గ్రామాలకు కేంద్రం ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 10% నిధులనే పాత విద్యుత్ బకాయిలకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం
పంచాయతీరాజ్ కమిషనర్‌కు సర్పంచుల ఐక్యవేదిక ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: గ్రామాలకు కేంద్రం ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 10% నిధులనే పాత విద్యుత్ బకాయిలకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అధికారులు 30% నిధులను కోత పెడు తున్నారని సర్పంచుల ఐక్యవేదిక ఆరోపిం చింది. ప్రభుత్వమిచ్చిన ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆందోల్‌కృష్ణ ఆధ్వర్యంలో పలు జిల్లాల సర్పంచులు శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూప్రసాద్‌ను కలసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కాకపోవడం, సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తెచ్చారు. సమస్యలపై దృష్టి సారిస్తానని, ప్రభుత్వ ఆదేశాలు అమల య్యేలా చూస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. కమిషనర్‌ను కలసిన వారిలో సర్పంచుల ఐక్యవేదిక ప్రతినిధులు బుచ్చి రాములు, సుమంగళి, బాలగౌడ్, ప్రభాకర్ రెడ్డి, ఎం.బాబు, వి.సత్యం తదితరులున్నారు.