మస్క్ కీలక నిర్ణయం.. ఏఐ స్టార్టప్‌కు X అమ్మకం! | Musk Merges His AI Company With X | Sakshi
Sakshi News home page

మస్క్ కీలక నిర్ణయం.. ఏఐ స్టార్టప్‌కు X అమ్మకం!

Published Sat, Mar 29 2025 8:40 AM | Last Updated on Sat, Mar 29 2025 9:55 AM

Musk Merges His AI Company With X

టెక్‌ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్‌ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్‌ Xను అమ్మకానికి ఉంచారు. అయితే ఆ కొనుగోలు చేస్తున్న కంపెనీ కూడా ఆయనదే కావడం గమనార్హం. 

మస్క్‌ ఆధీనంలోని కంపెనీలలో ఒకటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ఎక్స్ఏఐ'.. సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్‌ ప్లాట్‌ఫారమ్‌ను సొంతం చేసుకుంది. రెండు కంపెనీలు ఏకీకృతమైనట్లు.. మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

రెండు సంవత్సరాల క్రితం స్థాపించినప్పటి నుంచి.. xAI వేగంగా ప్రపంచంలోని ప్రముఖ AIలలో ఒకటిగా మారింది. X అనేది సోషల్ మీడియా దిగ్గజం. ఇక్కడ 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. ఇది కూడా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కంపెనీలలో ఒకటిగా రూపాంతరం చెందింది. కాగా ఇప్పడు ఈ సంస్థను ఎక్స్ఏఐ సొంతం చేసుకుంది. ఎక్స్ఏఐ, ఎక్స్ భవిష్యత్తులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మస్క్ పేర్కొన్నారు.

ఎక్స్ఏఐ, ఎక్స్ కలయిక ఏఐ సామర్థ్యం పెంపొందించడానికి దోహదపడుతుంది. వినియోపగదారులకు గొప్ప అనుభవాలను అందించడానికి సంస్థ కృషి చేస్తోందని మస్క్ అన్నారు. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని కూడా వేగవంతం చేయడానికి ఉపయోగపడే వేదికను నిర్మించడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు.

ఈ కంపెనీలు అన్నీ స్టాక్లతో కూడిన ఒప్పందంలో విలీనం చేయబడుతున్నాయి. ఎక్స్ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లు కాగా.. ఎక్స్  విలువ 33 బిలియన్ డాలర్లు. రెండు కంపెనీ కలయికతో 113 బిలియన్ డాలర్ల సంస్థ అవతరించింది.

ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం

నిజానికి 2022 చివరలో మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన లావాదేవీల్లో అప్పు కూడా ఉందని తెలుస్తోంది. ఆ మరుసటి సంవత్సరమే ఎక్స్ఏఐ ప్రారంభమైంది. ఇప్పుడు ఏఐలో ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement