రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్) -2016 ప్రాథమిక కీని ఈనెల 20న ఏపీసెట్ వెబ్‌సైట్ www.apset.net.in లో ఉంచుతున్నట్లు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు
అభ్యర్థులు పరీక్షలో వచ్చిన ప్రశ్నలపై ఎటువంటి సందేహాలున్నా ఈనెల 25వ తేదీలోగా apsetau@gmail.com మెయిల్ ఐడీకి పూర్తి వివరాలు పంపాలి. విద్యార్థులు తమ పరీక్ష హాల్‌టికెట్, ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానాన్ని తెలుపుతూ సంబంధిత ఆధారాలను ఈమెయిల్‌కు జతపరచాలి. 25వ తేదీ సాయంత్రం 5 గంటల తరువాత వచ్చే అభ్యర్థనలు స్వీకరించరు.