‘ఒక జడ్జి నియామకానికిగానీ లేదా పదోన్నతికిగానీ సంబంధించి కొలీజియం చేసే సిఫార్సుపై అసమ్మతి వ్యక్తమైతే దానిని
న్యూఢిల్లీ: ‘ఒక జడ్జి నియామకానికిగానీ లేదా పదోన్నతికిగానీ సంబంధించి కొలీజియం చేసే సిఫార్సుపై అసమ్మతి వ్యక్తమైతే దానిని కార్యనిర్వాహక వర్గంతో పంచుకోవాలి’ ఇది మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంవోపీ) ముసాయిదాలో కేంద్రం చేర్చాలని భావిస్తున్న నిబంధనల్లో ఒకటి. ఉన్నత కోర్టుల్లో జడ్జీల నియామకాన్ని పారదర్శకం చేయడానికి కేంద్రం ఎంవోపీ ముసాయిదాను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని ఎంవోపీపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ), కొలీజియంలోని ఇతర సభ్యులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం తుది ముసాయిదా ఎంవోపీని త్వరలో సీజేఐకి అందించేందుకు కసరత్తు చేస్తోంది.
కొలీజియం సిఫార్సులపై ఎవరైనా సభ్యుడు అసమ్మతి వ్యక్తపరిస్తే ఆ నోట్‌నూ సిఫార్సుకు జతచేసి.. సీజేఐ న్యాయమంత్రికి పంపుతారు. దాన్ని ఆయన ప్రధానికి.. ప్రధాని దానిని తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు. దీంతో ఆయన ఈ నోట్‌నూ పరిగణనలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.