దేవీ శ్రీ దర్శకత్వంలో సుకుమార్‌..! | Sukumar In Devi Sri Prasad Direction | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 7 2018 12:18 PM | Last Updated on Sat, Jul 7 2018 4:31 PM

Sukumar In Devi Sri Prasad Direction - Sakshi

సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ దర్శకత్వంలో స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ నటించారు

అవును.. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ దర్శకత్వంలో స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ నటించారు. ప్రతీ ఏడాది లాగే దేవీ ఈ ఏడాది కూడా ఫారిన్‌లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో ఈ కన్సర్ట్స్‌ జరగనున్నాయి. ఈ షోకు సంబంధించిన ప్రోమోనూ దేవీ శ్రీ స్వయంగా డైరెక్ట్‌ చేశారు. షోకు సంబంధించిన వివరాలను తెలియ జేస్తూ రూపొందించిన ఈ ప్రోమోలో దర్శకుడు సుకుమార్ నటించారు. 

దేవీ శ్రీ, సుకుమార్‌ ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ స్నేహం కారణంగా దేవీ అడిగిన వెంటనే ప్రోమోలో నటించేందుకు అంగీకరించాడు సుకుమార్‌. ఈ ప్రోమో ఈ రోజు (శనివారం) సాయంత్రం 6 గంటలకు సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement