Top Stories
ప్రధాన వార్తలు

‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
తాడేపల్లి: ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచి నీళ్లకు అల్లాడిపోతుంటే మరొకవైపు మద్యం మాత్రం ఏరులై పారుతోందని మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. 10 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ సీపీ దిగిపోయే నాటికి గోదాంల్లో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మింది. గోదాంల్లో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టరీలను ఎందుకు రద్దు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టలరీను రద్దు చేసిందా?’ అని ప్రశ్నించారు పేర్ని నాని. ఇంకా ఆయన ఏమన్నారంటే..వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో.. ‘లెల్ట్’ పెట్టుకో..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వైఎస్సార్ సీపీకి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. కేరళ, బెంగళూరు మద్యం ఏపీలో ఎందుకు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తోందా?. వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యే డబ్బు కొట్టుకో.. బెల్ట్ పెట్టుకో అన్నట్లే ఉంది ఏపీలో పాలన. సూపర్ సిక్స్ హామీల అమలు లేదు కానీ.. మద్యం మాత్రం యధేచ్ఛగా సరఫరా అవుతుంది. బెల్ట్ షాపులుంటే తోలుతీస్తానన్న సీఎం.. మద్యం ఆఖరికి బడ్డీ కొట్టుల్లో దొరుకుతున్నా మాట్లాడటం లేదు ఎందుకు?. శుక్రవారం మధ్యాహ్నం డిఫ్యాక్ట్ సీఎం(లోకేష్ ఉద్దేశిస్తూ) ఏపీలో ఉండడు’ అని విమర్శించారు. కొన్నిసార్లు అపరిచితుడు.. మరొకసారి దశావాతారాలుపవన్ కళ్యాణ్ ని చూస్తే అపరిచితుడిలా కనిపిస్తాడు.. కొన్నిసార్లు దశావతారాల్లో కనిపిస్తాడు.తోలు తీస్తా.. తాట తీస్తా అంటాడు. ఊళ్లో మాత్రం ఉండడు.. సమీక్షలు రాడు.. క్యాబినెట్ మీటింగ్ లకు రాడు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఈ మూడు నియోజవర్గాల్లో మద్యం విచ్చలవిడిగా దొరకుతోంది. బడ్డీ కొట్టులోని ఫ్రిజ్ లో మద్యం ఉంటుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చురాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు.. ఈ ముగ్గురు.. కానీ వీళ్ల నియోజకవర్గాల్లోని మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.

రాప్తాడుకు వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలు!
సాక్షి, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అయితే, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చారు. అలాగే, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇది కూడా చదవండి: రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై!

సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి ఊరట.. పోలీసులకు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్లో భాగంగా తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది.మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ముందస్తు బెయిల్‌పై జస్టిస్ జేబీ. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ విచారణ జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో, మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక, పిటిషన్‌పై మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాయి. దీంతో, మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
రియాద్: హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం(Kingdom of Saudi Arabia) (KSA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు ముందుగానే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర వీసాలపై జూన్ మధ్యకాలం వరకు అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉండనుంది. హజ్ యాత్ర(Hajj pilgrimage) సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్డ్ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీసా నిబంధనలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సౌదీ అరేబియా సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఉమ్రా వీసా(Umrah Visa) కోసం కేటాయించిన గడువు 2025, ఏప్రిల్ 13తో ముగియనుంది. అలాగే హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయరు. ఈ నిషేధం కారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో సహా పలు దేశాల నుంచి సౌదీ వెళ్దాలనుకునేవారికి నిరాశ ఎదురయ్యింది.వీసాలు నిషేధించిన దేశాలివే..1. భారత్2. బంగ్లాదేశ్3. పాకిస్తాన్4. అల్జీరియా5. ఈజిప్ట్6. ఇథియోపియా7. ఇండోనేషియా8. ఇరాక్9. జోర్డాన్10. మొరాకో11. నైజీరియా12. సుడాన్13. ట్యూనిషియా14. యెమెన్నిషేధం వెనుక కారణాలివే..సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హజ్ సమయంలో భద్రత కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో హజ్‌యాత్రలో పాల్గొన్న 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతిచెందారు. రిజస్టర్డ్కాని యాత్రికుల కారణంగా హజ్లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. దీనిని నివారించేందుకే వివిధ రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్-నిర్దిష్ట వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా

జట్టుకు భారం!.. ధోని ఎప్పుడో రిటైర్ కావాల్సింది: పాక్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఆకట్టుకోలేకపోతున్నాడు. వికెట్ కీపర్‌గా తనదైన మెరుపు విన్యాసాలతో అలరిస్తున్నా.. బ్యాటర్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందిన ‘తలా’.. ఇప్పుడు జట్టుకు భారంగా మారాడనే విమర్శలు వస్తున్నాయి.క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 76 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేటు 138.18. ఇక ఈ సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన సీఎస్కే (CSK).. ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది.ఉన్న పేరు చెడగొట్టుకోవద్దుఈ నేపథ్యంలో ధోని ఇక రిటైర్ అయి.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నై ఆటతీరును విమర్శించే క్రమంలో ధోని బ్యాటింగ్ వైఫల్యాన్ని హైలైట్ చేస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని చాన్నాళ్ల క్రితమే రిటైర్ కావాల్సిందని.. జిడ్డు బ్యాటింగ్ కారణంగా తన కీర్తికి తానే మచ్చ తెచ్చుకునే ప్రయత్నాలు మానివేయాలని సూచించాడు.ఈ మేరకు IANSతో మాట్లాడుతూ.. ‘‘ధోని చాలా ఏళ్ల క్రితమే ఆటగాడిగా వీడ్కోలు తీసుకోవాల్సింది. సాధారణంగా వికెట్ కీపర్లు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆటను కొనసాగించలేరు. అందుకు నేనే ఓ ఉదాహరణ.సీఎస్కే ఇకనైనా గుర్తించాలివయసు మీద పడుతున్నా... ఇంకా టీవీల్లో కనిపిస్తూ.. నా ప్రదర్శన బాగా లేదనేలా విమర్శలు వస్తూ ఉంటే.. నా గత కీర్తి మసకబారిపోతుంద కదా! పదిహేనేళ్ల పాటు గొప్ప ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నా .. ఇప్పుడిలా పేలవ ప్రదర్శన కనబరిస్తే యువ తరానికి అంతగా రుచించదు.నిజానికి 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీలో అతడి ఆట జట్టుకు ఏమాత్రం మేలు చేకూర్చలేదు. అప్పుడే వాళ్లు (టీమిండియా యాజమాన్యం అన్న అర్థంలో), అతడు పరిస్థితిని అంచనా వేసుకున్నారు. తర్వాత అతడు తప్పుకొన్నాడు.ఏదేమైనా జట్టు కంటే ఆటగాడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మాత్రం ఆటకు మీరు అన్యాయం చేసినట్లే. అందుకే సీఎస్కేను అందరూ ట్రోల్ చేస్తున్నారు. గత 2-3 మ్యాచ్‌లలో ధోని రాగానే ప్రేక్షకుల నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి.#MSDhoni, the Thala, walks into his Chepauk Den and the crowd makes DHO-NOISE!Can he finish it off in style for #CSK tonight with his parents cheering for him?Watch LIVE action ➡ https://t.co/4Kn2OwL1UW#IPLonJioStar 👉 #CSKvDC, LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi… pic.twitter.com/1TkzYloNwL— Star Sports (@StarSportsIndia) April 5, 2025 కానీ సీఎస్కేకు ఇప్పుడు విజయాలు, పాయింట్లు కావాలి. ప్రస్తుతం వారు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి.. సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని రషీత్ లతీఫ్ చెన్నై జట్టు యాజమాన్యానికి సూచించాడు.ఆడుతూనే ఉంటాడు..కాగా ఢిల్లీ చేతిలో ఓటమి తర్వాత ధోని రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురుకాగా... ‘‘అతడితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నా.. ఈ విషయంలో నాకు ఎలాంటి సమాచారం లేదు.ఇప్పటికీ అతడు ఫిట్‌గానే ఉన్నాడు’’ అని సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. మరోవైపు.. ధోని కూడా తన శరీరమే తన రిటైర్మెంట్ అంశాన్ని నిర్ణయిస్తుందంటూ.. ఇప్పట్లో వీడ్కోలు పలికే అవకాశం లేదని స్పష్టం చేశాడు.చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్

JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
విశాఖ జిల్లా,సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలను విద్యార్థులు రాయలేకపోయారు. పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈ విద్యార్థులకు పవన్ కాన్వాయ్ అడ్డుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష రాయకుండానే ముప్పై మంది విద్యార్థులు వెనుదిరిగారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.పెందుర్తిలో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉదయం 8.30 జరగనుండగా.. పవన్ కాన్వాయ్ కారణంగా పరీక్షా కేంద్రానికి 8.32కి వచ్చారు. ఆ రెండు నిమిషాలు కూడా పవన్ వస్తున్నారని పోలీస్ అధికారులు ట్రాఫిక్ నిలిపివేశారని, లేదంటే పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునే వారమని విద్యార్థులు మీడియాకు తెలిపారు.పవన్ కళ్యాణ్ వస్తున్న మార్గంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంది. పవన్ వస్తున్నారనే కారణంతో ప్రొటోకాల్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. కాబట్టే రెండు నిమిషాల ఆలస్యంతో పరీక్షా కేంద్రానికి వచ్చామని, ఆలస్యమైందని అధికారులు తమని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదని విలపిస్తున్నారు. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకుని ఆ 30 మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టు ధర్మాసనం చెట్ల నరికివేత విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వందల ఎకరాల్లో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు ఏపీలో సుమారు 33 వేల ఎకరాలలో ఏటా మూడేసి పంటలు పండే పచ్చటి భూములను బీడులుగా మార్చి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా స్పందించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.దేశ ప్రధానితోపాటు, న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాలలో పని చేసిన వారిలో కొందరు కూడా అమరావతి పేరుతో సాగుతున్న పర్యావరణ విధ్వంసానికి సహకరించే విధంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రాన్ని బట్టి, నేతలను బట్టి, పార్టీలను బట్టి వ్యవస్థలు స్పందిస్తున్నాయా అన్న సందేహం రావడానికి ఇలాంటి ఘట్టాలు ఆస్కారం ఇస్తుంటాయి. కంచ గచ్చిబౌలి భూముల మీద స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనమే, పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా అసంతృప్తి తెలిపింది. ఈ రెండు ఉదంతాలకు సంబంధం ఉందో, లేదో తెలియదు. అయితే, రేవంత్ చేసిన తప్పిదం వల్ల దాని ప్రభావం న్యాయ వ్యవస్థపై పడి ఉండవచ్చా అన్నది కొందరి డౌటు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ఇలాంటి కేసులు తనంతట తానే తీసుకున్నట్లు కనిపించలేదు. అన్ని కేసుల్లోనూ కింది కోర్టుల్లో విచారణ జరుగుతుండగా ఇలా స్పందిస్తుందా? అన్నది కొందరి ప్రశ్న.తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల నిరసనలు, బీజేపీ, బీఆర్ఎస్ల విమర్శల హోరు, కేంద్ర ప్రభుత్వం జోక్యం, తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ, స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి రావడం వంటి పరిణామాలను విశ్లేషించుకుంటే అన్ని వ్యవస్థలలో ఉన్న మంచితోపాటు లోపాలు కూడా కనిపిస్తాయని చెప్పాలి. కంచ గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దాంతో రేవంత్ సర్కార్‌కు కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని అమ్మడమో, లేక లీజు పద్దతిపై ఆయా సంస్థలకు కేటాయించడమో, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమో చేయాలని తలపెట్టి ఆ దిశగా పావులు కదిపింది.అయితే, ఇక్కడే రేవంత్ అనుభవరాహిత్యం వల్ల దెబ్బతిన్నారు. నిజంగానే ఆయన అక్కడ అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ఉంటే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాలి. దానికి ముందు ఈ భూమిని అధీనంలోకి తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలను పసికట్టి ఉండాలి. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భాగమా? కాదా? ఎవరికి భూములపై హక్కులు ఉన్నాయన్న దానిపై న్యాయపరంగా అభిప్రాయం తీసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత తదుపరి చర్యలకు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో గాని, అలా కాకుండా, వేగంగా సెలవు దినాలలో పెద్ద సంఖ్యలో జేసీబీలను పంపించి చెట్లు కొట్టి, నేల చదును చేయించడంతో వివాదానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కొందరైతే ఇంకా ఎక్కువే వస్తుందని అంటారు. దీంతో ప్రభుత్వ కష్టాలు తీరుతాయని ఆశించి ఉండవచ్చు. సుమారు రెండు దశాబ్దాల పాటు కోర్టులలో ప్రభుత్వమే ఈ భూమిపై పోరాడింది కనుక తమవే అన్న అభిప్రాయం వచ్చినప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఒక అంచనాకు రావడంలో విఫలమైందని అనిపిస్తుంది.1975లో రాష్ట్ర ప్రభుత్వమే 2300 ఎకరాలు కేటాయించినా, సెంట్రల్ యూనివర్శిటీకి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయినా వారు వాడుకున్న భూమి పోను మిగిలినది ప్రభుత్వ అధీనంలోనే ఉందట. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమిని ‘ఐఎమ్జీ భారత’ అకాడమి అనే ప్రైవేటు సంస్థకు కేటాయించింది. ఆ సంస్థకు భూమిని బదలాయించే నిమిత్తం 2004 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం 534 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి బదలాయించారు. ఈ మేరకు రికార్డులు ఉన్నాయని మీడియా కథనం. అందులో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సంతకం కూడా ఉండడం గమనార్హం. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం హోదాలో ఈ భూమిని ఇలా బదలాయించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఏ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు రాలేదు. పైగా ఈ భూమిలో 400 ఎకరాలు పొందిన ప్రైవేటు సంస్థ రెండు దశాబ్దాలుగా ఆ భూమి తనదే అంటూ కోర్టులలో వ్యాజ్యాలు సాగించినా ఏ వ్యవస్థ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు.ఇక, 2006లో ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ భూమి విషయాన్ని పరిశీలించి ఇది ప్రైవేటు వ్యక్తులకు లాభం చేసేందుకే చంద్రబాబు సర్కార్ కేటాయించిందని అభిప్రాయపడి దానిని రద్దు చేసింది. అయినా కోర్టులో అది ప్రభుత్వ భూమి అని ఇంతకాలం పోరాడాల్సి వచ్చింది. ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఐఎంజీ సంస్థ ఏవైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఏమై ఉండేది అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. అప్పుడు కూడా ఈ భూమిలో చెట్లు ఉన్నాయి కదా!. అలాంటి ఖాళీ భూమిలోనే కదా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అప్పుడు పర్యావరణ సమస్యలు రావా? ఇక్కడ రేవంత్ సర్కార్ కరెక్ట్ గా చేసిందా? లేదా? అన్నది చర్చ కాదు. కానీ, పరిణామాలన్నిటిని విశ్లేషించినప్పుడు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా!. సుప్రీంకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చిన తర్వాత ఈ భూమిని అభివృద్ది చేయడం కోసం మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించింది. ఈ పనులు చేయడం కోసం ఇదే భూమిని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా పదివేల కోట్ల అప్పు కూడా తీసుకుందట. మార్కెట్లో బాండ్లు, వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల ద్వారా ఈ రుణాలు సేకరించి, వడ్డీ కట్టడం కూడా ఆరంభమైందని కథనం.ఈ భూమిని యూనివర్శిటీకే ఇవ్వాలని, అక్కడ ప్రహరి గోడ కట్టించడం వల్లే వృక్షాలు పెరిగాయని చెబుతూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడం, తదుపరి విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ ఎంటర్ అవ్వడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఈలోగా కేంద్రం కూడా స్పందించి ఈ భూమిపై నివేదికను కోరింది. తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది. ఇంతలో సుమోటోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని చెట్లు కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు ఆపాలని ఆదేశించింది. దీంతో విద్యార్దులు తామే గెలిచామని సంబరాలు చేసుకుంటే, రేవంత్ సర్కార్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఇప్పుడు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. కాగా అక్కడ పర్యావరణ అనుకూల పార్కు ఏర్పాటు చేస్తామని, యూనివర్శిటీ కూడా అదే భూమిలో ఉంది కనుక దానిని ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని కొత్త కండీషన్ పెట్టడం విశేషం. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ద్వారా కల్పిత వీడియోలు సృష్టించారని తెలంగాణ సర్కార్ ఇప్పుడు వాపోతున్నా పెద్దగా ఫలితం ఉంటుందా అన్నది సందేహం.కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావని రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సీఎంకు సంయమనం పాటించడం తెలియదా అని ప్రశ్నించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజునే ఆయన అనవసర వివాదంలో చిక్కుకున్నారని అనుభవజ్ఞులు అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను సవాల్ చేసేలా ఆయన మాట్లాడడం వారికి ఎలా నచ్చుతుంది. గతంలో ఫిరాయింపులపై కోర్టులు గట్టి చర్యలు తీసుకోలేదన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ శాసనసభలో అలా మాట్లాడి దెబ్బతిన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం గందరగోళంగా మారింది. విశేషం ఏమిటంటే యూనివర్శిటీకి చెందిన భూములలో కొంత భాగం ఆక్రమణలకు గురైందని చెబుతున్నారు. తన అధీనంలో ఉన్న భూములను ఏం చేయాలన్నది నిజానికి ప్రభుత్వ అభీష్టం ప్రకారం జరగాలి. అయితే స్థానిక ప్రజలు పర్యావరణ వేత్తలు, యూనివర్శిటీ విద్యార్ధులు చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఉండవచ్చు. అవేవి జరగలేదు. దానిని సహజంగానే విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుంటాయి.ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్మడం కొత్త కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల కారణం చూపి అమ్ముతున్నారు. తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం కూడా పలు చోట్ల భూములను అమ్మి వేల కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడేమో బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తాము అధికారంలోకి వస్తే ఈ భూములను యూనివర్శిటీకి అప్పగిస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సర్కార్ భూముల అమ్మకాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు ఆయన అదే బాటలో ఉన్నారు. ఇదంతా ఒక గేమ్‌గా మారింది. ప్రతిపక్షంలో ఉంటే ఒకరకం, అధికారంలోకి వస్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారు.ఇక ఏపీ సంగతి కూడా చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. కృష్ణానది పక్కన 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించి రాజధాని కడుతున్నారు. అది పర్యావరణానికి నష్టమని పలువురు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ భూమి స్వభావ రీత్యా మామూలు వ్యయం కన్నా ఒకటిన్నర రెట్ల అధికంగా నిర్మాణ ఖర్చు అవుతుందట. రిషికొండపై జగన్ ప్రభుత్వం మంచి భవనాలు నిర్మిస్తే, ప్యాలెస్‌లని ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన నేతలు ఇప్పుడు అమరావతిలో అంతకన్నా పెద్ద ప్యాలెస్‌లు నిర్మించాలని తలపెట్టారు. వాటికి మాత్రం ఐకాన్ భవనాలని, అదని, ఇదని బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు స్వయంగా కృష్ణా నది తీరాన నదీ చెంత సీఆర్‌జెడ్ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఒక భవనంలో నిర్మిస్తున్నా ఏ వ్యవస్థ ఆయన జోలికి వెళ్లలేకపోయింది.రిషికొండపై అంతా కలిపి 400 కోట్లతో భవనాలు నిర్మిస్తే తప్పట. అదే అమరావతిలో ఏభై వేల కోట్ల అప్పులు తెచ్చి మరీ ప్యాలెస్‌లు నిర్మిస్తే రైటట. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యవస్థలే లేవా?. రాజధాని కోసం ఎంత భూమి అవసరమో అంత తీసుకోవచ్చు. అలా కాకుండా మహానగరం నిర్మిస్తామంటూ శివరామకృష్ణన్ నివేదికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇలా చేస్తుంటే ఏమనాలి?. తెలంగాణకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం ఉంటుందా?. ఇదంతా మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థతో సహా వివిధ వ్యవస్థలలో ఉన్న లోపమా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
మనిషి దేన్నైనా సాధించాలని బలంగా అనుకుని ముందుకు సాగితే.. తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుందని ఎంతోమంది చెప్పారు. ఉదాహరణలుగా కూడా నిలిచారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు టీమ్ ఇండియాకు ఓపెనర్ 'శుభ్‌మన్ గిల్' (Shubman Gill). సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గిల్.. కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ కథనంలో శుభ్‌మన్ ఆస్తి ఎంత? ఎలాంటి వాహనాలను వినియోగిస్తున్నారు, ఏ కంపనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు, అనే వివరాలు తెలుసుకుందాం.శుభ్‌మన్ గిల్ అంటే టీమిండియా క్రికెటర్ మాత్రమే కాదు యూత్ ఐకాన్ కూడా. రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇతను మొత్తం సంపద విలువ రూ. 32 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇతని వద్ద రూ. 89 లక్షల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్, రూ. 14.16 లక్షల ఖరీదైన మహీంద్రా థార్ ఉన్నాయి.మహీంద్రా థార్ కారును ఆనంద్ మహీంద్రా గిఫ్ట్‌గా ఇచ్చారు. 2021 టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన సమయంలో ఆనంద్ మహీంద్రా ఆరుగురు ఆటగాళ్లకు మహీంద్రా థార్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు. ప్రస్తుతం గిల్ ఏడాదికి రూ. 5 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?శుభ్‌మన్ గిల్ అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో CEAT, Nike, Dior, Fiama, Gilette వంటి బ్రాండ్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. కాగా ఈయనకు పంజాబ్‌లో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.

'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
మెగా హీరో రామ్ చరణ్ కొట్టిన సిక్సర్‌తో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ గల్లంతు అయ్యాయి. తాజాగా విడుదలైన 'పెద్ది' గ్లింప్స్‌కు షోషల్‌మీడియా షేక్ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుంది. ఫస్ట్ షాట్‌తోనే సినీ అభిమానులను రామ్‌చరణ్ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల గ్లింప్స్‌కు వచ్చిన వ్యూస్ విషయంలో దేవర (26.17 మిలియన్లు) టాప్‌లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్ ఆ రికార్డ్‌ను దాటేసింది. 24గంటల్లోనే ఏకంగా 30.6 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న అన్ని సినిమాల గ్లింప్స్ రికార్డ్స్‌ను పెద్ది దాటేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తప్పకుండా పెద్ది సినిమాతో భారీ హిట్ కొడుతున్నామని వారు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. టాలీవుడ్లో పెద్ది గ్లింప్స్ టాప్-1లో ఉంటే.. ఇండియాలో టాక్సిక్ (36 మిలియన్లు)తో టాప్-1లో ఉంది.'పెద్ది' హిందీ గ్లింప్స్ విడుదల.. డబ్బింగ్ ఎవరంటే..?పెద్ది సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా హిందీ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. హందీ వర్షన్లో తన పాత్రకు డబ్బింగ్ స్వయంగా చెప్పుకున్నారు. ఈ గ్లింప్స్ నుంచి ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.టాలీవుడ్ టాప్ (గ్లింప్స్) చిత్రాలుపెద్ది (30.6 మిలియన్లు)దేవర (28.7 మిలియన్లు)పుష్ప2 (27.11 మిలియన్లు)ఓజీ (27 మిలియన్లు)కల్కి (23.16 మిలియన్లు)గుంటూరు కారం (21.12 మిలియన్లు)ది ప్యారడైజ్ (17.12 మిలియన్లు)

Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
ఓ మూషికం సరికొత్త రికార్డ్లను సృష్టించింది. బాంబుల నుంచి ఓ దేశాన్ని కాపాడడంలో పాత రికార్డ్లన్నీ తిరగ రాసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా బాంబులు గుర్తించిన ఎలుకల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కింది. కాంబోడియా దేశానికి చెందిన భూముల్లో ఉన్న బాంబులను గుర్తించడమే ఎలుక రోనిన్ పని. తాజాగా రోనిన్ బాంబుల వేటలో ప్రపంచంలోనే తొలిసారి వందకు పైగా ల్యాండ్మైన్లు, ఇతర యుద్ధ అవశేషాలను గుర్తించిన ఎలుకగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.అఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ రాట్ రోనిన్ 2021 నుండి ఇప్పటివరకు భూమిలో దాచిన 109 బాంబులు, 15 పేలని బాంబులను గుర్తించినట్లు జంతువులకు శిక్షణ ఇచ్చే ఏపోపో అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. తద్వారా రోనిన్ ఇప్పుడు ఎలుకలలో అత్యధిక మైన్లు గుర్తించిన రికార్డును సొంతం చేసుకుందని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా, కాంబోడియా ప్రజల ప్రాణాల్ని కాపాడడంలో రొనిన్ బాధ్యతలు అత్యద్భుతమని కొనియాడింది. ఎలుక రోనిన్ గురించి పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల వయస్సున్న రోనిన్ మంచి పనిమంతుడు. అందరితో స్నేహంగా ఉండటమే కాదు..శాంతంగా ఉంటాడట. రోనిన్ విజయానికి కారణం ఏకాగ్రత, ఒత్తిడిలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో సిద్ధహస్తుడు. అంతేకాదు, రోనిన్ తెలివితేటలు, సహజమైన ఆసక్తి నిత్యం చురుగ్గా ఉంచేందుకు దోహదం చేస్తున్నాయి. అందుకే కాబోలు భూమిలో బాంబులు గుర్తించడం రోనిన్కు ఒక ఆటలా ఉంటుంది’ అని ఏపోపో ప్రతినిధి లిల్లీ షాలోమ్ అన్నారు.రోనిన్ సంరక్షణ చూసుకునే ఫానీ మాట్లాడుతూ.. ‘రోనిన్ విజయాలు ఎలుకల అసాధారణ సామర్థ్యానికి నిదర్శనం. రోనిన్‌ను కేవలం బాంబుల్ని నిర్విర్యం చేసే ఎలుక అని అనుకోం. మేం అతన్నిఫ్రెండ్గా, సహచరుడిగా భావిస్తాం’ అని అన్నారు.ఏపోపో సంస్థ దాదాపు ముప్పై సంవత్సరాలుగా భూమిలోని బాంబులను గుర్తించేందుకు ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. రోనిన్,అతని సహచరులు ప్రతి రోజూ మైన్లు ఉండే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తారు. మైన్లు ఉన్నాయన్న అనుమానం ఉన్న ప్రదేశాల్లో వాటిని విడిచిపెడతారు. ఎలుక తమ అసాధారణమైన ప్రతిభతో మైన్లు ఉన్న ప్రదేశంపై ఉన్న మట్టిని కొరుకుతాయి. అలా ఓ నిర్ధిష్ట వయస్సు వచ్చిన తర్వాత విధుల నుంచి పదవీ విరమణ చేస్తాయి.కాంబోడియాలో ఇరవై ఏళ్లపాటు అంతర్యుద్ధాలు జరిగాయి. చివరికి యుద్ధాలు 1998లో ముగిశాయి. అయినప్పటికీ ఇంకా ప్రపంచంలో అత్యధికంగా ల్యాండ్ మైన్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఇప్పటికీ 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో కాంబోడియా భూముల్లో ల్యాండ్ మైన్లతో పాటు ఇంకా పేలని పేలుడు పదార్ధాలు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఈ దేశంలో సగటున 40వేల మందికి పైగా ఈ ల్యాండ్ మైన్ల వల్ల కాళ్లను పోగొట్టుకున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. రోనిన్కు ముందు మగావా అనే ఎలుకనే అత్యధిక బాంబులు గుర్తించాడు. మగావా 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, అయిదేళ్ల కాలంలో 71 మైన్లు, 38 పేలని బాంబులను గుర్తించాడు. అతడికి సేవల గుర్తింపుగా పీడీఎస్ఏ అనే జంతు సంక్షేమ సంస్థ నుండి సాహస వీరుడి పతాకాన్ని అందుకున్నాడు. 2022 జనవరిలో వృద్ధాప్యంతో మగవా మరణించాడు.
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్న ఫ్యాన్స్!
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
పోస్ట్‌పార్టం సమస్యలతో శ్రద్ధా ఆర్య, ట్విన్స్ జిబ్లీ ఫోటోలు సూపర్ క్యూట్
అప్పుల కుప్పలుగా రాష్ట్రాలు
నిషేధం ముగించుకుని తిరిగొచ్చిన నాసిర్ హొసేన్
వాట్సాప్ ద్వారా ఫండ్స్‌లో పెట్టుబడులు
విజయాల శ్రీ‘లీల’వెనుక రహస్యాలివే...
తరచూ బీహార్‌కు రాహుల్.. మహాకూటమి ప్లాన్ ఏమైనా..
Bill Gates : రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్!
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
ఈ రాశి వారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది
...సూపర్ సిక్స్ సార్!
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
'అమెరికాలో ఉద్యోగాలుండవు'
చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?
ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఓటీటీలో కోర్ట్ సినిమా.. అఫీషియల్ ప్రకటన
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
CSK Vs DC: అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు అక్షర్
బర్త్ డే పార్టీకి రష్మిక-విజయ్ కలిసి వెళ్లారా?
కియారా ప్రెగ్నెన్సీ గ్లో.. చీరలో ఆహా అనిపించేలా అనన్య!
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
‘ట్రావిషేక్’ మళ్లీ ఫెయిల్!.. ఇదేం బ్యాటింగ్? సహనం కోల్పోయిన కావ్యా
'65 ఏళ్ల ముసలాడికి 30 ఏళ్ల అమ్మాయితో ప్రేమ'.. కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
ఏడు పదాల్లోనే రాజీనామా చేసిన ఉద్యోగి - ఫోటో వైరల్
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. 'సెంచరీ' కొట్టిన మహ్మద్ సిరాజ్
ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
Visakha: ఎట్టకేలకు టీడీపీ మహిళా నేతపై కేసు నమోదు
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
టెస్లా రాకపై బీఎండబ్ల్యూ ఇండియా కీలక వ్యాఖ్యలు
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?
‘రింగు’ 6 వరుసలు!
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
అంత కష్టం ఏమొచ్చిందో..
SRH VS GT: వారి పేసర్లను ఎదుర్కోవడం మా బ్యాటర్ల వల్ల కాలేదు: కమిన్స్
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి ఊరట.. పోలీసులకు నోటీసులు
చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైళ్లు
రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై!
ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వస్తారో తెలియదు!
ఇల్లు అమ్మిన ఇషా అంబానీ
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
అది మాయ లేడి కాదు స్వామీ! హెచ్‌సీయూ నుంచి వచ్చిన నిజమైన లేడికూన!!
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే
‘నాలుగు’తో నగుబాటు
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
వీడియో వైరల్: అందరిని నవ్వించి.. చివరికి కన్నీళ్లను మిగిల్చిన విద్యార్థిని
అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
గొడ్రాలు అనే మాట పడలేకే ఈ నాటకం
మోసం చేశావ్ చంద్రబాబూ.. అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
పూజలకు పీరియడ్స్ ఆటంకం, తప్పు జరిగిందంటూ..
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
రాప్తాడుకు వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలు!
బాబోయ్ ఈ–స్కూటర్లు!
ఆ పాన్ కార్డులకు కొత్త డెడ్‌లైన్..
డ్యాన్స్‌తో దుమ్మురేపిన స్టార్ హీరో సతీమణి.. రీఎంట్రీ కోసం ప్లాన్
స్టార్ హీరోను పట్టుకుని అలా తోసేస్తావేంటి? నటుడికి మణిరత్నం వార్నింగ్
కొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.. స్టాలిన్‌కు మోదీ కౌంటర్
15 ఏళ్ల పాటు కలిసి ఆడుతామని అస్సలు అనుకోలేదు: విరాట్ కోహ్లి
ఆట నేర్పడు.. బాలికలతో ఆడుకుంటాడు
కొత్త ఇల్లు.. కొత్త ట్రెండ్..
జాబిలమ్మ నీకు అంత కోపమా.. సినిమా రివ్యూ
టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. నేను ఫెయిల్యూర్ కాదు!
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ రోషన్
'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్
పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు
గుంటూరులో దారుణం.. కుక్క దాడిలో బాలుడు మృతి
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
సినీ నటి హేమ సీరియస్.. కరాటే కల్యాణి, తమన్నాకు నోటీసులు!
వైఎస్సార్సీపీ అహ్మద్ భాషా అరెస్ట్.. పీఎస్ వద్ద భారీ బందోబస్తు!
తల్లీకొడుకు... యాక్షన్
హీరోయిన్గా అవకాశాలు రాక ఐటం సాంగ్? కేతిక ఏమందంటే?
నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!
కుమారుడికి వైద్యం అందక...
కఠిన వాస్తవాలను దాచేస్తారా?
'జాట్' తెలుగు వర్షన్‌కు ఇబ్బంది ఏంటి..?
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్న ఫ్యాన్స్!
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
పోస్ట్‌పార్టం సమస్యలతో శ్రద్ధా ఆర్య, ట్విన్స్ జిబ్లీ ఫోటోలు సూపర్ క్యూట్
అప్పుల కుప్పలుగా రాష్ట్రాలు
నిషేధం ముగించుకుని తిరిగొచ్చిన నాసిర్ హొసేన్
వాట్సాప్ ద్వారా ఫండ్స్‌లో పెట్టుబడులు
విజయాల శ్రీ‘లీల’వెనుక రహస్యాలివే...
తరచూ బీహార్‌కు రాహుల్.. మహాకూటమి ప్లాన్ ఏమైనా..
Bill Gates : రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్!
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
ఈ రాశి వారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది
...సూపర్ సిక్స్ సార్!
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
'అమెరికాలో ఉద్యోగాలుండవు'
చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?
ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఓటీటీలో కోర్ట్ సినిమా.. అఫీషియల్ ప్రకటన
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
CSK Vs DC: అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు అక్షర్
బర్త్ డే పార్టీకి రష్మిక-విజయ్ కలిసి వెళ్లారా?
కియారా ప్రెగ్నెన్సీ గ్లో.. చీరలో ఆహా అనిపించేలా అనన్య!
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
‘ట్రావిషేక్’ మళ్లీ ఫెయిల్!.. ఇదేం బ్యాటింగ్? సహనం కోల్పోయిన కావ్యా
'65 ఏళ్ల ముసలాడికి 30 ఏళ్ల అమ్మాయితో ప్రేమ'.. కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
ఏడు పదాల్లోనే రాజీనామా చేసిన ఉద్యోగి - ఫోటో వైరల్
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. 'సెంచరీ' కొట్టిన మహ్మద్ సిరాజ్
ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
Visakha: ఎట్టకేలకు టీడీపీ మహిళా నేతపై కేసు నమోదు
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
టెస్లా రాకపై బీఎండబ్ల్యూ ఇండియా కీలక వ్యాఖ్యలు
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?
‘రింగు’ 6 వరుసలు!
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
అంత కష్టం ఏమొచ్చిందో..
SRH VS GT: వారి పేసర్లను ఎదుర్కోవడం మా బ్యాటర్ల వల్ల కాలేదు: కమిన్స్
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి ఊరట.. పోలీసులకు నోటీసులు
చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైళ్లు
రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై!
ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వస్తారో తెలియదు!
ఇల్లు అమ్మిన ఇషా అంబానీ
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
అది మాయ లేడి కాదు స్వామీ! హెచ్‌సీయూ నుంచి వచ్చిన నిజమైన లేడికూన!!
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే
‘నాలుగు’తో నగుబాటు
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
వీడియో వైరల్: అందరిని నవ్వించి.. చివరికి కన్నీళ్లను మిగిల్చిన విద్యార్థిని
అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
గొడ్రాలు అనే మాట పడలేకే ఈ నాటకం
మోసం చేశావ్ చంద్రబాబూ.. అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
పూజలకు పీరియడ్స్ ఆటంకం, తప్పు జరిగిందంటూ..
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
రాప్తాడుకు వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలు!
బాబోయ్ ఈ–స్కూటర్లు!
ఆ పాన్ కార్డులకు కొత్త డెడ్‌లైన్..
డ్యాన్స్‌తో దుమ్మురేపిన స్టార్ హీరో సతీమణి.. రీఎంట్రీ కోసం ప్లాన్
స్టార్ హీరోను పట్టుకుని అలా తోసేస్తావేంటి? నటుడికి మణిరత్నం వార్నింగ్
కొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.. స్టాలిన్‌కు మోదీ కౌంటర్
15 ఏళ్ల పాటు కలిసి ఆడుతామని అస్సలు అనుకోలేదు: విరాట్ కోహ్లి
ఆట నేర్పడు.. బాలికలతో ఆడుకుంటాడు
కొత్త ఇల్లు.. కొత్త ట్రెండ్..
జాబిలమ్మ నీకు అంత కోపమా.. సినిమా రివ్యూ
టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. నేను ఫెయిల్యూర్ కాదు!
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ రోషన్
'పెద్ది' గ్లింప్స్ వచ్చేసింది.. సిక్సర్ కొట్టిన రామ్ చరణ్
పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు
గుంటూరులో దారుణం.. కుక్క దాడిలో బాలుడు మృతి
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
సినీ నటి హేమ సీరియస్.. కరాటే కల్యాణి, తమన్నాకు నోటీసులు!
వైఎస్సార్సీపీ అహ్మద్ భాషా అరెస్ట్.. పీఎస్ వద్ద భారీ బందోబస్తు!
తల్లీకొడుకు... యాక్షన్
హీరోయిన్గా అవకాశాలు రాక ఐటం సాంగ్? కేతిక ఏమందంటే?
నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!
కుమారుడికి వైద్యం అందక...
కఠిన వాస్తవాలను దాచేస్తారా?
'జాట్' తెలుగు వర్షన్‌కు ఇబ్బంది ఏంటి..?
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
సినిమా

ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా
తెలుగులో ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే వీటిలో ఓటీటీలోకి మాత్రం కొన్నే వస్తుంటాయి. కొన్ని చిత్రాలు మాత్రం నెలలు లేదా సంవత్సరాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఓ తెలుగు ఆంథాలజీ మూవీ.. దాదాపు 15 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.సాయికుమార్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన 'మూడో కన్ను' సినిమా గతేడాది జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే అప్పుడు హనుమాన్ చిత్రం హవా వల్ల ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దాదాపు ఏడాది మూడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. ప్రస్తుతం రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల)'మూడో కన్ను' విషయానికొస్తే.. తొలి కథలో ఓ అందమైన కుటుంబం ఉంటుంది. వీళ్ల పెంపుడు కుక్క ఓ రోజు చనిపోతుంది. ఏమైంది అనుకునేలోపు హీరో తల్లి మరణిస్తుంది. రెండో కథలో మనిషి తయారు చేసిన కృత్రిమ మాంసం కోసం జరిగిన ఫైట్ ఫార్ములా ఎవరిది? ఎవరు దొంగిలించారనేది స్టోరీ.మూడో కథలో ఓ నేరస్తుడిని పట్టుకునేందుకు పిల్లాడిని ఉపయోగిస్తారు. ఇంతకీ ఇది ఎవరు చేయించారనేది స్టోరీ. ఈ మూడింటికి సంబంధించిన లింక్, సస్సెన్సే నాలుగో కథ. వీటన్నింటిని అమెరికాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం విశేషం.(ఇదీ చదవండి: 'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్)

'గుడ్ బ్యాడ్ అగ్లీ' తెలుగు ట్రైలర్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) తెలుగు ట్రైలర్ వచ్చేసింది. మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష నటించారు. ఇప్పటికే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ తమిళ్ వర్షన్ ట్రైలర్ విడుదలైంది. ఏకంగా 35 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యాన్స్‌కు నచ్చే భారీ యాక్షన్ సీన్లు ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది.

26 ఏళ్ల నాటి అత్యంత ఖరీదైన సినిమా...ఇంకా విడుదల కాలేదు..!
ప్రస్తుతం అంతా భారీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించకపోతే వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల బుర్రలోకెక్కించలేం అన్నట్టుగా ఉంది పరిస్థితి. కధ, కధనాలను బట్టి బడ్జెట్ అనడం కన్నా బడ్జెట్‌ను బట్టి కధ అన్నట్టు మారిపోయింది. ఐదూ, పది కోట్లతో తీసే సినిమాల గురించి మాట్లాడుకోవడం కూడా దండగ అన్నట్టుగా నోరెత్తితే భారీ సినిమాలే చర్చకు నోచుకుంటున్నాయి. అయితే భారీ చిత్రాలు అనేవి ఇప్పుడే కాదు ఒకప్పుడూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలు దశాబ్ధాల క్రితమే తలపెట్టారు. అలాంటి ఒక సినిమా, ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే చరిత్రలోనే నెం1 భారీ చిత్రం అని పేర్కొనదగ్గ సినిమా... పాతికేళ్ల క్రితమే ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా పేరు మరుదనాయగం (Marudhanayagam).‘మరుదనాయగం‘ అనేది 18వ శతాబ్దపు యోధుడు మహ్మద్ యూసుఫ్ ఖాన్ గురించిన చారిత్రక నాటకం స్ఫూర్తితో తలపెట్టారు. హిందీ, తమిళం, తెలుగు ఆంగ్లంతో సహా పలు భాషలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్(Kamal Haasan) ను ఎంతో ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మక కాలపు చిత్రం మరుధనాయగం సినిమా 1997లో, తన స్వీయ దర్శకత్వంలో ప్రారంభించారు. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ అతిధిగా ఇది భారీ స్థాయిలో షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సుజాత స్క్రిప్ట్ రాశారు. నాజర్, సత్యరాజ్, విష్ణువర్ధన్ తదితర నటులు కూడా ఈ సినిమాకు ఎంపికయ్యారు.(చదవండి: ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల)ప్రత్యేక పాత్రల కోసం అమితాబ్, రజనీకాంత్‌లను కూడా సంప్రదించినప్పటికీ వాళ్లు తిరస్కరించారు. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు కీలకపాత్రలో హాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ కేట్ విన్స్లెట్ ని కూడా అనుకున్నారు. సినిమా టెస్ట్ షూట్ కోసం, కమల్ హాసన్ మాజీ భార్య, నటి సారిక బ్రిటీష్ ఫ్రెంచ్ సైన్యం అధికారులతో పాటు హిందూ ముస్లిం యోధులను ప్రతిబింబించేలా 7,400 వరకు దుస్తులు ఉపకరణాలను తయారు చేయించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూ.1 కోటి ఖర్చుతో టెస్ట్ షూట్ చేశారు. అప్పట్లోనే ఈ సినిమాకు రూ.80 నుంచి 90 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు..అంటే ప్రస్తుతం లెక్కల ప్రకారం చూస్తే...ఇది రూ..650 కోట్ల వరకూ ఉండొచ్చు.(చదవండి: ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్)అట్టహాసంగా అతిరధుల సమక్షంలో ప్రారంభమైన ఈ సినిమా,30 నిమిషాల రన్ టైమ్ పూర్తయిన తర్వాత 1998 చివరలో షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని సహ–నిర్మాతగా నిర్మించాలని అనుకున్న ఒక బ్రిటిష్ కంపెనీ, అర్ధంతరంగా వెనక్కి తగ్గడంతో, మరుధనాయగం పనులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. బ్రిటీష్ నిర్మాణ సంస్థ ఉపసంహరణ కారణంగా ఏర్పడిన ఆర్థిక పరిమితులు అడ్డంకిగా మారాయి. ఈ సినిమా పూర్తి కాలేదు... ఇప్పటికీ విడుదల కాలేదు, ప్రాజెక్ట్ ఎక్కడిది అక్కడే ఉండిపోయింది. ఆ బ్రిటిష్ కంపెనీ ఉపసంహరించుకోకుంటే ఈ సినిమా ఖచ్చితంగా పూర్తయి విడుదలై ఉండేది ఎన్నో సంచలనాలు నమోదు చేసేది.ఆ బ్రిటిష్ కంపెనీ సినిమా నిర్మాణం నుంచి ఉపసంహరించుకోవడానికి కారణం భారతదేశంలో జరిగిన పోఖ్రాన్ అణు బాంబు పరీక్ష . అంటే కమల్ సినిమా ఆగిపోవడానికి మన భారతరత్న నాటి అణు పరీక్షల సారధి అబ్ధుల్ కలాం పరోక్షంగా కారణం అయ్యారన్నమాట. అయితే అది తన కలల ప్రాజెక్ట్ అని కమల్ హాసన్ చెబుతుంటారు. కానీ ఇప్పుడు గానీ ఆ సినిమా స్క్రిప్ట్‌ను పునరుద్ధరించాలంటే గణనీయమైన మార్పులతో పాటు, దీనికి ఓ యువ కథానాయకుడు అవసరమని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికైనా తెరకెక్కుతుందో లేదో....

ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్, ఓటీటీలలో పెద్దగా సినిమాల సందడి కనిపించలేదు. మార్చి చివరన వచ్చిన సినిమాలతోనే అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే, ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి వాతావరణం కనిపించనుంది. రేసులో సిద్ధు నటించిన జాక్, అజిత్, త్రిష నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీతో పాటు సన్నీ డియోల్- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా 'జాట్' ఉంది. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా కాస్త పర్వాలేదనే సినిమాలే ఉన్నాయి.థియేటర్స్‌లోకి వచ్చే సినిమాలు🎥 జాక్- ఏప్రిల్ 10🎥 గుడ్ బ్యాడ్ అగ్లీ -ఏప్రిల్ 10🎥 జాట్- ఏప్రిల్ 10🎥 బజూక- ఏప్రిల్ 10🎥 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి- ఏప్రిల్ 11🎥 కౌసల్య తనయ రాఘవ- ఏప్రిల్ 11ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/ వెబ్సిరీస్లునెట్ఫ్లిక్స్🎥 కోర్టు- ఏప్రిల్ 11🎥 పెరుసు (తెలుగు/ తమిళ్)- ఏప్రిల్ 11🎥 బ్లాక్ మిర్రర్ 7 (వెబ్‌సిరీస్/ఇంగ్లిష్)- ఏప్రిల్ 10 🎥 కిల్ టోనీ (వెబ్‌సిరీస్/ఇంగ్లిష్)- ఏప్రిల్ 7అమెజాన్ ప్రైమ్ వీడియో🎥 ఛోరీ 2 (హిందీ)- ఏప్రిల్ 11🎥 ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ ( ఇంగ్లీష్) - ఏప్రిల్ 8 🎥 జీ20 (ఇంగ్లీష్)- ఏప్రిల్ 10జియో హాట్‌స్టార్🎥 ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 (యానిమేషన్ సిరీస్/హిందీ)- ఏప్రిల్ 11🎥 ది లాస్ట్ ఆఫ్ అజ్ (హిందీ/ తెలుగు/ ఇంగ్లీష్)- ఏసోనీలివ్🎥 ప్రావింకూడు షాపు (తెలుగు/ మలయాళం)- ఏప్రిల్ 11 జీ5🎥 కింగ్స్‌స్టన్ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్ 13
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు
క్రీడలు

‘మీకసలు మానవత్వం ఉందా?’.. గిల్- ఇషాన్‌పై నెటిజన్లు ఫైర్.. కానీ ఓ ట్విస్ట్!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తమ ఫీల్డర్ నొప్పితో విలవిల్లాడుతుంటే... అతడు మాత్రం ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌తో కలిసి నవ్వులు చిందించడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడింది.ఆరంభంలోనే షాకులుఉప్పల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు అతడి నమ్మకాన్ని వమ్ముకానీయలేదు. రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ ట్రవిస్ హెడ్ (8)ను పెవిలియన్‌కు పంపిన టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్.. తదుపరి ఐదో ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (18)ను కూడా అవుట్ చేశాడు.ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఎనిమిదో ఓవర్ రెండో బంతికి టైటాన్స్ మరో పేసర్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, అంతకంటే ముందు.. అంటే ఆరో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఇషాన్ ఎదుర్కొన్నాడు.గ్లెన్ ఫిలిప్స్నకు గాయంఅవుట్ సైడ్ ఆఫ్ దిశగా ప్రసిద్ వేసిన షార్ట్ బాల్‌ను పాయింట్ వైపు తరలించగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న టైటాన్స్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ బంతిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. మైదానంలో కుప్పకూలి నొప్పితో విలవిల్లాడగా.. వాషింగ్టన్ సుందర్ అతడికి దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. ఇంతలో ఫిజియో కూడా వచ్చి ఫిలిప్స్‌ను పరీక్షించి.. మైదానం బయటకు తీసుకువెళ్లాడు.ఇషాన్- గిల్ నవ్వులుఅయితే, ఆ సమయంలో నితీశ్ రెడ్డితో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన గిల్.. అతడితో నవ్వుతూ ముచ్చటించాడు. ఇషాన్ తన భుజంపై చేయి వేయగా.. గిల్ కూడా నవ్వులు చిందిస్తూ సరదాగా సంభాషిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో గిల్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.glenn phillips is lying in pain and these two buddies are gossiping like they're in some college park 😭😭😭#SRHvGT pic.twitter.com/172aqoAtM4— 🍂 (@jaaniyeeex) April 6, 2025మీకసలు మానవత్వం ఉందా?‘‘సొంత జట్టు ఆటగాడు గాయపడి.. నొప్పితో బాధపడుతుంటే.. కెప్టెన్ మాత్రం ఇలా ప్రత్యర్థి జట్టు ఆటగాడితో ముచ్చట్లు పెడుతున్నాడు. ఆటగాళ్ల మధ్య స్నేహం తప్పు కాదు. కానీ పరిస్థితికి తగ్గట్లుగా హుందాగా , కాస్త మానవత్వంతో వ్యవహరించాలి. మ్యాచ్ అయిపోయిన తర్వాత కావాల్సినంత సేపు జోకులు వేసుకోవచ్చు’’ అంటూ గిల్‌కు చురకలు అంటిస్తున్నారు.కాగా ఇషాన్- శుబ్‌మన్ గిల్ అండర్-19 స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలోనూ ఓపెనింగ్ జోడీగా రాణించారు. వీరిద్దరి మధ్య గాఢమైన స్నేహబంధం ఉంది. అయితే, టైటాన్స్- రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడు గాయపడిన వేళ.. ఇలా నవ్వులు చిందిస్తూ మాట్లాడుకోవడం వీరిపై విమర్శలకు దారితీసింది.Left national team to chase IPL money. Got injured without playing a ball.- Glenn Phillips proving once again, greed has its own price. 🥲 #GTvSRH pic.twitter.com/S0urYUhW7q— MUHAMMAD SAMI (@mrsalaar96) April 6, 2025 కానీ ఓ ట్విస్ట్!అయితే, అప్పటికి ఫిలిప్స్ పరిస్థితిని గిల్ చూడకపోవడం గమనార్హం. విషయం తెలిసిన వెంటనే అతడు తమ ఫీల్డర్ దగ్గరికి వెళ్లినట్లు కనిపించింది. దీంతో.. ‘‘తెలిసీ తెలియక మాట్లాడవద్దు’’ అంటూ ట్రోలర్స్‌కు గిల్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ టాపార్డర్ అభిషేక్ శర్మ(18), ట్రవిస్ హెడ్ (8), ఇషాన్ కిషన్ (17) మరోసారి విఫలం కాగా.. నితీశ్ రెడ్డి 34 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇతరులలో హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్) కాస్త వేగంగా ఆడారు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.గిల్ సూపర్ బ్యాటింగ్టైటాన్స్ పేసర్లు మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని టైటాన్స్ 16.4 ఓవర్లలోనే ఛేదించింది.ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్) అద్భుత అర్థ శతకం సాధించగా.. వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్) అదరగొట్టారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. రైజర్స్ బౌలర్లలో మహ్మద్ షమీకి రెండు, కమిన్స్‌కు ఒక వికెట్ దక్కాయి.3️⃣ wins on the trot 💙A commanding 7️⃣-wicket win over #SRH takes #GT to the second spot in the #TATAIPL 2025 points table 🆙Scorecard ▶ https://t.co/Y5Jzfr6Vv4#SRHvGT | @gujarat_titans pic.twitter.com/tYB1Dt5mdd— IndianPremierLeague (@IPL) April 6, 2025 చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్

ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ కౌంటీ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (సోమర్సెట్) 403 బంతులు ఎదుర్కొని 56 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 371 పరుగులు స్కోర్ చేశాడు. కౌంటీ క్రికెట్ చరిత్రలో ఇది ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోర్. సోమర్సెట్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. 344 పరుగుల వద్ద మూడో రోజు ఆటను కొనసాగించిన బాంటన్.. మరో 27 జోడించి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బాంటన్ ఆట తీరు చూసి బ్రియాన్ లారా 501 పరుగుల రికార్డు బద్దలు కావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 371 పరుగుల స్కోర్ వద్ద బాంటన్‌ను టామ్ హిన్లే ఔట్ చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బాంటన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ స్థానంలో బరిలోకి దిగి రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఐదో స్థానంలో అత్యధిక స్కోర్ రికార్డు బిల్ పాన్స్‌ఫోర్డ్ పేరిట ఉంది. అతను 1922/23లో టస్మానియా 429 పరుగులు స్కోర్ చేశాడు. ఓవరాల్‌గా బాంటన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 21వ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు బ్రియాన్ లారా పేరిట పదిలంగా ఉంది. 1994 కౌంటీ సీజన్లో లారా వార్విక్‌షైర్‌కు ఆడుతూ డర్హమ్‌పై 501 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డు నింబాల్కర్ పేరిట ఉంది. నింబాల్కర్ 1948లో ఖతియావార్పై 443 (నాటౌట్) పరుగులు స్కోర్ చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో భారత్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ పృథ్వీ షా పేరిట ఉంది. షా 2023 రంజీ సీజన్లో అసోంపై 379 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు టెస్ట్‌ల్లో కూడా అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు బ్రియాన్ లారా పేరిటే ఉంది. లారా 2004లో ఇంగ్లండ్‌పై 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు (టాప్-10)బ్రియాన్ లారా- 501 నాటౌట్హనీఫ్ మొహమ్మద్- 499డాన్ బ్రాడ్‌మన్- 452 నాటౌట్బీబీ నింబాల్కర్- 443 నాటౌట్పాన్స్ఫోర్డ్- 437పాన్స్‌ఫోర్డ్- 429అప్తాబ్ బలోచ్- 428మెక్లారెన్- 424సామ్ నార్త్ఈస్ట్- 410 నాటౌట్గ్రేమ్ హిక్- 405 నాటౌట్మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వార్సెస్టర్‌షైర్ 154 పరుగులకు ఆలౌటైంది. అల్డ్రిడ్జ్ 5 వికెట్లతో చెలరేగాడు. వార్సెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రోడ్రిక్ (58) అర్ద సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సోమర్సెట్.. టామ్ బాంటన్ ట్రిపుల్ సెంచరీతో (371) చెలరేగడంతో 7 వికెట్ల నష్టానికి 670 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ ర్యూ (152) కూడా శతక్కొట్టాడు. భారీగా వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వార్సెస్టర్‌షైర్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. సోమర్సెట్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు వార్సెస్టర్‌షైర్ ఇంకా 236 పరుగులు వెనుకపడి ఉంది. బ్రెట్ డొలివెయిరా (71), ఆడమ్ ఫించ్ (4) క్రీజ్‌లో ఉన్నారు.

SRH VS GT: ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను.. అదే నన్ను పైకి లేపింది: సిరాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. నిన్న (ఏప్రిల్ 6) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు. తద్వారా గుజరాత్ సన్‌రైజర్స్‌ను వారి సొంత ఇలాకాలో (ఉప్పల్ స్టేడియంలో) చిత్తుగా ఓడించింది. ఈ ప్రదర్శనకు గానూ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ (4-0-19-3) సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శనకు కూడా సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు గుజరాత్ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించడంలోనూ సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో సిరాజ్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్ శర్మ, రికెల్టన్లను క్లీన్ బౌల్డ్ చేశాడు) తీశాడు.సిరాజ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రెచ్చిపోవడంతో గుజరాత్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన ఈ జట్టు ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. గుజరాత్ ఈ స్థాయిలో సత్తా చాటడంలో సిరాజ్‌దే ప్రధాన పాత్ర. సన్‌రైజర్స్‌పై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం సిరాజ్ ఇలా అన్నాడు. సొంత మైదానంలో ఆడటం ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఇవాళ మ్యాచ్‌లో నా కుటుంబ సభ్యులు జనం మధ్యలో ఉన్నారు. అదే నన్ను పైకి లేపింది. నేను ఏడు సంవత్సరాలు ఆర్సీబీకి ఆడాను. నా బౌలింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు చాలా కష్టపడ్డాను. అది నాకు ఇప్పుడు పనిచేస్తోంది. ఓ సమయంలో నేను దానిని జీర్ణించుకోలేకపోయాను (ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కానందుకు).అయినా నిరాశపడకుండా ఫిట్నెస్ మరియు ఆటపై దృష్టి పెట్టాను. నేను చేసిన తప్పులపై వర్కౌట్ చేశాను. ప్రస్తుతం నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. టీమిండియా తరఫున స్థిరంగా ఆడుతున్నప్పుడు జట్టులో స్థానం కోల్పోవడం నిజంగా బాధించింది. అయినా నన్ను నేను ఉత్సాహపరుచుకున్నాను. ఐపీఎల్ కోసం ఎదురు చూశాను. కసితో వర్కౌట్ చేసి సత్ఫలితాలు సాధిస్తున్నాను.

‘ట్రావిషేక్’ మళ్లీ ఫెయిల్!.. ఇదేం బ్యాటింగ్? సహనం కోల్పోయిన కావ్యా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు రోజురోజుకీ అధ్వానంగా తయారవుతోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన కమిన్స్ బృందం.. తాజాగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైంది. సొంత మైదానం ఉప్పల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.సమిష్టి వైఫల్యంతో పరాజయాల సంఖ్యను నాలుగుకు పెంచుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం టాపార్డర్ దారుణంగా విఫలం కావడమే. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్లుగా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma), ట్రవిస్ హెడ్ (Travid Head) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకోవడం.. జట్టులోకి కొత్తగా వచ్చి వన్‌డౌన్‌లో ఆడుతున్న టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ కూడా వరుస మ్యాచ్‌లలో చేతులెత్తేయడం తీవ్ర ప్రభావం చూపుతోంది.టాపార్డర్ మరోసారి కుదేలుగుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ ఈ బ్యాటింగ్ త్రయం దారుణంగా విఫలమైంది. అభిషేక్ 16 బంతుల్లో 18 చేసి నిష్క్రమించగా.. హెడ్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఈ ఇద్దరి వికెట్లను హైదరాబాదీ స్టార్, గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు.Hyderabad + New ball = Miyan Magic!#MohammedSiraj rocks #SRH early with the big wicket of #TravisHead in the opening over! 👊🏻Watch LIVE action ➡ https://t.co/meyJbjwpV0#IPLonJioStar 👉 SRH 🆚 GT | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star Sports 2… pic.twitter.com/Vokiul9meR— Star Sports (@StarSportsIndia) April 6, 2025 సహనం కోల్పోయిన కావ్యా మారన్ఇక ఓపెనర్ల వరుస వైఫల్యాలతో విసుగెత్తిన సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘‘అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇంత ఘోరంగా అవుటవుతారా? ఇదేం బ్యాటింగ్’’ అన్నట్లుగా హావభావాలు పలికిస్తూ తలను బాదుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Ruk jao bhai kya kar rahe ho Normal cricket khel lo ab 🤣🤣Kavya maran's reactions 🤌🏽🤣 pic.twitter.com/O39QTMNgPc— ••TAUKIR•• (@iitaukir) April 6, 2025సిరాజ్ ‘స్ట్రోక్’ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (18), ట్రవిస్ హెడ్ (8), ఇషాన్ కిషన్ (17) మరోసారి చేతులెత్తేయగా.. నితీశ్ రెడ్డి (31) రాణించాడు. హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27), కమిన్స్ (9 బంతుల్లో 22) వేగంగా ఆడి స్కోరును 150 పరుగుల మార్కు దాటించారు.గుజరాత్ బౌలర్లలో లోకల్ బాయ్ సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు కూల్చారు. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు రైజర్స్ పేసర్ షమీ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ సాయి సుదర్శన్‌ను 5 పరుగులకే పెవిలియన్‌కు పంపించాడు.గిల్, వాషీ, రూథర్‌ఫర్డ్ ధనాధన్అదే విధంగా.. ప్రమాదకర బ్యాటర్ జోస్ బట్లర్‌ను కెప్టెన్ కమిన్స్ డకౌట్ చేశాడు. అయితే, రెండు కీలక వికెట్లు తీసిన ఆనందం సన్‌రైజర్స్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. నాలుగో స్థానంలో వచ్చిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ధనాధన్ (29 బంతుల్లో 49) దంచికొట్టాడు.ఆఖర్లో షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (16 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35) తన పవర్ హిట్టింగ్తో గిల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గిల్, వాషీ, రూథర్‌ఫర్డ్ ఇన్నింగ్స్ కారణంగా 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయఢంకా మోగించింది.Glorious shots on display 🫡Captain Shubman Gill led from the top and remained unbeaten with a well constructed innings of 61(43) 👏Scorecard ▶ https://t.co/Y5Jzfr7tkC#TATAIPL | #SRHvGT | @ShubmanGill pic.twitter.com/1CWQU5gd82— IndianPremierLeague (@IPL) April 6, 2025 చదవండి: SRH VS GT: వారి పేసర్లను ఎదుర్కోవడం మా బ్యాటర్ల వల్ల కాలేదు: కమిన్స్
బిజినెస్

బీమాతో ధీమా.. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకోండిలా
'ఆరోగ్యమే మహాభాగ్యం'.. ఈ మాటను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ కొంత పెద్దయిన తరువాత మహాభాగ్యం అంటే మిద్దెలు, మెడలు అనుకున్నాం. నిజానికి మనిషి ఆరోగ్యంగా లేకపోతే.. ఎంత సంపాదించినా అది వ్యర్థమే. కాలం మారిపోయింది.. ఎప్పుడు ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితిలో బతుకుతున్నాం.చరిత్ర చదువుకేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చదువుకున్నట్లు.. ఆరోగ్యం అంటే కరోనా ముందు, కరోనా తరువాత అన్నట్లు అయిపోయింది. కోవిడ్ మహమ్మారి ప్రజల జీవితాలను అంతలా తలకిందులు చేసింది. చేతిలో డబ్బులు లేక.. ఆసుపత్రులలో ఖర్చులు పెట్టుకోలేక పడ్డ ఇబ్బందులు కోకొల్లలు. ఆ తరువాత చాలామంది కళ్ళు తెరిచారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు. అవసరానికి చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయం బహుశా అందరికీ తెలిసి ఉన్నప్పటికీ.. 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' సందర్భంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎలా ఎంచుకోవాలనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం..హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. ఆరోగ్య స్థితిని బట్టి మాత్రమే కాకుండా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఎలాంటి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవానుకుంటున్నావు అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో నివసిస్తున్న అనేక మధ్యతరగతి కుటుంబాలకు..హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రూ. 5 లక్షలు సరిపోదని స్పష్టమైపోయింది. చాలా మంది ఆర్థిక సలహాదారులు, ఆరోగ్య బీమా నిపుణులు సైతే కనీసం రూ. 10 లక్షల కవరేజ్ సిఫార్సు చేస్తున్నారు.నాణ్యమైన ఆరోగ్య సేవల కోసంతగినంత పెద్ద కవరేజ్ ఉండటం వల్ల.. మీరు మీకు నచ్చిన ఆసుపత్రులు చికిత్స తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందటానికి ఉత్తమమైన మార్గం వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ. వయసులో ఉన్నప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలు తక్కువే అయినప్పటికీ.. వయసు మీదపడే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.35 ఏళ్ల వ్యక్తి కనీసం రూ. 10 లక్షల కవర్‌తో ఇన్సూరెన్స్ ప్రారంభించడం ఉత్తమం. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అవసరం అయినప్పుడు లేదా తరచూ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళకు ఇంకా పెద్ద కవరేజ్ అవసరం అవుతుంది. కాబట్టి వ్యక్తి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. పాలసీ ఎంచుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: బంగారం కొనడానికి ఇదే మంచి సమయం.. మరింత తగ్గిన రేటుమెట్రో నగరాల్లో నివసించేవారికిచిన్న పట్టణాలలో నివసిస్తున్న వారితో పోలిస్తే.. మెట్రో నగరాల్లో నివసిస్తున్నవారికి పెద్ద కవరేజ్ అవసరం అవుతుంది. ముంబై వంటి మహానగరాల్లో, ఇండోర్ వంటి టైర్-II నగర్లో నివసిస్తున్న వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాలంటే.. కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు కవరేజ్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు మీ నగరంలోని ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.కుటుంబంలో ప్రతి వ్యక్తికి రూ. 10 లక్షల వరకు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే.. కనీసం రూ. 20 లక్షల కవర్‌తో ప్రారంభించడం ఉత్తమం. ఆర్థిక స్థోమత అడ్డంకి కాకుండా ఉండాలంటే.. ఆరోగ్య సమస్యలను నుంచి బయట పడాలంటే.. బీమా తీసుకోవాల్సిందే.

బ్యాంక్ ఖాతాలు వారివే ఎక్కువ: డేటా విడుదల
న్యూఢిల్లీ: దేశీయంగా బ్యాంక్ ఖాతాల్లో మహిళల వాటా 39.2 శాతమని ఒక నివేదికలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే మరింత అధికంగా 42.2 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. ‘ఉమన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024: సెలెక్టెడ్ ఇండికేటర్స్, డేటా’ పేరుతో గణాంకాలు, పథకాల అమలు శాఖ నివేదిక విడుదల చేసింది.దీని ప్రకారం మహిళల ఖాతాల ద్వారా మొత్తం బ్యాంక్ డిపాజిట్లలో 39.7 శాతం లభిస్తున్నాయి. ఇక కొన్నేళ్లుగా స్టాక్ మార్కెట్లో ప్రజల పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో డీమ్యాట్ ఖాతాల సంఖ్య బలపడుతూ వస్తోంది. 2021 మార్చి 31లో నమోదైన 33.26 మిలియన్ డీమ్యా ట్ ఖాతాలు 2024 నవంబర్ 30కల్లా 143.02 మిలియన్లకు చేరాయి. వెరసి నాలుగు రెట్లుపైగా ఎగశాయి. వీటిలో పురుషుల ఖాతాలు భారీగా 26.59 మిలియన్ల నుంచి 115.31 మిలియన్లకు జంప్‌చేశాయి. అయితే మహిళల ఖాతాలు సైతం 6.67 మిలియన్ల నుంచి 27.71 మిలియన్లకు ఎగశాయి.1952లో 17.32 కోట్లుగా నమోదైన మహిళా ఓటర్ల సంఖ్య 2024 కల్లా 97.8 కోట్లకు జంప్‌చేసింది. కనీసం ఒక మహిళా డైరెక్టర్గల.. డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌లలోనూ పురోగతి కనిపిస్తోంది. 2017లో ఈ తరహా స్టార్టప్‌లు 1,943 నమోదుకాగా.. 2024కల్లా 17,405కు ఎగశాయి. వెరసి మహిళా ఎంటర్‌ప్రెన్సూర్స్ సంఖ్య బలపడుతోంది.

నీళ్లు లేకుండా బట్టలు ఉతికేద్దామా?
అదెలా సాధ్యం అనే డౌట్ వచ్చిందా? నీళ్లు లేకుండా చిన్న పని కూడా చేయలేం కదా? అలాంటిది బట్టలు ఉతకడమా? వినడానికే వింతగా ఉంది.. అని అనుకుంటున్నారా? టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే. సమస్త ప్రాణకోటికీ నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ప్రపంచం సాంకేతికంగా ఎంత ముందుకు వెళుతున్నా.. నీటి కష్టాలు మాత్రం తీరడంలేదు. ఈ భూ మండలంపై 71 శాతానికి పైగా నీరున్నా.. మనిషి అవసరాలకు ఉపయోగపడేది కేవలం ఒక శాతం మాత్రమే. జనం పెరిగిపోవడం, వాతావరణ మార్పులు వెరసి.. నీటి కష్టాలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. నిత్య జీవితంలో మనిషికి నీటి అవసరం చాలా ఉంటుంది. పట్టణాల్లో అయితే సగటున ఒక వ్యక్తి వంటకు, స్నానాలకు, బట్టలు ఉతకడానికి, ఇంటి అవసరాలు తదితరాల కోసం రోజూ 135 లీటర్ల నీటిని వినియోగిస్తున్నాడు. ఇక మన దేశంలో అయితే ఒక్కో ధోబీ ఘాట్‌లో రోజుకు 78 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగిస్తున్నారు. పైగా ఇలా బట్టలు ఉతకడం వల్ల నీటి వృథా అవడమే కాదు.. టన్నుల కొద్దీ డిటర్జెంట్లు, మైక్రో ప్లాస్టిక్లు, రసాయనాలు నదులు, సరస్సుల్లోకి విడుదలై ఆ నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. మరి ప్రత్యామ్నాయమేంటి? బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్లు వినియోగించడం తెలిసిందే. సాధారణంగా వాషింగ్ మెషీన్లో ఒకసారి బట్టలు ఉతకడానికి 30 నుంచి 40 లీటర్ల నీళ్లు సరిపోతాయి. మామూలుగా బట్టలు ఉతకడంతో పోలిస్తే ఇది తక్కువే. ప్రస్తుతం బట్టలు ఉతకడానికి నీరు (హెచ్‌టూఓ) తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలో అసలు నీళ్లే లేకుండా బట్టలు ఉతకలేమా అనే ఆలోచన రావడంతో ఆ దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. తొలుత నైలాన్ బీడ్స్ సహాయంతో దుస్తులు ఉతికే వాషింగ్ మెషీన్ వచి్చంది.అయితే, ఇది పూర్తిగా నీరు, డిటర్జెంట్ లేకుండా ఆ పని చేయలేకపోయింది. కానీ 80 శాతం వరకు నీటిని ఆదా చేసింది. తర్వాత కాలంలో కూడా వీటికి సంబంధించి పలు పరిశోధనలు జరిగాయి. ఈ క్రమంలో కార్బన్ డైఆక్సైడ్ (సీ వోటూ) ఉపయోగిస్తే.. నీటి అవసరమే ఉండదని తేల్చారు. ద్రవరూప కార్బన్ డై ఆక్సైడ్తో బట్టలు ఉతకడం సులభమేనని నిర్ధారణకు వచ్చారు. ఎలా పనిచేస్తుంది? ఇది మామూలు వాషింగ్ మెషీన్ల కంటే పెద్దగా ఉంటుంది. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రూపంలో ఉంటుంది. దుస్తులను నిర్దేశిత చాంబర్లో వేసి స్విచ్ ఆన్ చేయాలి. అప్పుడు గ్యాస్ రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ద్రవరూపంలోకి మారి బట్టలకు ఉన్న మురికిని వదిలిస్తుంది. బట్టలు ఉతకడం పూర్త యిన తర్వాత ఆ ద్రవం తిరిగి గ్యాస్ రూపంలోకి మారిపోయి.. పునరి్వనియోగానికి సిద్ధంగా ఉంటుంది. నీటి వినియోగం లేనందున బట్టలు మళ్లీ ఆరబెట్టాల్సిన అవసరం లేదు. బట్టలు ఉతకడం పూర్తయిన తర్వాత పొడిగానే బయటకు వస్తాయి. ప్రయోజనాలేంటి? ఈ మెషీన్‌కు నీళ్లే కాదు.. ఎలాంటి డిటర్జెంట్లూ అవసరం లేదు. దుస్తులు పాడైపోతాయనే బెంగా లేదు. పైగా ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. అంతేకాదు ఇది పర్యావరణ అనుకూలంగానూ ఉంటుంది. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే.. ఖరీదు కాస్త ఎక్కువే. దీన్ని ఇంట్లో పెట్టడానికి కాస్త ఎక్కువ ప్లేస్ కావాలి. అయితే నీరు, ఇతరత్రా నిర్వహణ వ్యయం ఆదాతో పోలిస్తే వీటిని ప్రతికూలతలుగా పరిగణించక్కర్లేదనేది నిపుణుల మాట.మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా? ప్రస్తుతానికి ఈ వాషింగ్ మెషీన్లు యూఎస్, యూకే, జపాన్ వంటి దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. ముఖ్యంగా హోటళ్లు, ఆస్పత్రుల వంటి చోట్ల వినియోగిస్తున్నారు. ఇంటి అవసరాలకు ఉపయోగించడం ఇంకా మొదలుకాలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు వాషింగ్ మెషీన్ల బ్రాండ్లు వీటిని పరీక్షిస్తున్నాయి. అయితే అత్యధిక జనాభా కలిగి, అత్యధిక నీటి అవసరం ఉన్న భారత్ మాత్రం ఆ దిశగా ఇంకా ప్రయతి్నంచడం లేదు. ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ అవగాహన కల్పించి, ఆ మేరకు సాంకేతికతను అందిపుచ్చుకుంటే మనం కూడా ఎంతో నీటిని ఆదా చేసే అవకాశం ఉంటుంది.

వైద్య రంగంలో గేమ్ ఛేంజర్‌గా కృత్రిమమేధ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఆరోగ్య సంరక్షణలోనూ కృత్రిమమేధ ఎంతగానో తోడ్పడుతుంది. అధునాతన అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, విస్తారమైన డేటాను ఉపయోగించడం ద్వారా ఏఐ రోగి సంరక్షణను మెరుగుపరుస్తుంది.. కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది.. వైద్య పరిశోధనను వేగవంతం చేస్తుంది. ప్రాథమికంగా వ్యాధి గుర్తింపు నుంచి అందుకు అవసరమైన చికిత్సల వరకు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో, ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కృత్రిమ మేధ ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది. (నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..)ప్రాథమికంగా రోగ నిర్ధారణ..ఆరోగ్య సంరక్షణకు ఏఐ సహకారం అందిస్తోంది. సాంప్రదాయ పద్ధతుల కంటే ముందుగానే మరింత కచ్చితంగా వ్యాధులను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ నమూనాలతో ఎక్స్-రే రిపోర్ట్లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు వంటి మెడికల్ ఇమేజింగ్ వ్యవస్థల ద్వారా మానవుల కంటే మెరుగ్గా వైద్య పరిస్థితులను విశ్లేషిస్తున్నాయి. ఉదాహరణకు, మామోగ్రామ్లలో రొమ్ము క్యాన్సర్ సంకేతాలను గుర్తించడానికి లేదా కంటి స్కాన్లలో డయాబెటిక్ రెటినోపతిని మరింత కచ్చితత్వంతో గుర్తించడానికి ఏఐ వ్యవస్థలు అభివృద్ధి చేశారు.గుండె జబ్బులు, డయాబెటిస్ లేదా అల్జీమర్స్ వంటి పరిస్థితుల అవకాశాలను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (ఇహెచ్ఆర్), వేరబుల్స్, జన్యు ప్రొఫైల్స్ నుంచి డేటాను ప్రాసెస్ చేయగలదు. భవిష్యత్తులో తలెత్తె సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా కృత్రిమమేధ త్వరగా వైద్యులకు సమాచారం అందిస్తుంది. ఇది నిత్యం రోగులు వెచ్చించే చికిత్స ఖర్చులను తగ్గిస్తుంది.వైద్య సిఫారసులుఏఐ రోగులకు అనుగుణంగా రిపోర్ట్‌లను విశ్లేషించి చికిత్సలను సూచిస్తుంది. ఇది జన్యు సమాచారాన్ని కూడా అందిస్తుంది. దాంతో జీవనశైలి, వైద్య చరిత్రలు వంటి లార్జ్ డేటాసెట్లను విశ్లేషించి ఏఐ మెరుగై చికిత్సలను అందించేందుకు సాయం చేస్తుంది. ఉదాహరణకు, ఏఐ అల్గారిథమ్స్ రోగి జన్యు డిజైన్ ఆధారంగా నిర్దిష్ట క్యాన్సర్ చికిత్సలను సిఫారసు చేయగలవు. కొత్త మందులకు రోగులు ఎలా స్పందిస్తారో అంచనా వేయడం ద్వారా కృత్రిమ మేధ ఆధారిత సాధనాలు ఔషధ అభివృద్ధికి సహాయపడతాయి. ఇది క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేయడనికి తోడ్పడుతుంది. ఇది నిర్దిష్ట జనాభాకు మరింత ప్రభావవంతమైన మందులను రూపొందించడానికి ఫార్మా కంపెనీలకు సహాయపడుతుంది.పరిపాలనా విధుల్లో..హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ తరచుగా షెడ్యూల్, బిల్లింగ్, రికార్డుల నిర్వహణ వంటి అడ్మినిస్ట్రేటివ్ విధులపై ఉంతో సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ఏఐ రంగంలోకి దిగుతోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) సాధనాలు డాక్టర్-రోగి సంభాషణలను విశ్లేషించగలవు. సంబంధిత వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రిపోర్ట్‌లను అప్డేట్ చేయగలవు. చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు రోగులకు డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్స్‌ను నిర్వహిస్తాయి. సాధారణ రోగి ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తాయి. ఇది ఆసుపత్రులు, క్లినిక్‌లకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.టెలిమెడిసిన్, రిమోట్ కేర్..ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి వంటి సంఘటనల నేపథ్యంలో టెలిమెడిసిన్ వృద్ధిని కృత్రిమమేధ వేగవంతం చేసింది. ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు, వీడియో కాల్స్ ద్వారా రోగులు నివేదించిన లక్షణాలను విశ్లేషించడం వల్ల రిమోట్‌గానే సేవలందించింది. కృత్రిమ మేధ ఉపయోగించిన వేరబుల్ పరికరాలు హృదయ స్పందన రేటు లేదా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తాయి. రియల్ టైమ్‌లోనే అందుకు అనుగుణంగా రోగుల పరిస్థితులపట్ల వైద్యులను అప్రమత్తం చేస్తాయి.పరిశోధనలు వేగవంతంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య ఆవిష్కరణల వేగాన్ని పెంచుతోంది. విస్తారమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విశ్లేషించడానికి పరిశోధకులు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. మానవులు కనుగొనడానికి సంవత్సరాలు పట్టే ఔషధ ఆవిష్కరణలో కృత్రిమ మేధ నమూనాలు సమ్మేళనాలు ఎంతో తోడ్పడుతున్నాయి. దీనివల్ల కొత్త మందులను మార్కెట్లోకి తీసుకువచ్చే సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. సంక్లిష్ట వ్యాధులను, వాటి పురోగతిని అర్థం చేసుకోవడానికి ఏఐ సహాయపడుతుంది. ఉదాహరణకు, పార్కిన్సన్ వంటి న్యూరోడిజెనరేటివ్ పరిస్థితులు ఎలా అభివృద్ధి చెందుతాయో ఇది అంచనా వేయగలదు.మానసిక ఆరోగ్యానికి మద్దతుగా..ఏఐ మానసిక ఆరోగ్య సంరక్షణలోనూ పురోగతి సాధిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనువర్తనాలు, చాట్బాట్లు వ్యక్తులకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)ని అందిస్తున్నాయి. ఈ సాధనాలు ఆందోళన, నిరాశ లేదా ఒత్తిడి సంకేతాలను విశ్లేషిస్తాయి. అవసరమైనప్పుడు చికిత్సకులను సూచిస్తాయి.ఇదీ చదవండి: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలుసవాళ్లు-పరిష్కారాలుఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధ ఉంతో తోడ్పాటు అందిస్తున్నప్పటికీ ఈ ఏఐ వ్యవస్థలు సున్నితమైన రోగి సమాచారంపై ఆధారపడతాయి. కాబట్టి డేటా గోప్యత ఒక ప్రధాన ఆందోళనగా ఉంది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం, ఈ విభాగంలో చట్టాలకు లోబడి నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. ఈ రంగంలో ఏఐ నమూనాల విశ్లేషణను జాగ్రత్తగా పర్యవేక్షించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. రోగులు ఏఐ సిఫార్సులపై విశ్వాసం కలిగి ఉండేలా విధానాలు పటిష్టంగా రూపొందించాల్సి ఉంటుంది. దీనికి ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే దానిపై పారదర్శకత చాలా అవసరం.
ఫ్యామిలీ

గోల్డెన్ చారియట్ టూర్: ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా..జస్ట్ ఒకే రైలుబండిలో..!
రత్నాల రాశులతో విలసిల్లిన నేల హంపి. కాఫీ తోటలతో విలసిల్లుతున్న చిక్‌మగళూరు. హొయసల వాస్తుశైలికి తార్కాణం హలేబీడు. బహు విశేషణాల మల్లిగ మాల మైసూరు. మైసూర్ పాలకుల బెంగళూరు ప్యాలెస్.మధ్యలో మృగరాజు గాండ్రించే బందీపూర్.చివరాఖరుకు అరేబియా తీరాన గోవా...ఒకే రైలుబండిలో మొత్తం తిరిగి వద్దాం. రాజమహల్లాటి గోల్డెన్ చారియట్ ట్రైన్ ఉంది. ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా ప్యాకేజ్ ఉంది. మెనీ మెనీ థాంక్స్ టూ ఐఆర్సీటీసీ.గోల్డెన్ చారియట్ అనేది మనదేశంలో విలాసవంతమైన పర్యటన కోసం ఇండియన్ రైల్వేస్ డిజైన్ చేసిన రైలు ప్రయాణం. ఇందులో ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా, జ్యువెల్స్ ఆఫ్ సౌత్, గ్లింప్సెస్ ఆఫ్ కర్నాటక ప్యాకేజ్‌లున్నాయి. ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా ప్యాకేజ్‌లో బెంగళూరు, నంజన్‌గుడ్, బందీపూర్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీ, మైసూరు, హలేబీడు, చిక్మగుళూరు, హంపి, గోవాలు కవర్ అవుతాయి.1వ రోజుబెంగళూరు నుంచి నంజన్గుడ్కి ప్రయాణం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పర్యాటకులు యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్లో ఉదయం ఎనిమిదిన్నరకు ట్రైన్ ఎక్కి లో తమకు కేటాయించిన క్యాబిన్లో చెక్ ఇన్ అవుతారు. రైలు 9.45కి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. లంచ్ రైల్లోనే. మధ్యాహ్న ఒకటిన్నరకు నంజన్‌గుడ్ చేరుతుంది. రైలు దిగిన తర్వాత రోడ్డు మార్గాన బందిపూర్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీకి ఒకటిన్నర గంట ప్రయాణం. సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు అడవిలో విహారం తర్వాత తిరిగి నంజన్‌గుడ్ స్టేషన్‌కు చేరి రైలెక్కాలి. ఎనిమిది తరవాత రాత్రి భోజనం. రైలు మైసూరు వైపు సాగుతుంది.బందీపూర్: ఇది దట్టమైన అడవి. పశ్చిమ కనుమలు అంటేనే పచ్చదనానికి పుట్టిల్లు. దట్టమైన అడవుల నెలవు. ఈ పర్వతశ్రేణుల్లో విస్తరించిన అడవి ఇది. ఈ పులుల సంరక్షణ కేంద్రంలో పులి ఠీవిగా రాజుగా సంచరిస్తుంటుంది. కానీ పగలు చూడలేం. సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్‌ని మాత్రమే చూడగలం. మైసూర్– ఊటీ హైవేలో ఉంది. ఈ అటవీ ప్రాంతం ఏనుగులు, రకరకాల జింకలు, వందలాది జాతుల పక్షుల నిలయం. ఇక్కడ మహావృక్షాలను చూడడానికి తలెత్తి ఆకాశాన్ని చూడాల్సిందే. ఆకాశాన్నంటే మహావృక్షాలనే అతిశయోక్తి అలంకారం ఈ వృక్షాలను చూసే పుట్టిందేమో! వెదురు, టేకు, రోజ్‌వుడ్ వృక్షాలుంటాయి. చందనవృక్షాలను తాకి చేతిని వాసన చూసుకుని మురిసిపోవచ్చు. అడవిలో సఫారీకి పర్యటించడానికి జీపులు, మినిబస్సులున్నాయి. ఇప్పుడు ఎలిఫెంట్ సఫారీ లేదు. ట్రెకింగ్ చేయవచ్చు. కానీ ఈ టూర్ ప్యాకేజ్‌లో అంత సమయం ఉండదు.2వ రోజుమైసూరు పర్యటన. ఉదయం రైల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత రైలు దిగి మైసూరు ΄్యాలెస్కు రోడ్డు ప్రయాణం. మధ్యాహ్న భోజనం సమయానికి రైలెక్కాలి లేదా ఆ సమయంలో శ్రీరంగపట్టణం వెళ్లి రావచ్చు. ట్రైన్ శుభ్రం చేసుకోవడం కోసం ఆగుతుంది. రాత్రి భోజనం రైల్లోనే, బనావర్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణం సాగుతుంది.మైసూరు: ఈ నగరానికి ఉన్నన్ని విశేషణాలు బహుశా మరే నగరానికీ ఉండక΄ోవచ్చు. హెరిటేజ్ సిటీ, సిటీ ఆఫ్ ΄్యాలెస్, ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కర్నాటక, సాండల్‌వుడ్ సిటీ, సిటీ ఆఫ్ జాస్మిన్...ఇన్ని పేర్లతో పిలుచుకుంటారు. ఇంకా ముఖ్యంగా పర్యాటకులు గుర్తుంచుకోవాల్సింది మైసూరు ఉచ్చారణ గురించి. ఇంగ్లిష్ స్పెల్లింగ్ ఆధారంగా మైసూర్ లేదా మైసోర్ అని పలికితే కన్నడిగులకు నచ్చదు. సౌమ్యులు కాబట్టి కోప్పడరు కానీ నొచ్చుకుంటారు. మైసూరు అనాల్సిందే. వడయార్లు నివసించిన మైసూరు ప్యాలెస్, మైసూరుకి ఆ పేరు తెచ్చిన చాముండి హిల్స్‌లో చాముండేశ్వరి ఆలయం వంటి పర్యాటక ప్రదేశాలను చూసిన తర్వాత ఇక్కడ దొరికే మైసూరు మల్లిగె (మల్లెపూలు)లు కొనుక్కుని జడకు చుట్టుకుని మురిసి΄ోవాల్సిందే. అలాగే మైసూరు సిల్క్ చీరలు, మైసూర్ శాండల్ సోప్‌లు కూడా.3వ రోజుహలేబీడు, చిక్‌మగళూరుకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బణావర్లో రైలు దిగి హలేబీడుకు వెళ్లాలి. హలేబీడు సైట్‌సీయింగ్ తర్వాత రైలెక్కి మధ్యాహ్న భోజనం చేస్తూ చిక్మగుళూరుకు వెళ్లాలి. సాయంత్రం కాఫీ తోటల్లో విహారం, సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత అక్కడే రాత్రి భోజనం పూర్తి చేసుకుని రైలెక్కి హోస్పేటకు సాగి΄ోవాలి.హలేబీడు... ఇది 11వ శతాబ్దంలో విలసిల్లిన హొయసల సామ్రాజ్యానికి తార్కాణం. ఢిల్లీ సుల్తానుల విధ్వంసం తర్వాత మిగిలిన శిథిలాలు నాటి శిల్పుల గొప్పదనాన్ని తెలుసుకోవడానికి మిగిలిన ఆనవాళ్లు. ఏకరాతిలో చెక్కిన మహాశిల్పాలు చూపుతిప్పుకోనివ్వవు. బారులు తీరిన ఏనుగులు, సింహాలతో ఆలయం గోడలంతా శిల్పనైపుణ్యమే. ఈ శిల్పాలను ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తే ఇందులో ఒక మహా చారిత్రక గ్రంథం దాగి ఉందని చెబుతారు చరిత్రకారులు.చిక్‌మగళూరు: విస్తారమైన కాఫీ తోటల మధ్య కాఫీ సువాసనను ఆఘ్రాణిస్తూ విహరించడం గొప్ప అనుభూతి. కాఫీ తోటల్లో చెట్ల సన్నని కొమ్మలు కాఫీ గింజల బరువుకు నేలకు వంగి΄ోతుంటాయి. ఆకు పచ్చ రంగు నుంచి ఎరుపు రంగుకు మారిన గింజలను కోసి బుట్టలో వేస్తుంటారు మహిళలు.టీ తోటల్లో టీ ఆకు సేకరించేవాళ్లు బుట్టను వీపుకు కట్టుకుంటారు. కాఫీ గింజలను సేకరణలో బుట్టను ముందుకు తగిలించుకుంటారు. కాఫీ పొడి తయారు చేసే ఫ్యాక్టరీల నుంచి కాఫీ వాసన గాల్లో తేలుతూ పర్యాటకులను ఆహ్వానిస్తుంది. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోస్పేట జంక్షన్లో ట్రైన్ దిగి హంపిలోని పర్యాటకప్రదేశాల వీక్షణానికి తీసుకువెళ్తారు. లంచ్ సమయానికి తిరిగి రైలెక్కాలి. సాయంత్రం వరకు ఖాళీ సమయం. రాత్రి భోజనం తర్వాత గోవా వైపు ప్రయాణం సాగుతుంది. హంపి: తుంగభద్ర తీరాన 14వ శతాబ్దంలో విలసిల్లిన నగరం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబిస్తున్న ఆనవాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. కృష్ణదేవరాయలు పాలించిన నేల. రాయల కాలంలో రత్నాలు రాశులు పోసిన నేలలో ఇప్పుడు మనకు కనిపించేవి రాళ్లు మాత్రమే. విరూపాక్ష ఆలయం, ముస్లిం పాలకుల చేతిలో ధ్వంసమైన నిర్మాణాల శిథిలాల ఆధారంగా వాటి పూర్తి స్వరూపాన్ని మనోనేత్రంతో వీక్షించుకోగలిగితే నాటి శిల్పకారుల చాతుర్యానికి చేతులెత్తి మొక్కకుండా ఉండలేం. హంపిని ఏటా సందర్శించే ఏడు లక్షల పర్యాటకుల్లో మనమూ ఉందాం. 5వ రోజుగోవాలో విహారం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నార్త్ గోవాలోని చర్చ్‌ల వీక్షణం. తిరిగి స్టేషన్‌కి వచ్చి ట్రైన్లో లంచ్. ట్రైన్ మాద్గోవ్ వైపు సాగుతుంది. సాయంత్రం సౌత్ గోవాలో ఉత్సాహం ఉరకలు వేసే కార్యక్రమాలు, గాలా డిన్నర్ తర్వాత ట్రైన్ బెంగళూరు వైపు సాగుతుంది.గోవా అంటే మనకు అరేబియా తీరమే గుర్తు వస్తుంది. కానీ ఇది ఒక మినీ వరల్డ్. ప్రాచ్య పాశ్చాత్యాల కలయిక. పోర్చుగీసు పాలకులు నిర్మించిన కట్టడాలు ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. చర్చ్‌ల నిర్మాణంలో వైవిధ్యత ఆకట్టుకుంటుంది. ఇక్కడ కొన్ని హిందూ ఆలయాలు కూడా పాశ్చాత్యశైలిలో ఉంటాయి. హిందూ– క్రిస్టియన్ ఐకమత్యాన్ని చాటే శిల్పాన్ని తప్పకుండా చూడాలి. లీనింగ్ టవర్ ఆఫ్ పిసాను పోలిన నిర్మాణం ఉంది. అది మంగేషి ఆలయం. 6వ రోజుయశ్వంత్పూర్ స్టేషన్‌కు ట్రైన్ చేరుతుంది. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నిర్వహకులు పర్యాటకులకు వీడ్కోలు పలుకుతారు.ప్యాకేజ్ ఇలా...ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా 5 రాత్రులు, 6 రోజుల ప్యాకేజ్‌లో డీలక్స్ క్యాబిన్ ట్విన్ షేరింగ్‌లో ఒకరికి 4,20,680 రూపాయలు. సింగిల్ సప్లిమెంట్ కేటగిరీ 3,15,950 రూపాయలు.రెండు పడకల క్యాబిన్‌కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. టూర్లో అన్ని భోజనాలు, టీ కాఫీ, నీటి బాటిల్, కూల్ డ్రింకులతోపాటు వైన్, బీర్ వంటి ఇతర డ్రింకులురైలులో పారా మెడికల్ సర్వీస్, బట్లర్ సర్వీస్, స్టేషన్లలో పోర్టర్ సర్వీస్ గైడ్ సర్వీస్‌తోపాటు పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రన్స్ ఫీజ్, స్టిల్ కెమెరా ఫీజ్.డీలక్స్ క్యాబిన్ బుక్ చేసుకున్న పర్యాటకులకు రైలు దిగి రోడ్డు మార్గాన ప్రయాణానికి వోల్వో బస్, వోక్స్వ్యాగన్ వంటి వాహనాలుంటాయి.లాండ్రీ ఖర్చులు, ప్యాకేజ్‌లో లేని ఇతర బేవరేజ్‌లు, పర్యాటక ప్రదేశాల్లో వీడియో కెమెరా ఫీజ్, ఇంటి నుంచి టూర్ మొదలయ్యే ప్రదేశానికి చేరడానికి, పర్యటన పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి అయ్యే వాహన ఖర్చులు ఈ ప్యాకేజ్‌లో వర్తించవు. (చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?)

క్షమ... సఫల జీవితానికి చుక్కాని
క్షమాగుణానికి సుఖ శాంతులను చేకూర్చే మహత్తరమైన గుణం ఇమిడి ఉంది. అది తెలుసుకుంటే జీవితమే మారిపోయి ఆనందంగా వుండే అవకాశం ఉంటుంది. క్షమ సఫల జీవితానికి చుక్కాని. క్షమ ఒక ఆయుధం. దాన్ని ధరించితే దుర్జనుడేమీ చేయలేడు. ఈ క్షమాగుణం అనేది ఒక అద్భుతమైనది. ఈ గుణాన్ని ప్రదర్శించటం అంటే కొందరు తమ వ్యక్తిత్వం దెబ్బతింటుందేమో అని అనుకుంటారు. కానీ అది వ్యక్తిత్వాన్ని పెంచేదే కాని తగ్గించేది మాత్రం కాదు. మనిషి కొన్ని బంధాలకు, అనుబంధాలకు లోబడి ఉండటం సహజం. అందులో తన కుటుంబీకులే గాకుండా బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కూడా వుంటారు. అయితే ఈ అనుబంధాలు ఎల్లవేళలా ఒకేలా ఉండవు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక చిన్న తేడా రావొచ్చు. దాంతో అప్పటినుంచి మన మనసుకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు. ఇప్పడు ఆ సంబంధాలు చెడిపోయినా, ఒకప్పుడు అవి ఆనందాన్ని, ప్రేమను, తృప్తిని ఇచ్చినవే. అసలు ఈ సంబంధాలు ఎలా ఏర్పడినాయని ఆలోచిస్తే, కొన్ని మేధోపరమైనవి, కొన్ని ఆర్ధికపరమైనవి కాగా, కొన్ని వారి ఆలోచనలు, భావాలు కలిస్తే వచ్చినవి అయి ఉంటాయి. ఇష్టాయిష్టాలు ఒకటి కావటంవల్ల కూడా కొన్ని బంధాలు దీర్ఘ కాలం నిలిచే వీలుంది. భౌతిక రూపానికి కూడా కొందరు ఇష్టపడతారు. అలా దగ్గరవుతారు. ఎంతో గొప్పగా సాగుతాయి ఈ సంబంధాలు. కానీ ఎక్కడో చిన్న తేడా వస్తుంది. వచ్చిన చిక్కల్లా అక్కడే. కొందరు వెంటనే సరిదిద్దుకోగలుగుతారు. మరికొందరికి అది కుదరక పోవచ్చు. ఆ చిన్న తేడా వలన గతంలో ఉన్న అనుబంధంలో తేడా వస్తుంది. అది ఒకోసారి పలకరింపులు కూడా లేని స్థితికి తీసుకువెళ్లి, బంధమే చెడిపోయే స్థితికి పడిపోవచ్చు లేదా అసలు బంధమే తెగిపోయి, ఎడముఖం పెడముఖంగా మారిపోవచ్చు. కానీ తర్వాతి కాలంలో ఎప్పుడో మనకు అనిపించవొచ్చు, అయ్యో ఇదేమిటీ ఇలా చేసుకున్నాము అని, అటువంటి పరిస్థితి రాకుండా ఉంటే బాగుండేది అని. ఇలాంటి భావన తర్వాతి కాలంలో కలుగవొచ్చు. కొన్ని సందర్భాలలో సంబంధాలను మెరుగుపరచుకోవాలన్నా కుదరని మానసిక స్థితి వెంటాడుతుంది. సంబంధాలు ఇలా చెడిపోవడానికి కారణం అవతలి వారేనని అర్ధం అయినా, సంబంధాలు తిరిగి కొనసాగాలని అనుకుంటే క్షమాగుణం కలిగి ఉండాలి. ప్రతీకారేచ్ఛ లేకపోవడమే సహనం. ఓరిమిని మించిన సద్గుణం మరొకటి లేదు. ప్రతి ఇద్దరి మధ్య ఎన్నో మంచి చెడులు వారికి మాత్రమే తెలిసినవి ఉండొచ్చు. అవతలివారు చాలాసార్లు మనకు ఎన్నో మంచి చేసిన సందర్భాలు ఉండి ఉండొచ్చు. ఆ మంచిని మర్చిపోయి, మధ్యలో చేసిన తప్పును పట్టుకుని సంబంధాలను చెడగొట్టుకోవడం మంచిదికాదు.అది సరి అయిన పద్ధతి కాదు. తప్పొప్పులనేవి జరుగుతూనే ఉంటాయి. అది సహజం. ఎవరైనా చేయొచ్చు. ఎవరి వలన తప్పు జరిగినా రెండవవారు పెద్దమనసుతో క్షమించగలిన గుణం కలిగి ఉండాలి. క్షమించటం అనేది విజయమే కానీ ఓటమి కాదు. క్షమించటంలో చాలా లాభాలున్నాయి. మొదటిది... పాడైపోయిన సంబంధాలను పునరుద్ధరించుకోవడం. రెండవ లాభం మనలోని కోపం, కసి మాయం కావడం. దీనివల్ల మనలో ఉన్న మానసిక ఒత్తిడి దూరమై మనసులోని బరువు ఒక్కసారిగా దిగిపోయినట్లవుతుంది. ఇది ఇక కొత్త అనుభూతిని కలుగ చేస్తుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అర్ధం లేని ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టాలి. మనం గతంలో అనుకున్న విషయం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అదేనండీ... అసలు ఆ బంధం తెగకుండావుంటే బాగుండేదని అనుకున్న విషయం. ఆ ఆలోచన రాగానే, తిరిగి మనలను గతంలోకి తీసుకువెళుతుంది. కొందరు ఇదంతా కర్మ ఫలం అంటారు. అయితే ఇక్కడ ఆ కోణంలోకూడా ఆలోచిస్తే, ఇతరుల వలన మనం పడిన కష్టాల ఆలోచన వదిలి, మనం ఇతరులకు చేసిన, కలిగించిన ఇబ్బందుల ఆలోచన మొదలవుతుంది. ఇక క్షమించడం మనందరం నేర్చుకుందాం. హాయిగా జీవిద్దాం. – డా. పులివర్తి కృష్ణమూర్తి

అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?
అవతలి వాళ్లు మన నుంచి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే..వాళ్లు మనల్ని దూరం చేసుకున్నామనే ఫీల్ కలిగేలా మన ప్రవర్తన ఉండాలి. అంతేతప్ప దిగజారి దారుణాలకు ఒడిగడితే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాంటి పనిచేసే కటకటాల పాలయ్యాడు. అంతేగాదు తన గర్ల్‌ఫ్రెండ్‌కి మరింత అసహ్యం కలిగేలా చేసుకున్నాడు.ఈ ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. 57 ఏళ్ల కోళ్ల పెంపకందారుడు ఎల్వీ 48 ఏళ్ల టాంగ్ అనే మహిళతో రిలేషన్షిప్లో ఉన్నాడు. వాళ్ల బంధం 15 ఏళ్లు కొనసాగింది. అయితే ఎల్వీ ప్రవర్తన సరిగా లేకపోవడం, కుటుంబ తోడ్పాటుకు ఎటువంటి సహకారం లేకపోవడంతో విసిపోయిన టాంగ్ అతడితో బంధానికి స్వస్తి చెప్పింది. అప్పటి నుంచి ఆమె వేరుగా జీవిస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని ఎల్వీ, టాంగ్ని పదే పదే బెదిరింపులకు గురి చేయడం ప్రారంభించాడు. అక్కడితో ఆగక ఇక ఆమెను ఎలాగైనా.. తన వద్దకు రప్పించుకుని, కలిసే జీవించేలా చేద్దామనే దురుద్దేశంతో దురాగతానికి తెరతీశాడు. ఆమె తండ్రి సమాధి వద్ద ఉండే చితాభస్మాన్ని దొంగలించి ఆమె మనోవ్యధను కలిగిస్తే..కచ్చితంగా తన వద్దకు తిరిగి వచ్చేస్తుందని భావించాడు. కానీ అతడు ఒకటి తలిస్తే..విధి మరొకటి తలిచింది. అయితే ఇదంతా టాంగ్‌కు తెలియదు. అతడు తన తండ్రి చితాభస్మం నా దగ్గర ఉందని చెప్పినా..టాంగ్ అవన్నీ బెదిరింపులే అనుకుని కొట్టిపారేసింది. నమ్మను కూడా నమ్మలేదు. అయితే ఎలా దొంగలించానో..ఫోటోలతో సహా వివరంగా పంపించాడు. అప్పుడే ఆమె తన తండ్రి స్మశాన వాటికను సందర్శించి అసలు విషయం తెలుసుకుంది. ఇక టాంగ్ అతడిని క్షమించకూడదన్న పట్టరాని కోపంతో..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వాళ్లువెంటనే రంగంలోకి దిగి విచారించగా..అతడే టాంగ్ తండ్రి చితాభస్మాన్ని అపహరించాడని తేల్చారు. అయితే అప్పటికే ఎల్వీ మనీలాండరింగ్‌కి సంబంధించిన కేసులో జైల్లో ఉన్నాడు. ఇక ఈ ఘనకార్యంతో ఎల్వీపై మరిన్ని అబియోగాలు మోపి అరెస్టు చేశారు. అలాగే అతడి నుంచి ఆమె తండ్రి చితాభస్మాన్ని కూడా స్వాధీన పర్చుకుని టాంగ్కి అప్పగించారు. ప్రేమతో మన నుంచి దూరమైన వాళ్ల మనుసుని గెలుచుకోవాలే గానీ ఇలాంటి పనులతో బలవంతంగా రప్పించుకుంటే..విధి సైతం సహకరించదు అంటే ఇదే కదూ..!.(చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?)

రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
ఎవరైనా సరే తమ ఇంటి లోపలికి అడుగు పెడితే అలంకారానికి ముగ్ధులైపోవాలని కోరుకుంటారు. ఇంటి గుమ్మం ఆహ్వానం పలికేలా ఎంత అందంగా అలంకరించుకోవచ్చో చూద్దాం..భారతీయ హస్త కళలు లేదా ఎంబ్రాయిడరీ చేసిన క్లాత్స్తో ఉన్న వాల్ హ్యాంగింగ్స్ గుమ్మం ముందు వేలాడదీస్తే తక్షణమే ప్రవేశ ద్వారం అలంకరణ కళాత్మకంగా మారిపోతుంది. అంతేకాదు, మనదైన సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతుంది. గణేశుడు లేదా బుద్ధుని విగ్రహాలు గుమ్మం దగ్గర ఉంచడంతో ప్రవేశ ద్వారానికి ఆధ్యాత్మికత అలంకారంగా మారిపోతుంది. అంతేకాదు, ఈ విగ్రహాలు ప్రశాంతతను కలిగిస్తాయి.మొక్కలు లేదా చిన్న నీటి సౌకర్యంతో మీ ప్రవేశ ద్వారంలోకి ప్రకృతిని తీసుకువచ్చి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. తక్కువ కాంతిపడినా ఏపుగా పెరిగే ఇండోర్ మొక్కలను ఇందుకు ఎంచుకోవాలి.చిన్నా పెద్ద గంటలున్న హ్యాంగింగ్ను వేలాడదీయడం వల్ల తలుపు తెరిచినప్పుడల్లా గంటలు శ్రావ్యంగా మోగుతూ, మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. గంటలు ప్రతికూల శక్తిని దూరం చేసి ఇంటికి సానుకూలతను తీసుకువస్తాయని మనలో చాలామందికి నమ్మకం.బంతిపూలు లేదా మల్లెపూలు వంటి తాజా పువ్వులు మీ ప్రవేశ ద్వారానికి సువాసనను, అందాన్ని ఇనుమడింపజేస్తాయి. వాటిని కుండీలో అలంకరించినా, దండగా అల్లి ద్వారానికి వేలాడదీసినా చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటాయి.డిజైన్లలో ఉన్న కుండలు, టెర్రకోట శిల్పాలు.. వంటి సాంçస్కృతిక కళాఖండాలతో ప్రవేశ ద్వారానికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకురావచ్చు. (చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?)
ఫొటోలు


సన్‌రైజర్స్ vs గుజరాత్ మ్యాచ్‌లో సందడి చేసిన సినీనటి సౌమ్యజాను (ఫోటోలు)


పసలేదు బ్రో.. సన్‌రైజర్స్ ఆట తీరుపై అభిమానుల నిరాశ (ఫొటోలు)


సింపుల్ లుక్ మెరిసిపోతున్న 'యానిమల్' బ్యూటీ త్రిప్తి డిమ్రి (ఫోటోలు)


అనంత్ అంబానీ ద్వారక పాదయాత్ర పూర్తి.. (ఫోటోలు)


'రామ్ గోపాల్ వర్మ'.. బర్త్‌డే స్పెషల్ ఫోటోలు చూశారా..?


ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)


కన్నుల పండువగా శోభాయాత్ర భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)


శ్రీరామనవమి స్పెషల్ లుక్.. అందంగా రెడీ అయిన అనన్య నాగళ్ల (ఫోటోలు)


నా రామునితో నేను అంటోన్న అనసూయ.. (ఫోటోలు)


పండగరోజు అయోధ్య రాములవారిని దర్శించుకున్న లాస్య (ఫోటోలు)
అంతర్జాతీయం

యుద్ధం ఆగేనా? సుంకాలు మీకు ఓకేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) వివిధ దేశాలపై సుంకాలను విధించిన తరుణంలో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 7న జరగనున్న ఈ భేటీలో ఇరువురు నేతలు గాజా స్వాధీనం కోసం తుది యుద్ధ ప్రణాళికను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ త్వరలోనే గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోబోతోందని, ఇందుకు ట్రంప్ మద్దతుగా నిలుస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే అమెరికా సర్కారు కొత్తగా విధించిన సుంకాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ చర్చించనున్నారని సమాచారం.ట్రంప్ రెండవసారి అధ్యక్షుడైన తర్వాత వైట్ హౌస్‌లో నెతన్యాహు(Netanyahu)తో ఇప్పుడు రెండోసారి సమావేశమవుతున్నారు. ఈ సమావేశాన్ని వైట్ హౌస్ తో పాటు నెతన్యాహు కార్యాలయం ధృవీకరించాయి. హమాస్ తీవ్రవాదులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ గతకొంతకాలంగా గాజా స్ట్రిప్‌లోని నూతన భద్రతా కారిడార్‌లో సైన్యాన్ని మోహరిస్తున్న తరుణంలో ఇద్దరు నేతల మధ్య సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.గత నెలలో ఇజ్రాయెల్(Israel) కాల్పుల విరమణను ఉల్లంఘించి, అకస్మాత్తుగా గాజాపై బాంబు దాడి చేసింది. ఈ చర్యకు వైట్ హౌస్ మద్దతు పలికింది. కాగా బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశంలో సుంకాల సమస్య, ఇజ్రాయెల్-టర్కీ సంబంధాలు, ఇరాన్ నుండి పొంచివున్న ముప్పు తదితర అంశాలపై చర్చించనున్నట్లు నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బగత వారం గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణ భయంతో శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 16 మందికి పైగా పాలస్తీనా వాసులు చనిపోవడం గమనార్హం. ఈ తరుణంలో అమెరికా-ఇజ్రాయిల్ దేశాధినేతలు భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.ఇజ్రాయిల్ కు టారిఫ్ ఉపశమనం..అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు సంబంధించి ఇటీవల ప్రపంచ దేశాలపై సుంకాల విధించి షాకిచ్చిన ట్రంప్.. ఇజ్రాయిల్ పై 17 శాతం సంకాన్ని విధించారు. ట్రంప్ పలు దేశాలకు విధించిన సుంకాల పరంగా చూస్తే ఇజ్రాయిల్ కు కాస్త ఊరటనిచ్చినట్లే కనబడింది. భారత్ పై 26 శాతం సుంకాన్ని విధించిన ట్రంప్.. చాలా దేశాలపై 20 శాతం 49 శాతం వరకూ కూడా సుంకాలు విధించారు. ఇక్కడ ఇజ్రాయిల్ కు మాత్రం 17 శాతాన్ని సుంకాన్ని మాత్రమే విధించడంతో ఆ దేశంపై కాస్త ప్రేమ చూపించినట్లే అవగతమవుతుంది. సుంకాలకు సంబంధించి కూడా ఇజ్రాయిల్ తో డొనాల్డ్ ట్రంప్ చర్చించే అవకాశం ఉంది. ఒకవేశ ఇజ్రాయిల్ ఏమైనా గట్టిగా పట్టుబడితే దానిని కాస్త కుదించే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: West Bengal: నవమి వేడుకల్లో కత్తులు తిప్పిన బీజేపీ నేతలు

ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు
వాషింగ్టన్: అమెరికాలోని సూపర్ మార్కెట్లన్నీ వినియోగదారుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన జనమంతా తమకు అందిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసి, తమ ట్రాలీలలో నింపేసుకుని, బయటకు వస్తూ కనిపిస్తున్నారు. దీనిని చూసినవారికి త్వరలో లాక్డౌన్(Lockdown) వస్తుందనే విధంగా అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ‘ఇప్పుడే షాపింగ్ చేయండి.. లేదంటే పశ్చాత్తాప పడతారు’ అనే ట్రెండ్ నడుస్తోంది.అమెరికాలోని వినియోగదారులు షాపింగ్ మాల్స్‌కు పరుగులు తీయడం వెనుక ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ పాలసీ(Donald Trump's new tariff policy). ఏప్రిల్ 2న డోనాల్డ్ ట్రంప్ భారత్, చైనాతో సహా పలు దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలను విధించారు. దీనిపై అమెరికన్లు కలత చెందుతున్నారు. రాబోయే రోజుల్లో పలు వస్తువులు చాలా ఖరీదైనవిగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతోనే వారంతా ఉప్పు మొదలుకొని టీవీలు, ఫ్రిజ్‌లు.. ఇలా అన్నింటికీ కొనుగోలు చేస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ప్రభుత్వ సుంకాల విధానం దిగుమతులపై(imports) ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. ఇది కంపెనీల ఖర్చును పెంచుతుంది. ఫలితంగా ఆ భారం కస్టమర్‌పై పడుతుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఈ సుంకాలు మేలు చేస్తాయని చెబుతున్నారు. అమెరికన్లు ప్రస్తుతం చేస్తున్న షాపింగ్ తీరు చూస్తుంటే.. వారెవరికీ ట్రంప్ హామీలపై పెద్దగా నమ్మకం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మైక్రోవేవ్‌లు అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, విడిభాగాలు చైనా తదితర దేశాల నుండి దిగుమతి అవుతాయి. సుంకాల పెరుగుదల కారణంగా భవిష్యత్తులో అవి మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. సుంకాలు విధించాక ధరలలో 15-20శాతం మేరకు పెరుగుదల తప్పకుండా ఉంటుందని డీలర్లు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే అమెరికన్లు వివిధ రకాల షోరూంలకు క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున జీన్స్, స్పోర్ట్స్ వేర్, వర్క్ వేర్, క్యాజువల్ షూలను కూడా ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కాఫీ, స్నాక్స్, సాస్‌లు, అంతర్జాతీయ కిరాణా వస్తువులు కూడా జోరుగా విక్రయమవుతున్నాయి. బ్లెండర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, మసాజ్ కుర్చీలు, ట్రెడ్మిల్స్ కూడా విరివిగా అమ్ముడవుతున్నాయి. ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్

ఇజ్రాయెల్ ఓవరాక్షన్.. బ్రిటన్ ఎంపీలతో అనుచిత ప్రవర్తన!
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ ఎంపీలను అక్కడి అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. దీంతో, ఈ ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ మండిపడ్డారు.వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో అధికార లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్, అబ్తిసామ్ మొహమ్మద్ ఇద్దరూ శనివారం ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. లుటాన్ నుంచి ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. అనంతరం కొంత సమయం తర్వాత వారిద్దరినీ విడిచిపెట్టారు. తమ భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమపై వ్యతిరేకతను పెంచేందుకు ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే వారి రాకను అడ్డుకున్నట్లు తెలిపారు. సమాచారం లేకుండా ఇక్కడ వచ్చారు? అని ప్రశ్నించారు అధికారులు. దీంతో, ఇజ్రాయెల్ టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.ఈ నేపథ్యంలో డేవిడ్ లామీ స్పందిస్తూ..‘ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన యూకే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోని ఇద్దరు ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారి చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మా ఎంపీలతో వారు ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు స్పష్టం చేశాను. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి అంశాలకు సంబంధించిన చర్చలపైనే మా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది’ అని తెలిపారు.ఇక, యువాన్ యాంగ్ బిట్రన్‌లోని ఎర్లీ, వుడ్డీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అబ్తిసామ్ మొహమ్మద్ (Abtisam Mohamed) షెఫీల్డ్ సెంట్రల్‌కు ఎంపీగా ఉన్నారు. వీరిద్దరి నిర్భందానికి సంబంధించిన కథనాలు పలు మీడియా చానల్స్‌లో ప్రసారం అయ్యాయి. Israel detained British MPs Yuan Yang and Abtisam Mohamed, denying them entry over suspicions they aimed to document Israeli security forces and spread anti-Israel narratives. UK Foreign Secretary Lammy condemned the move as “unacceptable” and “deeply concerning.” pic.twitter.com/jUcApToxis— Nassim Chalhoub (@WarRoomIntel1) April 6, 2025

అమెరికాలో ట్విస్ట్.. ట్రంప్, మస్క్‌కు ఝలక్!
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ పరిపాలన, వివాదాస్పద విధానాలపై అమెరికా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు వీధుల్లోకి వచ్చి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. హ్యాండ్స్ ఆఫ్('Hands Off!') పేరుతో నిరసనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు తెలిపారు. హ్యాండ్స్ ఆఫ్ అంటూ 50 రాష్ట్రాలలో 1,200కిపైగా ప్రదేశాల్లో నిరసనలను నిర్వహించారు. ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, LGBTQ+ న్యాయవాదులు, ఎన్నికల కార్యకర్తలు సహా 150కి పైగా సమూహాలు ఈ ర్యాలీలకు మద్దతు ఇచ్చాయి.HAPPENING NOW: A MASSIVE protest is taking place in downtown Chicago for the "Hands Off!" movement against Elon Musk and Donald Trump pic.twitter.com/NVEiTFi8Iy— Marco Foster (@MarcoFoster_) April 5, 2025 ఈ సందర్భంగా ట్రంప్ పరిపాలన విధానాలపై వీరు నిరసనలు తెలిపారు. ముఖ్యంగా సమాఖ్యల తొలగింపులు, సామూహిక బహిష్కరణలు, ఇతర వివాదాస్పద చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచానికే సవాల్ చేస్తున్నారని అన్నారు. వలసదారుల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థల తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కోతలు, వలసదారుల చికిత్స, లింగమార్పిడి హక్కులపై ఆంక్షలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక, 2017 తర్వాత అమెరికా ఇంత మంది బయటకు వచ్చి నిరసనలు ఇలా నిరసనలు తెలపడం ఇదే మొదటిసారి. కాగా, వీరి నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.A surprising 300 people showed up at the state Capitol in downtown Jackson, Mississippi as part of the nationwide HANDS OFF! protests of @POTUS, @elonmusk and the work of @DOGE. Rally organizes expected only 30 people to show up. #DOGE #handsoffprotests pic.twitter.com/d9dSIkXkD2— Ross Adams (@radamsWAPT) April 5, 2025BREAKING: Thousands have flooded the streets of Boston for the massive anti-Trump “Hands Off!” rally—one of over 1,200 protests erupting across all 50 states.From coast to coast, Americans are sending a message: Hands off our rights. Hands off our democracy. Hands off our… pic.twitter.com/ZGQWF8fRy3— Brian Allen (@allenanalysis) April 5, 2025Absolutely incredible!Protesters are lining both sides of the street for blocks in the tiny little town of Geneva, Illinois!It's estimated that around 5000 people showed up for the Hands Off! protest.Let's go!!!!! pic.twitter.com/lStDLrtQpp— Art Candee 🍿🥤 (@ArtCandee) April 5, 2025
జాతీయం

బాల రాముడికి సూర్యతిలకం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భవ్య మందిరంలో కొలువుదీరిన బాల రాముడికి ఆదివారం సూర్య భగవానుడు తిలకం అద్దడం చూసి భక్తులు పులకించిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన తిలకం 4 నిమిషాలపాటు కొనసాగడం అమితంగా ఆకట్టుకుంది. కొందరు గర్భాలయంలో ఆనందంతో నృత్యాలు చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సూర్యతిలకం అద్దే కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అలాగే ప్రభు శ్రీరామ్‌లల్లాకు అర్చకులు ప్రత్యేకంగా మహా మస్తకాభిషేకం నిర్వహించినట్లు తెలియజేసింది. 56 పదార్థాలతో కూడిన భోగ్‌ను శ్రీరాముడికి నివేదించారు. ప్రత్యేక హారతి ఇచ్చారు. గర్భాలయంలో సూర్యతిలకం, మహా మస్తకాభిషేకాన్ని నేరుగా చూడలేని భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తన్మయులయ్యారు. శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 10 లక్షల మందికిపైగా తరలివచ్చినట్లు అంచనా.

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబి ఎన్నిక
మదురై: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన సీనియర్ నేత మరియమ్ అలెగ్జాండర్(ఎంఏ) బేబి ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో ఆదివారం జరిగిన సీపీఎం 24వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఈ ఎన్నిక జరిగింది. కొందరు నేతలు ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ ధవాలేను ఈ పదవికి బలపరిచారు. మెజారిటీ సభ్యుల మద్దతుతో బేబి ఎన్నికైనట్లు ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన 18 మందితో కూడిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి పొలిట్ బ్యూరో ఎంఏ బేబిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. అదేవిధంగా, 85 మందితో కూడిన సెంట్రల్ కమిటీలోకి 20 శాతం మంది మహిళలను తీసుకున్నట్లు ఆ పార్టీ ‘ఎక్స్’లో తెలిపింది. 2023 సెప్టెంబర్‌లో అనారోగ్య కారణాలతో సీతారాం ఏచూరి కన్నుమూయడంతో ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీ అయింది. అప్పటి నుంచి ప్రకాశ్ కారత్ తాత్కాలిక సమన్వయకర్తగా ఆ బాధ్య తలను నిర్వర్తిస్తున్నారు. కాగా, పొలిట్ బ్యూరో నుంచి సీనియర్ నేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్ వైదొలిగారు. వీరిద్దరితోపాటు మణిక్ సర్కార్‌ను పార్టీ కేంద్ర కమిటీకి ప్రత్యేక ఆహ్వాని తులుగా ప్రకటించినట్లు సమాచారం.విద్యార్థి దశ నుంచే..కేరళలోని ప్రక్కులంలో 1954లో జన్మించిన ఎంఏ బేబి విద్యార్థి దశలోనే సీపీఎం పట్ల ఆ కర్షితుడయ్యారు. కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యుడయ్యారు. కొల్లమ్‌లోని ఎస్ఎన్ కాలేజీలో బీఏలో చేరినా చదువు కొనసాగించలేకపో యారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్‌ఐల్లో పలు పదవులు చేపట్టారు. 1986–98 మధ్య కాలంలో రాజ్యసభ ఎంపీగా, 2006–16 మధ్య ఎమ్మెల్యేగా కొనసా గారు. కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

దేశానికే తలమానికం: ప్రధాని మోదీ
తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదు. 2014 కంటే ముందు పదేళ్లతో పోలిస్తే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చాం. తమిళనాడుకు రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెంచాం. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. అయినా నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సాక్షి, చెన్నై: తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పంబన్ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రికార్డుకెక్కిన ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. ఈ వంతెన దేశానికే తలమానికం అని వ్యాఖ్యానించారు. అలాగే రామేశ్వరం–తాంబరం (చెన్నై) కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. వర్టికల్ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగించే కోస్ట్‌గార్డ్ షిప్‌ను సైతం ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ కీలకమైన కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ గైర్హాజరయ్యారు. ఆదివారం ఉదకమండలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడంతో తాను రాలేకపోతున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చారు. నియోజకవర్గాల పునరి్వభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న స్టాలిన్ ప్రధాని మోదీ కార్యక్రమానికి వ్యూహాత్మకంగానే దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డీలిమిటేషన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఆయన ఇప్పటికే ప్రధానమంత్రిని కోరారు. తమిళంలో సంతకాలు చేయలేరా? తమిళనాడులో రూ.8,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాముడు అందించిన సుపరిపాలన మన దేశ నిర్మాణానికి పునాది అని చెప్పారు. రాముడితో తమిళనాడుకు ఎంతో అనుబంధం ఉందంటూ సంగమ శకం నాటి సాహిత్యాన్ని ప్రస్తావించారు. శ్రీలంక నుంచి గత పదేళ్లలో 3,700 మంది తమిళ జాలర్లను వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు. వీరిలో 600 మందిని గత ఏడాది కాలంలోనే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తమిళ మాధ్యమంలో వైద్య విద్య అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల పేదలకు లబ్ధి కలుగుతుందన్నారు. తమిళనాడుకు ఇటీవల 11 నూతన మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు వివరించారు. తమిళ భాషను, సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రపంచంలో అన్ని మూలలకూ తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తమిళనాడు నాయకుల నుంచి తనకు లేఖలు వస్తుంటాయని, కానీ, వాటిపై తమిళ భాషలో సంతకాలు ఉండడం లేదని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. కనీసం తమిళ భాషలో సంతకాలు చేయాలని కోరారు. నిధుల కేటాయింపులో వివక్ష లేదు తమిళనాడు మత్స్యకారులు కష్టపడి పనిచేస్తారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘పీఎం మత్స్య సంపద యోజన’ కింద తమిళనాడుకు గత ఐదేళ్లలో భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సీవీడ్ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఉద్ఘాటించారు. తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదని తేల్చిచెప్పారు. 2014 కంటే ముందు పదేళ్లలో కేటాయించిన దాని కంటే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఈ నిధులు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని స్పష్టంచేశారు. తమిళనాడుకు రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెంచామన్నారు. రాష్ట్రంలో 2014 కంటే ముందు రైలు ప్రాజెక్టులకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు ఏటా రూ.6,000 కోట్లు ఇస్తున్నామని తెలియజేశారు. 2014 తర్వాత రాష్ట్రంలో కేంద్ర నిధులతో 4,000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. రామనాథ స్వామి ఆలయంలో పూజలు ప్రధాని మోదీ రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ వ్రస్తాలు ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు శ్రీలంక నుంచి రామేశ్వరం చేరుకున్న ప్రధానమంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఆయనకు అభివాదం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. నూతన పంబన్ వంతెనను ప్రారంభించిన అనంతరం మోదీ రామనాథస్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ఇది దైవిక యాదృచ్ఛికం హిందూ మహాసముద్రంలోని ప్రాచీన రామసేతును దర్శించుకోవడం ఒక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘కొద్ది సేపటి క్రితమే శ్రీలంక నుంచి హెలికాప్టర్లో వస్తూ రామసేతును దర్శించుకున్నాను. ఇదొక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నా. అయోధ్యలో బాలరాముడికి ఆదిత్యుడు తిలకం దిద్దిన సమయంలోనే ఇక్కడ రామసేతు దర్శనం కావడం దైవిక యాదృచి్ఛకం. రెండింటినీ ఒకేసారి దర్శించుకోవడం గొప్ప విషయం. శ్రీరాముడు మనందరినీ ఐక్యంగా కలిపి ఉంచే ఒక బలమైన శక్తి. ఆయన ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలన్నదే నా ఆకాంక్ష’’ అని మోదీ అన్నారు.ఇంజనీరింగ్ అద్భుతం రామేశ్వరంలో పంబన్ వర్టికల్ సీ–లిఫ్ట్ బ్రిడ్జిని రూ.550 కోట్లతో నిర్మించారు. పొడవు 2.08 కిలోమీటర్లు. 99 స్పాన్లు ఉన్నాయి. మధ్యలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వంతెన కిందినుంచి భారీ నౌకల రాకపోకలకు వీలుగా ఇది 22 మీటర్ల ఎత్తువరకు పైకి వెళ్లగలదు. నౌకలు వెళ్లిపోయిన తర్వాత యథాతథ స్థితికి చేరుకుంటుంది. ఎప్పటిలాగే రైళ్లు ప్రయాణం సాగించవచ్చు. ప్రధాన భూభాగంలోని మండపం రైల్వేస్టేషన్‌ను రామేశ్వరం దీవితో ఈ వంతెన అనుసంధానిస్తుంది. అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ బ్రిడ్జి ఒక ఉదాహరణ. దీర్ఘకాలం మన్నికగా ఉండేలా నిర్మాణంలో స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించారు. హై–గ్రేడ్ రక్షణ పెయింట్ వాడారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనపై రెండు రైల్వే ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. భక్తులు రామేశ్వరం ఆలయానికి చేరుకోవడం ఇక మరింత సులభతరం కానుంది. ప్రధాన భూభాగం–రామేశ్వరం దీవి మధ్య 1914లో బ్రిటిష్ పాలకుల హయాంలో రైల్వే వంతెన నిర్మించారు. శతాబ్దం పాటు సేవలందించిన ఈ వంతెన గడువు తీరిపోవడంతో అదేచోట కొత్త వంతెన నిర్మాణానికి 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా, ఆదివారం పంబన్ వంతెనను ప్రారంభించిన తర్వాత గంట సేపట్లో సాంకేతిక సమస్య నెలకొంది. కోస్ట్‌గార్డు నౌక కోసం వంతెనను 17 అడుగుల మేర పైకి ఎత్తారు. తిరిగి కిందకు దించే సమయంలో 10 అడుగుల వద్ద సాంకేతిక సమస్య ఏర్పడింది. రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు.

కొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.. స్టాలిన్‌కు మోదీ కౌంటర్
రామేశ్వరం: కొంతమందికి కారణం లేకుండానే ఎప్పుడూ ఏడ్చే అలవాటు ఉంటుందంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభ వేదికగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తోందని, గతంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని తెలిపారు.త్రిభాషా విధానంపై స్టాలిన్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్ ఇస్తూ.. తమిళ నాయకులు నాకు లేఖలు రాస్తుంటారు. ఒక్కరు కూడా మాృతభాష తమిళంలో సంతకం చేయరు. తమిళ భాషను గౌరవించండి.. తమిళంలో సంతకం చేయండి. చాలా రాష్ట్రాల్లో మాృతభాషలో వైద్య విద్యా బోధన జరుగుతోంది. తమిళనాడులోనూ తమిళంలో వైద్య విద్యను అందించాలి. గత దశాబ్దంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించాం. రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచాం’’ అని మోదీ చెప్పారు.‘‘తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. 2014 నుంచి అధికంగా తమిళనాడుకు ఇచ్చాం. 2014కు ముందు రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6,000 కోట్లకు పైగా ఉందన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌లో తమిళనాడు పాత్ర చాలా గొప్పదన్న మోదీ.. ఈ రాష్ట్రం ఎంత బలంగా ఉంటే మన దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు.
ఎన్ఆర్ఐ

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పొగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చివరకు ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి.. అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అభిషేక్ కొల్లి(Abhishek Kolli) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు. పదేళ్ల కిందట అభిషేక్ సోదరుడు అరవింద్‌తో కలిసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఏడాది కిందట వివాహం జరగ్గా భార్యతో పాటు అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తాళలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య.. చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, వలంటీర్లు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే చివరకు మరణాన్ని సోదరుడు అరవింద్ ఆదివారం ధృవీకరించారు. మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
క్రైమ్

నువ్వు అందంగా ఉన్నావు...
ఖమ్మంవైద్యవిభాగం: ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు.... తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు.. చదువుకున్న ఆఫీసర్లా ఉన్నావు.. బొద్దుగా కనిపిస్తున్నావు..’ అంటూ ఓ వివాహితతో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. చేయి విరిగిన ఆమె సర్జరీ కోసం రాగా.. వైద్యులు, సిబ్బంది ప్రవర్తనతో హహిళ భయబ్రాంతులకు గురికాగా.. ఘటనపై వివాహిత బంధువులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.వైరా నియోజకవర్గానికి చెందిన ఓ వివాహిత ఇంట్లో పనులు చేస్తుండగా కిందపడటంతో చేయికి తీవ్రంగా గాయమైంది. సమీపంలోని ఆర్ఎంపీని సంప్రదిస్తే చేయి విరిగిందని నిర్ధారించి ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సమీపాన శివ ఆర్థోపెడిక్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అక్కడ పరీక్షించాక సర్జరీ చేయాలని చెప్పడంతో గత గురువారం ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం సర్జరీ చేసేందుకు నిర్ణయించగా, ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లాక సదరు మహిళపై సిబ్బంది అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఆపై ఆపరేషన్ చేయడానికి వైద్యుడు కూడా అదే మాదిరి ప్రవర్తించాడు. కేస్‌షీట్‌లో వివరాలన్నీ ఉన్నా వయస్సు ఎంత అని అడిగి చెప్పగానే అంత వయస్సులా కనిపించడం లేదు... అందంగా ఉన్నావు... తెల్లగా, వయస్సు తక్కువగా కనిపిస్తున్నావు... అంటూ మాట్లాడడంతో ఆమె భయాందోళనకు గురైంది.ఆ తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చాక కుటుంబీకులకు చెప్పడంతో డాక్టర్, సిబ్బందిని నిలదీస్తే అలాంటిదేమీ బుకాయించారు. దీంతో కొద్దిరోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉన్నా ఇష్టపడని మహిళను డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్లాపోయారు. కాగా, ఘటనపై ఆస్పత్రి యాజమాన్యానికి వివాహిత కుటంబీకులు ఫిర్యాదు చేయగా, ఆమె ఆరోగ్యం చక్కబడ్డాక అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై విచక్షణా రహితంగా సిమెంట్ బ్రిక్‌తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లికి చెందిన మహ్మత్ బస్రత్(32) కోల్‌కత్తాకు చెందిన షబానా పర్వీన్(22)ను 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. బస్రత్ తల్లిదండ్రులతో పర్వీన్ తరచు గొడవ పడుతుండటంతో రెండు నెలల క్రితం వేరు కాపురం పెట్టాడు. కాగా పర్వీన్‌కు వాంతులవుతుండడంతో రాఘవేంద్ర కాలనీలోని సియాలైఫ్ హాస్పిటల్లో చేర్పించాడు. ఏప్రిల్1న రాత్రి 10 గంటలకు డిశ్చార్జి చేయగా బయటకు వచ్చి ఇద్దరు గొడవపడ్డాడు. కోపంతో బస్రత్ తన్నడంతో షబానా పర్వీన్ కిందపడి పోయింది. అక్కడ ఉన్న రెండు సిమెంట్ బ్రిక్లతో దాదాపు 15 సార్లు తల, శరీరంపై మోదాడు. చనిపోయిందనుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడి చికిత్సపొందుతోంది. వైద్యులు నిర్వహించిన పరీక్షలలో మూడు నెలల గర్భిణి అని తేలిందని, షబానా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/St6JwDt1Ti— ChotaNews App (@ChotaNewsApp) April 7, 2025

ప్రాణాలు తీస్తున్న సరదా
మెదక్‌జోన్: ఈత సరదా యువకుల ప్రాణాలు తీస్తోంది. జిల్లాలో కేవలం ఆరునెలల వ్యవధిలో పాతికేళ్లలోపు యువకులు నలుగురు మృత్యువాత పడ్డారు. గతంలో మంజీరా నదిలో ఇద్దరు.. తాజాగా శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడిలో మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నీటి వనరుల వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అందరూ పాతికేళ్లలోపు వారే.. అయితే బొల్లారం మత్తడి మెదక్ మండలంలోని పలు గ్రామాలకు సమీపంగా ఉంటుంది. ఇందులోకి ఘనపూర్ ఆనకట్ట నుంచి నీరు వచ్చి చేరటంతో మండు వేసవిలో నిండుకుండలా మారుతుంది. దీంతో యువత అందులోకి ఈత కోసం వెళ్తుంటారు. అయితే ఇప్పటివరకు ఈ మత్తడి నలుగురు యువకులను బలి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో జానకంపల్లికి చెందిన యువకుడు మిత్రులతో కలిసి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతిచెందాడు. అలాగే తిమ్మక్కపల్లికి చెందిన మరో యువకుడు మత్తడిలో మునిగి చనిపోయాడు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. అలాగే ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం సమీపంలో మంజీరా నది ఎప్పుడు నిండుకుండలా ఉంటుంది. భక్తులు ముందుగా మంజీరా పాయల్లో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే గత నెల 1వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ఏడుపాయలకు వచ్చి మూడు రోజుల పాటు అక్కడే గడిపారు. అందులో ఇద్దరు యువకులు పోతంశెట్‌పల్లి 2వ బ్రిడ్జి వద్ద నదిలో ఈతకు దిగి నీటమునిగి దుర్మరణం చెందారు. మంజీరాలో లోతు ఎక్కువగా ఉండటంతో పాటు రాళ్లు రప్పలతో నిండి ఉంది. ఈ ప్రదేశంలోనికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అక్కడ నిరంతరం పోలీస్ సిబ్బందిని ఉంచితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. పండుగ పూట విషాదం మెదక్ మండలం బాలనగర్‌కు చెందిన తుండు అనిల్ (17), తుండుం నవీన్ (25) శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడికి ఈతకు వెళ్తున్నా మని కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరారు. అయితే రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు మత్తడి వద్దకు వెళ్లి చూడగా గడ్డపై ఇద్దరి దుస్తులు, చెప్పులు కనిపించారు. దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా ఆదివారం మధ్యా హ్నం ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామానికి చెందిన తుండుం లలిత, పద్మయ్యకు కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా కూతురు పెళ్లిచేయగా.. అనిల్ పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్ద తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే చేతికందివచి్చన కొడుకు నీటి మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదే గ్రామానికి చెందిన తుడుం బాలయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. నీట మునిగి మృతిచెందిన నవీన్ (25) రెండో కుమారుడు. అతడికి మూడేళ్ల క్రితం పెళ్లి చేయగా రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య గర్భిణి. భర్త నీటి మునిగి చనిపోయాడని తెలియటంతో ఆమె రోదనలు మిన్నంటాయి.

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
చేవెళ్ల: వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే గోవిందగారి పురుషోత్తంరెడ్డికి రెండేళ్ల కిత్రం హైదరాబాద్‌లోని కాళీమందిర్‌కు చెందిన తరుణి అలియాస్ యమున(30)తో వివాహ జరిగింది. కొన్నేళ్ల పాటు వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అనుకోకుండా శనివారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె గదిలో గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంత పిలిచినా బయటకు రాకపోవటంతో కుటుంబసభ్యులు తలుపు తెరిచి చూడగా విగత జీవిగా కనిపించింది. దీనిపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యువతి అదృశ్యం నాగోలు: ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..బండ్లగూడ ఇందు అరణ్య అపార్ట్మెంట్లో నివాసముండే సంకేపల్లి నిహారిక(28) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఈ నెల5న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి రాత్రైనా రాలేదు. కుటుంబ సభ్యు లు ఫోన్ చేయగా స్విచ్ఛా ఫ్ వచి్చంది. స్నేహితులు, బంధువులతో ఆరా తీసి నా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియోలు


పసివాడి ప్రాణం తీసిన వీధి కుక్క


Bengaluru: ఫ్రెండ్ తోవెళ్తున్న యువతిపై వేధింపులు


స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్


వక్ఫ్ చట్టంపై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం


CPI Narayana: రాష్ట్ర ప్రజలకు మీ వల్ల ఏం ఉపయోగం అని చంద్రబాబును అడుగుతున్న


భద్రాద్రిలో వైభవంగా రాములోరి పట్టాభిషేకం


భయపడిన బాబు.. వైఎస్ జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు


పవన్ కళ్యాణ్ వల్ల అన్యాయమైపోయిన కుటుంబం


అక్రమ అరెస్టుకు సుప్రీం బ్రేక్


కన్ ఫ్యూజన్ లో ది రాజా సాబ్ ...!