Top Stories
ప్రధాన వార్తలు

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు.ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీసీతారాముల అనుగ్రహం లభించాలని వైఎస్ జగన్ అభిలషించారు. సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామచంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శనీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామచంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శనీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.#SriRamaNavami— YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2025

కూటమిలో కుంపట్లు రాజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు.. టీడీపీ శ్రేణులపై కేసులు
కాకినాడ జిల్లా,సాక్షి: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమెల్సీ నాగబాబు పర్యటన కూటమిలో కుంపట్లు రాజేస్తోంది. పిఠాపురంలో వరుస పర్యటనలు చేస్తున్న నాగబాబును టీడీపీ శ్రేణులు అడుగడునా అడ్డుకుంటున్నారు. ఈ తరుణంలో పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.శనివారం ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో భాగంగా గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలు జనసేనకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆహ్వానించడం లేదంటూ ఆయన అభిమానులు,టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఈ తరుణంలో తనను అడ్డుకుని మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారని టీడీపీ కార్యకర్తలపై జనసేన నేత మొయిళ్ళ నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సంఘటనలో తమ విధులకు ఆటంకం కల్పించారని టీడీపీ కార్యకర్తలపై పిఠాపురం అడిషనల్ ఎస్సై జానీ భాష మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై గొల్లప్రోలు పోలీసులు వేరు వేరుగా కేసులు నమోదు చేశారు.అంతకుముందు పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీ నాగబాబు రాగా.. టీడీపీ, జనసేన కార్యకర్తలు బలాబలాలు ప్రదర్శించుకున్నారు. జై వర్మ, జై టీడీపీ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేయగా.. ప్రతిగా జై జనసేన, జై పవన్ అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ తరుణంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పిఠాపురం కూటమిలో నాగబాబు పర్యటన కుంపట్లు రాజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి కుట్ర.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసిన చంద్రబాబు సర్కార్.. అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అరెస్ట్‌కు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్ట్ చేసింది. అహ్మద్ బాషా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, అహ్మద్ బాషా గతంలో రాజీ పడిన ఓ కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక, సదరు కేసులో ఇరు వర్గాలు ఇప్పటికే రాజీపడటం గమనార్హం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా అహ్మద్‌ను ఇప్పుడు అరెస్ట్ చేసింది.

నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మరికొన్ని నెలల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్న జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏదో సరదాగా అమ్యూజ్మెంట్ పార్క్‌కు వెళ్లడమే వారి జీవితాన్ని మలుపు తిప్పింది. పార్క్‌లో జరిగిన ప్రమాదంలో తనకు కాబోయే భార్య చనిపోయింది.వివరాల ప్రకారం.. నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంక(24)తో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో వారిద్దరికీ ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని నెలల్లో వారికి పెళ్లి జరిగాల్సి ఉంది. అయితే, ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో ఉన్న ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. కాసేపు అక్కడ తిరిగిన తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయింది. దీంతో, ప్రియాంక ఎత్తులో నుంచి కింద పడిపోయింది.దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో, ఒక్కసారిగా నిఖిల్ కుప్పకూలిపోయి కన్నీటిపర్యంతమయ్యాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మృతిచెందిన ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ఈఎన్టీ రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. Delhi | A 24-year-old woman, Priyanka lost her life after falling from a roller coaster ride at Fun and Food Village in the Kapashera area of Delhi yesterday. She reportedly lost her balance and fell from the ride, sustaining severe injuries. Despite being rushed to a nearby…— ANI (@ANI) April 5, 2025

వారి దయ, జనం ప్రాప్తం... అదే పీ–ఫోర్!
‘ఏరు దాటకముందు ఓడ మల్లయ్య... దాటిన తర్వాత బోడి మల్లయ్య!’ – ఇది పాత సామెత. ఎన్నికలకు ముందు ‘సూపర్ సిక్స్’... ఎన్నికలయ్యాక ‘పీ–ఫోర్’ – ఇది కొత్త సామెత. ఎన్ని కల్లో గెలవడానికి చంద్రబాబు ఎంత అలవికాని హామీలిస్తారో గెలిచిన తర్వాత వాటిని ఎలా అటకెక్కిస్తారో తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ బోడి మల్లయ్య వైఖరిపై వై.ఎస్. రాజశేఖరరెడ్డి, రోశయ్య వంటి పెద్దలు వేసిన సెటైర్ల వీడియోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఐదొందలకు పైగా వాగ్దానాలు చేశారు. అన్నిట్లోకి ప్రధానమైన హామీ... రైతులకు సంపూర్ణ రుణ మాఫీ. ఎన్నికల నాటికే 87 వేల కోట్లకు పైగా ఉన్న రైతు రుణాల సంపూర్ణ మాఫీ రాష్ట్ర వనరులతో సాధ్యం కాదని, ఆ హామీని ఇవ్వడానికి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నిరాకరించారు. కానీ, ఏరు దాటడమే ముఖ్య మని భావించే చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఆ హామీని అమలు చేస్తానని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేశారన్నది రాష్ట్ర రైతాంగానికి తెలుసు.ఇప్పుడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్రం విడుదల చేసిన గణాంకాల సాక్షిగా దేశ ప్రజలందరికీ చంద్రబాబు రైతు రుణమాఫీ బండారం బట్టబయలైంది. సరిగ్గా వారం రోజుల కిందనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను సమర్పించింది. 2018 జూలై నుంచి 2019 జూన్ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రైతుల సగటు రుణభారం రూ.2,45,554గా ఉన్నట్టు ఈ సమాధానం వెల్లడించింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్ఓ) రూపొందించిన జాబితా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్ రైతుల రుణభారం అధికంగా ఉన్నది. ఇది చంద్రబాబు గద్దె దిగేనాటికి రైతాంగ పరిస్థితి. సంపూర్ణ రుణమాఫీ వాగ్దానం ఒక ప్రహసనం అని చెప్పేందుకు ఇంతకంటే పెద్ద రుజువు ఏముంటుంది?జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత, అంటే 2001 జూలై – 2002 జూన్ మధ్యకాలంలోని ఏపీ రైతుల సగటు రుణభారం 66,205 రూపాయలకు తగ్గిపోయింది. ఇది కూడా ఎన్ఎస్ఎస్ఓ తయారుచేసిన లెక్కే. రాజ్యసభలో కేంద్రం వెల్లడించినదే. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయడంతోపాటు, క్రమం తప్పకుండా బాకీ తీర్చే రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయడం వల్ల కలిగిన సత్ఫలితమిది. చంద్రబాబు బూటకపు హామీల అమలు తీరుకూ, జగన్ సంక్షేమ పథకాల అమలు తీరుకూ మధ్యన ఉండే తేడాను చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కూటమి చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనది ‘సూపర్ సిక్స్’. పది నెలల తర్వాత కూడా ఈ ఆరు పథకాల ప్రారంభం ఆచరణకు నోచుకోలేదు. ఒక్క దీపం పథకంలో భాగంగా ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు బదులు ఒక సిలిండర్‌ను అందజేసి మమ అనిపించుకున్నారు. ‘సూపర్ సిక్స్’ అమలు చేయాలంటే ఈ సంవత్సరానికి అవసరమైన 70 వేల కోట్ల రూపాయలకు బదులు బడ్జెట్లో 17 వేల కోట్లే కేటాయించడాన్ని బట్టి రెండో సంవత్సరం కూడా ప్రధాన హామీ అమలు లేనట్టేనని భావించవలసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మరిపించడానికి ‘పీ–ఫోర్’ అనే దానధర్మాల కార్యక్ర మాన్ని చంద్రబాబు ముందుకు తోస్తున్నారు. ఇక ‘సూపర్ సిక్స్’ జోలికి వెళ్లరని చెప్పడానికి ఇటీవల చంద్రబాబు చేసిన వింత వ్యాఖ్యానం కూడా ఒక రుజువని చెప్పవచ్చు. జగన్మోహన్రెడ్డి అమలుచేసిన సంక్షేమ కార్య క్రమాలన్నీ ఒక ఎత్తు – తాను పెంచి అమలుచేస్తున్న పెన్షన్ కార్యక్రమం ఒక ఎత్తని ఒక విచిత్రమైన పోలికను ఆయన తీసుకొచ్చారు. ఈ రెండూ సమానమే కనుక ఇక అదనంగా చేసేదేమీ లేదనేది ఆయన మనోగతం కావచ్చు. కానీ ఈ పోలిక నిజమేనా? ‘సూపర్ సిక్స్’తో సహా మేనిఫెస్టోలోని మొత్తం హామీల్లో వెయ్యి రూపాయల పెన్షన్ పెంపు ఒక్కదాన్నే చంద్ర బాబు ప్రభుత్వం అమలు చేస్తున్నది. అది కూడా సంపూర్ణంగా కాదు! ఎస్సీ, బీసీలకు యాభయ్యేళ్ల నుంచే వృద్ధాప్య పెన్షన్‌ను అమలు చేస్తానని కూటమి మేనిఫెస్టో చేసిన హామీని విస్మరించారు. ఆ రకంగా ఈ పది నెలల్లో ఎగవేసిన సొమ్మెంతో అంచనా వేయవలసి ఉన్నది.ఐదేళ్ళ పదవీకాలంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 2,73,756 కోట్ల రూపా యలను జనం ఖాతాల్లో వేసింది. ఇతర పథకాల (నాన్–డీబీటీ) ద్వారా 1,84,604 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. మొత్తం ప్రజా సంక్షేమ పథకాల కోసం ఐదేళ్ళలో వెచ్చించిన సొమ్ము 4,58,360 కోట్లు. అంటే ఏడాదికి రమారమి 92 వేల కోట్లు. ఈ కాలంలో వరసగా రెండేళ్లు కోవిడ్ దాడులు జరిగిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్ సర్కార్ 66 లక్షల పైచిలుకు మందికి మూడు వేల రూపాయల చొప్పున నెలకు సుమారుగా రెండు వేల కోట్ల మేర పెన్షన్లు అందజేసింది. పెన్షనర్లలో మూడు లక్షలమందికి కత్తెర వేసిన చంద్రబాబు ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయల చొప్పున పెంచి నెలకు 2,700 కోట్లు పంపిణీ చేస్తున్నది. ఈ పెరుగుదల నెలకు ఏడు వందల కోట్ల చొప్పున సంవత్సరానికి 8,400 కోట్లు. ఇది జగన్ సర్కార్ ఏడాదికి సంక్షేమం కింద ఖర్చుపెట్టిన 92 వేల కోట్లకు సమానమేనని చంద్రబాబు వాదిస్తున్నారు. ఎట్లా సమానమవుతుందని ఎవ రైనా ప్రశ్నిస్తే ‘ఎర్ర బుక్కు’లో పేరు రాసుకుంటారట!‘సూపర్ సిక్స్’ హామీల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు ఒక కొత్త నామవాచకాన్ని రంగంలోకి దించారు. అదే ‘పీ–ఫోర్’ (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్). దీని ప్రకారం సమాజంలోని అగ్రశ్రేణి పది శాతం సంపన్నులు సామాజిక బాధ్యత తీసుకుని అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను ఉద్ధరించాలట! సంపన్నులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ పేదలను ఆదుకోవాలనే సిద్ధాంతాలు ఇప్పటివి కావు. పేద, ధనిక తేడాలు సమాజంలో ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నాయి. చంద్రబాబు దానికి కొత్త పేరు పెట్టుకున్నారు. అంతే తేడా! కానీ ఈ సిద్ధాంతంతో అంతరాలు తొలగిపోయిన సమాజం చరిత్రలో మనకెక్కడా కనిపించదు. ఏపీలో ఆదాయం పన్ను చెల్లిస్తున్న అధికాదాయ వర్గాలవారు ఎనిమిది లక్షల మందేనట! మరోపక్క పేదరికం కారణంగా తెల్ల రేషన్‌కార్డు లున్న కుటుంబాలు కోటీ నలభై ఎనిమిది లక్షలు. చంద్రబాబు ‘పీ–ఫోర్’ సిద్ధాంతపు డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఈ గణాంకాలను ఉటంకించారు.ఆదాయం పన్ను చెల్లించేవారి సంఖ్య ఈ లెక్కన రెండు శాతం కూడా లేదు. అందులోనూ వేతన జీవుల సంఖ్యే ఎక్కువ. వీళ్లకు సేవా కార్యక్రమాలు చేసేంత స్థోమత ఉండదు. ఈ లెక్కన కాస్త అటూఇటుగా ఒక్కశాతం మందే పేదల బాధ్యత తీసు కోవాలి. తెల్లకార్డుల సాక్షిగా పేదలు 90 శాతం మంది. ఇందు లోంచి 70 శాతాన్ని తొలగిస్తూ 20 శాతం మంది పేదలను మాత్రమే ‘పీ–ఫోర్’ స్కీములోకి చేర్చుకున్నారు. ఈ పేదల మీద తనకు ఏ రకమైన అభిప్రాయాలున్నాయో మొన్నటి ఉగాది నాడు జరిగిన సభలో స్వయంగా చంద్రబాబు వెల్లడించారు. ‘ఈ బీసీల ఆలోచనంతా ఆ పూట వరకే! సభకొచ్చారు. మధ్య లోనే లేచి వెళ్లారు. మార్గదర్శులు (సంపన్నులు) మాత్రం కూర్చునే ఉన్నార’ని పేదలను ఈసడిస్తూ సంపన్నులను మెచ్చు కున్నారు. పేదవాళ్లకు క్రమశిక్షణ ఉండదనీ, ముందుచూపు ఉండదనీ, డబ్బున్నవాళ్లే పద్ధతైనవాళ్లనే అభిప్రాయంలోంచి మాత్రమే అటువంటి మాటలు వస్తాయి. పేదల పట్ల చంద్ర బాబు ఈసడింపు ధోరణికి ఇదొక్కటే ఉదాహరణ కాదు. చాలా ఉదంతాలున్నాయి. ఎస్.సీల గురించి, బీసీల గురించి గత పదవీ కాలంలో చేసిన కామెంట్లు ప్రజలకు ఎల్లకాలం గుర్తుంటాయి.2013లో చేసిన కంపెనీల చట్టం సెక్షన్ 135 ప్రకారం కార్పొరేట్ కంపెనీలన్నీ వాటి లాభాల్లో రెండు శాతానికి తగ్గకుండా సామాజిక సేవా రంగాలపై ఖర్చు చేయాలి. అది చట్ట బద్ధమైన బాధ్యత. దయాదాక్షిణ్యం కాదు. సగటున దేశ వ్యాప్తంగా సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద 15 వేల కోట్ల రూపాయలను ఇప్పటికే ఖర్చు చేస్తున్నారు. దీన్ని ఏపీ భాగం కింద విడదీస్తే వెయ్యి కోట్ల లోపే ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని పనిచేస్తే రెండు వేల కోట్లో, మూడు వేల కోట్లో రావచ్చు. ఈ సొమ్ముతో ఇరవై శాతం మంది జీవితాల్లో వెలుగులు పూయించాలని ఆయన ఆలో చిస్తున్నారు.ప్రతి పౌరునికీ జీవించే హక్కును మాత్రమే కాదు, గౌరవప్రదంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. 21వ అధికరణం ప్రకారం గౌరవప్రదమైన జీవనం ప్రతి వ్యక్తికీ ప్రాథమిక హక్కు. ఈ హక్కును ప్రభుత్వం సంరక్షించాలి. అందుకు విరుద్ధంగా నలుగురు డబ్బున్న వాళ్లను పోగేసి వేదికపై కూర్చోబెట్టి, వేదిక ముందు పేదల్ని చేతులు జోడించి కూర్చు నేలా చేసి, ‘ఒక అయ్యగారి సాయం పదివేలు, ఒక దొరగారి సాయం ఇరవై వేలం’టూ వేలం పాటలు పాడటం రాజ్యాంగ విరుద్ధం. అందుకే సీఎం సభ నుంచి పేద ప్రజలు మధ్యలోనే నిష్క్రమించి ఉంటారు. ముందుచూపు లేక కాదు, మోకరిల్లడం ఇష్టం లేక వెళ్లిపోయుంటారు. అందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడం, అందరికీ మేలైన వైద్య సదుపాయాలు లభించేలా చేయడం, అందరూ సమాన స్థాయిలో పోటీపడగలిగే లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ను తయారు చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. రాజ్యాంగ ఆదేశాన్ని మన్నించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వపు ప్రాథమిక విధి. దిద్దుబాటా... ఇంకో పొరపాటా?ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాల పుట్టినిల్లుగా పేరుండేది. ఉద్యమాల పర్యవసానంగా పుట్టిన యూనివర్సిటీ హైదరా బాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఒక భావోద్వేగ పూరితమైన నేపథ్యం హెచ్‌సీయూ ఆవిర్భావానికి కారణమైంది. 1969, 1972 సంవత్సరాల్లో రెండు ఉధృతమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలను తెలుగు నేల చూడవలసి వచ్చింది. ఆ ఉద్యమాలను చల్లార్చి ఉమ్మడి రాష్ట్రాన్ని కొనసాగించడం కోసం ఒక రాజీ ఫార్ములాగా ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. అందులో ఒక అంశం హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు! విద్యారంగంలో వెనుకబాటుతనా నికి గురైన ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటు, రాష్ట్ర రాజధానిలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభించే విధంగా దాన్ని కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఉభయతారకంగా ఉంటుందని భావించారు.ఇందుకోసం రాజ్యాంగ సవరణ అవసరమైంది. 32వ సవరణ ద్వారా 371వ అధికరణానికి ‘ఈ’ అనే సబ్‌క్లాజ్‌ను జోడించారు. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా హైదరాబాద్‌లో ఒక ‘సెంట్రల్’ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఈ క్లాజ్ అవకాశం కల్పించింది. ఆ మేరకు హైదరాబాద్ విశ్వవిద్యాలయ చట్టం 1974ను పార్లమెంట్ ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో గెజెట్‌లో ఈ చట్టాన్ని ప్రచురించారు. భారత రాజ్యాంగంలో 371వ అధికరణం కింద ప్రస్తావించిన ఏకైక విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ మాత్రమే! అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా 2,300 ఎకరాల భూమిని హైదరాబాద్ నగర కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో కేటాయించింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడమో, లేక ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించడమో చేయలేదు.పూర్వపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో వాటిని ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్న భూములన్నీ నవాబ్ సొంత భూములుగా (‘సర్ఫెఖాస్’గా) పరిగణించేవారు. పోలీస్ యాక్షన్ తర్వాత ‘హైదరాబాద్ స్టేట్’ ఇండియన్ యూని యన్‌లో విలీనమైంది. నైజాం... భూములన్నీ హైదరాబాద్ స్టేట్‌కు వారసత్వంగా లభించాయి. ఇందుకోసం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జీవించి ఉన్నంతకాలం పెద్దమొత్తంలో కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రాజభరణం చెల్లించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలో డజన్లకొద్ది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు ఈ భూముల లభ్యతే కారణం.హెచ్‌సీయూను ఒక ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా మలచాలని కేంద్రం భావించినందు వల్ల అప్పటికి ప్రపంచ స్థాయిలో పేరున్న యూనివర్సిటీలను దృష్టిలో పెట్టుకొని వాటి స్థాయిలోనే భూములను కేటాయించాలని భావించారు. ఈ భూములను కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. కాకపోతే భూముల రిజిస్ట్రేషన్ జరగలేదు. అటువంటిది అవసరమని కూడా నాటి యూని వర్సిటీ పాలకవర్గాలు భావించలేదు. హెచ్సీయూకు చీఫ్ రెక్టార్‌గా ఒక గౌరవ హోదా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పార్లమెంట్ చట్టపరంగానే కట్టబెట్టింది. కంచే చేను మేస్తుందని ఎవరు భావిస్తారు! అందువల్ల టెక్నికల్‌గా ఆస్తుల బదలాయింపు జరగలేదు.కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్‌సీయూ ప్రతి ష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్ర మించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని స్థాపించిన యాభయ్యేళ్లకు దాని భూములపై ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదం జరుగుతున్నది. నిజానికి పాతికేళ్ల కిందనే ఈ చర్చను లేవనెత్తి ఉండాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అప్పటి మీడియా కరపత్రికల్లా వ్యవహరించడం వల్ల, కేంద్రంలో కూడా ఆయన మిత్రపక్షమే ఉన్నందువల్ల చర్చ జరగలేదు. యూనివర్సిటీకి కేటాయించిన 2300 ఎకరాల్లో 800 ఎకరాల సంతర్పణ వివిధ సంస్థల పేర్లతో ఇష్టారాజ్యంగా జరిగిపోయింది.మిగిలిన దాంట్లో 400 ఎకరాల భూమిని తాడూ బొంగరం లేని క్రీడా నిపుణుల పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టారు. అదీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కేబినెట్ అనుమతి కూడా లేకుండానే ఈ కేటాయింపులు జరిగాయి. ఈ నాలుగొందల ఎకరాలు చాలవని ఎయిర్‌పోర్టు సమీపంలో మరో నాలుగొందల యాభై ఎకరాలను కూడా కట్టబెట్టారు. ఆనాటికి దేశంలోని అతిపెద్ద స్కాముల్లో ఈ బిల్లీరావు భూబాగోతం కూడా ఒకటి. వెంటనే ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం, తదనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ కేటాయింపును రద్దు చేయడం తెలిసిన విషయాలే!రద్దును సవాల్ చేస్తూ బిల్లీరావు కోర్టుల్ని ఆశ్రయించి ఇరవయ్యేళ్లపాటు వ్యాజ్యాన్ని నడిపాడు. రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగానే నిలవడంతో ఇరవయ్యేళ్ల తర్వాత గత సంవత్సరమే సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ఈ 400 ఎకరాలు ప్రభు త్వానివేనని తేల్చేసింది. కేవలం టెక్నికల్‌గానే ప్రభుత్వ భూములు అనుకోవాలి. యూనివర్సిటీకి ఈ భూములను కేటాయించినట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామచంద్రారెడ్డి యూనివర్సిటీ అధికా రులకు 1975లోనే ఫిబ్రవరి 21న డీఓ లెటర్ ద్వారా కమ్యూ నికేట్ చేశారు. 2,300 ఎకరాలు కేటాయించినట్టు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు గానీ, ఆ రోజుల్లో రెండు కోట్లు ఖర్చుపెట్టి కాంపౌండ్‌వాల్ కట్టించింది.ఇక్కడ తలెత్తుతున్న కీలకమైన ప్రశ్న ఏమిటంటే, రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన యూనివర్సిటీ ఇది. పార్లమెంట్లో ప్రత్యేకంగా చట్టాన్ని చేసి ఏర్పాటుచేశారు. రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భూముల్ని కేటాయించింది. ఈ భూముల్ని అకడమిక్ అవసరాలకు మాత్రమే వినియోగించాలని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే షరతు కూడా విధించింది. ఆ షరతును ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధపడటం, అమ్ముకోవడానికి కూడా తెగించడం చెల్లుబాటయ్యే విషయాలేనా? నైతికంగానే కాదు, న్యాయపరంగా కూడా! విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్ప స్టేక్ హోల్డర్లు ఇంకెవరూ లేరా?కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకున్నదట! ఇప్పుడు వేలానికి సిద్ధపడింది. ఈ 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదన్న వార్తలు వ్యాపించడం, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఇది జాతీయ సమస్యగా మారింది. ఈ నాలుగొందల ఎకరాల పరిధిలోని దట్టమైన పొదలు స్క్రబ్ అడవిగా అల్లుకున్నాయి. మంజీరా బేసిన్లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడి కుంటల్లో చేరిన నీరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలకు ఊపిరిపోస్తున్నాయని చెబుతున్నారు. హెచ్‌సీయూ వెబ్సైట్ లోనే ఇక్కడున్న బయో డైవర్సిటీ గురించి అధికారికంగా పొందుపరిచారు.వంద ఎకరాల్లో బయో డైవర్సిటీని ధ్వంసం చేశారన్న వార్తలను అధికారికంగా రూఢి చేసుకున్న తర్వాతనే సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. ఏప్రిల్ 16వ తేదీ లోగా నివేదికను ఇవ్వాలని రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించింది. న్యాయ స్థానం జోక్యంతో ప్రస్తుతం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా,ఎంపిక చేసుకున్న పత్రికల్లో వస్తున్న లీకు వార్తలు కొత్త కలవరాన్ని కలిగిస్తున్నాయి. 400 ఎకరాలే కాదు, మొత్తం రెండువేల ఎకరాల్లో ‘ఎకో పార్క్’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదనీ, ఇందుకోసం సెంట్రల్ వర్సిటీకి ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాలు కేటాయించి, అక్కడికి తర లిస్తారనీ ముందుగా ఒక తెలుగు పత్రిక రాసింది. దానికి ప్రభుత్వ అనుకూల పత్రికగా పేరున్నది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. రెండోరోజు ఒక జాతీయస్థాయి ఇంగ్లిషు పత్రికలో మరింత ప్రముఖంగా, సమగ్రంగా అదే వార్త వచ్చింది. ఎవరూ ఖండించలేదు. అధికారికంగా ప్రకటించనూ లేదు. ఇటువంటి వార్తల్నే జనం పల్స్ తెలుసుకోవానికి ప్రయోగించే ‘లీకు వార్త’లంటారు. నిజంగా ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నదా? వేలానికి అడ్డుపడ్డ సెంట్రల్ వర్సిటీ విద్యార్థులపై కోపమా? వాళ్ల మీద కోపంతో యూనివర్సిటీ స్థాయిని తగ్గించాలనుకుంటున్నారా? వాళ్లదేముంది. రెండు మూడేళ్లు చదువుకొని వెళ్లిపోతారు. నిజంగానే సెంట్రల్ వర్సిటీని వంద ఎకరాల్లోకి పంపించే ఉద్దేశం ఉంటే మాత్రం దాని స్థాపిత లక్ష్యాలను అవహేళన చేసినట్టే అవుతుంది. ఒక తప్పును దిద్దుకోవడానికి మరో తప్పు చేసినట్టవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంతో ఫుట్‌బాల్ ఆడుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా అనే సంగతి కూడా తేలవలసి ఉన్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 50 లక్షల లోపు ధర ఉండే అఫోర్డబుల్ గృహాల అమ్మకాలు 9 శాతం క్షీణించినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ఎనిమిది ప్రధాన నగరాల్లో విక్రయాలు 21,010 యూనిట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, సరఫరా తగ్గడం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది.నివేదిక ప్రకారం రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఖరీదు చేసే రెసిడెన్షియల్ సెగ్మెంట్లో కూడా విక్రయాలు 6 శాతం తగ్గి 26,832 యూనిట్లకు క్షీణించాయి. మార్చి త్రైమాసికంలో ఎక్కువగా ప్రీమియం కేటగిరీపైనే గృహాల కొనుగోలుదారులు దృష్టి పెట్టినట్లు రిపోర్ట్ పేర్కొంది. రూ. 1 కోటి పైగా ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు పెరగడం ఇందుకు నిదర్శనంగా వివరించింది.హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, చెన్నై తదితర 8 నగరాల్లో నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రకారం..రూ. 1–2 కోట్ల రేటు ఉన్న గృహాల విక్రయాలు 2 శాతం పెరిగి 22,330 యూనిట్లకు చేరాయి. అలాగే రూ. 2–5 కోట్ల కేటగిరీలో 28 శాతం వృద్ధి చెంది 13,735 యూనిట్లు, రూ. 5–10 కోట్ల విభాగంలో విక్రయాలు ఏకంగా 82 శాతం పెరిగి 3,448 యూనిట్లుగా నమోదయ్యాయి.రూ. 10–20 కోట్ల కేటగిరీలో అమ్మకాలు రెట్టింపై 658 యూనిట్లకు చేరాయి. రూ. 20–50 కోట్ల విభాగంలోనూ రెండు రెట్లు పెరిగి 92 యూనిట్లుగా నమోదయ్యాయి. రూ. 50 కోట్ల పైగా ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు అనేక రెట్లు పెరిగి 169 యూనిట్లకు చేరాయి.రూ. 2 కోట్ల ధర శ్రేణిలోని ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 22,330 యూనిట్లకు చేరడం.

నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’
భువనేశ్వర్ : ‘నాకు పెళ్లై రెండేళ్లవుతుంది. పెళ్లైన నాటి నుంచి నా భర్య నన్ను మానసికంగా వేధిస్తోంది. ఆమె వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇక నాకు చావే శరణ్యం’ అంటూ ఓ భర్త కదులుతున్న ట్రైన్ ఎదురు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ దుర్ఘటన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈస్ట్ కోస్ట్ డివిజన్ రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం ఖోర్ధాజిల్లా కుంభార్బస్తా (Kumbharbasta) కు చెందిన రామచంద్ర బర్జెనా కదులుతున్న ట్రైన్ నుంచి ప్రాణాలు తీసుకున్నాడు. దుర్ఘటనకు ముందు ఓ వీడియోను తన సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు.ఆ వీడియోలో ‘నేను రామచంద్ర బర్జెనాను. నేను కుంభార్బస్తాలో ఉంటాను. ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. అందుకు కారణం నా భార్య రూపాలీనే. రూపాలీ నన్ను మెంటల్ టార్చర్ చేస్తోంది. ఇక నేను బ్రతకలేను’ అని విలపిస్తూ వీడియోలో చెప్పాడు. వీడియో తీసిన అనంతరం, నిజిఘర్-తపాంగ్ రైల్వే ట్రాక్ సమీపంలో కదులుతున్న రైలు ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు రామచంద్ర, రూపాలీకి రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికో కుమార్తె. అయితే, పెళ్లైన నాటి నుంచి భార్య రూపాలి.. భర్త రామచంద్రను మానసికంగా వేధిస్తుండేది. అది సరిపోదున్నట్లు మెట్టినింట్లో చిచ్చుపెట్టేది. ఇవన్నీ తట్టుకోలేక రామచంద్ర ప్రాణాలు తీసుకున్నాడు. రామచంద్ర ఆత్మహత్యపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు రామచంద్ర తీసిన వీడియో ఆధారంగా భార్య రూపాలీని అరెస్ట్ చేశారు. Odisha: Unable to endure relentless torture from his wife, a young man tragically ended his life. The incident occurred in Kumarabasta village of Khordha district. The deceased has been identified as Ramchandra Badjena. Before his death, Ramchandra posted a video on social media,… https://t.co/hmwt0hzaEx— ସତ୍ୟାନ୍ୱେଷୀ/सत्यान्वेषी/Satyanweshi (@imsatyanweshi) April 5, 2025 రామచంద్ర ఆత్మహత్య తర్వాత అతని తల్లిదండ్రులు.. కోడలు రూపాలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నా కుమారుడు రామచంద్రకు రూపాలీతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి కూడా మా ఇంట్లోనే అంగరంగ వైభవంగా చేశాం. పెళ్లైన నాటి నుంచి రూపాలీ నా కొడుకుని చిత్ర హింసలు పెట్టేది. పాప పుట్టింది. తరుచూ మెట్టి నుంచి పుట్టింటికి వెళ్లేది. పుట్టింటికి వెళ్లకపోతే నన్ను నా కుటుంబ సభ్యుల్ని దూషిస్తుండేది. అయినప్పటికీ, అత్త కుటుంబసభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రూ.20లక్షలు అప్పుగా ఇచ్చాం. కానీ రూపాలీ తీరు మారలేదు. నా కొడుకు ఆమె చేతిలో నరకాన్ని అనుభవించాడు. ఆమె క్రూరత్వానికి ఫలితం ఇదే. మాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అభినయ, సన్నీల పెళ్లి ఎప్పుడంటే..?
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వారు పెళ్లి ఏర్పాట్లలో ఫుల్ బిజీగా ఉన్నారట. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళ్లోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఇక్కడ 'నేనింతే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. అయితే, అందులో ఒక సీన్లో ఆమె బోల్డ్‌గా నటించడంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి.అభినయ, సన్నీ వర్మల వివాహాం ఏప్రిల్ 16న జరగనున్నట్లు తెలుస్తోంది. ఆమె సన్నిహితులకు ఇప్పటికే ఆహ్వానం కూడా పంపారట. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. అభినయ పుట్టుకతోనే మాటలు రావు, వినిపించవని తెలిసిందే. అయినప్పటికీ తన టాలెంట్‌తో సినిమాల్లో రాణించింది. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు సన్నీ వర్మతో కలిసి ఆమె ఏడడుగులు వేయనుంది. అతనికి కూడా పుట్టుకతోనే మాటలు రావని ఇండస్ట్రీలోని ఆమె సన్నిహితులు కొందరు చెబుతున్నారు. అయితే, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.ఆమె ఇటీవలే నిశ్చితార్థం సమయంలో తీసుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభినయ పంచుకుంది. తనకు కాబోయే భర్తను ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేసింది. ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి కుటుంబం కూడా వ్యాపార రంగంలో ఉందని సమాచారం. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official)

మీరు ఉద్యోగం సరిగా చేయడం లేదు.. ‘కుక్కలా నడవండి’ అంటూ..
తిరువనంతపురం: కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారికి అప్పగించిన టార్గెట్స్ రీచ్ కాకపోవడంతో వారికి వేధింపులకు గురిచేశారు. శునకాల మాదిరిగా మోకాళ్లపై నడవాలని, నేలపై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. కేరళలో కలూరులోని ఓ ప్రైవేటు మార్కెటింగ్ సంస్థకు రాష్ట్రంలో పలుచోట్ల బ్రాంచ్ ఉన్నాయి. ఈ ఘటన మాత్రం పెరుంబవూర్ బ్రాంచీలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే, సదరు మార్కెటింగ్ కంపెనీల్లో వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, సంస్థలో ఉద్యోగులకు యాజమాన్యం టార్గెట్స్ నిర్ధేశించింది. కచ్చితంగా టార్గెట్స్ రీచ్ కావాలనే నియమం విధించారు. దీంతో, టార్గెట్ పూర్తి చేయని ఉద్యోగులను సదరు సంస్థ వేధింపులకు గురిచేసింది.ఉద్యోగులను శునకాల మాదిరిగా మోకాళ్లపై నడవాలని, నేలపై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా.. అతడిని మరో వ్యక్తి మోకాళ్లపై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ.. నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తిచేయని ఉద్యోగులపై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.100% literate State Kerala: Shocking video claiming to be of Employees of a company getting punished for missing Sales Targets goes viral....allegedly they were forced to Crawl, Lick spit & Bark like dogs. pic.twitter.com/0nnHje5oNO— Megh Updates 🚨™ (@MeghUpdates) April 5, 2025ఇక, దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ అమానవీయ ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని కార్మికశాఖ మంత్రి వీ శివన్కుట్టి వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే, యజమాని మాత్రం ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలిసింది. దీనిపై ఉద్యోగులు ఇప్పటివరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం.

రాయల్స్ ఘనవిజయం
మూల్లన్పూర్: తొలి రెండు మ్యాచ్‌లలో చక్కటి ఆటతో విజయాలు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్‌కు సొంత మైదానంలో ఆడిన మొదటి పోరులో ఓటమి ఎదురైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజస్తాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ సంజు సామ్సన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. జైస్వాల్, సామ్సన్ తొలి వికెట్‌కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఫెర్గూసన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు సహా 43 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్న పంజాబ్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. వధేరా, మ్యాక్స్‌వెల్ ఐదో వికెట్‌కు 52 బంతుల్లో 88 పరుగులు జత చేసి ఆశలు రేపినా... విజయానికి అది సరిపోలేదు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఫెర్గూసన్ 67; సామ్సన్ (సి) అయ్యర్ (బి) ఫెర్గూసన్ 38; పరాగ్ (నాటౌట్) 43; నితీశ్ రాణా (సి) మ్యాక్స్‌వెల్ (బి) యాన్సెన్ 12; హెట్‌మైర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) అర్ష దీప్ 20; జురేల్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–89, 2–123, 3–138, 4–185. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–1, యాన్సెన్ 4–0–45–1, ఫెర్గూసన్ 4–0–37–2, మ్యాక్స్‌వెల్ 1–0–6–0, చహల్ 3–0–32–0, స్టొయినిస్ 4–0–48–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్షి (బి) ఆర్చర్ 0; ప్రభ్‌సిమ్రన్ (సి) హసరంగ (బి) కార్తికేయ 17; శ్రేయస్ అయ్యర్ (బి) ఆర్చర్ 10; స్టొయినిస్ (సి) అండ్ (బి) సందీప్ 1; వధేరా (సి) జురేల్ (బి) హసరంగ 62; మ్యాక్స్‌వెల్ (సి) జైస్వాల్ (బి) తీక్షణ 30; శశాంక్ సింగ్ (నాటౌట్) 10; సూర్యాంశ్ (సి) హెట్‌మైర్ (బి) సందీప్ 2; యాన్సెన్ (సి) హెట్‌మైర్ (బి) తీక్షణ 3; అర్ష దీప్ (సి) హసరంగ (బి) ఆర్చర్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–11, 3–26, 4–43, 5–131, 6–131, 7–136, 8–145, 9–151. బౌలింగ్: ఆర్చర్ 4–0–25–3, యు«ద్వీర్ 2–0–20–0, సందీప్ శర్మ 4–0–21–2, తీక్షణ 4–0–26–2, కార్తికేయ 2–0–21–1, హసరంగ 4–0–36–1.
యువ కథ: మనిషి చనిపోయిన తర్వాత 7నిమిషాలు పాటు..
ఈ వారం కథ: ఉల్లి బంధం
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
సత్వర స్పందనతోనే.. స్కామ్ బట్టబయలు
Rama Navami 2025: పిబరే రామరసం..
నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’
'జాట్' తెలుగు వర్షన్‌కు ఇబ్బంది ఏంటి..?
దిద్దుబాటా... ఇంకో పొరపాటా?
అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
రాజన్నతో ముడి.. హిజ్రాల సందడి
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు.. కార్యజయం
అది మాయ లేడి కాదు స్వామీ! హెచ్‌సీయూ నుంచి వచ్చిన నిజమైన లేడికూన!!
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
‘రింగు’ 6 వరుసలు!
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
'అమెరికాలో ఉద్యోగాలుండవు'
ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ రోషన్
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
మోసం చేశావ్ చంద్రబాబూ.. అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
పూజలకు పీరియడ్స్ ఆటంకం, తప్పు జరిగిందంటూ..
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఇల్లు అమ్మిన ఇషా అంబానీ
డ్యాన్స్‌తో దుమ్మురేపిన స్టార్ హీరో సతీమణి.. రీఎంట్రీ కోసం ప్లాన్
అది పరిటాల కుటుంబానికి అలవాటే: గంగుల భానుమతి
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
రాయల్స్ ఘనవిజయం
అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్ నిలిపేసిన ఎస్బీఐ
గొడ్రాలు అనే మాట పడలేకే ఈ నాటకం
అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
MI Vs LSG: ఏం చేస్తున్నావ్ హార్దిక్?!.. ఆకాశ్ అంబానీ ఆగ్రహం!
అంత కష్టం ఏమొచ్చిందో..
హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
బావిలో పడిన కోడలు రక్షించేందుకు బావిలోకి దూకిన అత్త
ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. నేను ఫెయిల్యూర్ కాదు!
ట్రంప్ సుంకాల జోరు దేశాలన్నీబేజారు
అమెరికాలో ట్విస్ట్.. ట్రంప్, మస్క్‌కు ఝలక్!
బంగారం రెండోసారి.. వెండి మూడోసారి..
ఆ పాన్ కార్డులకు కొత్త డెడ్‌లైన్..
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
బౌలింగ్ వేస్తుండగా పవర్ కట్.. భయపడిన పాక్ బ్యాటర్! వీడియో వైరల్
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
మాళవిక లుంగీ లుక్.. అనసూయని ఇలా చూస్తే!
ద్వారకకు కాలినడకన అనంత్ అంబానీ
టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
కేఎల్ రాహుల్ అరుదైన ఫీట్.. గంభీర్ రికార్డు సమం
‘స్ట్రేచర్ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు
కోపంతో ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లిన ఖుష్దిల్!.. మద్దతుగా పీసీబీ ప్రకటన
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైళ్లు
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వైష్ణవి
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
వరంగల్: ఎస్బీఐ బ్యాంకుకు తాళం
హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్ వీడియోలపై సీఎం రేవంత్ సీరియస్
అమెరికా మార్కెట్లు అల్లకల్లోలం
ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపుతావా.. లేదా.. ? భర్తపై భార్య దాడి
జైపూర్ లో దేవసేన బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
అదే మా కొంపముంచింది.. ఏదీ కలిసి రావడం లేదు: సీఎస్కే కెప్టెన్
వామనరావు దంపతుల కేసు.. సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
డేట్ ఫిక్స్
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
బాబోయ్ ఈ–స్కూటర్లు!
ఐదేళ్ల క్రితం అంత్యక్రియలు.. ఇప్పుడు ప్రత్యక్షం
టారిఫ్‌లతో పడిపోయిన ట్రంప్ గ్రాఫ్
జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్.. వీడియో వైరల్
బ్రాండ్ ఎండోర్స్మెంట్లకు దూరంగా ప్రభాస్
వైఎస్సార్సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి
‘ఇందిరమ్మ’కు ప్రైవేట్ ఇంజనీర్లు
ధోని ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Sri Rama Navami టెంపుల్ స్టైల్లో ప్రసాదాలు ఇలా చేసుకోండి!
'టెస్ట్' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్ మెప్పించారా..?
ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
బబుల్ గమ్కాదు..చెక్క నమిలితే మెదడుకు చాలా మంచిది : కొత్త స్టడీ
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గడువు ఎప్పటిదాకా అంటే..!
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
సాయి పల్లవి ‘పొట్టి డ్రెస్’ కథ తెలుసా?
వారియర్ లుక్‌లో రష్మిక.. పాటతో అలరించిన విజయ్ దేవరకొండ!
ఖైదీ సీక్వెల్లో అమలాపాల్
నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’
NZ vs Pak: పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. సిరీస్ క్లీన్‌స్వీప్
'భరోసా'.. మెల్లమెల్లగా!
శ్వాస మరింత మెరుగ్గా! సింపుల్ అండ్ హెల్దీ యోగ!
అల.. ఏకశిలానగరిలో..
OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
అందరి చూపు... టాలీవుడ్ వైపు...
వారి దయ, జనం ప్రాప్తం... అదే పీ–ఫోర్!
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
బంగ్లా తీరు మారాల్సిందే!
గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. ఇద్దరి మరణం ఒకేలా..
యువ కథ: మనిషి చనిపోయిన తర్వాత 7నిమిషాలు పాటు..
ఈ వారం కథ: ఉల్లి బంధం
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
సత్వర స్పందనతోనే.. స్కామ్ బట్టబయలు
Rama Navami 2025: పిబరే రామరసం..
నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’
'జాట్' తెలుగు వర్షన్‌కు ఇబ్బంది ఏంటి..?
దిద్దుబాటా... ఇంకో పొరపాటా?
అమ్మో అన్ని యాడ్స్ శోభితకు ఎలా వచ్చాయి? సీక్రెట్ ఇదే..
రాజన్నతో ముడి.. హిజ్రాల సందడి
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు.. కార్యజయం
అది మాయ లేడి కాదు స్వామీ! హెచ్‌సీయూ నుంచి వచ్చిన నిజమైన లేడికూన!!
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
‘రింగు’ 6 వరుసలు!
ఓటీటీలో 'సిరి' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్.. తనను అసభ్యంగా చూపారంటూ విమర్శలు
'అమెరికాలో ఉద్యోగాలుండవు'
ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ రోషన్
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
మోసం చేశావ్ చంద్రబాబూ.. అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
పూజలకు పీరియడ్స్ ఆటంకం, తప్పు జరిగిందంటూ..
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఇల్లు అమ్మిన ఇషా అంబానీ
డ్యాన్స్‌తో దుమ్మురేపిన స్టార్ హీరో సతీమణి.. రీఎంట్రీ కోసం ప్లాన్
అది పరిటాల కుటుంబానికి అలవాటే: గంగుల భానుమతి
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
రాయల్స్ ఘనవిజయం
అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్ నిలిపేసిన ఎస్బీఐ
గొడ్రాలు అనే మాట పడలేకే ఈ నాటకం
అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
MI Vs LSG: ఏం చేస్తున్నావ్ హార్దిక్?!.. ఆకాశ్ అంబానీ ఆగ్రహం!
అంత కష్టం ఏమొచ్చిందో..
హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
బావిలో పడిన కోడలు రక్షించేందుకు బావిలోకి దూకిన అత్త
ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. నేను ఫెయిల్యూర్ కాదు!
ట్రంప్ సుంకాల జోరు దేశాలన్నీబేజారు
అమెరికాలో ట్విస్ట్.. ట్రంప్, మస్క్‌కు ఝలక్!
బంగారం రెండోసారి.. వెండి మూడోసారి..
ఆ పాన్ కార్డులకు కొత్త డెడ్‌లైన్..
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
బౌలింగ్ వేస్తుండగా పవర్ కట్.. భయపడిన పాక్ బ్యాటర్! వీడియో వైరల్
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
మాళవిక లుంగీ లుక్.. అనసూయని ఇలా చూస్తే!
ద్వారకకు కాలినడకన అనంత్ అంబానీ
టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
కేఎల్ రాహుల్ అరుదైన ఫీట్.. గంభీర్ రికార్డు సమం
‘స్ట్రేచర్ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు
కోపంతో ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లిన ఖుష్దిల్!.. మద్దతుగా పీసీబీ ప్రకటన
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైళ్లు
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వైష్ణవి
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
వరంగల్: ఎస్బీఐ బ్యాంకుకు తాళం
హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్ వీడియోలపై సీఎం రేవంత్ సీరియస్
అమెరికా మార్కెట్లు అల్లకల్లోలం
ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపుతావా.. లేదా.. ? భర్తపై భార్య దాడి
జైపూర్ లో దేవసేన బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
అదే మా కొంపముంచింది.. ఏదీ కలిసి రావడం లేదు: సీఎస్కే కెప్టెన్
వామనరావు దంపతుల కేసు.. సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
డేట్ ఫిక్స్
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
బాబోయ్ ఈ–స్కూటర్లు!
ఐదేళ్ల క్రితం అంత్యక్రియలు.. ఇప్పుడు ప్రత్యక్షం
టారిఫ్‌లతో పడిపోయిన ట్రంప్ గ్రాఫ్
జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్.. వీడియో వైరల్
బ్రాండ్ ఎండోర్స్మెంట్లకు దూరంగా ప్రభాస్
వైఎస్సార్సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి
‘ఇందిరమ్మ’కు ప్రైవేట్ ఇంజనీర్లు
ధోని ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Sri Rama Navami టెంపుల్ స్టైల్లో ప్రసాదాలు ఇలా చేసుకోండి!
'టెస్ట్' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్ మెప్పించారా..?
ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
బబుల్ గమ్కాదు..చెక్క నమిలితే మెదడుకు చాలా మంచిది : కొత్త స్టడీ
బెంగాలీ బ్యూటీలా అనసూయ.. ట్రిప్ లో రష్మిక నవ్వులు
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గడువు ఎప్పటిదాకా అంటే..!
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
సాయి పల్లవి ‘పొట్టి డ్రెస్’ కథ తెలుసా?
వారియర్ లుక్‌లో రష్మిక.. పాటతో అలరించిన విజయ్ దేవరకొండ!
ఖైదీ సీక్వెల్లో అమలాపాల్
నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’
NZ vs Pak: పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. సిరీస్ క్లీన్‌స్వీప్
'భరోసా'.. మెల్లమెల్లగా!
శ్వాస మరింత మెరుగ్గా! సింపుల్ అండ్ హెల్దీ యోగ!
అల.. ఏకశిలానగరిలో..
OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కారులో తిరగ్గలనా అనుకున్నాను: సంపూర్ణేష్ బాబు
అందరి చూపు... టాలీవుడ్ వైపు...
వారి దయ, జనం ప్రాప్తం... అదే పీ–ఫోర్!
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
బంగ్లా తీరు మారాల్సిందే!
గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. ఇద్దరి మరణం ఒకేలా..
సినిమా

డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
కామెడీ అనే పదానికి అర్థాలే మారిపోయాయి. స్వచ్ఛమైన హాస్యానికి బదులు డార్క్, వెగటు కామెడీలే ఎక్కువైపోతున్నాయి. అవతలివారిని చులకన చేసి నవ్వించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అయితే కామెడీ పేరుతో తనను నిజంగానే తిట్టారంటోంది నటి, కమెడియన్ వర్ష (Varsha). ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వర్ష మాట్లాడుతూ.. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు, డబ్బు సంపాదించాను. కానీ ఒకానొక సమయంలో కొందరివి రెండు ముఖాలు చూశాను. సీరియల్ నుంచి షోకు వచ్చి హైలైట్ అయినప్పుడు వారు చూపించిన ప్రేమ సడన్‌గా మాయమవడంతో తట్టుకోలేకపోయాను.నిజంగానే తిట్టారునా మీద పంచులు వేస్తూ కామెడీ చేసినప్పుడు నేను సరదాగానే తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే వాళ్లు నిజంగానే తిడుతున్నారని తెలిసిందో తట్టుకోలేకపోయాను. ఛీ, దేవుడా ఎందుకీ బతుకు ప్రసాదించావు.. అడుక్కునేవారి ఇంట్లో పుట్టినా బాగుండు కదా! డబ్బు, పేరు, అందరూ ఉన్నా సుఖం లేదు. ఇలాంటి జీవితం నాకు మళ్లీ రావొద్దని దేవుడిని కోరుకుంటాను. అసలు ఈ ఫీల్డ్‌కే రావొద్దు.కావాలనే పిలిచిఏడేళ్ల క్రితం నన్ను ఓ ఈవెంట్‌కు పిలిస్తే వెళ్లాను. నేనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని మరీ వెళ్లాను. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు కానీ నన్ను మాత్రం పిలవట్లేదు. నన్నెప్పుడు పిలుస్తారా? అని స్టేజీ వెనకాల ఓ గుడిసెలో కూర్చున్నాను. ఓ అమ్మాయి తను రెడీ అవడానికి అద్దం పట్టుకోమని అడిగింది. గంటసేపు తనకు అద్దం పట్టుకుని కూర్చున్నాను. ఆలస్యంగా అర్థమైందేంటంటే నన్ను కావాలనే పిలిచి అలా ఖాళీగా వెనక కూర్చోబెట్టారు. అప్పుడెంతో బాధపడ్డాను అని వర్ష కంటతడి పెట్టుకుంది.చదవండి: జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్

జాబిలమ్మ నీకు అంత కోపమా.. సినిమా రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రా జెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ (Nilavuku En Mel Ennadi Kobam) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా అనేది 24 కళలతో రూపొందేది. అంటే 24 కళలకు సంబంధించిన కళాకారులు ఓ సినిమా కోసం పని చేస్తారన్నమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మల్టీ టాలెంటెడ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. 24 కళలలో ఓ మూడు నాలుగు కళలు ఒక్కరే చేసేస్తున్నారు. అలా సినిమాలోని కొన్ని శాఖలను ఒక్కరే చేసి, ఓ సినిమాకి సింగిల్ కార్డుతో 80వ దశకంలోనే ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుగారు శ్రీకారం చూట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది.‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ అనేది ఓ తమిళ సినిమా. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అన్నది తెలుగు డబ్బింగ్ వెర్షన్. ప్రముఖ హీరో ధనుష్ తాను కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాను రాసిన కథకు తానే నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వం కూడా చేశారు. ఇది ఓ రకంగా రిస్క్ అనే చెప్పాలి. అయినా ఈ సినిమాని మాత్రం ఈ తరం యంగ్ జనరేషన్‌తో పాటు నిన్న, మొన్నటి తరాలకు కూడా నచ్చే విధంగా తీర్చిదిద్దారు ధనుష్. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులను కదలనివ్వదు. అంత ప్లెజెంట్‌గా ఉంటుంది.సినిమా టైటిల్ కూడా కొంటెగా పెట్టడంలోనే తెలిసిపోతుందీ సినిమా విషయం. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలో లభ్యమవుతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... ప్రభు ఓ మంచి చెఫ్. తన గర్ల్‌ఫ్రెండ్ నిలాతో విడిపోయిన తరువాత ప్రభు తల్లిదండ్రులు ప్రీతితో వివాహం నిశ్చయించి, సంబంధం కుదుర్చుకోవడానికి ప్రీతి ఇంటికి వస్తారు. ఆ సమయంలో ప్రీతికి నిలా కథ చెబుతాడు. నిలా, ప్రభు ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన పార్టీలో కలిసి ప్రేమలో పడతారు. ఓ అనుకోని సంఘటన వల్ల నిలాకి దూరమవుతాడు ప్రభు. దాంతో నిలాకి కోపమొచ్చి తండ్రి చూసిన సంబంధానికి తలూపుతుంది. నిలా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని స్నేహితులందరినీ గోవాకి పిలుస్తుంది. నిలా పెళ్లి ఆహ్వానం ప్రభుకి కూడా అందుతుంది. ప్రభు ఫ్రెండ్స్ అందరూ అతన్ని వారించినా నిలా పెళ్లికి వెళతాడు. తన మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్లిన ప్రభుకి అక్కడ ఎదురైన పరిస్థితులేంటి? తరువాత ప్రీతి పరిస్థితి ఏంటి? అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. ఇది చాలా సింపుల్ స్టోరీ. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నారు ధనుష్. ఈ సినిమాలోని పాత్రధారులంతా ఫ్రెష్‌గా అనిపించడంతో పాటు ప్రతి పాత్ర ప్రేక్షకులను కనువిందు చేస్తుందనే చెప్పాలి. హ్యాట్సాఫ్ టు ధనుష్. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు

రామాపురంలో సీతారాముల కథ
రాజేశ్ కొంచాడ, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన వింటేజ్ విలేజ్ ఎమోషనల్ లవ్ డ్రామా ‘కౌసల్య తనయ రాఘవ’(Kausalya Thanaya Raghava). స్వామి పట్నాయక్ దర్శకత్వంలో ఏఆర్ మూవీ మేకర్స్ పతాకంపై అడపా రత్నాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.‘‘ఈ నాటి ప్రసారంలో... రామాపురంలో సీతారాముల కథ..’, ‘ఈ సీత ప్రేమలో రాముడి పడితే..’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు వస్తుంది’’ అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజేశ్ అన్నారు. ‘‘మా సినిమాను థియేటర్స్‌లో చూసి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు స్వామి పట్నాయక్, రత్నాకర్.

ఖైదీ సీక్వెల్లో అమలాపాల్
కోలీవుడ్ నటుడు కార్తీ కథానాయకుడుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ఖైదీ. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రకాష్ బాబు, ఎస్సార్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. కాగా త్వరలో ఈ చిత్రానికి సీక్వల్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఖైదీ చిత్రాన్ని హిందీలో నటుడు అజయ్ దేవగన్ 'భోలా' పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, అక్కడ కూడా ఫర్వాలేదనిపించింది. తమిళం కార్తీ కథానాయకుడిగా నటించిన పాత్రను హిందీలో అజయ్ దేవగన్ పోషించారు. నరేన్ పాత్రలో నటి టబు కనిపించారు.అజయ్ దేవగన్ ఫిలిమ్స్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నటి అమలాపాల్ కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను బాలీవుడ్లో కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను యూనిట్ వర్గాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా 2009లో మలయాళంలో నీలతామర అనే చిత్రంలో కథానాయకిగా పరిచయమైన అమలాపాల్ తమిళంలో వీరశేఖరన్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అలా మలయాళం ,తమిళం, తెలుగు భాషల్లోనూ ప్రముఖ హీరోల సరసన కథానాయకగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు మనస్పర్ధల కారణంగా రెండేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలో నటించడం మొదలెట్టిన అమలాపాల్ అదేవిధంగా జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఒక పాప కూడా పుట్టింది. కాగా అమలాపాల్ నటించిన మలయాళ చిత్రం గోట్ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆమె తమిళంలో నటించి చాలా కాలమే అయ్యింది. కాగా తాజాగా బాలీవుడ్‌లోకి ఖైదీ2తో మరోసారి సందడి చేయనున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
క్రీడలు

ఫైనల్లో అభినాశ్
న్యూఢిల్లీ: వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నమెంట్లో భారత బాక్సర్ అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు) పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. బ్రెజిల్‌లోని ఫాజ్ డు ఇగాకు నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అభినాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో అభినాశ్ 5–0తో ఇటలీ బాక్సర్ మలంగపై ఏకపక్ష విజయం సాధించాడు. 22 ఏళ్ల అభినాశ్... ఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన యూరీ రెయిస్తో తలపడతాడు. ఐదుగురు జడ్జీల్లో నలుగురు జమ్వాల్‌కు ‘పర్ఫెక్ట్ 30’ పాయింట్లు ఇచ్చారు. మొదటి, మూడో రౌండ్లో అందరూ ఏకగ్రీవంగా అతనికే పాయింట్లు అందించడం విశేషం. మరో సెమీఫైనల్లో మనీశ్ రాథోడ్ ఓటమి పాలై కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 55 కేజీల సెమీస్‌లో మనీశ్ 0–5తో నూర్సుల్తాన్ అల్టిన్బెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. ఈ టోర్నీలో భారత బాక్సర్ హితేశ్ (70 కేజీలు) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా... జాదూమణి సింగ్ (50 కేజీలు), విశాల్ (90 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. 19 దేశాలకు చెందిన 130 మంది బాక్సర్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్లో... భారత్ నుంచి 10 మంది బరిలోకి దిగారు. అందులో నలుగురు బాక్సర్లు ఆరంభ రౌండ్లలోనే ఓడిపోగా... మరో నలుగురు కాంస్య పతకాలు సాధించారు.

సన్‌రైజర్స్ కోలుకునేనా!
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–2025లో తమ తొలి మ్యాచ్‌లో 286 పరుగులు చేసి రాజస్తాన్‌పై ఘనవిజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్‌ను ప్రారంభించింది. అయితే ఆ తర్వాత జట్టు ప్రదర్శన ఒక్కసారిగా పడిపోయింది. సొంత మైదానంలో లక్నో చేతిలో ఓడిన టీమ్...ఆపై వరుసగా ఢిల్లీ, కోల్‌కతా చేతుల్లో చిత్తుగా ఓడింది. ఇప్పుడు మళ్లీ హోం గ్రౌండ్‌కు చేరిన జట్టు వరుస ఓటముల నుంచి కోలుకోవాలని పట్టుదలగా ఉంది.నేడు జరిగే పోరులో గుజరాత్ టైటాన్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ఐపీఎల్లో అతి పెద్ద పరాజయాన్ని గత మ్యాచ్‌లో మూటగట్టుకున్న టీమ్‌ను మళ్లీ ముందంజలో నిలిపే బాధ్యత బ్యాటర్లపైనే ఉంది. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ చెలరేగితే భారీ స్కోరు సాధించవచ్చు. క్లాసెన్ మెరుగ్గానే ఆడుతున్నా... నితీశ్ రెడ్డి ఇంకా ఫామ్‌ను అందుకోలేదు. కమిందు మెండిస్ ఆల్‌రౌండ్ ఆట సానుకూలాశం. షమీ, కమిన్స్ బౌలింగ్‌లో మరింత ప్రభావం చూపించాల్సి ఉంది. బెంగళూరుపై చెలరేగిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు గుజరాత్ తరఫున తన సొంత ఊరిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. సుదర్శన్, గిల్, బట్లర్ తదితరులతో టైటాన్స్ బ్యాటింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది.

చెపాక్ మళ్లీ చేజారె...
చెన్నై: ఐపీఎల్లో తమకు కోటలాంటి చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ పట్టు చేజారిపోతోంది. 17 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో బెంగళూరు చేతిలో ఓడిన సూపర్ కింగ్స్... ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ చేతుల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన పోరులో క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీకి తోడు అభిõÙక్ పొరేల్ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులే చేసింది. విజయ్‌శంకర్ (54 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎమ్మెస్ ధోని (26 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. తొలి ఓవర్లోనే జేక్ ఫ్రేజర్ (0) వెనుదిరగ్గా...రాహుల్, పొరేల్ 54 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యంలో ఢిల్లీ కోలుకుంది. ముకేశ్ చౌదరి ఓవర్లో పొరేల్ వరుసగా 4, 6, 4, 4తో చెలరేగిపోగా, పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 51 పరుగులకు చేరింది. ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన రాహుల్ తొలి 20 బంతుల్లో 25 పరుగులే చేశాడు. ఆ తర్వాత ధాటిగా ఆడిన అతను తర్వాతి 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 పరుగులు సాధించాడు. పొరేల్ వెనుదిరిగిన తర్వాత అక్షర్ పటేల్ (14 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), సమీర్ రిజ్వీ (15 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కొద్ది సేపు రాహుల్‌కు అండగా నిలిచాడు. 33 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఒకే ఓవర్లో రాహుల్, అశుతోష్ (1) అవుటైనా...చివర్లో స్టబ్స్ (12 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు సాధించాడు. సమష్టి వైఫల్యం... ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. పిచ్ నెమ్మదిస్తూ పోవడంతో పరుగులు రావడంతో కష్టంగా మారిపోయింది. టాప్–6లో విజయ్‌శంకర్ మినహా అంతా విఫలమయ్యారు. ఆరు పరుగుల వ్యవధిలో రచిన్ (3), రుతురాజ్ (5) అవుట్ కాగా, కాన్వే (13) విఫలమయ్యాడు. ఆ తర్వాత 9 పరుగుల తేడాతో శివమ్ దూబే (18), రవీంద్ర జడేజా (2) కూడా వెనుదిరిగారు. ఆ తర్వాత విజయ్ బాగా నెమ్మదిగా ఆడగా, ధోని కూడా ప్రభావం చూపలేదు. తాను ఆడిన తొలి 31 బంతుల్లో విజయ్ ఒక్కటే ఫోర్ కొట్టగలిగాడు! వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 57 బంతుల్లో 84 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి) అశ్విన్ (బి) అహ్మద్ 0; రాహుల్ (సి) «ధోని (బి) పతిరణ 77; పొరేల్ (సి) పతిరణ (బి) జడేజా 33; అక్షర్ (బి) నూర్ 21; రిజ్వీ (సి) జడేజా (బి) అహ్మద్ 20; స్టబ్స్ (నాటౌట్) 24; అశుతోష్ (రనౌట్) 1; నిగమ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–0, 2–54, 3–90, 4–146, 5–179, 6–180. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–25–2, ముకేశ్ చౌదరి 4–0–50–0, అశ్విన్ 3–0–21–0, జడేజా 2–0–19–1, నూర్ అహ్మద్ 3–0–36–1, పతిరణ 4–0–31–1. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) అండ్ (బి) ముకేశ్ 3; కాన్వే (సి) పటేల్ (బి) నిగమ్ 13; రుతురాజ్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) స్టార్క్ 5; విజయ్‌శంకర్ (నాటౌట్) 69; దూబే (సి) స్టబ్స్ (బి) నిగమ్ 18; జడేజా (ఎల్బీ) (బి) కుల్దీప్ 2; ధోని (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–14, 2–20, 3–41, 4–65, 5–74. బౌలింగ్: స్టార్క్ 4–0–27–1, ముకేశ్ కుమార్ 4–0–36–1, మోహిత్ శర్మ 3–0–27–0, విప్రాజ్ నిగమ్ 4–0–27–2, కుల్దీప్ యాదవ్ 4–0–30–1, అక్షర్ పటేల్ 1–0–5–0. ధోని మళ్లీ అలాగే... ‘ధోని గతంలోలాగా ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయలేడు కాబట్టి కావాలనే ఆలస్యంగా వస్తున్నాడు’...చెన్నై కోచ్ ఫ్లెమింగ్ వివరణ ఇది. శనివారం తప్పనిసరి పరిస్థితుల్లో అతను 74/5 వద్ద 11వ ఓవర్ ఐదో బంతికే బ్యాటింగ్‌కు వచ్చాడు. 56 బంతుల్లో 110 పరుగులు చేయాల్సిన స్థితిలో అతనిపై పెద్ద బాధ్యత కనిపించింది. కానీ అతను భారీ షాట్లు ఆడలేక మళ్లీ అభిమానులను నిరాశపర్చాడు. 16 సింగిల్స్, 2 సార్లు రెండేసి పరుగులు తీసిన అతని బ్యాటింగ్‌లో ఆరు ‘డాట్‌బాల్స్’ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లు అతని తల్లిదండ్రులిద్దరూ ఈ మ్యాచ్‌కు హాజరు కావడం విశేషం! దాంతో అతని కెరీర్ ముగింపుపై మరోసారి చర్చ మొదలైంది.

రాయల్స్ ఘనవిజయం
మూల్లన్పూర్: తొలి రెండు మ్యాచ్‌లలో చక్కటి ఆటతో విజయాలు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్‌కు సొంత మైదానంలో ఆడిన మొదటి పోరులో ఓటమి ఎదురైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజస్తాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ సంజు సామ్సన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. జైస్వాల్, సామ్సన్ తొలి వికెట్‌కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఫెర్గూసన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు సహా 43 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్న పంజాబ్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. వధేరా, మ్యాక్స్‌వెల్ ఐదో వికెట్‌కు 52 బంతుల్లో 88 పరుగులు జత చేసి ఆశలు రేపినా... విజయానికి అది సరిపోలేదు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఫెర్గూసన్ 67; సామ్సన్ (సి) అయ్యర్ (బి) ఫెర్గూసన్ 38; పరాగ్ (నాటౌట్) 43; నితీశ్ రాణా (సి) మ్యాక్స్‌వెల్ (బి) యాన్సెన్ 12; హెట్‌మైర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) అర్ష దీప్ 20; జురేల్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–89, 2–123, 3–138, 4–185. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–1, యాన్సెన్ 4–0–45–1, ఫెర్గూసన్ 4–0–37–2, మ్యాక్స్‌వెల్ 1–0–6–0, చహల్ 3–0–32–0, స్టొయినిస్ 4–0–48–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్షి (బి) ఆర్చర్ 0; ప్రభ్‌సిమ్రన్ (సి) హసరంగ (బి) కార్తికేయ 17; శ్రేయస్ అయ్యర్ (బి) ఆర్చర్ 10; స్టొయినిస్ (సి) అండ్ (బి) సందీప్ 1; వధేరా (సి) జురేల్ (బి) హసరంగ 62; మ్యాక్స్‌వెల్ (సి) జైస్వాల్ (బి) తీక్షణ 30; శశాంక్ సింగ్ (నాటౌట్) 10; సూర్యాంశ్ (సి) హెట్‌మైర్ (బి) సందీప్ 2; యాన్సెన్ (సి) హెట్‌మైర్ (బి) తీక్షణ 3; అర్ష దీప్ (సి) హసరంగ (బి) ఆర్చర్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–11, 3–26, 4–43, 5–131, 6–131, 7–136, 8–145, 9–151. బౌలింగ్: ఆర్చర్ 4–0–25–3, యు«ద్వీర్ 2–0–20–0, సందీప్ శర్మ 4–0–21–2, తీక్షణ 4–0–26–2, కార్తికేయ 2–0–21–1, హసరంగ 4–0–36–1.
బిజినెస్

ఏఐలో ప్రయివేట్ పెట్టుబడులు గుడ్
న్యూయార్క్: వర్ధమాన దేశాలలో ఏఐ ప్రయివేట్ పెట్టుబడులకు 2023లో చైనా రెండో ర్యాంకును దక్కించుకోగా.. భారత్ టాప్–10గా నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ దేశాలలో ఏఐపై యూఎస్ అత్యధికంగా 67 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు వెచ్చించినట్లు వెల్లడించింది. గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్లో ఇది 70 శాతంకాగా.. తద్వారా యూఎస్ టాప్ ర్యాంకులో నిలిచినట్లు తెలియజేసింది. వర్ధమాన దేశాలలో చైనా 7.8 బిలియన్ డాలర్లు, భారత్ 1.4 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు కేటాయించినట్లు తెలియజేసింది. యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్(యూఎన్‌సీటీఏడీ) విడుదల చేసిన టెక్నాలజీ, ఇన్నోవేషన్ నివేదిక 2025లో ఈ వివరాలు తెలియజేసింది. 2033కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ విలువ 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వెరసి డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాలు కొన్ని ఆర్థిక వ్యవస్థలకే పరిమితమవుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా గ్లోబల్ ఆర్అండ్డీ కేటాయింపుల్లో యూఎస్, చైనా 40 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది.

ఫిన్‌టెక్ సంస్థలకు పెట్టుబడుల జోష్..
ముంబై: దాదాపు రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఫిన్‌టెక్ రంగంలోకి పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం 2025లో ఇప్పటివరకు వృద్ధి దశలో ఉన్న అంకుర సంస్థలు దాదాపు 550 మిలియన్ డాలర్లు సమీకరించాయి. మరికొన్ని డీల్స్ ముగింపు దశలో ఉన్నాయి. పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్, ఎపిస్, యాక్సెల్, మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్, ఎస్ఎంబీసీ గ్రూప్ లాంటి భారీ ఫండ్స్, ఫిన్టెక్లో భాగమైన వివిధ విభాగాల్లోని సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. నియంత్రణ నిబంధనలపరమైన అనిశ్చితి తగ్గడంతో రాబోయే రోజుల్లో ఫిన్‌టెక్ రంగంలో మరిన్ని డీల్స్ నమోదవుతాయని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ వర్గాలు తెలిపాయి. ఫిన్‌టెక్ రంగంలోకి 2023, 2024లో కేవలం 1.3 బిలియన్ డాలర్లు మాత్రమే రాగా.. తాజాగా ఈ ఏడాది తొలి నాళ్లలోనే అర బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు రావడం సానుకూల పరిస్థితులను సూచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి. వెల్త్టెక్కు ప్రాధాన్యం.. ఫండ్స్ పెట్టుబడుల్లో వెల్త్‌టెక్ విభాగానికి ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, పేమెంట్స్, బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల్లాంటి ఇతరత్రా విభాగాలకు కూడా గత మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో గ్రోత్ స్టేజ్ పెట్టుబడులు మెరుగ్గానే లభిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన క్యాష్‌ఫ్రీ సంస్థ ఫిబ్రవరిలో 43 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది. అలాగే, టోన్‌ట్యాగ్ అనే సౌండ్ ఆధారిత పేమెంట్స్ స్టార్టప్ 78 మిలియన్ డాలర్లు అందుకుంది. ఇక ఈజ్‌బజ్ అనే పేమెంట్ అగ్రిగేటర్ సంస్థలో బెస్సీమర్ వెంచర్ పార్ట్నర్స్ సారథ్యంలో ఇన్వెస్టర్లు 40 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. టోన్‌ట్యాగ్‌కు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దన్ను ఉంది. ఈ విభాగంలో వృద్ధి చాలా నెమ్మదిగా ఉండొచ్చు కానీ తాజా పరిణామాలతో వ్యాపారాలకు కాస్త స్థిరత్వం లభిస్తుందని ఓ వెంచర్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, ఫిన్‌టెక్ రంగంలో అంతర్గతంగా వెల్త్‌టెక్ విభాగం విస్తరణకు గణనీయంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటక్ చెర్రీ సీఈవో శ్రీకాంత్ సుబ్రమణియన్, ఐఐఎఫ్ఎల్ వెల్త్‌కి చెందిన సందీప్ జెత్వానీ వంటి ప్రముఖ వెల్త్ మేనేజర్ల సారథ్యంలోని సంస్థలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. పేటీఎం మనీ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ జాదవ్ నెలకొలి్పన ధన్ సుమారు 1.1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో దాదాపు 200 మిలియన్ డాలర్లు సమీకరించే యత్నాల్లో ఉంది. 2022లో ప్రారంభమైన స్టేబుల్ మనీ సంస్థ 130 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 20 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంటోంది. 2024 జూన్‌లో నిధులు సమీకరించినప్పటితో పోలిస్తే వేల్యుయేషన్ మూడు రెట్లు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి నియంత్రణ నిబంధనల విషయంలో స్పష్టత నెలకొనడమే ఈ విభాగంపై వెంచర్ క్యాపిటల్ సంస్థలకు ఆసక్తి పెరగడానికి కారణమని పలువురు ఇన్వెస్టర్లు వెల్లడించారు.

ఆఫీస్ స్పేస్‌లో గ్లోబల్ హవా..
న్యూఢిల్లీ: ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో గ్లోబల్ కార్పొరేట్ల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో విదేశీ సంస్థలు తొమ్మిది నగరాలవ్యాప్తంగా 111.60 లక్షల చ.అ. స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. మార్చి క్వార్టర్లో నమోదైన 180 లక్షల చ.అ. స్థలంలో ఇది సుమారు 62 శాతం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది ఇదే వ్యవధిలో 171 లక్షల చ.అ. లీజింగ్ నమోదైంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇటు దేశీ, అటు అంతర్జాతీయ సంస్థలు వ్యాపారాన్ని విస్తరిస్తుండటంతో లీజింగ్ కార్యకలాపాలు మరింతగా పుంజుకునే అవకాశం ఉందని సీబీఆర్ఈ చైర్మన్ (ఇండియా, ఆగ్నేయాసియా) అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టితో కంపెనీలు నాణ్యమైన ఆఫీస్ స్పేస్‌లను కోరుకుంటున్నందున, పర్యావరణహిత కార్యాలయాలకు డిమాండ్ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. జీసీసీలకు డిమాండ్.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు కూడా ఆఫీస్ స్పేస్‌కు దన్నుగా ఉంటోందని అన్షుమన్ తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన కోసం బహుళజాతి సంస్థలు స్థానికంగా నిపుణుల సేవలను వినియోగించుకోవడంపై ఆసక్తి కనపరుస్తుండటంతో జీసీసీలకు భారత్ చాలా వేగంగా గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని సీబీఆర్ఈ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రామ్ చంద్నానీ తెలిపారు. 2025లో మొత్తం ఆఫీస్ స్పేస్‌లో జీసీసీల వాటా సుమారు 35–40 శాతానికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, వివిధ రాష్ట్రాల్లో సానుకూల విధానాల కారణంగా చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయని వివరించారు. జీసీసీల విషయంలో అమెరికన్ కంపెనీలదే ఆధిపత్యం ఉన్నప్పటికీ, యూరప్, ఆసియా కంపెనీలు కూడా ఇక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నాయని రామ్ చంద్నానీ చెప్పారు. నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని పేర్కొ న్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ), టెక్నాలజీ రంగాల నుంచి ఇకపైనా డిమాండ్ గణనీయంగా కొనసాగుతుందని వివరించారు.తగ్గిన కో–వర్కింగ్ స్పేస్.. జనవరి–మార్చి త్రైమాసికంలో కో–వర్కింగ్ ఆపరేటర్లు.. ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకోవడం 43 శాతం తగ్గింది. తొమ్మిది ప్రధాన నగరాల్లో ఇది 21.6 లక్షల చ.అ.లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో కో–వర్కింగ్ ఆపరేటర్లు 37.6 లక్షల చ.అ. స్పేస్‌ను లీజుకు తీసుకున్నారు. కో–వర్కింగ్ సంస్థలు, ప్రాపర్టీ ఓనర్ల దగ్గర్నుంచి ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు తీసుకుని, దాన్ని క్లయింట్లకు సబ్–లీజుకు ఇస్తుంటాయి. ఉయ్‌వర్క్ ఇండియా, స్మార్ట్‌వర్క్స్, ఇన్క్యుస్పేజ్, సింప్లీవర్క్ ఆఫీసెస్, ఇండిక్యూబ్, లిస్టెడ్ సంస్థ ఆఫీస్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. కోవిడ్ అనంతరం కో–వర్కింగ్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగింది.

సిబ్బంది సేవలపై జీఎస్టీ తగ్గింపుతో ఆర్థిక వృద్ధి పెంపు
సిబ్బంది సేవలపై జీఎస్టీని తగ్గించడం అధికారిక ఉపాధికి, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తోందని అభిప్రాయపడుతోంది ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్. మన దేశం తన విస్తారమైన శ్రామికశక్తి సామర్థ్యాన్ని నిజంగా ఉపయోగించుకోవాలంటే, ముఖ్యమైన విధాన సంస్కరణలు చాలా కీలకమైనవి. కాంట్రాక్ట్ సిబ్బంది వంటి మెరిట్ ఆధారిత సేవలపై వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించడం అటువంటి ఒక సంస్కరణ అని స్పష్టం చేస్తోంది.కాంట్రాక్ట్ సిబ్బంది, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ వంటి లేబర్–ఇంటెన్సివ్ సెక్టార్లు ఉపాధిని సృష్టిలో కీలక పాత్ర పోషిస్తాయి, మిలియన్ల మందికి స్థిరమైన ఉద్యోగాలను అందిస్తూ వ్యాపారాలకు ఉపయుక్తంగా ఉండేలా చూసుకుంటాయి. అయితే, ఈ వీటికి ఒక ముఖ్యమైన అడ్డంకిని ఎదుర్కొంటున్నాయి అదే జీఎస్టీ. సిబ్బంది సేవలపై 18% వస్తు సేవల పన్ను (జిఎస్టీ) సంస్థలు ఉద్యోగులను అధికారికంగా నియమించుకోకుండా ఉండేందుకు కారణమవుతోంది. తద్వారాకార్మిక చట్టాలకి కట్టుబడి ఉండకుండా సామాజిక భద్రతా ప్రయోజనాలు అనధికారిక నియామక పద్ధతులను అవి ఎంచుకోవడానికి దారి తీస్తోంది.ఈ జీఎస్టీ రేటును 5 శాతానికికి తగ్గించడం వలన నియామక ఖర్చులు తగ్గుతాయి.. అంతేకాకుండా ఇది అధికారిక ఉపాధిని కూడా ప్రోత్సహిస్తుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎస్‌ఎమ్‌ఇలు) ప్రభావంతంగా పనిచేసేందుకు ఆర్థిక వృద్ధికి దారితీస్తూ మరింత దోహదం చేస్తుంది. ఈ మార్పు ఉద్యోగ కల్పనకు, ఉపాధిని క్రమబద్ధీకరించడానికి కార్మిక చట్టాలను నిజాయితీగా పాటించడానికి శక్తివంతమైన ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. వ్యాపారాలకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది, మరింత నిర్మాణాత్మకమైన జవాబుదారీతనం గల లేబర్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తుంది.భారత స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా అభిప్రాయం ప్రకారం,. కాంట్రాక్టు సిబ్బంది సేవలపై జీఎస్టీ రేటును తగ్గించడం అనే సంస్కరణ ద్వారా అనధికారిక రంగంలోని కార్మికులు సామాజిక భద్రత, న్యాయమైన వేతనాలు మెరుగైన పని పరిస్థితుల వంటి ప్రయోజనాలు పొందుతారు. ఈ సంస్కరణ భారతదేశంలో విస్తృత దృష్టితో స్థిరమైన సమగ్ర ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తుంది. ఆర్థిక వృద్ధి కార్మికుల హక్కులతో సమతుల్యం అవుతుంది.
ఫ్యామిలీ

అసహ్యించుకుంటూనే....చివరికి నటినయ్యా..!
రాయదుర్గం : మొదట్లో నేను నటిని కావాలనే ఆలోచననే అసహ్యించుకున్నా.. కానీ చివరకు నటిగా మారానని ప్రఖ్యాత నటి, నాటక కళాకారిణి రత్నపాఠక్‌షా స్పష్టం చేశారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘పాత్రలు, కథలను రూపొందించడం’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. అనంతరం తెలంగాణ పురాతన డోక్రా క్రాఫ్ట్ జ్ఞాపికను ఆమె ఆవిష్కరించారు. నేను కథకుల కుటుంబంలో పెరిగానని, కాబట్టి ఆ నైపుణ్యం నాకు సహజంగానే వచి్చందని, అందరిలా కాకుండా నేను భిన్నంగా ఉండాలని కోరుకున్నాని వివరించారు. మంచి స్క్రిప్ట్ రాయడం అంత సులభం కాదని, దీనికి ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉండాలని అన్నారు. సినిమాలతో పోలిస్తే థియేటర్ ఆర్ట్స్ ఒక సవాలుతో కూడిన పని అని గుర్తుచేశారు. డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ పునరుద్ధరణే లక్ష్యం.. చేతి వృత్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా 4వేల ఏళ్ళ పురాతన డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్‌ను పునరుద్ధ్దరించాలనేదే లక్ష్యం. మన సంప్రదాయాన్ని కాపాడుకోడమేకాదు, దానిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉషేగావ్, జామ్‌గావ్, కేస్లా గూడ నుంచి వచ్చిన చేతి వృత్తులవారితో కలిసి పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం. – ప్రతిభాకుందా, ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో

సీతారాముల కల్యాణం.. చూతము రారండీ..
శ్రీ సీతారాముల కల్యాణానికి నగరం నలుమూలలా ఉన్న రామాలయాలు ముస్తాబయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఆలయం ‘అమ్మపల్లి’ దేవస్థానం. ఏకశిలా రాతి విగ్రహంతో.. దశావతారంలో మకర తోరణం కలిగి శ్రీ సీతారామ లక్ష్మణులు ఇక్కడ కొలువయ్యారు. యేటా రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ శివారులోని అమ్మపల్లిలోని ఈ ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లు ప్రశస్థి. ఇక్కడి ఆలయ, ప్రాకారాల నిర్మాణాల గురించి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలూ లేకపోయినా.. అప్పటి నిర్మాణ శైలి, విగ్రహ రూపాలను బట్టి 18వ శతాబ్దం నాటివిగా పురావస్తు శాఖ అంచనా వేస్తోంది. నర్కూడలోని అమ్మపల్లి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో రెండు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, ధ్వజారోహణం నిర్వహించారు. ఆదివారం ఉదయం 11.49 గంటలకు స్వామి కల్యాణం జరుగనుంది. భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయం చుట్టూ క్యూలైన్లు, ఇతర ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.ఎత్తయిన ఆలయ గోపురం.. అమ్మపల్లి ఆలయానికి ఎత్తయిన గోపురం ప్రత్యేక ఆకర్షణ. సుమారు 80 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో ఈ గోపురం నిర్మితమైంది. ఆలయ గోపురం, ప్రాకారాలు చారిత్రక కళా నైపుణ్యాన్ని చాటి చెబుతాయి. ఆలయానికి ఈశాన్యంలో కోనేరు, వెనకాల మరో కోనేరు ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఎదురుగా ఉన్న మంటపంలో యేటా శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. మంటప సమీపంలో నగారా, రథశాల ఉన్నాయి. శ్రీరామ లింగేశ్వర, శ్రీ ఆంజనేయస్వామి ఉప ఆలయాలు ఉన్నాయి.గద్వాల్ సంస్థానం నుంచి విగ్రహాలు.. నిజాం దర్బార్‌లో వివిధ హోదాల్లో పని చేసిన రాజా భవానీ ప్రసాద్ భటా్నగర్ 1790లో దేవాలయం పనులను ప్రారంభించగా.. 1802లో విగ్రహ ఆవిష్కరణను కేరళకు చెందిన పూజారి వెంకటరమణాచారి, రాజా భవానీ ప్రసాద్‌ల నేతృత్వంలో గద్వాల్ సంస్థానం నుండి శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలను తీసుకొచ్చి అత్తాపూర్ రాంబాగ్‌లో విగ్రహా ప్రతిష్టాపన చేశారు. దీనికి మూడో నిజాం సికిందర్ జా ముఖ్య అతిథిగా హజరయ్యారు. నాటి నుంచి నేటి వరకూ వారి వారసులు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. 300 సంవత్సరాలు గల ఈ దేవాలయానికి భక్తులు అధికంగా వస్తుంటారు. భద్రాది రాములోరి కల్యాణం జరిగే సమయంలోనే అత్తాపూర్ రాంబాగ్ దేవాలయంలో అత్యంత వైభవంగా కల్యాణ ఉత్సవం ఆనవాయితీగా వస్తుంది.అత్తాపూర్ రాంబాగ్‌లో.. అత్తాపూర్ : అత్తాపూర్ రాంబాగ్‌లోని చారిత్రాత్మక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కల్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. ఇప్పటికే దేవాలయాన్ని రంగులు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ మహోత్సవం, 7న దశమి రోజున రథోత్సవంతో పాటు లంకా దహనం, 8న సీతారామలక్ష్మణులకు దోపుసేవ, 9న వీధి సేవతో పాటు చక్రతీర్థం వంటి కార్యక్రమాలతో ముగుస్తాయని పూజారి తిరుమల దేశభక్త ప్రభాకర్, శ్రీనివాస్‌లు వెల్లడించారు.

దర్గాలో సీతారామ కల్యాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని హజ్రత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ దర్గాలో సీతారాములకు శాస్తోక్త్రంగా కల్యాణం జరిపించడమే కాదు ఆ మరుసటి రోజు కోదండ రాముడికి ఘనంగా పట్టాభిషేకం కూడా చేస్తారు. ఇల్లెందు పట్టణానికి చెందిన సత్యనారాయణ ఈ దర్గాకు మాలిక్‌గా ఉన్నారు. 1960వప్రాంతంలో నాగుల్‌మీరా ఆయన కు కలలో కనిపించి సత్యనారాయణపురం సమీపంలోని అడవుల్లో తాను ఉన్నానని చె΄్పారు. అప్పటి నుంచి ఈ గుట్టపై ఓ చెట్టు కింద పుట్టలో కొలువై ఉన్న నాగుల్‌మీరాను ఆయన పూజించడంప్రారంభించారు. కాలక్రమంలో ముస్లింలతో పాటు హిందువులు, క్రిస్టియన్లు ఈ దర్గాకు రావడం మొదలైంది. 1972 నాటికి ఈ అడవిలో దర్గా వెలిసింది. గడిచిన పాతికేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ నుంచి కులమతాలకు అతీతంగా ఇక్కడికి భక్తులు రావడం మొదలైంది. ఈ క్రమంలో 2008లో కొందరు భక్తులు తమిళనాడు నుంచి సీతారాముల పంచలోహ విగ్రహాలను దర్గా ఆవరణలో ప్రతిష్టించి పూజించడంప్రారంభించారు. దర్గా ఆవరణలో ఒకవైపు మహ్మదీయ సంప్రదాయ ప్రకారంప్రార్థనలు నిర్వహిస్తూనే మరోవైపు హిందూ సంప్రదాయంలో శ్రీరాముడికి పూజలు చేసే ఆనవాయితీ మొదలైంది.నవమి కల్యాణంశ్రీరామనవమి సందర్భంగా నాగుల్‌మీరా దర్గా ఆవరణ లో తొలిసారిగా 2013లో శ్రీరాముడికి కల్యాణం, ఆ మరుసటి రోజు పట్టాభిషేకం జరిపించారు. వేదపండితులు శాస్తోక్త్రంగా ఈ వేడకలు నిర్వహించగా భక్తులు కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను కనులారా వీక్షించారు. హిందూ – ముస్లిం భాయి భాయి అనే స్ఫూర్తికి మరోసారిప్రాణప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి ప్రతి నవమికి ఇక్కడ కల్యాణం, పట్టాభిషేక వేడుకలను కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. పట్టాభిషేకం ప్రత్యేకంశ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆలయాల్లో శ్రీరాముడి కల్యాణం జరిపిస్తారు. అంతటితో వేడుకలు ముగిస్తారు. భద్రాచలం తరహాలోనే సత్యనారాయణపురం దర్గాలో కూడా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని తొమ్మిది మంది వేదపండితులు శాస్తోక్త్రంగా జరిపిస్తూ శ్రీరాముడికి కిరీటధారణ చేస్తారు.దమ్మక్క వారసుల తలంబ్రాలుపోకల దమ్మక్క అనే గిరిజన మహిళ తొలిసారిగా భద్రాచలంలో సీతారాములకు పూజాదికాలు నిర్వహించింది. భద్రాద్రి రాముడికి తొలిసారిగా పూజలు అందించిన పోకల దమ్మక్క వారసుల్లో కొందరు నవమి సందర్భంగా దర్గాలో జరిగే కల్యాణ తంతుకు తొలి తలంబ్రాలు పంపిస్తారు. అదే విధంగా సత్యనారాయణపురం గ్రామంలోని రామాలయంలో జరిగే శ్రీరాముడి కల్యాణానికి దర్గా నుంచి ముత్యాల తలంబ్రాలు పంపే విధానం కూడా మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఆలయప్రాంగణంలో శ్రీరాముడికి గుడిని నిర్మించాలని సంకల్పించారు. ఈ దర్గాప్రాంగణంలోనే చర్చి, మసీదు, గురుద్వారాలను కూడా నిర్మిస్తామని భవిష్యత్తులో సకల మతాల సమ్మేళనానికి ఈ దర్గాను వేదికగా మారుస్తామని ఇక్కడి భక్తులు అంటున్నారు.– సూరం శ్రావణ్‌రెడ్డి, సాక్షి, ఇల్లెందు రూరల్

వెండితెరకు మిస్టర్ భారత్
‘ఈ దేశం నీకేమిచ్చిందనేది కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అనేది చూడాలి’ అన్నారు నెహ్రూ. ‘జై జవాన్ జై కిసాన్ ’ అన్నారు లాల్‌బహదూర్ శాస్త్రి. ఈ దేశానికి ప్రధానులైన వారు ప్రజలను దేశం వైపు చూసేలా చేయగలిగారు. ఈ స్ఫూర్తిని సినిమా రంగంలో మొదటగా అందుకున్న హీరో మనోజ్ కుమార్ (Manoj Kumar). సినిమాల్లో తన పాత్రకు ‘భారత్’ అని పేరు పెట్టుకుని అందరి చేత ‘మిస్టర్ భారత్’ అనిపించుకున్నాడు. శుక్రవారం మరణించిన ఈ దేశభక్త నటుడికి నివాళి1974.‘రోటీ కపడా ఔర్ మకాన్’ రిలీజైంది. జనం మొదటిరోజు మొదటి ఆటకు వెళ్లారు. ఫస్ట్సీన్... జేబులో డిగ్రీ పెట్టుకుని రోడ్ల మీద బేకార్‌గా తిరుగుతున్న హీరో ఒకచోట ఆగిపోయాడు. కారణం... పోలీస్ ఒకతనిపై తుపాకీ ఎక్కుపెట్టి ‘చెప్పు... ఎవరు నువ్వు’ అని అడుగుతున్నాడు. ‘నేనా... ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ని’... ‘ఏం దొంగిలించుకుని వెళుతున్నావ్?’ ‘చూస్తావా...’ కోటు చాటున ఉన్న వస్తువు చూపించాడు. రొట్టె ముక్క.ఈ సీన్‌తోనే ఆనాటికి దేశంలో పేరుకొని పోయిన ఆకలిని, నిరుద్యోగాన్ని చూపించి ప్రేక్షకుల గుండెలను గట్టిగా చరుస్తాడు మనోజ్ కుమార్. ఆ తర్వాతి సీను కప్పుకోవడానికి గుడ్డలేని పేద స్త్రీలు... నిలువ నీడలేని నిరుపేద కూలివాళ్లు. దర్శకుడు తీసిన కథ తమ కష్టాల గురించే అని జనం అర్థం చేసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది.‘సినిమా అనేది సందేశాలివ్వడానికి కాదు అని కొందరు అంటారు... అనుకుంటారు. కాని నేను తీసేది మాత్రం ఏదో ఒక సందేశం (Message) ఇవ్వడానికి. సమాజం నుంచి ఎంతో పొందాం... బదులుగా మంచి మాట చెప్పడానికి ఏమిటి కష్టం’ అంటాడు మనోజ్ కుమార్.బాధ చూసినవాడు బహుశా బాధ్యతగా ఉంటాడు. పదేళ్ల వయసులో ఉండగా దేశ విభజన చూశాడు మనోజ్ కుమార్. నేటి పాకిస్తాన్లో ఉన్నా అబ్తాబాద్ నుంచి అతడి కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది. రెఫ్యూజీ క్యాంప్‌లో ఉంటూ చదువుకున్నాడు. ఆ కష్టాలను మర్చిపోవడానికి అప్పుడప్పుడు మేనమామ వచ్చి సినిమాకు తీసుకెళ్లేవాడు. పన్నెండేళ్ల మనోజ్ చూసిన మొదటి సినిమా ‘జుగ్ను’. ఇందులో దిలీప్ కుమార్ హీరో. సినిమా చివరలో చనిపోతాడు. తర్వాత మనోజ్ మరో సినిమా చూశాడు. ‘షహీద్’. ఇందులో కూడా దిలీప్ కుమార్ హీరో. సినిమాలో చనిపోతాడు. మనోజ్ చాలా విస్మయం చెంది ఇంటికొచ్చి తల్లిని అడిగాడు ‘అమ్మా.. ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు?’. ‘ఒకసారే’. ‘మరి రెండుసార్లు చనిపోతే?’... ‘అలాంటి వాళ్లు దేవదూతలై ఉంటారు’ అంది. ‘అంటే సినిమా హీరోకు మరణం లేదన్నమాట. నేను హీరోను అవుతాను. దిలీప్ కుమార్లాంటి హీరో’ అనుకున్నాడు మనోజ్ కుమార్. అంతే కాదు దిలీప్ కుమార్ నటించిన ‘షబ్నమ్’ చూసి అందులో దిలీప్ పేరు ‘మనోజ్’ అని ఉంటే ‘నేను పెద్దయ్యి హీరో అయ్యాక ఆ పేరే పెట్టుకుంటాను’ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే హీరో అయ్యాడు. అదే పేరుతో విఖ్యాతం అయ్యాడు. ఎంతగా అంటే అతని అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి (Harikrishna Giri Goswami) అని ఎవరికీ తెలియనంత!ఢిల్లీ నుంచి బాంబే వచ్చి సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు మనోజ్ కుమార్. వాళ్ల నాన్న కవి. ఇతనికి కూడా రాయడం వచ్చింది. కొన్నాళ్లు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాడు. సినిమాల్లో ‘ఎక్స్ట్రా’గా కూడా కనిపించాడు. దిలీప్ కుమార్‌ను ఇమిటేట్ చేస్తూ ఇతను చేస్తున్న నటన ఖరీదైన దిలీప్ కుమార్‌ను బుక్ చేసుకోలేకపోయేవారిని ఆకర్షించింది. మెల్లగా అవకాశాలు వచ్చాయి. 1960లో వచ్చిన ‘కాంచ్ కీ గుడియా’తో తొలిసారి హీరోగా కనిపించాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది. మరికొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో హీరో అవకాశాలు పొందడానికి డింకీలు కొడుతున్న ధర్మేంద్ర, శశి కపూర్లతో దోస్తీ కట్టి ఎక్కే స్టూడియో దిగే స్టూడియోగా ఉండేవాడు. ముగ్గురి జాతకం బాగుంది... ముగ్గురూ పెద్ద హీరోలయ్యారు. కాని మిగిలిన ఇద్దరి కంటే మనోజ్ ఎక్కువ నైపుణ్యాలు ప్రదర్శించాడు. నటుడు, రచయిత, ఎడిటర్, నిర్మాత, దర్శకుడు... అన్నింటికి మించి దేశభక్తి అనే అంశాన్ని సినిమాకు ఫార్ములాగా మార్చగలిగిన మేధావి అయ్యాడు.పెద్ద హీరోల రొమాంటిక్ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో డాన్స్ ఏ మాత్రం చేయలేని, లిమిటెడ్ బాడీ లాంగ్వేజ్ ఉన్న మనోజ్ కుమార్ సీరియస్ సబ్జెక్ట్స్ తనను గట్టెక్కిస్తాయని భావించాడు. భగత్సింగ్లాంటి కేరెక్టర్ తన ఇమేజ్ను పెంచుతుందని ఆ సినిమా చేయాలనుకున్నాడు. కాని భగత్ సింగ్‌కు సంబంధించి సినిమా తీసేంత సమాచారం ఆ రోజుల్లో లేదు. మనోజ్ కుమారే నాలుగేళ్లు తిరిగి సమాచారం సేకరించి కథ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 1965లో వచ్చిన ‘షహీద్’... భగత్ సింగ్ మీద వచ్చిన తొలి భారతీయ సినిమా. పెద్ద హిట్ అయ్యింది. అంతేకాదు ‘నర్గిస్‌దత్ జాతీయ పురస్కారం’ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సినిమాను చూశారు. మరుసటిరోజు టీకి ఆహ్వానించి మనోజ్‌తో ‘నేను జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చాను కదా. నువ్వు ఆ నినాదం పై సినిమా తీయరాదూ’ అని అడిగారు. దేశ ప్రధాని కోరిన కోరిక మనోజ్‌ను సూటిగా తాకింది. ఒక నోట్‌బుక్, పెన్ను పట్టుకుని ఢిల్లీలో రైలెక్కి ముంబైలో దిగేలోపు ‘ఉప్కార్’ స్క్రిప్ట్ రాశాడు. దర్శకుడు కావాలనే కోరిక అప్పటి వరకూ మనోజ్‌కు లేదు. కాని ప్రధానిని ఇంప్రెస్ చేసేలా సినిమా తీయాలంటే తానే దర్శకుడిగా మారక తప్పదు అనుకున్నాడు. అంటే ఒక ప్రధాని వల్ల దర్శకుడైన ఏకైన వ్యక్తి మనోజ్. భారతదేశంలో రైతుకు ప్రాధాన్యం ఇవ్వాలని, సైనికులకు బాసటగా నిలవాలని మనోజ్ తీసిన ‘ఉప్కార్’ అతణ్ణి అంబరంలో కూచోబెట్టింది. అవార్డుల రాసి పోసింది. ‘మేరే దేశ్ కీ ధర్తీ’ పాట జనాన్ని ఊపేసింది. సినిమాలో పాత్రకు పెట్టిన పేరు భారత్ (Bharat) మనోజ్ కుమార్ నిక్‌నేమ్ అయ్యింది. ‘మిస్టర్ భారత్’.పాశ్చాత్య సంస్కృతి చెడ్డది కాకపోయినా దానిని చెడ్డగా ఇమిటేట్ చేస్తున్న వారిపై ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ తీశాడు మనోజ్. మన సంస్కృతి మనకు ముఖ్యం అని చాటాడు. ఇక దేశంలో నిరుద్యోగం, యువకుల్లో పేరుకుపోతున్న అనిశ్చితి పై ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తీశాడు. నేటికీ ప్రభుత్వాలు ఈ మూడూ అందించడానికి ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. ఇక బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న చిన్న సంస్థానాల నుంచి వారిపై సాయుధ పోరాటం చేసిన వారి కథతో తీసిన భారీ చిత్రం ‘క్రాంతి’ సూపర్‌డూపర్ హిట్ అయ్యి భాష తెలియని ప్రాంతాల్లో కూడా పెద్ద కలెక్షన్లు రాబట్టింది. కార్మికుల సమస్యలతో ‘షోర్’ తీశాడు. చిరుద్యోగుల తరఫున ‘క్లర్క్’ తీశాడు. ఆకాంక్షలో స్వచ్ఛత, ప్రయత్నంలో శ్రమ ఉంటే విజయం వరిస్తుందనడానికి మనోజ్ కుమార్ జీవితం ఒక ఉదాహరణ. ఏ హీరోని అయితే చూసి హీరో అయ్యాడో ఆ దిలీప్ కుమార్‌తో ‘ఆద్మీ’లో నటించగలిగాడు మనోజ్ కుమార్. అదే దిలీప్ కుమార్‌ను డైరెక్ట్ చేసి ‘క్రాంతి’గా సూపర్‌హిట్ సాధించగలిగాడు. తగిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేక ముఖాన్ని చేతుల్లో దాచుకునే మేనరిజంతో ఫేమస్ అయిన మనోజ్‌ను అప్పుడప్పుడు కళాకారులు అదే మేనరిజంతో ఆటపట్టించడం కద్దు. షారూక్ ఖాన్ ‘ఓమ్ శాంతి ఓమ్’లో మనోజ్‌ను ఇమిటేట్ చేసి ఆయనకు కోపం తెప్పించాడు. పరువు నష్టం దావా వేసే వరకూ వ్యవహారం వెళ్లి తర్వాత సద్దుమణిగింది.చదవండి: అసహ్యించుకుంటూనే.. చివరికి నటినయ్యామనోజ్ కుమార్ నిజమైన దేశ ప్రేమికుడు. తన సినిమాల్లో అన్ని మతాల, వర్గాల వారి పాత్రలు సృష్టించి దేశమంటే మనుషులోయ్ అని చూపించినవాడు. నేటి హేట్ ఫిల్మ్స్ మధ్యలో మనోజ్ భావధార వెనుకబడ్డట్టు అనిపించిన అంతిమంగా గెలవబోయేది అదే. ఎందుకంటే విలువల వరుసలో మానవత్వం ముందు ఉండి తర్వాతే కదా మతం ఉండేది. సెల్యూట్ మిస్టర్ భారత్.హోమియోపతి డాక్టర్మనోజ్ కుమార్ మంచి హోమియోపతి డాక్టర్. అతనికి ఒకసారి చెంప మీద సర్పి వచ్చింది. అల్లోపతిలో ఎన్ని వైద్యాలు చేసినా పని చేయలేదు. నటుడికి ముఖాన సర్పి చాలా ప్రమాదం. ఆ సమయంలో మద్రాసులో షూటింగ్లో ఉండగా హోమియోపతిప్రాక్టీసు చేసే నటుడు అశోక్ కుమార్ (Ashok Kumar) ఒక డోస్ మందు వేశాడు. వారంలో సర్పి మాయమైంది. మనోజ్‌కు ఇది ఎంతగా ఆసక్తి రేపిందంటే అతడు హోమియోపతి డాక్టర్ల కంటే ఎక్కువగా హోమియోపతి (Homeopathy) చదివి ఆ వైద్యం ప్రాక్టీసు చేయడానికి సర్టిఫికెట్ పొందాడు. చాలామందికి హోమియోపతి వైద్యం చేశాడు.తెలుగు సినిమాల్లో మనోజ్ కుమార్మనోజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా తెలుగు సినిమాల్లో ఉన్నాడు. ఆయన తీసిన ‘ఉప్కార్’ తెలుగులో కృష్ణ హీరోగా ‘పాడిపంటలు’గా రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. మరో సూపర్‌హిట్ ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తెలుగులో శోభన్ బాబు హీరోగా ‘జీవన పోరాటం’ పేరుతో రీమేక్ అయ్యింది. హిందీలో అమితాబ్ వేసిన పాత్రను తెలుగులో రజనీకాంత్ చేశాడు. మనోజ్ కుమార్ నటించిన ‘ఓ కౌన్ థీ’ తెలుగులో జగ్గయ్య, జయలలిత కాంబినేషన్లో ‘ఆమె ఎవరు’గా వచ్చింది. ‘హిమాలయ్ కీ గోద్ మే’ శోభన్ బాబు హీరోగా ‘డాక్టర్ బాబు’గా వచ్చింది. ‘దస్ నంబరీ’ పెద్ద హిట్ కావడంతో ఎన్టీఆర్ (NTR) హీరోగా ‘కేడీ నంబర్ 1’ పేరుతో రీమేక్ చేశారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మగ మహారాజు’ సినిమాలో ఏడు రోజులు సైకిల్ తొక్కే సన్నివేశం ఒరిజినల్ మనోజ్ కుమార్ నటించిన ‘షోర్’లో ఉంది.మనోజ్ కుమార్ కన్నుమూతసుప్రసిద్ధ సినీనటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా వెన్నునొప్పితోనూ, వయసు సంబంధమైన ఇతర రుగ్మతలతోనూ బాధపడుతున్న మనోజ్‌కుమార్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. కునాల్, విశాల్. వీరిలో కునాల్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. దేశభక్తి సినిమాలతో ఖ్యాతి పొందిన మనోజ్‌కుమార్‌ను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి. షహీద్, ఉప్కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి తదితర సూపర్‌హిట్ సినిమాలు మనోజ్ దర్శకత్వంలో రూపొందాయి.
ఫొటోలు


విజయవాడలో సందడి చేసిన సినీ నటి హన్సిక (ఫొటోలు)


#SRHvsGT : సిరాజ్, గిల్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే (ఫొటోలు)


ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవం..డ్యాన్స్ లతో అదరగొట్టిన యవత (ఫొటోలు)


భద్రాచలం : కనుల పండువగా శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం (ఫొటోలు)


పిల్లలతో రాధిక సమ్మర్ వెకేషన్.. యష్ ఎక్కడ? (ఫోటోలు)


చంటి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)


బంగారపు బొమ్మలా యాంకర్ రష్మీ... ఆడియన్స్‌కి పండగే (ఫోటోలు)


చీరకట్టు అందాలతో రచ్చ చేస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఇమాన్వి ఫొటోలు


‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన ‘రెబా మోనికా జాన్’ (ఫొటోలు)


రష్మిక మందన్నా పుట్టినరోజు స్పెషల్.. ఎన్నో బర్త్డేనో తెలుసా (ఫోటోలు)
అంతర్జాతీయం

మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం
కొలంబో: మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శ్రీలంకకు చేరుకున్నారు. ఘన స్వాగతంలో భాగంగా.. కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద భారత ప్రధానికి గార్డ్ ఆఫ్ ఆనర్ దక్కింది. ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో మోదీ భేటీ కానున్నారు. కాగా, ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఇంధనం, రక్షణ, వాణిజ్య, డిజిటల్ ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. భారత్ సహకారంతో ఆ దేశంలోనూ పలు ప్రాజెక్టులు నిర్మాణం జరిగే అవకాశం ఉంది.మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారంశ్రీలంకలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీని ‘శ్రీలంక మిత్ర విభూషణ’ పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డు అందుకోవడానికి మోదీ అన్నివిధాల అర్హుడని అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అన్నారు. Glimpses from the ceremonial welcome in Colombo this morning.@anuradisanayake pic.twitter.com/88k2T1NN20— Narendra Modi (@narendramodi) April 5, 2025

కెనడాలో భారతీయుడి దారుణ హత్య
ఒట్టావా: కెనడాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు దుండగులు కత్తితో పొడిచి భారతీయుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారతీయుడి హత్యపై విచారణ వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. కెనడా రాజధాని ఒట్టావా సమీపంలోని రాక్లాండ్లో ఓ భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. కత్తితో పొడిచి అతడిని హత్య చేశారు. ఈ ఘటనపై కెనడాలో భారత రాయబార కార్యాలయం స్పందించింది. హత్య ఘటనపై విచారణ వ్యక్తం చేసింది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, కెనడా పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది. ఇక, ఈ ఘటనలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. We are deeply saddened by the tragic death of an Indian national in Rockland near Ottawa, due to stabbing. Police has stated a suspect has been taken into custody. We are in close contact through a local community association to provide all possible assistance to the bereaved…— India in Canada (@HCI_Ottawa) April 5, 2025

ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
వాషింగ్టన్: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్‌చుప్‌గా ఆసియా రీజియన్‌లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్‌లోని యూఎస్-బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా రన్‌వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్ సిగ్నల్స్ కూడా అందకుండా.. షెల్టర్‌లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్ రీజియన్‌లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్‌లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్ఎస్ నిమిట్జ్హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్, యెమెన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్‌ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్‌పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ వద్ద యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారీయర్‌ను, మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది.

పుతిన్ దాడులు ఆపాలంటే.. ఇదే కరెక్ట్ ప్లాన్: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా సైన్యం దాడిలో మరో 16 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అంశంపై జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపై అమెరికా ఇప్పటికైనా ఒత్తిడి పెంచాలి అని డిమాండ్ చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా వీడియాలో మాట్లాడుతూ.. రష్యా క్షిపణి దాడి తర్వాత ప్రస్తుతం క్రివీ రిహ్‌లో రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి, ఆరుగురు పిల్లలు సహా 16 మంది మరణించారు. ఖార్కివ్ లక్ష్యంగా చేసుకున్న రష్యన్ డ్రోన్ దాడి తర్వాత రోజంతా సహాయక చర్యలు కొనసాగాయి. ఆరు "షాహెద్" డ్రోన్లతో రష్యా సైన్యం ఉద్దేశపూర్వకంగా దాడి చేసింది. ఈ దాడులు ప్రమాదవశాత్తు జరగలేదు. రష్యా స్వయంగా అమెరికాతో కాల్పులు విరమణ గురించి చర్చించినప్పటికీ దాడులను కొనసాగిస్తోంది. కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్ పదేపదే ఉల్లంఘిస్తున్నారు.అందుకే రష్యాపై ఒత్తిడి చాలా అవసరం. రష్యాపై ఇంకా ఆంక్షలు విధించాలి. కాల్పుల విరమణకు సంబంధించి పుతిన్‌పై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తేనే రష్యా దాడులు చేయకుండా ఉండగలదు. మార్చి 11వ తేదీ నుంచి పుతిన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. చర్చల ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచాలి. అప్పుడే పుతిన్ దారిలోకి వస్తారు అంటూ చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరు దేశాల అధ్యక్షులతో ట్రంప్ చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ప్రయత్నించారు. Rescue operations are currently underway in Kryvyi Rih following a Russian missile strike. As of now, 16 people are confirmed dead, including six children. In Kharkiv, rescue efforts continued all day after a targeted Russian drone strike. A deliberate attack by six “Shahed”… pic.twitter.com/7TbgHQYfEI— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) April 4, 2025
జాతీయం

ఆ టీచర్ల కుటుంబాల్లో అంతా కన్నీటి వరదే
ఇది ఏ ఒక్కరి పరిస్థితో కాదు.. సుమారు 25 వేల మందికిపైగా ఉద్యోగస్తుల పరిస్థితి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. 2016 టీచర్ల నియమాకాల రద్దు టాపిక్.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఎంతో హాయిగా తమ జీవితాల్లోకి వెలుగొచ్చిందని అనుకుంటుండగానే వారి జీవితాల్లో చీకటి అలుముకుంది. టీచర్లగా ఉద్యోగాలు చేస్తూ సంఘంలో ఎంతో గౌరవంగా బతుకుతున్న వారి జీవితాలను కారు మబ్బు అలుముకుంది. తమ నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీచర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇలా ఉంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టీచర్ల కుటుంబాల్లో కన్నీటి వరదలే తారసపడుతున్నాయి.పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం తీర్పు ఇవ్వడంపై ఆ టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమాకాలు కలిపి 25 వేల 753 పోస్టులను చెల్లవంటూ సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన నేపథ్యంలో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ జీవితాలు ఇంతేనా.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎందుకిలా జరిగింది.. మాకే ఎందుకు ఇలా జరిగింది అంటూ మౌనంగా రోదిస్తున్నారు.2016లో టీచర్ గా నియమించబడ్డ రజత్ హల్దార్ మాట్లాడుతూ.. ‘ మాకు మాటలు రావడం లేదు. మేము అర్హత సాధించిన టీచర్లం. మాకు ఎటువంటి ఆరోపణలు లేవు. సుమారు 19 వేల మంది టీచింగ్ స్టాఫ్ పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ మమ్మల్ని వారు అనర్హులు అంటూ సుప్రీంకోర్టు ప్రకటించడంతో మాకు ఏమీ చెప్పుకోవాలో.. ఎవరి చెప్పుకోవాలో తెలయని స్థితిలో ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పుతో మాకు అన్యాయం జరిగింది. ఇది న్యాయబద్ధమైన తీర్పు కాదు. ఏ దర్యాప్తు సంస్థలు కూడా మా నియామకం చట్టబద్ధతలో జరగలేదని చెప్పలేదు. మేము ఎటువంటి తప్పు చేయలేదు’ అంటూ గద్గద స్వరంతో చెప్పుకొచ్చాడు.కాగా, వెస్ట్ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం మమతా సర్కారు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.

మావోయిస్టులకు అమిత్ షా సవాల్
ఛత్తీస్‌గఢ్: దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పాండుం ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ తాను దంతేశ్వరి మాత ఆశీస్సులు పొందానని.. వచ్చే నవరాత్రి నాటికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు. బస్తర్ గొప్ప గిరిజన సంస్కృతిని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అమిత్ షా అన్నారు.ఇదే వేదికపై నుంచి మావోయిస్టులకు ఆయన గట్టి సవాలు విసిరారు. బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు అమిత్‌షా పిలుపునిచ్చారు.మోదీ నుంచి తానొక సందేశం తెచ్చా.. వచ్చే ఏడాది దేశంలోని ప్రతీ గిరిజన జిల్లా నుంచి కళాకారులను ఒకే పేరుతో బస్తర్ పాండుం ఉత్సవాలకు తీసుకొస్తాం’’ అని అమిత్ షా ప్రకటించారు. బస్తర్ పాండుంకు అంతర్జాతీయ హోదా ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం ప్రపంచం నలుమూలల నుంచి రాయబారులను బస్తర్‌కు తీసుకువస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.#WATCH | Dantewada, Chhattisgarh: Union Home Minister Amit Shah says, "Now the time has gone when bullets were fired and bombs exploded here. I have come to request all those people who have weapons in their hands, all the Naxalite brothers, to give up their weapons. No one is… pic.twitter.com/A2j2oOC7El— ANI (@ANI) April 5, 2025

పూజలకు పీరియడ్స్ ఆటంకం, తప్పు జరిగిందంటూ..
నవరాత్రి వేడుకలను నిష్టగా ఆచరించేందుకు ఆ వివాహిత ఏడాదిగా ఎదురుచూస్తూ వచ్చింది. తీరా ఆ సమయం వచ్చేసరికి అందులో పాల్గొనలేకపోయింది. ఆ బాధతోనే మానసికంగా కుంగిపోయింది. తన బదులు ఆ పూజలు చేసేందుకు భర్త సైతం సిద్ధం అయ్యాడు. అయినా కాని ఆమె కోలుకోలేకపోయింది. చివరకు.. ఏకంగా ప్రాణమే తీసుకుంది!. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని పన్నా లాల్ గొల్లా కువాన్ ప్రాంతంలో ప్రియాంషా సోని(36).. భర్త ముఖేష్ సోనీ, పిల్లలు జాన్వి, మాన్విలతో కలిసి నివసిస్తుంది. అయితే, ప్రియాంషా సోనికి దుర్గాదేవి అంటే అపరామైన భక్తి. ప్రతి ఏడాది ఎంతో ఇష్టంగా నవరాత్రి వేడుకలు జరుపుకునేది. అలాగే, ఈసారి నవరాత్రి వేడుకలు నిర్వహించుకోవాలని అంతా సిద్ధం చేసుకుంది. భర్త ముఖేష్‌తో చెప్పి పూజకు కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకుంది.మార్చి 30వ తేదీన చైత్ర నవరాత్రి ప్రారంభమైంది. అయితే మొదటి రోజే ప్రియాంషాకి పీరియడ్స్ వచ్చింది. దీంతో ఆమె నవరాత్రి పూజల్లో పాల్గొనలేకపోయింది. ఏడాదిగా ఆ పూజ కోసమే ఎదురు చూసిన ఆమె.. నాటి నుంచి తీవ్రంగా కుంగిపోయింది. ఇది సహజంగా జరిగేదే అని భర్త ముఖేష్ సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ఆమె వినిపించుకోలేకపోయింది. బదులుగా తాను పూజలు చేస్తానని చెప్పినా వినలేదు. తప్పు జరిగిపోయిందంటూ ఏడుస్తూ ఉండిపోయింది. దీంతో పుట్టింట్లో అయినా ఆమె సంతోషంగా ఉంటుందని భావించి కొన్నాళ్లు ఉండమని దింపి వచ్చాడు. అయితే.. తల్లిదండ్రులు ఓదార్చిన ఆమె ఆ బాధ నుంచి బయటపడలేకపోయింది. ఈ బాధలోనే చనిపోవాలని విషం తాగింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి, చికిత్స కోసం ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. అయితే, ఇంటికి వచ్చాక ప్రియాంషా ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడి చికిత్స పొందుతూ, బుధవారం మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

Vadodara Case: ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
గాంధీనగర్: వడోదరా కారు ప్రమాదం కేసులో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడు రక్షిత్ చౌరాసియా తానేం మద్యం సేవించి బండి నడపలేదంటూ మొదటి నుంచి వాదిస్తున్నాడు. అయితే.. తాజాగా తేలింది ఏంటంటే అతను, అతని స్నేహితులు గంజాయి తీసుకుని కారు నడిపారని!.మార్చి 13వ తేదీన హోలీనాడు వడోదరా కరేలీబాగ్లోని అమ్రపాలి చౌరస్తాలో ఘోరం చోటు చేసుకుంది. 23 ఏళ్ల న్యాయ విద్యార్థి రక్షిత్ చౌరాసియా తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలు వాహనాలకు మీదకు దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురుకి గాయాలయ్యాయి. ఈ ఘటన అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యింది. అంతేకాదు.. ఘటన తర్వాత కూడా చౌరాసియా ఏదో మత్తులో జోగుతూ ‘‘ఇంకో రౌండ్.. ఇంకో రౌండ్.. ఓం నమఃశివాయ’’ అంటూ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో అతను మద్యం సేవించి బండి నడిపి ఉంటాడని అంతా భావించారు. అయితే ఆ వాదనను అతను, ఆ టైంలో అతనితో పాటు మరో ఇద్దరు స్నేహితులు తోసిపుచ్చుతూ వచ్చారు. ఘటన జరిగిన మరుసటిరోజే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతనిది ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌గా పోలీసులు ప్రకటించారు. అయితే కారు గుంతలో పడిపోయి ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నాయని.. అందువల్లే తనకేం కనబడక ఆ ప్రమాదం జరిగిందని రక్షిత్ వాదించాడు. కావాలంటే బాధిత కుటుంబాన్ని తాను పరామర్శించి.. పరిహారం అందజేస్తానంటూ ప్రకటించాడు. ఈ క్రమంలో.. వాళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ(FSL) 20 రోజుల తర్వాత ప్రాథమిక నివేదిక వెల్లడించింది. అందులో రక్షిత్ గంజాయి సేవించి ఉన్నారని తేలింది. దీంతో ఎడీపీఎస్( Narcotic Drugs and Psychotropic Substances) యాక్ట్ 1985 ప్రకారం పోలీసులు రక్షిత్‌తోపాటు అతని స్నేహితులపైనా కేసు నమోదు చేశారు. అలాగే.. రక్షిత్‌పై మోటార్ వెహికిల్స్ యాక్ట్‌లోని సెక్షన్ 185 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే రక్షిత్ వడోదరా సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అతని స్నేహితుడిని తాజాగా అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాని, అతని కోసం గాలింపు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.Law student's reckless driving during Holi celebrations leaves one dead, seven injured in Vadodara. Driver admits to consuming bhang before crash#VadodaraCrash #RoadSafety #DrunkDriving #HoliTragedy #GujaratNews #JusticeForHemali #RecklessDriving #TrafficAccident #StudentCrime pic.twitter.com/2y3SgdC78P— The Source Insight (@DSourceInsight) March 15, 2025
ఎన్ఆర్ఐ

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పొగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చివరకు ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి.. అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అభిషేక్ కొల్లి(Abhishek Kolli) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు. పదేళ్ల కిందట అభిషేక్ సోదరుడు అరవింద్‌తో కలిసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఏడాది కిందట వివాహం జరగ్గా భార్యతో పాటు అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తాళలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య.. చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, వలంటీర్లు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే చివరకు మరణాన్ని సోదరుడు అరవింద్ ఆదివారం ధృవీకరించారు. మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానంఅమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

Hyderabad : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల్లంతైన ఆరుగురు కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారి ఆచూకీ కనిపెట్టేందుకు బోయిన్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని విజయవాడ పంపించారు. ఆరుగురిలో ఒక్కరి వద్దే సెల్‌ఫోన్ ఉండగా అది కూడా స్విచ్చాఫ్ కావడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కొంత కష్టంగా మారినట్లు తెలుస్తోంది.బోయిన్‌పల్లికి చెందిన మహేశ్ తన భార్య ఉమ, ముగ్గురు పిల్లలు రిషి, చైతు, శివన్, మరదలు సంధ్యతో కలిసి ఈ నెల 1న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. రెండు రోజుల అనంతరం మహేశ్ బావమరిది బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలు పెట్టారు. మహేశ్ కుటుంబం 1వ తేదీన బోయిన్పల్లి నుంచి నేరుగా, ఇమ్లీబన్‌కు చేరుకుని అక్కడ విజయవాడకు వెళ్లే గరుడ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం విజయవాడలో దిగినట్లు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి పంప్‌హౌజ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్, తోటి ఉద్యోగులతో ముభావంగానే ఉండేవాడని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తీర్థయాత్రలకు వెళ్లి ఉండచ్చొని మహేశ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వీరి గల్లంతుకు గల ఇతరత్రా కారణాలు ఏవైనా ఉంటాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలిశాకే పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Banjara Hills: అడిగిన పాట వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా..
హైదరాబాద్ : తాను కోరిన పాటను ప్రసారం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ యువతి బెదిరించడంతో ఛానల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఓ టీవీ ఛానెల్ రోజూ మ్యూజిక్ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తుంది. ఓ యువతి ఈ కార్యక్రమానికి ప్రతిరోజూ ఫోన్ చేస్తూ ఒకే పాటను కోరుకుంటుంది.ఒకసారి ప్రసారం చేసిన తర్వాత కూడా మళ్లీ ఫోన్ చేసి అదే పాట కావాలంటూ పట్టుబడుతూ నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫోన్లో అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే బాగుండదంటూ హెచ్చరించేది. తాజాగా శనివారం ఫోన్ చేసిన ఆమె నేను కోరిన పాటను వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన టీవీ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పట్టపగలు యువతికి కత్తిపోట్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టపగలు ఇంటికెళ్లి యువతిపై ఒక దుండగుడు దాడిచేసి కత్తితో పొడిచిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. గరివిడి మండలంలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, 18 ఏళ్ల యువతికి నానమ్మ, తల్లిదండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటోంది. ఉదయం 9:30 గంటల సమయంలో ఇంటి వద్ద వంట పాత్రలు శుభ్రం చేస్తున్న యువతిపై ఓ యువకుడు ముసుగు (మంకీ క్యాప్) ధరించి వచ్చి దాడి చేశాడు. కత్తితో కడుపు పక్క భాగంలో రెండుచోట్ల పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు. ఇంటికి ఎదురుగానే ఉంటున్న బూర్లె ఆదినారాయణ అనే యువకుడే ఈ దాడికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఇందుకు కారణం. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్న నలుగురు యువకుల్లో ఆదినారాయణ కూడాఉన్నట్లు తెలిసింది. దెబ్బతిన్న కాలేయం, ఊపిరితిత్తులు తీవ్ర రక్తస్రావంతో ఘటన జరిగిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని స్థానికులు 108 వాహనంలో తొలుత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దాడిలో కాలేయం భాగం దెబ్బతిన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లోనూ రక్తస్రావం కావడంతో ఊపిరి తీసుకోవడానికి యువతి ఇబ్బందిపడుతోంది.బాధితురాలికి వైఎస్సార్సీపీ అండబాధితురాలికి అండగా ఉండాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్యలత ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య ఖర్చుల నిమిత్తం పార్టీ తరఫున యువతి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అండగా ఉంటామని చెప్పారు.

మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. అంతలోనే విషాదం
గండేపల్లి/జగ్గంపేట(కాకినాడ): మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. ఈ నేపథ్యంలో కొత్త దుస్తులు కొనుక్కుని.. ఎంతో ఆనందంగా తిరిగి వస్తున్న ఆ యువకుడిపై మృత్యువు కన్నెర్ర చేసింది. లారీ రూపంలో దూసుకువచ్చి, అతడి ఆయువు హరించేసింది. పెళ్లి చేసుకుని, కొడుకు, కోడలు చిలకాగోరింకల్లా తమ కళ్ల ముందు తిరుగుతూంటే చూసి మురిసిపోవాలనుకున్న కలలు కల్లలు కావడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతేలేకుండా పోయింది. ఈ విషాద ఘటన వివరాలివీ.. గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన చిక్కాల కాటమస్వామి, సావిత్రి దంపతులకు కుమార్తె, కుమారుడు చిక్కాల శ్రీను (28) ఉన్నారు. కుమార్తెకు గతంలోనే వివాహం చేశారు. శ్రీను ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి కాటమ స్వామి వ్యవసాయం చేస్తున్నారు. శ్రీనుకు గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన అమ్మాయితో ఈ నెల 20న వివాహం చేయాలని నిశ్చయించారు. శనివారం శ్రీను పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు, పెళ్లి వేడుకలకు అవసరమైన దుస్తులు కొనుగోలు చేసేందుకు స్నేహితుడితో కలిసి, శ్రీను శుక్రవారం మోటార్ సైకిల్‌పై పెద్దాపురం వెళ్లాడు. అక్కడ మిత్రులిద్దరూ కొత్త దుస్తులు కొనుకున్నారు. సాయంత్రం ఆనందంగా ఇంటికి తిరిగి వస్తూండగా, వారి బైక్‌ను జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పెట్రోల్ బంకు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీను (28) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మోటార్ సైకిల్‌పై ఉన్న స్నేహితుడు స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లింట పెను విషాదం శ్రీను పెళ్లి సమయం సమీపిస్తూండటంతో కుంటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే పెళ్లి దుస్తుల కోసం వెళ్లిన వరుడు శ్రీను రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే సమాచారంతో కుటుంబం తల్లడిల్లిపోయింది. పుట్టిన రోజు వేడుక, పెళ్లి సంబరాలతో ఆనందం నిండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. పరిసరాల్లో విషాదం నెలకొంది. అందరితోనూ స్నేహభావంతో ఉండే శ్రీను మృతి అందరినీ కలచి వేసింది.
వీడియోలు


వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం


పంజాబ్ పై రాజస్థాన్ ఘన విజయం


ఏపీలో అప్పు తోనే ఆర్థిక ఏడాది మొదలు


ఏఐ సాయంతో సృష్టించిన ఫేక్ వీడియోలపై రేవంత్ సర్కార్ సీరియస్


పరిటాల రవీంద్ర హత్యతో జగన్‌కు సంబంధం లేదు..


TJR Sudhakar : రాజధాని నిర్మాణం కోసం కుప్పలుగా అప్పులు తెచ్చి చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే


Surekha : కావాలనే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెడుతున్నారు ..


ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక మీటింగ్


వక్ఫ్ బిల్లుతో చంద్రబాబు ముస్లింలకు వెన్నుపోటు పొడిచారు : ఖాదర్ బాషా


శ్రీలంకలో మోదీకి ఘన స్వాగతం