రీరంగం కామేష్, క్రైమ్ బ్యూరో, సాక్షి, హైదరాబాద్ -
Janta Curfew: జనతా కర్ఫ్యూకు ఐదేళ్లు.. 68 రోజుల లాక్డౌన్ మొదలైందిలా..
2020, మార్చి 22.. ఆదివారం.. ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున దేశవ్యాప్తంగా రోడ్లపై నిశ్శబ్దం ఆవరించింది. భారతదేశ చరిత్రలో ఉత్తరాది నుండి దక్షిణాది వరకూ.. తూర్పు నుండి పశ్చిమం వరకు దేశం అంతటా నిశ్శబ్దం నెలకొంది. ఇలాంటి పరిస్థితి భారతదేశ చరిత్రలో అదే మొదటిసారి.ఆరోజు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలు స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. జనం బయటకు వెళ్లేందుకు ఎటువంటి పరిమితులులేనప్పటికీ, దేశవ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్లనుండి బయటకు వెళ్లకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. పెరుగుతున్న కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనమంతా తమకు తాము కట్టడి విధించుకున్నారు. నాడు కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి తీవ్రతను ప్రజలకు తెలియజేయాలని భావించింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం జనతా కర్ఫ్యూ(Janata Curfew)కు పిలుపునిచ్చింది. అయితే ఈ ప్రజా కర్ఫ్యూ వాస్తవానికి లాక్‌డౌన్‌కు సిద్ధం కావడానికి ఒక మార్గమని ఆ తరువాత స్పష్టమైంది.2020, మార్చి 22న సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలంతా చప్పట్లు కొడుతూ, ప్లేట్లు చప్పుడు చేస్తూ కరోనా మహమ్మారి(Corona pandemic) విషయంలో అప్రమత్తమయ్యారు.ఆ రోజున ఉదయం 7 గంటల నుండి రాజ్యమేలిన నిశ్శబ్దం సాయంత్రానికి అప్రమత్తను గుర్తుచేసేదిగా మారింది. సాయంత్రం 5 గంటలకు దేశంలోని ప్రజలంతా తమ ఇళ్ల బాల్కనీలలోకి వచ్చి చప్పట్లు కొట్టడం, ప్లేట్లు కొట్టడం, గంటలు మోగించడం చేశారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న దేశ ఆరోగ్య కార్యకర్తలకు గౌరవసూచకంగా, సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలంతా చప్పట్లు, లేదా ప్లేట్లతో శబ్ధం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ప్రజా కర్ఫ్యూ మార్చి 22న ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. దీని తరువాత రెండు రోజులు అంతా సాధారణంగానే ఉంది. ఆ తర్వాత 24వ తేదీ సాయంత్రం ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రకటించారు. మొత్తం 21 రోజుల పాటు కఠినమైన లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్(Lockdown) ఏప్రిల్ 14న ముగియాల్సి ఉంది. కానీ దానిని పొడిగిస్తూ వచ్చారు. లాక్డౌన్ వ్యవధిని స్టేజ్ -2లో 19 రోజులు, స్టేజ్ -3లో 14 రోజులు, స్టేజ్ -4లో 14 రోజులు పొడిగించారు. ఈ విధంగా దేశంలో మొత్తం 68 రోజులు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధించారు. ఈ లాక్డౌన్ మే 31 వరకు కొనసాగింది. దీని తరువాత జూన్ ఒకటి నుండి లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తూ వచ్చారు. ఈ ఆకస్మిక లాక్డౌన్ కారణంగా దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనటువంటి పరిస్థితి ఎదురయ్యింది. లక్షలాది మంది కార్మికులు నగరాల నుండి తమ స్వగ్రామాల వైపు తరలివెళ్లారు. వాహనాలు అందుబాటులో ఉన్నవారు వాటిలో పయనమవగా, వాహనాలు లభించని వారు వందల కిలోమీటర్లు నడిచి తమ స్వగ్రామాలకు చేరుకున్నారు.ఇది కూడా చదవండి: బీజేపీ గూటికి శశిథరూర్?.. ఖచ్చితమైన సంకేతాలివే.. -
మహమ్మారి మా గౌరవాన్ని పెంచింది!
2020 మార్చి 24.. జనతా కర్ఫ్యూ... అదే లాక్డౌన్ గుర్తుందా? ఆనాడు రోజులను గుర్తుపెట్టుకోవడం కూడానా అని ముఖం చిట్లిస్తున్నారా?నిజమే చేదు అనుభవాలను అదేపనిగా గుర్తుపెట్టుకోనక్కరలేదు! కానీ కష్టకాలంలో అందిన సేవలు, సహాయాన్ని మాత్రం మరువకూడదు కదా!అలా కోవిడ్ టైమ్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా నిలబడ్డ నర్స్‌లు, డాక్టర్లు, పోలీసులు అందించిన సేవలు, సాయం గురించి మార్చి 24 లాక్డౌన్ డే సందర్భంగా ఒక్కసారి గుర్తుచేసుకుందాం.. ఓ సిరీస్‌గా! అందులో భాగంగా నేడు .. సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ శిరీష ఏం చెబుతున్నారంటే..ఆ రోజులను తలచుకుంటే ఇప్పటికీ భయమే! నేనప్పుడు ఉస్మానియాలో పనిచేసేదాన్ని. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్‌గా కన్వర్ట్ చేశారు. కోవిడ్ పాజిటివ్ అని తేలాకే అందులో జాయిన్ చేసుకునేవారు. జనరల్ పేషంట్స్, కోవిడ్ లక్షణాలున్న వాళ్లు ఉస్మానియాకు వచ్చేవాళ్లు. టెస్ట్ చేసి.. పాజిటివ్ అని తేలితే గాంధీకి పంపేవాళ్లం. ఉస్మానియా కోవిడ్ కాదు, ఎన్ 95 మాస్క్‌లు, పీపీఈ కిట్స్ ఖరీదైనవి కూడా .. కాబట్టి వాటిని ముందు డాక్టర్స్‌కే ఇచ్చారు. అయితే నిత్యం పేషంట్స్‌తో ఉంటూ వాళ్లను కనిపెట్టుకునేది నర్సింగ్ స్టాఫే కాబట్టి మాస్క్‌లు, పీపీఈ కిట్లు ముందు వాళ్లకు కావాలని మాకు ఇప్పించారు అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సర్.మామపోయాడు.. అల్లుడు బతికాడుఒక కేస్‌లో మామ, అల్లుడు ఇద్దరికీ కోవిడ్ సోకింది. ఇద్దరినీ గాంధీలో చేర్పించాం. మాకు రెండు ప్రాణాలూ ఇంపార్టెంటే! ఇద్దరికీ ఈక్వల్ సర్వీసే ఇస్తాం. దురదృష్టవశాత్తు పెద్దాయన అంటే మామ చనిపోయాడు. ఆ అమ్మాయి భర్త డిశ్చార్జ్ అయ్యాడు. అల్లుడిని చూసి అత్తగారు తన భర్త కూడా తిరిగొస్తాడనుకుంది. వెంటనే నిజం చెబితే ఆమెకేమన్నా అయిపోతుందన్న భయంతో నెల తర్వాత అసలు విషయం చెప్పారురు. ఇలా ఎన్నికేసులో! కోవిడ్ నుంచి బయటపడగలమా అని దిగులేసేది. అలాంటి సిట్యుయేషన్ ఎప్పటికీ రావద్దు!వెంటిలేటర్ మీదుంచే స్థితిలో..లాక్డౌన్ టైమ్‌లో మాకు వారం డ్యూటీ, వారం సెలవు ఉండేది. రెండో వారమే నాకు కాళ్లు లాగడం, కళ్లు మండటం స్టార్టయింది. దాంతో తర్వాత వారం కూడా సెలవు తీసుకున్నాను. ఇది కోవిడా లేక నా అనుమానమేనా అని తేల్చుకోవడానికి డ్యూటీలో జాయినయ్యే కంటే ముందురోజు అంటే పదమూడో రోజు టెస్ట్ చేయించుకున్నాను. స్వాబ్ టెస్ట్‌లో నెగటివ్ వచ్చింది. సీటీ స్కాన్ కూడా చేయిస్తే.. సీవియర్‌గా ఉంది కోవిడ్. ఆ రిపోర్ట్స్‌ని మా హాస్పిటల్‌లోని అనస్తీషియా డాక్టర్‌కి పంపాను. వాటిని చూసిన ఆవిడ ‘వెంటిలెటర్ మీదుంచే స్థితి తెలుసా నీది? అసలెలా ఉన్నావ్?’ అంటూ గాభరాపడ్డారు. కానీ నేను మాత్రం బాగానే ఉన్నాను. అయినా ఆవిడ కొన్ని జాగ్రత్తలు చె΄్పారు. తెల్లవారి డ్యూటీలో జాయిన్ అయ్యాను. అయితే డాక్టర్స్, కొలీగ్స్ చాలా కేర్ తీసుకున్నారు. ఇంట్లో మా ఆయన, పిల్లలు కూడా! డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మావారు వేడినీళ్లు పెట్టి ఉంచేవారు. మా పెద్దబ్బాయి రోజూ నాన్‌వెజ్ చేసిపెట్టేవాడు.‘ నువ్వు డ్యూటీ చేయాలి కదమ్మా.. మంచి ఫుడ్ అవసరం’ అంటూ. అందరూ చాలా స΄ోర్ట్‌గా ఉన్నారు.అంత విషాదంలోనూ సంతోషమేంటంటే.. మా నర్సింగ్ స్టాఫ్‌లో డెబ్భై శాతం మందికి కోవిడ్ సోకింది. ఐసొలేషన్ పీరియడ్ అయిపోగానే వెంటనే డ్యూటీకొచ్చారు.. భయపడలేదు. పీపీఈ కిట్‌తో ఉక్కపోతగా ఉండేది. అది వేసుకున్న తర్వాత ఒక్కసారి తీసినా మళ్లీ పనికిరాదు. దాంతో వాష్‌రూమ్‌కి కూడా వెళ్లేవాళ్లం కాదు. దానివల్ల డీహైడ్రేషన్ అయింది. అయినా, సహనం కోల్పోలేదు. కోవిడ్ మా సర్వీస్‌కి పరీక్షలాంటిది. నెగ్గాలి.. మానవ సేవను మించిన పరమార్థం లేదు అనుకునేదాన్ని! అంత విషాదంలోనూ సంతోషమేంటంటే మా నిబద్ధత, సేవ ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వాసుపత్రుల మీదున్న చెడు అభిప్రాయం పోయింది. మమ్మల్ని గౌరవిస్తున్నారు. – సరస్వతి రమ (చదవండి: లాభాల తీరం మత్స్య సంపద యోజన) -
నీవల్లే కరోనా!.. చైనాకు అమెరికా కోర్టు జరిమానా
వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా భారీ షాకిచ్చింది. కోవిడ్ మహమ్మారిని కప్పిపుచ్చడంతోపాటు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ)పై గుత్తాధిపత్యం చెలాయించిందనే ఆరోపణలపై అమెరికా కోర్టు చైనాకు 24 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కాగా, కోవిడ్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమంటూ 2020లో మిస్సోరిలో కేసు నమోదైంది. మహమ్మారికి కేంద్రంగా భావిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, తదితర సంస్థలను బాధ్యులుగా ఇందులో పేర్కొన్నారు. అమెరికాకు సరఫరా కావాల్సిన పీపీఈ కిట్ల ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతి, దిగుమతులను చైనా ప్రభుత్వం అడ్డుకుందని అందులో ఆరోపించారు. విచారణ ముగించిన జడ్జి స్టీఫెన్ కోవిడ్ మహమ్మారికి కారణమై నష్టం కలిగించినందుకు చైనా ప్రభుత్వానికి 24 మిలియన్ డాలర్లు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇదే సమయంలో చైనా చర్యల ఫలితంగా మిస్సోరికి పన్నుల రూపంలో 8 బిలియన్ డాలర్ల నష్టం కలిగిందని, పీపీఈ కిట్ల సరఫరా నిలిచినందుకు గాను మరో 122 మిలియన్ డాలర్ల మేర అదనంగా ఖర్చు చేయాల్సి వచి్చందని ఆయన తీర్పులో పేర్కొన్నారు. కోవిడ్‌కు చైనాను బాధ్యునిగా చేయడంలో ఇది చారిత్రక తీర్పు అని మిస్సోరి అటార్నీ జనరల్ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. మిసోరిలోని చైనా ఆస్తులను స్వా«దీనం చేసుకుని, నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. మిసోరి కోర్టు తీర్పుపై వాషింగ్టన్లో చైనా ఎంబసీ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ‘ఈ తీర్పును మేం పట్టించుకోం. ఎలాంటి ప్రాతిపదిక లేని కేసు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న తీర్పు’అని పేర్కొన్నారు. -
కోవిడ్ కారణంగా అల్జీమర్స్ ముప్పు
వాషింగ్టన్: కోవిడ్ సోకిన వారు అల్జీమర్స్ వ్యాధి బారిన పడే అవకాశాలు పెరుగుతున్నట్లు తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. మధ్యస్థాయిలో కోవిడ్ కారణంగా ఆయా వ్యక్తుల మెదడులో అల్జీమర్స్ కారక ప్రోటీన్ క్రియాశీలకమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు చేసిన అధ్యయనం వివరాలు తాజాగా ‘నేచర్ మెడిసిన్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్‌లో కోవిడ్ బారిన పడి కోలుకున్న 46 నుంచి 80 ఏళ్ల వయసు వేలాది మంది వ్యక్తుల సమాచారాన్ని సేకరించి వాటిపై పరిశోధన చేయడంలో ఈ ఫలితాలొచ్చాయి. ‘‘కోవిడ్ బారిన పడిన వారిలో మెదడులోని బీటా రకం ప్రోటీన్‌లో జీవక్రియలు గతంతో పోలిస్తే మరింత క్రియాశీలకమవుతున్నాయి. ఇవి త్వరలో మెదడు న్యూరాన్లు క్షీణించడానికి, అల్జీమర్స్(మతిమరుపు) వ్యాధి వచ్చే అవకాశాలను పెంచుతోంది. కోవిడ్ కాలంలో వచ్చే వాపు భవిష్యత్తులో ఈ వ్యాధి ముప్పుకు ప్రధాన కారణం. అయితే సార్స్–కోవ్2 వైరస్ అనేది అల్జీమర్స్‌కు నేరుగా హేతువు కాదుకానీ భవిష్యత్తులో అల్జీమర్స్ రిస్క్ ను మాత్రం పెంచుతుంది. ఇప్పటికే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఉన్న వ్యక్తుల్లో ఈ రిస్క్‌ను కోవిడ్ ఎగదోస్తుంది. పలు రక్త ప్రోటీన్లలోనూ మార్పుల కోవిడ్ కారణం. ఈ రక్త ప్రోటీన్లలో కొన్నింటికి మెదడులోని బీటా ప్రోటీన్‌తో సంబంధం ఉంది. కోవిడ్ కారణంగా మెదడులో పీటీఏయూ181 అనే ప్రోటీన్ స్థాయిలు పెరుగుతాయి. వీటి కారణంగా టవూ ప్రోటీన్ ముద్దలు ఏర్పడటం, ఈ ప్రతిబంధకాల కారణంగా న్యూరాన్లు దెబ్బతింటాయి. అది చివరకు మతిమరుపునకు దారితీస్తాయి’’అని ఈ పరిశోధనలో ప్రధాన రచయిత డాక్టర్ ఎజీన్ డఫ్ వ్యాఖ్యానించారు. కోవిడ్ బారిన పడిన వారిలో డిమెన్షియా (చిత్రభ్రంశం) వ్యాధి ముప్పు పెరిగిన నేపథ్యంలో ఆ కోణంలోనే ఈసారి కూడా పరిశోధన చేశారు. -
భారత్‌లో మంకీపాక్స్ కేసు నమోదు.. ఎక్కడంటే?
బెంగళూరు : భారత్‌లో తాజాగా మరో మంకీ పాక్స్ (mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుంచి భారత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి.జనవరి 17న బాధితుడు దుబాయ్ నుంచి భారత్‌లోని కర్ణాటక రాష్ట్రం మంగళూరు నగరానికి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే అతడి శరీరంపై దద్దుర్లు, జ్వరంతో పాటు ఇతర మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సదరు ఆస్పత్రి వైద్యులు బాధితుడి లక్షణాలపై అనుమానం రావడంతో కర్ణాటక (karnataka) వైద్యఆరోగ్యశాఖకు సమాచారం అందించారు.అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ బాధితుడి రక్త నమోనాలను సేకరించారు. వాటిని పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్‌లో బాధితుడికి మంకీ పాక్స్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం బాధితుడు, అతని కుటుంబ సభ్యుల్ని ఐసోలేషన్ వార్డ్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.మంకీపాక్స్ నమోదు కావడంపై వైద్యులు స్పందించారు. కోవిడ్-19తో పోలిస్తే మంకీపాక్స్ ప్రమాద తీవ్రత చాలా తక్కువ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎయిర్‌పోర్టులో మంకీ పాక్స్ సోకిన బాధితుణ్ని ఎవరు ఆలింగనం చేసుకున్నారో.. వారందరిని ఐసోలేషన్ వార్డ్‌కు తరలించాం. త్వరలో వారిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. -
‘ఇప్పటికీ ఆ బాధ వెంటాడుతోంది’
మెల్బోర్న్: మూడేళ్ల క్రితం 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. అయితే ఆ సమయంలో అమల్లో ఉన్న కోవిడ్ ఆంక్షల కారణంగా వ్యాక్సిన్ వేసుకున్న వారినే దేశంలోకి అనుమతించారు. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా జొకోవిచ్‌ను విమానాశ్రయంలోనే నిలిపి వేశారు. ఆ తర్వాత అతను కోర్టును ఆశ్రయించడం, ఇతర పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. చివరకు టోర్నీలో ఆడకుండానే జొకోవిచ్‌ను ఆ్రస్టేలియా దేశం నుంచి అధికారులు పంపించి వేశారు. నాటి ఘటన తనను ఇప్పటికీ వెంటాడుతోందని, ఆస్ట్రేలియాకు ఎప్పుడు వచ్చినా దానిని మర్చిపోలేకపోతున్నానని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడేందుకు అతను ఇప్పుడు మళ్లీ వచ్చాడు. ‘నాటి ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా ఎప్పుడు ఆ్రస్టేలియాకు వచ్చినా అదే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. పాస్‌పోర్ట్, ఇమిగ్రేషన్ విభాగం నుంచి వద్ద తనిఖీలు జరుగుతుంటే నావైపు ఎవరైనా వస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. పాస్‌పోర్ట్‌ను చెకింగ్ చేస్తుంటే కూడా నన్ను రానిస్తారా, అదుపులోకి తీసుకుంటారా, వెనక్కి పంపిస్తారా అనే సందేహాలు వస్తుంటాయి’ అని జొకోవిచ్ అన్నాడు. అయితే నిజాయితీగా చెప్పాలంటే నాటి సంఘటనకు సంబంధించి తనకు ఎవరీ మీదా కోపంగానీ, ప్రతీకార భావనగానీ లేదని అతను స్పష్టం చేశాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 10 సార్లు విజేతగా నిలిచిన జొకోవిచ్... గత ఏడాది సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. అయితే రిటైరయ్యే లోగా ఇక్కడ కనీసం మరో టైటిల్ సాధించాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. బ్రిటన్ మాజీ ఆటగాడు ఆండీ ముర్రేను కోచ్‌గా ఎంచుకున్న తర్వాత జొకోవిచ్ ఆడనున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే కానుంది. ఈనెల 12న ప్రారంభమయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ కోసం జొకోవిచ్ మంగళవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. -
ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్లు.. కరోనాకు ముందే..
చైనాలో పుట్టిన హ్యూమన్ మెటా నిమో వైరస్(హెచ్ఎంపీవీ) ఇప్పుడు భారత్‌ను తాకింది. కరోనాను మరచిపోకముందే హెచ్ఎంపీవీ కేసులు భారత్‌లో నమోదవుతుండటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వైరస్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ వైరస్‌కు ముందే ప్రపంచంలో ఎన్నోవైరస్‌లు ఉన్నాయి. అవి వివిధ కాలాల్లో జనాలను వణికించాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు ఆ వైరస్ల కట్టడికి పలు చర్యలు చేపట్టాయి.ప్రపంచంలో దాదాపు 3 లక్షల 20 వేల రకాల వైరస్‌లున్నాయి. ఈ వైరస్లలో అత్యంత ప్రమాదకరమైనవి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కంటే ముందు ఏఏ వైరస్లు ప్రపంచాన్ని వణికించాయనే విషయానికొస్తే..రోటా వైరస్రోటా వైరస్‌ను చైల్డ్ కిల్లర్ వైరస్(Child killer virus) అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పిల్లల ప్రాణాలను హరిస్తోంది. ఇది నవజాత శిశువులు, 6 నుండి 8 ఏళ్ల వయసు గల పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.స్మాల్ పాక్స్దీనిని మశూచి అని అంటారు. ప్రపంచంలోని ఇతర వైరస్‌లకు మించి 30 నుండి 50 కోట్ల మంది మరణాలకు ఇది కారణంగా నిలిచింది. ఈ వైరస్ పునరుత్పత్తి సంఖ్య 3.5 నుండి 6 మధ్య ఉంటుంది. అంటే ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి మూడు నుంచి ఆరుగురికి తిరిగి వైరస్ సోకుతుంది. ఈ వైరస్ మరణాల రేటు(Mortality rate) 90 శాతం. అయితే టీకా ద్వారా, ఈ వైరస్‌ను సమూలంగా నిర్మూలించారు.తట్టుదీనిని మీజిల్స్ అని కూడా అంటారు. ఇది గత 150 ఏళ్లలో దాదాపు 20 కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. గతంలో ఈ వ్యాధి ప్రతి ఏటా సుమారు 2 లక్షల మందిని బలితీసుకుంది. అయితే ఈ వైరస్‌ను వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించారు. మీజిల్స్ వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఈ వైరస్ 18 మందికి సోకే అవకాశముంది.డెంగ్యూదోమల వల్ల డెంగ్యూ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను ప్రపంచంలోని 110 దేశాలలో కనుగొన్నారు. ఇది ప్రతి సంవత్సరం సుమారు 10 కోట్ల మందికి సోకుతోంది. వారిలో 20 వేల మంది మరణిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంటారు.ఎల్లో ఫీవర్(Yellow fever)ఈ వైరస్ సోకిన బాధితుడు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. బాధితుని ముక్కు, కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం జరుగుతుంది. ఈ స్థితికి చేరుకున్న రోగులలో 50 శాతం మంది 7 నుండి 10 రోజుల్లో ప్రాణాలు కోల్పోతారు. ఇప్పటి వరకూ ఎల్లోఫీవర్ ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మందికి సోకింది. ఈ వైరస్ కారణంగా 30 వేల మంది మృతిచెందారు.ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా)ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఫ్లూ కారణంగా మరణిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్పానిష్ ఫ్లూ 10 కోట్ల మందిని బలితీసుకుంది.రేబిస్పురాతన కాలం నుండి రాబిస్‌ను ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణిస్తున్నారు. గబ్బిలం లేదా కుక్క కాటు వల్ల రేబిస్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది మరణిస్తున్నారు. రేబిస్ మరణాలు ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో సంభవిస్తున్నాయి.హెపటైటిస్-బీ అండ్ సీహెపటైటిస్ బీ వల్ల ఏటా 7 లక్షల మంది మృతిచెందుతున్నారు. ప్రస్తుతం ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటిగా నిలిచింది. ఈ వైరస్ తొలుత శరీరంలోని కాలేయంపై దాడి చేస్తుంది. దీనికి తగిన చికిత్స అందుబాటులో లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది హెపటైటిస్ సీ కారణంగా మరణిస్తున్నారు.ఎబోలా- మార్బర్గ్ వైరస్ఎబోలా- మార్బర్గ్ వైరస్లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లుగా గుర్తించారు. ఈ వైరస్ల నియంత్రణకు ఇంకా చికిత్స గానీ, వ్యాక్సిన్‌ను గానీ అభివృద్ధి చేయలేదు. అయితే ఈ వైరస్ల మరణాల రేటు 90 శాతం వరకు ఉంది. ఈ రెండు వైరస్ల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటి బారిన పడిన బాధితుడు రక్తస్రావ జ్వరం, అవయవ వైఫల్యం లాంటి సమస్యలను ఎదుర్కొంటాడు.హెచ్ఐవీ, ఎయిడ్స్నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది హెచ్ఐవి వైరస్‌తో బాధపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం గత 30 ఏళ్లలో ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2.5 కోట్ల మంది ఎయిడ్స్ కారణంగా మృతిచెందారు.ఇది కూడా చదవండి: ‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే -
ముఖ్యమంత్రిగా అవకాశం.. వద్దనుకున్న సోనూసూద్.. ఎందుకంటే?
ఢిల్లీ : కరోనా (covid-19) సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood) రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల సోనూసూద్ ఓ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తులు ‘నాకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు. నేను తిరస్కరించా. అప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్నారు. అదీ వద్దన్నా. రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చింది. వాటిని వద్దనుకున్నాను. రాజకీయాల్లో (politics) ఉండి దేని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉండదన్నారు. స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేనందునే రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినట్లు చెప్పారు. రెండు కారణాలతో రాజకీయం చేస్తారు. ఒకటి డబ్బు కోసం, అధికారం కోసం. వాటిల్లో దేనిపైనా నాకు ఆసక్తిలేదు. ప్రజాసేవ చేస్తున్నాను. ఇందుకోసం ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. నేను ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే చేస్తాను. అదే రాజకీయం చేస్తే జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. స్వేచ్ఛను కోల్పోతామని భయం కూడా ఉంది. ఎవరైనా ప్రజాదరణ పొందుతున్నప్పుడు జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని అనుకుంటారు. కానీ మనం ఎంత ఎంతుకు ఎదిగితే అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మీరు అక్కడ ఎంతకాలం నిలదొక్కుకోగలరన్నది ముఖ్యం.రాజకీయాల్లోకి వస్తే ఢిల్లీలో ఇల్లు, ఉన్నత పదవి, భద్రత, విశిష్ట అధికారాలు ఉంటాయని నాకు చాలా మంది చెప్పారు. అవన్నీ బాగున్నాయి. నేను వాటిని వినడానికి ఇష్టపడుతున్నాను. అంతే తప్పా ఇంకా దేని గురించి ఆలోచించడం లేదు. నటుడిగా కొనసాగుతా. నాలో ఒక నటుడు,దర్శకుడు మిగిలి ఉన్నారు, నేను రాజకీయాలకు వ్యతిరేకం కాదు, గొప్ప పని చేసే రాజకీయ నాయకులను నేను గౌరవిస్తాను’ రాజకీయాలపై సోనూసూద్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కోవిడ్ వెంటాడినా ఏపీ వృద్ధి ముందుకే
సాక్షి, అమరావతి: రెండేళ్లపాటు కోవిడ్ సంక్షోభం వెంటాడినా గడచిన ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్ర వృద్ధి ముందుకే సాగింది. ఐదేళ్ల పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1.94 లక్షల కోట్లు పెరిగింది. వ్యవసాయ, తయారీ, పారిశ్రామిక, సేవలు, నిర్మాణ రంగాలన్నింటిలోనూ వృద్ధి కొనసాగింది. స్థిర ధరల ఆధారంగా వృద్ధి గణన మాత్రమే నిజమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్ధికరంగ నిపుణులు పేర్కొంటారు. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రంగాల వృద్ధి గణాంకాలను విడుదల చేసింది. ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీ 31.04 శాతం వృద్ధి నమో దైనట్టు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. సగటు వార్షిక వృద్ధి 6.20 శాతం నమోదైంది. వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 16.46 శాతం నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 3.29 శాతం నమోదైంది. సంక్షోభంలోనూ.. కోవిడ్ సంక్షోభం ప్రపంచాన్ని రెండేళ్లు వెంటాడింది. ఆ పరిస్థితుల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగించడం వల్లే ఈ వృద్ధి నమోదైందని ఆర్ధిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తయారీ రంగం ఐదేళ్లలో 58.39 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 11.67 శాతం నమోదైంది. పారిశ్రామిక రంగంలో 46.62 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 9.32 శాతంగా నమోదైంది. నిర్మాణ రంగంలో గత ఐదేళ్లలో 41.50 శాతం వృద్ధి నమోదవ్వగా.. సగటు వార్షిక వృద్ధి 8.3 శాతంగా ఉంది. ఐదేళ్లలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో 42.04 శాతం వృద్ధి నమోదు కాగా.. సగటు వార్షిక వృద్ధి 8.40 శాతంగా ఉంది. సేవా రంగం 22.90 శాతం వృద్ధి నమోదు చేయగా.. సగటు వార్షిక వృద్ధి 4.5 శాతంగా నమోదైంది. -
తిరుగు వలసలు చెబుతున్నదేమిటి?
కోవిడ్ మహమ్మారి కాలంలో లక్షలాది మంది నగరాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. మహమ్మారి ముగిసిన తర్వాత వీరందరూ తిరిగి నగరా లకు చేరుకుంటారన్న అంచనాలకు భిన్నంగా గ్రామాల్లోనే ఉండిపోయారు. 2020–22 మధ్య కాలంలో గ్రామీణ శ్రామిక శక్తికి సుమారు 5 కోట్ల 60 లక్షల మంది కార్మికులు జోడించబడ్డారు. వీళ్లలో ఎక్కువమంది యువత. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లాంటివాటిని మినహాయిస్తే, చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ కూడా జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని చాటుతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించే ఆర్థిక విధానాలకు బదులుగా, వ్యవసాయాన్ని స్థిరమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చాలి.భారత ప్రజలు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. గత ఐదేళ్లలో, పట్టణ కేంద్రాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, ‘తక్కువ–ఉత్పాదకత’ కలిగిన వ్యవసాయం నుండి కార్మికులను బయటకు నెట్టడానికి సంకల్పించిన విధానం ఇప్పుడు అడ్డం తిరిగింది.కోవిడ్–19 మహమ్మారి కాలంలో మొదటిసారి తిరుగు వలసలు (రివర్స్ మైగ్రేషన్) మొదలయ్యాయి. లక్షలాది మంది పట్టణ పేదలు అనంత దూరాలు, చాలామంది కాలినడకన తమ తమ ఊళ్లకు ప్రయా ణించారు. దేశ విభజన రోజుల తర్వాత ఇది ప్రజల అతిపెద్ద చలనం. కనీవినీ ఎరుగనంత స్థాయిలో సాగిన ఈ అంతర్–రాష్ట్ర వలసలు, రాష్ట్రం లోపలి వలసలు తాత్కాలికమని నమ్మారు. కానీ, మహమ్మారి ముగిసిన తర్వాత శ్రామికశక్తి నగరాలకు తిరిగి వస్తుందనే అంచనాను తోసిపుచ్చుతూ, వాళ్లలో ఎక్కువ మంది తమ ఊళ్లలోనే ఉండడానికి ఇష్టపడటం జరిగింది.వ్యవసాయంలోనే ఉపాధి‘నేషనల్ శాంపిల్ సర్వే’, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ల డేటా ఆధారంగా, ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’, న్యూఢిల్లీకి చెందిన ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్’ రూపొందించిన ఒక నివేదికలో వ్యవసాయ ఉపాధి పెరిగిందని తేలింది. సాధారణ అభి ప్రాయానికి విరుద్ధంగా, 2020–2022 మధ్య గ్రామీణ శ్రామికశక్తికి 5 కోట్ల 60 లక్షలమంది కార్మికులు జోడించబడ్డారు. నిరుద్యోగం వృద్ధి చెందుతున్న సమయంలో, నగరాల్లో లభించే ఉపాధి అవకాశాలు వలస కార్మికులకు అంతగా ఆకర్షణీయంగా లేవని ఇది నిరూపిస్తోంది. తయారీ రంగంలో మందగమనం, నిర్మాణ రంగ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టడం వల్ల నగరాలకు వలస వచ్చినవారు గ్రామాలకు తిరిగి వెళ్లడమే మంచిదని భావించారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2004–05, 2018–19 మధ్య అంటే 13 సంవత్సరాల కాలంలో 6 కోట్ల 60 లక్షల మంది వ్యవసాయ శ్రామికులు పట్టణాలలో చిన్న ఉద్యోగాల కోసం వలస వెళ్లారు. కానీ 2018–19, 2023–24 మధ్య ఐదేళ్లలో 6 కోట్ల 80 లక్షల మంది పైగా ప్రజలు గ్రామాలకు తిరిగి వచ్చారని జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యా లయానికి చెందిన ఆర్థికవేత్త హిమాన్షు అంచనా వేశారు. వ్యవసాయం అకస్మాత్తుగా లాభదాయకంగా మారిందని దీని అర్థం కాదు. ప్రజ లను పొలాల నుండి బయటకు నెట్టడం ఆచరణీయమైన వ్యూహం కాదని ఇది స్పష్టంగా చెబుతోంది.గ్రామీణ శ్రామిక శక్తిలో వ్యవసాయం వాటా 2018–19లో 42.5 శాతం నుండి 2023–24లో 46.1 శాతానికి పెరిగిందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక చెబుతోంది. పైగా ఇందులో గణనీయమైన యువ జనాభా కూడా ఉంది. ఇది విస్మరించలేని సందేశాన్ని ఇస్తోంది. ప్రజలను ఆ రంగం నుండి బయటకు నెట్టాలనే లక్ష్యంతో సంవత్సరాలుగా వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా వెనుకపట్టున ఉంచిన విధానాల మీద మన ఆర్థిక ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో ఒక సంవత్సరం పాటు జరిగిన ఆందోళనల తరువాత రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. తమకు సరైన ఆదాయాన్ని నిరంతరం తిరస్కరించడంపై రైతాంగం ఆగ్రహంతో ఉంది.ప్రపంచ బ్యాంకుకు దూరంగా– గాంధీజీకి దగ్గరగా!భారతదేశం తన వ్యవసాయరంగం నుండి 40 కోట్ల మంది ప్రజలను నగరాలకు వలసబాట పట్టించాలని ప్రపంచ బ్యాంకు 1996లో కోరింది. ఇది బ్రిటన్, ఫ్రాన్ ్స, జర్మనీల ఉమ్మడి జనాభా కంటే రెండింతలకు సమానం. అయితే పట్టణ కేంద్రాలకు వలస వెళ్లడానికి వీలుగా ఆర్థిక పరిస్థితులను సృష్టించే బదులు, వ్యవ సాయాన్ని ఆచరణీయమైన వాణిజ్యంగా మార్చడం ద్వారా వ్యవ సాయాన్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించాలి. మహాత్మా గాంధీ కోరుకున్నది ఇదే. వలస కార్మికులు తిరిగి వచ్చిన రేటు ఆయన అభి ప్రాయం ఎంత సరైనదో చూపిస్తుంది. అందువల్ల, ప్రపంచ బ్యాంకు ఆలోచనను విడనాడి వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం, వ్యవసాయాన్ని స్థిరమైన, ఆచరణీయమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.మీకు ఇంకా నమ్మకం లేకుంటే, ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్’ (నాబార్డ్)కు చెందిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే 2021–22’ నివేదికను చూడండి. దీని ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న జనాభా వాటా సంవత్సరాలుగా గణనీయంగా పెరి గింది. 2016–17లోని 48 శాతం నుండి 2023–24లో గరిష్ఠంగా 57 శాతానికి చేరుకుంది. వ్యవసాయ కుటుంబాల సంఖ్యలో పెను గంతు స్థానికుల తిరిగిరాకను స్పష్టంగా సూచిస్తోంది. వ్యవసాయ కుటుంబాల వాటా 2016–17లో 42 శాతం నుండి 2021–22 నాటికి 36 శాతానికి తగ్గిన పంజాబ్; 70 నుండి 63 శాతానికి తగ్గిన హిమాచల్ ప్రదేశ్, కొంచెం తగ్గుదల చూపిన గుజరాత్, కర్ణాటకలను మినహాయిస్తే... అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల పెరుగుదల గణనీయంగా ఉంది. వ్యవసాయ కుటుంబాలు గోవాలో 3 నుండి 18 శాతానికి, హరియాణాలో 34 నుండి 58 శాతానికి పెరిగాయి. ఉత్తరా ఖండ్‌లో 41 నుంచి 57 శాతం; తమిళనాడులో 13 నుండి 57 శాతం పెరుగుదల కనబడింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పెరుగుదల ధోరణినే చూపుతున్నాయి.కారణాలు ఏమైనప్పటికీ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, పీరి యాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, నాబార్డ్ చేసిన మూడు అధ్యయనాలు కూడా ఉపాధి, జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను చాటుతున్నాయి. అందుకే గృహ ఆహార భద్రతను నిర్ధారించడంలో వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని విస్మరంచకూడదు.ఆందోళనలో శుభవార్త వ్యవసాయంలో సంఖ్యలను తగ్గించడంపై ఆధారపడిన మును పటి ఆర్థిక విధానాలను రివర్స్ మైగ్రేషన్ తారుమారు చేసినప్పటికీ, వ్యవసాయంలో ఉపాధి పెరుగుదలను ప్రధాన ఆర్థికవేత్తలు ‘ఆందో ళన కలిగించే అంశం’గా చూస్తున్నారు. భారతదేశంలో కనిపిస్తున్న ఈ తిరుగు వలసల ధోరణి తక్కువ మధ్య–ఆదాయ వర్గానికి ప్రత్యే కమైనదిగా చూస్తున్నారు. కానీ వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన ఆర్థిక విధానాలను పునరుజ్జీవింపజేయవలసిన అవస రాన్ని ఇది సూచిస్తుంది. మారుతున్న క్షేత్ర వాస్తవికతను గుర్తించాల్సిన సమయం ఇది.ప్రభుత్వం తగిన వనరులను కల్పించడానికి సిద్ధంగా ఉంటే, వ్యవసాయంపై ఆధారపడటం దాని సొంత ఆచరణీయ మార్గాలను సృష్టిస్తుంది. వ్యవసాయం కోసం కేటాయించే బడ్జెట్ వ్యయంలో ఏదైనా పెరుగుదలను ప్రతిపాదిస్తే, అది ఆర్థిక లోటుకు అదనపు మొత్తంగా పరిగణించడాన్ని ఆర్థికవేత్తలు ఇకనైనా మానేయాలి. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం మాత్రమే రైతుల నష్టాలను బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేయడం లేదు. నేను తరచుగా చెప్పినట్లు, రైతులు దాదాపు 25 సంవత్సరాలుగా ఏటా పంట నష్టపోతున్నారు. రైతులకు ‘దేవుడే దిక్కు’ అయ్యే ఈ లోపభూయిష్ట ఆర్థిక రూపకల్పన ఇకనైనా అంతం కావాలి.ఒక విధంగా తిరుగు వలసలను శుభవార్తగా చూడాలి. వనరులను అత్యంత అవసరమైన చోట ఉంచడానికి ఇది సరైన సమయం. అది చివరకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’కు దారి తీస్తుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
మోదీకి డొమినికా జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి విజృంభించి దేశాన్ని కలావికలం చేస్తున్న వేళ భారత్ అందించిన ఆపన్నహస్తంతో తెరిపినపడిన డొమినికా దేశం తన కృతజ్ఞత చాటుకునేందుకు సిద్ధపడింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయానికి గుర్తుగా మోదీకి ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రదానం చేయనున్నట్లు ది కామన్వెల్త్ ఆఫ్ డొమినికా గురువారం ప్రకటించింది. భారత ప్రభుత్వ ఉదార గుణాన్ని స్మరించుకుంటూ ఆ దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీకి తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గయానాలోని జార్జ్‌టౌన్ పట్టణంలో నవంబర్ 19 నుంచి 21వ తేదీదాకా జరిగే ఇండియా–కరికోమ్ శిఖరాగ్ర సదస్సులో మోదీకి ఈ అవార్డ్‌ను అందజేస్తారు. ‘‘2021 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఆదేశాలతో భారతసర్కార్ మాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనికా కోవిడ్19 వ్యాక్సిన్లు అందించింది. మా స్థాయికి అది పెద్ద సాయం కావడంతో వాటిలో కొన్నింటిని మా పొరుగు దేశాలకూ సాయంగా అందించగలిగాం. ఆరోగ్యం, వైద్యం, సమాచార సాంకేతిక రంగాల్లోనూ భారత్ మాకు ఎంతో సాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో వాతావరణమార్పు నిరోధక చర్యలు చేపట్టడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకను గుణంగా ముందడుగు వేయడంలో మాకు వెన్నంటి నిలిచింది’’ అని ఆ దేశ ప్రధాని కార్యాలయం కొనియాడింది. -
కోవిడ్ కక్కిన విషం.. స్వీట్ లిటిల్స్లో చేదు చక్కెర
కోవిడ్ తర్వాత పిల్లల్లో టైప్– 1 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందేమోనని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా ఇది జరిగేందుకు అవకాశముందనే పరిశోధకుల రిపోర్టులు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’ (జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్)లో ప్రచురితమయ్యాయి.పరిశోధకుల అధ్యయన ఫలితాల వివరాలివి... వైరస్ తాలూకు ప్రభావంతో చిన్నారుల సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు.. వారి క్లోమ (ప్యాంక్రియాస్) గ్రంథిలోని బీటా కణాలు దెబ్బతీయడం వల్ల పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ వచ్చే ముప్పుందని పేర్కొంటున్నారు.అధ్యయన ఫలితాలు చెప్పేదేమిటంటే... జర్మనీలో ఫిబ్రవరి 2015 నుంచి అక్టోబరు 2023 వరకు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు పరిశోధకులు 509 మంది చిన్నారులపై ఓ సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. ఏడాది మొదలుకొని పదహారేళ్ల వయసున్న పిల్లల్లో మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీలనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ అధ్యయనం సాగింది. ఈ ‘మల్టిపుల్ ఐలెట్ యాంటీబాడీస్’ అనేవి ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీసే ్రపోటీన్లు. ప్యాంక్రియాస్‌ను అవి అలా దెబ్బతీయడంలో చిన్నారుల్లో అది టైప్–1 డయాబెటిస్‌కు కారణమవుతుంది. ఐలెట్ ఆటో యాంటీబాడీస్... ప్యాంక్రియాస్‌ను దెబ్బతీయడం జరిగితే ముందు లక్షణాలు కనిపించకపోయినప్పటికీ... తుదకు అది టైప్–1 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఈ తరహా పరిశోధనల అవసరమెందుకంటే... డయాబెటిస్ వ్యాధిలో రక్తంలో చక్కెరను నియంత్రించాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగదు. లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ దేహం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోకపోవచ్చు. దాంతో రక్తంలో చక్కెర ఎక్కువవ్వడంతో తొలిదశల్లో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా నిశ్శబ్దంగా దెబ్బతీసే చక్కెర వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’గా నిపుణులు చెబుతుంటారు. జీవనశైలి సమస్యల్లో ఒకటైన ఈ వ్యాధిని దురదృష్టవశాత్తూ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. దాంతో అది దేహంలోని కీలకమైన అవయాలను... మరీ ముఖ్యంగా గుండె, రక్తనాళాలు, కళ్లు, మూత్రపిండాలు, నరాలను దెబ్బతీస్తుంది. అందువల్ల చిన్నపిల్లల్లో కనిపించే చక్కెరవ్యాధి (జువెనైల్ డయాబెటిస్) అని పిలిచిన ఈ వ్యాధి... ఇప్పుడు యువత పెద్దయ్యాకా వారిని ప్రభావితం చేస్తుండటంతో మనదేశ నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి్టపెడుతున్నారు.గట్ మైక్రోబియమ్ అసమతౌల్యత వల్ల... జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందనీ, ఈ సూక్ష్మజీవుల సమూహాన్నే ‘గట్ బ్యాక్టీరియా’ లేదా ‘గట్ మైక్రోబియమ్’ అంటారనీ, దీనివల్లనే ప్రతి ఒక్కరిలోని వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఏదైనా వైరస్ సోకాక... ఈ గట్ మైక్రోబియమ్లో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య తగ్గి, కీడు చేసేవి పెరగడం వల్ల గట్ మైక్రోబియమ్ సమతౌల్యతలో మార్పుల వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, బలహీనమవుతుంది. ఈ పరిణామం డయాబెటిస్, గుండెజబ్బుల వంటి అనేక దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులకు కారణమవుతుంది.యాంటిజెన్స్కు ఎక్స్పోజ్ కానివ్వపోవడంతో... మునపటి తరంతో పోలిస్తే ఇటీవల పిల్లలను స్వాభావికమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కానివ్వకుండా అత్యంత రక్షణాత్మకమైన రీతిలో తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. పిల్లలు ఆరుబయట ఆడుతూ, ్రపాకృతిక పర్యావరణానికీ, అందులోని కొన్ని వ్యాధికారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు చిన్నారుల్లో ఆ వ్యాధికారకాలను ఎదుర్కొనే యాంటిజెన్స్ ఉత్పన్నం అవుతాయి. కానీ తల్లిదండ్రుల అతిజాగ్రత్త కారణంగా వారు నేచురల్ ఎన్విరాన్మెంట్లో ఉండటం తగ్గిపోవడంతో కొన్ని రకాల హానికారక అంశాలకు యాంటిజెన్స్ ఉత్పాదన లేకుండా పోయి, సహజ రక్షణ కవచం ఏర్పడకుండా పోయింది. ఈ అంశం కూడా పిల్లల్లో సహజ రక్షణ వ్యవస్థను బలహీనం చేసిందనే అభి్రపాయం కూడా ఇంకొందరు నిపుణులనుంచి వ్యక్తమవుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిందే... కనబడుతున్న తార్కాణాలను బట్టి, ప్రస్తుతానికి టైప్–1 డయాబెటిస్‌కు మందులేదనే వాస్తవానికి బట్టి రాబోయే భావితరాలను వ్యాధిగ్రస్తం కాకుండా చూసుకునేందుకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. డయాబెటిస్ ఉన్న పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు ... 👉చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉండటం; మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్తుండటం. 👉రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటును మానేసిన పిల్లలు అకస్మాత్తుగా మళ్లీ పక్క తడపటం మొదలుపెట్టడం ∙బాగా ఆకలితో ఉండటం; మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం ∙చాలా తేలిగ్గా అలసిపోతుండటం, చాలా నిస్సత్తువగా, నీరసంగా ఉండటం ∙కొందరిలో చూపు మసగ్గా కనిపిస్తుండటం (బ్లర్డ్ విజన్) ∙జననేంద్రియాల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్లు (క్యాండిడియాస్) వంటివి వస్తుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపోతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు.టైప్–1 డయాబెటిస్‌ను ఎదుర్కొనే తీరు(మేనేజింగ్ టైప్–1 డయాబెటిస్) పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ కనిపించినప్పుడు కింద పేర్కొన్న ఆరు అంశాల ద్వారా దాన్ని మేనేజ్ చేయాలి. అవి... 1. ఇన్సులిన్ : డయాబెటిస్తో బాధపడే పిల్లల విషయంలో ప్రస్తుతానికి ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స. 2. పర్యవేక్షణ (మానిటరింగ్) : పిల్లల్లో కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపోదు. వారు తిన్న దాన్ని బట్టి ఎంత మోతాదులో ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్ని నిత్యం పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఈ అంశాన్ని పిల్లలు ఎంత తిన్నారు, ఎలాంటి ఆహారం తీసుకున్నారు, దాని వల్ల రక్తంలో ఎంత గ్లూకోజ్ వెలువడుతుంది... వంటి అనేక అంశాలను పర్యవేక్షించుకుంటూ ఇన్సులిన్ ఇస్తుండాలి. 3. ఆహారం : కేవలం రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను చూసుకుంటూ యాంత్రికంగా ఇన్సులిన్ ఇవ్వడం కాకుండా... పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా ఆహారం ఉండేలా చూపుకోవాలి. ఆహారంలో తగిన పాళ్లలో పిండిపదార్ధాలను (కార్బోహైడ్రేట్స్) సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపోటీన్లు), ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు ఇస్తుండాలి. వీటిని పిల్లల వయసు, బరువు, రోజంతా చేసే శ్రమ వంటి అంశాల ఆధారంగా ఓ ప్రణాళిక రూ΄÷ందించి, దానికి అనుగుణంగా అవసరమైన మోతాదుల్లో ఇవ్వాలి. 4. శారీరక శ్రమ : ఈ రోజుల్లో చిన్నారులు ఆరుబయట ఆడుకోవడం చాలా తక్కువ. పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర మోతాదులు స్వాభావికంగానే నియంత్రితమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లల్లో ఒళ్లు అలిసేలా ఆడుకోవడం చాలా అవసరం.5. గ్లూకోజ్‌ను పరీక్షించడం : పిల్లల రక్తంలో గ్లూకోజ్ మోతాదుల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. 6. కీటోన్ మోతాదుల కోసం మూత్రపరీక్ష : మూత్రంలో కీటోన్ మోతాదులను పరీక్షించడం కోసం తరచూ మూత్రపరీక్షలు చేయిస్తూ ఉండాలి. చిన్నారుల్లో పెరుగుతున్న కేసులు... కోవిడ్–19 ఇన్ఫెక్షన్ అన్నది ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను పెంచడం వల్ల ఆ అంశం ఈ వ్యాధిని ప్రేరేపిస్తోందంటున్నారు మరికొందరు నిపుణులు. ఇక జామా రిపోర్టును అనుసరించి, కోవిడ్–19 బారిన పడ్డ పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన ఆర్నెల్ల నుంచి ఏడాది కాలంలోనే టైప్–1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు మామూలు పిల్లల కంటే 16% ఎక్కువ. మన దేశంలో నిర్దిష్టమైన గణాంకాలు లేకపోయినప్పటికీ... పాశ్చాత్య దేశాల అధ్యయనాల ప్రకారం చూస్తే కోవిడ్ (సార్స్–సీవోవీ2) ఇన్ఫెక్షన్ తర్వాత టైప్–1 డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎంటరోవైరస్, సైటో మెగాలో వైరస్, రుబెల్లా వైరస్లు ఎటాక్ అయ్యా కూడా టైప్–1 డయాబెటిస్ రావడం జరిగినట్లే... కోవిడ్19 విషయంలోనూ జరుగుతోందని మరికొందరు నిపుణుల అభి్రపాయం.కారణాలుటైప్–1 డయాబెటిస్‌కు జన్యుపరమైన కారణాలను ముఖ్యంగా చెప్పవచ్చు. దాంతోపాటు బాధితులు కొన్ని వైరస్‌లకు గురికావడం కూడా మరో ముఖ్యమైన అంశం. కోవిడ్–19 కూడా ఒక రకం వైరల్ ఇన్ఫెక్షన్ కావడం కూడా ఈ ముప్పును పెంచుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్), 2022 నివేదిక ప్రకారం మన దేశంలో టైప్–1 డయాబెటిస్తో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 95,600 మంది 14 ఏళ్లలోపు చిన్నారులని తేలింది. -
ముంచుకొస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్..ఏకంగా 27 దేశాలకు..!
కోవిడ్-19 ప్రపంచ దేశాలను ఎంతలా గడగడలాడించిందో అదరికి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది అనుకునేలోపు ఆ మహమ్మారి ఏదో రూపంలో నేను ఉన్నానంటూ కన్నెర్రజేస్తోంది. ఇప్పటివరకు ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్ వంటి రకరకాల సబ్వేరియంట్లుగా రూపాంతరం చెంది కలవరపెడుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ ఎక్స్ఈసీ అనే కొత్త వేరియంట్ రూపంలో దూసుకొస్తోంది. తొలిసారిగా ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన కేసుని జర్మన్లో గుర్తించారు. అలా ఇది యూకే, యూఎస్, డెన్మార్క్, పోలాండ్, చైనాతో సహా 27 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఇది యూరప్‌లో వేగంగా విజృంభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్‌లో కూడా ఈ వైరస్ వృద్ధి తీవ్రంగా ఉందని వెల్లడించారు. ఈ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్‌ని ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ హైబ్రిడ్ కేఎస్ 1.1, కేపీ, 3.3గా చెబుతున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా, లండన్‌లోని జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ మాట్లాడుతూ.. ఇతర కోవిడ్ వేరియంట్లతో పోలిస్తే ఈ ఎక్స్ఈసీ తొందరగా వ్యాప్తి చెందదని, అయినప్పటికీ టీకాల వంటి రక్షణ అందిచడం మంచిదని సూచించారు. శీతకాలంలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్లేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ..ఈ వేరియంట్ ఉధృతి ఇప్పుడే ప్రారంభమయ్యింది. ఇది తీవ్ర రూపం దాల్చడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్లొచ్చు. ఈ ఎక్స్ఈసీ కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వంశానికి చెందిన ఉపవేరియంటే కాబట్టి దీన్ని వ్యాక్సిన్ల, బూస్టర్ డోస్‌లతో అదుపు చేయగలం అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందర్నీ పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.ఎక్స్ఈసీ లక్షణాలు..జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులతో సహా మునుపటి కోవిడ్ వేరియంట్ల మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత ఛార్జ్ చేస్తాడంటే..?) -
రానున్నది మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ ఆందోళన
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్‌గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్‌ను మించిన మహమ్మారి.‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్‌కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు. -
Karnataka: మరో కుంభకోణం వెలుగులోకి.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల లూటీ
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో భారీ స్కాం వెలుగుచూసింది. కరోనా సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తేలింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ పాలనలో కోవిడ్‌పై పోరాటానికి కేటాయించిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి.దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిషన్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఆగస్టు 31వ తేదీన సుమారు 1722 పేజీలతో కూడిన నివేదికను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును విశ్లేషించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు కమిషన్‌కు ఆరు నెలల అదనపు గడువు ఇచ్చారు.తాజాగా ఈ నివేదికపై చర్చించేందుకు నేడు మంత్రివర్గం సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఈ నివేదికపై చర్చించిన సిద్ధరామయ్య.. కొన్ని కీలక విషయాలను గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వందల కోట్లు దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని కమిటీ గుర్తించిందని సీఎం ఆ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.కొవిడ్ సమయంలో రాష్ట్రం వెచ్చించిన సొమ్ము మొత్తం విలువ రూ.13 వేల కోట్లు. కానీ దానిని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అందులో రూ.1,000 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుదిరూపు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతోంది.పార్లమెంట్ శీతాకాల సమావేశంలో దీనిని సమర్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముడా స్కామ్ వచ్చిన తరుణంలోనే ‘కొవిడ్’ కుంభకోణం నివేదిక తేవడంపై మీడియా అడిగిన ప్రశ్నపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ముడా వ్యవహారంపై విమర్శలు రాబట్టి రెండు నెలలు కూడా కావడం లేదు. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీని ఏడాదిక్రితం ఏర్పాటుచేశారు. అసలు రెండింటిని ఎలా పోలుస్తారు. ఇది దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు. -
మరోసారి కరోనా పంజా?
న్యూఢిల్లీ: కోవిడ్–19 సృష్టించిన విలయాన్ని దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ప్రాణాంతక మహమ్మారి కాటుకు లక్షల మంది బలయ్యారు. క్రమంగా వైరస్ వ్యాప్తి నిలిచిపోయింది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, కోవిడ్–19 మరోసారి విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అమెరికాలో 25 రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతున్నట్లు సెంటర్ ఫర్ డిసీజజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. దక్షిణ కొరియాలో చాలామంది కరోనా బారినపడి, చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇండియాలో ఈ ఏడాది జూన్, జూలైలో 908 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు బాధితులు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో జూన్ 24 నుంచి జూలై 21 మధ్య వారానికి సగటున 17,358 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేసింది. ఇతర దేశాల్లో ఉన్నట్లుగా ఇండియాలో పరిస్థితి అంత తీవ్రంగా లేకపోయినా మనం అన్నింటికీ ఇప్పటి నుంచే సిద్ధపడి ఉండడం మంచిదని నోయిడాలోని శివ నాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వైరాలజిస్టు దీపక్ సెహగల్ సూచించారు. వైరస్ మరోసారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఈసారి వైరస్ వ్యాప్తిలో వేగం 11 శాతం పెరిగిందని, బాధితుల్లో 26 శాతం మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసిందని వెల్లడించారు. ఇది నిజంగ ఆందోళకరమైన పరిణామమేనని పేర్కొన్నారు. -
కోవిడ్ మందుకు ఆయుష్ అనుమతి!
కొవిడ్ వైరస్ బారిన పడినవారిలో ఇప్పటికీ కొన్ని స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వారికోసం రెమిడియమ్ థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ ఫార్మాసూటికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సంయక్తంగా ‘కోరోక్విల్-జెన్’ అనే ఔషధాన్ని తయారు చేశాయి. ఈమేరకు తాజాగా ఈ డ్రగ్ భారత ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు కూడా పొందింది.ఈ సందర్భంగా రెమిడియమ్ థెరపెటిక్స్ సీఈఓ కృష్ణన్ మాట్లాడుతూ..‘కొవిడ్ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటికీ స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు రెమిడియం థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్-చెన్నై, ఢిల్లీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ యూనివర్శిటీ సహకారంతో ‘కోరోక్విల్-జెన్’ను అభివృద్ధి చేశాయి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్న జింక్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్ మిశ్రమం ఇందులో ఉంటుంది. దానివల్ల కొవిడ్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని వాడే రోగులు ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. ఈ డ్రగ్‌కు తాజాగా భారత ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు లభించాయి. కొవిడ్‌తో కలిగే అనారోగ్య సమస్యలతోపాటు క్షయ, ఆస్తమా, సీజనల్ అలర్జీలు, పల్మనరీ, ఇతర శ్వాసకోశ రుగ్మతల చికిత్సలో కోరోక్విల్-జెన్ ఉపయోగించేందుకు లైసెన్స్ లభించింది’ అన్నారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలో వ్యక్తిగత వివరాలు మార్చుకోండిలా..! -
భారత్‌లోనే కోవిడ్-19 మరణాలు ఎక్కువ.. ఖండించిన కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్-19 సమయంలో భారత్‌లో అధిక మరణాలు సంభవించాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం తెలిపింది. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో పేర్కొన్న అధ్యయనాన్ని కేంద్రం కొట్టిపారేసింది. భారత్‌లో అధికారిక కోవిడ్-19 మరణాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల కంటే 1.5 రెట్లు ఎక్కువ అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నివేదించారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, అధిక-ఆదాయ దేశాలలో కనిపించే నమూనాలతో పోలిస్తే, మహమ్మారి సమయంలో మహిళల కంటే పురుషులలో అధిక మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే,ఆ రిపోర్ట్‌పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. సైన్స్ అడ్వాన్సెస్ పేపర్లో నివేదించబడిన అదనపు మరణాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. జర్నల్స్ లోపభూయిష్టంగా ఉందని, ఆమోదయోగ్యం కాని ఫలితాలను చూపుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
2020లో భారత్‌లో కరోనాతో... 11లక్షల అధిక మరణాలు
న్యూఢిల్లీ: కరోనా వల్ల 2020లో భారత్‌లో కేంద్రం చెప్పిన వాటికంటే ఏకంగా 11.9 లక్షల అధిక మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఇది భారత్ అధికారిక గణాంకాల కంటే 8 రెట్లు, డబ్ల్యూహెచ్ఓ అంచనాల కంటే ఒకటిన్నర రెట్లు అధికం! 2019తో పోలిస్తే ఈ మరణాలు 17 శాతం అధికమని అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, మరికొన్ని విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2019 నుంచి 2020 దాకా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బాధితుల డేటాను సైతం పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్–19 సంబంధిత మరణాల్లో మూడింట ఒక వంతు మరణాలు ఇండియాలోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు. కోవిడ్–19 ప్రభావం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం 2.6 ఏళ్లు తగ్గినట్లు తెలిపారు. మహిళల ఆయుర్దాయం 3.1 ఏళ్లు, పురుషుల ఆయుర్దాయం 2.1 ఏళ్లు తగ్గినట్లు గుర్తించారు. అధ్యయనం వివరాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ప్రచురించారు.అవన్నీ కరోనా మరణాలు కాదు అధ్యయనం గణాంకాలపై కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. ఈ గణాంకాల్లో వాస్తవం లేదని, అవన్నీ కరోనా మరణాలు కావని పేర్కొంది. -
మరో కరోనా వేవ్.. జపాన్‌లో పెరుగుతున్న కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోల్లాన్ని ఎవరూ మరచిపోలేరు. తాజాగా జపాన్‌లో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇవి అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ వేరియంట్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19కు చెందిన 11వ వేవ్ ఇప్పుడు జపాన్ను వణికిస్తోంది.జపాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కజుహిరో టటేడా తెలిపిన వివరాల ప్రకారం కేపీ.3 వేరియంట్ జపాన్‌లో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం.ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో కోవిడ్ -19 బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అయితే ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైనవి కావని టాటెడా చెప్పారు. కేపీ వేరియంట్ త్రీ సాధారణ లక్షణాలు అధిక జ్వరం, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, అలసట. జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ అంతటా జూలై 1 నుండి 7 వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది. -
ఇలా బైడెన్‌కి మూడోసారి..! వృద్ధాప్యం కోవిడ్ సమస్యలను పెంచుతుందా?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్ - 19 పాజిటివ్‌గా తేలిందని, ఆయన స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్నారని వైట్ హౌస్ ప్రకటించింది.ఆయన గతంలో వ్యాక్సీన్ వేయించుకున్నారని, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని అధ్యక్షుడి ప్రెస్ కార్యదర్శి కరీన్ జీన్ పియరీ చెప్పారు. బైడెన్‌కు గతంలోనూ రెండుసార్లు కోవిడ్ సోకింది. సరిగ్గా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్ కరోనా బారినపడటం పార్టీ నేతలను కలవరపాటుకి గురి చేసింది. ఆయన టీకాలు వేయించుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కోసం తన డెలావేర్ బీచ్ హౌస్‌లో ఉన్నారని, అక్కడ నుంచి విధులు కొనసాగిస్తారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్‌కి కరోనా రావడం ఇది మూడోసారి. అమెరికా అధ్యక్షుడు కేసును బట్టి వృద్ధులు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండేల్సిందేనని తెలుస్తోంది. అదీగాక యూఎస్‌లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా 65 అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులలో కరోనే కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వృద్ధులు కరోనా బారిన పడుకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందువల్ల వారికే ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ తదితరాల గురించి తెలుసుకుందాం. వృద్ధులకే ఎందుకు..వృద్ధలు, చిన్నపిల్లల్లో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. వృద్ధాప్య కారణంగా ఉండే వయసురీత్య సమస్యలు కూడా కోవిడ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఊబకాయం, ఉన్నవారు ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఉంది. వృద్ధులలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాల్సిందే.జ్వరం లేదా చలిదగ్గుశ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిఅలసటకండరాలు లేదా శరీర నొప్పులుతలనొప్పిరుచి లేదా వాసన యొక్క కొత్త నష్టంగొంతు మంట ముక్కు కారటంవికారం లేదా వాంతులుఅతిసారంమరింత తీవ్రంగా ఉంటే..కోవిడ్-19 ఉన్న పెద్దలు కూడా డెలిరియం, వివరించలేని హైపోక్సియా వంటి విలక్షణమైన లక్షణాలు కనిపించొచ్చు. ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలు, వేగవంతమైన శ్వాస, మైకం, పెరిగిన హృదయ స్పందన రేటు, రక్తపోటు పడిపోవడం తదితరాలు.బూస్టర్లు ఎందుకు..బూస్టర్ మోతాదులను సాధారణంగా వారి రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరచడానికి వృద్ధులకు సిఫార్సు చేస్తారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ కూడా సాధారణంగా 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు ఉంటే..వారి సంరక్షణార్థం ఈ బూస్టర్ షాట్లను సిఫార్సు చేస్తోంది.రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా వృద్ధులను రక్షించడంలో బూస్టర్ లేదా ముందుజాగ్రత్త మోతాదు సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది లక్షణాలు స్వల్పంగా ఉండేలా చేసి ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. (చదవండి: వామ్మో ఎంత పొడుగు జుట్టు!..గిన్నిస్ రికార్డులకెక్కింది!) -
కరోనా రికార్డులు దాటేస్తున్న వడదెబ్బ మృతులు?
దేశరాజధాని ఢిల్లీలో వడగాడ్పుల బీభత్సం కొనసాగుతోంది. ఎండలకు తాళలేక మృతి చెందుతున్నవారి సంఖ్య గతంలో ఎదురైన కరోనా మహమ్మారి మరణాలను మించిపోతున్నది. ఢిల్లీలోని పలు శ్మశానవాటికల వద్ద దహన సంస్కారాలకు ఎదురుచూస్తున్న మృతదేహాల క్యూ కనిపిస్తోంది.ఢిల్లీ కార్పొరేషన్‌కు చెందిన బోద్ ఘాట్‌లో కరోనా తర్వాత అత్యధిక దహన సంస్కారాలు జూన్ 19న ఒక్క రోజులో జరిగాయి. బుధవారం రాత్రి 12 గంటల వరకు నిగమ్ బోద్ ఘాట్ వద్ద 142 మృతదేహాలను దహనం చేశారు. కరోనా కాలంలో 2021 ఏప్రిల్‌న 253 మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు.నిగమ్ బోద్ ఘాట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడానికి వడదెబ్బ కారణం కావచ్చన్నారు. ఈ జూన్‌లో ఇప్పటివరకు 1,101 మృతదేహాలను దహనం చేశామన్నారు. నిగమ్ బోద్ ఘాట్ల వద్ద మృతదేహాల అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు చాలాసేపు వేచిచూడాల్సి వస్తోంది.దేశంలో కరోనా తాండవమాడుతున్న 2022 జూన్‌లో ఈ ఘాట్‌లో మొత్తం 1,570 మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. ఇప్పుడు ఈ రికార్డు బద్దలయ్యేలా వేసవి ఉష్ణోగ్రతలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నిగమ్ బోద్ ఘాట్‌లో వారం రోజులుగా జరిగిన దహన సంస్కారాల గణాంకాలు ఇలా ఉన్నాయి.జూన్ 14 - 43జూన్ 15- 53జూన్ 16 - 70జూన్ 17 - 54జూన్ 18 - 97జూన్ 19- 142 (అర్ధరాత్రి 12 గంటల వరకు)ఢిల్లీలో సంభవిస్తున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పేదల పాలిట శాపంగా మారాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో మృతదేహాలు కనిపిస్తున్నాయి. వడగాడ్పుల కారణంగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 48 గంటల్లో 50 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండ తీవ్రతకు తొమ్మది రోజుల్లో 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరంతా వడదెబ్బ కారణంగా మృతిచెందారా లేదా అనేది ఆరోగ్యశాఖ అధికారులు ఇంకా ధృవీకరించలేదు. -
EPF Update: ఇక ఆ సౌకర్యం లేదు.. ప్రకటించిన ఈపీఎఫ్‌వో
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇకపై కోవిడ్ -19 అడ్వాన్స్‌లను అందించబోమని ప్రకటించింది. కోవిడ్ -19 ఇకపై మహమ్మారి కానందున, తక్షణమే ఈ అడ్వాన్స్ నిలిపివేయాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించిందని ఈపీఎఫ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది. మినహాయింపు పొందిన ట్రస్టులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది.కరోనా మహమ్మారి సమయంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులు రెండుసార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ ఆప్షన్‌ను మొదటి వేవ్ సమయంలో ప్రవేశపెట్టగా, సెకండ్ వేవ్‌లో మరో అడ్వాన్స్‌తో పొడిగించారు. ఈ వెసులుబాటు కింద ఈపీఎఫ్ఓ చందాదారులు మూడు నెలల బేసిక్ వేతనం, కరువు భత్యాలు లేదా తమ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌లో 75 శాతం ఏది తక్కువైతే అది నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉండేది.కాగా పిల్లల చదువులు, పెళ్లిళ్ల, మెడికల్ ఎమర్జెన్సీ, రెసిడెన్సియల్ ప్రాపర్టీ కొనుగోలు వంటి వాటి కోసం ఉద్యోగుల ఈపీఎఫ్ నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. నగదు ఉపసంహరణ కోసం ఆన్లైన్లోనే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది. ఈ ఆన్లైన్ విత్‌డ్రాయల్ ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరం చేసింది.పీఎఫ్ విత్‌డ్రా ఎలా?» ముందుగా మీరు మీ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అర్హులా కాదా నిర్ధారించుకోండి.» ఈపీఎఫ్ పోర్టల్ లో మీ వ్యక్తిగత వివరాలు అప్టు డేట్‌గా ఉండేలా చూసుకోండి.» మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) ఇప్పటికే యాక్టివేట్ కాకపోతే యాక్టివేట్ చేయండి.» పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణ కోసం ఈపీఎఫ్ ఫారాన్ని పూర్తి చేయండి.» రిటైర్మెంట్ తర్వాత లేదా రెండు నెలల కంటే ఎక్కువ నిరుద్యోగం తర్వాత మాత్రమే పూర్తి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.ఆన్లైన్లో క్లెయిమ్ ఇలా..» మీ UAN క్రెడెన్షియల్స్ ఉపయోగించి మెంబర్ ఇంటర్ ఫేస్ ని యాక్సెస్ చేసుకోండి.» మీ యూఏఎన్ తో లింక్ చేసిన అన్ని సర్వీస్ అర్హతలు, కేవైసీ ఆవశ్యకతలను మీరు తీర్చారని నిర్ధారించుకోండి.» సంబంధిత క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి.» యూఐడీఏఐతో మీ రిజిస్టర్డ్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఉపయోగించి మీ వివరాలను ధ్రువీకరించండి.» ఆన్లైన్ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయండి. -
COVID-19: సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ వేవ్
సింగపూర్: సింగపూర్‌లో కోవిడ్–19 మరోసారి విజృంభిస్తోది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కేవలం వారం వ్యవ ధిలో 25,900 కేసులు నమోద య్యాయి. దీంతో, ప్రభుత్వం మాస్క్‌లు ధరించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆరోగ్యమంత్రి ఓంగ్ యె కుంగ్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ‘దేశంలో కోవిడ్ వేవ్ ప్రారంభ దశలో ఉంది. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో, జూన్ మధ్య నుంచి చివరి వరకు భారీగా కేసులు నమోదవుతాయి’ అని చెప్పారు. గత వారంలో మే 5 నుంచి 11వ తేదీ వరకు కేసులు 25,900పైగా నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 13,700 కేసులొచ్చాయి. ఆ వారంలో రోజుకు 181 నుంచి 250 మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఐసీయూ కేసులు సరాసరిన రోజుకు మూడు మాత్రమే ఉన్నాయని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధాశ్రమాల్లో ఉండేవారు అదనపు డోసు కోవిడ్ టీకా తీసుకోవాలని మంత్రి సూచించారు. -
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
-
కోవిడ్ సమయంలో ‘ఊపిరి’పోశారు
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ పడకలను భారీగా పెంచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2020 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో కేవలం 2,643 ఆక్సిజన్ పడకలు మాత్రమే ఉండగా అనంతరం నాలుగేళ్లలో అదనంగా 15,376 ఆక్సిజన్ పడకలను పెంచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల సంఖ్య 18,019కి చేరినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి చాలా వేగంగా ఆక్సిజన్ పడకలను పెంచడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించడానికి పలు చర్యలను చేపట్టింది. ఆక్సిజన్ పడకల సంఖ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నారు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. వికసిత్ భారత్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు అనుసరించిన ఉత్తమ ఆచరణలను నీతి ఆయోగ్ వెల్లడించింది. మార్చి 2020లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అంటువ్యాధుల చట్టాన్ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. రాజకీయ నిబద్ధత, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం, టెలిమెడిసిన్ వంటి డిజిటల్ సాంకేతిక సాధనాల వినియోగం, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ముందస్తు శిక్షణ, అవగాహన కోసం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రచారాలు, నిఘాపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మరణాల రేటు తక్కువగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. రాజకీయ నిబద్ధతతో పాటు అధికారులు, భాగస్వాముల మధ్య సమన్వయం, ముందస్తు స్క్రీనింగ్‌లు, నిఘా, ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేటింగ్, డిజిటల్ పద్ధతులు ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొంది. క్షేత్ర స్థాయి పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను అవసరమైన సాధనాలతో సన్నద్ధం చేయడం, కమ్యూనిటీలతో నిమగ్నమవ్వడం, ప్రజల మానసిక, సామాజిక అవసరాలను పరిష్కరించడం, అవసరమైన ఆరోగ్య సేవల పంపిణీకి హామీ ఇవ్వడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అదుపులో ఉంచిందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలో అత్యధికంగా కోవిడ్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించినట్లు తెలిపింది. -
కోవిడ్ టీకాను ఎలా చూడాలి?
‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు అరుదుగానైనా కలగడమే ఆ నిర్ణయానికి కారణం. ఇదే టీకాను ‘కోవిషీల్డ్’ పేరుతో ఇండియాలో కోట్లాది డోసులు వేయడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదు. మహమ్మారులు దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి పెద్ద దేశంలో ఆసుపత్రుల్లో పడకలు కూడా అందుబాటులో లేని కాలంలో, ఈ టీకా లక్షలాది మందిని చనిపోకుండా నిరోధించిందని మరిచిపోరాదు.ఆంగ్లో–స్వీడిష్ ఔషధ తయారీదారు అయిన ‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో ‘కోవిషీల్డ్’ పేరుతో వచ్చిన ఈ టీకాను ఆస్ట్రా–జెనెకా సహకారంతో పుణెకు చెందిన ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. టీకాల ఉపసంహరణకు ‘భిన్న రకాల వేరియంట్లకు బహుళ టీకాల లభ్యత వల్ల కాలం చెల్లిన టీకాలు మిగిలిపోవడం’ కారణమని ఆస్ట్రా–జెనెకా సంస్థ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, తీవ్రమైన దుష్ప్రభావాల కేసులకు సంబంధించిన కోర్టు విచారణలు,కంపెనీ ఎదుర్కొంటున్న 100–మిలియన్ పౌండ్ల(సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) మేరకు క్లాస్ యాక్షన్ వ్యాజ్యం(ఎక్కువమందికి సంబంధించిన కేసు) నేపథ్యంలో ఇది కేవలం వ్యాపార నిర్ణయం. కోవిడ్–19 టీకా ‘చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్‌కు కారణం కావచ్చు’ అని కంపెనీ, ఫిబ్రవరిలో అంగీకరించినట్లు నివేదించబడింది.‘టీటీఎస్’ అంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో థ్రాంబోసిస్. ఇది శరీరంలో ప్లేట్లెట్లు పడిపోవడానికీ, రక్తం గడ్డకట్టడానికీ కారణమవుతుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పులు, సులభంగా గాయపడటం వంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి. బ్రిటన్ లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాల గాయాలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా, కొన్ని కుటుంబాలు ఆస్ట్రా–జెనెకాపై, సీరమ్ సంస్థపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రజారోగ్యం నిర్దేశిస్తుంది, భారతదేశంలో దీనికి ఏదైనా భిన్నంగా చేయగలిగి ఉండేవాళ్లమా అనేదాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మాజీ ప్రజారోగ్య పాలనాధికారిగా నా అభిప్రాయాలను ఇచ్చే ముందు, ఇద్దరు అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. నేను మొదటగా భారతదేశ ప్రముఖ మైక్రోబయాలజిస్టు, వైరాలజిస్టులలో ఒకరైన డాక్టర్ గగన్ దీప్ కాంగ్‌తో మాట్లాడాను. ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్లేషనల్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆమె అభిప్రాయం మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 మార్చిలో అస్ట్రా–జెనెకా టీకా టీటీఎస్ దుష్ప్రభావం కలిగించే ప్రమాదం గురించి ప్రకటించింది. 2021 మే నాటికి దానిని ధ్రువీకరించింది. 2021 అక్టోబర్‌లో ‘కోవిషీల్డ్’కు సంబంధించిన ప్రమాద కారకాన్ని చేర్చడానికిగానూ సీరమ్ సంస్థ తన టీకా లేబుల్‌ను నవీకరించింది. టీటీఎస్ వల్ల, కొందరు రోగులు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో చివరికి మరణాలు సంభవించాయని మనకు పొడికథలుగా మాత్రమే తెలుసు. అలాంటప్పుడు టీకాను కొనసాగించడం లేదా కొనసాగించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి? మనకు ప్రత్యామ్నాయం ఉందా?గగన్‌దీప్ కాంగ్ మనకు తెలియని వాటి గురించి వివరించారు. ‘‘ప్రమాదం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇది భౌగోళికతపై కూడా ఆధారపడి ఉండొచ్చు. భౌగోళికత సమస్యను రోటావైరస్ టీకాల కోసం మనం చేసినట్లుగా ఫార్మావిజిలె¯Œ ్స ద్వారా మాత్రమే లెక్కించవచ్చు. నిష్క్రియాత్మకంగా అంటే ప్రజలు సమస్యను నివేదించే వరకు వేచి ఉండటం మరొక మార్గం. ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే, టీకా వేసిన మొదటి కొన్ని గంటలలో లేదా రోజులలో దుష్ప్రభావం చూపకుంటే అది టీకాతో సంబంధం ఉన్నదిగా గుర్తించబడకపోవచ్చు.ప్రమాదం–ప్రయోజనం నిష్పత్తి, ముఖ్యంగా డెల్టా వేవ్ విషయంలో చూస్తే, ప్రయోజనమే ఎక్కువగా ఉండింది; ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా, యువకులకు కొంత తక్కువగా. పాశ్చాత్య దేశాలను అనుసరించి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిషీల్డ్‌ను వేయడం నిలిపివేసి ఉంటే, మన ప్రత్యామ్నాయం ‘కోవాక్సిన్ ’ అయివుండేది. ఇది తక్కువ సరఫరాలో ఉంది. ఫలితంగా యువకులకు రోగనిరోధక శక్తి విస్తరించేది. భారతదేశానికి నిర్దిష్టంగా టీటీఎస్ డేటా లేనందున, పర్యవేక్షించడం కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కృష్ణన్ దీనిని విభిన్నంగా చెప్పారు: ‘‘అరుదైన దుష్ప్రభావం ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోవడానికి భారీస్థాయి ప్రజారోగ్య ప్రయోజనం కారణమైంది. దుష్ప్రభావాలపై దృష్టి కేంద్రీకరించడం వలన టీకా వేసుకోవాలా వద్దా అనే సంకోచం ఏర్పడుతుంది. అంటే మనం ఆ దుష్ప్రభావాలను దాచిపెట్టాలని కాదు... వెనక్కి చూసుకుంటే, మెరుగైన, మరింత సూక్ష్మమైన, సమతుల్యమైన సమాచారం సహాయపడి ఉండేదని చెప్పడం మెరుగు. అరుదైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారికి పరిహారం కోసం కూడా మనం ప్లాన్ చేసి ఉండవచ్చు.’’దుష్ప్రభావాల క్లెయిమ్‌లను పరిశీలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పీడకలగా మారేదని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. టీకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడానికి అవి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. మహమ్మారి దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అత్యంత హాని కలిగే వారికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేసేలా చూసుకోవాలి. భారతదేశంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది ప్రజలు చనిపోకుండా టీకాలు నిరోధించాయి.ఇక టీకాను అభివృద్ధి చేయడానికి తీసుకునే సాధారణ సమయం పదేళ్లు. దీనికి భిన్నంగా అస్ట్రా–జెనెకా టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దానిని తప్పక గుర్తించి, గౌరవించాలి. ఇది కచ్చితంగా లక్షలాది మందిని తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా లేదా చనిపోకుండా నిరోధించింది. తీవ్రమైన దుష్ప్రభావాల గురించి బాగా అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నవారు పట్టించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అంతేనా? ఏదైనా నిపుణుల సంఘం ఇచ్చిన ప్రతికూల సలహా దేన్నయినా అణచిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన ముఖ్యమైన, చర్య తీసుకోదగిన సమాచారం ఏదైనా ఉండిందా? అలా కాదంటే మాత్రం వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడానికి ప్రయోజనపు సమతూకం స్పష్టంగా అనుకూలంగా ఉంది.భారతదేశంలోని భారీ జనాభాకు టీకాలు వేయకుండా ఆటంకం కలిగించే శక్తిమంతమైన టీకా వ్యతిరేక ఉద్యమాన్ని మనం అదృష్టవశాత్తూ చూడలేదు. రద్దీగా ఉండే నగరాలు, ఆరు లక్షలకు పైగా గ్రామాలలో ప్రజలు చెదిరిపోయి ఉన్నందున ప్రజారోగ్య స్పందన అనేది సహజంగానే పెద్ద ఎత్తున వ్యాధిగ్రస్తులను మరియు మరణాలను నిరోధించడానికి ఉద్దేశించారు. అందులో చర్చకు తావులేదు. కుటుంబాలు, సంఘాల ఎంపికకు టీకాను వదిలేసివుంటే, లక్షలాదిమందిని ప్రమాదంలో పడేసేది. వయసు లేదా భౌగోళికతపై లేని డేటాను వెతుకుతూ పోతే, టీకా కార్యక్రమం పట్టాలు తప్పివుండేది. ఒక్కో జిల్లాలో దాదాపు 20 లక్షల జనాభా కలిగిన భారతదేశంలోని దాదాపు 800కు పైగా జిల్లాల్లోని జిల్లా ఆరోగ్య కార్యకర్తలు అప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నారు.కొన్ని సమయాల్లో, మంచి (ఈ సందర్భంలో, దుష్ప్రభావాలను పర్యవేక్షించడం) అనేది కూడా గొప్ప శత్రువుగా (లక్షలాదిమందికి టీకాలు అందని అపాయం ఉండటం) మారవచ్చు. భారతదేశానికి సంబంధించి, ఈ క్షణపు వాస్తవం ఇది!- వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి; మాజీ ప్రధాన కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- శైలజా చంద్ర -
కోవాగ్జిన్‌తోనూ సైడ్ ఎఫెక్ట్స్..
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఆందోళనలు తగ్గేలోపే భారతీయ కంపెనీ తయారు చేసిన మరో కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’తోనూ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు ఓ తాజా అధ్యయనం వెలువడింది.భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొంతమందిని బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధక బృందం ఏడాదిపాటు పరిశీలించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది ప్రతికూల సంఘటనలను నివేదించారు. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 1,024 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 304 (47.9 శాతం) మంది టీనేజర్లు, 124 మంది (42.6 శాతం) పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొన్నట్లు నివేదించారు. 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు, 10.2 శాతం మందిలో సాధారణ రుగ్మతలు, 4.7 శాతం మందిలో నాడీ సంబంధిత సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి సమస్యలు గుర్తించారు.సైడ్ ఎఫెక్ట్స్ వార్తల నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వాణిజ్య కారణాలతో మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న కొన్ని రోజులకే ఈ అధ్యయనం వెలువడటంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. -
అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తాము సరఫ రా చేసిన కోవిడ్ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యూకేకు చెందిన ఫార్మా కంపెనీ అ్రస్టాజెనెకా వెల్లడించింది. కోవిడ్ అప్డేటెడ్ వ్యాక్సిన్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని, అందుకే వాణిజ్య కారణాలతో తమ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేసింది. అ్రస్టాజెనెకా కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చే సింది. అస్ట్రాజెనెకా టీకాతో దు్రష్పభావాలు తలెత్తుతున్నట్లు కోర్టుల్లో కేసులు నమోదవడంతో న్యాయ విచారణ జరుగుతోంది. -
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా సంస్థ తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్ నుంచి తొలగిస్తున్న సంస్థ ప్రకటించింది. కొన్ని వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్) కారణంగా చాలా అరుదుగా థ్రోంబోసిస్ అనే అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈమేరకు సంస్థ వీటిని ధ్రువపరుస్తూ యూకే కోర్డులో పత్రాలను అందజేసింది. అనంతరం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.కొత్త కొవిడ్ వేరియంట్లతో పోరాడే వ్యాక్సిన్‌ను ఇకపై సంస్థ తయారు చేయదని, దానికి సంబంధించిన డ్రగ్‌ను సరఫరా చేయదని సంస్థ స్పష్టం చేసింది. ఐరోపాలో సరఫరా చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ వాక్స్జెవ్రియా మార్కెటింగ్‌ను తొలగిస్తున్నట్లు చెప్పింది. అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని పేర్కొంది. ఇకపై ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి జరగదని వివరించింది.వ్యాక్సిన్‌ను రూపొందించడానికి గతంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యూకే ఆధారిత ఫార్మా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ అందించేందుకు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఒకపై ఆ ఒప్పందాలు రద్దైనట్లు తెలిసింది.ఇదీ చదవండి: సిబ్బంది అనారోగ్యంతో 70కి పైగా విమానాలు రద్దుఅసలేం జరిగిందంటే..యూకేకు చెందిన జామీ స్కాట్ అనే వ్యక్తి 2021లో కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. అప్పటినుంచి నిత్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వైద్య పరీక్షలు చేసిన అనంతరం తన శరీరంలో రక్తం గడ్డకడుతుందని వైద్యులు గుర్తించారు. అయితే టీకా వేయించినప్పటి నుంచి ఈ సమస్య ఉండడంతో తన అనారోగ్యానికి అదే కారణమని అనుమానం వ్యక్తంచేశారు. మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత తన పరిస్థితికి టీకానే కారణమని నిర్థారణ అయింది. తాను థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ బారిన పడినట్లు తేలింది. దాంతో యూకే కోర్టులో దావా వేశారు. తాజాగా కంపెనీ వివరణ ఇస్తూ చాలా అరుదుగా ఇలాంటి వాటికి అవకాశం ఉందని అంగీకరించింది. -
నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?
బాలీవుడ్, మళయాళీ నటుడు, నిర్మాత, దర్శక్షుడు అయిన శ్రేయాస్ తల్పాడే గతేడాది గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నాటి దురదృష్టకర ఘటనను గుర్తు తెచ్చుకుంటూ తాను ధూమపానం సేవించనే, మందు తాగాను అయినా తాను ఈ గుండెపోటు బారిని పడ్డానని బాధగా అన్నారు. తనకు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందన్న విషయం తెలుసనిన్నారు. అందుకోసం మందులు వాడుతున్నట్లు చెప్పారు. ఇక తనకు మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలి వ్యాధులు లేవనిన్నారు. అలాంటప్పుడు తాను ఈ గుండె జబ్బు బారిన ఎలా పడ్డానని ఆవేదనగా అన్నారు. బహుశా ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అయ్యి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఆ మహమ్మారి సమయంలో బయటపడేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్‌లు చేపట్టింది. మనం కూడా సేఫ్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో వారి చెప్పిన డోస్‌లు తీసుకున్నాం. అయితే నిజానికి మనకు శరీరంలో ఏం తీసుకుంటున్నామనేది తెలియదు. ఎలాంటి కంపెనీలను విశ్వసించాలో కూడా తెలియని స్థితి అది. ప్రస్తుతం కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల ముగ్గురు చనిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే శ్రేయాస్ ఇలా తన అనుమానాన్ని బాధగా వెలిబుచ్చారు. ఇక బాధితులు పోస్ట్‌మార్టంలో కూడా వ్యాక్సిన్ రియాక్షన్ కారణంగానే మరణించినట్లు వెల్లడవ్వడంతో ఒక్కసారిగా అందరిలో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. కాగా, నటుడు గతేడాది డిసెంబర్లో శ్రేయాస్ తల్పాడే తనకు గుండెపోటు వచ్చిన విధానాన్ని గూర్తి వివరిస్తూ.."అహ్మద్ ఖాన్ వెల్కమ్ టు ది జంగిల్ కోసం ముంబైలో జోగేశ్వరికి దగ్గరగా ఉన్న ఎస్ఆర్పీఎఫ్ గ్రౌండ్స్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఆర్మీ శిక్షణా సన్నివేశాలు చిత్రికరిస్తుండగా..సడెన్‌గా ఒక షాట్లో ఊపిరి పీల్చుకోలేకపోడం, ఎడమ ఛాతీలో తీవ్ర నొప్పి రాడం జరిగింది. దీంతో కనీసం ఆ షూట్ తర్వాత నేను నా వానిటీ వ్యాన్‌కి వెళ్లి బట్టలు కూడా మార్చుకోలేకపోయాను. ఈ విధమైన అలసటను తానెప్పుడూ ఫేస్ చేయలేదని చెప్పుకొచ్చాడు శ్రేయాస్ తల్పాడే. అంతేగాదు తాను కోలుకుని బయటపడాతనని కూడా అనుకోలేదని చెప్పారు. ఇది తనకు భగవంతుడు ఇచ్చిన రెండో అవకామని అన్నారు. నిజంగా కోవిషీల్డ్ ప్రమాదకరమైనదా..?భారతదేశంలో కోవిషీల్డ్ 175 కోట్ల డోస్‌లు ఇచ్చారు. భారతదేశంలో ప్రజలకు అత్యంత విస్తృతంగా అందించిన టీకా. అయితే ఇటీవల ఈ ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ఫ్రభావాలు గురించి ప్రజల్లో తీవ్ర ఆందోళలను మొదలయ్యాయి. కానీ ఆస్ట్రాజెనెకా చట్టపరమైన సమర్పణలో టీకా గురించి సవివరంగా వెల్లడించింది. అందులో ఈ టీకా కారణంగా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్)తో థ్రాంబోసిస్కు దారితీస్తుందని అంగీకరించింది. ఈ పరిస్థితి కారణంగా రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌కి పడిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ దుష్ప్రభావాలు గురించి క్లియర్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మనదేశంలో ఈ టీకా వేసిన తర్వాత పరిమిత సంఖ్యలో ఈ టీటీఎస్ కేసులు నమోదయ్యాయి. టీకా-ప్రేరిత రోగనిరోధక థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనియా (VITT)తో సహా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్ అనేది చాలా అరుదైన దుష్ప్రభావం. ఎక్కువగా ప్రాథమిక టీకా తర్వాత కనిపిస్తుంది. అలాగే ఈ వ్యాక్సిన్‌ని తీసుకున్న ప్రతిఒక్కరు దీని బారిన పడరని ఆస్ట్రాజెనెకా కంపెనీ చట్టపరమైన పత్రాల్లో స్పష్టం చేసింది. చాలావరకు టీకా తీసుకున్న మొదటి 21 రోజుల్లోనే ఈ దుష్ప్రభావం సంభవిస్తుంది. అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ టీకా తీసుకున్నవాళ్లు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే టీకా వేసిన కొన్ని వారాల్లోనే ఇలాంటీ టీటీఎస్ సమస్యలు వస్తాయని తేల్చి చెప్పారు.(చదవండి: ఆజానబాహుడిలా ఉండే జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే! అందుకే..!) -
ఆస్ట్రాజెనెకాకు మరో షాక్, ఈ వాక్సీన్‌తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు
కోవిడ్ వ్యాక్సీన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై పిటీషన్ దాఖలు చేశారు.ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని ఆస్ట్రాజెన్‌కా కూడా అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్ తమ 20 ఏళ్ల కుమార్తె కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ ఎక్స్‌లో ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.అలాగే ఇంత నష్టం జరిగిన తరువాత ఆస్ట్రాజెన్‌కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్ మండి పడ్డారు. రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు వ్యాక్సీన్ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై సీరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.Thanks to @Teensthack for this article. 🙏I missed to tell Teena that today (May 1st) is Karunya's birthday and she was the first wedding anniversary gift to me and my wife from the heavens. 😭Perhaps due to editorial/space constraints few core points I gave missed to make… pic.twitter.com/bjJjHOc1aM— Venugopalan Govindan (@gvenugopalan) May 1, 2024 2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.కాగా వ్యాక్సిన్ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే. -
జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. ఉక్కిరి బిక్కిరవుతున్న ఉద్యోగులు
ప్రపంచ జాబ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులు పుట్టుకు రావడం సర్వసాధారణంగా మారింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత మూన్‌లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ పేరుతో జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండే నడిచింది. అవేవి చాలవన్నట్లు తాజాగా ‘డ్రై ప్రమోషన్’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. కోవిడ్-19 తర్వాత జాబ్ మార్కెట్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీల వరకు ప్రాజెక్ట్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఖర్చు విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. లేఆఫ్స్, రిమోట్ వర్క్, కృత్తిమ మేధ వినియోగం పేరుతో పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. డ్రై ప్రమోషన్ పేరుతో ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో డ్రై ప్రమోషన్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాయి. అందుకు తగ్గట్లుగా జీతాల్ని పెంచవు. బరువు, బాధ్యతల్ని పెంచుతాయి. ఇప్పుడు దీన్ని డ్రై ప్రమోషన్ అని పిలుస్తున్నారు. 900 కంపెనీల్లో జరిపిన సర్వేలో ప్రముఖ కాంపన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ డ్రై ప్రమోషన్‌పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 2018లో ఈ సంఖ్య 8శాతం మాత్రమే అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మరో కన్సల్టెన్సీ సంస్థ మెర్సెర్ అనే సంస్థ 900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. లేఆఫ్స్ ఆపై ప్రమోషన్లు అంతకుముందు, ఉద్యోగుల కొరతను ఎదుర్కొన్న కంపెనీలు వారిని నిలుపుకునేందుకు భారీగా వేతనాలు పెంచింది. అదే సమయంలో ఉద్యోగాల్ని తొలగించింది. వారి స్థానంలో కొత్త ఉద్యోగుల్ని తీసుకోకుండా.. ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రమోషన్ పేరుతో కొత్త ట్రెండ్‌కు తెరతీశాయి ఆయా సంస్థలు కంపెనీలకు వరమేనా? ఈ విధానంపై ఉద్యోగులు డైలామాలో ఉన్నారు. ఓ వర్గం ఉద్యోగులు ప్రమోషన్ తీసుకుని మరో సంస్థలో చేరితే అధిక వేతనం, ప్రమోషన్లో మరో అడుగు ముందుకు పడుతుందని భావిస్తుండగా.. రేయింబవుళ్లు ఆఫీస్‌కే పరిమితమై కష్టపడ్డ తమకు తగిన ప్రతిఫలం లేకపోవడం ఏంటని మరో వర్గం ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. మొత్తానికి డ్రై ప్రమోషన్ విధానం కంపెనీలకు ఓ వరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నవారు లేకపోలేదు. -
ప్రపంచానికి పొంచివున్న మరో మహమ్మారి ముప్పు: డిసీజ్ ‘ఎక్స్’
కోవిడ్-19 మహమ్మారితో అల్లాడిపోయిన ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్-19 కంటే 20 రెట్లు ప్రాణాంతకం కావచ్చట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనికి ఇచ్చిన పేరు డిసీజ్ ‘ఎక్స్’ (Disease X). నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాధి X ఎప్పుడైనా ,ఎక్కడైనా పెరుగుతుంది. లేదా ఇప్పటికే ప్రస్తుతం ఎక్కడో పెరుగుతూ ఉండవచ్చు లేదా ఇప్పటికే పెరిగి ఉండవచ్చు. దీని ఆవిర్భావాన్ని అంచనా వేయడం అంత తేలిక కాదని, మరో విధంగా చెప్పాలంటే డిసీజ్ X తో మానవజాతి అంతం కావచ్చేనే అంచనాలు కూడా ఉన్నాయి. డిసీజ్ ఎక్స్ రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీలో సీనియర్ స్కాలర్ అమేష్ అడాల్జా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్‌ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇది కొత్తది కాదని 2018 నుండి ఎక్స్ వ్యాధి గురించి చర్చ ఉందని అమేష్ అడాల్జా తెలిపారు. వైరస్ ద్వారా రావచ్చు. లేదా ఒక జంతు జాతి నుండి మానవునికి వ్యాపించి కొత్త లక్షణాలను అభివృద్ధి చేసే మహమ్మారిగా మారవచ్చు అని అంచనావేశారు. 90 శాతం సాధారణ జలుబు లేదా న్యుమోనియాగా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. టీకాలు, యాంటీవైరల్‌లు, మోనోక్లోనల్ యాంటీ బాడీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఎంత వేగంగా అందుబాటులో ఉంటే మహమ్మారిని నిలువరించడం అంత సులభం అవుతుందన్నారు. ముఖ్యంగా డబ్ల్యూహెచ్‌వో, సీడీసీ, యూరోపియన్ సీడీడీ, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఏజెన్సీలు సంసిద్ధంగా ఉండాలన్నారు. అలాగే కరోనామహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్ హామ్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అనేక వైరస్లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, అయితే వాటినన్నింటిని ప్రమాద కరమైనవిగా పరిగణించలేమని, వాటిలో కొన్ని ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అమ్మకాల్లో ఆన్‌లైన్‌దే హవా..
కోల్‌కతా: కొద్దిరోజులపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నిలువరించిన కోవిడ్–19 శకం ముగిసినప్పటికీ ఆన్లైన్ సర్విసులకు డిమాండ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం నిలిచిపోవడంతో ఊపందుకున్న ఆన్లైన్ ట్రెండ్ తదుపరి దశలో మరింత ఊపందుకుంది. ప్రజలు తమ అవసరాల కోసం ఆఫ్‌లైన్ స్టోర్లకంటే ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. దీంతో ఆన్లైన్ అమ్మకాలు ఆఫ్‌లైన్ స్టోర్లను మించి నమోదవుతున్నట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థల తాజా నివేదిక పేర్కొంది. నీల్సన్ఐక్యూ, జీఎఫ్కే ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక వివరాలు చూద్దాం.. డోర్ డెలివరీ ఎఫెక్ట్ కరోనా తదుపరి లాక్డౌన్లు ఎత్తివేయడంతోపాటు.. అన్ని రకాల ఆంక్షలనూ ప్రభుత్వం తొలగించింది. అయినప్పటికీ వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల జనంలోకి చొచ్చుకుపోయిన సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో ఫిజికల్‌గా స్టోర్ల సందర్శనకంటే ఈకామర్స్వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కాలంలో జోరందుకున్న డోర్ డెలివరీ వ్యవస్థ రానురాను బహుముఖాలుగా విస్తరించింది. ఫలితంగా నిత్యావసరాలు మొదలు విచక్షణ ప్రకారం కొనుగోళ్లు చేపట్టే వస్తువుల విషయంలోనూ ఆన్‌లైన్‌కే ఓటు వేస్తున్నారు. భారీ వృద్ధి బాటలో లాక్డౌన్ రోజుల్లో కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ తదితర నిత్యావసరాల కోసం కాంటాక్ట్‌లెస్ డోర్ డెలివరీలకు అలవాటుపడిన ప్రజలు తదుపరి కాలంలో టీవీ సెట్ల దగ్గర్నుంచి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వినిమయ వస్తువులను సైతం ఈ కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ లాక్డౌన్ రోజులకుమించి కనిపిస్తోంది. ప్రధానంగా మెట్రో నగర ప్రాంతాలలో ఈకామర్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా ఎగశాయి. ఇంటినుంచే కొనుగోలు చేయగలగడం, డోర్‌డెలివరీ సౌకర్యం, విభిన్న ప్రొడక్టుల అందుబాటు తదితర సానుకూలతలు కీలకపాత్రను పోషిస్తున్నాయి. ఫ్రాస్ట్ఫ్రీ ఫ్రిజ్‌లు, 55 అంగుళాలకుమించిన టీవీలు వంటి ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు 2023లో రెట్టింపయ్యాయి. కాగా, గతేడాదిలో ఎఫ్ఎంసీజీ విభాగ అమ్మకాలు అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే ఊపందుకున్నాయి. -
‘నేను సైన్స్ టాపర్‌ని.. కోవిడ్ వైరస్‌కే వణుకు పుట్టించాను’
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ నేతగా మారిన బిహార్‌కు చెందిన పప్పు యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన కోవిడ్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘న్యూస్ 24’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పప్పు యాదవ్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మహమ్మారికి అందరూ భయపడుతుంటే తాను మాత్రం ఆ వైరస్‌నే భయపెట్టానని పేర్కొన్నారు. ‘కోవిడ్ సమయంలో మాస్క్, చేతికి గ్లోవ్స్ ధరించని ఏకైక వ్యక్తని నేనే. నేను సైన్స్ టాపర్‌ని’ అన్నారాయన. బిహార్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పప్పు యాదవ్ ప్రపంచ రాజకీయాలు, తత్వాలు, ఆర్థిక వ్యవస్థతో సహా తనకు అన్ని విషయాలు తెలుసునని పేర్కొన్నారు. పప్పు యాదవ్ 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా 2015లో జన్ అధికార్ పార్టీని స్థాపించారు. పప్పు యాదవ్‌ను బిహార్ బాహుబలిగా వ్యవహరిస్తారు. ఆయన ఇటీవలే తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి అధికారికంగా ఆ పార్టీలో చేరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. -
గుండెపోటు సడెన్‌గా వస్తుందా? కసరత్తు, కోవిడ్‌తో లింకేంటి?
వయసుతో సంబంధం లేకుండా యువత హాట్ ఎటాక్‌తో కుప్పకూలి పోతున్న ఘటనలు రోజు దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూల వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఓ పెళ్లి బారాత్ లో డాన్స్ చేస్తూ గుండెపోటుతో రావుల విజయ్ కుమార్( 33) అనే యువకుడు మృతి చెందడం ఆందోళన రేపింది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలు యవకులు, నిరంతరం వ్యాయామం చేస్తున్నవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. న్యూఇయర్ పార్టీల్లోనూ, పెళ్లి బారాత్‌లో డాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ, చివరకు , మెట్లు ఎక్కుతూ, రోడ్డుపై నడుస్తూ, కూర్చున్నవారు కూచున్నట్టుగానే కుప్పకూలిన సంఘటలను అనేకం. ప్రధానంగా వైసీపీ నేత, ఫిట్నెస్ ఫ్రీక్ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం విషాదాన్ని నింపింది. ఇంకా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా, ఇంకా పలువురు పోలీసు ఉన్నతాధికారులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.అతేకాదు ఈ కోవలో ఫిట్నెస్ ట్రైనర్లు కూడా చాలామందే ఉన్నారు. జిమ్‌కు, గుండెపోటుకు సంబంధం ఏమిటి? నియంత్రణ లేకుండా ఎక్కువగా వ్యాయామం చేయడం. అతిగా వ్యాయాయం చేయడం అనేది ఎవరికైనా ముప్పే అంటున్నారు డాక్టర్లు. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకి ఒక అరగంట లేదంటే నలభై నిమిషాల వ్యాయామం సరిపోతుందట. బాడీ ఫిట్‌గా ఉండాలనో, కండలు పెంచాలనో గంటల తరబడి జిమ్‌కే పరిమితం కాకూడదు. అంతేకాదు తొందరపాటుతో ఒక్కసారిగా జిమ్‌కు వెళ్లి పెద్దపెద్ద బరువులు ఎత్తాలని ప్రయత్నించ కూడదు. అస్సలు నిపుణుల సలహా, ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోనిదే జిమ్‌లోకి ఎంటర్ కాకూడదు. వ్యాయామం చేస్తున్నపుడు విపరీతంగా చెమటలు పడితే తక్షణమే ఆపివేయాలి. మరోవైపు శరీరంలో సోడియం స్థాయిలు పడిపోకుండా జాగ్రత్త వహించాలి. సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింక్‌ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. హానికరమైన కృత్రిమ రసాయనాలు, స్టెరాయిడ్స్ వాడకంపై పూర్తి అవగాహన ముఖ్యం. ఎలాంటి దురలవాట్లు లేకుండా సంతులిత ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలి మార్పులు ధూమపానం, మద్యం సేవించడం, జంక్ఫుడ్స్, మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లాంటివి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. కరోనాతో సంబంధం ఏంటి? భారతదేశంలో కోవిడ్ మహమ్మారి అనంతరం గుండెపోటు కేసులు, మరణాలు బాగా పెరిగియాని ఇటీవలి అధ్యయనాలు, నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా గుండెపోటు కబళిస్తోంది. కోవిడ్-19 దీర్ఘకాలిక లక్షణాల ప్రభావంతోనే ఈ పరిస్థితి అని చెబుతున్నారు. ఫలితంగా గుండె నాళాల్లో తీవ్ర మంట, గుండెపోటుకు దారితీయవచ్చు. అధిక సోడియం ఉన్న ఆహారం, కనీస వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అతిగా మద్యపానం, కదలికలు లేని జీవనశైలి, అధిక హిమోగ్లోబిన్ స్థాయిలు వంటి కారకాలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. -
ఆయుర్దాయానికి కోవిడ్ కోత
కరోనా కోరల్లో చిక్కి యావత్ ప్రపంచం విలవిల్లాడిన ఘటన ఇప్పటికీ చాలా మందికి పీడకలే. అధునాతన కోవిడ్వ్యాక్సిన్లతో ఎలాగోలా కోవిడ్‌పై యుద్ధంలో గెలిచామని సంతోషపడేలోపే కరోనా మహమ్మారి మనుషుల ఆయుర్దాయాన్ని తగ్గించేసిందన్న చేదు నిజం తాజాగా బయటపడింది. 2019–2021 కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఆయుష్షు దాదాపు రెండు సంవత్సరాలు తగ్గిపోయిందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కష్టాల నుంచి తెరిపినపడి ఎలాగోలా మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాం కదా అని సంబరపడుతున్న ప్రజానీకానికి ఇది పిడుగుపాటులాంటి వార్తే. లాన్సెట్ అధ్యయనంలోని ముఖ్యాంశాలు ► 2019 డిసెంబర్లో తొలిసారిగా కోవిడ్ వ్యాధికారక కరోనా వైరస్ విస్తృతి బయటపడ్డాక తొలి రెండేళ్లు అంటే 2020, 2021 సంవత్సరాల్లో జనాభా ఆయుర్దాయం ఎలా ఉంది అనే అంశాలపై తాజా అధ్యయనం సమగ్ర వివరాలను వెల్లడించింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే 84 శాతం దేశాల్లో ఆయుర్దాయం తగ్గింది. ఈ కాలంలో ప్రజల ఆయుర్దాయం 1.6 సంవత్సరాలు తగ్గిపోయింది. ► మెక్సికో సిటీ, పెరూ, బొలీవియా వంటి చోట్ల ఆయుఃక్షీణత మరింత ఎక్కువగా నమోదైంది. కరోనా తొలినాళ్లలో టీనేజర్లు మినహాయించి మిగతా అన్ని వయసుల వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడ్డారని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టింది. ► ప్రపంచవ్యాప్తంగా టీనేజీ, యుక్త వయసు వాళ్లలో కోవిడ్ మరణాల రేటు ఎక్కువగానే ఉందని పేర్కొంది. ► ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గడం విశేషం. 2019తో పోలిస్తే 2021లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 7 శాతం తగ్గాయి. అంటే మరణాలు 5,00,000 తగ్గాయని అధ్యయనం వెల్లడించింది. ► దక్షిణాసియా, ఆఫ్రికా చిన్నారుల పేరిట కోవిడ్ శాపమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు దక్షిణాసియాలోనే చనియారు. ప్రతి నలుగురిలో ఒకరు సహారా ఆఫ్రికా ప్రాంతంలో ప్రాణాలు వదిలారు. ► అధ్యయనంలో భాగంగా మొత్తం జనాభాలో 15 ఏళ్లుపైబడిన వారు ఎంత మంది? వారిపై కోవిడ్ ప్రభావం, ఆయుర్దాయం వంటి అంశాలను విశ్లేషించారు. వీరిలో 2019–2021 కాలంలో పురుషుల్లో 22 శాతం, మహిళల్లో 17 శాతం మరణాల రేటు పెరగడం ఆందోళనకం ► 2020, 2021 సంవత్సరాల్లో మొత్తంగా 13.1 కోట్ల మంది మరణించారు. అందులో కోవిడ్ సంబంధ మరణాలు ఏకంగా 1.6 కోట్ల పైమాటే. ► గతంలో ఎన్నడూ లేని విధంగా జోర్డాన్, నికరాగ్వా వంటి దేశాల్లో కోవిడ్ మరణాలు భారీగా నమోదయ్యాయి. ► దక్షిణాఫ్రికాలోని క్వాజూలూ–నాటల్, లింపోపో వంటి చోట్ల ఆయుర్దాయం దారుణంగా తగ్గిపోయింది ► కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న/ కోవిడ్ బారిన పడి కూడా బార్బడోస్, న్యూజిలాండ్, ఆంటిగ్వా, బార్బుడా వంటి దేశాల్లో తక్కువ మరణాలు నమోదవడం విశేషం. ► కోవిడ్ వల్ల ఆయుర్దాయం కొంత తగ్గినప్పటికీ దశాబ్దాలుగా అందుబాటులోకి వస్తున్న నూతన వైద్య విధానాల కారణంగా 1950 నుంచి చూస్తే ఆయుర్దాయం మెరుగ్గానే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పూనమ్ కౌర్ ట్వీట్.. సీఎం జగన్ సాయం మరోసారి తెరపైకి
నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో ఆమె స్పందిస్తూ ఉంటారు. కరోనా సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై కొద్దిరోజుల క్రితం ఆమె ప్రసంశించారు. 'కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతగానో అండగా నిలిచిందని ఆమె కొనియాడారు. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా తాను ఈ మాటలు చెబుతున్నానని ఆమె తన ఎక్స్ పేజీలో పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఏపీ ప్రభుత్వం ఆదుకున్న తీరుపై నెటిజన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలయిపోయి, బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదిలోనే కోవిడ్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఏడాదిలోనూ పూర్తిగా కోవిడ్ ఆంక్షల మధ్యనే ఆయన పాలన సాగింది. అలా రెండేళ్ల పాటు కరోనాపై ఏపీ ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాల ఆర్థిక స్థితిగతులు తలక్రిందులయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాత్రం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎనలేని మేలు చేశాయి. ఆ పరిస్థితుల్లో ఎందరో ఉపాధి కోల్పోయి లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. పనిచేస్తున్న చోట కరోనా పేరుతో జీతాలలో కోతలు పడటమే కాకుండా ఉన్న ఉద్యోగాలను కూడా కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో అనేక మందికి సీఎం జగన్ ఇస్తున్న ఈ పథకాలు ఎంతో లబ్ధిని చేకూర్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రైతులు, అమ్మ ఒడి లబ్ధిదారులు, చేతి వృత్తుల వాళ్లు, కుల వృత్తుల వాళ్లు, ఆటోలు నడుపుకునే వాళ్లు, పూజారులు, పాస్టర్లు, ఇమామ్ లు.. ఇలా వాళ్లూ వీళ్లూ అనే తేడాలు లేవు. కులాల వారీగా కూడా సంక్షేమ పథకాలు వేరే! ప్రజల క్షేమం కోరుకున్న ఆయనపై ప్రతి పక్షాల నుంచి విమర్శలు వచ్చినా, పంచుడు కార్యక్రమాలు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నా.. సీఎం జగన్ తన దారిలో వెనక్కు తగ్గలేదు. అప్పు చేసైనా సరే ముందుగా ప్రజల ఆకలి తీర్చాలని జగన్ భావించారు. కరోనా సమయంలో కేవలం రేషన్ సరకులు పంపించి కేంద్రం చేతులు దులుపుకుంది. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతి సామాజిక వర్గానికి ఏదో ఒక రూపంలో నగదు బదిలీ చేస్తూ ఆర్థికంగా ఆదుకున్నారు. అలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి అండగా నిలిచింది. అప్పుడు ఆ వ్యవస్థ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాల్లో పరిపాలన, సంక్షేమ పథకాలు కుంటుపడగా.. ఏపీలో మాత్రం ఇంటింటికి సంక్షేమ ఫలాలు, రేషన్, పింఛన్లు క్రమం తప్పకుండా అందాయి. దీనంతటికి కారణం సీఎం జగన్ తీసుకున్న డైనమిక్ నిర్ణయాలు అని చెప్పవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థపై దేశవ్యాప్తంగా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కరోనా కష్టకాలంలో ఎవరు ఏంటి? అనే విషయం అప్పట్లో క్లియర్‌గా తేలిపోయింది. రోగానికి భయపడి చంద్రబాబు, పవన్ హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. కానీ సీఎం జగన్ మాత్రం తన మంత్రుల సమీక్షలతో ప్రజలకు నిత్యం టచ్‌లో ఉన్నారు. అలాంటి కష్ట-నష్ట కాలంలో కూడా ప్రజల బాగోగులు పట్టించుకున్న ఏకైక సీఎంగా రికార్డులకెక్కారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో పారాసెట్మాల్ వేసుకోమని జగన్ గారు చెబితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కామెడీ చేశారు, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటే ఎకసెక్కాలాడారు. అలా నోరు చేసుకున్నోళ్లంతా చివరకు సీఎం జగన్ చెప్పిన సూత్రాలనే ప్రపంచవ్యాప్తంగా పాటించారు. కోవిడ్ సమయంలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న దశలోనూ ఎలాగైనా ప్రజలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఆయన అనునిత్యం తపనపడ్డారు. మరోవైపు కరోనా కట్టడిపై ఏపీని దేశానికే ఆదర్శంగా మార్చారు జగన్. అత్యథిక వ్యాధి నిర్థారణ పరీక్షలు జరిపిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందంటే ఆ ఘనత జగన్‌ది కాక ఇంకెవరిది. కనీసం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టీకాలు కూడా దొరకకపోవడంతో బార్డర్ దగ్గరగా ఉన్న ప్రజలు ఏపీలోకి వచ్చి టీకాలు తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తమ ఇంటికి సంతోషంగా వెళుతున్న సమయంలో రూ. 2000 వారి జేబులో పెట్టి పంపించారు. లాక్డౌన్ సమయంలో వాహనాలు లేకపోవడంతో కాలినడక ద్వార తమ గమ్యానికి చేరుకోవాలని ఎందరో రోడ్డు బాట పట్టారు. వారిలో కొందరికి కనీసం చెప్పులు కూడా లేని పరిస్థితి. అలాంటి వారి కోసం పలు చోట్ల చెప్పుల స్టాండ్లను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదేమైనా పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది లాగే సీఎం జగన్ కూడా అసలైన కరోనా వారియర్ అని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేసేవారు. కరోనా కష్ట సమయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ప్రజల పట్ల చూపిన అంకిత భావాన్ని పూనమ్ తాజాగా కొనియాడటంతో మరోసారి నెటిజన్లు కూడా ఆనాటి రోజులను ఇలా గుర్తు చేసుకుంటున్నారు. #ysrcp has done the best job for weavers during pandemic and I am as an activist extremely greatfull for this . — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 6, 2024 -
విమాన ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి
ముంబై: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌కు ముందున్న 141.2 మిలియన్ స్థాయిలను అధిగమిస్తుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం తెలిపింది. 8–13 శాతం వృద్ధితో ప్రయాణికుల సంఖ్య 2023–24లో 150–155 మిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ, సాపేక్షంగా స్థిర వ్యయ వాతావరణంలో కొనసాగుతున్న పునరుద్ధరణ మధ్య భారతీయ విమానయాన పరిశ్రమపై స్థిర దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ఇక్రా నివేదిక ప్రకారం.. రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాలలో పరిశ్రమ నికర నష్టంలో గణనీయ తగ్గింపు నమోదు చేయనుంది. సరఫరా సంబంధ సవాళ్లు, ఇంజిన్ వైఫల్య సమస్యలతో సమీప కాలానికి ఎదురుగాలి ఉండవచ్చు. ట్రాఫిక్ వృద్ధిలో ఊపు 2024–25లో కూడా కొనసాగుతుంది. యాత్రలు, వ్యాపార ప్రయాణాలకు డిమాండ్ పెరగడం, విమానాశ్రయ మౌలిక సదుపాయాలు మెరుగుపడడం వంటివి ఈ జోరుకు సహాయపడతాయి. గణనీంగా తగ్గనున్న నష్టాలు.. భారతీయ విమానయాన సంస్థల ద్వారా 2022–23లో నమోదైన విదేశీ ప్రయాణికుల రద్దీ కోవిడ్ ముందస్తు స్థాయిలను అధిగమించింది. 2018–19లో ఇది 25.9 మిలియన్ల గరిష్ట స్థాయిలను తాకింది. 7–12 శాతం వృద్దితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–27 మిలియన్లు, 2024–25లో 27–29 మిలియన్లకు చేరవచ్చు. పరిశ్రమ మెరుగైన ధరల పెరుగుదలను చూడడంతో ఆదాయాల్లో వృద్ధి నమోదైంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలలో క్షీణత, సాపేక్షంగా స్థిరంగా ఉన్న విదేశీ మారకపు రేట్ల కారణంగా రాబోయే రోజుల్లోనూ ఇది అనుకూలంగా ఉంటుంది. పరిశ్రమ నష్టాలు 2022–23 స్థాయి రూ.17,000–17,500 కోట్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,000–4,000 కోట్లకు చేరవచ్చు. ఏటీఎఫ్ ధరలు, భారతీయ రూపాయి–యూఎస్ డాలర్ కదలికలు ఎయిర్‌లైన్స్ వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఏటీఎఫ్ ధర 2022–23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి కాలంలో 15 శాతం క్షీణించింది. -
కోవిడ్-19 తగ్గినా..ఐక్యూ ముప్పు పెరిగింది!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు నియంత్రణలో ఉన్నప్పటికీ, దీని బారినపడిన వారిని వెంటాడుతున్న లాంగ్ కోవిడ్ ముప్పు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాపై చేసిన పలు పరిశోధనలలో సార్స్- కోవ్-2 వైరస్ దీర్ఘకాలంలో హాని కలిగిస్తుందని తేలింది. దీని దుష్ప్రభావాలు గుండె, ఊపిరితిత్తులపై ఉంటాయని వెల్లడయ్యింది. కోవిడ్-19పై ఇటీవల జరిపిన అధ్యయనాలు కరోనా కారణంగా మెదడు సంబంధిత సమస్యల ముప్పును తెలియజేశాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన బాధితులలో చాలా మంది వ్యాధి నుంచి కోలుకున్నాక వారిలో జ్ఞాన సామర్థ్యం(ఐక్యూ) తగ్గిపోతున్నదని పరిశోధనల్లో తేలింది. నిపుణుల బృందం కోవిడ్-19 నుండి కోలుకున్న వారిలో ఒక ఏడాది తర్వాత వారి ఐక్యూ స్థాయిలో మూడు పాయింట్ల తగ్గుదలను కనుగొంది. ఇది మెదడు సంబంధిత ముప్పుపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని నిపుణులు అంటున్నారు. మెదడు పనితీరులో తగ్గుదల జీవన నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ పరిశోధనా వివరాలు ప్రచురితమయ్యాయి. -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్‌లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డెలివరీ బాయ్‌గా దిగ్గజ కంపెనీ సీఈఓ!
కరోనా... రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎన్నో కోట్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేం. అయినవారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో కుటుంబాలు రూ.కోట్లు కుమ్మరించడం, చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్న ఘటనలు కోకొల్లలు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ చాలామంది భయంతో వణికిపోతుంటారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంతటి మానసిక క్షోభ అనుభవించాయో తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి డెలివరీ బాయ్‌గా పనిచేసినట్లు చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖస్రోషాహి ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండి పిచ్చెక్కిపోయేది. అందుకే నేను ఇంటి నుండి బయటకు వెళ్లాలని అనుకున్నాను. వెంటనే ఈబైక్ సాయంతో ఉబర్ ఈట్స్ లో డెలివరీగా బాయ్‌గా చేరాను. ఫుడ్ డెలివరీ చేయడం, కస్టమర్లను రేటింగ్స్ అడిగినట్లు చెప్పారు. మాస్క్ పెట్టుకుని విధులు నిర్వహించడంతో తాను డెలివరీ డెలివరీ బాయ్‌గా పనిచేయడం మరింత సులభమైందని అన్నారు. View this post on Instagram A post shared by CNBC-TV18 (@cnbctv18india) కోవిడ్ ముగిసిన తర్వాత టెస్లా కారు ఉబెర్ డ్రైవర్ గా పనిచేశారంటూ నందన్ నిలేకనితో తన అనుభవాల్ని పంచుకున్నారు. కాగా, ఉబర సీఈఓ భారత్ లో తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. -
COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!
కొవిడ్-19 వాక్సినేషన్, గుండెపై ప్రభావానికి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారిలో(భారత్ మినహా) గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిర్డిటిస్ , సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST) లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో COVID-19 టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించేందుకు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం అని తెలుస్తోంది. భారత్ మినహా, వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది వాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరీశీలించారు. వివిధ దేశాల్లో 9.9 కోట్లమందిలో ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన నిర్వహించింది. Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కీలక డాటా సేకరించింది. మోడర్నా(mRNA),కోవిషీల్డ్ (ChadOX1) వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్నవారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే Guillain-Barre సిండ్రోమ్‌ను గుర్తించారు ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించవచ్చు, సుదీర్ఘ చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది. వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..! కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయట. ఈ తరహా టీకాలే భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదనినిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్ , ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా , కెనడా, డెన్మార్క్‌లోని అంటారియోతో సహా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ , స్కాట్లాండ్ పలు ప్రదేశాల్లో డి COVID-19 వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్ డేటాను సేకరించింది. కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ పరిశోధనపై వాక్సిన్ తయారీదారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ప్రముఖ టెక్ కంపెనీ కఠిన నిర్ణయం.. ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల భవిష్యత్!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేసింది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయాలకు రావాలని పిలుపు నిచ్చింది. లేని పక్షంలో మీ కెరియర్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో డెల్ ఇతర టెక్ కంపెనీల తరహాలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిచ్చింది. ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చే అవసరం లేకుండా 60 శాతం మంది సిబ్బందికి రిమోట్ వర్క్‌ను సౌకర్యాన్ని కల్పిచ్చింది. అయితే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కంపెనీ తన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను పునఃసమీక్షించింది. మార్చి 2023లో డెల్ తన కార్యాలయాలకు ఒక గంట ప్రయాణానికి లోపల నివసించే ఉద్యోగులందరూ వారానికి కనీసం మూడు రోజులు హాజరు కావాలని తప్పనిసరి చేసింది. తాజాగా, ఆ నిబంధనను అందరికి అమలు చేసింది. కెరీర్ ఫణంగా పెట్టి కానీ వారిలో తక్కువ వేతనం పొందుకు ఉద్యోగులు రిమోట్ వర్క్‌కి మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కార్యాలయానికి కొన్ని గంటల దూరంలో నివసించే వారు కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని, లేదంటే కెరీర్‌ను ఫణంగా పెట్టి రిమోట్ వర్క్ చేస్తామంటూ డెల్‌తో కాంట్రాక్ట్ కుదర్చుకునే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. లేఆఫ్స్ ఉన్నప్పటికీ డెల్ గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వర్క్ ఫోర్స్‌లో సుమారు 6వేల మందిని లేఆఫ్స్ ప్రకటించింది. అయినప్పటికీ డెల్ స్టాక్ గణనీయమైన పెరుగుదలను చూసింది. గత 12 నెలల్లో దాని విలువను రెట్టింపు చేసి సుమారు 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
కరోనా బారిన మాజీ సీఎం... స్వైన్ ఫ్లూ కూడా నిర్ధారణ!
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారినపడ్డారు. ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా సోకినట్లు మెడికల్ రిపోర్టులో వెల్లడయ్యింది. గెహ్లాట్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో తన ఆరోగ్యం గురించి అశోక్ గెహ్లాట్ తెలియజేస్తూ ‘గత కొన్ని రోజులుగా జ్వరం వస్తున్న కారణంగా, వైద్యుల సలహా మేరకు మెడికల్ టెస్టులు చేయించాను. కోవిడ్, స్వైన్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వచ్చే ఏడు రోజుల పాటు నేను ఎవరినీ కలవలేను. మారుతున్న ఈ సీజన్లో అందరూ ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం వాతావరణం మారుతోంది. ఇటువంటి వాతావరణంలో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారని’ దానిలో పేర్కొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పేనా?
ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్‌పై అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు ఈ బడ్జెట్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే ఈ బడ్జెట్లో సుధీర్ఘ కాలంగా నిలిచిన కరువు భత్యంపై కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సంఘం ‘భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్’ జనరల్ సెక్రటరీ ముఖేసింగ్ 18 నెలల కాలంలో నిలిచిపోయిన డీఏ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్ధిక ఇబ్బందులను తలెత్తాయని అంగీకరిస్తూనే.. దేశం మహమ్మారి నుంచి కోలుకుని ఆర్ధిక పరిస్థితులు చక్కబడ్డాయని అన్నారు. పునసమీక్షించాలని లేఖ కాబట్టి, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మూడు విడుతల కరువు భత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునసమీకక్షించాలని లేఖ రాశారు. నిలిపివేసిన డీఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విమరణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలందించిన వారికి ఉపశమనం లభిస్తుందన్నారు. ముఖేష్ సింగ్ లేఖపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కరువు భత్యం నిలిపివేసింది కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు చెల్లించేందుకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)ను జనవరి 2020 నుంచి జూన్ 2021 అంటే సుమారు 18 నెలలు పాటు నిలిపివేసింది. ఆ సమయంలో కోవిడ్-19 విజృంభణ కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. -
కోవిడ్‌ను మించిన వ్యాధి మనల్ని కబళిస్తుందా?
మొన్నటి వరకూ ప్రపంచాన్ని కోవిడ్-19 వణికించింది. దీని నుంచి కాస్త దూరవుతున్నామనేంతలోనే ఇప్పుడు మరొక ప్రాణాంతక వ్యాధి సమస్త మానవాళిని చుట్టుముట్టేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాపించగల ఈ కొత్త వ్యాధికి ‘డిసీజ్ ఎక్స్’ అనే పేరు పెట్టారు. కరోనా మాదిరిగానే ఈ వ్యాధి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ప్రాణాలను కూడా మింగేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లోనే ఈ వ్యాధి పేరును మొదటిసారి ప్రకటించింది. భవిష్యత్తుకు ముప్పుగామారిన ఈ వ్యాధి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీవ్రంగా హెచ్చరించింది. 2019లో కోవిడ్-19 వేగంగా వ్యాపించడం వల్ల అనేక దేశాలలో బాధితులకు సహాయం చేయడానికి తగినంత మంది వైద్యులు, నర్సులు, మందులు, పరికరాలు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ కోవిడ్-19 ప్రపంచానికి పెద్ద సమస్యగానే ఉంది. కొందరు శాస్త్రవేత్తలు డిసీజ్ ఎక్స్ వ్యాధి నుంచి మానవాళిని రక్షించేందుకు వ్యాక్సిన్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ అనే గ్రూప్ వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తోంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ కొత్త వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత వ్యాక్సిన్లను తయారీ సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంచనాలకు అందని డిసీజ్ ఎక్స్ డిసీజ్ ఎక్స్ ఎంత ఘోరంగా ఉండనుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు అంచనావేయలేకపోతున్నారు. ఇది తేలికపాటి జలుబు మాదిరిగా ఉండవచ్చు లేదా కోవిడ్-19 కంటే చాలా ప్రాణాంతకం కావచ్చని వారు భావిస్తున్నారు. ఏ సూక్ష్మక్రిమి దీనికి కారణంగా నిలుస్తున్నదో, దానిని ఏ విధంగా కనుగొనాలో, ఎటువంటి చికిత్స అందించాలో వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. అందుకే ఈ వ్యాధి విషయంలో అప్రమత్తత అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. డిసీజ్ ఎక్స్ వ్యాధి సోకిన బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ డ్రాప్స్ ద్వారా వ్యాధి వ్యాపించవచ్చు. బాధితుడు తాకిన వస్తువులపై నిలిచిన సూక్ష్మక్రిములు ద్వారానూ ఈ వ్యాధి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి క్రిములను మోసే కీటకాల నుంచి కూడా వ్యాప్తి చెందవచ్చంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు. జంతువుల నుంచి.. డిసీజ్ ఎక్స్ అనేది కోతులు, కుక్కలు తదితర జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక ఊహాజనిత వ్యాధి. దీని కారణంగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇదీ ఒకటి కానుంది. అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న పలు వైరస్లు గతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డిసీజ్ ఎక్స్ సోకినపుడు బాధితునికి జ్వరం, నరాల తిమ్మిరి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధి వ్యాపిస్తే కోవిడ్‌ను మించిన ప్రమాదం వాటిల్లవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రతీఒక్కరూ పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. -
డిసెంబరులో కరోనాతో 10 వేలమంది మృతి!
కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నాయి ప్రత్యేకించి కరోనా జెఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సింగపూర్, అమెరికాలో కరోనా వేవ్ అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారతదేశంలో కూడా గడచిన 50 రోజుల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలోనే పెరిగాయి. ఇటీవలి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో జనం జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ మరింతగా విస్తరించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఓ) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనామ్ తెలిపారు. గత డిసెంబర్లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేలమంది మరణించారని పేర్కొన్నారు. 50 దేశాల నుంచి అందిన డేటా ప్రకారం ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య కూడా 42 శాతం మేరకు పెరిగిందన్నారు. భారతదేశంలో కూడా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని, ప్రతిరోజూ సగటున 600 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 514 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,422. దీనికిముందు అంటే బుధవారం కొత్తగా 605 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కారణంగా రోజుకు సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో పెరుగున్న కరోనా కేసులు
ఛత్తీస్‌గఢ్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 24 మందికి కరోనా సోకింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా బాధితులు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు చెందిన వారని సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గత 24 గంటల్లో కొత్తగా 11 మందికి కరోనా సోకింది. దీంతో రాజధానిలో కరోనా బాధితుల సంఖ్య 51కి చేరింది. ఇక్కడ ఇప్పటికే 40 మంది కరోనా బాధితులు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 51కి పెరగడం ఆందోళనకు దారితీస్తోంది. రాష్ట్రంలోని పారిశ్రామిక నగరం రాయ్‌ఘర్ కరోనా కేసులలో రెండవ స్థానంలో ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా ఐదుగురికి కరోనా సోకింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 131కి చేరింది. కాగా 31 మంది కరోనా బాధితులు హోమ్ ఐసోలేషన్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4182 శాంపిల్స్‌ను పరీక్షించారు. -
కోవిడ్ కొత్త కేసులు 774
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 774 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్ కేసుల సంఖ్య 4,187గా ఉందని తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో తమిళనాడు, గుజరాత్‌లలో ఒక్కరేసి చొప్పున బాధితులు చనిపోయారని పేర్కొంది. శీతల వాతావరణం, కోవిడ్–19 వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి కారణంగా కేసులు వేగంగా పెరుగుదల నమోదవుతోందని తెలిపింది. -
619కి చేరిన జేఎన్.1 కేసులు
న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాల్లో జనవరి 4వ తేదీ వరకు కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 619 నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయన్నారు. ఆ తర్వాత కేరళలో 148, మహారాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్లో 36, ఏపీలో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్తాన్‌లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హరియాణాల్లో ఒక్కటి చొప్పున కేసులు వెలుగు చూశాయి. -
Corona: గడిచిన 24 గంటల్లో 761 కేసులు.. 12 మంది మృతి
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మరోసారి భారత్‌లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన రేకేత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో 761 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క రోజులోనే 12 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,249 యాక్టివ్ కేసులు ఉండగా కర్ణాటక 1,240, మహారాష్ట్ర 914, తమిళనాడు 190, చత్తీస్‌గఢ్- ఆంధ్రప్రదేశ్‌లో 128 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్‌తో మరణించిన వారిలో కేరళలో అయిదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరు ఉన్నారు. కాగా గతేడాది తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా డిసెంబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. డిసెంబర్ 5 వరకు వందలోపు నమోదైన కేసులు.. తర్వాత కొత్త వేరియంట్ వెలుగుచూడంతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020లో కరోనా తొలిసారి బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు 4.5 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 5.3లక్షల మంది ప్రాణాలు కోల్పాయారు. 4.4 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇక 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. -
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 760 కరోనా కేసులు!
కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో పెరుగుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం చైనాతో సహా అనేక దేశాలలో కరోనా బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. భారతదేశంలో గత 20 రోజులుగా ప్రతిరోజూ కొత్తగా సగటున 500 కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 760 మందికి ఇన్ఫెక్షన్ నిర్ధారితమయ్యింది. జేఎన్-1 వేరియంట్ ఇప్పటివరకు దేశంలోని 11 రాష్ట్రాలకు వ్యాపించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4423కు చేరింది. కరోనా ముప్పు పెరుగుతోందని, దీని నివారణకు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ కారణంగా ఐదు మరణాలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) తెలిపింది. -
227 రోజుల తరువాత భారీగా కరోనా కేసులు
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 10 రోజుల డేటాను పరిశీలిస్తే, రోజుకు సగటున 500 నుంచి 600 కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం (డిసెంబర్ 31) ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన గణాంకాలు మరింత భయం గొలిపేవిగా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇవి 227 రోజుల తరువాత అత్యధికంగా నమోదైన కేసులు. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి పెరిగింది. అంతకుముందు మే 19న 865 కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మంది కరోనా బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా బాధితులు కన్నుమూశారు. కరోనాలోని కొత్త వేరియంట్ జేఎన్.1 ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వేరియంట్ ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే వైరస్ సోకిన వారిలో చాలా మంది కోలుకోవడం ఉపశమనం కలిగించే అంశమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. రికవరీ రేటు 98.81 శాతం. కాగా దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లు అందించారు. కాగా కొన్ని నివేదికల ప్రకారం బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా జేఎన్.1 సోకినట్లు సమాచారం. అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: 2023లో ‘ఉదయ్‌పూర్’ ఎందుకు మారుమోగింది? -
కరోనా ఇలా కూడా ఎటాక్ చేస్తుందా? నటుడు విజయ్‌కాంత్ కూడా..
కోలివుడ్‌కి చెందిన ప్రుముఖ నటుడు విజయ్‌కాంత్(71) చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతుండగానే చివరికి కరోనా పాజిటివ్‌గా అని తేలిన ఒక్కరోజులోనే మృతి చెందారు. న్యూమెనియా లక్షణాలతో కూడా కరోనా అటాక్ ఇస్తుందా? లేదా ఇది కూడా కరోనా సంకేతమా? లేక వయసు కారణామా?. అలాంటప్పుడూ సీనియర్ సిటీజన్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలుత తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో ఆస్పత్రిలోకి చేరినట్లు సమాచారం. ఆ తర్వాత సుమారు 14 రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. న్యూమెనియా వంటి శ్వాసకోశ సమస్యలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఆ తర్వాత కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడం, పరిస్థితి విషమించడం మృతి చెందడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో అందరిలో న్యూమోనియా కాస్త కరోనా మారి ప్రాణాంతకంగా పరిణామిస్తుందా? అని తీవ్ర భయాందోళనలు తలెత్తుతున్నాయి. అయితే వైద్యులు ఇలా ఎంత మాత్రం జరగదని చెబుతున్నారు. ఒక్కొసారి తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా తీసుకున్నప్పుడే సమస్య తలెత్తుందన్నారు వైద్యులు. వయసు వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే సుమారు 61 ఏళ్ల పైబడినవారిలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, దీనికి తోడు వారిలో వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువుగా ఉంటుంది. అందువల్ల అలాంటి వారు సదా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు. యువత కంటే పెద్దలు, చిన్నారులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ముఖ్యంగా కీమోథెరపీ, మధుమేహం, స్టెరాయిడ్లు తీసుకుంటున్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణి స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నొక్కి చెబుతున్నారు వైద్యులు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. జ్వరం అలసట దగ్గు, గొంతు నొప్పి ఊపిరి ఆడకపోవడం కండరాలు, శరీర నొప్పులు తలనొప్పి చలి రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలు వృద్ధలు లేదా పెద్దవారిలో వస్తే అస్సలు నిర్లక్ష్య చేయకుండా తక్షణమే వైద్యుడిన సంప్రదిస్తే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్ 1 మరింత ప్రమాదకారి కాదు కానీ తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటిచటం తోపాట్లు ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే సెపరేట్‌గా ఉండటం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే కాలనుగుణంగా తాజా కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం వంటివి చేయాలని అన్నారు. అన్నింటికంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వంటివి చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..) -
కొత్త కరోనా టెన్షన్ తో ఐటీ కంపెనీల కీలక నిర్ణయం
-
అమెరికా టూరిస్టులపై చైనా కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా నుంచి వచ్చే పర్యాటకుల విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది తొలి రోజు నుంచి చైనాకు వచ్చే అమెరికా పర్యాటకులకు నిబంధనల్లో భారీ సడలింపులు ఇచ్చింది. రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్లు, హోటల్ రిజర్వేషన్ ప్రూఫులు, చైనా నుంచి అందిన ఇన్విటేషన్లు తీసుకురావాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ ఒక ప్రకటన చేసింది. చైనా, అమెరికా ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపర్చేందుకే ఈ నిబంధనల సడలింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో చైనా ఎంబసీ తెలిపింది. అయితే కొవిడ్‌తో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, మలేషియా దేశాల పౌరులకు 15 రోజుల పాటు దేశంలో పర్యటించేందుకుగాను వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత నెలలో చైనా ప్రకటించడం గమనార్హం. కొవిడ్‌కు ముందు ఏడాది 2019లో చైనాలో విదేశీ టూరిస్టుల ఎంట్రీ ఎగ్జిట్లు 977 మిలియన్లు నమోదవగా ఈ ఏడాది అవి 8.4 మిలియన్లకు పడిపోయాయి. చైనా పర్యాటక రంగం ఎంత దారుణంగా దెబ్బతిన్నదో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఇదీచదవండి.. ట్రంప్ పోరాటం వాటితోనే.. 15 నుంచి ఎన్నికల రేసు స్టార్ట్ -
కోవిడ్ అడ్వాన్స్‌లకు ఈపీఎఫ్ఓ చెక్
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కోవిడ్–19 అడ్వాన్స్ మంజూరును నిలిపివేసింది. ప్రస్తుతం కోవిడ్–19 పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడం, ఉద్యోగావకాశాలు పెరిగిన నేపథ్యంలో కోవిడ్–19 కారణంగా భవిష్యనిధి నుంచి నగదు ఉపసంహరణ అవకాశాన్ని ఈపీఎఫ్ఓ రద్దు చేసింది. ఇకపై భవిష్యనిధి నుంచి సాధారణ కారణాలతో నగదు ఉపసంహరించుకునే అవకాశాన్ని మాత్రం కొనసాగిస్తోంది. కోవిడ్–19 ప్రభావంతో 2020 మార్చిలో లాక్డౌన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కాలంలో పలుమార్లు వివిధ కంపెనీలు లాక్డౌన్ పాటించాల్సిరావడం, ఫలితంగా తయారీ రంగంతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడంతో వారి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈపీఎఫ్ఓ కోవిడ్–19 అడ్వాన్స్‌ల విడుదలకు నిర్ణయించింది. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించిన ఈ ఉపసంహరణ ప్రక్రియతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.25 కోట్ల మంది ఖాతాదారులు రూ.50 కోట్ల మేర భవిష్య నిధిని ఉపసంహరించుకున్నారు. నిధి మెరుగుపడేలా.. దాదాపు మూడున్నరేళ్ల పాటు కోవిడ్–19 ఆడ్వాన్స్ విడుదలకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పించింది. ఈ కాలంలో ఖాతాదారులు దాదాపు మూడుసార్లు నిధి నుంచి అర్హత మేరకు ఉపసంహరించుకున్నారు. మూలవేతనం నుంచి దాదాపు 3 రెట్ల నగదును ఉపసంహరించుకునేలా వెసులుబాటు ఉండడంతో దాదాపు 2.25 కోట్ల మంది ఈమేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 7.25 కోట్ల మంది ఈపీఎఫ్ఓలో చందాదారులుగా ఉన్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా తాజాగా కోవిడ్–19 అడ్వాన్స్ ఉపసంహరణను ఈపీఎఫ్ఓ నిలిపివేసింది. భవిష్యత్ అవసరాల కోసం, పదవీ విరమణ పొందిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా చందాదారులు జీవించేందుకు వినియోగించుకోవాల్సిన ఈపీఎఫ్ నిధి నుంచి ఉపసంహరణ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే చివరి నాటికి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఉపసంహరణల ప్రక్రియకు కాస్త బ్రేక్ వేస్తూ సాధారణ పద్ధతిలో మాత్రమే నిధిని వెనక్కు తీసుకునే అవకాశాలను కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఉపసంహరణలతో తగ్గిన నిధిని తిరిగి మెరుగుపర్చే దిశగా ఈపీఎఫ్ఓ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. -
వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కొత్తగా 797 కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 797 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో రెండు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కో మరణం నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరుకుంది. దేశంలో కొత్త వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఇప్పటివరకు 157 జేఎన్.1 కరోనా వేరియంట్‌కు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో అత్యధికంగా 78, గుజరాత్ (34), గోవా (18), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4) కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదైంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..
-
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్-1
-
అలెర్ట్, కోవిడ్-19 అడ్వాన్స్ విత్‌డ్రాపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం?!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మనీ విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో చందాదారుల ఆరోగ్య అవసరాల్ని తీర్చేలా కోవిడ్ అడ్వాన్స్ అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ ఆప్షన్‌ను ఈపీఎఫ్ఓ త్వరలో తొలగించనుంది. దీంతో కోవిడ్ అడ్వాన్స్ పేరుతో రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్‌ను ఉపసంహరించుకోవడం అసాధ్యం. వారం రోజుల క్రితం రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని సంబంధిత అధికారులు అనధికారికంగా వెల్లడించారు. కోవిడ్ అడ్వాన్స్ పేరుతో ఇందులో ప్రముఖంగా భారత్‌లో తొలిసారి కరోనా విజృంభణ మొదలైన సమయంలో ఈపీఎఫ్ఓ మనీ విత్ డ్రాలో మార్పులు చేసింది. చేసిన మార్పులకు అనుగుణంగా చందారులు కరోనా చికిత్సతో పాటు సంబంధిత అనారోగ్య సమస్యలకు చికిత్స పొందేందుకు వీలుగా కోవిడ్ అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా ఈపీఎఫ్ఓ అకౌంట్లో ఉన్న కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అవసరాల్ని తీర్చుకోవచ్చు. ప్రాణాల్ని కాపాడింది ఈ నిర్ణయం సబ్స్క్రైబర్లు కోవిడ్ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సహాయ పడింది. పలువురు కోవిడ్‌కు చికిత్స చేయించుకుని ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. అయితే సుమారు ఏడెనిమిది నెలల క్రితం కోవిడ్-19పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) విధించిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ నిర్ణయంతో ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటనతో ఈపీఎఫ్ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రీటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ నుంచి కోవిడ్ అడ్వాన్స్ తీసుకునే సదుపాయన్ని తొలగించనుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ, సాఫ్ట్‌వేర్‌లో నాన్ రిఫండబుల్ కోవిడ్ అడ్వాన్స్ నిబంధనను నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తద్వారా చందాదారులు ఇకపై దరఖాస్తు చేసుకోలేరని అధికారి తెలిపారు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది కాగా, కొవిడ్ అడ్వాన్స్ పేరుతో తీసుకున్న నగదుతో అనవసరైమన కొనుగోళ్లు, ఇతర అవసరాలకు వినియోగించుకునే వారికి ఈపీఎఫ్ఓ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపునుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉండేదని, ఇప్పటికే ఆలస్యం అయిందని అంటున్నారు. రిటైర్మెంట్ పొదుపు నుంచి కోవిడ్ అడ్వాన్స్ పేరుతో తీసుకున్న నగదును ఆరోగ్యం కోసం కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారని తెలిసినప్పటికీ కోవిడ్ ఉపసంహరణను ముగించడానికి వారికి ఇంత సమయం పట్టిందని ఆర్థికవేత్త కేఆర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఏ ఏడాది ఎంత విత్‌డ్రా చేశారంటే ఈపీఎఫ్ 2020-21లో 6.92 మిలియన్ల మంది చందాదారులకు రూ .17,106.17 కోట్లు, 2021-22 లో 9.16 మిలియన్ల లబ్ధిదారులకు రూ .19,126.29 కోట్లు, 2022-2023లో 6.20 మిలియన్ల మంది లబ్ధిదారులకు రూ .11,843.23 కోట్ల నగదను అందించింది. 4 రోజుల్లో 6లక్షలు విత్‌డ్రా మార్చి 28, 2020 నుండి కోవిడ్ అడ్వాన్స్ నిబంధన అమల్లోకి వచ్చింది. 2020 ఆర్థిక సంవత్సరం చివరి వరకు (మార్చి 31, 2020) నాలుగు రోజుల్లో 33 మంది లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. 6 లక్షల్ని విత్ డ్రా చేసుకున్నారు. కోవిడ్ అడ్వాన్స్ రూ.48,075 కోట్లు 2022-23 ఈపీఎఫ్ఓ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2020-21 నుండి మూడు ఆర్థిక సంవత్సరాల్లో 22 మిలియన్లకు పైగా చందాదారులు కోవిడ్ అడ్వాన్స్ పొందారు. ఈ మొత్తం విలువ రూ .48,075.75 కోట్లు. -
తెలంగాణలో కోవిడ్ మరణం.. స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. తగ్గుముఖం పట్టిందనున్న మహమ్మారి మరోసారి విస్తరిస్తుంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా మరణం సంభవించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. దీంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. తెలంగాణలో కరోనా మరణంపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదని తెలిపారు. కోవిడ్ మరణం నమోదు అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు. ఉస్మానియాలో చనిపోయిన వ్యక్తులకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆ మరణాలను కో మార్బిడ్ అంటారని చెప్పారు. కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. రాష్టంరలో కోవిడ్ టెస్టులను రోజుకి 4 వేలకు పెంచామని తెలిపారు. మెడికల్ డిపార్ట్మెంట్ను అలెర్ట్ చేశామని తెలిపారు. కోవిడ్ మరణం అనే అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆరా తీసిన మంత్రి.. మహమ్మారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సాయంత్రం సమీక్ష చేయనున్నారు. పూర్తిస్థాయి కరోనా వివరాలతో రావాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరురోగులు ప్రాణాలు విడిచినట్లు వార్తలు వచ్చాయి. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించిన్లు సమాచారం. చదవండి: కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ -
పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?!
దేశంలో పెరిగిపోతున్న కోవిడ్-19 కేసులతో దిగ్గజ ఐటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే పరిస్థితి చేయిదాటి పోతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కేసుల నమోదు తీవ్రతరమైతే మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తే బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల్ని విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా, ఓ వైపు సంస్థ వృద్ది కోసం పాటుపడుతూనే ఉద్యోగులు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ‘‘నవంబర్ నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. మేం ఇచ్చిన ఆదేశాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ఉద్యోగులకు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం.”అని విప్రో ఈ సందర్భంగా వెల్లడించింది. వారానికి మూడు రోజులు ఆఫీస్‌లోనే ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా కారణంగా ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని ఆదేశించింది. అయితే, గత నెల నవంబర్ 15 నుంచి సిబ్బందికి హైబ్రిడ్ వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిర్ధేశించిన సమయం నుంచి ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని పట్టుబట్టింది. వారికి కేటాయించిన ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని ఆదేశించింది. ప్రస్తుతం ఈ హైబ్రిడ్ విధానంలో విప్రో ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్‌కు వస్తే..మరో రెండు రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కోవిడ్-19 కేసులతో తిరిగి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విస్తరిస్తోన్న కరోనా కనుమరుగైందనుకున్న మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. కోవిడ్-19 వైరస్ రెండేళ్లపాటు బతుకుపై భయం పుట్టించింది. దేశీయంగా టీకాలు అందుబాటులోకి రావడంతో వైరస్ పీడ విరగడైందని భావించినా కొన్నాళ్లకు రూపు మార్చుకుంది. కోవిడ్-19, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్.. ప్రస్తుతం జేఎన్1 వైరస్‌గా మన ముందుకొస్తోంది. డిసెంబర్ 26, మంగళవారం నాటికి దేశంలో 4,100 దాటాయి. గడిచిన 24 గంటల్లో 412 మందికి వ్యాపించింది. -
తెలంగాణలో ఈ ఏడాది తొలి కోవిడ్ మరణం!
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్ బారిన పడగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరురోగులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు.. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. మృతులను 60 ఏళ్ల వ్యక్తితోపాటు 40 ఏళ్ల వ్యక్తిగా తెలిపారు. తెలంగాణలోనూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 55 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 45 మంది వైరస్ బారిన పడ్డారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో 54 పాజిటివ్ చేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్ టెస్ట్‌లు పెంచారు, -
భారత్‌లో కరోనా: 4,170 యాక్టివ్ కేసులు
ఢిల్లీ/బెంగళూరు, సాక్షి: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికే 4 వేలు దాటేసింది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరింది. కొత్త వేరియెంట్ జేఎన్.1 మూలంగానే అధిక కేసులు నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పంజా విసురుతోంది. మరోవైపు కర్ణాటకలో కొత్త వేరియెంట్ కేసులు వెలుగు చూశాయి. మంగళవారం ఉదయం అక్కడి ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఒక్క బెంగళూరులోనే 20 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. ఈ వేరియెంట్ ధాటికి.. కర్ణాటక వ్యాప్తంగా ముగ్గురు మరణించారు. బెంగళూరులో ఇద్దరు, రామనగర జిల్లాలో ఒకరు వైరస్ బారిన పడి మరణించారు. అయితే వాళ్ల వయసులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మరణాలకు కారణమా? అనేదానిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు కొత్త కేసులు అధికంగా నమోదు అవుతుండడంతో.. కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ►వేగవంతమైన సాంక్రమణ సామర్థ్యమున్న కరోనా జేఎన్1 రకం వ్యాప్తి అధికమవుతోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం.. కేవలం జేఎన్.1 కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒక్క గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి. ►తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు కొత్త వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. అన్ని వేరియంట్లు కలుపుకుని గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా సోమవారం మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్రం తెలిపింది. ►తెలంగాణలో సోమవారంనాటికి 10 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒకరు వైరస్ బారిన నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 55కి చేరింది. మరోవైపు ఏపీలోనూ యాక్టివ్ కేసుల సంఖ్య 24కి చేరింది. కొత్త వేరియంట్‌గా వ్యాప్తి చెందుతున్న జేఎన్.1 ఉపరకం కేసుల భయం తెలుగు రాష్ట్రాలను పట్టుకుంది. ఇప్పటికే నమోదు అయిన కేసుల శాంపిల్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు.. ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక కోవిడ్ వార్డులు ఏర్పాటు చేశారు. ►జేఎన్.1 అంత ప్రమాదకరమైందేం కాదని మొదటి నుంచి వైద్య నిపుణులు, ఆఖరికి డబ్ల్యూహెచ్‌వో కూడా చెప్పింది. అయితే వైరస్ తేలికపాటిదే అయినా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జాగ్రత్తలు చెబుతూ వస్తోంది. తాజాగా కొత్త వేరియెంట్ కేసుల విజృంభణ నేపథ్యంలో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచించింది. -
అవి రెండూ అవినీతి పత్రాలే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, ప్రతిపక్ష బీఆర్ఎస్ స్వేద పత్రం.. రెండూ అవినీతి పత్రాలేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి విమర్శించారు. ఆ రెండు పత్రాలు కూడా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకేనని నిందించారు. భారతరత్న, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఇతరనేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ మాట్లాడుతూ... వాజ్‌పేయి జయంతిని కేంద్రం సుశాసన్ దినోత్సవ్ పేరుతో నిర్వహిస్తోందన్నారు. ఒక్క ఓటు తగ్గినా.. నైతిక విలువలకు కట్టుబడి ప్రధాని పదవికి వాజ్ పేయి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని వాజ్‌పేయి ఆకాంక్షించారని, త్వరలోనే ఆయన కల సాకారం కాబోతుందన్నారు. దేశంలో సుపరిపాలనకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంత్యోదయ నినాదంతో వాజ్‌పేయి దేశంలో సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా వాజ్‌పేయి చూపిన మార్గంలో.. నడుస్తోందని పేర్కొన్నారు. కొత్త వేరియెంట్ ప్రమాదకరం కాదు.. కోవిడ్ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అవసరాన్ని బట్టి కోవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఫీవర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉంటుందని.. అయితే ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు.ప్రజలు ఆందోళన చెందకుండా కోవిడ్ కట్టడికి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు?
2019 డిసెంబర్ చివర్లో సాంప్రదాయంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. తర్వాత కొద్ది వారాల్లోనే ప్రపంచమంతా చైనా నుంచి కరోనా వైరస్ వ్యాపించింది. మళ్లీ అదే డిసెంబర్లోనే మరో వేరియంట్ రూపంలో వైరస్ మనముందుకొచ్చింది. అసలు డిసెంబర్లోనే ఎందుకని వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇందుకు గల కారణాలేంటి? కరోనా ప్రధానంగా మూడు ప్రధాన మ్యుటేషన్లుగా మార్పు చెందింది. డిసెంబర్ 2020లో వ్యాప్తి చెందిన కరోనా ఆల్ఫా(B.1.1.7), బీటా(B.1.351), గామా(P.1)గా మార్పు చెందింది. మరుసటి ఏడాది 2021 డిసెంబర్లో ఉద్భవించింన ఒమిక్రాన్ వేరియంట్ భారీ నష్టాన్ని మిగిల్చింది. మరుసటి ఏడాది డిసెంబర్ 2022లో ప్రధాన వేరియంట్ వ్యాప్తి చెందనప్పటికీ ఒమిక్రాన్‌లోనే BA.2, BA.5గా పరిణామం చెందింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న JN1 కూడా ఒమిక్రాన్ వేరియంట్లోని ఉపరకమే. ఇది కూడా డిసెంబర్లోనే వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్లోనే ఎందుకు? ప్రతి ఏడాది డిసెంబర్ మాసం నుంచి కొవిడ్-19 కొత్త రకంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే. శీతాకాలంలోని చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగానే వైరస్ మార్పు చెంది వేగంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. డెల్టా వేరియంట్, మహమ్మారి మొదటి దశలోనూ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నేచర్ జర్నల్ పేర్కొంది. వేసవి నుంచి శీతాకాలానికి మారినప్పుడు ఉష్ణోగ్రత పడిపోతుంది. గాలి కూడా పొడిగా మారుతుంది. ఉత్తర అర్ధగోళంలోని దేశాలలో కోవిడ్-19 వ్యాప్తికి ఈ అంశాలే దోహదం చేస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. చైనాలోని సిచువాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఇదే విశయాన్ని వెల్లడించారు. వెచ్చని పరిస్థితుల్లోని వారికంటే చల్లని పరిస్థితుల్లో నివసించేవారికి కరోనావైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని వారి అధ్యయనం కనుగొంది. 'కొవిడ్-19 అనేది శ్వాసకోశ వైరస్. దీన్ని ఎదుర్కొనే క్రమంలో రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి వైరస్, రెండోది మన శరీరం. వైరస్ నిరంతరం మార్పు చెంది వేరియంట్లుగా పరిణామం చెందుతోంది. మన శరీరం గత వేరియంట్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని కల్పించుకుంటే మరో రకమైన వేరియంట్ సవాళ్లను విసురుతోంది. అంటే కొత్త వేరియంట్‌కు మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది.' అని అమృత హాస్పిటల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపు తెలిపారు. సెలవుల్లో పర్యటనలు.. కరోనా వేరియంట్ చైనాలో డిసెంబర్లోనే ఉద్భవించింది. నెలలోనే విపరీతంగా వ్యాప్తి చెందింది. ఉత్తర, దక్షిణ అర్ధగోళంలో డిసెంబర్ నెలలో ఎక్కువగా సెలువులు ఉన్నాయి. క్రిస్టమస్ సెలవులు, చైనాలో జనవరిలో లునార్ న్యూ ఇయర్ వేడుకలు వైరస్ వ్యాప్తికి దోహదం చేశాయి. ఈ సారి జేఎన్1 వేరియంట్ కూడా సరిగ్గా ఇదే సమయంలో వ్యాప్తి చెందుతోంది. అని డాక్టర్ దీపు తెలిపారు. భయం అవసరం లేదు.. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న జేఎన్ 1 వేరియంట్‌తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్ 1 వేరియంట్ నుంచి కూడా రక్షిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇదీ చదవండి: Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు -
Maharashtra: మంత్రికి కొవిడ్ పాజిటివ్
ముంబై: మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేకు కొవిడ్ సోనినట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. అయితే వైరస్ ఇన్ఫెక్షన్ గురించి ఎవరూ భయపడనవసరం లేదని పవార్ అన్నారు. ‘నా క్యాబినెట్ సహచరుడు ధనుంజయ్ ముండేకు కొవిడ్ పాజటివ్ వచ్చింది. నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు ముండేకు కొవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని పవార్ తెలిపారు. ‘కొవిడ్ నిర్ధారణ అయిన వెంటనే మంత్రి హోం ఐసోలేషన్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇంట్లో నుంచి ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొంటున్నారు. అయితే మంత్రి ఆఫీసు సిబ్బందిలో కొందరు అనారోగ్యం పాలయినప్పటికీ వారికి కొవిడ్ లక్షణాలు లేవు’ అని మంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఇదీచదవండి..బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? -
Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
ఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు పెరిగింది. కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 4054 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 128 కొత్త కేసులు కేరళలో నమోదయ్యామని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. 24 గంటలల్లో కేరళతో కలుపుకొని దేశవ్యాప్తంగా మరో 334 కొత్త కేసులు నమోదు కావటంతో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరుకుంది. కేరళలో కోవిడ్‌తో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,248 (4.50 కోట్లు). వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 (4.44 కోట్లు). జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. -
బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్‌లోని కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసు నమోదైన తర్వాత గోవా, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం బూస్టర్ డోసు లేదా నాలుగో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియా సార్స్- కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఎన్కే అరోరా మాట్లాడుతూ.. కొత్త సబ్-వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. డాక్టర్ అరోరా మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే, ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాధారణ ప్రజలకు నాలుగో డోసు అవసరం లేదని చెప్పారు. ఓమిక్రాన్‌లోని ఈ కొత్త సబ్-వేరియంట్‌కు సంబంధించిన కేసులు తీవ్రంగా లేవని, వైరస్ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. జేఎన్.1 సబ్‌వేరియంట్ లక్షణాలు.. జ్వరం, ముక్కు కారటం, దగ్గు, కొన్నిసార్లు విరేచనాలు, తీవ్రమైన శరీర నొప్పులు అని తెలిపారు. ఇవి సాధారణంగా ఒక వారం రోజులలో తగ్గిపోతాయన్నారు. కాగా కోవిడ్-19 పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన డేటాలోని వివరాల ప్రకారం దేశంలో ఆదివారం కొత్తగా 656 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కి చేరుకుంది. ఇది కూడా చదవండి: పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ! -
జయశంకర్ భూపాలపల్లిలో కోవిడ్ కలకలం
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. గణపురం మండలం గాంధీనగర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు నిర్వహించగా నలుగురికి కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్ చేశామని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. చదవండి: Year Ender 2023: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ
ఢిల్లీ: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 752 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. కేరళలో ఇద్దరు, రాజస్థాన్, కర్నాటకలో ఒకరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కు చేరుకుంది. అటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ జేఎన్-1 వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో 24 గంటల్లో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 38కి చేరాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే.. 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,71,212 కాగా.. రికవరీ శాతం 98.81గా తేలింది. జేఎన్.1 వ్యాప్తి ముందు వేరియెంట్‌లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి.. కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఇదీ చదవండి: Year Ender 2023: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
ఇంటర్‌లోనే ఇలా ఎందుకు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తక్కువగా ఉంటుందనే విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. 2024లో జరిగబోయే పరీక్షల్లో దీనిని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎక్కువగా ఏ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు? వారికి రివిజన్ చేయడం ఎలా? అనే అంశాలపై జిల్లాల వారీగా నివేదికలు కోరారు. రెసిడెన్షియల్, గురుకులాల్లో మంచి ఫలితాలు వస్తున్నా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కోవిడ్ తర్వాత 70 శాతం రిజల్ట్ కష్టంగా ఉందని గుర్తించారు. మెరుగైన ఫలితాలు సాధించే సిబ్బందిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. కారణాలేంటి? 2023లో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ 4,33,082 మంది విద్యార్థులు రాయగా, వీరిలో 2,72,280 మంది ఉత్తీర్ణులయ్యారు. 63 శాతం రిజల్ట్ వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో 4,19,267 మంది పరీక్ష రాస్తే, 2,65,584 (63 శాతం) పాసయ్యారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్ సెకండియర్‌లో కనీసం 50 శాతం కూడా పాసవ్వలేదు. జగిత్యాల (23శాతం), సూర్యాపేట (30శాతం), సిద్ధిపేట (34శాతం), నిర్మల్ (49శాతం) జిల్లాలు ఈ కోవలో ఉన్నాయి. పెద్దపల్లి, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌బాద్, కరీంనగర్, వనపర్తి, జనగాం, జిల్లాల్లో 48 శాతం లోపే ఫలితాలొచ్చాయి. నారాయణపేట (100శాతం) మినహా మరే ఇతర జిల్లాలోనూ 75 శాతం ఫలితాలు కనిపించలేదు. 68 శాతం ఫలితాలు ప్రైవేటు కాలేజీల్లో ఉంటుంటే, ప్రభుత్వ కాలేజీల్లో 32 శాతం మించడం లేదు. ఈ పరిస్థితికి గల కారణాలపై ఇంటర్ అధికారులు దృష్టి పెట్టారు. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. రివిజన్ ఏమాత్రం జరగడం లేదని తెలుసుకున్నారు. జనవరి రెండోవారంలో సిలబస్ పూర్తి చేసి, మిగతా రోజుల్లో రివిజన్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. సీఈసీ...హెచ్‌ఈసీలోనే ఎక్కువ ► విద్యార్థులు ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోనే చేరుతున్నారు. సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో తక్కువగా చేరినా, వారిలోనూ చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ► గత ఏడాది సీఈసీలో 98 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో 37 వేల మంది (37 శాతం) మాత్రమే 2023లో ఉత్తీర్ణులయ్యారు. ► బైపీసీ గ్రూపులో లక్ష మంది పరీక్ష రాస్తే, 64 వేల మంది (64.14) పాసయ్యారు. ► హెచ్ఈసీలో 11,294 మంది పరీక్ష రాస్తే, 3,408 మంది (30.18 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ రిజల్ట్స్ ఇలా ఉంటే.. సెకండియర్‌లో ఫలితాలు మరీ తగ్గుతున్నాయి. ► ఎంపీసీలో గరిష్టంగా 72 శాతం, బైపీసీలో 67 శాతం ఫలితాలు ఉంటే, హెచ్ఈసీలో 46 శాతం సీఈసీలో 47 శాతం ఉంటోంది. హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఫస్టియర్‌లో సరిగా బోధన జరగడం లేదని బోర్డు అధికారులు గుర్తించారు. ఈ రెండు గ్రూపులు ఎక్కువగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనే ఉంటున్నాయి. ఈసారి మెరుగైన ఫలితాల దిశగా క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
వైద్యారోగ్యశాఖపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పనిచేయని పీఎస్ఏ ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులను సాంకేతికపరమైన యంత్రాలను రెడీ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ ల్యాబ్‌లలో 16,500 శాంపిల్స్ టెస్ట్ చేసే సామర్థ్యం ఉందని మంత్రికి ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రభుత్వంతోపాటు 84 ప్రైవేట్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గత రెండు వారాల నుంచి 6 వేలకు పైగా నమూనాలను సేకరించామని చెప్పారు. కోవిడ్ టెస్టుల సామర్థ్యం పెంచాలని కనీసం రోజుకు 4000 టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. కోవిడ్ 19 రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు పత్రికా ప్రకటన కోసం సమర్పించాలని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాల సీఎస్ఆర్ విరాళాల జాబితాను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని తెలిపారు. చదవండి: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 78 మంది సస్పెండ్ -
మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ!
పంజాబ్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్- 1 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి పంజాబ్ ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రులు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గుండె, మధుమేహం, కిడ్నీ, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని సూచించింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సలహా ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రజలు వైద్య సహాయం కోసం, 104కు డయల్ చేయాలని కోరింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా తుమ్మేటప్పుడు ముక్కును, నోటిని చేతి రుమాలుతో కప్పుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. సబ్బు నీటితో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని తెలియజేసింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకడాన్ని నివారించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయవద్దని ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులను కోరింది. అలాగే బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇది కూడా చదవండి: 30న ప్రధాని మోదీ అయోధ్య రాక.. భారీ రోడ్ షోకు సన్నాహాలు! -
కరోనా టెన్షన్: దేశంలో 2,997 కరోనా యాక్టీవ్ కేసులు
-
కరోనా కొత్త వేరియంట్ విషయంలో ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం..ఇంకా ఇతర అప్డేట్స్
-
వరంగల్ ఎంజీఎంలో ఇద్దరికి కరోనా పాజిటివ్
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం మొదలైంది. ఎంజీఎం ఆసుపత్రిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్‌లో ఆరు శాంపిల్స్ ఆర్‌టీపీసీటీ టెస్ట్‌కు పంపగా.. రెండు పాజిటివ్‌గా వచ్చాయి. భూపాలపల్లికి చెందిన యాదమ్మ అనే మహిళతోపాటు మరో వ్యక్తి రాజేందర్‌కు పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. వీరిద్దరికి కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్క్‌లు లేకుండా ఎవరిని ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కొవిడ్ వ్యాప్తిపై అపోహలు వద్దని వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో 50 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. 70కిపైగా కోవిడ్ వెంటిలెటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. -
ఆరు నెలల పాపకు కరోనా! షాక్‌లో వైద్యులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ జెఎన్ 1 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఓ పక్కన వైద్యులు భయపడొద్దు అంత తీవ్ర స్తాయిలో లేదు, కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు అని చెబుతున్నారు. కానీ వ్యాప్తి మాత్రం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడూ ఎవ్వరికీ కరోనా పాజిటివ్ వచ్చినా అది కరోనా కొత్త వేరియంటేనని భయపడే పరిస్థితి. ఓ పక్క మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించమని ఇప్పటికే ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. డబ్ల్యూహెచ్ఓ సైతం దీని గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తంగా ఉండమని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఓ ఆరేళ్ల పాపకు కరోన పాజిటివ్ రావడం వైద్యులను మరింత కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. అక్కడ ఓ ఆరు నెలల పాపతో సహా ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. బీహార్‌కు చెందిన ఆ చిన్నారి కోల్‌కతాలోని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చికిత్స పొందుతుండగా, మిగతా వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వారందరికి వచ్చింది కరోనా కొత్త వేరియంట్ జెఎన్ 1? కాదా? అనేది తెలియాల్సి ఉంది. దీన్ని ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా నిర్థారిస్తున్నారు. ఈ ఘటనతో వైద్యులు కేసులను కుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. అక్కడ రాష్ట్ర ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇన్ఫ్లుఎంజా అనారోగ్యం(ILI)కి సంబంధించిన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై ప్రత్యేక దృష్టిసారించింది. అంతేగాక పశ్చిమబెంగాల్ ఆరోగ్య అధికారుల ఈ కొత్త వేరియంట్ కేసులపై గట్ట నిఘా పెట్టడమే గాక నివారించేలా కట్లుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?) -
దేశంలో కరోనా విజృంభణ.. 3 వేలకు చేరిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,997కు చేరింది. ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,328కు చేరింది. బిహార్‌లో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. బిహార్‌లో నమోదైన కేసులతో దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరిలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా వేరియంట్ జేఎన్1 విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 265 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 జేఎన్1 వేరియంట్ కేసులు ఉన్నాయి.కాగా.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇదీ చదవండి: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన వద్దు! ఈ లక్షణాలు కనిపిస్తే.. -
కరోనా నిరోధకానికి హోమియో మందులు!
సాక్షి, హైదరాబాద్: కరోనా జెఎన్1 వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన పడకుండా రెండు హోమియో ఔషధాలు వాడి ఎవరికి వారు రక్షించుకోవచ్చని ప్రముఖ హోమియో వైద్యులు డా. అంబటి సురేంద్ర రాజు ‘సాక్షి’కి తెలిపారు. అర్సెనిక్ ఆల్బం 30 (Arsenic Album 30)ను వరుసగా 3 రోజులు, ఇన్ఫ్లుయెంజినమ్ 30 (Influenzinum 30)ను వరుసగా 3 రోజులు వాడాలి. ఉదయం 7 గంటలకు పరగడుపున నాలుకపై ఒకటి లేదా రెండు చుక్కలు వేసుకుంటే చాలు. ఇలా ఒకొక్క మందును వరుసగా 3 రోజులు, రోజుకు ఒకసారి మాత్రమే.. మొత్తం వరుసగా 6 రోజులు వాడాలి. ప్రామాణిక జర్మనీ కంపెనీ మదర్ టింక్చర్లు వాడితే ఫలితం బాగుంటుందని డా. సురేంద్ర రాజు వివరించారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఈ మందులు ఒక విడత వాడితే రోగనిరోధక శక్తి ఇనుమడించి సురక్షితంగా జీవించ వచ్చన్నారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?) -
వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. వైద్యులు ఏమన్నారంటే
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం రేపుతోంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొత్త వైరస్ సోకి.. ఎంజీఎం కోవిడ్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. అంతేగాక నగరానికి చెందిన మరో ముగ్గురిని సైతం అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్‌లో సమాచారం చక్కర్లు కొట్టింది. దీంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా కరోనా భయంతో ఆసుపత్రి సిబ్బంది నో మాస్క్, నో ఎంట్రీ విధానాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. మాస్క్‌లు లేకుండా ఎవరిని లోపలికి రావొద్దని సెక్యూరిటీ చెబుతున్నారు. ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి ఇదిలా ఉండగా కోవిడ్ పాజిటివ్‌పై వార్తలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని స్పష్టం చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను అనుసరించి 50 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ -
కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?
న్యూయార్క్: కరోనా కారణంగా జలుబు, జ్వరం రావడం, వాసన, రుచిని కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని తెలుసు. కానీ కరోనా సోకినవారికి స్వరాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుందా? అమెరికాలో ఇదే జరిగింది. అమెరికాలో కరోనా బారిన పడిన ఓ బాలిక తన స్వరాన్ని కోల్పోయింది. కోవిడ్‌కు కారణమైన సార్కోవ్ 2 వైరస్ నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఇప్పటికే వైద్య పరిశోధనలు తెలిపాయి. తాజా ఘటన అందుకు నిదర్శనమని మసాచుసెట్స్ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కోవిడ్ -19 బారిన పడిన 13 వారాలకు 15 ఏళ్ల బాలిక శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షలో ఆమె స్వరపేటికలోని రెండు స్వర తంతువులు నిస్తేజంగా మారిపోయాయని వైద్యులు గుర్తించారు. ఆమెకు స్వరపేటికకు పక్షవాతం సోకిందని తేలింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె గొంతులో ఆపరేషన్ చేశారు. ట్యూబ్ ద్వారా బ్రీతింగ్ ఆడిట్ చేశారు. గొంతులోని ట్యూబ్ ద్వారానే 13 నెలల పాటు శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. కరోనా గురించి అందరు మర్చిపోతున్న తరుణంలో మరోసారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశంలో కొత్తగా వ్యాపిస్తున్న జేఎన్1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కు చేరింది. గత 24 గంటల్లో కేరళలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే దీనితో జనాలకు పెద్దగా ముప్పు లేదని పేర్కొంది. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియెంట్ లక్షణాలివే.. అదే జరిగితే తట్టుకోగలమా?.. అశ్రద్ధ వద్దు -
కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలను మాములుగా హడలెత్తించలేదు. అది పెట్టిన భయం అంత ఇంత కాదు. అప్పటికే ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాల వేరియంట్లుగా కరోనా వైరస్ మార్పు చెందుతూ ప్రభావం చూపించింది. తగ్గుముఖం పడుతుందనే లోపు మరో వేరియంట్ ఓమిక్రాన్ రూపంలో సెకండ్ కరోనా వేవ్‌తో ఎంతలా భయబ్రాంతులకు గురించేసిందో తెలిసిందే. ఎటూ చూసిన ఆస్పత్రులన్నీ మరణ మృదంగంతో మారు మ్రోగిపోయాయి. క్రమేణ ప్రజలు ఈ మహమ్మారికి అలవాటు పడిపోయి పట్టించుకోవడం వదిలేశారు. ఆ తర్వాత ఆ మహమ్మారి కూడా కనిపించనంత స్థాయిలో మాయం అయ్యింది కూడా. హమ్మాయా! అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 హడలెత్తిస్తోంది. ఒకటో రెండో కేసులే కదా అనకుంటే పెరుగుతున్న కేసుల ఉధృతి మళ్లీ ఇది వరకటి పరిస్థితికే చేరుకుంటామా? అని గుబులు తెప్పించేస్తుంది. ఇప్పటికే నిపుణుల భయపడొద్దని సూచిస్తూ మరోవూపు మాస్క్‌లు సామాజిక దూరం అని చెబుతుంటే మళ్లీ టెన్షన్.. టెన్షనే..అని భయాందోళనకు గురవ్వుతున్నారు. దీని గురించి మరో బూస్టర్ తీసుకోవాలా అని ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే వైద్యులు ఏమంటున్నారంటే.. ఈ కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పర్యాటక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే గత నాలుగు రోజుల నుంచి అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో విజయవంతంగా వ్యాక్సినేషన్లు వేశారు. 95% మంది తొలి రెండు షాట్ల వ్యాక్సిన్ తీసుకోగా, సుమారు 25% మంది బూస్టర్ డోస్‌లను కూడా వేయించుకున్నారు. మరీ ఇప్పుడూ ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మళ్లీ బూస్టర్ డోస్లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా? అని పలువురిని వేధిస్తున్న సందేహం. అయితే నిపుణులు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి గానీ మరో బూస్టర్ తీసుకోవద్దదని సూచిస్తున్నారు. అంటువ్యాధులు ఉన్న ప్రాంత్లాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్‌లో ఉండటం వంటివి చేయాలని సూచించారు. మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనా..? ఐతే గతంలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన వారుఉన్నారని అన్నారు నిపుణులు. అలాగే రెండు సార్లు కరోనాని ఫేస్ చేసిన వారకు కూడా ఉన్నారు. అయితే వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ప్రమాదం అంత తీవ్రంగా లేదు, పైగా సులభంగా బయటపడగలిగారు. ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 దగ్గరకొచ్చేటప్పటికీ.. రోగుల్లో న్యూమోనియా వంటి లక్షణాలతో కొద్దిపాటి శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అవికూడా తేలికపాటి లక్షణాలే అని ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు నిపుణులు. జస్ట్ నాలుగైదు రోజుల్లో నయం అయిపోతుంది. అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. అప్రమత్తంగా ఉండండి, లక్షణాలు కనిపిస్తే ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి, వ్యాప్తి చెందకుండా చూసుకోండి అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది కాస్త ప్రమాదకారి కావొచ్చు కాబట్టి వ్యాధినిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకుని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి వరకు సరిగా వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే వ్యాక్సిన్ తీసుకున్నా..అలాంటి వారు మాత్రమే వీలైతే బూస్టర్‌డోస్ లేదు రెండు వ్యాక్సిన్ షాట్లను తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు. ఐతే కొద్దిమంది ఆరోగ నిపుణులు మాత్రం ఈ దశలో అదనపు వ్యాక్సిన్ డోస్‌లను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. మళ్లీ వేయించుకుంటే మంచిదేనా..? అసలు మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదా కాదా అనే దిశగా పరిశోధన చేయడం కూడా మంచిదేనని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆ కొత్త వేరియంట్‌ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలం. కొత్త వేరియంట్లకు తగ్గట్టుగా ఏదైనా బూస్టర్ డోస్ ఇవ్వడం మంచిదా? కాదనే దానిపై పరిశోధన చేయడం అవసరమని అంగీకరించారు పరిశోధకులు. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న రోగులకు ఈ పరిశోధన బాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. (చదవండి: ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..? ఎందుకు చేస్తారు?) -
భద్రం... బీ కేర్‌ఫుల్!
పారాహుషార్ గంట మరోసారి మోగింది. దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మే 21 తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో 614 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జెఎన్.1 కేసు తొలిసారిగా కేరళలో బయటపడిన కొద్దిరోజుల్లోనే ఆ రాష్ట్రంలో నలుగురు బలయ్యారు. ఒక్క బుధవారమే దేశవ్యాప్తంగా 341 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, అందులో 292 కేసులు కేరళ నుంచి వచ్చినవే కావడంతో తక్షణమే అప్రమత్తత అవసరమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. భయాందోళనలకు గురి కానక్కర్లేదు కానీ, జాగ్రత్తలు మాత్రం తప్పవనేది ఇప్పుడు మన ఆరోగ్య మంత్రం. సరిగ్గా మూడేళ్ళ క్రితం మొదలైన కరోనా ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మానవాళిని వేధిస్తూనే ఉంది. చిన్నాచితకా అలల్ని పక్కనపెడితే, రెండు ప్రధాన కరోనావేవ్లు మన దేశంలో జన జీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేశాయో అందరికీ అనుభవైకవేద్యం. అప్పుడు నేర్చిన పాఠాలే ఇప్పుడు మార్గదర్శకాలు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక కరోనా వైరస్ వేరియంట్లు వచ్చాయి. ఆ వరుసలోదే భారత్‌లో తాజాగా కనిపించిన జెఎన్.1 వేరియంట్. బీఏ.2.86 కుటుంబానికి చెందిన ఈ వైరస్ ఉత్పరివర్తనం ఏడాది పైచిలుకుగా రూపుదిద్దుకొంటూ వచ్చిందట. ఇది ఇప్పటికే సుపరిచితమైన ఒమిక్రాన్‌లో బలవత్తరమైన వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే ఇది తన విజృంభణ చూపుతోంది. డిసెంబర్ 3 ముందు వారంలో 32 వేల మందికి కరోనా సోకితే, ఆ తరువాతి వారంలో 56 వేల మందికి ఇన్ఫెక్షన్ వచ్చిందని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలోని కేరళలో ర్యాండమ్ శాంపిళ్ళకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తుండగా ఈ జెఎన్.1 వేరియంట్‌ను గుర్తించారు. మన దగ్గర ఈ వేరియంట్ తొలిసారిగా బయటపడి, కేసులు పెరుగుతుండగానే రాష్ట్రాలన్నిటికీ కేంద్రం తాజాగా మార్గదర్శకావళిని జారీ చేయడం గమనార్హం. పలు రాష్ట్రాలు అప్రమత్తమై ఇప్పటికే సమీక్షా సమావేశాలు జరిపి, మార్గదర్శ కాలను ప్రకటించాయి. కేరళలో పరిస్థితులు, కొత్త జెఎన్.1 వేరియంట్ కేసుల భయంతో కర్ణాటక సర్కార్ 60 ఏళ్ళ పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్నవారికి మాస్కు ధరించడం తప్పని సరి చేసింది. కేరళ సరిహద్దు జిల్లాలలను అప్రమత్తం చేసింది. ప్రజల రాకపోకలు, సమావేశాలపై నియంత్రణలు విధించ లేదన్న మాటే కానీ, కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయించడం పెంచింది. వివిధ దేశాల్లో ఈ వేరియంట్ కనిపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తాజా పరిస్థితులపై దృష్టి సారించింది. దీన్ని ఆసక్తికరమైన వేరియంట్‌గా పేర్కొంది. ఒమిక్రాన్ తరగతికి చెందినప్పటికీ ఈ వేరియంట్ మరీ ప్రాణాంతకమైనదేమీ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ టీకా వేసుకోని వారికి సైతం ఈ వేరియంట్ వల్ల ప్రాణహాని ఉండదనీ భరోసా ఇస్తున్నారు. అది కొంత ఊరటనిచ్చే అంశం. అలాగని అశ్రద్ధచూపలేం, అజాగ్రత్త వహించలేం. ఎవరెన్ని చెప్పినా ఆరోగ్యం, ప్రాణరక్షణకు సంబంధించిన విషయం గనక సహజంగానే ఈ వేరియంట్ పట్ల మన దేశంలో ఆరోగ్య నిపుణుల్లో, ప్రజల్లో ఆందోళన నెలకొనడం సహజమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తొందరపడి, కఠిన నియంత్రణలు పెట్టనక్కరలేదు కానీ, మాస్కు ధారణ, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు పాటించడమే ప్రజారోగ్యానికి శ్రీరామరక్ష. అసలే వ్యాధినిరోధక శక్తి తగ్గే చలికాలం. దానికి తోడు శబరిమల యాత్ర, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవులతో ప్రయాణాల సీజన్. పైగా వచ్చేది సార్వత్రిక ఎన్నికల సీజన్. ర్యాలీలు, బహి రంగ సభల హంగామా. కరోనా వ్యాప్తికి కలిసొచ్చే ఇన్ని అంశాల మధ్య జాగ్రత్తలను విస్మరించడం ఎలాచూసినా రిస్కే. కట్టుదిట్టమైన ఆరోగ్యవ్యవస్థ, పరీక్షల వల్ల కేరళలో ఎప్పటికప్పుడు భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి కానీ, అంతటి పరీక్షలు, నిఘా లేని చోట పరిస్థితులు చాప కింద నీరులా ఉండివుండవచ్చు. దురదృష్టమేమంటే, మన దేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాల్లో సైతం ఆ మధ్య కోవిడ్ కేసులు తగ్గాక, అధికారికంగా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించారే తప్ప తర్వాతి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. జీనోమిక్ ప్రాసెసింగ్ టెస్ట్‌లు సహా వివిధ రూపాల్లో నిఘాను విస్మరించారు. భారత్‌లో లేబరేటరీ నెట్వర్క్ ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్) తగిన స్థాయిలో పనిచేయకపోవడమే అందుకు ఉదాహరణ. గత మూడేళ్ళలో దేశంలో 4.5 కోట్ల మంది కరోనా బారినపడ్డారనీ, 5.33 లక్షల మంది మరణించారనీ సర్కారు వారి తాజా లెక్క. ఈ అధికారిక లెక్కలకు అందని, సామాన్య బాధితుల సంఖ్య ఇంతకు అనేక రెట్లు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో టెస్ట్‌లు ఎంత ఎక్కువగా చేస్తే, కరోనా విజృంభణను అంత త్వరగా పసిగట్టి, చర్యలు చేపట్టవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లకు ఇప్పుడున్న టీకాలు ఏ మేరకు పనిచేస్తాయో పరీక్షించాలి. వివిధ దేశాలు ఇప్పటికే కొత్తవాటికి తగ్గట్టు టీకాలను మెరుగు చేస్తు న్నాయి. మన దేశానికీ వాటి అవసరం ఉందేమో శాస్త్రీయ సలహా స్వీకరించాలి. ముంచుకొచ్చే దాకా ఆగకుండా మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్లు చేయడం మంచిది. అలసత్వం దూర మవుతుంది. అలాగే, కరోనాపై నిరంతర నిఘా సరేసరి. ప్రజానీకానికి సమాచారం చేరవేస్తూ, పొంచివున్న ముప్పుపై అవగాహన పెంచడం ముఖ్యం. ప్రజారోగ్యంపై అన్ని రాష్ట్రాలూ, ప్రభుత్వాలు ఏకతాటిపైకి రావాలి. రాజకీయాలకు అతీతంగా, సమన్వయంతో ఏకోన్ముఖ వైఖరిని అవలంబించాలి. ప్రయాణాలు, జనసమ్మర్దం పెరిగే రానున్న వారాలు కీలకం గనక సన్నద్ధతే సగం మందు! -
కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు!
ఆదిలాబాద్: కోవిడ్.. రెండేళ్ల క్రితం ప్రపంచాన్నే ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం విదితమే. మహమ్మారి ముప్పు తప్పిందని భావిస్తున్న తరుణంలో మరోసారి తాజాగా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది. జేఎన్–1 వేరియంట్ రూపంలో ముప్పు పొంచి ఉండటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో కొత్త వేరియంట్ ప్రభావం ఇంకా కనిపించనప్పటికి కేంద్రం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. వైరస్ కట్టడి దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 14న కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు జిల్లాలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కోవిడ్ టెస్టుల నిర్వహణతో పాటు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. పీపీఈ కిట్స్, మాస్కులను సిద్ధంగా ఉంచారు. వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే శ్రేయస్కరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ కలవరం.. ప్రస్తుతం జేఎన్–1 వేరియంట్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 2020–21లో ప్రబలిన కోవిడ్ వైరస్‌తో జిల్లాలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేలాది మంది వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. రెండేళ్లుగా కొత్తగా కేసులేమి నమోదు కాకపోవడంతో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని అందరూ భావించారు. అయితే వైరస్ మళ్లీ కొత్త రూపంలో నమోదు కావడం జిల్లావాసులను కలవరానికి గురిచేస్తోంది. శీతాకాలం కావడంతో పాటు ఈ నెలాఖరు వరకు శుభ కార్యాలు ఎక్కువగా ఉండటం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు రానున్నాయి. వీటిల్లో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశముంటుంది. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కట్టడికి వైద్యారోగ్యశాఖ సన్నద్ధం! ప్రమాదకరమైన కొత్త వేరియంట్ కట్టడికి జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 14న మాక్ డ్రిల్ నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ బోఽధనాసుపత్రితో పాటు పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, సివిల్ కమ్యూనిటీ ఆసుపత్రులు కలిపి 96తో పాటు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిర్ధారణ పరీక్షలతో పాటు పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్స అందించేలా వారికి దిశా నిర్దేశం చేశారు. వైద్యులు, సిబ్బందికి అవసరమైన మాస్కులు 1,47,270, పీపీఈ కిట్స్ 12,740ని సిద్ధంగా ఉంచారు. రిమ్స్, ఇతర ఆసుపత్రుల్లో కలిపి 1436 బెడ్స్‌ను సిద్ధం చేశారు. రిమ్స్‌లో వంద పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్‌తో కూడిన 455 పడకలు, 135 పడకలతో ఐసీయూ, వెంటిలేటర్స్‌తో కూడిన 157 పడకలను రిమ్స్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 19 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచనున్నారు. జిల్లాలో కోవిడ్ టెస్టుల వివరాలు : 7,40,181 పాజిటివ్‌గా తేలిన కేసులు : 19,707 జిల్లాలో సంభవించిన మరణాలు : 92 ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు : 5,52,815 సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు : 5,55,884 ప్రికాషన్ డోస్ తీసుకున్న వారు : 2,65,780 ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండాలి కొత్త వేరియంట్ కట్టడికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాం. వైరస్ నియంత్రణకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించి ఏర్పాట్లు పూర్తి చేశాం. మాస్కులు, పీపీఈ కిట్లతో పాటు చికిత్సకు అవసరమైన మెడిసిన్‌ను అందుబాటులో ఉంచాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్షం చేయకుండా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు చికిత్స పొందాలి. – రాథోడ్ నరేందర్, డీఎంహెచ్‌వో -
Covid Variant JN.1: కరోనా కొత్త వేరియంట్.. 21 కేసులు నమోదు
కరోనా వైరస్ మరోసారి తన పంజా విసురుతోంది. అంతమైపోయిందనుకున్న కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు భారత్‌లోనూ నమోదవుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు దేశంలో ఇప్పటి వరకు జేఎన్.1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్‌పై దృష్టిసారించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. చదవండి: ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా?.. కారణమిదే! కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు . వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు.. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. -
భారత్ లో పెరుగుతోన్న కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు
-
తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల
-
ఏపీలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు
సాక్షి,విజయవాడ : కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందునే కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి కృష్ణబాబు తెలిపారు. ఈ విషయమై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. ‘ఏపీ నుంచి ఈ సీజన్‌లోలో కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులు ఎక్కువ ఉంటారు. శబరిమల వెళ్లి వచ్చిన భక్తులకి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. 12 మెడికల్ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు. ‘ప్రతీ గ్రామ సచివాలయానికి పది ర్యాపిడ్ కిట్లు పంపించాం. ఫీవర్ ఉన్న వారికి ర్యాపిడ్ కిట్లతో ముందుగా పరీక్షలు చేస్తాం. ఇందులో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ఆర్టీపీసీఆర్ ల్యాబులకు పంపేందుకు ఏర్పాట్లు చేశాం. పాజిటివ్ వచ్చిన వారిలో కోవిడ్ వేరియంట్ తెలుసుకోవడానికి విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తాం’ అని చెప్పారు. జ్వరం, పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు జెఎన్ 1 కొత్త వేరియంట్లో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మాస్క్ ధరించడం లాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏపీలో 33 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్లకు, కోవిడ్ మందులకి కొరత లేదు’అని కృష్ణబాబు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసిన RTPCR ల్యాబ్ లను క్రియాశీలకం చేయాలి. రోజుకు కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించేలా సిద్ధం కావాలి. విలేజ్ హెల్త్ క్లినిక్ లకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలి. ఫ్లూ జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు RTPCR టెస్ట్ లను తప్పనిసరి చేయాలి. గ్లౌజ్‌లు, మాస్క్ లు, శానిటైజర్లు వంటి రక్షణ పరికరాలను అన్ని ఆస్పత్రులలో సిద్ధంగా వుంచుకోవాలి. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా కోసం LMO, PSA, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి వాటిని, డి టైప్ సిలిండర్లను సిద్ధంగా ఉంచాలి. జ్వరం, దగ్గు వంటి ఎటువంటి స్వల్ప లక్షణాలు కన్పించినా సంబంధిత వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలి. దీనితో పాటు రానున్న పండుగ సీజన్లలో అన్ని ప్రాంతాలలో రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రజల్ని కోరారాయన. శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వారిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించినా వారు తక్షణణం దగ్గరలోని విలేజ్ క్లనిక్ లో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, తాము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా నిరంతరం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు మన రాష్ట్రంలో కోవిడ్ కేసులు తాజాగా ఇప్పటి వరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదని, అయితే కేరళ వంటి రాష్ట్రాలలో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. గ్రామ సచివాలయ స్థాయిలో వున్న విలేజ్ క్లినిక్ లు అన్నింటికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లు ఇప్పటికే అందచేశామని ఆయన చెప్పారు. అక్కడ ఏదైనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే దానిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు పంపటానికి వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో టెస్ట్ లకు అవసరమైన సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. అక్కడ కూడా పాజిటివ్ నిర్ధారణ అయితే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి దాని వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కేరళ, తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇటువంటి సమస్య తలెత్తలేదని, అయితే మనం ముందు జాగ్రత్త పాటించటం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ లు ధరించటం, సామాజిక దూరం పాటించటం, పరిశుభ్రతను పాటించటం వంటి చర్యల ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని ఆయన సూచించారు. ఇదీచదవండి..జమ్ములో ఆంధ్రప్రదేశ్ జవాను మృతి -
Covid: యాక్టివ్ కేసులు అక్కడే ఎక్కువ
న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 341 కొత్త కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. మృతి చెందిన ముగ్గురు కేరళకు చెందిన వారే. దేశంలో ప్రస్తుతం 2311 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో ఒక్క కేరళలోనే 2041 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ,మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ జేఎన్1 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం(డిసెంబర్ 20) కరోనా కేసులు పెరుగుతండడంపై ఉన్నతస్థాయి సమీక్షనిర్వహించనుంది. ఈ సమీక్ష అనంతరం ఆరోగ్య శాఖ అధికారులు కొత్త వేరియెంట్ వ్యాప్తిపై మరిన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇదీచదవండి..ఈ ఏడాది ఈమె టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ.. -
కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల అలెర్ట్
-
గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ కేసులేమీ నమోదు కాలేదు
హైదరాబాద్: ‘కోవిడ్ వైరస్ వ్యాప్తిపై వదంతులు నమ్మవద్దు. ఈ నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో వ్యాప్తిలో ఉన్న జేఎన్–1 వేరియంట్‌తో గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు చేరారనే ప్రచారం పూర్తిగా ఫేక్. అనవసరంగా భయాందోళన వద్దు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ∙కేరళలో వ్యాప్తిలో ఉన్న జేఎన్–1 వైరస్‌తో గాందీలో ఐదుగురు చేరారనేది పూర్తిగా అబద్ధం. ఆ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. రాష్ట్రంలోనే జేఎన్–1 వేరియంట్ కేసు నమోదు కాలేదు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం అలర్ట్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు, సలహాలు అందించింది. రాష్ట్ర వైద్యమంత్రి దామోదర రాజనర్సింహా, ఇతర వైద్య ఉన్నతాధికారులు గాం«దీలో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ∙గాంధీ అత్యవసర విభాగంలో గతంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డులో పురుషులకు 30, మహిళలకు 20 మొత్తం 50 పడకలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ పాండమిక్ ముగిసన తర్వాత ఎండ్మిక్లో ఒకటి, రెండు కేసులు నమోదు కావడం సర్వసాధారణం. ఈ నెలలో గాం«దీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రానున్న పండగ రోజులు కీలకం.. ∙రానున్న క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండగలు కీలకం. కోవిడ్ వంటి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్ «ధరించాలి. హ్యాండ్ శానిటైజేషన్ పాటించాలి. ఈ ఏడాది సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో శ్వాసకోశ రుగ్మతలు, ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. నవంబర్, డిసెండర్ నెలల్లో తగ్గుముఖం పట్టాయి. ∙ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ జేఎన్–1 మొదట అమెరికాలో వెలుగుచూసింది. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు కేరళలో వ్యాప్తిలో ఉంది. రూపాంతరం చెందిన జేఎన్– 1 సబ్ వేరియంట్ సెల్ఫ్ లిమిటింగ్ వైరస్. దానంతట అదే తగ్గిపోతుంది. ఈ వైరస్ తీవ్రత తక్కువ, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు గుర్తించారు. వీరు జాగ్రత్తగా ఉండాలి.. ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల్లో వ్యాపించిన ఆల్ఫా, డెల్టా కంటే మూడో వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్ త్వరితగతిన వ్యాపిస్తుంది. ఒమిక్రాన్ సబ్‌వేరియంటే జేఎన్– 1. దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకే అవకాశం ఉంది. వారంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ వైరస్ అన్ని వేవ్‌లు సమ్మర్లోనే ఎక్కువగా వ్యాపించాయి. ► కేరళలో జేఎన్– 1 వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములు ముందు జాగ్రత్తలు పాటించాలి. తిరిగి వచి్చన తర్వాత స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. కోవిడ్ కేసులు పెరిగితే గాంధీ మెడికల్ కాలేజీ వైరాలజీ ల్యాబ్‌లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే మార్గదర్శకాలను అమలు చేస్తాం. ► కోవిడ్ నోడల్ కేంద్రం సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో కోవిడ్ ఐసోలేషన్ వార్డుతోపాటు, కోవిడ్ పరీక్షలు, పీపీఈ కిట్లు, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయి. అసత్య ప్రచారాలు నమ్మవద్దు. భయాందోళనకు గురి కావద్దు. మాస్క్ ధరించి, హ్యాండ్ శానిటైజేషన్, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. -
కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1
-
AP: కోవిడ్‌పై మరోసారి అప్రమత్తత
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. ఏపీ ప్రభుత్వం కేంద్రం సూచనలతో ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. సీజనల్‌గా ఇప్పటికే రెగ్యులర్‌గా ఫీవర్సర్వేను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సమీక్షించారు. గ్రామస్థాయిలో ర్యాపిడ్ కిట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సెకండ్ వేవ్ సమయంలోనే ముందస్తు చర్యలను ఏపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ చర్యలతో రాష్డ్ర వ్యాప్తంగా 40 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. రోజుకి 60 వేలకి పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి ఏపీ చేరుకుంది. మరోసారి ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్, పనితీరు, మందులు సమీక్షించుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కోవిడ్ విషయంతో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్డ్రాలకి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుదాన్ష్ పంత్ సోమవారం లేఖ రాశారు. కేరళలో వెలుగుజూసిన కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ జెఎన్1పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న(సోమవారం) ఒక్కరోజే కోవిడ్‌తో దేశవ్యాప్తంగా ఐదుగురు మృతి చెందారు. చదవండి: 8 వేల టన్నుల కందిపప్పు సిద్ధం -
కోవిడ్ కేసులు పైపైకి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీచేసింది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల, కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్1 (బీఏ 2.86.1.1) వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం సోమవారం ముందస్తు చర్యలకు దిగింది. ‘‘ కోవిడ్ కేసుల్లో ఉధృతి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. భారత వాతావరణాన్ని తట్టుకుని వేరియంట్లు విజృంభించేలోపు ముందస్తు చర్యలతో సమాయత్తం అవుదాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్‡్ష పంత్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఐదుగురు కోవిడ్‌తో కన్నుమూశారు. కొత్తగా వందలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రాలు కోవిడ్ టెస్టులను సిద్ధంగా ఉండాలని సూచించింది. అలాగే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్దంగా ఉంచాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అలాగే, పాజిటివ్ శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని కోరింది. ఇక, జెన్-1 వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ జారీ చేసింది. అయితే, ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు కేరళవాసులే ఉన్నారు. Centre issues advisory to States in view of a recent upsurge in COVID-19 cases and detection of first case of JN.1 variant in India. States urged to maintain a state of constant vigil over the COVID situation. States to report & monitor district-wise SARI and ILI cases on a… pic.twitter.com/NpS1wAQLM8 — ANI (@ANI) December 18, 2023 -
మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి!
భారత్‌లో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, ఆదివారం కొత్తగా మరో 335 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కి పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా తాజాగా ఐదుగురు మృతి చెందారు. కరోనాతో కన్నుమూసినవారిలో నలుగురు కేరళకు చెందినవారు కాగా, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. కరోనా కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 కేసులు కేరళలో నమోదయ్యాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. కోవిడ్ -19 కారణంగా ఇప్పటివరకు 5,33,316 మంది మరణించారు. కోవిడ్-19 మరణాల రేటు 1.19 శాతం. డిసెంబర్ 8న కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కరకుళంలో పాజిటివ్ కేసు కనుగొన్నామని ఐసీఎంఆర్‌డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ మీడియాకు తెలిపారు. కాగా రాష్ట్రంలో బయటపడిన కోవిడ్ సబ్-వేరియంట్ జేఎన్.1 విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. కొత్త వేరియంట్ గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసిన భారతీయ ప్రయాణికురాలిలో నెలరోజుల క్రితమే సబ్-వేరియంట్‌ని గుర్తించారని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇది కూడా చదవండి: ఈ ఏటి మేటి మహిళలు వీరే! -
కేరళలో కోవిడ్ వేరియంట్
పత్తనంతిట్ట: కేరళలో కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసు బయటపడింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి ఆదివారం ప్రకటించారు. అయితే, దీనితో ఎలాంటి ఆందోళనా అవసరం లేదని స్పష్టం చేశారు. ‘కొన్ని నెలల క్రితం సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ సందర్భంగా ఈ సబ్ వేరియంట్‌ను గుర్తించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ కొత్త వేరియెంట్లను గుర్తించారు. తాజాగా, జేఎన్.1 ఉప వేరియెంట్ తిరువనంతపురం కరకుళంలో బయటపడింది. దీనితో కంగారు పడాల్సిన పనిలేదు’అని మంత్రి అన్నారు. అయితే, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్ )సాధారణ పరీక్షల్లో భాగంగా ఒక శాంపిల్‌లో ఈ వేరియంట్‌ను నవంబర్ 18న గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి పేర్కొంది. 79 ఏళ్ల బాధిత మహిళ ఇన్ప్లూయెంజా వంటి తేలికపాటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నారని వివరించింది. -
మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు..మరో రూపంతర వేరియంట్ కలకలం!
కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్లిపోయిందనుకునేలోపు ఎక్కడో ఒక చోట ఏదో కేసు రూపంలో నమోదై నేనింకా ఉన్నానని చెబుతూనే ఉంటోంది. ఇప్పటి వరకు దాని రూపాంతర వేరియంట్ ఒమిక్రాన్ బీఏ 2.86 వంటి కేసులను ఫేస్ చేశాం. మళ్లీ మరో రూపంతరం మార్చుకుని జేఎన్ 1 అనే కరోనా కొత్త వేరియంట్ కేసులతో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన తొలి కేసును ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులనే చైనాలో కూడా గుర్తించారు.ఇప్పుడూ ఆ తరహాలోనే తొలి కేసు భారత్‌లో కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది. ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్‌వేరియంట్ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2.86 వంశానికి చెందినది. దీనిని ‘పిరోలా’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, జేఎన్.1, బీఏ.2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు. స్పైక్ ప్రోటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. జేఎన్.1 లక్షణాలు సీడీసీ తెలిపిన ప్రకారం కరోనాలోని ఈ కొత్త సబ్‌వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో, దాని లక్షణాలు కోవిడ్-19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చంటున్నారు. జ్వరం, నిరంతర దగ్గు, త్వరగా అలసిపోవడం, జలుబు, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి జేఎన్.1కి సంబంధించి ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. సీడీసీ అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండటాన్ని గమనిస్తే, ఇది మన రోగనిరోధక వ్యవస్థ నుండి సులభంగా తప్పించుకోగలదని అంటున్నారు. ఇతర కరోనా వేరియంట్ల కంటే జేఎన్.1 ప్రమాదకరమా కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని సీడీసీ చెబుతోంది. (చదవండి: ఫ్లూ జ్వరంలా ఉందని తేలిగ్గా తీసుకుంది..కట్ చేస్తే అంతలోనే..) -
దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఈ వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజల ఆందోళనను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను తొలుత లక్సెంబర్గ్‌లో గుర్తించారు. ఆ తర్వాత జేఎన్.1 కేసులు యూకే, ఐస్లాండ్, ఫ్రాన్స్, అమెరికాలో కూడా వెలుగు చూశాయి. తాజాగా ఈ సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసు భారతదేశంలోనూ వెలుగు చూసింది. తాజాగా జేఎన్.1 కేసు కేరళలో నిర్ధారితమయ్యింది. దీంతో కేరళ వైద్యశాఖలో మరోమారు ఆందోళనలు కమ్ముకున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్‌వేరియంట్ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2.86 వంశానికి చెందినది. దీనిని ‘పిరోలా’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, జేఎన్.1, బీఏ.2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు. స్పైక్ ప్రోటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. జేఎన్.1 లక్షణాలు సీడీసీ తెలిపిన ప్రకారం కరోనాలోని ఈ కొత్త సబ్‌వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో, దాని లక్షణాలు కోవిడ్-19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చంటున్నారు. జ్వరం, నిరంతర దగ్గు త్వరగా అలసిపోవడం, జలుబు, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి జేఎన్.1కి సంబంధించి ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. సీడీసీ అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండటాన్ని గమనిస్తే, ఇది మన రోగనిరోధక వ్యవస్థ నుండి సులభంగా తప్పించుకోగలదని అంటున్నారు. ఇతర కరోనా వేరియంట్ల కంటే జేఎన్.1 ప్రమాదకరమా కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని సీడీసీ చెబుతోంది. ఇది కూడా చదవండి: శిశువును ఈడ్చుకుపోయిన సుడిగాలి.. తరువాత? -
పాడ్‌కాస్ట్‌కు మరింతగా పెరుగుతున్న ఆదరణ!
వీడియోలను విరివిగా చూడటం అనేది కోవిడ్ కాలం తర్వాత వేగంగా పెరిగింది. ఇంట్లోనే ఉండాల్సిన నాటి సమయంలో వినోదం కోసం వీడియోలను చూస్తూ టైమ్‌పాస్ చేశారు. వీడియోలపై ప్రేక్షకులకు పెరుగుతున్న క్రేజ్‌ను గమనించిన బడా టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోకి ప్రవేశించాయి. ఇప్పుడు ఓటీటీలకు ప్రత్యామ్నాయంగా పాడ్కాస్ట్ల ట్రెండ్ మరింతగా పెరుగుతోంది. పాడ్‌కాస్ట్..అంటే మోడ్రన్ రేడియో.. విద్య, వినోదం, వార్తలు, మత ప్రసంగాలు, నవలలు, మతపరమైన పుస్తకాలు, సాహిత్యం... ఇలా సమస్తం ఇప్పుడు ఆడియో రూపంలో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. యువత, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులలో పాడ్కాస్ట్పై విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. భారీ కోచింగ్ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలలు చదువును ఎలా సులభతరం చేయాలనే దానిపై దృష్టి సారిస్తున్నాయి. కోవిడ్ కాలంలో ఆన్లైన్ తరగతులు విరివిగా నిర్వహించేవారు. అయితే ఇప్పుడు పెద్దపెద్ద విద్యా కేంద్రాలు సిలబస్‌ను ఆడియో రూపంలో మార్చడానికి, విద్యార్థులకు సరళమైన భాషలో పాఠాలను బోధించేందుకు కృషి చేస్తున్నాయి. ఆడియో బుక్కు సంబంధించిన మెటీరియల్‌ను వివిధ సబ్జెక్టుల నిపుణులు సరళమైన భాషలో సిద్ధం చేస్తున్నారు. వాటిని నిపుణుల సహకారంతో ఆడియో బుక్‌గా మార్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. మొబైల్లోని విద్యాసంబంధిత పాడ్‌కాస్ట్‌ను ఆన్ చేసి, చెవుల్లో ఇయర్ఫోన్లు పెట్టుకుని విద్యార్థులు సులభంగా వాటిని వినవచ్చు. అర్థం కాని సందర్భంలో మరోమారు వినేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. వినోదం కోసం ఇప్పుడు స్టోరీ పాడ్‌కాస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వివిధ రకాల కథలను వినేందుకు అవకాశం ఏర్పడుతోంది. క్రైమ్, హర్రర్, కామెడీ ఇలా విభిన్న తరహాలలోని కథలు మనం వినవచ్చు. సెలబ్రిటీ వాయిస్‌లలో రికార్డ్ చేసిన పాడ్‌కాస్ట్‌లు, ఆడియో పుస్తకాలు ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రేరణాత్మక ప్రసంగాలు మొదలుకొని మతపరమైన ప్రసంగాల వరకు సమస్తం పాడ్‌కాస్ట్ రూపంలో మన ముందుకు వచ్చాయి. వివిధ పాడ్‌కాస్ట్ యాప్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. పలువురు మోటివేషనల్ స్పీకర్లు తమ పాడ్‌కాస్ట్‌లను విడుదల చేస్తున్నారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం, స్థానిక వార్తలను అందించే పలు పాడ్‌కాస్ట్‌లు ఆదరణ పొందుతున్నాయి. న్యూస్ యాప్‌లలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రత్యేక పాడ్‌కాస్ట్ బులెటిన్లను చాలామంది క్రమం తప్పక వింటున్నారు. ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లలో షేర్ ట్రేడింగ్ మొదలుకొని ఉద్యోగంలో విజయం వరకు అనేక రకాల సమాచారం విశేష ఆదరణ పొందుతోంది. ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే.. -
సరిహద్దు దేశాల నుంచి ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: భూ సంబంధ సరిహద్దు దేశాల ద్వారా 2020 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ వరకూ రూ. లక్ష కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనలు నమోదయ్యాయి. వీటిలో 50 శాతానికి ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర లభించింది. మిగిలిన సగం ప్రతిపాదనల్లో పెండింగ్ లేదా ఉపసంహరణ లేదా తిరస్కరణకు గురై ఉండవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా భూ సరిహద్దు దేశాల నుంచి లభించే ఎఫ్‌డీఐలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం 2020 ఏప్రిల్‌లో పత్రికా ప్రకటన విడుదల చేసింది. తద్వారా దేశీ కంపెనీల టేకోవర్ అవకాశాలకు చెక్ పెట్టింది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్లతో దేశానికి భూ సంబంధ సరిహద్దులున్న సంగతి తెలిసిందే. వెరసి ఈ దేశాల నుంచి తరలివచ్చే ఎఫ్‌డీఐల ద్వారా దేశీయంగా ఏ రంగంలోనైనా పెట్టుబడులు చేపట్టేందుకు అనుమతులు తప్పనిసరిగా మారాయి. ఈ నిబంధనల తదుపరి రూ. లక్ష కోట్ల ప్రతిపాదనలురాగా.. 50 శాతం పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. భారీ మెషీనరీ తయారీ, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ట్రేడింగ్, ఈకామర్స్, తేలికపాటి ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలలో అత్యధిక ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు నమోదయ్యాయి. సమీక్షా కాలంలో చైనా నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐ ఈక్విటీ ప్రతిపాదనలురాగా.. నేపాల్ నుంచి 4.5 మిలియన్ డాలర్లు, మయన్మార్ నుంచి 9 మిలియన్ డాలర్లు చొప్పున లభించాయి. -
దేశంలో కొత్తగా 88 కరోనా కేసులు.. 400 మందికి చికిత్స!
గతంలో కరోనా వైరస్ విజృంభణతో దేశం అతలాకుతలమైపోయింది. లక్షల మంది మృత్యువాత పడ్డారు. వ్యాక్సినేషన్ తర్వాత కొంత ఉపశమనం లభించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ మహమ్మారి ఇంకా మన మధ్య నుంచి పోలేదు. భారత్‌లో కొత్తగా 88 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 396 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,33,300. కరోనా సోకిన వారి సంఖ్య 4,50,02,103. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,68,407కు పెరిగింది. దేశంలో కరోనా నుండి కోలుకున్నవారి శాతం 98.81 కాగా, మరణాల రేటు 1.19 శాతం. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.67 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్లు అందించారు. కాగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ)లో కరోనా పాజిటివ్‌తో ఒక మహిళ మృతి చెందింది. ఇది కూడా చదవండి: భోపాల్ విషాదానికి 39 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది? -
Hyderabad: మళ్లీ కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. మంగళవారం రాష్ట్రంలో 415 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో హైదరాబాద్‌లో ఒకరికి వైరస్ సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. ఈనెల 25న కూడా నగరంలో ఒక కేసు నమోదైందని తెలిపారు. ప్రస్తుతం నలుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. దీంతో కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.44 లక్షలకు చేరింది. అందులో 8.40 లక్షల మంది రికవరీ అయ్యారు. చలికాలం కావడం, ఎన్నికల్లో జనం గుంపులుగా ఉండటం, ఫ్లూ జ్వరాలు వంటి తదితర కారణాలతో కరోనా కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. అయితే అది ప్రమాదకరంగా లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. చదవండి: చైనాలో నిమోనియా కలకలంపై కేంద్రం అప్రమత్తం -
చైనాలో కొత్తవైరస్ టెన్షన్.. ఆస్పత్రుల్లో పిల్లలు (ఫొటోలు)
-
మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..
కరోనా మహమ్మారి సృష్టించిన విలయం గురించి తెలిసిందే. ఆ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకోస్తోంది ప్రజల్లో. అలాంటిది మళ్లీ కరోనా రీపిట్ అంటేనే బెంబేలెత్తిపోతున్నారు జనాలు. అందులో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కరోన పుట్టినిల్లు అయినా చైనా సంగతి చెప్పనక్కర్లేదు. ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్న దేశం అది. పైగా చాలా ఏళ్ల పాటు కరోనా మహమ్మారి ఆ దేశాన్ని ఓ పట్టాన వదల్లేదు. కానీ ఇప్పుడూ తాజాగా మళ్లీ కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నట్లు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. సాక్షాత్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులే విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేగాక ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు కూడా నివేదించారు. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లాంటి వైరల్ వ్యాధి ప్రభలంగా ఉంది. ఈ వ్యాధి బారిన అధికంగా చిన్నారులే పడుతున్నట్లు సమాచారం. అక్కడ ఆస్పత్రులన్నీ ఈ అనారోగ్యం బారిన పడిన పిల్లలతోనే నిండిపోయాయని చెబుతున్నారు. పిల్లలంతా అంతుచిక్కని న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణ ఔట్ పేషంట్ క్లినిక్‌లు లేవని జబ్బు పడిన పిల్లలతోనే ఆస్ప్రుత్రులన్ని కిక్కిరిసి ఉన్నాయని చెబుతున్నారు. కరోనా ఆంక్షాలను తొలగించాక దేశంలో శ్వాసకోశ వ్యాధులు అధికమైనట్లు డబ్ల్యూహెచ్ఓకి వెల్లడించారు. ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రం కాకుండా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోమని డబ్ల్యూహెచ్ఓ చైనా అధికారులను కోరింది. కోవిడ్-19 రూపాంతరం సార్క్ కోవిడ్-2.. ఇన్ఫ్లుఎంజా, మైక్రోప్లాస్మా న్యుమోనియా వంటి వ్యాధులకు దారితీస్తున్నట్లు కరోనా మహమ్మారి ప్రారంభంలోనే డబ్ల్యూహచ్ఓ హెచ్చరించింది. ఇప్పుడూ చైనా పిల్లల్లో అలాంటి వ్యాధుల సంక్రమణే ఎక్కువగా ఉండటంతో చైనా అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) ఆ వ్యాధుల పరిస్థితి, తీవ్రతకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదించమని చైనా అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా ఉత్తర చైనాలో గత మూడు ఏళ్లలో సరిగ్గా ఇదే టైంలో సుమారు అక్టోబర్ మధ్య కాలంలో ఈ ఇన్ఫ్లుఎంజా వంటి వైరల్ అనారోగ్యాలు అధికమైనట్లు డబ్బ్యూహెచ్‌వో పేర్కొంది. ఇలాంటి అనారోగ్యం బారిన పడిన వారిని దూరంగా ఉంచడం, టీకాలు వేయించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మాస్క్‌లు వంటివి ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని చైనా ప్రజలకు సూచించింది డబ్ల్యూహెచ్ఓ. భారత్‌లోనూ పెరుగుతున్న అంతు చిక్కని జ్వరాలు.. తమిళనాడులోకి కోయంబత్తూరులో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అక్కడ జ్వరానికి సంబంధించిన కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో అధికారులు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్లు అధికమైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వైరల్ ఫీవర్లు బారిన పిల్లలు, పెద్దలు పడటమే గాక అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో కోవిడ్ మాదిరిగానే జాగ్రత్తలు పాటించమని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ఉద్దానంలోని మరణాలకు గల కారణాన్ని కనిపెట్టిన పరిశోధకులు! చాలా మరణాలు..) -
కోవిడ్ కొత్త వ్యాక్సిన్ ఆ క్యాన్సర్‌ని రానివ్వదు! అధ్యయనంలో వెల్లడి
కోవిడ్ మహమ్మారి ప్రజలను ఎంతలా వణికించిందో తెలిసిందే. దీన్ని నుంచి సురక్షితంగా బటపడేందుకు బయోఎన్‌టిక్ కొత్త ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆ క్యాన్సర్ మహమ్మారిని రాకుండా కూడా నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో కనుగొన్నారు. కరోనా కోసం వ్యాక్సిన్ వేసుకున్నట్లే క్యాన్సర్ వ్యాక్సిన్లు వేసుకొవచ్చేనే ఆలోచనకు పురిగొల్పింది. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా లేదా క్యాన్సర్ అటాక్ అయ్యే దశలో ఉన్న వాళ్ల పాలిట ఈ వ్యాక్సిన్ వరం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఇది ఏ రకమైన క్యాన్సర్‌ని రాకుండా కాపాడుతుంది? అధ్యయనంలో కనుగొన్న సరికొత్త విషయలేంటీ?.. కోవిడ్‌కి సంబంధించిన ఎంఆర్ఎన్ వ్యాక్సిన్లపై క్లినకల్ ట్రయల్స్ నిర్వహించగా ఈ సరికొత్త విషయం వెల్లడైంది. ఇది క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు క్యాన్సర్ ఇమ్యునోథెరపీకి చెందిన డేవిడ్, రూబెన్‌స్టెయిన్ సెంటర్ ఫర్ ఫ్యాంక్రియాటిక్ క్యాన్సర్ రీసెర్చ్‌కు సంబంధించిన శాస్త్రవేత్త వినోద్ బాలచంద్రన్ల బృందం ఈ విషయాలను వెల్లడించింది. ఇంతకీ ప్యాక్రియాటిక్ క్ అంటే.. జీర్ణవ్యవస్థలో ఒక భాగం. ఇది పొత్తికడుపులో ఉండే శరీర అవయవం. ప్యాంక్రియాస్ నిర్వహించే ముఖ్యమైన విధులేంటంటే.. జీర్ణక్రియను సులభతరం చేసే ఎక్సోక్రైన్ ఫంక్షన్, రరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఎండోక్రైన్ పనితీరు. అయితే ఈ అవయవం వెలుపల అసాధారణ కణుతులు వస్తే దాన్ని ప్యాక్రియాటిక క్యాన్సర్ అంటారు. దీని వల్ల ఆహారం అరగదు. నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించటం కష్టం. దీనఇన తొలి దశలో గుర్తిస్తేనే రోగికి చికిత్స అందించి ప్రాణాలను కాపడగలం. అలాంటి ప్రమాకరమైన ప్యాక్రియాటిక్ క్యాన్సర్‌ని ఈ వ్యాక్సిన్ రాకుండా ఆపగలదని చెబుదున్నారు వైద్యులు. ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్ కణాలను గుర్తించేలా హెచ్చారిస్తాయి. తత్ఫలితంగా ప్యాంక్రియాటిక్ కణితుల్లో కనిపించే నియాయాంటిజన్ ప్రోటీన్లు అలారం గంటలుగా పనిచేసేలా చేసి రోగనిరోధక వ్యవస్థను సమీకరిస్తుంది. ఈ వ్యాక్సిన్‌లో ఉండే టీ కణాలు నిర్దిష్ట రోగ నిరోదక కణాల ఉత్పత్తిని ప్రేరిపించే లక్ష్యంతో పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. దీంతో రోగుల్లో ఈ క్యాన్సర్ కణితిని సులభంగా గుర్తించి శస్త్ర చికిత్స ద్వారా తొలగించగలుగుతారు వైద్యులు. అంతేగాదు మళ్లీ ఈ క్యాన్సర్ పునరావృత్తం గాకుండా చేస్తుంది డాక్టర్ బాల చంద్రన్ అన్నారు. దాదాపు ఏడేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగులలో ఎలా పనిచేస్తుందనే ఆలోచనను రేకెత్తించిందని ఆ దిశగా మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని అన్నారు వైద్యులు. ఈ టీకాలు సంప్రదాయ టీకాల వలె కాకుండా జన్యు సంకేత విభాగాన్ని ప్రేరేపించి నిర్దిష్ట ప్రోటీన్ ఉత్పతి చేసేలా నిర్దేశిస్తుంది. తద్వారా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. అందువల్ల ఈ వ్యాక్సిన్ ప్యాక్రియాంటిక్ క్యాన్సర్‌ని రాకుండా నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పరిశోధనలు ప్యాంక్రియాంటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు జీవితంపై సరికొత్త ఆశను అందిస్తాయని అన్నారు వైద్యులు. దాదాపు 20 మంది రోగులపై చేసిన క్లినికల్ ప్రయోగాల్లో ఈ చక్కటి ఫలితాలు కనిపించాయన్నారు. ఒకరకంగా పరిశోధనలు వ్యాక్సిన్ల ఆవశక్యత తోపాటు ఇతర క్యాన్సర్లను నివారించేలా మరిన్ని వ్యాక్సిన్లు అభివృద్ధి చేసే ఆలోచనకు నాంది పలికిందన్నారు. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సవాలుకు చెక్‌పెట్టేలా చేసి రోగుల జీవితంలో కొత్త ఆశాజ్యోతిని వెలిగించిందన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: సెల్యులర్ రీప్రోగ్రామింగ్కి ఆ విటమిన్ కీలకం: పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
కొత్త రూపంలో కోవిడ్-19.. భారత్‌కూ తప్పని ముప్పు?
కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను తీసుకుంటోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఉత్పరివర్తనమై బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూకేలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. రుచి లేదా వాసన కోల్పోవడం కోవిడ్-19 ప్రధాన లక్షణం అయితే, పిరోలా లేదా బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి. పిరోలా సోకినప్పుడు ముందుగా దాని ప్రభావం ముఖంపైనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయని, ఈ వ్యాధి శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్ఎస్ఏ) తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త వైరస్‌కు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కాగా ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు టీకాల ప్రచారాన్ని యూకేహెచ్ఎస్ఏ ముమ్మరం చేసింది. వృద్ధులు, పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగినవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే ఈ డోస్ తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలో ఉండేటప్పుడు కూడా మాస్క్ ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు. కాగా బీఏ.2.86 కేసులు తొలిసారి గత జూలైలో కనిపించాయి. ఇది కూడా చూడండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు! -
అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా: ఈ లక్షణాలుంటే..!
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అమెరికాలో మరోసారి వేగంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ కొత్త వేరియంట్ హెచ్వీ.1 అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం ఈ వేరియంట్ కారణమని తేల్చింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5 అకా ఎరిస్ వేరియంట్ల కంటే ఈ హెచ్వీ.1 వేరియంట్ ఎక్కువ డామినెంట్ వేరియంట్ అని, ఇటీవల నమోదైన కేసుల్లో నాలుగో వంతు కంటే మించి హెచ్వీ.1 వేరియంట్ కేసులేనని గుర్తించారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా గణాంకాల ప్రకారం జూలైలో 0.5 శాతంగా ఉన్న ఈ వేరియంట్ కేసులు సెప్టెంబర్ నాటికి అవి 12.5 శాతానికి పెరిగాయి. దీన్ని ఒమిక్రాన్ గ్రాండ్ చైల్డ్‌గా వాండర్బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ డా. విలియం షాఫ్నర్ పేర్కొన్నారు. అలాగే పిలోరా జేఎన్.1 వేరియంట్‌ను ఐస్లాండ్, పోర్చుగల్, స్పెయిన్‌తో సహా 12 దేశాలలో కనుగొన్నారు. కోవిడ్ టంగ్ ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, చలి లాంటివి కోవిడ్‌లో కీలక లక్షణాలు. అయితే, ఈ కొత్త వేరియంట్ సోకిన వారి నోటిలో కోవిడ్ టంగ్ లక్షణం కనిపిస్తోందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. దీని ప్రకారం ఒమిక్రాన్ హెచ్వీ.1, పిరోలా జాతి జేఎన్.1 వేరియంట్స్ బారిన పడిన వారిలో నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా ఉంటోంది. కొంతమంది రోగుల నాలుకపై సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతోంది. దీంతోపాటు నాలుక బాగా ఎర్రగా మారడం, మంట, రుచి కోల్పోవడం, కొద్దిగా తిమ్మిరి కనిపించాయట. కొన్నిసార్లు నాలుకపై గడ్డలు , అల్సర్లు ఏర్పడినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయిదే మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం వైరస్‌తో పోరాడుతున్నదానికి సంకేతం కావచ్చని, కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత వాపు దానంతట అదే తగ్గిపోతుందని తెలిపారు. మరికొంతమందికి మందులు వాడాల్సి ఉంటుందన్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుణిని సంప్రదించాలని చెప్పారు. ఈ వేరియంట్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు హెచ్వీ.1 లాంటి వేరియంట్ కొత్త వేరియంట్ల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఎన్బీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది.ఎక్కువ మ్యుటేషన్ అయ్యే వేరియంట్లు తక్కువ హాని కలిగిస్తాయని వీరు పేర్కొన్నారు. -
పలుకే బంగారమాయెనా!!..కోవిడ్ తర్వాతే అధికం..
వయసు పలికే పదాలు మొదటి సంవత్సరం దాదాపు 10 పదాలు రెండో సంవత్సరం 50 నుంచి 60 పదాలు మూడో సంవత్సరం కనీసం 150 పదాలు.. ఆ పైన కెనడాకు చెందిన ఓ సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. 6 నెలల నుంచి రెండేళ్లలోపున్న 900 మంది చిన్నారులను పరీక్షించింది. 20 శాతం మంది చిన్నారులు ప్రతిరోజూ సగటున 28 నిమిషాల సేపు స్మార్ట్ఫోన్లను చూస్తున్నట్లు తేలింది. 30 నిమిషాల డిజిటల్ స్క్రీనింగ్ వల్ల చిన్నారులకు ‘స్పీచ్ డిలే’ రిస్క్ 49 శాతం పెరుగుతుందని వెల్లడయ్యింది. ఏం చేయాలి? ముందుగా చిన్నారుల చెంతకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు దరిచేరకుండా చూసుకోవాలి.పిల్లలకు అసలు స్మార్ట్ఫోన్లు ఇవ్వవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచించింది. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. వారి నవ్వులకు, అరుపులకు ప్రతిస్పందించాలి. చిన్నారులను ముఖానికి దగ్గరగా తీసుకొని మాటలో, పాటలో, కథలో చెబుతూ..మీకు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలు తాగించేటప్పుడు, ఆహారం తినిపించేటప్పుడు.. చేసే పని గురించి వారికి వివరిస్తూ ఉండాలి. ఎలాంటి శబ్ధాలు చేస్తుంటాయి? తదితరాలన్నీ అడుగుతూ, అనుకరిస్తుండాలి. పిల్లలు ఏ వస్తువు చూస్తుంటే.. దాని గురించి వివరిస్తుండాలి. తద్వారా పిల్లలు కూడా మిమ్మల్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తూ.. క్రమంగా మాట్లాడుతారు. విజయవాడకు చెందిన రాజేశ్, ఉష దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడిని బుజ్జగించేందుకు..పుట్టిన ఏడాది గడిచేసరికల్లా స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు చూపించడం మొదలుపెట్టారు. ఏడుపు ఆపాలన్నా.. భోజనం చేయాలన్నా.. ఫోన్లోని వీడియోలు చూడాల్సిందే. ఇలా.. ఆ చిన్నారి క్రమంగా స్మార్ట్‌ఫోన్‌కు బానిస అవ్వగా.. ఆ తల్లిదండ్రులు నాలుగేళ్లయినా ‘అమ్మా, నాన్న’ అనే పిలుపులకు నోచుకోలేక పోయారు. చివరకు స్పీచ్ థెరపిస్ట్‌లను ఆశ్రయించి.. పిల్లలకు చికిత్స అందించాల్సి వచి్చంది. – గుండ్ర వెంకటేశ్, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒకప్పుడు చిన్న పిల్లలు ఏడిస్తే.. వారిని లాలించేందుకు తల్లిదండ్రులు జోలపాటలు పాడేవాళ్లు. ఎత్తుకొని ఆరుబయట తిప్పుతూ చందమామను చూపించి కబుర్లు చెప్పేవాళ్లు. అమ్మ, నాన్న.. అనే పదాలను చిన్నారుల నోటి వెంట పలికించడానికి ప్రయత్నించేవాళ్లు. వారు ఆ పదాలను పలకగానే విని మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు సిరులొలికించే ‘చిన్ని’ నవ్వులు.. చిన్నబోతున్నాయి. చీకటి ఎరుగని ‘బాబు’ కన్నులు.. క్రమంగా మసకబారిపోతున్నాయి. చిట్టిపొట్టి పలుకుల మాటలు మాయమైపోతున్నాయి. మొత్తంగా స్మార్ట్ఫోన్లలో చిక్కుకొని ‘బాల్యం’ విలవిల్లాడిపోతోంది. చిన్నారుల నోటి వెంట వచ్చే ‘అమ్మ, నాన్న..’ అనే పిలుపులతో కొందరు తల్లిదండ్రులు పులకించిపోతుంటే.. మరికొందరు తల్లిదండ్రులు ఆ ‘పలుకుల’ కోసం నెలలు, సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. పునాది పటిష్టంగా ఉంటేనే.. ప్రతి ఒక్కరి జీవితంలో ‘మాట్లాడటం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్నారులు ఎదుగుతున్నకొద్దీ మెల్లగా మాటలు నేర్చుకుంటూ ఉంటారు. మనం ఎలా మాట్లాడిస్తే అలా అనుకరిస్తూ ముద్దుముద్దుగా ఆ పదాలను పలుకుతుంటారు. ముఖ్యంగా చిన్నారి పుట్టిన మొదటి రెండేళ్లు లాంగ్వేజ్ డెవలప్మెంట్కు చాలా కీలకం. అప్పుడు సరైన పునాది పడితేనే.. మూడో ఏడాదికల్లా మంచిగా మాట్లాడగలుగుతారు. ‘స్మార్ట్’గా చిక్కుకుపోయారు.. సాధారణంగా చిన్నారులు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. మొదటి రెండేళ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. వారు తమ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతూ ఉంటే.. వారి పెదాల కదలికను చూస్తూ అనుకరిస్తుంటారు. కానీ చుట్టుపక్కల అలాంటి వాతావరణం లేకపోతే వారిలో బుద్ధి వికాసం లోపిస్తుంది. కొందరు తల్లిదండ్రులు వారి పనుల ఒత్తిడి వల్ల తమకు తెలియకుండానే పిల్లలకు సెల్ఫోన్లను అలవాటు చేస్తున్నారు. పిల్లల ఏడుపును ఆపించడానికో, భోజనం తినిపించడానికో, నిద్రపుచ్చేందుకో ఫోన్లలో ఆ సమయానికి ఏది దొరికితే ఆ వీడియో చూపిస్తున్నారు. క్రమంగా అది అలవాటుగా మారి.. పిల్లలు బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోతున్నారు. వాటిలోనే లీనమైపోయి.. తల్లిదండ్రుల పిలుపులకు సరిగ్గా స్పందించలేకపోతున్నారు. తమ భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయలేకపోతున్నారు. మరికొందరైతే గతంలో తాము నేర్చుకున్న పదాలను కూడా మర్చిపోయారు. ఫోన్లలో చూపించే కార్టూన్లు, గేమ్స్ వల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందులోని శబ్ధాలు, మాటలను వింటారు. కానీ.. వాటికి, నిజజీవితానికి చాలా తేడా ఉండటంతో ఆ శబ్ధాలు, మాటలను అనుకరించలేకపోతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రుల మాటలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాతే అధికం చిన్నారుల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య కోవిడ్ తర్వాత అధికమైందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగిందని పేర్కొంటున్నారు. లాక్డౌన్లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో అనుబంధాలు పెరగాలి. కానీ, ఆ సమయంలో చుట్టుపక్కలవారికి, బంధువులకు దూరంగా ఉండటం వల్ల అందరూ స్మార్ట్ఫోన్లకు అంకితమైపోయారు. చిన్నారులను లాలించడానికి కూడా ఫోన్లను ఉపయోగించారు. దీనివల్ల 9 నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న కొందరు చిన్నారులు తమ కీలక సమయాన్ని కోల్పోయారు. వేరే పిల్లలతో కలవకపోవడం, తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య అధికమైందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు వారానికి ఐదు కేసులు వస్తే.. కోవిడ్ తర్వాత 20 వరకు కేసులు వస్తున్నాయని పిల్లల వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం చిన్నారులు ఫోన్‌కు అడిక్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నారుల వద్ద ఫోన్ పెట్టేసి.. ఒంటరిగా వదిలేయవద్దు. అలాగే తల్లిదండ్రులు కూడా సెల్‌ఫోన్‌ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత ఎక్కువ సేపు పిల్లలతో గడుపుతూ.. వారి వైపే చూస్తూ కబుర్లు చెప్పాలి. పిల్లలను ఆలోచింపజేసేలా కుటుంబసభ్యులు, వస్తువులు, జంతువుల గురించి వర్ణిస్తూ మాట్లాడాలి. తద్వారా పిల్లలు సులభంగా మాటలు నేర్చుకునే అవకాశం ఉంది. – డాక్టర్ ఇండ్ల విశాల్‌రెడ్డి, మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ -
మెడ్‌టెక్ జోన్లో మెగా ఎక్స్పో సిటీ
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీ... భారత వైద్యరంగంలో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్... ప్రపంచంలోనే మొదటి డేటా సెంటర్ ఏర్పాటు.. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన విశాఖపట్నంలోని ఏపీ మెడ్ టెక్ జోన్ మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఇండియా ఎక్స్పో సిటీ పేరుతో భారీ ఎగ్జిబిషన్ సెంటర్‌ను నిర్మించింది. కేవలం 150 రోజుల్లోనే లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఎగ్జిబిషన్ సెంటర్‌ను ఏర్పాటుచేసి రికార్డు సృష్టించింది. ఈ ఇండియా ఎక్స్పో సిటీని శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ తొలి రోజే 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ప్రారంభం కావడం విశేషం. ఇవీ ప్రత్యేకతలు... మెడ్‌టెక్ జోన్‌లోని ప్రగతి మైదాన్‌లో 1,03,951 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇండియా ఎక్స్పో సిటీ నిర్మాణ పనులు జూన్ 14న ప్రారంభించారు. శుక్రవారం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం 5.40లక్షల పని గంటల్లో నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఎక్స్పో సిటీ నిర్మాణం కోసం 3,577 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 718 మెట్రిక్ టన్నుల స్టీల్ వినియోగించారు. రోజుకు 10వేల మంది సందర్శించేలా ఎక్స్పో సిటీని నిర్మించారు. లోపల భాగంలో ఒక్క కోలమ్ కూడా నిర్మించకుండా దీనిని పూర్తి చేయడం విశేషం. ఎక్స్పో సిటీలో నాలుగు కాన్ఫరెన్స్ హాల్స్, బోర్డ్‌రూమ్‌లు ఉన్నాయి. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిస్ప్లే షాప్స్ ఏర్పాటుచేసుకోవచ్చు. తొలి రోజే అంతర్జాతీయ సదస్సు ఇండియా ఎక్స్పో సిటీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజే అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్(ఏఏఎంఐ), గ్లోబల్ క్లినికల్ ఇంజినీరింగ్ అలయెన్స్(జీసీఈఏ) ఆధ్వర్యంలో 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ (ఐసీఈహెచ్‌టీఎంసీ) ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న సదస్సులో కోవిడ్–19 అనంతర పరిణామాలతోపాటు వైద్య పరికరాల వినియోగం, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలు, హెల్త్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికా, చైనా, వెనుజులా, మెక్సికో, స్కాట్లాండ్, బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాంగ్రెస్‌లో భాగంగానే 14 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఫోరం సమావేశం కూడా మెట్‌టెక్ జోన్లో నిర్వహించనున్నట్లు ఏఏఎంఐ చీఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాబర్ట్ బరోస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాలకు చెందిన జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. -
నిర్లక్ష్యం.. నిండు ప్రాణం ఖరీదు.. టాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల టాలీవుడ్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలతో పాటు ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చిన్న తప్పుతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం వెంకీ కుడుముల చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. (ఇది చదవండి: రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) ట్వీట్లో వెంకీ రాస్తూ..' కొన్ని వారాలుగా మా కజిన్ జ్వరంతో బాధపడుతున్నారు. అది సాధారణ జ్వరమేనని అనుకున్నారు. దీంతో టైముకి వైద్యుని వద్దకు వెళ్లలేదు. అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్‌కు (మనిషిలోని రోగనిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయటం) దారి తీసింది. సరైన సమయంలో చికిత్స తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. ఆలస్యం చేయడం వల్లే జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యం మా కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది. కొవిడ్ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకుంటున్నారు. దయచేసి అలా చేయొద్దు. జ్వరం వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలే మన ప్రాణాలు కాపాడతాయి.'అని రాసుకొచ్చారు. కాగా.. వెంకీ ప్రస్తుతం నితిన్‌తో ఇటీవల సినిమాను ప్రకటించారు. భీష్మ’ తర్వాత నితిన్ - రష్మిక కాంబోలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?) #NotJustAFever 💔🙏🏻 pic.twitter.com/kuxuXr4V5L — Venky Kudumula (@VenkyKudumula) November 7, 2023 -
కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు
కోవిడ్‌కి గురైనవారు చాలామంది గుండె సంబంధిత సమస్యల బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా గుండెపై ప్రభావం చూపిస్తుందా?. కరోనా వచ్చినవారంతా జాగ్రత్తగా ఉండాల్సిదేనా?. ఆరోగ్య మంత్రి సైతం కరోనా ఇన్ఫెక్షన్కి గురైన అలాంటివి చేయొద్దంటూ హెచ్చరించడంతో ఒక్కసారిగా మళ్లీ కరోనా గుబులు పోలేదా అని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఈనేపథ్యంలోనే ఈ కథనం!. వివరాల్లోకెళ్తే..ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కరోనా బారిన పడినవారు గుండెపోటు రాకుండా ఉండాలంటే అతిగా శ్రమించటం, భారీగా వ్యాయమాలు వంటివి చేయటం మానుకోవాలని సూచించారు. ఇటీవల గుజరాత్ నవరాత్రి వేడుకల సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ సుమారు 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. పైగా మృతుల్లో 13 ఏళ్ల బాలుడు అతి పిన్న వయస్కుడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యమంత్రి ఈ విధంగా ప్రజలకు సూచనలిచ్చారు. దీంతో ఒక్కసారి కరోనా భయాలు ప్రజల్లో వెల్లువెత్తాయి. అంతేగాదు మాండవియా ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం తీవ్ర కరోనాతో బాధపడినవారు గుండెపోటుకి గురికాకుడదంటే కనీసం ఒక ఏడాది లేదా రెండేళ్ల పాటు అతిగా వ్యాయామాలు, వంటి జోలికి పోకూడదని చెబుతోందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. #WATCH | Bhavnagar, Gujarat: On heart attack cases during the Garba festival, Union Health Minister Mansukh Mandaviya says, "ICMR has done a detailed study recently. The study says that those who have had severe covid and enough amount of time has not passed, should avoid… pic.twitter.com/qswGbAHevV — ANI (@ANI) October 30, 2023 కరోనా వల్ల గుండె సమస్యలు వస్తాయా..? కరోనా అనేది శ్వాసకోస లేదా ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించినదే అయినప్పటికీ గుండెపై ప్రభావం చూపుతుంది. గుండె కణాజాలనికి సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో మొదలవుతుంది సమస్య. ఈ వైరస్ ఊపిరితిత్తులలోని గాలి సంచులను ద్రవంతో నింపుతుంది. ఫలితంగా కొద్ది ఆక్సిజన్ మాత్రమే రక్తప్రవాహంలో ఉంటుంది. దీంతో శరీరంలోకి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల గుండె కణాజాలానికి శాశ్వత నష్టం లేదా తాత్కాలిక నష్టం ఏర్పడుతుంది. కొన్ని కేసుల్లో కరోనా వైరస్ నేరుగా గుండె కండరాల కణజాలానికి సోకి దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్లు సిరలు, ధమనులు అంతర్గత ఉపరితలాలను కూడా ప్రభావితం చేస్తాయి. దీంతో రక్తానాళాల్లో వాపు లేదా నష్టం ఏర్పడి రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఫలితం శరీరంలో ఇతర భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా జరగదు. శరీరం ఒత్తిడికి గురవ్వడం వల్ల కూడా.. వైరల్ ఇన్షెక్షన్లు కారణంగా శరీరం ఒత్తిడికి లోనై కాలోకోలమైన్లు అనే రసాయాలను విడుదల చేస్తుంది. ఇది గుండె పనితీరుకు ఆటంక కలిగించి గుండె సమస్యలు ఉత్ఫన్నమయ్యేలా చేస్తుంది. గుండె ఆరోగ్యం ఉండాలంటే.. వ్యాయామాలను అతిగా కాకుండా శరీరానికి తగినంతగా చేయాలి పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి తగినంత కంటి నిండా నిద్రపోవాలి ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి ధుమపానం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ విధమైన ఆరోగ్యకరమైన అలవాట్లు కరోనా వైరస్‌ను జయించేలా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో గుండె సమస్యలను రాకుండా నిరోధించడంలో సహాయ పడుతాయి. (చదవండి: ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!) -
AP: ప్రభుత్వ ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి: కోవిడ్–19తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కారుణ్యం చూపుతోంది. కోవిడ్‌తో 2,917 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందగా.. వారి కుటుంబాల్లో ఒకరికి చొప్పున కారుణ్య నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. గతంలోనే కారుణ్య నియామకాల కోసం 2,744 మంది దరఖాస్తు చేసుకోగా 1,488 మందికి ఉద్యోగాలను కల్పించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మృతి చెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయసు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కోసం 330 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 241 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. వీటిలో ఇప్పటి వరకు జిల్లాల వారీగా 164 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మిగతా 77 మంది అర్హత గల కుటుంబాల్లోని వారికి వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అందరూ ఉద్యోగాల్లో చేరిన నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచాల్సిందిగా సీఎస్ సూచించారు. -
2023 Nobel Prize: కోవిడ్–19 టీకా పరిశోధనలకు నోబెల్
స్టాక్‌హోమ్: కోవిడ్–19 మహమ్మారి నియంత్రణ కోసం ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్) వ్యాక్సిన్ల అభివృద్ధికి తమ పరిశోధనల ద్వారా తోడ్పాటునందించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. హంగేరీకి చెందిన కాటలిన్ కరికో, అమెరికన్ డ్రూ వీజ్‌మన్‌కు ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ ప్రైజ్‌ను స్వీడన్‌లోని నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరిద్దరూ చేసిన నూతన ఆవిష్కరణలు ఎంఆర్ఎన్ఏ టీకాల అభివృద్ధికి దోహదపడ్డాయి. కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్ పరిశోధనలతో రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు ఆమోదం లభించిందని, ఈ వ్యాక్సిన్లు కోట్లాది మంది ప్రాణాలను కాపాడాయని నోబెల్ కమిటీ వెల్లడించింది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పట్ల ఎంఆర్ఎన్ఏ ఎలా ప్రతిస్పందిస్తున్న దానిపై వీరిద్దరి పరిశోధన మన అవగాహనను పూర్తిగా మార్చివేసిందని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గాను ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడానికి సహాయపడే న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు వీరిని నోబెల్‌తో సత్కరించనున్నట్లు తెలియజేసింది. ఇదిలా ఉండగా, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని మంగళవారం, బుధవారం రసాయన శాస్త్రంలో, గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనున్నారు. ఈ నెల 9న అర్థశాస్త్రంలో ఈ బహుమతి గ్రహీత పేరును వెల్లడిస్తారు. విజేతలకు డిసెంబర్ 10న నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. సంకల్పానికి తోడైన కృషి 1997లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పనిచేస్తున్న సమయంలో కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై ఉమ్మడి పరిశోధనలు మొదలుపెట్టారు. వీజ్‌మన్ ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీలలో బోస్టన్ యూనివర్సిటీ నుంచి 1987లో పీహెచ్డీ పట్టా పొందారు. అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లో హెచ్ఐవీ వైరస్‌పై పరిశోధనలు చేశారు. ఆ తరువాతి కాలంలో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వ్యాక్సిన్లపై పరిశోధనలకు శాస్త్రవేత్తల బృందం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కాటలిన్ కరికో ఎంఆర్ఎన్ఏ బయో కెమిస్ట్రీలో నిపుణులు. ఎంఆర్ఎన్ఏను వైద్యానికి ఉపయోగించాలన్న సంకల్పం ఇరువురిలోనూ మెండు. వేర్వేరు ఆర్ఎన్ఏ రకాలపై వీరు పరిశోధనలు చేపట్టగా 2005లో న్యూక్లియోటైడ్ బేసెస్లో మార్పులకు, దు్రష్పభావాలకు మధ్య సంబంధం స్పష్టమైంది. దీని ఆధారంగానే వారు ఆ బేస్‌లను మారిస్తే అప్పటివరకూ ఉన్న పరిమితులు తొలగిపోతాయని ప్రతిపాదించారు. తదుపరి పరిశోధనలతో దాన్ని రుజువు చేశారు. ఎంఆర్ఎన్ఏ బేస్‌లు మార్చారు.. టీకా సిద్ధం చేశారు! 2019లో మొదలై నెలల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్ మహమ్మారి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. తొలినాళ్లలో ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు కావాల్సిన టీకా అంత తొందరగా తయారవుతుందా? తయారయ్యేలోపు ఎన్ని ప్రాణాలు పోవాలో అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది. కానీ.. మానవ సంకల్పం, ఆధునిక టెక్నాలజీల పుణ్యమా అని తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచం పెను విపత్తు నుంచి చివరి క్షణంలో తప్పించుకుంది. అంతేకాదు, ఈ టీకాల్లో ఒక రకం (ఎంఆర్ఎన్ఏ) మనకు అందుబాటులోకి రావడానికి ఈ సంవత్సరం వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీతలైన కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్‌ల పరిశోధనలు కీలకమయ్యాయి! ఎందుకు? ఏమిటి? ఎలా? 30 ఏళ్లుగా పరిశోధనలు టీకాల తయారీకి శాస్త్రవేత్తలు వందేళ్లుగా నాలుగు రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వ్యాధికారక సూక్ష్మజీవిని నిరీ్వర్యం చేసి వాడేది ఒక రకమైతే.. ఆ సూక్ష్మజీవి భాగాన్ని ఉపయోగించుకోవడం ఇంకో పద్ధతి. వీటితోపాటు మరికొన్ని పద్ధతులను కూడా ఉపయోగిస్తారు. కానీ.. సుమారు 30 ఏళ్ల క్రితం శరీర కణాల్లోని అతి సూక్ష్మ భాగమైన ఎంఆర్ఎన్(మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్)ను కూడా వాడుకోవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలైతే జరిగాయి గానీ సాధించిన ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండేవి. కోవిడ్ వ్యాధి ప్రపంచంపై పంజా విసిరిన సందర్భంలో మాత్రం పరిస్థితి వేగంగా మారిపోయింది. వ్యాధి నియంత్రణకు ఎంఆర్ఎన్ఏ టీకా సిద్ధమైంది. ఎన్నో వ్యాధుల నియంత్రణకు ఉపయోగకరం? ఎంఆర్ఎన్ఏ టీకాలనేవి ప్రస్తుతం మనం కోవిడ్ నియంత్రణకు వాడుకున్నాం కానీ.. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ చాలా వ్యాధుల కట్టడికి ఉపయోగపడుతుందని, కొన్నింటికి చికిత్సగానూ పనికొస్తుందని శాస్త్రవేత్తల అంచనా. కోవిడ్ తరువాత జంతువుల నుంచి మనుషులకు వైరస్ సంబంధిత వ్యాధులు సోకే అవకాశాలు పెరిగినట్లు ప్రపంచం గుర్తించింది. అయితే, ఇప్పటికీ గుర్తించని వైరస్ రకాలు చాలా ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో గుర్తు తెలియని వైరస్ ఏదైనా మనిషిపై దాడి చేస్తే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో సులువుగా టీకా తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది. 2000లో ఏర్పాటైన క్యూర్‌వ్యాక్, 2008లో ఏర్పాటైన బయో ఎన్‌టెక్, 2010 ఏర్పాటైన మోడెర్నా కంపెనీలు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలను ముమ్మరం చేశాయి. ఈ మూడు కంపెనీల శాస్త్రవేత్తలు యూనివర్సిటీలతో కలిసి పనిచేయడం ద్వారా ఈ టెక్నాలజీ సాకారమయ్యేలా చేయగలిగారు. జీకా వైరస్ విరుగుడుకు ఇప్పటికే ఎంఆర్ఎన్ఏ వైరస్ ఒకటి అందుబాటులో ఉండగా హెచ్10ఎన్8, హెచ్7ఎన్9 ఇన్ఫ్లుయెంజా వైరస్ల కట్టడికీ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఏమిటీ ఎంఆర్ఎన్ఏ? మన కణాల్లోపల కణ కేంద్రకం.. అందులోపల మైటోకాండ్రియా, ఉండచుట్టుకుని క్రోమోజోములు ఉంటాయని చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. ఈ క్రోమోజోముల మెలికలను విడదీస్తే అది... మెలితిరిగిన నిచ్చెన ఆకారంలోని డీఎన్ఏ అని కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో రెండు పోగులుంటాయి. ఈ డీఎన్ఏలో అక్కడక్కడ కొంత భాగంలో శరీర క్రియలకు అవసరమైన ప్రొటీన్లను తయారు చేసేందుకు కావాల్సిన సమాచారం ఉంటుంది. కొన్ని రసాయన ప్రక్రియల కారణంగా ప్రొటీన్ల తయారీ సమాచారమున్న డీఎన్ఏ భాగాలు పోగు నుంచి విడిపోతుంటాయి. ఇలా విడిపోయిన భాగాన్నే ఎంఆర్ఎన్ఏ అని పిలుస్తారు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ ఎంఆర్‌ఎన్‌ఏలను టీకాలుగా వాడుకునేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలైతే జరుగుతున్నాయి. అయితే దు్రష్పభావాలు కనిపిస్తున్న నేపథ్యంలో వీటిని వాడటం అసాధ్యమైంది. అలాగే ఎంఆర్‌ఎన్‌ఏలు తగినంత మోతాదులో ప్రొటీన్లు ఉత్పత్తి చేయగలిగేవి కాదు. ఈ నేపథ్యంలో కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్‌లు చేసిన పరిశోధనలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఎంఆర్ఎన్ఏ పోగులోని న్యూక్లియోటైడ్ బేసెస్(అడినైన్, థయామీన్, సైటోసైన్, గ్వానైన్ అని నాలుగు బేస్‌లు ఉంటాయి. రెండు పోగుల డీఎన్ఏ మెలితిరిగిన నిచ్చెన మాదిరిగా ఉంటే.. నిచ్చెన మెట్లకు రెండువైపుల ఉండే ఆధారం ఈ బేస్‌లు)మారితే రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించలేదని, తద్వారా ప్రొటీన్ ఉత్పత్తి పెరగడమే కాకుండా దు్రష్పభావాలూ ఉండవని వీరు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. ఈ పరిశోధనలకు మరికొన్ని ఇతర పరిశోధనలూ తోడు కావడం వల్లనే కోవిడ్–19 విరుగుడుకు రికార్డు సమయంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. BREAKING NEWS The 2023 #NobelPrize in Physiology or Medicine has been awarded to Katalin Karikó and Drew Weissman for their discoveries concerning nucleoside base modifications that enabled the development of effective mRNA vaccines against COVID-19. pic.twitter.com/Y62uJDlNMj — The Nobel Prize (@NobelPrize) October 2, 2023 “For the 20 years that we worked together before anybody knew about us or cared it was literally the two of us sitting side by side at a bench and working together. Usually at 3 or 5am we would be emailing each other with new ideas.” - 2023 medicine laureate Drew Weissman on… pic.twitter.com/WF3hNLJbK3 — The Nobel Prize (@NobelPrize) October 2, 2023 ఇది కూడా చదవండి: అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు? – సాక్షి, నేషనల్ డెస్క్ -
Disease X: కరోనాను మించిన వైరస్
కరోనా తాలూకు కల్లోలం నుంచి మనమింకా పూర్తిగా తేరుకొనే లేదు. డిసీజ్ ఎక్స్‌గా పేర్కొంటున్న మరో ప్రాణాంతక వైరస్ అతి త్వరలో ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేయనుందట. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చేస్తున్న హెచ్చరిక ఇది! 2019లో వెలుగు చూసినా కరోనా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కనీసం 70 లక్షల ప్రాణాలు తీసింది. కానీ కొత్త రోగం హీనపక్షం 5 కోట్ల మందిని కబళించవచ్చన్న అంచనాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పైగా డిసీజ్ ఎక్స్ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది. ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కరోనా. ఈ పేరు వింటే చాలు ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ప్రపంచం. ఆధునిక ప్రపంచ చరిత్ర ఒక రకంగా కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైంది. మరి కోవిడ్‌ను మించిన వైరస్ మరోసారి ప్రపంచం మీదికి వచి్చపడితే? కానీ అది అతి త్వరలో నిజమయ్యే ఆస్కారం చాలా ఉందని స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థే అంటోంది! ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న సదరు ప్రాణాంతక వైరస్ మన ఉసురు తీయడం ఖాయమట. తీవ్రతలో కోవిడ్ కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న ఈ పేరు పెట్టని వైరస్ ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం 5 కోట్ల మందిని బలి తీసుకోవడం ఖాయమని సైంటిస్టులను ఉటంకిస్తూ హెచ్చరిస్తోంది. అంత డేంజరస్ కరోనా కూడా నిజానికి మున్ముందు మానవాళిని కబళించబోయే మహా మహమ్మారులకు ట్రెయిలర్ మాత్రమేనని జోస్యం చెబుతోంది...! తెలిసిన వైరస్ నుంచే..? డిసీజ్ ఎక్స్ మనకిప్పటికే తెలిసిన వైరస్ నుంచే పుట్టుకొచ్చి ఉంటుందని బ్రిటన్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బిన్ హామ్ చెబుతున్నారు. వినడానికి కఠోరంగా ఉన్నా, మనకు ముందున్నది కష్ట కాలమేనన్నది అంగీకరించాల్సిన నిజమని ఆమె అన్నారు! ‘1918–19 మధ్య ఫ్లూ కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్‌లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి అలాంటి మహోత్పాతానికే దారి తీయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసంఖ్యాకమైన వైరస్లు పరస్పరం పరివర్తనాలు చెందుతూ రూపు మార్చుకుంటున్నాయి. ఊహాతీత వేగంతో విస్తరిస్తున్నాయి. పైగా వీటి సంఖ్య ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇతర అన్ని జీవరాశుల మొత్తం సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ‘ అని చెప్పుకొచ్చారు! ‘వాటిలో అన్నీ మనకు అంతగా చేటు చేసేవి కాకున్నా కొన్ని మాత్రం చాలా డేంజరస్‘ అని వివరించారు. లోతుగా పర్యవేక్షణ జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్లు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందట! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల వైరస్ లను అధ్యయనంలో భాగంగా చేయలేదు. వాటినీ కలిపి చూస్తే మానవాళికి ముప్పు మరింత పెరుగుతుందని డేమ్ హెచ్చరిస్తున్నారు. అప్పుడే వ్యాక్సిన్ తయారీ! ఇంకా కొత్త రోగం పేరైనా తెలియదు. ఒక్కరిలో కూడా దాన్ని గుర్తించలేదు. అప్పుడే దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో బ్రిటన్ సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. ఏకంగా 200 మందితో కూడిన బృందం ఈ పనిలో తలమునకలుగా ఉందట! జంతువుల నుంచి ఎలుకల ద్వారా మనుషులకు సోకే, శరవేగంగా వ్యాపించే స్వభావమున్న బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంట్ వైరస్‌లనే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారిస్ తెలిపారు. అయితే, పర్యావరణ మార్పుల వంటి మానవకృత విపత్తులకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే ఎన్నో వైరస్‌లను కూడా అరికట్టినవాళ్లం అవుతామంటూ ఆయన ముక్తాయించారు! మున్ముందు మన పాలిట ప్రాణాంతకంగా మారే భయంకరమైన మహమ్మారులకు కరోనా కేవలం ఒక దారుణమైన ఆరంభం మాత్రమేనని సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు! అవును.. మరిన్ని మహమ్మారులు! ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి చైనా ‘బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం కోవిడ్ తరహా మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చైనా ’బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం చెప్పారు. చైనాలో బెస్ట్ వైరాలజిస్ట్‌గా చెప్పే ఆమె జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకే వైరస్‌లపై అపారమైన రీసెర్చ్ చేసినందుకు బ్యాట్ ఉమన్‌గా పేరుబడ్డారు. కరోనాకు పుట్టిల్లుగా నేటికీ ప్రపంచమంతా నమ్ముతున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో లీ బృందం 40 కరోనా జాతులపై లోతుగా అధ్యయనం చేసింది. వాటిలో సగానికి సగం మానవాళికి చాలా ప్రమాదకరమైనవని తేలి్చంది. వీటిలో ఆరు ఇప్పటికే మనకు సోకాయని లీ చెప్పారు! గత జూలైలో ఇంగ్లిష్ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ఇటీవలే ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని చైనాకు చెందిన మరికొందరు ప్రముఖ వైరాలజిస్టులు కూడా సూచిస్తున్నారు. గబ్బిలాలు, ఎలుకల నుంచి ఒంటెలు, పంగోలిన్లు, పందుల వంటి జంతువుల ద్వారా సమీప భవిష్యత్తులో ఇవి మనకు మరింతగా సోకే ప్రమాదం చాలావరకు ఉందని వారు హెచ్చరిస్తున్నారు! డిసీజ్ ఎక్స్‌తో పోలిస్తే కరోనా ప్రమాదకరమైనది కానే కాదని చెప్పాలి. ఎందుకంటే కరోనాకు ఇప్పుడు దాదాపుగా అంతా ఇమ్యూన్‌గా మారాం. కానీ కొత్త వైరస్ తట్టు అంత శరవేగంగా వ్యాపించే అంటురోగానికి కారణమైతే? సోకిన ప్రతి 100లో ఏకంగా 67 మందిని బలి తీసుకున్న ఎబోలా అంతటి ప్రాణాంతకంగా మారితే? ఇదే ఇప్పుడు సైంటిస్టులను తీవ్రంగా కలవర పెడుతున్న అంశం! ప్రపంచంలో ఏదో ఇక మారుమూలలో అదిప్పటికే సడీచప్పుడూ లేకుండా ప్రాణం పోసుకునే ఉంటుంది. అతి త్వరలో ఉనికిని చాటుకుంటుంది. ఇక అప్పటి నుంచీ నిత్య కల్లోలమే! – డేమ్ కేట్ బిన్ హామ్, బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ -
కోవిడ్ తర్వాత పెట్టుబడులు కళకళ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం అంతకంతకు పెరుగుతోంది. కోవిడ్ తర్వాత ఏటా పెరుగుతున్న ఒప్పందాలు, వాస్తవ రూపంలోకి వచ్చిన పెట్టుబడులే దీనికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రీస్టార్ట్ ప్యాకేజీతో పరిశ్రమలను ఆదుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఎంచుకుంటున్నారు. 2021 తర్వాత నుంచి రాష్ట్రం ఆకర్షిస్తున్న పెట్టుబడుల విలువ భారీగా పెరుగుతోంది. 2021లో రూ.9,373 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 47 ఒప్పందాలు కుదరగా 2022లో 54 యూనిట్ల ద్వారా రూ.16,137 కోట్ల విలువైన ఒప్పందాలు జరగడం గమనార్హం. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 18 యూనిట్ల ద్వారా రూ.7,187 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. అంటే గత 27 నెలల్లో కొత్తగా 119 యూనిట్లను ఆకర్షించడం ద్వారా రూ.32,697 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మార్చిలో విశాఖ కేంద్రంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 387 ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా గరిష్టంగా ఆరు నెలల్లోనే పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రానున్న త్రైమాసికాల్లో ఈ ఒప్పందాల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉత్పత్తి ప్రారంభించడంలోనూ అదే జోరు కేవలం కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను అమలు చేస్తోంది. ‘వైఎస్ఆర్ వన్’ ద్వారా ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఉత్పత్తి ప్రారంభించే వరకు అనుమతుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ వ్యవస్థను తెచ్చింది. దీంతో గతేడాది పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2021లో రూ.10,350 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 47 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్లు డీపీఐఐటీ తెలిపింది. 2022లో రూ.45,217 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో రూ.4,919 కోట్ల విలువైన 13 యూనిట్లు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. అంటే గత 27 నెలల వ్యవధిలో మొత్తం 106 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.60,486 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 కాలంలో సగటున ఏటా రూ.11,994 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇప్పుడు నాలుగేళ్లుగా ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం గమనార్హం. ఈ ఏడాది ముగిసేనాటికి సగటు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. -
లాంగ్ కోవిడ్‌తో అవయవాలకు ముప్పు
లండన్: కోవిడ్–19 మహమ్మా రి బారినపడి, ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగైన వారిలో కూడా అవయవాలు దెబ్బతింటున్నట్లు యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో వివిధ యూనివర్సిటీల సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. లాంగ్ కోవిడ్‌తో శరీరంలోని కొన్ని ప్రధాన అవయవాలు క్రమంగా పనిచేయడం ఆగిపోతున్నట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు. కరోనా బాధితుల మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) స్కానింగ్లతో ఈ విషయం కనిపెట్టినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలకు లాంగ్ కోవిడ్ ముప్పు మూడు రెట్లు అధికంగా పొంచి ఉందని అన్నారు. మనిషిపై దాడి చేసిన కరోనా వైరస్ తీవ్రతను బట్టి ముప్పు తీవ్ర కూడా పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ పత్రికలో ప్రచురించారు. 259 మంది కరోనా బాధితులపై అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక 5 నెలల తర్వాత వారి ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలించారు. కరోనా సోకని వారితో పోలిస్తే వారి శరీరంలోని ప్రధాన అవయవాల్లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించారు. అన్నింటికంటే ఊపరితిత్తులే అధికంగా ప్రభావితం అవుతున్నట్లు తేల్చారు. గుండె, కాలేయం ఏమాత్రం దెబ్బతినడం లేదని గమనించారు. లాంగ్ కోవిడ్‌కు మరింత ప్రభావవంతమైన చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!
Unemployment Fraud in US: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత భారీ నిరుద్యోగ మోసం బయట పడింది. కోవిడ్ (COVID-19) మహమ్మారి సమయంలో మోసగాళ్లు 100 బిలియన్ డాలర్ల (రూ. 8.3 లక్షల కోట్లు) నుంచి 135 బిలియన్ డాలర్లు (రూ. రూ. 11 లక్షల కోట్లు) వరకూ నిరుద్యోగ బీమా ప్రయోజనాలను తప్పుగా క్లెయిమ్ చేసి కాజేసి ఉండవచ్చని యూఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (GAO) నివేదిక విడుదల చేసింది. యూఎస్, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ దీవులలో 2020 ఏప్రిల్ నుంచి 2023 మే మధ్య చెల్లించిన నిరుద్యోగ ప్రయోజనాలపై జీఏవో అధ్యయనం నిర్వహించింది. ఆ సమయంలో అమెరికన్లకు చెల్లించిన మొత్తం నిరుద్యోగ ప్రయోజనాలలో మోసపూరితంగా క్లెయిమ్ చేసిన నిధులు 11 శాతం నుంచి 15 శాతం వరకూ ఉన్నాయని జీఏవో అంచనా వేసింది. ఆ కాలానికి నిరుద్యోగ ప్రయోజనాల మొత్తం చెల్లింపులు 900 బిలియన్ డాలర్లు. అన్ఎంప్లాయిమెంట్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ప్రోగ్రామ్ సమగ్రతతో దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొందని, ఇది కోవిడ్ మహమ్మారి సమయంలో మరింత దిగజారిందని జీఏవో తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ మోసం మొత్తం జీఏవో గత ఫిబ్రవరిలో అంచనా వేసినదాని కంటే రెట్టింపు. ఈ నివేదికను యూఎస్ సెనేట్ ఫైనాన్స్ ర్యాంకింగ్ సభ్యుడు, సెనేటర్ మైక్ క్రాపో (R-Idaho), యూఎస్ హౌస్ వేస్ అండ్ మీన్స్ ఛైర్మన్ జాసన్ స్మిత్ (R-Missouri) అభ్యర్థించారు. ఖండించిన కార్మిక శాఖ అయితే జీఏవో నివేదికను యూఎస్ కార్మిక శాఖ ఖండించినట్లుగా రాయిటర్స్ పేర్కొంది. జీఏవో ఏ లెక్కల ఆధారంగా ఈ అంచనాకు వచ్చిందని ప్రశ్నించిందని, దాని పరిశోధనలు మోసం పరిధిని మరీ ఎక్కువగా పేర్కొన్నాయని పేర్కొంది. -
ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ
న్యూఢిల్లీ: కోవిడ్–19 ఇన్షెక్షన్‌తో పోలిస్తే నిఫా వైరస్‌తో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ చెప్పారు. నిఫా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 శాతం నుంచి 70 శాతం దాకా ఉంటోందన్నారు. అదే కోవిడ్‌లో అయితే 2–3 శాతం మధ్యనే ఉందని వివరించారు. కేరళలో నిఫా కేసుల్లో పెరుగుదల నమోదు అవుతుండటంతో ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీ 20 డోసులు తెప్పించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కలుషిత ఆహారం లేక ఒకరి నుంచి మరొకరికి కూడా ఇది సోకుతుంది. నిఫా వైరస్‌తో ఇప్పటికే కేరళలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. యాంటీబాడీ డోసుల కొనుగోలుపై రాజీవ్ బహల్ స్పందిస్తూ..ఆస్ట్రేలియా నుంచి 2018లో తెప్పించిన కొన్ని డోసులు ఇప్పటికీ ఉన్నాయనీ, అవి 10 మంది బాధితులకు మాత్రమే సరిపోతాయని వివరించారు. భారత్ కాకుండా విదేశాల్లో ఇప్పటి వరకు 14 మందికి మాత్రమే ఈ వైరస్ సోకిందన్నారు. వీరికి మోనోక్లోనల్ యాంటీబాడీలను ఇవ్వగా అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ‘అయితే, ఈ యాంటీబాడీలను ప్రారంభదశలో ఉన్న వారికే వాడుతున్నారు. వీటితో చికిత్సపై నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం, వైద్యులు, వైరస్ బాధితుల కుటుంబాలకే వదిలేశాము. మోనోక్లోనల్ యాంటీబాడీలతో విదేశాల్లో భద్రతను నిర్థారించే ఫేజ్–1 ట్రయల్ మాత్రమే జరిగింది. సామర్థ్యాన్ని నిర్థారించే ట్రయల్స్ జరగలేదు. అందుకే దీనిని ‘కారుణ్య వినియోగ ఔషధం’గా మాత్రమే వాడుతున్నారు’అని రాజీవ్ వివరించారు. చదవండి: ముగిసిన ఈడీ డైరెక్టర్ పదవీకాలం -
కోవిడ్ తర్వాత కొత్త నగరాలకు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఒకప్పుడు ఇవే దేశంలో ప్రధాన ఐటీ హబ్‌లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఐటీ కంపెనీలు రూటు మారు స్తున్నాయి. చండీగఢ్, మంగళూరు, అహ్మదా బాద్, కాన్పూర్, తిరువనంతపురం, భోపా ల్, జైపూర్, వరంగల్, విశాఖపట్నం,విజయ వాడ లాంటి నగరాలు తెరపైకి వస్తున్నాయి. కోవిడ్‌కు దేశంలోని కేవలం ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన సమాచార సాంకేతిక రంగం.. కోవిడ్ తదనంతర పరిణా మాల నేపథ్యంలో దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బహుళజాతి సంస్థలు నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవాలని భావి స్తుండటమే ఇందుకు కారణమని ఐటీ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నగరాల్లోనే 11–15% నైపుణ్యం ఉన్న యువత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే 11–15 శాతం సాంకేతిక నైపుణ్యం ఉన్న యువత ఉన్నట్లు ఐటీ కంపెనీలు గుర్తించాయి. దాదాపు 60 శాతం పట్టభద్రులు ఈ పట్టణాల నుంచే ఉత్తీర్ణులు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉత్తీర్ణులయ్యే వారిలో 30 శాతం మేరకు ఉద్యోగాల కోసం ప్రథమ శ్రేణి నగరాలకు తరలి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల వైపు దృష్టి సారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్‌లు ఎక్కువగా ఇక్కడే.. 2022లో దాదాపు 7 వేల (39%) స్టార్టప్‌లు ఈ కొత్త నగరాల నుంచే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో 13 శాతం స్టార్టప్ కంపె నీల ఫండింగ్ ఈ ద్వితీయ శ్రేణి నగరాలకే వెళ్లినట్లు తెలిపింది. పెట్టుబ డిదారులు కూడా ప్రథమ శ్రేణి నగరాల్లోని వాటికంటే ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికే ముందుకు వస్తున్నట్లుగా అధ్యయనంలో తేలినట్లు నివేదిక పేర్కొంది. కొత్త హబ్‌లు ఎక్కడెక్కడ? దేశంలోని ద్వితీ య, తృతీయ శ్రేణి నగరాలైన టువంటి చండీగఢ్, నాగ్‌పూర్, అహ్మదా బాద్, మంగళూరు, కాన్పూర్, తిరువనంతపుర, లఖ్‌నవూ, గౌహతి, రాంచీ, భోపాల్, జైపూర్, ఇండోర్, నాసిక్, భువనేశ్వర్, రాయ్‌పూర్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, హుబ్బళి, విజయవాడ, తిరు పతి, మైసూరు, వెల్లూరు, మధురై, తిరుచిరా పల్లి, కొచ్చి నగరాలపై ఐటీ సంస్థలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తెలంగాణలోని పలు నగరాల్లో హబ్‌లు ఐటీ రంగాన్ని తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లాలని 2015–16 నుంచే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లు నిర్మించారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్‌లలో ఐటీ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. త్వరలోనే నల్లగొండ, రామగుండంలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయ బోతున్నారు. మొత్తం మీద 2026 నాటికి 20 వేల మందికి నేరుగా ఈ పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వికేంద్రీకరణతో సానుకూల మార్పులు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కేవలం ప్రధాన నగరాలు, పట్టణాలకు పరిమితం కాకుండా రెండో, మూడో శ్రేణి నగరాలు, ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణ వల్ల చాలా సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కోవిడ్ తర్వాత చాలావరకు ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నా మంచి ఉత్పాదకత వస్తుండటంతో కంపెనీల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. నిర్వహణ వ్యయం మరింత తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి మరోవైపు వికేంద్రీకరణ కారణంగా ఉద్యోగులకు కూడా ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు తగ్గుతాయి. రాబోయే రోజుల్లో వికేంద్రీకరణ మరింత జరిగి శాటిలైట్ సెంటర్ల ద్వారా చిన్న చిన్న హబ్‌లు కూడా ఏర్పడబోతున్నాయి. ఇంటర్నెట్ స్పీడ్, నిరంతర కరెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే గ్రామస్థాయి వరకు కూడా తీసుకెళ్లే అవకాశాలుంటాయి. – వెంకారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్ ప్రత్యామ్నాయ హబ్‌లు అత్యంత ఆవశ్యకం దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఏ విధంగా ఐటీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్న అంశంపై డెలాయిట్, నాస్కామ్ సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించి నివేదికను తయారు చేశాయి. ‘ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్స్ ఇన్ ఇండియా’ పేరిట ఇది రూపొందింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ప్రస్తుతం మరో 26 నగరాలకు విస్తరించిందని ఆ నివేదిక వెల్లడించింది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు నాస్కామ్ అధిపతి సుకన్యరాయ్ తెలిపారు.కాగా ఆయా ప్రాంతాల్లో విస్తరించడానికి గల కారణాలను, అక్కడ ఉన్న అవకాశాలను, ఇతర అంశాలను వివరించింది. ఏడు ప్రధాన నగరాల్లో విస్తరించిన ఐటీ రంగంలో దాదాపు 54 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. అయితే నైపుణ్యం, నిర్వహణ వ్యయం, కొత్త నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి వారు ఉన్నచోటే ఉపాధి కల్పించేలా ఆ ప్రాంతాల్లోనే కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చని ఐటీ సంస్థలు భావిస్తున్నాయని నివేదిక చెబుతోంది. కోవిడ్ తరువాత ఈ వికేంద్రీకరణ వేగం పుంజుకుందని తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలకు ప్రత్యామ్నాయంగా ఐటీ హబ్‌ల ఏర్పాటు అత్యంత ఆవశ్యకమని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు నాస్కామ్, డెలాయిట్ స్పష్టం చేశాయి. 2030 నాటికి నైపుణ్యం మిగులు.. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీ నిపుణుల కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని అంచనా వేశారు. అయితే 2030 నాటికి ఈ పరిస్థితి మారుతుందని, డిమాండ్ కంటే అధికంగా ఐటీ నిపుణులు ఉంటారని సుకన్యరాయ్ చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటు వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ రంగం వైపు మళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేలా తగిన మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావడం ఐటీ రంగానికి కలిసివచ్చే అంశమని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మౌలిక వసతుల కల్పనతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని, మరోవైపు భవనాల కోసం చెల్లించే అద్దె కానీ, సొంత భవనాల నిర్మాణ వ్యయం కానీ ప్రధాన నగరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎమర్జింగ్ సిటీస్ (కొత్త నగరాలు)లో 25 నుంచి 30 శాతం వరకు తక్కువ వేతనాలకే నిపుణులు లభిస్తుండటం, 50 శాతం వరకు తక్కువకు అద్దెకు భవనాలు లభించడం వంటి అనుకూల పరిణామాలు ఐటీ రంగం వికేంద్రీకరణకు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. -
మనోళ్ల ‘హెల్త్ కవర్’ అంతంతే..!
సాక్షి, హైదరాబాద్: జీవిత బీమా, హెల్త్ కవర్–ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కవరేజీ వంటి విషయాల్లో భారతీయులు అంత చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, సరైన ఆరోగ్య రక్షణలు లేనివారు రూ. 20 వేల కోట్లకు పైగానే కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం వ్యయం చేయాల్సి వచ్చిదనే అనధికార అంచనాలున్నాయి. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎదురైన పరిస్థితుల కారణంగా మధ్య, దిగువ, పేద వర్గాల ప్రజలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అని 46 శాతం మంది భావిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న వైద్యఖర్చులకు ఈ హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయని 43 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇదీ అధ్యయనం... తాజాగా భారతీయ టెక్–ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని, వారిలోనూ 27 శాతం మందికి మెడికల్ కవర్ రూ. 5 లక్షలలోపే ఉన్నట్టుగా ఇది స్పష్టం చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లోని 28–55 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ నివేదికను సిద్ధం చేసింది. అన్లిమిటెడ్ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్‌రెంట్ క్యాపింగ్ వంటి వాటిపై పాలసీ హోల్డర్లకు అంతగా అవగాహన ఉండటం లేదన్న విషయం నివేదికలో వెల్లడైంది. -
అపనమ్మకాన్ని తొలగిద్దాం
న్యూఢిల్లీ: కోవిడ్ మహా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధంతో విశ్వవ్యాప్తంగా దేశాల మధ్య వేళ్లూనుకుపోయిన అపనమ్మకాలు, భయాలను పారద్రోలాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీ20 సదస్సులో తొలి రోజు అగ్రరాజ్యాధినేతలతో శిఖరాగ్ర చర్చల సందర్భంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను మోదీ ప్రస్తావించారు. ‘కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లో కొత్త భయాలు, అపనమ్మకాలు గూడుకట్టుకున్నాయి. వెనువెంటనే వచి్చపడిన ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఆ అగాథాలను మరింత పెంచాయి. ఇప్పుడు అపనమ్మకాలను పోగొట్టాల్సిన సమయం వచ్చింది. విశ్వాసం దిశగా ప్రపంచదేశాలు కలిసి నడవాలి. అవిశ్వాసంపై మనం విజయం సాధించాలి. విశ్వ శ్రేయస్సు కోసం కలసి ముందడుగేద్దాం’ అని పిలుపునిచ్చారు. ప్రసంగం ప్రారంభంలోనే మొరాకోను పెను భూకంపం కుదిపేసిన దుర్ఘటనను ప్రస్తావించి వందలాది మంది మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా సహా జీ20 అధినాయకగణం సమక్షంలో మోదీ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లోనే.. ఏటా 100 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందే పెను వాతావరణ మార్పులు సంభవించకుండా ముందస్తు నివారణ చర్యలకు సమాయత్తమవుదాం. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వ్యవస్థల వైపు మారాలంటే ట్రిలియన్ల కొద్దీ భూరి నిధులు అత్యావశ్యకం. ఈ సమూల మార్పు ప్రక్రియలో అభివృద్ధి చెందిన దేశాలు అత్యంత కీలకమైన పాత్ర పోషించాలి. 2009లో కోపెన్‌హాగెన్‌లో ఐక్యరాజ్యసమితి ‘వాతావరణ’ చర్చల సందర్భంగా 2020 నాటికల్లా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల నిధులు ఇస్తామన్న వాగ్దానాలను సంపన్న దేశాలు నిలబెట్టుకోవాల్సిందే. 55 దేశాల ఆఫ్రికన్ కూటమిని జీ20లోకి ఆహ్వానించడం నాకు గర్వకారణం. కోవిడ్ తెచి్చన మహా విషాదం దేశాల మధ్య విశ్వాసం తగ్గించేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతి, ఉత్తరార్థ గోళ దేశాలు, దక్షిణార్ధ గోళ దేశాల మధ్య లోపించిన సఖ్యత, ఆహారం, ఇంధనం, ఎరువులు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, ఇంధనం, నీటి భద్రత అంశాల్లో పరిష్కారాలు వెతికి ప్రపంచ సుస్థిరాభివృద్ధికి సమష్టిగా పాటుపడదాం. ‘ఒకే కుటుంబం’ స్ఫూర్తితో సుస్థిరాభివృద్ధి ‘ఒకే కుటుంబం’ స్ఫూర్తితో అభివృద్ధిని సుస్థిరం చేసుకుందాం. దీనిని సాంకేతికత వారధి తోడుగా నిలవనుంది. ప్రతి వర్గం, ప్రతి ప్రాంతాన్ని అనుసంధానిస్తూ సహాయ వ్యవస్థను నిర్మించుకుందాం. అప్పుడే గణనీయమైన మార్పు మహిళల సారథ్యంలో జరిగే అభివృద్ధితోనే 21వ శతాబ్దంలో గణనీయమైన మార్పును చూడగలం. ఇప్పుడు భారత్‌లో సైన్స్, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్ విభాగాల్లో పట్టభద్రులైన వారిలో 45 శాతం మంది అమ్మాయిలే. సైన్స్, టెక్నాలజీలో ప్రతిభ చూపిన వారికి అంతర్జాతీయ అవకాశాలు కలి్పంచేందుకు ‘జీ20 టాలెంట్ వీసా’ అనే ప్రత్యేక కేటగిరీని త్వరలో ప్రారంభిస్తాం. గ్లోబల్ బయో–బ్యాంక్‌లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ బయో–బ్యాంక్‌ల ఏర్పాటు సంతోషదాయకం. హృద్రోగాలు, సికెల్ సెల్ అనీమియా, రొమ్ము క్యాన్సర్లపై దృష్టిసారించేందుకు మరింత అవకాశం చిక్కుతుంది. దేశాలను, మనుషులను కేవలం మార్కెట్ల కోణంలో చూడొద్దు. మనకు సహానుభూతి, దీర్ఘకాలిక లక్ష్యాలు తప్పనిసరి. 47 ఏళ్లు కాదు ఆరేళ్లలో సాధించాం ఆర్థిక సమ్మిళితకు 47 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. కానీ దానిని భారత్ కేవలం ఆరేళ్లలోనే సాధించింది. గత పదేళ్లలో ఏకంగా 360 బిలియన్ డాలర్ల మొత్తాలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమచేసింది. 33 బిలియన్ డాలర్ల నిధులు పక్కదారి పట్టకుండా నివారించింది. ఇది స్థూల దేశీయోత్పత్తిలో 1.25 శాతానికి సమానం. మహిళా సాధికారత ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు జీ20 ఎంతగానో కృషిచేస్తోంది. అంతర్జాతీయ సరకు రవాణా గొలుసులో విశ్వాసం, పారదర్శకత పెరగాలి. -
చిరు వ్యాపారులకు రుణాల్లో భారీగా ఏపీ ‘ముద్ర’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారులకు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైంది. స్వయం ఉపాధి కోసం ముద్ర యోజన కింద ఎటువంటి పూచీ కత్తు లేకుండా రాష్ట్రంలో గత నాలుగేళ్లలోనే 44.63 లక్షల మందికి రూ. 49,313 కోట్ల మేర రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో అత్యధికంగా మహిళలకే మంజూరయ్యాయి. ఇప్పటికే చేస్తున్న వ్యాపారాలను మరింత విస్తరించడానికి లేదా కొత్తగా వ్యాపారం చేసేందుకు ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కోవిడ్ సమయంలో తిరిగి రాష్ట్రానికి వచ్చిన వారికి జీవనోపాధి కల్పించడానికి ముద్ర రుణాలను రాష్ట్ర ప్రభుత్వం విరివిగా ఇప్పించింది. గత మూడేళ్లుగా లక్ష్యానికి మించి చిన్న వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 135 శాతం మేర ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యం కాగా రూ.16,212 కోట్లను మంజూరు చేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,838 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యమైతే రూ. 11,445 కోట్లు మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని మించడం పట్ల ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల రుణాల రికవరీ బాగుందని, మహిళల రుణాల్లో నిరర్థక ఆస్తులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు ముద్ర యోజన ద్వారా మహిళలు స్వయం ఉపాధి రంగంలో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ముద్ర కింద మూడు రకాల రుణాలను మంజూరు చేస్తున్నారు. శిశు పథకం కింద రూ. 50 వేల వరకు, కిశోర్ పథకం కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు, తరుణ్ పథకం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తున్నాయి. టైర్ల ఫిట్ షాపుతో స్వయం ఉపాధి రాజమహేంద్రవరానికి చెందిన యోగిత సింహాచలం పీఎంఎంవై కింద పది లక్షల రూపాయల రుణం తీసుకుని పరమేశ్వర బెస్ట్ ఫిట్ టైర్ షాపు ఏర్పాటు చేశారు. తొలుత ఒక్కరితో ప్రారంభమైన ఆ షాపులో తరువాత మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం కార్లకు టైర్లు ఫిట్ చేస్తున్నామని, త్వరలోనే మరింత విస్తరించడం ద్వారా మరో పది మందికి కూడా ఉపాధి కల్పిస్తామని సింహాచలం పేర్కొన్నారు. కర్టెన్ డిజైనర్ యూనిట్ తిరుపతికి చెందిన సులోచన డిజైనింగ్‌పై ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోవాలనే ఆలోచనతో కెనరా బ్యాంక్‌లో తరుణ్ పథకం కింద రుణం కోసం ధరఖాస్తు చేసుకుంది. కెనరా బ్యాంకు రూ. 7.5 లక్షల రుణం మంజూరు చేసింది. దీంతో ఆమె కర్టెన్ డిజైనర్ పేరుతో యూనిట్‌ను ప్రారంభించింది. మైక్రో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో కర్టెన్ల రూపకల్పనతో పాటు గృహోపకరణాలను తయారు చేయడం ప్రారంభించింది. మరో ఐదుగురికి ఉపాధి కూడా కల్పించారు. -
విశాఖ విమానాశ్రయానికి పెరుగుతున్న రద్దీ
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది. ప్రయాణికుల రద్దీతో కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి చేరుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 10,37,710 మంది ప్రయాణికులు (దేశీయ, అంతర్జాతీయ) రాకపోకలు సాగించారు. గత సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య నాలుగు నెలల్లో 7,75,100 మంది ప్రయాణించారు. వీరిలో దేశీయ ప్రయాణికులు 7,54,966 మంది, విదేశీ ప్రయాణికులు 20,084 మంది ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే దేశీయ విమానాల్లో ప్రయాణించిన వారు 10,13,518కి, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులు 24,192కి పెరిగారు. అలాగే దేశీయ (డొమెస్టిక్) విమానాల రాకపోకలు కూడా 7,045 నుంచి 7,184కి పెరిగాయి. అయితే రాకపోకలు సాగించిన అంతర్జాతీయ విమాన సర్వీసులు 170 నుంచి 164కి స్వల్పంగా తగ్గాయి. కానీ ఈ నాలుగు నెలల్లో అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపించింది. కోవిడ్‌కు ముందు ఈ విమానాశ్రయం నుంచి నెలకు సగటున 2.8 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కోవిడ్ తర్వాత రెండేళ్ల పాటు విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నెలకు 1.5 లక్షల మంది ప్రయాణించడం గగనమయ్యేది. మళ్లీ కొన్ని నెలల నుంచి ఈ ప్రయాణికుల సంఖ్య పుంజుకుంటోంది. ఇప్పుడది నెలకు 2.6 లక్షలకు పెరిగింది. మరికొద్ది నెలల్లో ఈ సంఖ్య కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ ఎయిర్‌పోర్టు ఏడాదికి 3.5 మిలియన్ల ప్రయాణికులు రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మున్ముందు ఈ ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సౌకర్యాలను పెంచుతున్నామని తెలిపారు. కార్గో రవాణాలోనూ.. మరోవైపు కార్గో రవాణాలోనూ ఈ విమానాశ్రయం ఊపందుకుంటోంది. కోవిడ్ ప్రభావంతో రెండేళ్లకు పైగా కార్గో రవాణా సన్నగిల్లింది. కానీ కొన్నాళ్లుగా ఇది మళ్లీ పుంజుకుంటోంది. కోవిడ్ సమయంలో రోజుకు ఏడెనిమిది టన్నుల సరకు రవాణా కష్టతరమయ్యేది. ఇప్పుడు రోజుకు 12 నుంచి 15 టన్నుల వరకు కార్గో రవాణా జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో ఈ ఎయిర్‌పోర్టు నుంచి 1,432 టన్నుల సరకు రవాణా జరిగింది. ఈ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రొయ్యలు, రొయ్య పిల్లలతో పాటు ఫార్మా ఉత్పత్తులు, అత్యవసర మందులు, దుస్తులు, ఆటోమొబైల్స్, నావికాదళానికి సంబంధించిన వస్తువులు, సరకులు, పరికరాలతో పాటు సాధారణ సరకు రవాణా కూడా జరుగుతోంది. వీటిలో రొయ్యలు, ఫార్మా ఉత్పత్తులు, దుస్తులు ఎక్కువగా రవాణా అవుతుంటాయి. -
పేదరికం పై పైకి!
యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది. – గారెత్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్ (కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు? పేదరికం పెంచిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది. ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం యూకేలో కోవిడ్ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది. కోవిడ్‌కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం. యూరప్ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్ కమిషన్ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్ యూరప్ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లెక్క అలా.. మనది ఇలా రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు. ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది. 2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి. 16.3 కోట్ల దిగువ మధ్యతరగతి? రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. పేదరికంపై నడ్జ్ ఫౌండేషన్ పోరు ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం. వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్ ఫౌండేషన్ -
చిన్న రుణాలకు మళ్లీ గిరాకీ.. బ్యాంకులను అధిగమించి, 40 శాతం వాటాతో
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) లాభదాయకత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.7–3 శాతానికి మెరుగుపడుతుందని ఇక్రా రేటింగ్స్ పేర్కొంది. మెరుగైన వసూళ్లు, తక్కువ రుణ వ్యయాలు, కొత్త రుణాలపై అధిక రేట్లు ఇవన్నీ లాభదాయకత పెరగడానికి అనుకూలతలుగా తెలిపింది. ఎంఎఫ్ఐలు కరోనా మహమ్మారి రాకతో కుదేలు కాగా, ఆ తర్వాత వేగంగా కోలుకుని సూక్ష్మ రుణాల్లో బ్యాంకులను అధిగమించి, 40 శాతం వాటాతో మొదటి స్థానానికి చేరుకోవడం గమనార్హం. 2021–22 నాటికి ఉన్న 34 శాతంతో పోలిస్తే 6 శాతం మార్కెట్ వాటాను గత ఆర్థిక సంవత్సరంలో పెంచుకున్నాయి. సూక్ష్మ రుణాల్లో బ్యాంకుల వాటా 40 శాతం నుంచి 34 శాతానికి తగ్గింది. ఈ మేరకు ఒక నివేదికను ఇక్రా విడుదల చేసింది. రుణాల్లో మెరుగైన వృద్ధి ఎంఎఫ్ఐలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరంగా 24–26 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని ఇక్రా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. అంతేకాదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25)నూ 23–25 శాతం మేర రుణ వితరణలో వృద్ధిని సాధిస్తాయని తెలిపింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్‌ఐల లాభదాయకత 3.2–3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వ్యక్తీకరించింది. 2022–23 చివరికి నాటికి ఎంఎఫ్‌ఐల లాభదాయకత 2.1 శాతంగా ఉంది. ‘‘ఇక మీదట మంజూరు చేసే రుణాలు అధిక ధరపై ఉండడం, రుణ రేట్ల పరంగా ఆర్బీఐ వెసులుబాటు కల్పించడం నికర వడ్డీ మార్జిన్లను పెంచుతుంది. దీంతో ఎంఎఫ్‌ఐల లాభదాయకత పెరుగుతుంది’’ అని ఇక్రా తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన వ్యయాల్లో అధిక భాగాన్ని గత ఆర్థిక సంవత్సరంలో ఇవి సర్దుబాటు చేసుకున్నట్టు వివరించింది. అలాగే, కరోనా మహమ్మారి ముందు నాటి స్థాయికి రుణ వసూళ్లు మెరుగుపడినట్టు వెల్లడించింది. ఆస్తుల్లోనూ బలమైన వృద్ధి.. ఎంఎఫ్ఐలు గత ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణ ఆస్తులను (రుణాల పోర్ట్‌ఫోలియో) 38 శాతం పెంచుకున్నాయి. బ్యాంకులతో పోలిస్తే ఎంఎఫ్ఐలు తమ ఆస్తులను అధికంగా విస్తరించుకున్నట్టు ఇక్రా రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ సచ్దేవ తెలిపారు. ఒక రుణగ్రహీతకు సంబంధించి సగటు ఖాతాలు కూడా పెరిగాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఒకే రుణ గ్రహీత వెంట ఒకటికి మించిన సంస్థలు వెంటబడుతున్నట్టు తెలుస్తోందని ఇక్రా పేర్కొంది. ఇది రుణ గ్రహీతల రుణ భారాన్ని కూడా పెంచుతున్నట్టు తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం సమసిపోవడంతో, రుణ బకాయిలు పేరుకుపోవడం తగ్గుతున్నట్టు వివరించింది. 90 రోజులకు పైగా చెల్లింపులు చేయని రుణ ఖాతాలు 2021–22 మొదటి ఆరు నెలల్లో 6.2 శాతానికి పెరగ్గా, 2023 మార్చి నాటికి 2.5 శాతానికి తగ్టినట్టు పేర్కొంది. 2023–24లో వసూలు కాని రుణాలు మరో 0.4–06 శాతం క్షీణించొచ్చని అంచనా వేసింది. ఎంఎఫ్‌ఐల లిక్విడిటీ పరిస్థితులు కూడా మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. -
భారత్ బ్యాంకింగ్ పటిష్టమవుతోంది: ఫిచ్
న్యూఢిల్లీ: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో భారతీయ బ్యాంకుల నిర్వహణా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నట్లు రేటింగ్ ఏజెన్సీ– ఫిచ్ తన తాజా ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్‌కు సంబంధించి పలు సూచీలు కోవిడ్ ముందుస్తు పరిస్థితులకన్నాసైతం ముందంజలో ఉన్నట్లు వివరించింది. కొన్ని రంగాల విషయంలో బ్యాంకుల రుణ బకాయిలూ తగ్గుతున్నట్లు తెలిపింది. ‘ఆరి్థక వ్యవస్థ భారీ పరిమాణం, డిమాండ్ పరిస్థితులు లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి అలాగే ఆదాయాలు పెరగడానికి, ఇబ్బందులను తగ్గించడానికి బ్యాంకింగ్‌కు మరిన్ని అవకాశాలను అందించాల్సి ఉంది’’ కూడా ఫిచ్ పేర్కొంది. -
పైసా ఇవ్వలే...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీలో డి.సాయికిరణ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఎంసెట్‌లో ఉత్తమర్యాంకు సాధించి కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న సాయికిరణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హుడు. కానీ రెండేళ్లుగా వ్యక్తిగతంగా ఫీజు చెల్లిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ నిధులు జమ కాగానే చెక్కు రూపంలో ఫీజు వెనక్కి ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో ధైర్యం చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. కోవిడ్ తర్వాత నిధుల విడుదలలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దాని ప్రభావం విద్యార్థుల చదువులు, ఇతర అంశాలపై పడుతోంది. బకాయిలు రూ.4,043.19 కోట్లు మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయి. రూ.4043.19 కోట్ల మేర విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు రూపంలో చెల్లించాల్సి ఉన్నట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల్లో పైసా విడుదల కాకపోగా, అంతకుముందు ఏడాది 40శాతం మాత్రమే నిధులు విడుదలయ్యాయి. సాధారణంగా అయితే విద్యాసంవత్సరం ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తారు. కానీ మూడేళ్లుగా పరిస్థితి తారుమారైంది. బీసీ విద్యార్థులవే అధికం ఫీజు బకాయిల్లో అత్యధికం బీసీ సంక్షేమశాఖకు చెందినవే ఉన్నాయి. ఈ మూడేళ్లకు సంబంధించి బీసీ విద్యార్థులకు రూ.2182.89 కోట్ల బకాయి లున్నాయి. ఈబీసీ కేటగిరీలో మూడేళ్ల బకాయిలు రూ.661.84 కోట్లు ఉన్నాయి. ♦ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా నిధుల సర్దుబాటు చేస్తున్నారు. ♦ మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోనూ బకాయిలు 461.05కోట్లు ఉన్నాయి. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు... ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిధులు విడుదల చేసిన తర్వాత వాటిని కాలేజీ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడంలోనూ తాత్సారం చేస్తోంది. గతేడాది డిసెంబర్లో దాదాపు రూ.4వందల కోట్లకు సంబంధించి టోకెన్లు జనరేట్ చేసిన అధికారులు ట్రెజరీల్లో క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపారు. – గౌరి సతీశ్, కన్వినర్, కేజీ టు పీజీ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గరున్న ఓఇంజనీరింగ్ కాలేజీలో జె.కార్తిక్ తాజాగా ఎంటెక్ పూర్తి చేశాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూ ద్వారా జాబ్‌కు ఎంపికయ్యాడు. ఒప్పందపత్రంపై సంతకంతోపాటు విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్టు సమర్పించాలని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజు చెల్లించాలంటూ రీయింబర్స్‌మెంట్‌కు మెలిక పెట్టింది. దీంతో అప్పు చేసి ఫీజు చెల్లించి కాలేజీకి నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నాడు. -
సీటు రానివారికి టెలీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ, నీట్, జేఈఈ వంటి ప్రముఖ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చి ఎంబీబీఎస్, ఐఐటీ వంటి వాటిల్లో సీటు రాని వారికి మానసిక చికిత్స అందజేసేందుకు 24 గంటల టెలీ కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆయా పరీక్షలు రాసి కొద్ది మార్కులతో సీట్లు కోల్పోతున్నవారు అనేకమంది ఉంటున్నారు. వీరిలో కొందరు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మానసిక ఆరోగ్యం.. వర్తమాన పరిస్థితుల్లో దాని నిర్వహణ’అనే అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఓ నివేదిక తయారు చేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేసింది. వివరాలిలా ఉన్నాయి.. ఆత్మహత్యలు 10 శాతానికి తగ్గాలి పాఠశాలల్లోనూ మానసికంగా కుంగిపోయే విద్యార్థుల కోసం కౌన్సిలర్లను నియమించాలి. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్యను 2030 నాటికి 10 శాతానికి తగ్గించాలి. కేంద్రీకృత సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ, స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. జైళ్లల్లోనూ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మానసిక ఆరోగ్య, సమస్యలను ఆరోగ్య బీమాలో చేర్చాలి. దేశంలో 47 మానసిక చికిత్సాలయాలున్నాయి. అయితే 2017లో ఏర్పాటైన మానసిక ఆరోగ్య చట్టానికి అనుగుణంగా అవి లేవు. ఆ మేరకు వాటిని తీర్చిదిద్దాలి. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మెంటల్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మానసిక చికిత్సకు సంబంధించిన 17 రకాల మందులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. అవన్నీ మెడికల్ కాలేజీలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఉన్నాయి. వాటిల్లో కనీసం 13 మందులను ప్రాథమిక ఆసుపత్రి స్థాయికి తీసుకురావాలి. పోలియో చుక్కల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు సినీ తారలు, క్రీడాకారుల వంటి ప్రముఖులతో ప్రచారం చేస్తారు. అలాగే మానసిక సమస్యలకు సంబంధించి కూడా ఆయా రంగాల ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి అవగాహన పెంచాలి. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. స్వయం ఉపాధి పొందుతున్నవారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తర్వాత వేతన జీవులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రైవేట్ రంగం, రైతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2021లో స్వయం ఉపాధికి చెందిన వారి లో 20,237 మంది ఆత్మహత్య చేసుకు న్నారు. వేతన జీవులు 15,870, నిరుద్యోగులు 13,714, విద్యార్థులు 13,089, వ్యా పారస్తులు 12,055, ప్రైవేట్‌రంగ ఉద్యోగులు 11,439, రైతులు 5,318, కూలీలు 5,563 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ తర్వాత మానసిక సమస్యలు 28% పెరిగాయి. 2017లో 1.29 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటే, 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్కహాల్ వల్ల 4.7 శాతం మంది, పొగాకు వల్ల 20.9 శాతం మంది మానసిక సమస్యలకు గురవుతున్నారు. డిప్రెషన్, ఉద్వేగాలు, ఇతరత్రా కారణాలతో 10.9 శాతం మందికి సమస్యలు వస్తున్నాయి. తీవ్రమైన స్కిజోఫ్రేనియా వంటి సమస్యలతో 1.4 శాతం, యాంగ్జయిటీతో 3.2 శాతం, స్ట్రెస్‌తో 3.7 శాతం, ఇతరత్రా ఏదో ఒక మానసిక సమస్యతో 13.7 శాతం బాధపడుతున్నారు. దేశంలో లక్ష జనాభాకు 0.75 మంది మానసిక చికిత్స నిపుణులు ఉన్నారు. అంటే 1.34 లక్షల మంది జనాభాకు ఒక మానసిక చికిత్స నిపుణుడు మాత్రమే ఉన్నారు. ప్రపంచ సగటు 1.7గా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షకు 8.6 మంది మానసిక నిపుణులు ఉన్నారు. . ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్న బడ్జెట్లో రెండు శాతమే మానసిక ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక మానసిక రోగుల్లో 85 శాతం మందికి తగిన వైద్యం అందడం లేదు. మానసిక చికిత్సలను ఆయుర్వేద, యోగా పరిధిలోకి తీసుకురావాలి. జిల్లా కేంద్రంగా మానసిక వైద్యం ఉండాలి. మానసిక రోగుల్లో అవగాహన పెంచాలి జిల్లాకొక యువ స్పందన కార్యక్రమం పెట్టి 20 మందిని రిక్రూట్ చేసుకొని ప్రజల్లో మానసిక రోగాలపై అవగాహన పెంచాలి. బ్రిక్స్ దేశాల్లోని దక్షిణాఫ్రికాలో 35.8 శాతం మంది మానసిక సమస్యలున్నవారే. మన దేశంలో 30.1 శాతం మంది ఏదో ఒక మానసిక సమస్యలతో ఉన్నారు. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ, సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ -
అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెలో గుబులు పడుతుంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గజగజ వణికించింది. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కరోనా ఉధృతితో పేద, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీని బాధితులుగా మారారు. ఊహించని ముప్పుతో ప్రాణాలు విడిచారు. అంతలా ప్రజలను భయాందోళనకు గురిచేసిన మహమ్మారి పీడ ప్రస్తుతం విరిగిపోయినట్లే కనిపిస్తుంది. భారత్‌లో గత కొన్ని నెలలుగా వైరస్ కేసులు పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజలు హమ్మయ్యా అనుకుంటూ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆలోపే మరో ప్రమాదం ముంచుకొస్తుంది. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈజీ. 5 (EG.5) అనే వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ జాతికి చెందిన ప్రస్తుతమున్న ఎక్స్‌బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌బీబీ 1.9.2 స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో అదనంగా ఒక మ్యూటేషన్ (జన్యుమార్పు) కలిగి ఉందని, ఇది 465 స్థానంలో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. శరీరంలోని కణాలకు వైరస్ సోకేందుకు స్పైక్ ప్రోటీన్ కీలకమన్న విషయం తెలిసిందే. చదవండి: మళ్లీ కరోనా విజృంభణ.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్.. అయితే ఈ కొత్త మ్యూటేషన్ ఇంతకముందు ఇతర కరోనా వేరియంట్లలో కూడా కనిపించిందని వెల్లడించారు. మరోవైపు ఈజీ.5 నుంచి ఇప్పటికే ఈజీ.5.1 (EG.5.1) అని పిలవబడే మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది కూడా వేగంగా వ్యాపిస్తోంది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ డా. డేవిడ్ హో ఈ వైరస్‌పై పరిశోధన చేస్తున్నారు. కరోనా టీకాలతో శరీరంలో ప్రేరేపితమైన యాంటీబాడీల నుంచి ఈ వైరస్ ఏమేరకు తప్పించుకుంటోందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా నిరోధక యాంటీబాడీల నుంచి ఈ రెండు కొత్త వేరియంట్లు కొంత మేర తప్పించుకోగలుగుతున్నాయని గుర్తించారు. ఫలితంగా ఇవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. XBB సిరీస్‌లోని ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఇది రోగ నిరోధకవ్యవస్థ నుంచి మరింత సమర్థవంతంగా తప్పించుకుంటోందని పేర్కొన్నారు. అయితే కొత్త వేరియంట్స్‌తో వ్యాధి తీవ్రతలో ఎలాంటి మార్పు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈజీ.5 వేరియంట్ ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకే, జపాన్, చైనాలలో కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. మరోవైపు ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ 'ఎరిస్' అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్‌లోని హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి.. ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్ 19 మహమ్మారి ఎదుర్కున్న తీరులో విఫలమైన నేపథ్యంలో రాబోయే మహమ్మారి పట్ల మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని భావిస్తూ, తనకు అధికారాలు కావాలని కోరుతోంది. ప్రపంచ దేశాలను నిర్దేశించడానికి తనకు అధికారాలు పెంచడానికి అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు (ఐహెచ్ఆర్), ప్రపంచ మహమ్మారి ఒప్పందం హెచ్ఈఆర్పీ గురించి తన సభ్య దేశాలతో చర్చల ప్రక్రియను ప్రారంభించింది. ఈ మూడు దారుల ద్వారా తన అధికారాలరను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్యం మీద తన గుత్తాధిపత్యం స్థాపించుకోవడానికి, కొనసాగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మే 2024 కల్లా పూర్తి కావాలని భావిస్తోంది. వీటి ద్వారా అన్ని దేశాలలో ఆరోగ్యంపై జాతీయ ప్రణాళికలను శాసించే విధంగా ఈ ఒప్పందాలను తయారు చేస్తున్నారు. ముసాయీదా ఒప్పందాల గురించి చర్చించడం ప్రారంభించారు. అయితే, ఇది కేవలం ఆరోగ్య రంగం కాకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారం తదితర రంగాలకు కూడా తన ‘ప్రభావం’ విస్తరించే ప్రయత్నంలో డబ్ల్యూహెచ్ఓ ఉంది. దీని వెనుక ఉన్న శక్తులు బిల్ గేట్స్, క్లాస్ శ్వాబ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ) వంటి ప్రముఖులు ఉన్నారు. ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని, ఒక కొత్త ప్రాపంచిక వ్యవస్థను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. భారత దేశం కూడా ఈ చర్చలలో పాల్గొంటోంది. కానీ మన దేశంలో, పార్లమెంటులో దీనిపై చర్చ లేదు. కనీసం ప్రస్తావన కూడా చాల తక్కువ. పైగా చాలా మంది ప్రజలకు అసలు ఈ విషయం కూడా తెలియదు. ఈ విషయం మీద అవగాహన పెంచాల్సిన అవసరం మాత్రం ఉంది. భారత ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు అధికారులు. రౌండ్ టేబుల్ సమావేశం : డబ్యూహెచ్ఓ ప్రపంచ మహమ్మారి ఒప్పందం (Global Pandemic Accord): దేశ సార్వభౌమత్వానికి , పౌరుల హక్కులకు పొంచి ఉన్న విపత్తు తేదీ : 09-08-2023 సమయం : ఉదయం 10 - 2 గంటలకు ప్రదేశం : ఆడిటోరియం సెమినార్ హాల్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ & సోషల్ స్టడీస్ ( సెస్ ) బేగంపేట్, హైదరాబాద్ వక్తలు : ప్రొఫెసర్ కోదండరాం, డా. దొంతి నర్సింహ రెడ్డి, సరస్వతి కవుల ప్రెజెంటేషన్ తర్వాత ఓపెన్ ఫోరమ్ చర్చ. (చదవండి: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం..భయం గుప్పెట్లో దేశాలు!) -
మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి..డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్!
మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి పూర్తిగా బయటపడ్డాం అని అనుకుంటున్న సమయంలో మరో వేరియంటే చాపకింద నీరులా వచ్చేస్తుంది. ఇంకా నేను ఉన్నానంటూ..మరో కొత్త వేరియంట్ రూపంలో భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ మహమ్మారి మొదలైన సమయంలో ఎదుర్కొన్న కష్టాలు అంత ఈజీగా మర్చిపోలేం. అందర్నీ ఇంట్లో బందీలుగా చేసింది. ఇప్పుడూ మళ్లీ మరో రూపంలో ఆ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ సైతం అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఏంటీ కొత్త వేరియంటే..ఎక్కడ వ్యాపించింది? ఇంతవరకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి, దాని తాలుకా కేసులు చూశాం. ఇప్పుడు అది ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ 'ఎరిస్' అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్‌లోని హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి..ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ఈ వారంలో ఆ కొత్త వేరియంట్‌కి సంబంధించి..సుమారు నాలుగువేల కేసు వచ్చాయిని చెప్పారు. ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త వేరియంట్‌కి జులై 31న "ఎరిస్" అనే పేరుతో వేరియంట్‌గా వర్గీకరించారు. తొలిసారిగా జూలై 3, 2023న దీని తాలుకా కేసులను గుర్తించారు. అది కాస్త నెమ్మదిగగా పెరగడంతో ఆరోగ్య అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు ఆస్పత్రిలో చేరే రేటు పెరగుతున్నట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు తక్కువుగానే ఉన్నాయని, అలాగే ఐసీయూలో అడ్మిట్ అవుతున్న కేసులు పెద్దగా పెరగలేదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్ఎస్ఏ) పేర్కొంది. ఏది ఏమైనా ఈ మహామ్మారీ కేసులు పెరగక ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు ఇయూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్ డాక్టర్ మేరి రామ్సే. ప్రజలంతా ఈ వైరస్ల బారిన పడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, అలానే శ్వాసకోస సంబంధ సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ఈ కొత్త వేరింట్ కేసులను ట్రాక్ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్లు, సంరక్షణ పద్దతులను అవలంబించాలని సూచించారు. అలాగే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండటమేగాక తమ రక్షణను వదులుకోవద్దని చెప్పారు. కాగా యూకేలో నెమ్మదిగా పెరుగుతున్న ఈ కొత్త వేరియంట్ కేసులపై నిపుణలు, అధికారలు పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రజలు ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరించారు అధికారులు. (చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!) -
ఆ అలవాటే కరోనా అటాక్ అవ్వడానికి ప్రధాన కారణమా?
కొందరికి ముక్కుని టచ్ చేయడం, లోపల పట్టి ఉన్నవాటిని తీయడం అనే బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అలవాటుగా అలా చేస్తూనే ఉంటారు. అవసరం ఉన్న లేకపోయినా అదే పనిగాముక్కుని టచ్ చేస్తూ లోపలి వేళ్లు పెట్టి క్లీన్ చేయడం వంటివి చేస్తారు. ఇది మంచిది కాదని ఇదే కరోనా ఈజీగా అటాక్ అయ్యేందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు శాస్తవేత్తలు. ఈ మేరకు నెదర్లాండ్స్‌లోని శాస్త్రవేత్తల బృందం తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇదే సమయంలో మనం కూడా కోవిడ్ సంబంధిత రోగులతో సన్నిహితంగా ఉంటే కరోనా అటాక్ అయ్యే అవకాశాలు మరింతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్స్‌లోని దాదాపు 219 మంది ఆరోగ్య కార్యకర్తలపై సర్వే చేయగా..సుమారు 84 శాతం మంది యాదృచ్ఛికంగానే ముక్కుని టచ్ చేయగా మిగిలినవారు అదే పనిగా ముక్కుని ముట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇలా ముక్కుని టచ్ చేస్తూ లోపల వేలు పెట్టి తిప్పే వారికే ఈజీగా కరోనా సోకినట్లు తేలింది. అలాగే గోర్లు కొరకడం, కళ్లకు ధరించే అద్దాలను శుభ్రపరచకపోవడం, గడ్డంతో ఉండట తదితరాలే కరోనా అటాక్ కావడానికి ప్రధాన కారణం అని చెప్పడం లేదని చెప్పారు శాస్త్రవేత్తలు. నిజానికి ఇలాంటి అలవాట్ల వల్ల క్రిములు, బ్యాక్టిరియా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఇక ముక్కుని చేతితో ముట్టుకోవడం, రంధ్రాల్లో పెట్టడం వల్ల సున్నితంగా ఉండే ముక్కు గోడలు దెబ్బతింటాయి. ఫలితంగా కోవిడ్ -19 సోకే అవకాశం పొంచి ఉంటుందని సూచించారు. ఇలాంటి అలావాట్లను దూరం చేసుకుంటే కరోనా మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు అటాక్ అవ్వకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారని పేర్కొంది శాస్త్రవేత్తల బృందం. (చదవండి: ఆకాశ పండు గురించి విన్నారా! ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!) -
కోవిడ్ కూడబెట్టిన బంగారం! పసిడి పొదుపుపై ఆసక్తికర అధ్యయనం
బంగారంపై భారతీయులకు ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. దాన్ని కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ఇదంతా తెలిసిందే. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లాడిస్తున్న సమయంలో భారతీయుల ఆర్థిక కార్యకలాపాలు, పొదుపు, బంగారు కొనుగోలు వంటి అంశాలపై ఓ ఆసక్తికర అధ్యయనం వెల్లడైంది. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశంలోని ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాలే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - అహమ్మదాబాద్ (ఐఐఎంఏ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ‘గోల్డ్ ఇన్ హౌస్‌హోల్డ్ పోర్ట్‌ఫోలియోస్ డూరింగ్ ఎ ప్యాండమిక్: ఎవిడెన్స్ ఫ్రం ఎమర్జెన్సీ ఎకానమీ’ పేరుతో రూపొందించిన అధ్యయన పత్రాన్ని ఐఐఎంఏ ఇటీవల తమ వెబ్సైట్లో ప్రచురించింది. ప్రతి 1000 జనాభాకు నమోదైన కోవిడ్ కేసులతోపాటు మరో సూచిక ఆధారంగా ఈ అధ్యయనం సంక్షోభ తీవ్రతలోని వైవిధ్యాన్ని సంగ్రహించింది. ఆభరణాల రూపంలో బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. ఒక సగటు భారతీయ కుటుంబం తన మొత్తం హోల్డింగ్‌లలో 11 శాతాన్ని బంగారంపై పెట్టుబడి పెడుతున్నట్లు ఈ అధ్యయన పత్రం పేర్కొంది. దీని ప్రకారం.. ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాల పొదుపు పోర్ట్‌ఫోలియోలలో బంగారం వాటా గణనీయంగా 6.9 శాతం ఎక్కువగా ఉంది. ఆయా కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు కోవిడ్‌కి ముందు కంటే మహమ్మారి సమయంలో గణనీయంగా పెరిగాయి. ఇదీ చదవండి ➤ రూ.2,000 నోటు ఉపసంహరణ ఎఫెక్ట్: ఆరేళ్ల గరిష్టానికి బ్యాంక్ డిపాజిట్లు 2020-21 ఆర్థిక సంవత్సరం కోవిడ్ సమయంలో ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (IGPC), పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (PRICE) ద్వారా నిర్వహించిన గోల్డ్ వినియోగానికి సంబంధించిన గృహ సర్వే ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో 160 జిల్లాల్లోని 40,427 కుటుంబాలతో ఈ సర్వే నిర్వహించారు. ఆ డేటా ఆధారంగా దేశంలో 21 రాష్ట్రాల్లోని 142 జిల్లాల్లోని 21,611 కుటుంబాలను శాంపిల్‌గా తీసుకుని అంచనాలను రూపొందించారు. ఆయా కుటుంబాల్లో బంగారంపై పొదుపులో వచ్చిన మార్పులను పోల్చడానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ‘ప్రైస్’ ముందస్తు ప్రతినిధి సర్వేను ఉపయోగించారు. ఇక జిల్లా స్థాయిలో కోవిడ్ కేసుల సంఖ్యను డెవలప్మెంట్ డేటా ల్యాబ్‌కు చెందిన సోషియో ఎకనామిక్ హై-రిజల్యూషన్ రూరల్-అర్బన్ జియోగ్రాఫిక్ ప్లాట్‌ఫాం ఫర్ ఇండియా (SHRUG) డేటాబేస్ నుంచి తీసుకున్నారు. -
ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లే
ముంబై: వ్యాపార ఒప్పందాల విషయంలో జాప్యం జరుగుతోందని మధ్య స్థాయి ఐటీ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ తెలిపింది. రాబోయే ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లు ఉంటాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కల్రా శుక్రవారం తెలిపారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్లను కంపెనీ చవిచూసిందని అన్నారు. ‘ప్రస్తుతం ఒప్పందాల ముగింపునకు ఎక్కువ సమయం పడుతోంది. సగటు సమయం సుమారు మూడు నెలల నుండి 4–6 నెలలకు చేరింది. జూన్ త్రైమాసికంలో కొత్త ఒప్పందాల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే రూ.2,050 కోట్ల నుంచి రూ.1,943 కోట్లకు పడిపోయింది. అయితే ఒప్పందాల విషయమై పలు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. కంపెనీ ఆదాయ వృద్ధి మార్చి త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 3 శాతం క్షీణించి రూ.2,321 కోట్లకు పడిపోయింది. నిర్ణీత సమయాల్లో మొత్తం 800 మంది ఫ్రెషర్లను బోర్డులోకి తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. మార్చితో పోలిస్తే జూన్ క్వార్టరులో ప్రాఫిట్ మార్జిన్ 0.5 తగ్గి 14.9 శాతంగా ఉంది. నికరలాభం 8.1 శాతం ఎగసి రూ.229 కోట్లను తాకింది. కొత్తగా 240 మంది చేరికతో మొత్తం సిబ్బంది సంఖ్య జూన్ చివరినాటికి 23,130కి చేరింది. కోల్‌కత, కొచి్చలో నూతనంగా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని సందీప్ వెల్లడించారు. -
వైరస్‌లను గుర్తించే స్మార్ట్ వాచ్
‘కోవిడ్’ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ పేరు చెబితేనే జనాలకు వెన్నులో వణుకు మొదలయ్యే పరిస్థితి దాపురించింది. వైరస్ల నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం కూడా చేశారు. ‘కోవిడ్’ తర్వాత వైరస్ల ఆచూకీని కనిపెట్టే సాంకేతికత కూడా అభివృద్ధి చెందింది. తాజాగా వైరస్ల జాడ గుర్తించగలిగే ‘విక్లోన్’ అనే ఈ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. టైమ్ చూపించడం సహా మిగిలిన పనులన్నీ ఇది ఇతర స్మార్ట్‌వాచీల మాదిరిగానే చేయడమే కాకుండా, చుట్టుపక్కల గాలిలో వైరస్లు ఉంటే, వెంటనే అప్రమత్తం చేస్తుంది. గాలిలోని సూక్ష్మకణాలను ఇది లోపలికి పీల్చుకుంటుంది. ఇందులో అమర్చిన అధునాతన సాంకేతికత ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కణాలు, వైరస్ కణాలు ఉన్నట్లయితే, వాటిని వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘డిజైనర్ డాట్’ వైరస్‌ను గుర్తించే ఈ స్మార్ట్‌వాచీని ‘విక్లోన్’ పేరుతో రూపొందించింది. -
ఆదర్శం వాస్తవమైన వేళ...
‘వృత్తి నైపుణ్యానికి వ్యక్తిత్వ వికాసం’ పేరుతో గతంలో అనేక మండలాల్లో అధ్యాపకులకు (ప్రాథమిక, ఉన్నత పాఠశాలల) రిసోర్స్ పర్సన్‌గా వేసవి శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండటంతో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఓ మండల అభివృద్ధి అధికారి... అక్కడి విద్యాశాఖాధికారి సలహా మేర అప్పటి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే అవకాశం ఈ వ్యాస రచయితకు కల్పించారు. ఆ శిక్షణా తరగతుల్లో దాదాపు వెయ్యి మంది వాలంటీర్లు పాల్గొన్నారు. అప్పుడా సందర్భంగా వారితో ప్రసంగ సంభాషణల్లో ప్రస్తావించిన అనేక అంశాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవరూపం దాల్చటం, అటు లబ్ధిదారులు, ఇటు వాలంటీర్ల నోటిద్వారా వింటూ, చూస్తూ ఉంటే ఎంతో ఆనందం సంతృప్తి కలుగుతోంది. అప్పటి ఆరంభ దశలోని మహోన్నత ఆశయాలు, ఆదర్శాలు ఈ అనతి కాలంలోనే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఆచరణ రూపం దాల్చాయి. తమ దైనందిన సమస్యల నుండి వాలంటీర్ల సేవ ద్వారా విముక్తులు అయినవారు వాలంటీర్లను ప్రశంసించడం ఎంతైనా ముదావహం. అందునా కోవిడ్–19 లాంటి విపత్కర సమయాలలో ఆ యా వాలంటీర్ల అనుపమాన సేవలు సమాజానికి ఎంత అవసరం ఉందో వీటి పట్ల అవగాహన ఉన్న అందరికీ తెలియ వచ్చింది. అప్పటి వారికి ఉద్బోధించిన వాటిలో ముఖ్యమైనవాటిలో కొన్ని... ఈ నూతన వ్యవస్థ ద్వారా వారు తమకు కేటాయించిన యాభై కుటుంబాలలో అంతర్భాగమై, ఆయా కుటుంబ సభ్యుల వయసు/ వృత్తి/ స్వభావం లాంటి వాటితో నిమిత్తం లేకుండా వారితో ఎంతగా మమేకం అవ్వాలనేదీ; అది వారి వృత్తినీ, వ్యక్తిత్వాన్నీ ఎంతగా పరిపూర్ణం చేసేదీ చెప్పాను. ఈ ఆత్మీయతా భావం వారికి పుట్టుకతో ఏర్పడే బంధుత్వాలకన్నా వయసు రీత్యా ఏర్పడే అతి కొద్దిమంది స్నేహితులు కన్నా మించి లభించిన అరుదైన అపురూప అవకాశముగా భావించాల్సిందిగా ప్రస్ఫుటం చేశాను. వారి పట్ల ప్రేమతో చేసే సేవ అన్నిటికన్నా మహోన్నతమైనదిగా వివరించాను. తమ విద్యుక్త ధర్మం సక్రమంగా నెరవేర్చడానికీ, సేవా నిరతిని దృఢ సంకల్పంతో ప్రదర్శించటానికీ, ప్రకటించడానికీ అవసరమైన శారీరక మానసిక ఆరోగ్యం ఎంతటి అత్యవసరమో, అలాగే బాధ్యత విషయంలో భావప్రకటనా సామర్థ్యం, సంబంధిత అంశాల/పథకాల పట్ల విషయ పరిజ్ఞానం, కాల వినియోగం పట్ల చక్కటి ప్రణాళిక –ఆచరణ, అందరితో ఎల్లప్పుడూ సత్సంబంధాలూ, అలాగే ఏ విధంగా ప్రభుత్వ పథకాలన్నీ నిజమైన అర్హులకు చేర్చాల్సినదీ, అందుకు కావాల్సిన ఓర్పు, సహనం, కారుణ్యం లాంటి మానవీయ లక్షణాలు ఎంత ముఖ్యమో వివరించాను. కుల, మత రాజకీయాలకు అతీతంగా, కోట్లాది మంది తమ గడప దగ్గరే తమకు కావలసినవి తగిన సమయంలో తగిన రీతిలో ఇప్పటిలాగే నిరంతరం పొందాలంటే ఈ వ్యవస్థ ఉండాల్సిందే. అందరూ కోరుకునేది ఇదే. వ్యవస్థలో లోటుపాట్లు ఉంటే తప్పనిసరిగా సరిదిద్దవలసిందే. అలాకాక మొత్తంగా వాలంటీర్లను కాదనటం అంటే వారి సేవల వల్ల కలిగే ప్రయోజనాలను కాదని అనడమే. ఏమాత్రం వివేకం, విజ్ఞత ఉన్న మనుషులు చేయదగిన పని ఇది కాదు. ప్రొ‘‘ బి. లలితానంద ప్రసాద్ వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ‘ 9247499715 ‘ -
ఆఖరి మజిలీకి అన్నీ తామై..!
రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. వైరస్ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఎక్కడ చూసినా రెడ్జోన్లు.. నిర్మానుష్యంగా వీధులు.. ఇంట్లో నుంచి బయటకు కదిలే పరిస్థితి లేదు.. ఎవరినైనా తాకాలంటే భయం.. ఇక కరోనా బారిన పడి మరణించినవారికి అంత్యక్రియలకు కూడా ఎవరూ ముందుకురాని దుస్థితి. మృతుల కుటుంబీకులు సాయం కోసం పిలిస్తే సొంత బంధువులు కూడా ముఖం చాటేసే రోజులు. ఆ సమయంలో వలంటీర్లు మొక్కవోని ధైర్యంతో విశేష సేవలందించారు. మృతదేహాలను దగ్గరుండి ఆఖరి మజిలీకి చేర్చారు. అన్నీతామై ఆత్మబంధువులుగా నిలిచారు. – పలమనేరు కోవిడ్ సెకెండ్ వేవ్.. మే 2021 లాక్డౌన్ అమల్లో ఉంది. పలమనేరు పట్టణంలోని ఆది ఆంధ్రవీధికి చెందిన జమున(50) అ నే మహిళ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు ఓ కుమార్తె మినహా ఇంకెవరూ లేరు. ఓ రోజు హఠాత్తుగా జమున తన ఇంట్లోనే మరణించింది. కుమార్తె తన తల్లి అంత్యక్రియలకు సహకరించమని బంధులను ప్రాధేయపడింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో తల్లడిల్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రంగాపురం వార్డు సచివాలయ వలంటీర్ మైఖేల్ సురేష్ వెంటనే స్పందించాడు. స్థానిక గాంధీనగర్ శ్మశానవాటికకు చెందిన కొందరిని తీసుకువచ్చాడు. మృతురాలి బంధువుల్లో ఇద్దరితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ఒప్పించాడు. జమునకు సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నాడు. అందరితోనూ శభాష్ అనిపించుకున్నాడు. జేసీబీలు రాని సమయంలో.. పలమనేరు సమీపంలోని సాయినగర్‌కు చెందిన వైఎస్సార్సీపీ నేత బద్రి కోవిడ్ కారణంగా 2021 మేలో మృతి చెందాడు. అతడి స్వగ్రామం కొలమాసనపల్లెలో అంత్యక్రియ లు నిర్వహించేందుకు కుటుంబీకులు సన్నద్ధమయ్యారు. అయితే ఖననానికి గుంత తవ్వేందుకు జేసీబీ దొరకలేదు. అడిగినంతా ఇస్తామని నచ్చజెప్పినా జేసీబీ నిర్వాహకులు ముందుకు రాలేదు. ఇదే పరిస్థితి సంబార్‌పూర్‌లో ఓ వ్యక్తి కోవిడ్‌తో మృతి చెందితే తలెత్తింది. బ్యాంకర్స్ కాలనీలోనూ ఓ మహిళ మృతి చెందితే ఖననం చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వలంటీర్లే సేవలందించారు. సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మృతులను ఆఖరి మజిలీలకు చేర్చారు. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపించారు. ఎన్నటికీ మరువలేం మా ఇంటి పక్కనే ఉన్న జమునమ్మ మృతి చెందింది. ఆమెకు ఓ కుమార్తె మాత్రమే ఉంది. జమునమ్మకు అంత్యక్రియలను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో మా వార్డు వలంటీర్ మైఖేల్ అన్నీతానై వ్యవహరించాడు. సొంత మనుషులు పట్టించుకోకున్నా దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాడు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మైఖేల్ అందించిన సేవలను ఎన్నటికీ మరువలేం. – ప్రవళ్లిక, ఆదిఆంధ్ర వీధి, పలమనేరు కుటుంబీకులుగానే భావిస్తా నా వార్డు పరిధిలోని 50 కుటుంబాలను నా సొంత కుటుంబీకులుగా భావిస్తా. సేవచేయాలనే ఆలోచనతోనే వలంటీర్‌గా చేరా. డబ్బు సంపాదన కోసం ఇందులోకి రాలేదు. కోవిడ్ సమయంలో మృతదేహాలకు అంత్యక్రియలు చేయలేదంటే తట్టుకోలేక పోయేవాడిని. అందుకే నేనే ప్రత్యేక చొరవ తీసుకుని సేవలందించా. నాకు ఈ తృప్తి చాలు. – మైఖేల్ సురే‹Ù, వలంటీర్, పలమనేరు -
ముంబయి కొవిడ్ స్కాం: శివసేన నేతల సహచరుల ఇళ్లలో ఈడీ సోదాలు
మహారాష్ట్ర: కొవిడ్ ఫీల్డ్ ఆస్పత్రి స్కామ్ కేసులో శివసేన(యూబీటీ) నేతలు అధిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ అనుచరుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. ఐఏఎస్ అధికారి సంజీవ్ జైశ్వాల్‌తో పాటు ఆదిత్య ఠాక్రే అనుచరుడు సూరజ్ ఛవాన్, సంజయ్ రౌత్‌కు సన్నిహితుడైన సుజిత్ పాట్కర్ ఇళ్లలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. థాణె, నవీ ముంబయిలో మొత్తం 15 ప్రదేశాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. జైశ్వాల్ థాణె మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. కొవిడ్ సమయంలో ముంబయి అదనపు కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఫీల్డ్ ఆస్పత్రి కాంట్రాక్టు కేటాయింపులపై ముంబయి కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన ఇక్భాల్ సింగ్ చాహల్‌ను జనవరిలోనే ఈడీ ప్రశ్నించింది. సుజిత్ పాట్కర్‌పై ఇప్పటికే మనీ లాండరింగ్ అభియోగాలు ఉన్నాయి. ఇదీ కేసు.. ఆరోగ్య రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినా కొవిడ్ సమయంలో సుజిత్ పాట్కర్కే ఫీల్డ్ ఆస్పత్రి కాంట్రాక్టు దక్కింది. తప్పుడు విధానంలో కాంట్రాక్టులు దక్కించుకున్నారని గతేడాది ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నేత కీర్తి సోమయ్య ఫిర్యాదుచేశారు. దీంతో లైఫ్‌లైన్ మేనేజ్మెంట్ సర్వీసెస్, పాట్కర్, అతడి ముగ్గురు సన్నిహితులపై కేసులు నమోదు చేశారు. ఇదీ చదవండి: మొట్టమొదట యోగాకు ప్రాచుర్యం కల్పించిన ప్రధాని ఆయనే.. -
భారత్ అప్పుపై ఆందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం నిర్వహించిన చక్కని ఆర్థిక నిర్వహణ వల్ల భారత్ ‘‘అత్యంత రుణగ్రస్తుల దేశం’’ సంక్షోభంలోకి పోకుండా రక్షణ పొందిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘భారతదేశం అప్పులు అధిక స్థాయికి పెరిగిపోయాయని ఆరోపిస్తున్న వారే మహమ్మారి సమయంలో డబ్బును ముద్రించి పంపిణీ చేయమని ప్రభుత్వానికి సలహా ఇచ్చిన వ్యక్తులు’’ ఆమె విమర్శించారు. ప్రభుత్వం వారి సలహాను ఆమోదించినట్లయితే, భారత్ ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కాకుండా అత్యంత రుణగ్రస్తుల దేశంగా మారిపోయి ఉండేదని బీజేపీ ’మహాజన్ స్మా్పర్క్ అభియాన్’లో భాగంగా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె అన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, అప్పులపై భారత్ ఆందోళన చెందనక్కర్లేదని ఉద్ఘాటించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సీతారామన్, ఇటీవల తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఆప్ ప్రభుత్వానికిచెందిన పలువురు మంత్రులు జైలులో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ రుణ భారాలు ఇలా... 2002 సెప్టెంబర్ నాటికి భారత్ ప్రభుత్వ మొత్తం రుణ భారం రూ.147 లక్షల కోట్లు ఉంటే, డిసెంబర్ త్రైమాసికానికి ఇది 2.6 శాతం పెరిగి రూ.151 లక్షల కోట్లకు ఎగసింది. మొత్తం రుణాల్లో పబ్లిక్కు చెల్లించాల్సింది 89 శాతం. సెప్టెంబర్ 89.1 శాతంతో పోల్చితే ఇది తగ్గింది. భారత్ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం పురోగమించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డాలర్లలో చూస్తే, 3.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2023 క్యాలెండర్ ఇయర్లో 3.7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. భారత్ రుణ భారం తగ్గే అవకాశం: మూడీస్ ఇదిలాఉండగా, భారత్ రుణ భారం తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం నాడు ఒక నివేదికలో పేర్కొంది. భారత్ ఆర్థిక బలం, పటిష్ట రుణ చెల్లింపుల పరిస్థితులను ఈ సందర్భంగా మూడీస్ ప్రస్తావించింది. ‘‘భారత్ పటిష్ట జీడీపీ వృద్ధి రేటును కొనసాగించినంతకాలం దేశ రుణ భారం స్థిరంగా ఉంటుంది లేదా కొద్దిగా తగ్గుతుంది‘ అని మూడీస్ తాజా నోట్లో పేర్కొంది. స్థిర అవుట్‌లుక్‌తో మూడీస్ భారత్‌కు అతితక్కువ పెట్టుబడుల గ్రేడ్– బీఏఏ3 సావరిన్ రేటింగ్‌ను ఇస్తోంది. రేటింగ్ పెంపుపై భారత్ అధికారులు మూడీస్ ప్రతినిధులతో శుక్రవారం సమావేశం కానున్నారు. ఒక దేశంలో పెట్టుబడులకు పెట్టుబడిదారులు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్‌పై ఆధారపడే సంగతి తెలిసిందే. -
ప్రపంచ ఆరోగ్యమే లక్ష్యంగా...
ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాల వినియోగాన్ని భారతదేశం ప్రోత్సహిస్తోంది. కోవిడ్–19 సమయంలో అభివృద్ధి చేసి అమలు చేసిన కో–విన్, ఈ–సంజీవని వంటివి లక్ష్యాల సాధన కోసం ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే ఒకరితో సంబంధం లేకుండా మరొకరు పనిచేసినప్పుడు ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంవత్సరాల తరబడి వినియోగంలో ఉన్న వ్యవస్థ మరో ప్రాంతంలో మళ్లీ మొదటి నుంచి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో జరుగుతున్నది ఇదే. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠంగా అమలు జరగడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణిక వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. జీ–20 అధ్యక్ష హోదాలో ఏకాభిప్రాయం సాధించడానికి భారతదేశం పని చేస్తోంది. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకోండి. ఇంటర్నెట్ సౌకర్యం లేక ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విడివిడిగా పనిచేస్తున్న కంప్యూటర్ నెట్‌వర్క్‌ల పనితీరు ఎలా ఉంటుంది? ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కంప్యూటర్ నెట్వర్క్ పనిచేసినప్పుడు ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంవత్సరాల తరబడి వినియోగంలో ఉన్న వ్యవస్థ మరో ప్రాంతంలో నూతన వ్యవస్థగా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రామాణిక ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) అమలులో లేకపోతే పరిస్థితి అసంబద్ధంగా ఉండేది. ఇది ప్రస్తుతం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో నెలకొని ఉన్న పరిస్థితిని గుర్తు చేస్తోంది. వివిధ సాంకేతిక అంశాల ఆధారంగా, వివిధ ప్రాంతాల్లో వివిధ విధాలుగా డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ సాగుతోంది. సరైన విధంగా అమలు జరిగి ఆశించిన ఫలితాలు ఇవ్వడానికి ఆ వ్యవస్థ మార్గనిర్దేశకుల కోసం ఎదురు చూస్తోంది. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠంగా అమలు జరగడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణిక వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. వ్యవస్థను పటిష్ఠంగా అమలు చేయడానికి అంతర్జాతీయ నాయకత్వం అవసరం ఉంటుంది. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పరిమాణం చిన్నదిగా కనిపించవచ్చు. అయితే, ఈ రంగం అనేక రంగాల్లో అవకాశాలను అందిస్తుంది. స్మార్ట్ వేరియబుల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ కేర్, రీమోట్ మానిటరింగ్, కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్, బ్లాక్–చైన్, రీమోట్ డేటా లాంటి రంగాల్లో అపారమైన అవకాశాలు వస్తాయి. డిజిటల్ పరికరాల సామర్థ్యం, అవసరం కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన చర్యల ప్రాధాన్యాన్ని గుర్తించాల్సి ఉంటుంది. డిజిటల్ సాధనాల వినియోగం ఇటీవలి కాలంలో ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాల వినియోగాన్ని భారతదేశం ప్రోత్సహిస్తోంది. కోవిడ్–19 సమయంలో అభివృద్ధి చేసి అమలు చేసిన కో–విన్, ఈ–సంజీవని వంటివి లక్ష్యాల సాధన కోసం ఉపయోగపడ్డాయి. టీకా కార్యక్రమం, ఆరోగ్య సంరక్షణ చర్యల అమలులో సమూల మార్పులు వచ్చాయి. డిజిటల్ సాధనాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే అంశంలో ప్రభుత్వం విజయం సాధించింది. భారతదేశంలో అమలు జరిగిన అతిపెద్ద టీకా కార్యక్రమానికి కో–విన్ వెన్నెముకగా నిలిచింది. కో–విన్ ద్వారా వ్యాక్సిన్ రవాణా కార్యక్రమం అమలు జరిగిన తీరును ప్రభుత్వం పర్యవేక్షించింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ టీకా కోసం నమోదు చేసుకోవడం, డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేయడం లాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కో–విన్ సహకారంతో జరిగాయి. ఇక్కడ మరో డిజిటల్ సాధనం ఈ– సంజీవని గురించి ప్రస్తావించాలి. ఈ–సంజీవని ద్వారా ప్రజలు ఆన్లైన్ ద్వారా ఆరోగ్య సంప్రదింపులను పొందుతున్నారు. తమ ఇళ్ల నుంచే నిపుణులను సంప్రదించి సలహాలు పొందే అవకాశాన్ని ఈ–సంజీవని అందుబాటులోకి తెచ్చింది. 10 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ–సంజీవని ద్వారా ప్రయోజనం పొందారు. గరిష్ఠ స్థాయిలో ఈ–సంజీవని ద్వారా రోజుకు 5 లక్షల సంప్రదింపులు జరిగాయి. డిజిటల్ విధానంలో నిర్వహించిన కోవిడ్ వార్ రూమ్ వల్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలిగింది. దీని ద్వారా జాతీయ, రాష్ట్ర , జిల్లా స్థాయిలో వ్యాధి తీవ్రత తెలుసుకుని అవసరమైన సామగ్రి సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం కలిగింది. ఆరోగ్య సేతు, ఆర్టీ –పీసీఆర్ యాప్, ఇతర డిజిటల్ సాధనాలను విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించిన ప్రభుత్వం కోవిడ్–19 మహమ్మారి రూపంలో వచ్చిన భారీ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించగలిగింది. ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాలను పూర్తి సామర్థ్యం మేరకు ఉపయోగించుకోవడానికి పటిష్ఠమైన వ్యవస్థ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ– ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్) పని చేయడం ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు వారి వైద్య రికార్డులు నిల్వ చేయడానికి, అవసరమైన సమయంలో చూసి అవసరమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి నిపుణులకు పంపడానికి అవకాశం కలుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి సాధించిన విజయాలు, ప్రణాళికలను ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్య–ఆదాయ దేశాలు భారతదేశం అనుసరించిన విధానాలు అనుసరించి తమ దేశ ప్రజలకు డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావడానికి వీలవుతుంది. దీనివల్ల సార్వత్రిక ఆరోగ్య కల సాకారం అవుతుంది. ఎదుర్కొంటున్న సవాళ్లు కాపీరైట్, ఇతర నిర్వహణ యాజమాన్య వ్యవస్థల వల్ల డిజిటల్ పరిష్కార వేదికలు అందరికీ అందుబాటులోకి రావడం లేదు. కొన్ని డిజిటల్ సాధనాలు లేదా ఓపెన్ సోర్స్ పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి వినియోగం పరిమితంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం అని చెప్పుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రయత్నాలు విడివిడిగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా దేశాల మధ్య సహకారం లేకుండా సాగుతున్నాయి. దీనికోసం ప్రపంచ దేశాలు ఒక వేదిక పైకి వచ్చి సంఘటిత ప్రయత్నాలు సాగించాలి. దీనికి జీ–20 ఒక సమగ్ర, పటిష్ట వేదికగా పనిచేస్తుంది. ఈ ప్రయత్నాలు భవిష్యత్తు అవసరాలకు అవసరమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి దారి తీస్తాయి. జీ–20 అధ్యక్ష హోదాలో... ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. దీనికి అవసరమైన ప్రణాళిక కూడా భారతదేశం వద్ద సిద్ధంగా ఉంది. ముందుగా విడివిడిగా జరుగుతున్న ప్రయత్నాలను సంఘటితం చేయాల్సి ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ ప్రయోజనం కలిగించేలా ఈ చర్యలు అమలు జరగాలి. దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ అభివృద్ధి కోసం జరిగిన ప్రయత్నం, కృషి మరోసారి డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి కోసం జరగాల్సి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సమాచార మార్పిడిపై దేశాల మధ్య నమ్మకం పెరిగేలా చూసి, అవసరమైన నిధులు సమకూర్చ డానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరగాలి. జీ–20 అధ్యక్ష హోదాలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం సాధించడానికి భారతదేశం పని చేస్తోంది. ఆచరణ సాధ్యమైన వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలు ముఖ్యంగా దక్షిణ దేశాలు ప్రయోజనం పొందేలా చూసేందుకు భారతదేశం కృషి చేస్తోంది. స్వప్రయోజ నాలను పక్కన పెట్టి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ప్రపంచ ఆరోగ్యం కోసం కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమయింది. డాక్టర్ మన్సుఖ్ మండావియా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు – ఎరువుల శాఖ మంత్రి -
కోవిన్ పోర్టల్.. ఫుల్ సేఫ్
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలకు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తోందని వెల్లడించింది. పోర్టల్‌లోని డేటా భద్రంగా ఉందని, డేటా ప్రైవసీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డేటా లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం ఆకతాయిల పనేనని పేర్కొంది. డేటా లీక్ వార్తలపై సెర్ట్–ఇన్ వెంటనే స్పందించిందని, కోవిన్ యాప్‌పై లేదా డేటాబేస్‌పై ప్రత్యక్షంగా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ఫోన్ నెంబర్లు ఎంట్రీ చేస్తే కోవిన్ యాప్ వివరాలను చూపిస్తోందని చెప్పారు. అంతేతప్ప వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. కాగా, కోవిన్ పోర్టల్ నుంచి ముఖ్యమైన డేటా లీకైనట్లు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మొత్తం డేటా మేనేజ్మెంట్ వ్యవస్థ గోప్యతపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? కరోనా టీకా తీసుకున్న వారి వ్యక్తిగత డేటా కోవిన్ పోర్టల్‌లో నిక్షిప్తమైన సంగతి తెలిసిందే. టీకా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు ఆన్లైన్ మెసెంజర్ యాప్ ‘టెలిగ్రామ్’లో కనిపిస్తున్నట్లు కొందరు ట్విట్టర్ ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ వ్యవహారంపై కొన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత లేకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశాయి. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి, వివరణ ఇచ్చింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా మాత్రమే కోవిన్ పోర్టల్‌లోని తమ వివరాలను లబ్ధిదారులు తెలుసుకోవచ్చని పేర్కొంది. లబ్ధిదారులు మినహా ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల చిరునామాలు తెలుసుకొనే వెలుసుబాటు కూడా లేదని వెల్లడించింది.