ఇప్పుడే హీరో ట్యాగ్‌ వద్దు | Sudigali Sudheer Interview about 3 Monkeys Movie | Sakshi
Sakshi News home page

ఇప్పుడే హీరో ట్యాగ్‌ వద్దు

Published Fri, Feb 7 2020 5:28 AM | Last Updated on Fri, Feb 7 2020 5:28 AM

Sudigali Sudheer Interview about 3 Monkeys Movie - Sakshi

‘సుడిగాలి సుధీర్

‘‘ప్రేక్షకులకు వినోదం పంచాలని ఇండస్ట్రీకి  వచ్చాను. టీవీ, సిల్వర్‌ స్క్రీన్, యూట్యాబ్‌ చానెల్‌ ఇలా ప్లాట్‌ఫామ్‌ ఏదైనా పర్లేదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్‌. ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్‌’ శ్రీను, రాంప్రసాద్‌ ప్రధాన తారాగణంగా అనిల్‌ కుమార్‌ జి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్‌’. నగేష్‌. జి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ‘సుడిగాలి’ సుధీర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ పాత్ర చేశా.

మా సినిమాకి ఊహించిన స్థాయిలో థియేటర్స్‌ రాకపోవడంతో కాస్త ఆందోళనగా ఉన్నాం. చిరంజీవిగారు మా ట్రైలర్‌ చూసి చాలా బాగుందన్నారు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తానన్నారు. నేను హీరోగా చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’కి మంచి వసూళ్లు వచ్చాయి. దానికి కారణం నేను ఫ్యామిలీలా భావించే నా ఫ్యాన్సే. హీరోగా ఓ సినిమా కమిట్‌ అయ్యాను. హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడే హీరో అనే ట్యాగ్‌ వద్దు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement