జమ్ము కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది.
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. కశ్మీర్ కుప్వారా జిల్లా తంగ్ ధర్ ప్రాంతంలో సైనికులకు, ఉగ్రవాదులకు కాల్పులు చోటు చేసుకున్నాయి. అక్రమంగా దేశంలో చొరబడడానికి వీరు ప్రయత్నించారు. వీరి వద్ద నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, కరెన్సీని ఆర్మీ స్వాధీనం చేసుకుంది. మృతి చెందిన ముగ్గురిని లష్కర్ ఇ తొయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు.