గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. బెయిల్‌ కోసం హైకోర్టుకు రన్యారావు | Actor Ranya Rao Approaches High Court Seeking Bail In Gold Smuggling Case | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. బెయిల్‌ కోసం హైకోర్టుకు రన్యారావు

Published Tue, Apr 1 2025 5:05 PM | Last Updated on Tue, Apr 1 2025 5:13 PM

Actor Ranya Rao Approaches High Court Seeking Bail In Gold Smuggling Case

బంగారం అక్రమ రవాణా కేసు(Gold Smuggling Case)లో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రన్యారావు(Ranya Rao) బెయిల్‌ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసు(Gold Smuggling Case)లో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రన్యారావు (Ranya Rao) బెయిల్‌ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మేజిస్ట్రేట్‌, సెషన్స్‌ కోర్టుల్లో ఆమెకు చుక్కెదురైంది. బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ వారం లేదా వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆమె డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) కస్టడీలో ఉన్నారు.

కాగా, రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు.

రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్‌గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది.

2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది.  తెలుగు సినిమా పటాస్‌కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement