
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (Whatsapp) ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేదా కొత్త ఫీచర్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే మరికొన్ని కొత్త ఫీచర్స్ అందించడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్స్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ నుంచే కరెంట్ బిల్, టెలిఫోన్ బిల్ వంటివన్నీ కట్టేయొచ్చని తెలుస్తోంది.
భారతదేశంలో ఆర్ధిక సేవలను ప్రారంభించడానికి మెటా యోచిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ వాట్సాప్ యాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, LPG గ్యాస్ చెల్లింపులు, నీటి బిల్లులు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లులు, అద్దె చెల్లింపులు చేయడానికి వీలుగా తగిన ఫీచర్స్ ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి కొంతమంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్స్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మెటా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత బిల్స్ చెల్లించడానికి ఇతర యాప్స్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే చాలామంది.. ఇన్స్టెంట్ మెసేజింగ్ కోసం వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ పేమెంట్స్ లేదా బిల్లింగ్స్ కోసం ఇతర యాప్స్ మీద ఆధారపడుతున్నారు. అయితే వాట్సాప్‌లో బిల్స్ చెల్లించడానికి కావలసిన ఫీచర్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ప్రత్యేకించి బిల్స్ పే చేయడానికి ఉపయోగించే యాప్స్ అనవసరం అవుతాయి. కొత్త ఫీచర్స్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. వినియోగంలోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని సమాచారం.