
సాక్షి, విజయవాడ : ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు దళితులకు చేసిందేమి లేదని వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక దళితులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల జీవో దళితుల పొట్ట కొట్టేదిగా ఉందని మండిపడ్డారు. లంక భూములకు ఒక ప్యాకేజీ, పట్టా భూములకు ఓ ప్యాకేజీ ఇస్తూ దళితులను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో ఉన్న వ్యవసాయ కూలీలకు సైతం పనులివ్వకుండా బీహర్ తదితర రాష్ట్రాల నుంచి తెస్తూ స్థానికులు అన్యాయం చేస్తున్నారన్నారు. రాజధానిలో దళిల కూలీలకు గృహాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్‌తోనే దళితులకు న్యాయం జరుగుతుందని సురేష్ చెప్పారు. దళితుల పట్ల చిన్న చూపు చూస్తున్న చంద్రబాబుకు.. వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు.