
Photo Credit: US Open Twitter
యూఎస్ ఓపెన్ 2022లో భాగంగా నాలుగో రోజు పెద్దగా ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నాదల్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినిని 2-6, 6-4, 6-2, 6-1తేడాతో చిత్తు చేసి మూడోరౌండ్‌కు చేరుకున్నాడు.
అయితే తొలి గేమ్ ఓడిన అనంతరం నాదల్ రాకెట్.. అతని ముక్కును చీల్చడంతో రక్తం కారింది. అయితే దీనిని లెక్కచేయని నాదల్ ఆ తర్వాత తన జోరును ప్రదర్శించాడు. పవర్‌ఫుల్ షాట్లతో విరుచుకుపడిన నాదల్.. ప్రత్యర్థి ఫోగ్నినిని వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఇక 23 వ గ్రాండ్‌స్లామ్ అందుకునేందుకు నాదల్ మరింత దగ్గరయ్యాడు.
VAMOS pic.twitter.com/6xxFhV4pJC
— US Open Tennis (@usopen) September 2, 2022
రికార్డు విజయాలతో అల్కరాజ్..
పరుషుల వరల్డ్ నెంబర్ 3 కార్లోస్ అల్కరాజ్ కూడా యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. గురువారం రాత్రి జరిగిన రెండో రౌండ్‌లో అర్జెంటీనాకు చెందిన కొరియాను 6-2, 6-2, 7-5తో ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో అల్కరాజ్‌కు ఇది 46వ విజయం. ఈ క్రమంలోనే సిట్సిపాస్ రికార్డును అధిగమించిన అల్కరాజ్ తొలిస్థానంలో నిలిచాడు. అంతేకాదు.. ఈ సీజన్‌లో సిట్సిపాస్ 17 పరాజయాలు పొందగా.. అల్కరాజ్ మాత్రం కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలయ్యాడు.
We see you, @carlosalcaraz 👀 pic.twitter.com/lGEZZin5dS
— US Open Tennis (@usopen) September 1, 2022
ఎదురులేని స్వియాటెక్..
ఇక మహిళల సింగిల్స్ విభాగంలో మహిళల ప్రపంచ నెంబర్‌వన్ ఇగా స్వియాటెక్ తన జోరును ప్రదర్శిస్తోంది. రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన స్టీఫెన్స్‌ను స్వియాటెక్.. 6-3, 6-2తో ఓడించి మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది. కాగా 2020, 2022లో స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది.
It's always crazy hearing yourself for the first time in the world's largest tennis stadium, @iga_swiatek 😆 pic.twitter.com/cWUjhiJSg9
— US Open Tennis (@usopen) September 1, 2022
విలియమ్స్ సిస్టర్స్‌కు షాకిచ్చిన చెక్ రిపబ్లిక్ ద్వయం..
ఇక మహిళల డబుల్స్ విభాగంలో విలియమ్స్ సిస్టర్స్(సెరెనా, వీనస్ విలియమ్స్) పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. గురువారం రాత్రి జరిగిన తొలి రౌండ్‌లో చెక్ రిపబ్లిక్ ద్వయం లూసీ హ్రడెకా- లిండా నోస్కోవా చేతిలో 7-6(7-5), 6-4తో విలియమ్స్ సిస్టర్స్ ఓటమి పాలయ్యారు. అయితే సింగిల్స్ మాత్రం సెరెనా దుమ్మురేపింది. బుధవారం రాత్రి జరిగిన రెండో రౌండ్‌లో వరల్డ్ నెంబర్-2 అనెట్ కొంటావిట్‌ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
చదవండి: బైచుంగ్ భుటియా ఘోర పరాజయం.. ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే