ఎంతకు తెగించారు.. జేసీబీతో ఏటీఎం దోపిడీకి యత్నం | Karnataka: Atm Robbery Attempt With Jcb | Sakshi
Sakshi News home page

ఎంతకు తెగించారు.. జేసీబీతో ఏటీఎం దోపిడీకి యత్నం

Published Sun, Aug 6 2023 11:35 AM | Last Updated on Sun, Aug 6 2023 11:42 AM

Karnataka: Atm Robbery Attempt With Jcb - Sakshi

యశవంతపుర(బెంగళూరు): జేసీబీలను తీసుకొచ్చి ఏటీఎంలను ధ్వంసంచేసి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించడం పెరిగింది. ఇటీవల శివమొగ్గలో ఇటువంటి దోపిడీ యత్నం మరువకముందే మంగళూరు వద్ద సూరత్కల్‌లో ఇదే మాదిరిగా దొంగలు యత్నించారు. విద్యాదాయిని పాఠశాల సమీపంలో జాతీయ రహదారి అండర్‌పాస్‌ వద్ద సౌతిండియా బ్యాంక్‌ ఎటీఎం ఉంది.

శుక్రవారం తెల్లవారు 2:13 గంటలకు దుండగులు జేసీబీతో వచ్చారు. ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించగా సైరన్‌ మోగడంతో జేసీబీ వదిలి పారిపోయారు. అక్కడికి రెండువందల మీటర్ల దూరంలోనే పోలీసుస్టేషన్‌ ఉంది. పడుబిద్రి నుంచి జేసీబీని తెచ్చినట్లు తేలింది. దొంగల దాడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి     స్మార్ట్‌ఫోన్‌ కోసం లోకానికి దూరమై... మరో ఇద్దరికి ప్రాణదాతగా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement