‘అటల్‌ సేతు’ నిర్మాణం కోసం ఉపయోగించిన టెక్నాలజీ ఇదే! | Top 7 Technologies Used In Atal Setu Bridge Inauguration In Mumbai | Sakshi
Sakshi News home page

‘అటల్‌ సేతు’ నిర్మాణం కోసం ఉపయోగించిన టెక్నాలజీ ఇదే!

Published Fri, Jan 12 2024 6:30 PM | Last Updated on Fri, Jan 12 2024 8:35 PM

Top 7 Technologies Used In Atal Setu Bridge Inauguration In Mumbai - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ‘అటల్‌ బిహారీ వాజ్‌పేయి సేవరి- నవ శేవ అటల్ సేతు’ వంతెనను ప్రారంభించారు. ఈ వంతెనను రూ.17,480 కోట్లతో నిర్మించారు. 21.8 కిలోమీటర్ల 6 లేన్ల పొడవుతో 16.5 కిలోమీటర్లు సముద్రం మీద, 5.5 కిలోమీటర్లు భూమిపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జిగా చరిత్రకెక్కింది. డిసెంబర్‌  2016 లో ఈ బ్రిడ్జికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.  

ఇక ఈ వంతెన నిర్మాణంలో ఉపయోగించిన టెక్నాలజీ కారణంగా భారత్‌ను ప్రపంచ పటంలో నిలుపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అతి తక్కువ ఐదేళ్ల కాలంలో పూర్తయిన ఈ బ్రిడ్జి వినియోగంతో కనెక్టివిటీ, రవాణాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని రవాణా సంబంధిత పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా బ్రిడ్జిని నిర్మించే సమయంలో వినియోగించిన​ టెక్నాలజీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే

ఆటల్‌ సేతు ప్రత్యేకతలు : 



భూకంపాలనే నిరోధించేలా :
వంతెన భూకంపాలను నిరోధించేలా టెక్నాలజీని వినియోగించారు. ఇది 6.5 రిక్టర్ స్కేల్ వరకు తీవ్రతతో వివిధ రకాల భూకంపాలను తట్టుకోలగలదు. 

రివర్స్ సర్క్యులేషన్ రిగ్స్: సౌండ్, వైబ్రేషన్‌లను తగ్గించడానికి వినియోగించిన టెక్నాలజీ  సముద్ర జీవులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

శబ్ధాన్ని తగ్గిస్తూ : వంతెనలో నాయిస్ సైలెన్సర్‌లు, శబ్ద ప్రభావాన్ని తగ్గించడానికి టెక్నాలజీని ఉపయోగించారు. 
  
ఎకో-ఫ్రెండ్లీ లైటింగ్: వంతెనపై లైటింగ్ సిస్టమ్ జల పర్యావరణానికి అంతరాయం కలగకుండా రూపొందించబడింది.

టోల్ క్యూలు లేవు: ఎంటీహెచ్‌ఎల్‌ ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది, ఇది టోల్‌ల వద్ద పొడవైన క్యూల సమస్యను పరిష్కరిస్తుంది. అధునాతన స్కానర్‌లు వాహనాన్ని స్కాన్ చేయగలవు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ వసూలు అవుతాయి.  తద్వారా వాహనాల  నిరీక్షణ సమయం తగ్గుతుంది. 

డిస్‌ప్లేలు: డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి వంతెన నిర్దిష్ట వ్యవధిలో డిస్‌ప్లేలు ఉన్నాయి. వారి మార్గంలో ట్రాఫిక్ జామ్‌లు లేదా ప్రమాదాల గురించి వారికి సమాచారం అందుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement