కేంద్రీయ విద్యాలయ స్కూళ్ల ఏర్పాటుకు భూసేకరణ నిబంధ నలను కేంద్రం సడలించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయ స్కూళ్ల ఏర్పాటుకు భూసేకరణ నిబంధ నలను కేంద్రం సడలించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. పలు నగరాల్లో కేంద్రీయ విద్యాలయాల స్కూళ్ల నిర్మాణాని కి అవసరమైన భూమి లభించకపోవడంతో నిబంధనలను సడలించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. మెట్రో నగరాలలో కేంద్రీ య స్కూళ్ల నిర్మాణానికి ప్రస్తుతం అవసర మున్న 4 ఎకరాల భూమిని రెండున్నర ఎకరాలకు, గ్రామీణ ప్రాంతాల్లో 10 ఎక రాల నిబంధనను 5 ఎకరాలకు, పట్టణాల్లో 8 ఎకరాల నిబంధనను 5 ఎకరాలకు తగ్గిం చినట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో గురు వారం కేంద్రీయ విద్యాలయ స్కూల్‌కు శంఖుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లా డుతూ కేంద్రీయ స్కూళ్లలో అడ్మిషన్ ప్రక్రి య కోసం ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ వ్యవ స్థ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. కేంద్రీయ స్కూళ్లలో 6 వేలకు పైగా టీచర్లను నియ మించే ప్రక్రియను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రారంభించిందని తెలిపారు.