key documents
-
భూకంప శిథిలాల నుంచి కీలక పత్రాల చోరీ?
బ్యాంకాక్: థాయ్‌లాండ్ భూకంప సహాయక చర్యల్లో.. కొత్త కోణం వెలుగు చూసింది. రాజధాని బ్యాంకాక్(Bangkok Building Collapse)లోని 33 అంతస్థుల భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రమాద స్థలి నుంచి కొన్ని పత్రాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కొందరు ప్రయత్నించగా.. సహాయక బృందాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయగలిగారు. అయితే ఆ ఐదుగురు చైనాకు చెందిన వాళ్లు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చైనా(China)కు చెందిన రైల్వే నంబర్ 10 కంపెనీ 2018లో థాయ్‌లాండ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. హౌజింగ్ సొసైటీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఇతర బడా కాంట్రాక్టులను ఈ కంపెనీ స్థానిక కంపెనీలతో జాయింట్ వెంచర్‌గా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో థాయ్‌లాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం సుమారు 58 బిలియన్ డాలర్లతో మూడేళ్ల కిందట పనులు చేపట్టారు.తాజా భూకంపం(Earthquake) ధాటికి నిర్మాణంలో ఉన్న ఆ భవనం కుప్పకూలిపోగా.. శిథిలాల నుంచి ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇంతకంటే ఎక్కువ ఎత్తులో భవనాలకు ఏం కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజైనింగ్‌లో లోపాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాల నడుమే.. థాయ్‌లాండ్ ఉప ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ సైతం ప్రమాద స్థలిని సందర్శించి దర్యాప్తునకు ఆదేశించారు. ఈలోపు.. ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన పత్రాలను దొంగిలించేందుకు యత్నాలు జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. భవన శిథిలాల వద్దకు ఆదివారం ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా లోనికి ప్రవేశించారు. శిథిలాల నుంచి కొన్ని పత్రాలను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా రెస్క్యూ టీంలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పాయి. వారిని ప్రశ్నించగా.. చైనా దేశస్థులని తెలిసింది. అయితే.. అందులో ఒకరు తాను ప్రాజెక్ట్ మేనేజర్ అని, బీమా క్లెయిమ్ చేసుకోవడం కోసం సంబంధిత పత్రాలు తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఈ కంపెనీ ‘నాసిరక నిర్మాణాల’తో వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆయా ఘటనలతో ప్రమాదవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలను ఈ చైనా కంపెనీకి అప్పగించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక శుక్రవారం మధ్యాహ్నాం మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి.. పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ భారీగా భూమి కంపించింది. రాజధాని బ్యాంకాక్‌లో పలు భవనాలు కుప్పకూలిపోవడంతో.. ఇప్పటిదాకా 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. -
స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం(ACB Court)లో దర్యాప్తు సంస్థ తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కీలక ఆధారాలను సమర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని ఏఏజీ వెల్లడించారు. నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులను దిగమింగారు. ఏ రకంగా డొల్ల కంపెనీల నుంచి ఈ నిధులు నేరుగా టీడీపీ ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఏఏజీ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లను ACB కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించిన ఆడిటర్‌ను విచారణకు పిలిచామని, ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వస్తానన్నారని ఏఏజీ తెలిపారు. డొల్ల కంపెనీలను సృష్టించి హవాలా రూపంలో నిధులు దిగమింగిన వైనాన్ని ఏఏజీ పొన్నవోలు వివరించారు. చదవండి: పవన్ కల్యాణ్‌ను బీజేపీనే వద్దనుకుందా? -
బీఆర్ఎస్ నేతలే టార్గెట్! ముగిసిన ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో అలజడి సృష్టించిన ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగినట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రిజనార్ధన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారితో స్థిరాస్థి వ్యాపార సంబంధాలున్నాయన్న ఆరోపణలపై మరికొన్ని కంపెనీల్లోనూ ఈ సోదాలు జరిగా యి. పదుల సంఖ్యలో ఐటీ అధికారులు.. 60కిపైగా ప్రాంతాల్లో పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతలు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై ఆరా తీసిన అధికారులు, సదరు నాయకులకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత వివరాలు, ఆధారాలతో ఫతేమైదాన్‌లోని ఐటీ ఆఫీస్‌లో మంగళవారం హాజరుకావాలని సూచించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీలోని శేఖర్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసులు, జూబ్లీహిల్స్‌లోని మర్రి జనార్ధన్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసులో సోదాల సందర్భంగా వారి అనుచరుల ఆందోళనలు కొంత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు బ్యాంకు ఖాతాలతోపాటు బ్యాంకు లాకర్లను సైతం తెరిపించి సోదాలు చేపట్టారు. శుక్రవారం లైఫ్‌స్టైల్ సంస్థ డైరెక్టర్ ఇల్లు, కార్యాలయాల్లోనూ ఈ సోదాలు కొనసాగాయి. కాగా, ఐటీ సోదాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పు డు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని తెలిపారు. -
షెల్ కంపెనీలపై ఆరా?...
-
రెండో రోజూ ‘సుజనా’పై సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై సీబీఐ దాడులు రెండోరోజు ఆదివారం కూడా కొనసాగాయి. శనివారం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో 12 చోట్ల దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం రాత్రి సీబీఐ అధికారులు సీజ్ చేసిన నాగార్జున హిల్స్‌లోని సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్యాలయంతోపాటు, సుజనా నివాసంలో ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. ముందురోజు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల తాలూకు వివరాలపై కంపెనీలోని పలువురు డైరెక్టర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆదివారం తనిఖీల్లో బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు. బెంగళూరు, ఢిల్లీ నుంచి వచ్చిన దాదాపు 30 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్`గొన్నారు. షెల్ కంపెనీలపై ఆరా?... సుజనా గ్రూపునకు చెందిన షెల్ కంపెనీలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలిసింది. బెస్ట్ క్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) కంపెనీ, సుజనా గ్రూప్‌నకు చెందింది. దీన్ని సుజనా చౌదరి సీబీఐ మాజీ చీఫ్ విజయరామారావు కుమారుడితో కలసి ఏర్పాటు చేశారు. 2010 నుంచి 2013 మధ్య బ్యాంకుల కన్సార్టియం నుంచి దాదాపుగా రూ.315 కోట్ల మేర రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో ఆంధ్రాబ్యాంకు రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు రూ.120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు రూ.124 కోట్ల చొప్పున రుణాలు మంజూరు చేశాయి. గంగాస్టీల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజనీరింగ్ లిమిటెడ్, ఫ్యూచర్‌టెక్ ఇండస్ట్రీస్ కంపెనీల పేర ఈ రుణాలు తీసుకున్నట్లు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయితే, వాటి నుంచి వివిధ డొల్ల కంపెనీలకు రుణాలు మళ్లించినట్లు గుర్తించిన సీబీఐ వాటి చిరునామాలపై ఆరా తీసిందని తెలిసింది. వాటి యజమానులు, చిరునామాలు, ఆఫీసు కార్యాలయాలు ఎక్కడున్నాయి? అన్న సమాచారం కోసం ప్రయత్నించినట్లు సమాచారం. ఆంధ్రాబ్యాంకు తమకు రావాల్సిన రూ.71 కోట్ల కేసులో చేసిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా దాడులు జరిగాయి. ఇదే వ్యవహారంలో మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై ఏప్రిల్‌లో దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.315 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. -
మంత్రి పీఎస్ ఇంటిపై లోకాయుక్త దాడి
కీలక పత్రాలు స్వాధీనం శివమొగ్గ, న్యూస్‌లైన్ : నగరంలోని ఓ గ్రూప్ డీ (క్లర్కు క్యాడర్) ఉద్యోగి నివాసంపై బుధవారం లోకాయుక్త పోలీసులు దాడులు చేసి ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... నగరంలో హొనమనే లేఔట్లో నివాసముంటున్న హర్ష మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రూప్ డీ ఉద్యోగి. గత బీజేపీ సర్కార్‌లో ఎక్సైజ్ మంత్రి రేణుకచార్య వద్ద పీఎస్ (వ్యక్తిగత కార్యదర్శి)గా పనిచేసిన హర్ష, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న అభయచంద్రజైన్ వద్ద పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. ఉదయం లోకాయుక్త ఎస్పీ.లింగారెడ్డి నేతృత్వంలో శివమొగ్గ లోకాయుక్త డీవైఎస్పీ నాగరాజ్, సీఐ పురుషోత్తమ్ సిబ్బంది హర్ష ఇంటిలో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వరకు సోదాలు చేశారు. అయితే స్థిర, చరాస్తులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందించలేదు. దాడుల సమయంలో శివమొగ్గ నగరంలోని ఎల్బీఎస్, జీహెచ్.పటేల్ లేఔట్లో ఖాళీ స్థలాలు, హుణసేహళ్లి గ్రామంలో రెండన్నర ఎకరా భూమి, రూ.18 వేల నగదుతో పాటు సుమారు 340 గ్రాములు బంగారం, ఒకటిన్నర కిలో వెండి, వివిధ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలకు చెందిన పత్రాలు, రెండు ైబె క్లు, ఒక కారు, బ్యాంకు పాస్‌బుక్కులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.