స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న బీల్ ఓపెన్ చెస్ ఫెస్టివల్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, తెలుగుతేజం హరికృష్ణకు రెండో రౌండ్లోనూ ...
హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న బీల్ ఓపెన్ చెస్ ఫెస్టివల్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, తెలుగుతేజం హరికృష్ణకు రెండో రౌండ్లోనూ డ్రా ఫలితమే ఎదురైంది.
మంగళవారం క్లాసిక్ విభాగంలో గ్రాండ్‌మాస్టర్ నికో జార్జియడిస్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో తెల్లపావులతో బరిలోకి దిగిన హరికృష్ణ 55 ఎత్తుల్లో గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఇదే టోర్నీ ర్యాపిడ్ విభాగంలో హరికృష్ణ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.