Seed Bank
-
జన్యు నిధుల అనుసంధానం కీలకం!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025–26 ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండవ ‘నేషనల్ జీన్ బ్యాంక్’ ఏర్పాటును ప్రక టించారు. ఇది ఒక మిలియన్ జన్యు పదార్థాల శ్రేణులతో నిండి, భవిష్యత్తులో ఆహారం– పోషకాల భద్రత కోసం ఏర్పాటు చేయబోయే నిర్మాణంగా చెప్పుకొచ్చారు. జన్యు వైవిధ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికీ, వైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యం కోసం... పబ్లిక్, ప్రైవేట్ రంగాలూ, కమ్యూ నిటీలూ (వ్యక్తుల సమూహాలు, సంఘాలు, సంప్ర దాయ జాతులు) కలిసికట్టుగా ప్రయత్నిచవలసిన అవసరం ఉంది. అందువల్ల నిపుణులు ఈ నిర్ణ యాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. నూతనంగా ఏర్పడ నున్న రెండవ జీన్ బ్యాంకుతో కమ్యూనిటీ విత్తన బ్యాంకుల అనుసంధానం ద్వారా పారిశ్రామిక రంగంతో సహా సంబంధిత వ్యక్తులు, సంస్థలు (షేర్ హోల్డర్లు) అందరూ అంతర్జాతీయ ఒప్పందం (కన్వెన్షన్ ఆన్ బయోలా జికల్ డైవర్సిటీ–సీబీడీ 1993), జాతీయ జీవ వైవిధ్య చట్టం–2002 (ఎన్బీఏ–2002)లో పొందుపరిచిన మూడు సూత్రాలకు (పరిరక్షణ, స్థిరమైన వినియోగం, న్యాయమైన – సమానమైన లాభాల పంపిణీ) కట్టుబడి ఉండగలరన్న ఆశా భావం వ్యక్తం అవుతోది.జాతీయ జన్యు బ్యాంక్ అనేది భవిష్యత్ తరాలకు వివిధ పంటలు, అడవి జాతులు, అనేక రకాల చెట్ల జన్యువులను నిల్వచేసే సదుపాయం. కమ్యూనిటీ విత్తన బ్యాంకులు పంటల అభివృద్ధి, ఆహార భద్రత, స్థిరమైన సమాజ అభివృద్ధికి బిల్డింగ్ బ్లాక్‌లుగా ఉపయోగపడే స్థానిక ప్రత్యామ్నాయ జన్యు వనరులుగా గుర్తించబడ్డాయి. జన్యు వనరుల సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవి దశాబ్దాల నుండి అనధికార వ్యవ స్థలుగా కొనసాగుతూనే ప్రాంతీయ కమ్యూనిటీలకు సంప్రదాయ విత్తన కోశాగారాలుగా పని చేస్తున్నాయి. అందులో ఉన్న వైవిధ్యభరిత జన్యు పదార్థాలను ఒక వ్యవస్థలో ఏకీకృతం చేయగలిగే కమ్యూనిటీ నిధులుగా ప్రస్తుతం సంఘటిత పడుతూ, అక్కడి వెనుకబడిన ఆదివాసీ కమ్యూ నిటీ వర్గాలకు సేవలు అందిస్తున్నాయి. ఈ కమ్యూనిటీ విత్తన బ్యాంకులు స్థానికంగా నిర్వహించబడే సంస్థలు. ఇవి విత్తనాలను సేకరించడం, నిల్వ చేయడం, కమ్యూనిటీ విత్తన అవసరా లను తీర్చడం వంటి సేవలు అందిస్తున్నాయి. అవి దేశంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద–చిన్న పంటలు, ఔషధ మొక్కలు, అలాగే నిర్లక్ష్యం చేయబడి తక్కువ ఉపయోగంలో ఉన్న మొక్కల జాతులను తమ పరిధిలో అంతరించి పోకుండా రక్షణ కలిగిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇవి సరైన నిల్వ, మౌలిక సదుపాయాలు, విత్తన శుద్ధి పరికరాలు, నిర్వహణ సిబ్బందికి శిక్షణ లేమి, ఆర్థిక మద్దతు లోటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. ఈ సమస్యలను పరిష్కరించవలసి ఉంది.భారత్ తన మొదటి జాతీయ జన్యు నిధిని 1996లో జాతీయ జాతీయ జన్యు వనరుల బ్యూరో న్యూ ఢిల్లీలో ఏర్పాటు చే సింది. మొట్ట మొదటి జన్యు నిధికి ఉన్న 0.47 మిలియన్ల నమూనాల పరి రక్షణ సామర్థ్యాన్ని అధిగమించి, రెండో జాతీయ జన్యు నిధికి నిల్వ సామర్థ్యాన్ని ఒక మిలియన్ దాకా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, దేశంలోని అధిక జీవవైవిధ్య సాంద్రత ఉన్న ప్రాంతాలలోని స్థానిక పరిరక్షకుల సంఘాలతో కమ్యూనిటీ విత్తన నిధులను జాతీయ జీన్ బ్యాంకుతో అనుసంధాన పరచడం ఒక ప్రగతిశీల ఆచరణయోగ్య కార్యక్రమం. భారత దేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఈశాన్య, అండమాన్–నికోబార్ దీవులు వంటి అనేక జీవవైవిధ్య సాంద్రత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. కనుక, ప్రస్తుత, భావితరాల ఆహార మరియు పోషకాల భద్రతా లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ రెండవ జాతీయ జన్యు బ్యాంకు ఏర్పాటు చొరవలో స్థానిక పరిరక్షకులు తప్పనిసరిగా భాగస్వాములు కావాలి.బలిజేపల్లి శరత్ బాబువ్యాసకర్త భారత వ్యవసాయ మండలి విశ్రాంత శాస్త్రవేత్త -
అద్భుతాలు చేస్తున్న అత్తోట రైతులు.. ప్రైవేటు రంగంలో తొలి విత్తన నిధి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: దేశీయ వరి విత్తనాలకు పెద్దపీట వేస్తూ ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు చేస్తున్నారు అత్తోట రైతులు. 2016లో మూడు రకాల వరి వంగడాలతో ప్రారంభించి ఈ ఏడాది 365 దేశవాళీ రకాలను పండిస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వరి వంగడాలను పండించడమే కాకుండా భూమి భారతి పేరుతో విత్తన నిధిని ఏర్పాటు చేశారు. దేశీయ వరి రకాలకు సంబంధించి ప్రైవేటు రంగంలో ఇదే తొలి విత్తన నిధి కావడం గమనార్హం. ఈ యజ్ఞానికి తానా తన వంతు సహకారం అందించింది. మొదట్లో ఏడెనిమిది మంది రైతులతో ఐదు ఎకరాల్లో ప్రారంభించిన ఈ ప్రక్రియ ఈ రోజున ఒక్క అత్తోట గ్రామంలోనే ఎనభై మందికి పైగా రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ దేశీయ వరి రకాలను పండిస్తున్నారు. రసాయనాల ప్రసక్తి లేకుండా కేవలం ప్రకృతి ఆధారిత సాగు పద్ధతుల్లో తీసిన విత్తనాలతో ‘దేశవాళీ విత్తన నిధి’ ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం–దేశీయ వంగడాలు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో రైతులు కొన్నేళ్లుగా దేశవాళి వరి వంగడాలను ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్నారు. గ్రామరైతు యర్రు బాపన్న నేతృత్వంలో మరో ఏడుగురు కలిసి దేశవాళీ వరి రకాల విత్తనాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఒక రైతు పంటను వేసుకోవడంతో పాటు విత్తనాలను కూడా తానే తయారు చేసుకునే అవకాశం దేశవాళీ విత్తనాలపై ఉంది. గత ఏడాది 365 రకాలను పండించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుకు కావాల్సిన ద్రవ, ఘన జీవామృతాలు, కషాయాలను స్వయంగా తయారుచేసుకుంటున్నారు. అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు అందిస్తున్నాయి. ‘దేశవాళీ విత్తన నిధి’ ఏర్పాటు అత్తోట రైతు యర్రు బాపయ్య గత ఆరేళ్లుగా ఈ విత్తనాలను సేకరిస్తూ సాగులో ఉన్నారు. ఆయన తానా సహకారంతో అత్తోట శివారులో విత్తననిధిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 365 రకాల ధాన్యం అందుబాటులో ఉంచారు. ఈ పంటలు వేసుకునే రైతులకు ఆయా రకాలను అందిస్తున్నారు. ధాన్యం కావాలనే వారికి మర ఆడించి ఇచ్చేందుకు చిన్నస్థాయి రైస్‌మిల్‌ను తమ ఆవరణలోనే ఏర్పాటు చేసుకున్నారు. మెట్టలో తొలినుంచీ ప్రకృతి సేద్యం చేస్తున్న నామన రోశయ్య వీరికి స్ఫూర్తిగా నిలిచారు. 78 ఏళ్ల వయసులో కూడా ముప్పాతిక ఎకరం (75సెంట్లు)లో వ్యవసాయం చేస్తూ ఏడాదికి లక్షన్నరకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాడు. ఈ వయసులోనూ కొబ్బరిచెట్లను అవలీలగా ఎక్కుతూ గెలలను దింపుతూ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. కొబ్బరి సహా 23 రకాల పండ్ల చెట్లు సాగు చేస్తున్నాడు. అన్నీ ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే రకాలే.. ఇక్కడ అరుదైన రకాలను సేకరించి సాగుచేశారు. బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి తగినట్టుండే ‘రత్నచోళి’ని సాగుచేశారు. వర్షాధారమై, ఎక్కువ పోషకాలుండే ‘సారంగనలి’ మరో రకం. వండేటపుడు చక్కని సువాసననిచ్చే పొడుగైన బియ్యం ‘ఢిల్లీ బాసుమతి’, ‘ఇంద్రాణి’ రకాలు, గడ్డి నుంచి బియ్యం వరకు సమస్తం నలుపురంగులో ఉండి రోగనిరోధక శక్తినిచ్చే ‘కాలాబట్టి’ (బ్లాక్‌రైస్), తెగుళ్లు, దోమకాటు దరిచేరని ‘దాసమతి’, మధుమేహాన్ని అదుపుచేసే నవారా, బలవర్ధకమైన ‘మాపిళై సాంబ’తోపాటు నెల్లూరు మొలకొలుకులు, తులసీబాసో, బాస్మతి, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి, దురేశ్వర్, పంచరత్న, రక్తశాలి, చింతలూరి సన్నం, కుజపటాలియా వంటివి ప్రముఖమైనవి. ఈ రకాలన్నీ ఆరోగ్య ప్రయోజనాలనిచ్చేవే. దేశవాళీ సాగును ప్రోత్సహించడమే.. దేశవాళీ వరి వంగడాల్లో గణనీయమైన జన్యువైవిధ్యాలున్నాయి. వివిధ కారణాలతో అనేక రకాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటి సంరక్షణకు మా వంతు కృషి చేస్తున్నాం. దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదు. అత్యంత అధ్వాన్నమైన పరిస్థితుల్లోనూ కనీసం యాభై శాతం ఫలితాన్ని అందిస్తుంది.అందుకే రైతులకు విత్తనాలు అందించేందుకు వీలుగా తానా సహకారంతో భూమి భారతి విత్తన నిధిని ఏర్పాటు చేశాము. – యర్రు బాపన్న, సంప్రదాయ సాగు రైతు, అత్తోట