జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకొని ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకొని ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కుప్వారా ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ కారణంగా ఓ లెఫ్టినెంట్ కల్నల్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు.
అక్కడి చుట్టుపక్కల అడవిలో తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో వారికి ఉగ్రవాదులు ఎదురవ్వగా.. ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సమయంలో వారు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఓ ఉగ్రవాది పోలీసుల కాల్పులకు హతమయ్యాడు. హంద్వారాలోని భవన్ అనే గ్రామంలో ఉగ్రవాదుల అలికిడి ఉందని గత శనివారం సమాచారం అందినప్పటి నుంచి బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.