Petrol Diesel Price Hike News Today: పెట్రో వాత : త్వరలో 150 రూపాయలకు? - Sakshi
Sakshi News home page

పెట్రో వాత : త్వరలో 150 రూపాయలకు?

Published Thu, Feb 18 2021 8:10 AM | Last Updated on Thu, Feb 18 2021 1:06 PM

  Today Petrol and diesel prices  - Sakshi

వరుసగా పదో రోజు పెరిగిన ఇంధన ధరలు. లీటరుకు పెట్రోల్‌పై 35పైసలు, డీజిల్ ధరలు 32-34 పైసలు చొప్పున పెంపు

సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. వరుసగా పదవ రోజు కూడా పెరిగిన ధరలు వాహనదారులకు  చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల భారంపై  వారి గుండెలు బేజారవుతున్నాయి. తాజాగా పెట్రోలుపై 35 పైసలు, డీజిల్‌పై 32-34 పైసల చొప్పున భారం పెరిగింది.  దీంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.  రోజుకు 30 పైసల చొప్పున పెట్రోలు ధర పెరుగుతూ పోతే, మరో ఆరు నెలల్లో లీటరుకు 150 రూపాయలకు చేరే అవకాశం ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లోని  కొన్ని ప్రాంతాల్లో  పెట్రో బాదుడు సెంచరీ దాటేసిన సంగతి తెలిసిందే. మరోవైపు హద్దే లేకుండా పెరుగుతున్న ధరలపై  ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.   (పెట్రో బాదుడు : రూ.100 దాటేసింది)

దేశం రాజధాని నగరం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.89.88కు చేరగా, డీజిల్ ధర రూ. 80.27గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.32 వద్ద రికార్డు స్థాయికి చేరింది. డీజిల్ ధర రూ. 87.32 గా ఉంది.

పలు నగరాల్లో  పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు
హైదరాబాద్‌ పెట్రోల్ ధర రూ.93.45 డీజిల్ ధర రూ.87.55
అమరావతి పెట్రోలు ధర రూ. 96.03, డీజిల్‌ ధర రూ. 89.60

కొలకత్తాలో పెట్రోల్ ధర రూ. 91.11, డీజిల్ ధర రూ.83.86
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 91.98,  డీజిల్ ధర రూ.85.31
బెంగుళూరులో  పెట్రోల్ ధర రూ. 92.89, డీజిల్ ధర రూ. 85.09

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement