ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనం | Williams Sisters Crash Out of French Open 2018 Doubles | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 4 2018 8:03 AM | Last Updated on Mon, Jun 4 2018 8:15 AM

Williams Sisters Crash Out of French Open 2018 Doubles - Sakshi

విలియమ్స్‌ సిస్టర్స్‌

పారిస్‌/రొనాల్డ్‌ గారోస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీలో సంచలనం చోటు చేసుకుంది. ఉమెన్‌ డబుల్స్‌ విభాగం నుంచి విలియమ్స్‌ సిస్టర్స్‌ నిష్క్రమించారు. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో అండ్రెజా క్లెపాక్‌(స్లోవేనియా)-మరియా జోస్‌ మార్టినెజ్‌(ఇటలీ) చేతిలో  ఓటమిపాలయ్యారు. చివరి సెట్‌ను విలియమ్స్‌ సోదరీమణులు చిత్తుగా కోల్పోవటం విశేషం.

మొత్తం మూడు రౌండ్లలో 6-4, 6-7(4), 6-0 తేడాతో ఓడిపోయారు. నిర్ణయాత్మక రౌండ్‌లో కనీస పోటీని కూడా ప్రదర్శించలేకపోయారు. కాగా, సెరెనా-వీనస్‌లు ఇప్పటిదాకా 14 గ్రాండ్‌ స్లామ్‌ డబుల్స్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మహిళల సింగిల్స్‌ విభాగం నాలుగో రౌండ్‌లో భాగంగా సెరెనా, రష్యన్‌ టెన్నిస్‌ క్వీన్‌ మరియా షరపోవాతో తలపడనుంది. గతంలో వీరిద్దరి 18సార్లు తలపడగా, 16 సార్లు సెరెనా, 2 సార్లు షరపోవా నెగ్గారు. 

జకోవిచ్‌ ఖాతాలో మరో రికార్డు... పురుషుల విభాగంలో నోవాక్‌ జకోవిచ్‌‌(సెర్బియా).. స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో వర్దాస్కోపై 6-3, 6-4, 6-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. జకోవిచ్‌కు ఇది క్లే మైదానంలో 200వ విజయం. జకోవిచ్‌ తన తదుపరి మ్యాచ్‌లో ఇటలీకి చెందిన మార్కో కెచ్చినషియోతో తలపడనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement