
సాక్షి, భూపాలపల్లి: ప్రమాదవశాత్తూ బొగ్గు టిప్పర్ బ్రిడ్జిపై నుంచి కింద పడడంతో క్లీనర్ మృతిచెందాడు. భూపాలపల్లి- కాళేశ‍్వరం ప్రధాన రహదారిలో బొగ్గులవాగుపై ఉన్న బ్రిడ్జిపై నుంచి టిప్పర్ బోల్తా కొట్టింది. దీంతో టిప్పర్ క్లీనర్ ధనం గోపీ(24) అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే టిప్పర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.