
టెన్నిస్ మహిళల సింగిల్స్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేతగా వరల్డ్ నెంబర్‌వన్..ఇగా స్వియాటెక్ నిలిచిన సంగతి తెలిసిందే. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్వియాటెక్‌కు ఓవరాల్‌గా ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇంతకముందు 2020, 2022లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్.. తాజాగా యూఎస్ ఓపెన్ నెగ్గింది. అయితే స్వియాటెక్ ఏ ట్రోఫీ గెలిచినా దానిని ఓపెన్ చేసి చూడడం అలవాటు.
ఈ విషయం పక్కనబెడితే.. స్వియాటెక్‌కు ఇటాలియన్ డిష్ తిరామిసూ(బెండకాయలతో చేసే ప్రత్యేక డిష్) అంటే చాలా ఇష్టం. దీంతో తనకిష్టమైన తిరామిసును ఆ ట్రోఫీలో పెట్టి ఇస్తారేమోనని ఆశగా చూసేదంటూ అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న యూఎస్ ఓపెన్ నిర్వాహకులు.. ట్రోఫీ అందుకున్న ఇగా స్వియాటెక్‌ను సర్‌ప్రైజ్ చేయాలనుకున్నారు.
ప్రెస్ మీట్‌కు హాజరైన స్వియాటెక్‌ను ట్రోఫీ చూపించాలని రిపోర్టర్స్ అడిగారు. దీంతో స్వియాటెక్ ట్రోఫీని దగ్గరికి తీసుకొని చూడగా కాస్త బరువుగా అనిపించింది. దీంతో లోపల ఏం ఉందా అని ఓపెన్ చేసి చూడగా.. తనకిష్టమైన ఇటాలియన్ డిష్.. తిరామిసు కనిపించడంతో ఆమె ఆశ్చర్యానికి లోనైంది. ఆ తర్వాత నిర్వహకుల వైపు తిరిగిన స్వియాటెక్ చిరునవ్వుతో.. ఇది మీ పనేనా అని సైగలు చేసింది.. అందుకు వాళ్లు అవును అని సమాధానం ఇవ్వడంతో కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక శనివారం అర్థరాత్రి జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనల్‌లో ట్యునీషియాకు చెందిన ఓన్స్ జబీర్‌ను ఓడించిన స్వియాటెక్ తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 52 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6-2, 7-6, (7-5) తేడాతో ఓన్స్ జబీర్‌పై విజయం సాధించింది. 2016లో అంజెలికా కెర్బర్ రెండు గ్రాండ్‌స్లామ్స్ నెగ్గగా.. తాజాగా ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారిణిగా ఇగా స్వియాటెక్ నిలిచింది.
From Paris to New York...still looking for the tiramisu 😄 pic.twitter.com/6cOBINQgoO
— Roland-Garros (@rolandgarros) September 10, 2022
!!!!! pic.twitter.com/87PMt0TfDe
— Out of Context Iga Świątek (@SwiatekOOC) September 11, 2022
చదవండి: US Open 2022: మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్