
సాక్షి, ముంబై: దేశీయంగా ఇంధన ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు (ఫిబ్రవరి 11, గురువారం) పెట్రోల్ , డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్ ధరను 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఈ తాజాపెంపుతో దేశవ్యాప్తంగా మెట్రోలలో ధరలు కొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి. దీంతో వాహనా దారుల్లో అలజడి మొదలైంది. (Petrol Diesel Prices: కొనసాగుతున్న పెట్రో సెగ)
ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు
ఢిల్లీలో పెట్రోలు రూ. 87.85 డీజిల్ రూ. 78.03
ముంబైలో పెట్రోలు రూ. 94.36 రూ. 84.94
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .89.16డీజిల్ ధర రూ .81.61
చెన్నైలో పెట్రోల్ ధర రూ .90.18 డీజిల్ ధర రూ . 83.18
బెంగళూరులో పెట్రోల్ రూ.90.78 డీజిల్ రూ.82.72
హైదరాబాదులో పెట్రోల్ ధర రూ. 91.35, డీజిల్ ధర రూ. 85.11
అమరావతిలో పెట్రోల్ రూ. 93.99, డీజిల్ రూ. 87.25
మరోవైపు ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.