
అధికారంలోకి వస్తే మద్దతు ధర: ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పంట ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తామని..
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పంట ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన రైతు సమస్యలపై మాట్లాడారు. వరికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2వేలు, జొన్న, మొక్కజొన్న క్వింటాలుకు రూ.2వేలు, కంది, పసుపుకు క్వింటాలుకు రూ. 8వేలు, మిర్చికి క్వింటాలుకు రూ.12వేలు అందేలా కచ్చితమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పత్తి మద్దతు ధర విషయమై.. తమ పార్టీ నిపుణుల విభాగం అధ్యయనం చేస్తోందని త్వరలోనే వాటి ధరలు ప్రకటిస్తామన్నారు. అలాగే, రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తామని తెలిపారు.