Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

A Pro Palestinian Employee Interrupts Microsoft AI CEO At Company 50th Anniversary Celebration Video Viral1
'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్‌గేట్స్‌ ఎదుటే నిరసన (వీడియో)

శుక్రవారం జరిగిన 50వ మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇజ్రాయిల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందిస్తుండటాన్ని వారు వ్యతిరేకించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ 'ముస్తఫా సులేమాన్' ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఈ పరిణామ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ముస్తఫా సులేమాన్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఇబ్తిహాల్ అబౌసాద్ వేదిక వద్దకు వచ్చి ఆయన వ్యాఖ్యలకు అంతరాయం కలిగించారు. ముస్తఫా.. ఇది నీకు సిగ్గుచేటు. ఏఐను మంచి కోసం ఉపయోగిస్తున్నామని మీరు చెబుతున్నారు. కానీ గాజా ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందించి.. 50వేల మంది మరణానికి కారణమైంది. మైక్రోసాఫ్ట్ మారణహోమానికి సహాయం చేసిందని అన్నారు.నేను మీ మాటలు వింటున్నాను, థాంక్యూ అంటూ.. ఆమె మాటలకు ముస్తఫా స్పందించారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, సీఈఓ సత్య నాదెళ్ల, మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్ఇబ్తిహాల్ అబౌసాద్ నిరసన తెలిపిన తరువాత.. మరో ఉద్యోగి వానియా అగర్వాల్ కూడా నీరసం తెలిపారు. మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో వీరు నిరసన తెలిపినందుకు వారు తమ వర్క్ అకౌంట్ యాక్సెస్ కోల్పోయినట్లు సమాచారం. బహుశా వారిని ఉద్యోగంలో నుంచి తొలగించి ఉండొచ్చని తెలుస్తోంది.An employee disrupted Microsoft’s 50th anniversary event to protest its use of AI.“Shame on you,” said Microsoft worker Ibtihal Aboussad, speaking directly to Microsoft AI CEO Mustafa Suleyman. “You are a war profiteer. Stop using AI for genocide. Stop using AI for genocide in… pic.twitter.com/cfub3OJuRv— PALESTINE ONLINE 🇵🇸 (@OnlinePalEng) April 4, 2025

IPL 2025 CSK vs DC: Toss Playing XIs Scores Updates And Highlights2
CSK vs DC: రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

IPL 2025 CSK vs DC Updates: ఐపీఎల్‌-2025లో భాగంగా శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చెపాక్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది.రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ6.5: జోరు మీదున్న పోరెల్‌కు జడేజా చెక్‌ పెట్టాడు. జడ్డూ బౌలింగ్‌లో పతిరణకు క్యాచ్‌ ఇచ్చి అతడు 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అక్షర్‌ పటేల్‌ క్రీజులోకి రాగా.. రాహుల్‌ 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 54/2 (6.5) పవర్‌ ప్లే ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 51/1 (6)పోరెల్‌ 32, రాహుల్‌ 19 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 32/1రాహుల్‌ 8, పోరెల్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 20/1 (2) ముకేశ్‌ బౌలింగ్‌లో చితక్కొట్టిన అభిషేక్‌ పోరెల్‌. 0,4, 6, 4, 4, 1. రాహుల్‌ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తొలి ఓవర్లో ఒక్క పరుగు.. ఒక వికెట్‌ఖలీల్‌ అహ్మద్‌ చెన్నై బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు. తొలి నాలుగు బంతులను డాట్‌ చేసిన ఖలీల్‌... ఐదో బంతికి మెగర్క్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి బంతికి అభిషేక్‌ పోరెల్‌ ఒక పరుగు చేశాడు. ఢిల్లీ స్కోరు: 1-1 (1)రుతు సారథ్యంలోనేఈ మ్యాచ్‌కు చెన్నై రెగ్యులర్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ దూరమయ్యాడని.. అతడి స్థానంలో మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని నాయకుడిగా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే, గాయం నుంచి కోలుకున్న రుతు మైదానంలో అడుగుపెట్టడం గమనార్హం.ఫాఫ్‌ లేడుమరోవైపు.. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌.. తొలుత బ్యాటింగ్‌ చేయనున్నట్లు తెలిపాడు. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ వికెట్‌ స్లోగా మారే అవకాశం ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో కూడా తాము ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. దురదృష్టవశాత్తూ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఫిట్‌గా లేడని.. అందుకే అతడి స్థానంలో సమీర్‌ రిజ్వీ తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.తుదిజట్లుచెన్నైరచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్‌), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముకేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌శివం దూబే, జేమీ ఓవర్టన్‌, షేక్‌ రషీద్‌, కమలేశ్‌ నాగర్‌కోటిఢిల్లీజేక్ ఫ్రేజర్-మెగర్క్, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్‌), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌ముకేశ్‌ కుమార్‌, కరుణ్‌ నాయర్‌, దర్శన్‌ నాల్కండే, డొనోవాన్‌ ఫెరీరా, త్రిపురాణ విజయ్‌

YS Jagan Anantapur Visit Confirmed Check Details Here3
వైఎస్‌ జగన్‌ అనంతపురం పర్యటన ఖరారు

అనంతపురం, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అనంతపురం(Anantapur) జిల్లా పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు బలైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి శనివారం ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరిటాల వర్గీయుల చేతిలో ఉగాది నాడు వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌(YS Jagan).. బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు. తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య కుటుంబ సభ్యులు జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో త్వరలో వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చారు.వైఎస్‌ జగన్‌ పర్యటన వేళ.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైఎస్సార్‌సీపీ కీలక నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Union Home Minister Amit Shah Visit To Dantewada District4
మావోయిస్టులకు అమిత్‌ షా సవాల్‌

ఛత్తీస్‌గఢ్: దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పాండుం ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ తాను దంతేశ్వరి మాత ఆశీస్సులు పొందానని.. వచ్చే నవరాత్రి నాటికి ఎర్ర బీభత్సం అంతం కావాలన్నారు. బస్తర్ గొప్ప గిరిజన సంస్కృతిని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అమిత్‌ షా అన్నారు.ఇదే వేదికపై నుంచి మావోయిస్టులకు ఆయన గట్టి సవాలు విసిరారు. బస్తర్‌ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు అమిత్‌షా పిలుపునిచ్చారు.మోదీ నుంచి తానొక సందేశం తెచ్చా.. వచ్చే ఏడాది దేశంలోని ప్రతీ గిరిజన జిల్లా నుంచి కళాకారులను ఒకే పేరుతో బస్తర్ పాండుం ఉత్సవాలకు తీసుకొస్తాం’’ అని అమిత్‌ షా ప్రకటించారు. బస్తర్ పాండుంకు అంతర్జాతీయ హోదా ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం ప్రపంచం నలుమూలల నుంచి రాయబారులను బస్తర్‌కు తీసుకువస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.#WATCH | Dantewada, Chhattisgarh: Union Home Minister Amit Shah says, "Now the time has gone when bullets were fired and bombs exploded here. I have come to request all those people who have weapons in their hands, all the Naxalite brothers, to give up their weapons. No one is… pic.twitter.com/A2j2oOC7El— ANI (@ANI) April 5, 2025

Operation Cheyutha: 86 Maoists surrender to police in Telangana5
భద్రాద్రి కొత్తగూడెం: భారీగా దళ సభ్యుల లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. శనివారం కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది దళ సభ్యులు లొంగిపోయారు. వీళ్లంతా బీజాపూర్, సుక్మా జిల్లా దళ సభ్యులుగా తెలుస్తోంది. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి.. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తాం.. అంటూ ఆపరేషన్‌ చేయూతను చేపట్టింది పోలీస్‌ శాఖ. ఈ కార్యక్రమం కింద.. లొంగిపోయిన ప్రతి సభ్యుడికి ఇవాళ రూ. 25 వేల చెక్కును ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అప్పగించారు.లొంగిపోయిన వాళ్లలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డంకిగా మారారు. పైగా మావోయిస్టు పార్టీ పేరుతో కొందరు బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. తక్షణమే ఆ పనిని ఆపాలి. గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యుల లొంగిపోయారు. గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 203 మంది లొంగిపోగా.. మరో 66 మందిని అరెస్ట్‌ చేశాం అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగ జిల్లా ఎస్పీ శబరీష్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.కిందటి నెలలోనూ ఆపరేషన్‌ చేయూతకు విశేష స్పందన లభించింది. ఒకేరోజు 64 మంది దళ సభ్యులు లొంగిపోయారు. ఇదిలా ఉంటే.. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్ట్‌ రహిత భారత్‌కు కేంద్ర హోం శాఖ పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో గత నాలుగు నెలల్లో 100 మందికి పైగా మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌లలో భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ క్రమంలో తాము శాంతి చర్చలకు సిద్ధమని, అవసరమైతే కాల్పుల విరమణ పాటిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు ఓ లేఖ రాశారు.

Hardik Pandya Last Over Strategy Backfires vs LSG Akash Ambani Reaction Viral6
MI Vs LSG: ఏం చేస్తున్నావ్‌ హార్దిక్‌?!​.. ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం!

ఐపీఎల్‌-2025 (IPL 2025) సీజన్‌ను పరాజయంతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిన హార్దిక్‌ సేన.. ఆ తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలోనూ పరాజయం పాలైంది.ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గెలుపుతో విజయాల బాట పట్టిందనుకుంటే.. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ ముందు తలొగ్గింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంత్‌ సేన చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో.. లక్ష్య ఛేదనలో భాగంగా ముంబై నాయకత్వ బృందం తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి.విజయానికి ఇరవై నాలుగు పరుగుల దూరంలో ఉ‍న్న సమయంలో బ్యాటర్‌ తిలక్‌ వర్మ ( Tilak Varma- 23 బంతుల్లో 25)ను రిటైర్డ్‌ అవుట్‌గా వెనక్కి పిలిపించారు. అతడి స్థానంలో హార్దిక్‌ పాండ్యాకు జతగా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ సాంట్నర్‌ క్రీజులోకి వచ్చాడు. Batting at 25 off 23 in the run chase, #TilakVarma retired himself out to make way for Mitchell Santner! 🤯Only the 4th time a batter has retired out in the IPL!Watch LIVE action ➡ https://t.co/nH2UGjQY0t #IPLonJioStar 👉 #LSGvMI, LIVE NOW on Star Sports 1, Star Sports 1… pic.twitter.com/NJ0C0F8MvL— Star Sports (@StarSportsIndia) April 4, 2025పరుగు తీసేందుకు నిరాకరణఇక ఆఖరి ఓవర్లో ముంబై గెలుపునకు 22 పరుగులు అవసరమైన సమయంలో .. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ తొలి బంతికే సిక్సర్‌ బాదాడు. దీంతో ముంబై శిబిరంలో జోష్‌ కనిపించింది. అయితే, ఆ తర్వాత ఆవేశ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. రెండో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు ఈ పేస్‌ బౌలర్‌. అయితే, మూడో బంతికి సింగిల్‌ తీసే అవకాశం ఉన్నా పాండ్యా మాత్రం అందుకు నిరాకరించాడు.ఈ క్రమంలో మూడో బంతికి ముంబై పరుగులేమీ రాబట్టలేకపోగా.. నాలుగో బంతి కూడా డాట్‌ అయింది. అప్పటికే ముంబై పరాజయం దాదాపుగా ఖరారు కాగా.. ఐదో బంతికి హార్దిక్‌ సింగిల్‌ తీసి.. సాంట్నర్‌ను క్రీజులోకి పంపాడు. ఆఖరి బంతికి సాంట్నర్‌ పరుగులేమీ రాబట్టలేదు. ఫలితంగా పన్నెండు పరుగుల తేడాతో ముంబైకి పరాజయం తప్పలేదు. ఆకాశ్‌ అంబానీ ఆగ్రహంఅయితే, తిలక్‌ వర్మను కాదని ‘హిట్టింగ్‌’ కోసమని సాంట్నర్‌ను పంపిన ముంబై వ్యూహం బెడిసికొట్టగా.. సాంట్నర్‌కు స్ట్రైక్‌ ఇచ్చేందుకు హార్దిక్‌ నిరాకరించడం జట్టు యజమాని ఆకాశ్‌ అంబానీకి కోపం తెప్పించింది. ఆఖరి ఓవర్‌ మూడో బంతికి హార్దిక్‌ చేసిన పనికి ఆకాశ్‌ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది.మరోవైపు.. ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి లక్నో విజయం దాదాపు ఖరారు కాగా.. లక్నో ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చప్పట్లు కొడుతూ అతడు విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోగా.. మరోవైపు ఆకాశ్‌​ మాత్రం తమ సభ్యులతో సీరియస్‌గా చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.ఐపీఎల్‌-2025:లక్నో వర్సెస్‌ ముంబైలక్నో స్కోరు: 203/8 (20)ముంబై స్కోరు: 191/5 (20)ఫలితం: 12 పరుగుల తేడాతో ముంబైపై లక్నో గెలుపు.చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్‌MI Owner Akash Ambani reaction When Hardik Pandya on 19.3 Balls not takes the Single.#LSGvsMI pic.twitter.com/BCznQ7fc5J— Vikas Yadav (@VikasYadav69014) April 4, 2025

IAF PilotSiddharth YadavFiancee Breaks Down Next To His Coffin7
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్‌ భార్య

జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన IAF పైలట్ సిద్ధార్థ్ యాదవ్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. క్లిష్టమైన సమయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి, తోటి పైలట్‌ను, అనేక మంది పౌరులను కాపాడిన సిద్దార్థ్‌ యాదవ్‌కు యావద్దేశం సంతాపం ప్రకటించింది. ఆయన త్యాగం, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నయనాలతో సెల్యూట్‌ చెబుతున్నారు. త్రివర్ణ పతాకం కప్పి, పూర్తి సైనిక గౌరవాలతో మజ్రా భల్ఖిలోని ఆయప స్వగ్రామంలో ఏప్రిల్ 4న అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో సిద్ధార్థకకు కాబోయే భార్య సోనియా యాదవ్ అతని శవపేటిక పక్కనే కుప్పకూలిపోయింది. పెళ్లి బారాత్‌లో ఆనందంగా ఊరేగి వెళ్లాల్సిన బిడ్డకు, అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడం కన్నతల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ ఈ జెట్ ప్రమాదంలో మరణించడానికి కేవలం పది రోజుల ముందు సోనియా యాదవ్‌తో నిశ్చితార్థం జరిగింది. నవంబరు 2న అంగరంగవైభంగా ఈ జంటకు పెళ్లిచేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగి ఉండగా ఊహంచని విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది. ఫైటర్‌జెట్‌ ప్రమాదంలోమరణించిన సిద్దార్థ్‌ పార్ధివ దేహాన్ని స్వగ్రామానికి తరలించి, గౌరవ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే భార్య సోనియా సిద్దార్థ శవపేటిక పక్కనే కూలిపోయింది. ఇదీ చదవండి: మొన్ననే ఎంగేజ్‌మెంట్‌, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంభోరున విలపిస్తూ అంతులేని శోకంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కుడన్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. సిద్ధార్థ్ యాదవ్ శవపేటికను కౌగిలించుకుని ‘‘వస్తానని చెప్పావు కదా బేబీ...రానేలదు ("బేబీ తు ఆయా నహీ...తునే కహా థా మై ఆవుంగా’’) అంటూ విలపించిన తీరు అందర్నీ కలిచివేసింది. కన్నీళ్లు ఆపుకోవడం అక్కడున్న ఎవ్వరి తరమూ కాలేదు. పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు , ఇతర అధికారులు సిద్ధార్థ్‌కు వీడ్కోలు పలికారు.Such incidents breaks down the hearts of many. My 🙏🙏🙏 to the family members of #SiddharthYadav I don't understand the story. Technical Snag, and a fighter jet and 2 pilot down. Technical efficacy of the Aero Engineers must improve. Loss can't be adjusted. pic.twitter.com/YXkdeSG5zU— Little Somesh 🇮🇳 1729 (@shankaravijayam) April 4, 2025

AP CID In Delhi Plan To Arrest YSRCP MP Mithun Reddy8
ఎంపీ మిథున్‌ రెడ్డి అరెస్టుకు కుట్ర.. ఢిల్లీకి ఏపీ సీఐడీ

సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి సర్కార​్‌ పాలనలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి అరెస్ట్‌కు ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి.మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ​వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నాయి. మరోవైపు.. మిథున్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్‌ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

HIT 3: Do You Know These 8 Heroes Are To Act In HIT 8 Movie9
హిట్‌ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌ అని తేడా లేకుండా సీక్వెల్స్‌ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్‌ అయితే అదే లైన్‌తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్‌ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్‌తో కొత్త ట్రెండ్‌ని సెట్‌ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్‌.నేచురల్‌ స్టార్‌ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్‌’ ఫస్ట్, సెకండ్‌ కేస్‌లు రెండూ కమర్షియల్‌ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్‌ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్‌’ లో విశ్వక్‌ సేన్, ‘హిట్‌ 2’ లో అడివి శేష్, ‘హిట్‌ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.అయితే ‘హిట్‌’ సిరీస్‌ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్‌ వెల్లడించింది కాబట్టి ‘హిట్‌ 4’ ‘హిట్‌ 5’ ‘హిట్‌ 6’ ‘హిట్‌ 7’ ‘హిట్‌ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్‌ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్‌ క్రియేట్‌ చేయాలని టీమ్‌ యోచిస్తోందని సమాచారం. హిట్‌ 1 నుంచి ‘హిట్‌ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్‌ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్‌ చేస్తారని అంటున్నారు.నిజానికి హిట్‌ ‘హిట్‌ 2’లో నాని కనిపించినట్టే హిట్‌ 3లో హీరో అడివి శేష్, విశ్వక్‌సేన్‌ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్‌ మాత్రం స్పెషల్‌ రోల్‌ చేస్తున్నాడు కానీ, విశ్వక్‌సేన్‌ మాత్రం లేకపోవడానికి కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్‌ సేన్‌ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్‌ ను మాత్రమే తీసుకుంటారట. అయితే హిట్‌ 2లో చేసినట్టే... క్లైమాక్స్‌ లో ‘హిట్‌ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్‌ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్‌ 4’లో హీరో గా చేయనున్నారంటూ కొన్ని వార్తలు హల్‌చల్‌ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన తమిళ హీరో కార్తీ ‘హిట్‌ 4’ లో హీరోగా ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్‌ చేసే విధంగా ‘హిట్‌ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్‌ప్రైజ్‌ కోసం సీక్రెసీ మెయిన్‌టైన్‌ చేస్తుందా? చూడాలి.

 KSR Comments On Chandrababu Over Schemes In AP10
చంద్రబాబు కొత్త రాగం.. ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ ఇదేనేమో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కొత్తపాట ఎత్తుకున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నొక్కిన బటన్లు అన్నీ తామిస్తున్న పెన్షన్‌తో సమానమని వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ ఇదే కావచ్చు. ఏం చెబుతున్నానన్న దానితో నిమిత్తం లేకుండా చెప్పుకుంటూ పోవడమే ఆయన నైజంగా కనిపిస్తోంది ఇలాంటివి చూస్తూంటే. చంద్రబాబు తాలూకూ గొప్పలు ఇంకొన్నింటి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి.ఒక కుటుంబానికి లేదా కొన్ని కుటుంబాలకు రూ.నాలుగు వేల చొప్పున ఇచ్చే పెన్షన్ల పంపిణీ చేయడానికి ఆయన లక్షలు ఖర్చు చేయడానికి వెనుకాడరు. అంతేకాదు.. ఈ నెల మొదటి తేదీన చంద్రబాబు పర్యటనలో మరో విచిత్రమూ కనిపించింది. తన సభకు రావాలని ఆయన దారిలో కనిపించిన వారినల్లా కోరుకున్నారు. దేశంలో మరే ముఖ్యమంత్రికి ఇలాంటి రికార్డు ఉండదేమో. ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లడం తప్పు కాదు కానీ పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు చిన్న, పెద్ద కార్యక్రమాలన్నింటికీ హెలికాఫ్టర్ వేసుకుని రాష్ట్రం అంతటా పర్యటించడం మాత్రం అంత హర్షణీయమైన విషయం కాదు.వృద్ధాప్య ఫించన్లున్ల పంపిణీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ దశాబ్దాలుగా సాగుతున్న విషయమే. గత ఎన్నికల్లో ఇచ్చిన అనేకానేక హామీలను ఎగ్గొట్టిన బాబుగారు ఫించన్‌ మొత్తాన్ని వెయ్యి రూపాయలైతే పెంచారు. అయితే, పెంచిన మొత్తాన్ని పంపిణీ చేసేందుకు నెల నెలా ముఖ్యమంత్రి వెళ్లడం ఏమిటో? హెలికాప్టర్‌ ఖర్చుతోపాటు సీఎం పర్యటన ఖర్చులు తడిసి మోపెడవుతాయి. సూపర్‌ సిక్స్‌ ఎగ్గొట్టిన విషయాన్ని మరపించేందుకు ఇలా చేస్తున్నారేమో మరి!.వైఎస్‌ జగన్ హయాంలో వలంటీర్లు మాత్రమే ఫించన్లు పంపిణీ చేసేవారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ప్రతినెల ఒకటవ తేదీన తెల్లవారుజామునే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేవారు. ఇది వృద్ధులకు ఎంతో సౌకర్యంగా ఉండేది. జగన్‌కూ మంచి పేరు తెచ్చింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం ముగిసేనాటికి ఫించన్ల మొత్తం రూ.రెండు వేలు ఉంటే, జగన్ ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ రూ.మూడు వేలకు తీసుకెళ్లారు. అది కూడా ఇంటివద్దే అందేది. అంతకుమునుపు మాదిరిగా మండల కార్యాలయాల చుట్టూ లేదా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన ఖర్మ వృద్ధులకు తప్పింది. ఇలాంటి సువ్యవస్థితమైన వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలు చెడగొట్టాయి. జగన్‌కు మంచిపేరు రాకూడదన్న ఉక్రోశంతో వలంటరీ వ్యవస్థలపై అవాకులు చెవాకులు మాట్లాడారు.అయితే, జనం నుంచి వచ్చిన నిరసన చూసిన తరువాత మాటమార్చారు. తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని కూడా నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాటలోనే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లయితే ఇస్తున్నారు కానీ.. కొన్నిచోట్ల ఇది సరిగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఫించన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా బాపట్ల జిల్లాలో చంద్రబాబు చేసిన ప్రసంగం అందరిని నివ్వరపోయేలా చేస్తుంది. జగన్ ను ఉద్దేశించి గతంలో బటన్లు నొక్కేవారని, ఆ బటన్లు అన్నీ కలిపి తామిచ్చే ఫించన్లకే సమానం అని కొత్త అసత్యాన్ని సృష్టించారు. మొత్తం 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రంలో ఇలా ఇవ్వడం లేదని తన గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి జగన్ టైమ్‌లో ఫించన్ల సంఖ్య 66 లక్షలకు చేరింది. ఇప్పుడు రెండు లక్షలు తగ్గింది.2019 వరకు చంద్రబాబు టైమ్‌లో అందిన ఫించన్లు సుమారు 44 లక్షల మందికే. ఇప్పుడు పెరిగిన పెన్షన్లు అన్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారన్నమాట. అప్పట్లో బటన్‌లు నొక్కితే ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత తాను అంతకన్నా ఎక్కువ బటన్లు నొక్కుతానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చేశారు. అయినా జగన్ కన్నా సంక్షేమానికి తానే ఎక్కువ మొత్తం ఇస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడానికి యత్నించారు. జగన్ టైమ్ కన్నా రూ.వెయ్యి ఎక్కువ ఇస్తే, ప్రభుత్వానికి అయ్యే అదనపు వ్యయం సుమారు 640 కోట్లే. మరి దీంతోనే జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం అందించినట్లు ఎలా అవుతుంది?. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఏభై ఏళ్లకే ఫించన్‌ ఇస్తామని ఇచ్చిన హామీ గురించి మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మాట్లాడరు.జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రూ.ఏభై వేల కోట్ల స్కీములకు అమలు చేశారు. చంద్రబాబు యథాప్రకారం వీటిపై అసత్యాలను ప్రచారం చేసి వచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అట. గత ప్రభుత్వం నుంచి పది లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీ కట్టాలట. ఇవి ఎంత నిజమో ఇప్పటికే ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలియచేసింది. జగన్ టైమ్‌లో కరోనా రెండేళ్లు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించినా, ఏ నెలా జీతాలు ఆపలేదు. ఇప్పుడేమో జీతాలకు డబ్బులు లేవంటున్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయినప్పుడు ప్రభుత్వ ఖజానాలో కేవలం వంద కోట్లే మిగిల్చి వెళ్లారు. కానీ, 2024లో జగన్ ప్రభుత్వం తప్పుకునే నాటికి ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలున్నాయి. పోనీ, చంద్రబాబు చెప్పినట్లు పది లక్షల కోట్ల అప్పు ఉందని అనుకున్నా, దానిలో ఆయన 2014-19 మధ్య చేసిన అప్పు ఎంత? 2024లో అధికారంలోకి వచ్చాక చేసిన అప్పు ఎంత? విభజన ద్వారా వచ్చిన అప్పు వాటా ఎంత? అన్నది చెప్పకుండా మొత్తం జగన్ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది చంద్రబాబే, బడ్జెట్లో అది ఆరున్నర లక్షల కోట్లేనని తేల్చిందీ చంద్రబాబు ప్రభుత్వమే. అయినా పది లక్షల కోట్ల అప్పు అని అబద్దాలు చెబుతున్నది ఆయనే. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటికే లక్ష ముప్పై వేల కోట్లకు పైగా అప్పు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది చంద్రబాబే. 14 లక్షల కోట్ల అప్పు ఉందంటూనే, తాను అధికారంలోకి వస్తే అప్పు చేయకుండా సంపద సృష్టించి పేదలకు స్కీములు అమలు చేస్తానని బొంకింది కూటమి పెద్దలే కదా!. ఇప్పుడేమో ఆరున్నొక్క రాగం ఆలపిస్తున్నది వారే. అంతేకాక అమరావతి రాజధానిని నిర్మించడం ద్వారా సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమం అందిస్తానని ఈ విడత చెప్పారు. అంటే ఏమిటి దీని అర్ధం. ఇప్పట్లో సూపర్ సిక్స్ అమలు చేయనని అనడమా?. అదే టైమ్ లో మేలో కొన్ని స్కీములు అమలు చేస్తామని అంటారు.ఈ సభకు అంతా రావాలని దారిలో కనిపించిన వారినల్లా కోరుతూ ముఖ్యమంత్రిగా ఆయన మరో సంప్రదాయం నెలకొల్పారు. ప్రజలు తన సభకు రావడం లేదనో, లేక వచ్చినా వెళ్లిపోతున్నారనో ఇలా దండోరా వేసినట్లుగా చెప్పి ఉండాలి. అలా వచ్చిన వారిలో ఒక యువకుడు తన అర్జీని ఇవ్వబోతే మాత్రం అతనిని వేరే రాజకీయ పార్టీ వ్యక్తి అని, అతని సంగతి తమ వాళ్లు చూసుకుంటారని బెదిరించడం ఏమిటో అర్థం కాదు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వ కాలం పూర్తి అయ్యే సరికి ప్రజలు ఇంకెన్ని అసత్యాలను వినాలో!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement