
ఖిరాది తన్నయ్య (ఫైల్)
కొరాపుట్( భువనేశ్వర్): విజిలెన్స్ వలలో కొరాపుట్ జిల్లా, సిమిలిగుడ ప్రాంత దుదారి రెవెన్యూ అధికారి ఖిరాది తన్నయ్య చిక్కుకున్నారు. ఓ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు జయరాం పంగి అనే వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా జయపురం విజిలెన్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. అనంతరం సదరు అధికారి ఆస్తులపై ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టి, ఆమెని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం జయపురం విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు.
మరో ఘటనలో..
పాముకాటుతో వ్యక్తి మృతి
జయపురం( భువనేశ్వర్): పాముకాటుకు గురైన జగన్నాథ్ గదబ అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానిక జయపురం సమితి, కొంగ గ్రామపంచాయతీలో ఉన్న కొదమగుడ గ్రామంలో బుధవారం రాత్రి తన ఇంటి ముందు నిల్చొని ఉన్న జగన్నాథ్‌ను పాము కాటేసింది.ఈ క్రమంలో వైద్యసేవల నిమిత్తం అతడిని జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే రాత్రి అక్కడే చికిత్స పొందుతుండగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబ సభ్యులకు గురువారం అప్పగించారు.
చదవండి: Chain Snatching: పల్లీపట్టీలు కావాలని వచ్చి... పుస్తెలు అపహరణ!