
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థినులు ఆకలి కేకలు జాతీయ రహదారిపై ప్రతిధ్వనించాయి.
తాము ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి సుమారు 650 మంది విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో గంటన్నరపాటు యూనివర్సిటీలోకి రాకపోకలు స్తంభించిపోయాయి.
– రాజానగరం
జీతాల కోసం ‘108’ ఆందోళన
ప్రభుత్వం 108 ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని చిత్తూరు జిల్లా పుంగనూరులో బుధవారం నిరసన తెలిపారు. పుంగనూరులోని ఏరియా ఆస్పత్రి వద్ద 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, మోకాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యోగేష్ మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు ఇవ్వాలని కోరారు.
– పుంగనూరు