
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) చెప్పినట్లుగానే తన వాహన ధరలను పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 8 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్నఇన్‌పుట్ ఖర్చులు, ఇతర మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగానే ధరలను పెంచడం జరిగిందని కంపెనీ స్పష్టం చేసింది.
మారుతి సుజుకికి తన గ్రాండ్ విటారా అన్ని వేరియంట్ల ధరలను గరిష్టంగా రూ. 62,000 వరకు పెంచింది. ఈకో రూ. 22500, వ్యాగన్ఆర్ రూ. 14000, ఎర్టిగా రూ. 12500, ఫ్రాంక్స్ రూ. 2500, డిజైర్ రూ. 3000 పెంపును పొందాయి. ఏప్రిల్ 8 తరువాత ఈ కార్లు కొత్త ధరల వద్ద అందుబాటులో ఉంటాయి.
2024-25 ఆర్ధిక సంవత్సరంలో మారుతి సుజుకి సేల్స్
2024–2025 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఇండియా మొత్తం అమ్మకాలు 2,234,266 యూనిట్లుగా నమోదయ్యాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన మొత్తం అమ్మకాల (2,135,323 యూనిట్లు) కంటే 4.63 శాతం ఎక్కువ. ఈ ఏడాది మొత్తం దేశీయ అమ్మకాలు 17,60,767 యూనిట్లు కాగా.. మిగిలినవి ఎగుమతులు.
ఇదీ చదవండి: ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు నిషేధించిన కర్ణాటక హైకోర్టు: డెడ్‌లైన్ ఫిక్స్