ప్రత్యేక ఆఫర్‌ను ఆమోదించిన ‘జీతం లేని ఆఫీసర్‌’! | Zomato introduced a special offer for its Gold membership program approved by chief of staff | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ఆఫర్‌ను ఆమోదించిన ‘జీతం లేని ఆఫీసర్‌’!

Published Sun, Dec 1 2024 5:55 PM | Last Updated on Sun, Dec 1 2024 5:56 PM

Zomato introduced a special offer for its Gold membership program approved by chief of staff

జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం ‘స్పెషల్‌ వీకెండ్‌ ఆఫర్‌’ను ప్రవేశపెట్టింది. అందుకు చీఫ్‌ ఆఫ్‌ స్టాప్‌ ఆమోదం లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల జొమాటో సీఈఓ దీపిందర్‌గోయల్‌ ఓ ప్రకటన చేస్తూ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్థానంలో పని చేసేందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇందులో చేరినవారికి జీతం ఉండదు, పైగా ఉద్యోగంలో చేరిన వాళ్ళే రూ.20 లక్షలు సంస్థకు ఇవ్వాలని చెప్పారు. అయినాసరే ఈ ప్రకటన వెలువడిన తర్వాత దాదాపు 10 వేలమంది ఉద్యోగంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!

ఈ వింత ఉద్యోగ ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందించడంతో జొమాటో సీఈఓ గోయల్‌ స్పందిస్తూ రూ.20 లక్షలు చెల్లించడం అనేది కేవలం వడపోత కోసం మాత్రమే అని పేర్కొంటూ.. రూ.20 లక్షలు చెల్లించే స్తోమత ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా కంపెనీ ప్రారంభించిన గోల్డ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం ‘స్పెషల్‌ వీకెండ్‌ ఆఫర్‌’ ప్రవేశపెట్టేందుకు చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఆమోదం లభించినట్లు కంపెనీ తెలిపింది. ఈ పోస్ట్‌ కోసమే గోయల్‌ వింత ఉద్యోగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement