Smuggling
-
గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. బెయిల్ కోసం హైకోర్టుకు రన్యారావు
బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసు(Gold Smuggling Case)లో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రన్యారావు (Ranya Rao) బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో ఆమెకు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ వారం లేదా వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆమె డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) కస్టడీలో ఉన్నారు.కాగా, రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్‌గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది.2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్‌కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. -
Gold Smuggling: తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరు అరెస్ట్
-
స్మగ్లింగ్ ఇదే మొదటిసారి!
బనశంకరి: బంగారం తీసుకు రావడం ఇదే మొదటిసారి.. అని విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన రన్య రావు(Ranya Rao) డీఆర్ఐ అధికారుల విచారణలో చెప్పింది. మార్చి 1వ తేదీన నాకు విదేశీ ఫోన్ నంబరు నుంచి కాల్ వచ్చింది. రెండు వారాలుగా గుర్తుతెలియని విదేశీ నంబర్ల నుంచి అనేక కాల్స్ వస్తున్నాయి. దుబాయ్ విమానాశ్రయం టెర్మినల్ మూడోగేట్–ఏ కు వెళ్లాలని సూచించారు. అక్కడ బంగారం తీసుకుని బెంగళూరుకు తీసుకెళ్లాని చెప్పారు. మార్చి 3వ తేదీన దుబాయ్‌లో తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తి 17 బంగారు బిస్కెట్లు ఉన్న బాక్సు ఇచ్చాడు. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లిన తరువాత టోల్‌గేటు దాటి సర్వీస్ రోడ్డులో ఆటో నిలిచి ఉంటుంది. అందులో ఉండే వ్యక్తికి బంగారం ఇవ్వాలని చెప్పారని ఆమె తెలిపింది. తరువాత టాయ్లెట్లోకి వెళ్లి శరీరమంతా బంగారు బిస్కెట్లు అంటించుకుని టేప్‌తో అతికించుకున్నాను. బెంగళూరుకు చేరుకోగానే పట్టుబడ్డానని తెలిపింది. బంగారాన్ని ఎలా తరలించాలో యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నానని పేర్కొంది. భర్త క్రెడిట్ కార్డుతో టికెట్లు ఫోన్ చేసిన వ్యక్తులు ఆఫ్రికన్, అమెరికన్ భాషల్లో మాట్లాడారని రన్య చెప్పింది. తన భర్త జతిన్ విజయ్‌కుమార్ క్రెడిట్‌కార్డు ద్వారా విమాన టికెట్లు బుక్ చేశానని రన్య చెబుతోంది. ఫోటోగ్రఫీ, రియల్ఎస్టేట్ పనులపై నేను అప్పుడప్పుడు యూరప్, అమెరికా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లానని తెలిపింది. రన్య చెప్పేది నమ్మశక్యంగా లేదని డీఆర్ఐ అనుమానిస్తోంది. ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌లో స్మగ్లింగ్ సంబంధాలు లభించాయని సమాచారం. మరోవైపు తనపై మీడియాలో వ్యతిరేక వార్తలు రాయకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టులో అర్జీ వేశారు.Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ -
కూతురి స్మగ్లింగ్‌లో డీజీపీ పాత్ర ఉందా?
బనశంకరి: నటి రన్య రావు పెంపుడు తండ్రి, రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ డీజీపీ రామచంద్రరావు చిక్కుల్లో పడ్డారు. రన్యకు బెంగళూరు విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఇవ్వడం గురించి విచారణ చేపట్టి వారంలోగా నివేదిక అందించాలని హోంశాఖను సర్కారు ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ లో ఆయన కుమ్మక్కయ్యారా, ప్రోటోకాల్ దుర్వినియోగానికి పాల్పడడం వెనుక ఆయన హస్తం ఉందా అనే దానిపై వారంలోగా విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించింది. నటి రన్య తన ప్రయాణాల్లో రామచంద్రరావు పేరును విరివిగా వాడుకున్నారు. రన్య కేసు శాసనసభ సమావేశాల్లో తీవ్ర చర్చకు రావడం తెలిసిందే. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రతిపక్ష బీజేపీ మండిపడడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. రన్య ప్రోటోకాల్‌పై నివేదిక మరోపక్క రన్య రావు ప్రోటోకాల్ దుర్వినియోగం పట్ల పోలీస్ కమిషనర్ దయానంద్‌కు డీసీపీ నివేదిక అందజేశారు. రన్య రావ్ అరెస్టైనరోజు ప్రోటోకాల్‌లో ఉన్న కానిస్టేబుల్ బసవరాజుకు ఆమె కాల్ చేసి విమానాశ్రయంలో టెరి్మనల్ వన్ వద్దకు రావాలని తెలిపింది. ఇప్పుడు రాలేను మేడం, వేరే ఆఫీసర్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి అని బసవరాజు చెప్పాడు. నువ్వే రావాలి లేకపోతే, అప్పాజీ కి చెబుతానని రన్య హెచ్చరించినట్లు నివేదికలో ప్రస్తావించారు. పోలీస్ స్టిక్కర్ వాడొద్దు: హోంమంత్రి దొడ్డబళ్లాపురం: పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సొంత వాహనాలపై పోలీస్ అనే స్టిక్కర్లు వేసుకోవడం మామూలే. ఇది ఏ మాత్రం మంచిది కాదని, ఇది కచ్చితంగా చట్టాన్ని , నిబంధనలను ఉల్లంఘించడమేనని హోంమంత్రి పరమేశ్వర్ చెప్పారు. 2022 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇలా స్టిక్కర్లు వేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. శ్రవణబెళగోళ ఎమెల్యే సీఎస్ బాలక్రిష్ణ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు తెలిపారు. రన్య అరెస్టు వెనుక...బనశంకరి: బంగారం దొంగరవాణా కేసులో నటి రన్య రావు పట్టుబడటం వెనుక ఆమె భర్త, ఢిల్లీలో అరెస్టైన ఇద్దరు స్మగ్లర్లు, పలువురు పెద్దలు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జతిన్ హుక్కేరి అనే వ్యక్తితో రన్యకు బెంగళూరులో ఆర్భాటంగా వివాహం జరిగింది. కానీ వారి మధ్య గొడవలు వచ్చాయి. రన్య పదేపదే విదేశాలకు వెళ్లడం గురించి భర్త ప్రశ్నించేవాడు. ఆయనే డీఆర్ఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. కొన్నిరోజుల కిందట ఢిల్లీలో డీఆర్ఐ అధికారులకు ఇద్దరు స్మగ్లర్లు దొరికారు. రన్య అనే యువతి కూడా బంగారం దొంగ రవాణా చేస్తోందని ఉప్పందించారు. దీంతో ఢిల్లీ నుంచి బెంగళూరు డీఆర్ఐ విభాగానికి అలర్ట్ వచ్చింది. 3వ తేదీ రాత్రి రన్య బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే అదుపులో తీసుకున్నారు. రన్య అంటే పడని బంగారు వ్యాపారులు, ఓ మంత్రి కూడా సమాచారం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. 28 సార్లు విదేశీ ప్రయాణం నటి రన్య కేసులో తరుణ్‌రాజు అనే వ్యక్తి అరెస్టు కావడం బెంగళూరులో చర్చనీయాంశమైంది. రన్య వెనుక తరుణ్‌రాజు ఉన్నాడని తెలుస్తోంది. బెంగళూరు కు బంగారం తెప్పించి హవాలా ద్వారా దుబాయికి డబ్బు పంపించేవారు. రన్య ఖర్చులన్నింటినీ తరుణ్‌రాజు చూసుకునేవాడు. ఐపీఎస్ అధికారి కూతురు కావడంతో రన్య ద్వారా సులభంగా బంగరాన్ని తెప్పించవచ్చని గుర్తించాడు. రన్య ఒక ఏడాదిలో 28 సార్లు విదేశీ పర్యటనలు చేసింది. గత 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చింది. ఐదోసారి దుబాయ్‌కి వెళ్లి వస్తుండగా జాతకం మారిపోయింది. -
కన్నడ నటి రన్యా రావ్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు
-
రన్యారావు శరీరంపై గాయాలు
-
స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!
కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్న ఉత్పత్తుల సంఖ్య కొద్ది నెలలుగా భారీగా పెరిగిపోయింది. అయితే అవేమిటో తెలుసా? ఎప్పట్లా ఫెంటానిలో, ఇతరేతర డ్రగ్సో కాదు. పౌల్ట్రీ ఉత్పత్తులు! ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. పైగా వాటిలోనూ సింహ భాగం గుడ్లే కావడం విశేషం!! నానాకష్టాలూ పడి డ్రగ్స్‌ను దేశం దాటించేకంటే స్మగ్లింగ్ నెట్వర్కులకు ఇదే మాంచి లాభసాటి బేరంగా కన్పిస్తోందట. అమెరికాను అతలాకుతలం చేస్తున్న గుడ్ల కొరత తీవ్రతకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ తదితర డ్రగ్స్ విచ్చలవిడిగా స్మగ్లింగ్ అవుతుండటం పరిపాటి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇది డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ప్రచారాస్త్రంగా మారింది కూడా. కెనడాపై టారిఫ్‌ల యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కూడా ఫెంటానిల్ నిలిచింది. కానీ కొద్ది నెలలుగా కెనడా నుంచి గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల స్మగ్లింగ్ డ్రగ్స్‌ను కూడా మించిపోయిందంటూ అమెరికా అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్లే అమెరికన్లకు ప్రధానమైన బ్రేక్‌ఫాస్ట్. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. వారి బ్రేక్‌ఫాస్ట్ అవసరాలు కాస్తా బ్లాక్మార్కెటర్లకు కాసుల పంటగా మారుతుండటం విశేషం!డ్రగ్స్ కంటే 10 రెట్లు! 2024 అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్‌డీగో వద్ద ఈ ఉదంతాలు ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం. 2024 అక్టోబర్ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డ ఉదంతాలు 3,768కి పైగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఫెంటానిల్ పట్టుబడ్డ ఉదంతాలు కేవలం 352 మాత్రమే కావడం విశేషం. పెరుగుతున్న ఫ్లూ రిస్క్! బర్డ్ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజనుకు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న పరిస్థితి! గుడ్ల సంక్షోభం చేయి దాటిపోయిందని స్వయానా అధ్యక్షుడు ట్రంపే అంగీకరించారు! ఈ ఏడాది చివరకల్లా గుడ్ల ధరలు కనీసం మరో 50 శాతం దాకా పెరగవచ్చని అంచనా. దాంతో కొద్ది నెలలుగా స్మగ్లర్ల కన్ను గుడ్లపై పడింది. కెనడా నుంచి అమెరికాలోకి వాటి అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే దీనివల్ల బర్డ్ ఫ్లూతో పాటు ఇతరత్రా రోగాల రిస్కు పెరిగిపోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. కోళ్లు, గుడ్ల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కెనడా, మెక్సికో సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేయాలంటూ ట్రంప్ సర్కారు తాజాగా ఆదేశాలు జారీచేసింది!అమెరికాలో అద్దెకు కోళ్లు గుడ్ల సంక్షోభం పుణ్యమా అని అమెరికాలో ఇప్పుడు కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారం పుట్టుకొచి్చంది. అది ఇప్పుడక్కడ యమా జోరుగా సాగుతుండటం విశేషం. డజను గుడ్లకు 5 నుంచి 10 డాలర్ల దాకా పెట్టాల్సి రావడం అమెరికన్లను కలవరపరుస్తోంది. దీనికి బదులు ఇంటి పెరళ్లలో కోడిపెట్టలను సాకేందుకు వాళ్లు మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కోడిపెట్టలకు చెప్పలేనంత డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రెంట్ ద చికెన్ వంటి పేర్లతో ఏకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి. ఆర్నెల్ల ప్రాతిపదికన కోడిపెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీస అద్దె ప్యాకేజీలు 300 డాలర్ల నుంచి మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా రెండు పెట్టలతో పాటు వాటికి ఆర్నెల్ల పాటు కావాల్సిన దాణాను కూడా కంపెనీలే ఇస్తాయి. కోళ్ల గూడు కూడా సమకూరుస్తాయి. ఆరోగ్యకరమైన పెట్ట వారానికి ఐదారు దాకా గుడ్లు పెడుతుంది. ఆ లెక్కన రెండు కోళ్లు ఆర్నెల్లకు కనీసం 250 గుడ్లు పెడతాయన్నమాట. వాటిని మార్కెట్లో కొనాలంటే ప్రస్తుత రేట్లను బట్టి కనీసం 80 నుంచి 160 డాలర్లకు పైనే పెట్టాల్సి ఉంటుంది. కోళ్లను సాకడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు తాజా గుడ్లు దొరుకుతుండటం అమెరికన్లను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక గుడ్లను పొదిగించి కోళ్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. కాంట్రాక్టు ముగిశాక అవి వారికే సొంతమవుతున్నాయి. వాటిని అద్దెకిస్తూ సైడ్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొదవ లేదు. దొరికితే జరిమానాలుఅమెరికాలోకి గుడ్లు, ఇతర ప్రాసెస్ చేయని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా చట్టవిరుద్ధం. ఫ్లూ తదితర ఆందోళనలే ఇందుకు కారణం. వీటిని దేశంలోకి తరలించే ప్రయత్నంలో పట్టుబడితే 300 డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. ‘‘ఇరు దేశాలకూ కొన్నేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న ఫెంటానిల్ వంటి డ్రగ్స్ కంటే కూడా కెనడా నుంచి అమెరికాలోకి గుడ్ల అక్రమ రవాణాయే పెరిగిపోతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. కానీ కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవమిది’’ అన్నారు కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ పాలసీ చీఫ్ మాథ్యూ హోమ్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నటి రన్యా రావ్ స్మగ్లింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
రన్యారావ్ పాత్రధారి మాత్రమే
బనశంకరి: బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు. అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మక్కైనట్లు అనుమానం వ్యక్తమైంది.డీఆర్ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. బంగారం రవాణాలో రన్యారావ్‌కు రూ.4 లక్ష లనుంచి రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్‌ను అదికారులు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీడియో: కర్ణాటకలో దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి.. -
బంగారంతో పట్టుబడ్డ కన్నడ హీరోయిన్
-
అక్రమ బంగారంతో దొరికిపోయిన హీరోయిన్.. ఏకంగా డీజీపీ కూతురేనట!
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంతకీ ఎవరు ఈ రాన్యా రావు అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అసలు ఆమె డీజీపీ కూతురు అని చెప్పడంతో పలువురు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలేంటో మీరు చూసేయండి.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్‌గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది. 2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్‌కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు.డీజీపీ కూతురే రాన్యా రావ్..మరోవైపు రన్యా రావు డీజీపీ కూతురు అని తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా ఉన్న ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె అని సమాచారం. -
బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో కన్నడ నటి అరెస్ట్
బెంగుళూరు: బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కన్నడ హీరోయిన్ రాన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి బెంగుళూర్‌కు 14 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. రాన్యారావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అధికారులకు తాను డీజీపీ కూతురినంటూ రన్యారావు చెప్పినట్లు సమాచారం.తరచుగా దుబాయ్ వెళ్లే రన్యారావు.. ఈసారి కూడా వెళ్లి మార్చి 3వ తేదీ రాత్రి తిరిగి దుబాయ్ నుంచి వచ్చింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్‌లో అనుమానంతో ఆమెను అధికారులు చెక్ చేయగా, స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె దుస్తులలో 14.8 కిలోల బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, కన్నడలో సుదీప్తో మాణిక్య సినిమాలో రాన్యా నటించింది. -
తగ్గిన బంగారం అక్రమ రవాణా
న్యూఢిల్లీ: బంగారం అక్రమ రవాణాకు దిగుమతి సుంకం తగ్గింపు కొంత చెక్ పెట్టింది. గతేడాది జూలైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి కేంద్రం తగ్గించడం గమనార్హం. అనంతరం అక్రమ రవాణా (స్మగ్లింగ్/దొంగ రవాణా) గణనీయంగా తగ్గినట్టు పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో 847 కిలోల బంగారాన్ని (రూ.544 కోట్లు) డీఆర్ఐ అధికారులు జప్తు చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులు, సరిహద్దులు, దేశంలోకి వచ్చే కార్గోల వద్ద అధికారుల నిఘా పెరిగినట్టు సంజయ్ కుమార్ చెప్పారు. కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు సరిహద్దుల ద్వారా వస్తు అక్రమ రవాణా జరుగుతుండడం తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీఆర్ఐ అధికారులు ఈశాన్య సరిహద్దుల వద్ద 1,319 కిలోల బంగారం అక్రమ రవాణాన్ని అడ్డుకుని, ఆ మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వద్ద ఎక్కువ మొత్తం పట్టుబడింది. కస్టమ్స్ విభాగం సహా సీబీఐసీ కలసి గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జప్తు చేసిన బంగారం 4,870 కిలోలుగా ఉంది. దిగుమతి సుంకం తగ్గింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ బంగారం ఆభరణ వర్తకుల (జ్యుయలర్లు) ఆదాయం 22–25 శాతం పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేయడం గమనార్హం. -
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు విదేశీయులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.26 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. జనవరి 24న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసి... అనంతరం కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. జనవరి 24న సావోపాలో నుంచి వచ్చిన బ్రెజిల్ మహిళ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకొనేందుకు గ్రీన్ చానల్ దాటుతుండగా పట్టుకున్నారు. డ్రగ్స్ క్యాప్సూల్స్ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసి 100 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. వాటిలో కొకైన్‌గా అనుమానిస్తున్న తెల్లటి పొడి ఉన్నట్లు తేలింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్స్ బరువు 802 గ్రాములు కాగా, వీటి విలువ రూ.12.03 కోట్లు ఉంటుందని అంచనా. అదే రోజు అడిస్ అబాబా నుంచి వస్తున్న కెన్యా ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. విచారణలో కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు అంగీకరించాడు. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి మొత్తం 70 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. క్యాప్సుల్స్‌లో 996 గ్రాముల హై ప్యూరిటీ కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. రూ.14.94 కోట్ల విలువైన డ్రగ్స్‌గా గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి.. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాదకద్రవ్యాల సిండికేట్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
వన్యప్రాణులకు స్మగ్లింగ్ ముప్పు
వన్యప్రాణుల అక్రమ రవాణా మన దేశంలో అంతకంతకూ పెరిగిపోతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సరిహద్దులు, ఎయిర్‌పోర్టుల ద్వారా వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. దీనికి చెన్నై, ముంబై ఎయిర్‌పోర్టులు కీలక హబ్‌లుగా మారాయని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో చెబుతోంది. ఈ ఏడాదిలో అక్రమ రవాణాకు సంబంధించి 40కిపైగా కేసులు నమోదయ్యాయి. వన్యప్రాణుల దంతాలు, విడిభాగాలు, చర్మానికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా జరుగుతోంది. ప్రధానంగా రైనో (ఖడ్గమృగం) కొమ్ము, పులి శరీర భాగాలు సంప్రదాయ ఔషధాల తయారీకి వినియోగిస్తారు. వాటి మాంసాన్ని కొన్నిచోట్ల తింటారు కూడా. అతిపెద్ద వ్యవస్థీకృత నేరాల్లో నాలుగోదిఅడవి జంతువుల అక్రమ రవాణా వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం దెబ్బతినడంతోపాటు జీవవైవిధ్యం సమతుల్యత లోపిస్తోంది. ఆరి్థక వ్యవస్థలపైనా దీని ప్రభావం పడుతోంది. అక్రమ రవాణా అనేక దేశాలలో విస్తరించింది. రక్షిత వన్యప్రాణులను వేటాడటం, స్మగ్లింగ్ చేయడం, చట్టవిరుద్ధంగా సేకరించడం, పట్టుకోవడం వంటివి నిరాటంకంగా జరుగుతోంది. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, నకిలీల తర్వాత నాలుగో అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరంగా వన్యప్రాణుల అక్రమ రవాణా కొనసాగుతున్నట్టు గుర్తించారు. ఈ అక్రమ రవాణా విలువ సంవత్సరానికి రూ.1,500 కోట్లు ఉంటుందని వైల్డ్ లైఫ్ నిపుణులు చెబుతున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్న టాప్–20 దేశాల్లో మన దేశం ఒకటి. విమానాల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్న టాప్–10 దేశాల్లో మన దేశం కూడా ఉండటం గమనార్హం. ఏనుగుదంతాలదే మొదటి స్థానంస్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశం నుంచి అత్యధికంగా అక్రమ రవాణా అవుతున్నవి ఏనుగు దంతాలు. ఆ తర్వాత తాబేళ్లు. వీటిలో నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఖడ్గమృగం కొమ్ముల వ్యాపారం కూడా పెరిగింది. ఇటీవల కాలంలో పాంగోలిన్ వేట, అక్రమ రవాణాకు మన దేశం ప్రధాన కేంద్రంగా మారింది. పులుల శరీర భాగాల వ్యాపారం కూడా యథేచ్ఛగా కొనసాగుతోంది. స్నేక్‌హెడ్ ఫిష్, జీబ్రా లోచ్ వంటి అలంకార చేపలను లైవ్ అక్వేరియంలో ఉంచడం కోసం అక్రమ రవాణా చేస్తుండడంతో వాటి సహజ ఆవాసాలు అంతరించిపోతున్నాయి. వీటితోపాటు నక్కలు, ఎలుగుబంట్లు, చిరుతలు, ముంగిసలు, కప్పలను అక్రమంగా రవాణా చేసి వాటి శరీర భాగాలను ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.రవాణా జరిగే రూట్లుమనదేశంలోనూ, మన దేశం నుంచి ఇతర దేశాల్లోకి వన్యప్రాణుల అక్రమ రవాణా ప్రధానంగా రెండు మార్గాల ద్వారా జరుగుతున్నట్టు గుర్తించారు. ఈశాన్య ప్రాంతంలోని పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఎక్కువ రవాణా జరుగుతుండగా, విమానాశ్రయాల ద్వారా రెండో మార్గంలో జరుగుతోంది. దిమాపూర్, గౌహతి, ఇంఫాల్ వంటి ఈశాన్య నగరాల నుంచి నేపాల్, మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఖడ్గమృగాల కొమ్ములు, పులి భాగాలు, పాంగోలిన్ పొలుసుల అక్రమ రవాణా విపరీతంగా జరుగుతున్నట్టు గుర్తించారు. ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దులో పక్షులు, సరీసృపాల అక్రమ రవాణా కూడా చాలా ఎక్కువగా ఉంది. నక్షత్ర తాబేళ్లు ప్రపంచంలోనే అత్యధికంగా రవాణా అవుతున్న వన్యప్రాణులు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వీటిని థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియాకు విమానాల ద్వారా సరఫరా చేస్తున్నారు.విమానాల్లో తీసుకెళ్లే లగేజీల రూపంలో 50 శాతానికిపైగా రవాణా ఎక్కువగా జరుగుతోంది. మరో 15 శాతం రవాణా ఎయిర్ కార్గో ద్వారా జరుగుతోంది. చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో తరచూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఇవీ కారణాలు ప్రపంచంలో 8 శాతం వన్యప్రాణులు మన దేశంలో ఉండగా.. అధిక జనాభా వల్ల వన్యప్రాణుల ఉత్పత్తులు మన మార్కెట్లలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి. ఒకసారి మార్కెట్లలోకి వచి్చన తర్వాత వాటిని గుర్తించడం అసాధ్యంగా మారుతోంది. చైనా, మయన్మార్, పలు ఆగ్నేయాసియా దేశాలతో సరిహద్దులు ఉండడం, పెరుగుతున్న విమానయాన మార్కెట్, వేగంగా విస్తరిస్తున్న విమానాశ్రయాలు, సోషల్ మీడియాను కూడా ఆన్లైన్ మార్కెట్లుగా ఉపయోగిస్తుండడంతో అక్రమ రవాణా పెరిగిపోతోంది.– సాక్షి, అమరావతి -
పవన్ ‘న్యూట్రల్’ గేర్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు.. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం.. వరుసగా చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై హత్యాచారాల ఘటనల సమయంలో ఉలకని పలకని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ పెద్దలు ఇరకాటంలో పడ్డప్పుడల్లా రంగంలోకి దిగుతున్నారు. కూటమి సర్కారు వైఫల్యాలకు బాధ్యత వహించకుండా.. తాను ప్రభుత్వంలో భాగం కాదనే రీతిలో తమపై విమర్శలకు దిగడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. శాంతి భద్రతల అంశం నేరుగా ముఖ్యమంత్రి చేతిలోనే ఉందన్న విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పవన్ తాను తటస్థుడినని చిత్రీకరించుకుంటూ ప్రత్యేకత చాటుకునే యత్నాల్లో భాగమని పేర్కొంటున్నారు. బియ్యాన్ని చూపించకుండా తనను ఓడ చుట్టూ తిప్పారని.. అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని.. కాకినాడ పోర్టు కార్యకలాపాల వెనుక పెద్ద స్మగ్లింగ్, మాఫియానే నడుస్తోందని పవన్ వ్యాఖ్యలు చేయడం పవన్ ‘న్యూట్రల్ గేర్’లో భాగమేనని పేర్కొంటున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు అక్కడ లేకపోవడంపై పవన్ మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే తన పార్టీకే చెందిన మంత్రి మనోహర్‌తో చర్చించకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి హడావిడి చేయాల్సిన అవసరం ఏముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆయన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.ఇటీవల హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. తాను తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయపడుతున్నట్టు కలరింగ్ ఇవ్వడంతో పాటు.. రాష్ట్రంలో జరిగే సంఘటనల్లో తన పాత్ర లేదని చెప్పుకోవడానికి ఇలా హైడ్రామాలకు తెరలేపారనే చర్చ జరుగుతోంది.సీజ్ చేసి విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే!కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి రెండు రోజుల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఎగుమతికి సిద్ధం చేసిన 640 టన్నుల బియ్యాన్ని పీడీఎస్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. నౌకలోని ఐదు హేచర్లకు 52 వేల టన్నుల బియ్యం లోడింగ్ సామర్థ్యం ఉండగా 38 వేల టన్నులు లోడింగ్ చేశారు. ఇందులో బాయిల్ రైస్‌తో పాటు 640 టన్నులు పీడీఎస్ ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు నెలల క్రితం సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని కొంత విడుదల చేశారు. అలా విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే కలెక్టర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఉండటం గమనార్హం. పౌరసరఫరాల అధికారి సరెండర్ ఉత్తర్వులుకాకినాడ జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ను సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పీడీఎస్ బియ్యం వ్యవహారాన్ని సక్రమంగా నిర్వహించనందున ఆయన పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి కథనంతో కలకలం..కలెక్టర్ స్వయంగా పోర్టుకు వెళ్లి పరిశీలించాక అదే బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. తన వెంట ఉన్న కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై పవన్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన మిల్లర్లకు ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు బకాయిలు విడుదల చేసింది. ఈ బకాయిలు విడుదల చేసినందుకు కూటమికి చెందిన ఒక నేతకు 8 శాతం కమీషన్లు ముట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ‘కమీషన్ల కోసం కపట నాటకం’ శీర్షికన ఈ నెల 27న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం వెలువడటం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. -
పంజాబ్‌లో 105 కిలోల హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: సరిహద్దుల్లో డ్రగ్స్ రాకెట్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు. 105 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేయడంతోపాటు తుర్కియే కేంద్రంగా పనిచేసే డ్రగ్స్ స్మగ్లర్ నవ్ భులార్ ముఠాలోని నవ్‌జ్యోత్ సింగ్, లవ్‌ప్రీత్ కుమార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్‌తోపాటు సుమారు 32 కిలోల కెఫీన్ ఎన్‌హైడ్రస్, 17 కిలోల డెక్స్ట్రోమెథార్ఫాన్ (డీఎంఆర్) అనే నిషేధిత డ్రగ్స్‌ను కూడా పట్టుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్ల పైమాటేనని చెబుతున్నారు. హెరాయిన్‌తోపాటు వీటిని కూడా వాడితే ఆ ప్రభావం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదివారం చెప్పారు. విదేశీ తయారీ పిస్టళ్లు ఐదు, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి ఈ మాదక ద్రవ్యాలను దొంగచాటుగా జల మార్గంలో తరలించేందుకు స్మగ్లర్లు భారీ రబ్బర్ ట్యూబ్‌లను వినియోగించారని వివరించారు. -
అక్రమ రవాణాకు అడ్డాగా బీహార్ ఈస్ట్ వెస్ట్ కారిడార్
పట్నా: నేపాల్, మయన్మార్, కొరియా దేశాల స్మగ్లర్లు భారత్‌లో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగించేందుకు బీహార్‌ను తమ అడ్డగా మార్చుకుంటున్నారు. బీహార్ మీదుగా వెళ్లే ఈస్ట్ వెస్ట్ కారిడార్ స్మగ్లర్లకు కొత్త మార్గంగా మారింది. నేపాల్‌కు సమీపంలో ఉండటంతో స్మగ్లర్లకు ఈ రహదారి వరంలా మారింది. ఈ మార్గంలో నేపాల్ నుంచే కాకుండా మయన్మార్, కొరియా దేశాల నుంచి కూడా ‘సరుకులు’ రవాణా అవుతున్నట్లు రోజూ వార్తలు వస్తున్నాయి.స్మగ్లర్ల సిండికేట్ ఈ మార్గం ద్వారా విదేశీ సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. కస్టమ్స్ కమిషనర్ డా.యశోవర్ధన్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల పట్నా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. మోతీహరి పోలీసుల సహాయంతో భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కారిడార్‌లో తొలిసారిగా ఒక కిలో 100 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. 15 రోజుల వ్యవధిలో దర్భంగా, ముజఫర్‌పూర్ మధ్య మైతీ టోల్ ప్లాజా సమీపంలో భారీగా విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు రూ.ఒక కోటి 30 లక్షల విలువైన దక్షిణ కొరియా సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో బరేలీకి చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.తాజాగా తూర్పు చంపారన్‌లోని నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డులో రూ.9 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రయాణికుల బస్సు నుంచి 9,500 సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ విభాగం అధికారులు మోతీహరి నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుంగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీనికితోడు భారతదేశంలో తయారయ్యే సిగరెట్లు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా రవాణా అవుతున్నాయని తెలియవస్తోంది.ఇది కూడా చదవండి: బంగారం తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత? -
ఇక బియ్యం అక్రమార్కుల భరతం
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమార్కుల భరతం పట్టేందుకు పోలీస్‌శాఖ సిద్ధమైంది.ఇప్పటికే డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్, పౌరసరఫరాలశాఖ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేపట్టనున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొన్ని ముఠా లు అక్రమంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిస్తున్నాయి.గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి లో ఈ ముఠాలు బియ్యాన్ని తక్కువ ధరకు వివి ధ మార్గాల్లో సేకరించి, వాటిని ఇతర రాష్ట్రాలకు తర లిస్తుండగా, అన్ని స్థాయిల్లో నిఘా పెట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాలతో అంటకాగుతున్న పోలీసు అధికారులపైనా వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నా రు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి, ఇతర పద్ధతు ల్లో అవినీతి అధికారుల వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. కీలక నిందితులపైనే గురి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా ఎక్కువగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రోకర్ల ద్వారా ఈ ముఠాలు లబి్ధదారుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నాయి. రేషన్ దుకాణాల నుంచి బియ్యం లబ్ధిదారులు తీసుకున్న వెంటనే వారికి కిలోకు రూ.10 నుంచి రూ.12 చెల్లిస్తున్నారు. వాటిని మండల స్థాయిలో మరో దళారీకి చేరవేసి, అక్కడి నుంచి జిల్లా స్థాయికి పంపించి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదంతా స్థానిక పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులకు తెలిసే జరుగుతుందన్నది బహిరంగ రహస్యం.ప్రధానంగా వీటిని మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు, ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిస్తున్నట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పోర్టుల నుంచి విదేశాలకు ఈ బియ్యం వెళుతోందన్నారు. మరికొన్ని ముఠాలు స్థానికంగా హోటళ్లకు సైతం రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. రీసైక్లింగ్ కోసం కొందరు మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. అయితే బియ్యం అక్రమ రవాణా కట్టడిలో కేవలం స్థానిక ముఠాలను అరెస్టు చేస్తే లాభం లేదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ అక్రమ రవాణాలో కీలక వ్యక్తులను గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలతో సమాచారం సేకరిస్తున్నామన్నారు. అక్రమ అధికారులపైనా కొరడా ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. మల్టీజోన్–2 పరిధిలో ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లను, 13 మంది ఎస్సైలను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. అంతకు ముందు సైతం ఇదే విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేశారు. ఇసుక అంశంలో మాదిరిగానే రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తున్న పోలీసులపై నిఘా విభాగం దృష్టి పెట్టింది. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారుల్లో భయం మొదలైంది. -
ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ కొరడా ఝుళిపించారు. ఒకేసారి మల్టీజోన్–2లోని తొమ్మిది జిల్లాల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వేటు పడిన వారిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నట్టు నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణ తర్వాతే చర్యలు తీసుకున్నట్టు ఐజీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేసినట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేటు పడింది వీరిపైనే..సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతోపాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్సైలు ఉన్నారు. త్వరలో వీరిని లూప్లైన్కు బదిలీ చేస్తామని ఐజీ తెలిపారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణల ద్వారా ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్‌పేట, తాండూర్, చిన్నంబావి ఎస్సైలను స్థానచలనం చేసినట్టు పేర్కొన్నారు.వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్పై వేటుజోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఓబా లికపై జరిగిన రేప్ కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవక లకు పాల్పడినందుకు సీఐ నాగరాజును సస్పెండ్ చేసినట్టు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. నాగరాజు ప్రస్తుతం వికారాబాద్ టౌన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాడు.రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూడా ఫోకస్ పెట్టనున్నట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాలో స్థానిక నిందితులతోపాటు అంతర్రాష్ట్రంగా అక్రమ రవాణా చేసే ప్రధాన నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఐజీ ఆదేశించారు. -
రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్‌కు వ్యతిరేకంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు. ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుఅక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్‌కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్‌పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్‌పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.నివేదికలోని వివరాలు..ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లుఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లువస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లుపొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లుమద్యం-రూ.66,106 కోట్లుఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓదేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది. -
పుష్పను మించిపోయిన మందు స్మగ్లర్లు
-
పగలు తోడేస్తూ.. రాత్రి తోలేస్తూ..
జగ్గయ్యపేట: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఆపేవారే కనబడకపోవడంతో సరిహద్దులు దాటిపోతోంది. ఉచిత ఇసుక పథకం అక్రమార్కుల జేబులు నింపుతోంది. మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ప్రభుత్వం ఇసుక స్టాక్ పాయింట్ నుంచి జూలై 8న ఇసుక విక్రయాలు ప్రారంభించింది. మొత్తం 81వేల టన్నుల ఇసుకను ఈ ప్రాంతంలోని లబ్ధిదారులకు ఇచ్చేందుకు టన్ను రూ.290 చొప్పున ధర నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు విక్రయిస్తోంది. ఇందు కోసం ఇక్కడ రెవెన్యూ, పంచాయతీ, ఎస్ఈబీ అధికారులను నియమించారు. ఇసుక ప్రారంభం నాటి నుంచి నేటి వరకు 16,800 మెట్రిక్ టన్నులు ఇసుక విక్రయించినట్లు అధికారులు చెబున్నారు. అయితే ఇందులో కొన్ని వందల టన్నులు తెలంగాణకు తరలినట్టు సమాచారం.తెలంగాణకు తరలింపు ఇలా..స్టాక్ పాయింట్ వద్ద కొందరు అక్రమార్కులు తెలంగాణకు అక్రమంగా ఇసుకను రవాణా చేసేందుకు ప్రత్యేక వ్యూహాలను రచించారు. ఈ ప్రాంతం తెలంగాణకు సరిహద్దుగా ఉండటంతో ఏ గ్రామం నుంచి చూసినా 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే తెలంగాణ సరిహద్దు గ్రామాలు కనిపిస్తాయి. దీంతో అక్రమార్కులు ఇసుకను సామాన్యులకు అందనీయకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని ప్రతి రోజు 10 నుంచి 30 ట్రాక్టర్ల వరకు ఇసుకను రహస్య ప్రదేశాలకు తరలిస్తారు.అధికార పార్టీ నేత హవా?స్టాక్ పాయింట్ వద్ద గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు తన హవా కొనసాగిస్తున్నారు. తన గ్రామంలో స్టాక్ పాయింట్ ఉండటంతో గ్రామానికి ప్రతి రోజు 30 ట్రాక్టర్ల ఇసుక తను చెప్పిన వారికే ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేయడంతో అధికారులు కూడా ఆయనకు తలొగ్గి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక ఒక్కో ట్రాక్టర్ నుంచి సదరు నాయకుడికి రూ.200 ఇస్తున్నట్లు కూడా సమాచారం.ఉదాసీనంగా అధికారులు..అక్రమంగా తరలిపోతున్న ఇసుకను నియంత్రించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ముఖ్యంగా స్టాక్ పాయింట్ వద్ద అనుభవం లేని పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులను నియమించడంతో కూపన్లు జారీ చేసి విషయంలో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక వే బిల్లుపై 2 నుంచి 3 సార్లు ఇసుకను తీసుకువెళ్తున్నారు. కనీసం వీటి పర్యవేక్షణకు సిబ్బంది లేకపోవడంతో ప్రతి రోజు 20 నుంచి 80 టన్నుల ఇసుక అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఎస్ఈబీ అధికారులు సమాచారం ఇస్తే తప్ప నియంత్రణ చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఏపీ ఇసుకకు మంచి డిమాండ్..తెలంగాణలో మునేరు, కృష్ణా ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. ఒక లారీ ఇసుక రూ.30వేలు నుంచి రూ.70వేల వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇసుక కొరత ఉండటంతో ఏపీ ఇసుక కోసం ధర ఎక్కువైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.చెక్‌పోస్ట్‌లు ఉన్నా..65వ నంబర్ జాతీయ రహదారి రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన ముక్త్యాల, గండ్రాయి, అన్నవరం గ్రామాల్లో చెక్ పోస్టులు ఉన్నప్పటికీ తూతూ మంత్రంగానే సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ముక్త్యాల చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది ఉన్నప్పటికీ అనుమంచిపల్లి స్టాక్ పాయింట్ నుంచి తెలంగాణ రాష్ట్రం వజినేపల్లికి ఓ ట్రాక్టర్ ఇసుకలోడు సిబ్బంది కనుచూపులోనే వెళ్లింది. సమీపంలోని తెలంగాణ బుగ్గ మాధవరం చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక తరలి వెళ్లడం గమనార్హం. -
Californium: 50 గ్రాముల రాయి... రూ. 850 కోట్ల ఖరీదు!
పట్నా: అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియంను గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తుండగా బిహార్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారినుంచి 50 గ్రాముల కాలిఫోర్నియంను స్వా«దీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా రూ.850 కోట్ల దాకా ఉంటుందని గోపాల్‌గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ వెల్లడించారు! గ్రాము ధర రూ.17 కోట్లు పలుకుతుందని ఆయన వివరించారు. ‘‘పక్కా సమాచారం మేరకు జిల్లా ఇన్వెస్టిగేషన్ విభాగం, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఎస్టీఎఫ్ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. యూపీ, బిహార్ సరిహద్దులో మోటార్‌బైక్ మీద వస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా కాలిఫోరి్నయం దొరికింది’’ అని తెలిపారు. దీనిపై అణు ఇంధన శాఖకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. ఎందుకింత ఖరీదు? కాలిఫోర్నియం అత్యంత అరుదైన రేడియోధార్మిక పదార్థం. ఇది ప్రకృతిలో సహజంగా లభించదు. ప్రయోగశాలల్లో హెచ్చు పీడనంతో కూడిన ఐసోటోప్ రియాక్టర్లలో తయారు చేయాల్సి ఉంటుంది. ఎంతగానో శ్రమించిన మీదట అత్యంత స్వల్ప పరిమాణాల్లో మాత్రమే తయారవుతుంది! దీన్ని తయారు చేయగల సామర్థ్యమున్న అణు రియాక్టర్లు రెండే ఉన్నాయి! ఒకటి అమెరికాలో, రెండోది రష్యాలో. 1950లో భౌతిక శాస్త్ర పరిశోధకులు స్టాన్లీ గెరాల్డ్ థాంప్సన్, కెనెత్ స్ట్రీట్ జూనియర్, అల్బర్ట్ గిరోసో, గ్లెన్ టి.సీబోర్గ్ దీన్ని తొలిసారిగా తయారు చేశారు. ఈ రేడియో ధారి్మక పదార్థాన్ని భూగర్భంలో బంగారు, వెండి నిల్వల అన్వేషణతో పాటు ఇంధన క్షేత్రాల్లో చమురు, నీటి పొరలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. -
బంగారం అక్రమ రవాణా తగ్గుతుంది..
న్యూఢిల్లీ: బంగారంపై భారీగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుందని సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డ్) చైర్మన్ సంజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. అలాగే దేశంలోని రత్నాలు ఆభరణాల ఎగుమతులు పెరగడానికి, ఉపాధి వృద్ధికి సహాయపడుతుందని ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24) కస్టమ్స్ శాఖ, డీఆర్ఐ కలిసి 4.8 టన్నుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2022–23లో ఈ పరిమాణం 3.5 టన్నులు కావడం గమనార్హం. యల్లోమెటల్సహా పలు విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ ఉపాధి కల్పన రత్నాలు, ఆభరణాల రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఎగుమతుల్లో ఈ రంగం వాటా 8 శాతం వరకూ ఉందని కుమార్ మల్హోత్రా తెలిపారు. దేశానికి 2023–24లో 45.54 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు జరిగాయి. వెండి విషయంలో ఈ విలువ 5.44 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో ఆభరణాల ఎగుమతులు విలువ 13.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా భారత్ 800 నుంచి 900 టన్నుల పసిడి దిగుమతులను చేసుకుంటోంది. బంగారం దిగుమతులలో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో ఈ దేశం వాటా దాదాపు 40 శాతం. తరువాతి 16 శాతానికిపైగా వాటాతో యూఏఈ రెండవ స్థానంలో ఉంది. 10 శాతం వాటాలో దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో నిలుస్తోంది. 2022లో పెరిగిన సుంకాలుదేశంలోకి వచీ్చ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భారీ పెరుగుదలను నివారించడానికి 2022 జూలైలో (10.75 శాతం నుంచి 15 శాతానికి) కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2022–23లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతంగా ఉన్న క్యాడ్, 2023–24లో ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా మిగులు నమోదయ్యింది. -
ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం
-
Hyd : నిందితుల నుంచి కిలో ఆల్ఫాజోలం స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
-
జాఫర్ సాధిక్ అరెస్ట్
సాక్షి, చైన్నె: మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో తమిళ సినీ నిర్మాత జాఫర్ సాధిక్‌ను శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆయన వద్ద తీవ్ర విచారణ జరుగుతోంది. గతనెల ఢిల్లీలో రూ. 2 వేల కోట్లు విలువైన మాదక ద్రవ్యాలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణలో ఈ స్మగ్లింగ్‌కు సూత్రదారి చైన్నెకు చెందిన సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాధిక్‌గా తేలింది. మూడేళ్లలో జాఫర్ సాధిక్ ముఠా 3,500 కేజీల మత్తు పదార్థాలను తమిళనాడు నుంచి పలు దేశాలకు స్మగ్లింగ్ చేసినట్టు విచారణలో తేలింది. తనను ఎన్సీబీ టార్గెట్ చేయడంతో జాఫర్ సాధిక్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి సోదరులు సలీం, మైదీన్ కూడా పత్తా లేకుండా పోయారు. ఇంట్లో ఉన్న వాళ్లందరూ ఎక్కడకువెళ్లారో అంతు చిక్కని పరిస్థితి. విచారణకు రావాలని జాఫర్ సాధిక్ ఇంటి వద్ద ఎన్సీబీ అధికారులు నోటీసులు అంటించి సైతం వెళ్లారు. అజ్ఞాతంలో ఉన్న సాధిక్ కోసం పలు నగరాల్లో గాలించారు. నెల రోజులుగా మకాం మారుస్తూ వచ్చిన సాధిక్ ఎట్టకేలకు ఎన్సీబీ అధికారులకు చిక్కారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో శనివారం అతడిని అరెస్టు చేశారు. ఢిల్లీకి తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఈ విషయంగా ఎన్సీబీ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొంటూ, అరెస్టు చేశామని విచారణ జరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన సొమ్మును జాఫర్ సాధిక్ సినిమాలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందన్నారు. ఇతగాడితో సత్సంబంధాలు కలిగిన వారి వివరాలను సేకరిస్తున్నామని, అలాగే, ఏదేని రాజకీయ పార్టీ, నాయకులకు నిధులు, విరాళాలు ఇచ్చి ఉన్న పక్షంలో వారిని కూడా విచారణ వలయంలోకి తీసుకొచ్చే విధంగా ఎన్సీబీ ఉరకలు తీస్తుండటం గమనార్హం. ఇతగాడు ఫుడ్ డెలివరి, ఫుడ్ ఎగుమతి పేరిట మాదక ద్రవ్యాలు విదేశాలకు పెద్దఎత్తున పంపించినట్టు విచారణలో వెలుగు చూసింది. -
రూ.3.61 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాదీనం
సాక్షి, అమరావతి: అక్రమంగా రవాణా చేస్తున్న రూ.3.61కోట్ల విలువైన 72.30లక్షల విదేశీ సిగరెట్లను కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు ఈ నెల 5, 6 తేదీల్లో కోల్కత్తా–చెన్నై జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. నెల్లూరు సమీపంలో 33.30 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న ఓ వాహనాన్ని, బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలో 39 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న మరో వాహనాన్ని గుర్తించారు. ఆ విదేశీ సిగరెట్ల ప్యాకెట్లపై తయారీ కంపెనీ వివరాలు, ఎక్సై్పరీ తేదీ, ఇతర వివరాలు ఏవీ లేవు. వాటిని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లు ఆ విదేశీ సిగరెట్లను దిగుమతి చేసుకున్నట్టు తగిన పత్రాలు గానీ పన్ను చెల్లించిన రశీదులను గానీ చూపించలేకపోయారు. దాంతో మొత్తం రూ.3.61కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు మూడు నెలల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4.88కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
DRI SUMMIT: దేశాల మధ్య సమన్వయంతోనే స్మగ్లింగ్ నిరోధం సాధ్యం
న్యూఢిల్లీ: అక్రమ రవాణా, వ్యాపారం వెనుక ఉన్న సూత్రధారులను అణిచివేసేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాల సమన్వయం అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. చట్టవిరుద్ధ వ్యాపారం వెనుక ఉన్న ‘‘మాస్టర్ మైండ్స్’’ ను పట్టుకోవడంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు పౌరుల ప్రయోజనాలను దెబ్బతీసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిరోధానికి విచారణా సంస్థల సమన్వయ చొరవలు అవసరమని ఆమె అన్నారు. అక్రమంగా రవాణా, లేదా చట్టవిరుద్ధ వ్యాపార స్వభావం గత 50 నుంచి 60 సంవత్సరాలుగా మారలేదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. విలువైన లోహాలు, మాదక ద్రవ్యాలు, అటవీ లేదా సముద్ర జీవుల అక్రమ రవాణా కొనసాగడం విచారకరమని అన్నారు. అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ ముప్పును అరికట్టడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆమె ఈ సందర్బంగా అన్నారు. సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడంలో సాంకేతికత వినియోగం చాలా ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఎన్ఫోర్స్మెంట్ మేటర్స్ 2023’’ అన్న అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇక్కడ నిర్వహించిన ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్‌ను ఉద్ధేశించి ఆర్థికమంత్రి చేసిన ప్రారంభోపన్యాసంలో కొన్ని ముఖ్యాంశాలు.. ► చాలా వరకు అక్రమంగా వ్యాపారం చేసే వస్తువులు అలాగే ఉంటాయి. కస్టమ్స్ అధికారులు కంగుతినేంత స్థాయిలో కొత్త వస్తువుల అక్రమ రవాణా ఏదీ లేదు. దశాబ్ద కాలంగా ఇదే ధోరణి కొనసాగుతుందంటే... దీని వెనుక ఉన్న శక్తులు ఎవరో సమాజానికి తెలియాలి. ∙అక్రమ రవాణా సూత్రధారుల అణచివేతకు డబ్ల్యూసీఓ (ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్)తో పాటు ప్రభుత్వాల మధ్య సహకారానికి చాలా ముఖ్యం. తద్వారా అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకో గలుగుతాము. ► జప్తు చేసిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, మార్కెట్లోకి తీసుకురాకుండా అడ్డుకోగలిగితే, అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం తేలికవుతుంది. ► అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడినవారికి శిక్ష తప్పదని, ఆయా చర్యల నిరోధం సాధ్యమేనని ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం మన కర్తవ్యం. ► బంగారం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, పురాతన వస్తువులు, వన్యప్రాణి సంపద అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా అవసరం. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థలన్నింటినీ దెబ్బతీస్తుంది. ► దొంగిలించిన, అక్రమంగా తరలించిన పురాతన వస్తువులన్నింటినీ వాటికి సంబంధించిన స్వదేశాలకు తిరిగి అప్పగించాల్సిన అవసరం ఉంది. దీనికీ అంతర్జాతీయ సమన్వయం, సహకారం అవసరం. ► ఈ కార్యక్రమంలో డీఆర్ఐ ’ఆపరేషన్ శేష’ నాల్గవ దశను మంత్రి ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌కు ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ రీజినల్ ఇంటెలిజెన్స్ లైజన్ ఆఫీస్ (ఆర్ఐఎల్ఓ) ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్‌ల సహకారం అందిస్తోంది. కలప అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు 2015లో తొలిసారిగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు. అక్రమ రవాణా పెరుగుతోంది: సంజయ్ కుమార్ అగర్వాల్ పరోక్ష పన్నులు– కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) చీఫ్ సంజయ్ కుమార్ అగర్వాల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం పరస్పరం అనుసంధానం కావడం, ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి వంటి అంశాల నేపథ్యంలో పురాతన వస్తువులు, సిగరెట్లు, బంగారం, అంతరించిపోతున్న వన్యప్రాణులసహా నిషేధిత వస్తువుల అక్రమ తరలింపు పెరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ డ్రగ్ ట్రాఫికింగ్ విలువ దాదాపు 650 బిలియన్ డాలర్లని ఆయన పేర్కొన్నారు. మొత్తం అక్రమ ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఈ వాటా దాదాపు 30 శాతమని తెలిపారు. ఇది తీవ్ర ప్రభావాలకు దారితీస్తోందని పేర్కొన్న ఆయన, మనీలాండరింగ్ తీవ్రవాద కార్యకలాపాల ఫైనాన్షింగ్ ఫైనాన్సింగ్‌కు ఇది దారితీస్తోందని, ఆయా అంశాలు జాతీయ భద్రతపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నిరోధానికి విచారణా సంస్థల మధ్య సన్నిహిత సమన్వయ చర్యలు అవసరమని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, స్మగ్లింగ్ ముప్పును ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. వ్యాపార వ్యయాలను తగ్గించి, పోటీతత్వాన్ని పెంచే సులభతర వాణిజ్య చర్యలను కూడా ఈ దిశలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎరువుల అక్రమ రవాణాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు ఇతర రాష్ట్రాలకు అనధికారిక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజిలెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్‌ఎంఎఎస్ ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్ చెప్పారు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 50 మంది రైతులతో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) రిజిస్ట్రేషన్‌తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్‌పీవోలతో అగ్రిమెంట్ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్ ద్వారా ఈ–క్రాప్ నమోదు చేయాలన్నారు. -
దుబాయ్ టు సిటీ.. గోల్డ్ స్మగ్లింగ్
సాక్షి, హైదరాబాద్:ఆదివారం రూ.1.25 కోట్ల విలువైన 2 కేజీలు.. శనివారం రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోలు.. గురువారం రూ.33.53 లక్షల విలువైన 553 గ్రాములు..మంగళవారం రూ.93.26 లక్షల విలువైన 1.52 కేజీలు.. ఈ నెల 6న రూ.1.18 కోట్ల విలువైన 1.92 కేజీలు.. 4న రూ.28 లక్షల విలువైన 461 గ్రాములు.. 2న రూ.82.42 లక్షల విలువైన 1.34 కిలోలు.. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న బంగారం లెక్కలు ఇవి. నగరానికి పెద్దయెత్తున బంగారం అక్రమ రవాణా అవుతుండటం కస్టమ్స్ అధికారులనే కలవరపరుస్తోంది. ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు మొత్తం రూ.9.66 కోట్ల విలువైన 15.79 కేజీల బంగారం పట్టుబడగా..ఇందులో 95 శాతానికి పైగా దుబాయ్ నుంచి తెచ్చిందే కావడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా గణనీయంగా పెరుగుతోంది. కిలోకు రూ.5 లక్షల లాభం విదేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలంటే పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 మాత్రమే ఉండేది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడికి ఉన్న ప్రతి 15 రోజుల సరాసరి ధరను పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం చెల్లించేలా కేంద్రం నిబంధనలు సవరించింది. ఈ కారణంగానే బంగారం స్మగ్లింగ్ పెరుగుతుండగా..దొంగ రవాణా విజయవంతమైతే అన్ని ఖర్చులూ పోనూ స్మగ్లర్లకు కిలోకు కనిష్టంగా రూ.5 లక్షల లాభం ఉంటున్నట్లు తెలుస్తోంది. టికెట్లు కొనిచ్చి.. విదేశాలకు పంపి.. బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవాణాకు పాల్పడటం ద్వారా పెద్దయెత్తున లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థల యజమానులు, రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులతో పాటు పాత నేరగాళ్లు సైతం క్యారియర్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా ప్రారంభించారు. మధ్యవర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీకి యువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టికెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేటప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరినే సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలుస్తున్నారు. స్మగ్లర్లకు స్వర్గధామంగా దుబాయ్ దుబాయ్‌లో ఆదాయపుపన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్ అన్నదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడినుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి, దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకువస్తున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దాన్ని విమానంలోకి తీసుకువచ్చేటప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు. దీన్ని ఆసరాగా చేసుకునే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. జోరుగా రెక్టమ్ కన్సీల్మెంట్.. చాలామంది స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మైబైల్ చార్జర్స్ లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తర్వాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తేవడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రెక్టమ్ కన్సీల్మెంట్ కూడా జోరుగా జరుగుతోంది. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు సూత్రధారులు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని అక్కడ దాచిపెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. క్లెయిమ్ చెయ్యకుంటే వేలం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95 శాతం ప్రొఫైలింగ్ పదర్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం తదితరాలను పరిగణలోకి తీసుకుంటారు. బయటి రాష్ట్రాల పాస్‌పోర్టులు కలిగిన వారు ఇక్కడ లాండ్ అయినా అనుమానిస్తారు. బంగారం స్మగ్లింగ్ వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్ బంగారం తనదే అని క్లైమ్ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైల్లో కస్టమ్స్ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం వేయడం ద్వారా విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. రియాద్ నుంచి వయా మస్కట్ శంషాబాద్ (హైదరాబాద్): రియాద్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రియాద్ నుంచి వయా మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న షేక్‌ఖాజా, షేక్‌జాని అనే ఇద్దరు ప్రయాణికులు కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని లాంజ్‌లోని సిటీసైడ్ ఏరియాలోకి వచ్చారు. వారి కదలికలను అనుమానించిన సీఐఎస్ఎఫ్ అధికారులు మరోసారి లగేజీని ఈకో–5 యంత్రంలో తనిఖీ చేశారు. దీంతో డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లో ఉంచిన కిలో బరువు కలిగిన బంగారు గొలుసులు బయటపడ్డాయి. దీంతో నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. -
వార్నీ.. ఈ ఐడియాలు ఎలా వస్తాయో, చీరను ఇలా కూడా వాడచ్చా!
హైదరాబాద్: బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే కొందరు బంగారం దుకాణాలు పెడుతుంటే, ఇంకొందరు బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే మరికొందరు మాత్రం ఇవేవి వద్దంటూ.. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ మార్గాన్ని ఎంచుకుని అక్రమంగా గోల్డ్ తరలిస్తూ ఇప్పటివరకు చాలా మంది ఎయిర్‌పోర్ట్‌లోనే పట్టుబడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఈ దారిలోప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఉన్న గిరాకీ అలాంటిది మరీ. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి గోల్డ్‌ని అత్యంత తెలివిగా లిక్విడ్‌గా మార్చి చీరపై స్ప్రే చేసుకొని తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారు చీర ధర 28.01లక్షల రూపాయలు చేస్తుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దీనిపై విచారణ జరపుతున్నారు. 28 lakhs worth of gold was seized by customs at @RGIAHyd from a Dubai passenger. He concealed the gold by spraying it over clothes and packed it amidst the luggage. #gold #goldsmuggling #RGIA@hydcus @cbic_india @XpressHyderabad@NewIndianXpress pic.twitter.com/d9llirhQb3 — Priya Rathnam (@Rathnam_jurno) August 4, 2023 -
లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ
బీజింగ్: దక్షిణ చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ ఎయిర్ పోర్టులో ఒకామె తన లోదుస్తుల్లో ఐదు బ్రతికున్న పాములను అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది. ఆమె శరీరాకృతి విచిత్రంగా ఉండటంతో అనుమానం వచ్చి శెంజిన్ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అదేంటో.. ప్రపంచంలో చిత్ర విచిత్రమైన సంఘటనలన్నీ చైనాలోనే చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్ పోర్టుల్లో ఈ విధంగా జీవులను తరలిస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అత్యధిక స్మగ్లర్లు బ్యాగుల్లో, బాక్సుల్లో లేదా మరో విధంగా వాటిని తరలిస్తూ ఉంటారు. కానీ ప్రమాదకరంగా విషపూరితమైన సర్పాలను శరీరంలో దాచుకుని తరలించిన సంఘటనలు చాలా అరుదు. కస్టమ్స్ అధికారులు పేరు చెప్పడానికి నిరాకరించిన దక్షిణాఫ్రికాకు చెందిన సదరు మహిళ సజీవంగా ఉన్న ఒక్కో పాముని ఒక్కో స్టాకింగ్ లో పెట్టి ప్యాక్ చేసింది. ఆ ఐదు స్టాకింగ్ బ్యాగులను తన ఛాతీ వద్ద లోదుస్తుల్లో జాగ్రత్తగా పెట్టుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా యధాతధంగా పైన డ్రెస్ వేసుకుంది. ఆమె ఎయిర్ పోర్టులోకి అడుగుపెడుతూనే కస్టమ్స్ అధికారులకు ఆమె ఆకృతి చూసి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అడ్డగించి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఐదు పాములను జెర్రిపోతులుగా గుర్తించి వాటిని జంతు సంరక్షణ శాలకు తరలించారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా? -
ఆ ఎర్రచందనం మాదే.. మాకూ వాటా ఇవ్వండి
సాక్షి, అమరావతి : అక్రమంగా రవాణా అవుతూ ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు ఏపీలోనివే కాబట్టి వాటిలో తమకూ వాటా ఉంటుందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్మగ్లింగ్ చేస్తుండగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసినప్పుడు వచ్చిన సొమ్ములో సగం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర అటవీ శాఖ, ఇతర రాష్ట్రాల అటవీ శాఖాధికారులతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరిగే అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టŠస్ (పీసీసీఎఫ్)ల సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్ర చందనం చెట్లు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. ప్రత్యేకమైన వాతావరణంలో పెరిగే ఈ వృక్షాలు అత్యంత అరుదైనవి. ఇతర ప్రాంతాల్లోనూ ఎర్రచందనం పెరుగుతుంది. కొన్ని చోట్ల తోటల్లో కూడా పెంచుతారు. అయితే, శేషాచలం చెట్లతో పోల్చితే అవి నాసిరకం. వీటిని సి గ్రేడ్‌గా పిలుస్తారు. అత్యంత నాణ్యంగా ఉండే ఎ గ్రేడ్ ఎర్రచందనం శేషాచలంలోనిదే. దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకే ఈ చెట్లను అక్రమంగా నరికి విదేశాలకు, ముఖ్యంగా చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు. ఈ వేలంలో విదేశీ కంపెనీలు కూడా పాల్గొంటాయి. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఈ ఎర్రచందనం ఏపీలో పెరిగిన అరుదైన వృక్షజాతి కాబట్టి అది దేశంలో ఎక్కడ దొరికినా అందులో సగం ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అవసరమైతే వేలం వేసే దుంగల్ని పరిశీలించి ఎక్కడివో నిర్ధారించాలని సూచించింది. దుంగలను చూడగానే అది ఎక్కడిదో చెప్పవచ్చని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏ గ్రేడ్ సరుకు అయితే ఎక్కువ వెడల్పు, ఎక్కువ బరువుతోపాటు లోపల ఎర్ర రంగు ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రం వద్ద 5,376 టన్నుల ఎర్రచందనం దుంగలు ఉండగా, ఇతర రాష్ట్రాలు, సంస్థల వద్ద సుమారు 8 వేల టన్నులు ఉంది. బయట ఉన్న సరుకులో సగం వాటా మనకు వస్తే దాదాపు రూ. 2 వేల కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. 50 శాతం వాటా అడుగుతున్నాం ఇతర రాష్ట్రాల్లో సీజ్ చేసిన ఎర్రచందనంలో సగం ఏపీకి ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖను కోరుతున్నాం. త్వరలో జరిగే జాతీయ స్థాయి సమావేశంలో దీనిపై గట్టిగా పట్టుబడతాం. దేశంలో అక్రమంగా రవాణా అవుతూ దొరికిన సరుకంతా ఇక్కడిదే. దాన్ని చూడగానే చెప్పొచ్చు. అందుకే దానిపై మన రాష్ట్రానికి హక్కు ఉంటుంది. – మధుసూదన్ రెడ్డి, అటవీదళాల అధిపతి, పీసీసీఎఫ్ -
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్
బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెండితెరపై కూడా పలు అవకాశాలు దక్కించుకున్నారు. తాజాగా జమర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదు అయింది. అతని ముఠాకు చెందిన కిషోర్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. (ఇదీ చదవండి: గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు) కానీ కమెడియన్ హరి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికే అతనిపై ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ షో ద్వారా లేడీ గెటప్‌లో చాలా రోజుల నుంచి హరి మెప్పిస్తున్న విషయం తెలిసిందే (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. అయినా దొరికిపోయారు
-
ఇదేం తెలివిరా నాయనా.. చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. చివరికి!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 269 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ల లోపల రూ.16.5 లక్షల విలువైన బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికులను అధికారులు పరిశీలించగా.. 269 గ్రాముల బంగారాన్ని చాక్లెట్ కవర్లలో చుట్టి తీసుకొచ్చినట్లు గుర్తించారు అట్టపెట్టెలో ఉంచిన 13 చాక్లెట్లలో 13 చిన్న బంగారు ముక్కలను అమర్చి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద 269 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: ‘గీత కార్మికుల బీమా’పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం -
ఏంది రా అయ్యా ఇది.. రెండేళ్ల చిన్నారి డైపర్‌లో..
యశవంతపుర(బెంగళూరు): విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లర్లు విచిత్రమైన మార్గాల్లో తెస్తూ దొరికిపోతున్నారు. రెండేళ్ల చిన్నారి డైపర్‌లో బంగారాన్ని దాచి తీసుకొచ్చిన ప్రయాణికున్ని మంగళూరు విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి బెల్ట్‌లో నడుం కట్టుకొని తెస్తుండగా పట్టుకున్నారు. మరో వ్యక్తిలో దుస్తుల్లో ద్రావణం రూపంలో బంగారాన్ని తెచ్చారు. తనిఖీల్లో గుర్తించి బంగారాన్ని సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. మార్చి 1 నుండి 15 వరకు రూ. 90 లక్షలు విలువగల 1.606 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: అనంతపురంలో విషాదం.. వారం కిందటే పెళ్లి.. ఏం జరిగిందో ఏమో! -
ఓర్ని.. చెప్పులో బంగారు దాచిపెట్టిన ప్రయాణికుడు.. ఎలా పట్టుబడ్డాడో చూడండి..
-
మహిళా కాంగ్రెస్ నేత అరెస్ట్.. కారణం ఇదే..
గాంధీనగర్: గుజరాత్‌కు చెందిన మహిళా కాంగ్రెస్ నేత మేఘనా పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, విదేశీ మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో దాదాపు రూ. 10లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. విదేశీ మద్యం అక్రమ రవాణా కేసులో మేఘనా పటేల్‌ను గుజరాత్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, ఆమె.. తన బొలెరో కారులో విదేశీ మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పిప్లాడ్ రోడ్డు ప్రాంతంలో మేఘనా పటేల్ కారును ఆపి చెక్ చేశారు. ఈ సందర్బంగా కారు నడుపుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా.. మేఘనా పటేల్ కోసం రూ.7.5 లక్షలకు పైగా విలువైన విదేశీ మద్యం తీసుకొచ్చినట్లు తేలింది.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో, విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, ఈ విదేశీ మద్యం ఎక్కడ నుంచి వచ్చింది.. దీన్ని ఎవరు విక్రయించారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మేఘనా పటేల్, కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, మేఘనా పటేల్ మాజీ మహిళా ఉపాధ్యక్షురాలుగా పని చేశారు. -
శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీఎత్తున బంగారం పట్టుబడింది. సుడాన్ జాతీయులైన 23 మంది మహిళలు సుడాన్ నుంచి వయా షార్జా మీదుగా జి9–458 విమానంలో గురువారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. లగేజీల స్కానింగ్‌లో బంగారం బయటపడడంతో అధికారులు అప్రమత్తమై మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బూట్ల అడుగున ప్రత్యేకంగా తయారు చేసిన భాగంలో పెద్దఎత్తున ఆభరణాలు సైతం బయటపడ్డాయి. మొత్తం 14 కేజీల 906 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.7.89 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. స్మగ్లర్లకు అందించేందుకే.. సుడాన్‌కు చెందిన మహిళలందరూ క్యారియర్లుగానే బంగారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. స్మగ్లర్లకు అక్రమంగా బంగారం చేరవేసేందుకే వీరు షార్జా మీదుగా హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. గతంలో కూడా సుడాన్‌కు చెందిన పలువురు మహిళలు అక్రమంగా బంగారం, విదేశీ నగదుతో పట్టుబడిన కేసులున్నాయి. వీరి సెల్ఫోన్ల ఆధారంగా బంగారం స్మగ్లర్ల వివరాలను తెలుసుకునేందుకు కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
సూడాన్ స్మగ్లర్ల నుంచి 100 కిలోల బంగారం సీజ్
ముంబై: భారత్–నేపాల్ సరిహద్దుల గుండా బంగారాన్ని అక్రమంగా తరలించే ముఠాకు చెందిన ఏడుగురు సూడాన్ దేశస్తులు సహా 10 మంది అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) మంగళవారం తెలిపింది. వారి నుంచి రూ.51 కోట్ల విలువైన 101 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు వెల్లడించింది. పట్నా, పుణే, ముంబైల్లో‘ఆపరేషన్ గోల్డెన్ డాన్’పేరిట చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ముఠా నుంచి రూ.1.35 కోట్ల దేశ, విదేశీ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. పేస్ట్ రూపంలో బంగారాన్ని భారత్–నేపాల్ సరిహద్దుల గుండా పటా్నకు అక్కడి నుంచి ముంబై సహా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు, వేర్వేరు మార్గాల్లో ఈ ముఠా రవాణా చేస్తోందని డీఆర్ఐ వివరించింది. చదవండి వామ్మో.. భారతీయులు ప్రయాణాలపై నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా! -
స్మగ్లింగ్ దందా.. 51 లక్షల ఉద్యోగాలకు ఎసరు
సాక్షి, అమరావతి: తక్కువకు వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది స్మగుల్ గూడ్స్ కొంటూ ఉంటారు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా ఏటా లక్షల కోట్లు చేతులు మారతాయంటే నమ్మగలమా? ఈ స్మగ్లింగ్ వల్ల ఏటా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తోంది. దేశంలో పరిశ్రమల విస్తరణకు విఘాతంగా మారి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది. స్మగ్లింగ్ దందా దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగా దెబ్బతీస్తోందనే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రముఖ మార్కెట్ అధ్యయన సంస్థ ‘థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(టీఏఆర్‌ఐ) ద్వారా అధ్యయనం చేయించింది. దేశ మార్కెట్లోకి అక్రమంగా చొరబడుతున్న ఉత్పత్తుల్లో మొదటి ఐదు స్థానాల్లో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, గృహ వినియోగ, మద్యం, పొగాకు ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఐదు కేటగిరీల్లో స్మగ్లింగ్ దందా ప్రభావాన్ని టీఏఆర్‌ఐ ద్వారా అధ్యయనం చేశారు. విదేశాల నుంచి దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్న టాప్–5 ఉత్పత్తుల విలువ ఏటా రూ. 2.60 లక్షల కోట్లుగా ఉంటోంది. దాంతో భారత ప్రభుత్వం పన్నుల ద్వారా రావాల్సిన రూ. 58 వేల కోట్ల ఆదాయాన్ని ఏటా కోల్పోతోంది. అంతే కాదు 51 లక్షల ఉపాధి అవకాశాలకు కూడా గండి పడుతోంది. ఆ ఐదు కేటగిరీల స్మగ్లింగ్ తీవ్రత ఎలా ఉందంటే.. ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు దేశంలోకి ఏటా సగటున రూ. 1,42,284 కోట్ల విలువైన ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల మార్కెట్లో ఈ అక్రమ దిగుమతి ఉత్పత్తుల వాటా ఏకంగా 25.09 శాతం ఉంటోంది. తద్వారా దేశం రూ. 17,074 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. అంతేకాదు అక్రమ ఉత్పత్తులతో దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల పరిశ్రమను దెబ్బతీస్తోంది. దాంతో దేశంలో 7.94 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. గృహ వినియోగ ఉత్పత్తులు గృహోపకరణాలు, గృహవినియోగ ఉత్పత్తులు, వ్యక్తిగత వినియోగ ఉత్పత్తులే దేశంలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ ఉత్పత్తులు కొల్లగొడుతున్నాయి. దేశంలోకి ఏటా రూ. 55,530 కోట్ల విలువైన గృహవినియోగ ఉత్పత్తులు అక్రమగా దిగుమతి అవుతున్నాయి. మొత్తం మార్కెట్ వాటాలో ఈ ఉత్పత్తుల వాటా 34.25 శాతం ఉంది. దాంతో దేశం ఏటా రూ. 9,995 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఇక పరిశ్రమలు దెబ్బతినడంతో దేశంలో ఏటా 2.89 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. మద్యం ఉత్పత్తులు.. విదేశాల నుంచి వచ్చే అక్రమ మద్యం దేశ మార్కెట్‌ను కొల్లగొడుతోంది. ఏటా రూ. 23,466 కోట్ల విలువైన విదేశీ అక్రమ మద్యం దేశ మార్కెట్లోకి చొరబడుతోంది. దేశంలో మద్యం మార్కెట్లో ఈ అక్రమ మద్యం వాటా 19.87 శాతం. దాంతో దేశం ఏటా రూ. 15,262 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 97 వేల మంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. పొగాకు ఉత్పత్తులు విదేశాల నుంచి దేశ మార్కెట్లోకి ఏటా రూ. 22,930 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తులు అక్రమంగా ప్రవేశిస్తున్నాయి. దేశ పొగాకు మార్కెట్లో ఈ ఉత్పత్తుల వాటా 20.04 శాతం ఉంది. దాంతో దేశం ఏటా సగటున రూ. 13,331 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 3.7 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. మొబైల్ ఫోన్ల మార్కెట్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ల మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ చీడ పీడిస్తోంది. విదేశాల నుంచి స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి ఏటా రూ. 15,884 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు వచ్చి చేరుతున్నాయి. దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో ఈ ఫోన్ల వాటా 7.56 శాతంగా ఉంది. దాంతో దేశం రూ. 2,859 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో పాటు దేశంలో 35 వేల మంది ఉపాధి అవకాశాలకు గండి పడుతోంది. -
స్మగ్లింగ్ కట్టడికి భారత్ నాయకత్వం వహించాలి
న్యూఢిల్లీ: వస్తు అక్రమ రవాణా (స్మగ్లింగ్) కారణంగా నష్టపోతున్న భారత్ దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ‘థింక్ చేంజ్ ఫోరమ్’ అనే సంస్థ ఓ నివేదికలో సూచించింది. ఈ విధమైన అక్రమ వాణిజ్య విధానాలను నిరోధించడం వల్ల ఏటా 31 బిలియన్ డాలర్లు (రూ.2.54 లక్షల కోట్లు) ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలకు ఆదా అవుతుందని పేర్కొంది. అంతేకాదు, ఏటా 1,64,000 (2030 నుంచి) ముందస్తు మరణాలను కూడా అరికట్టొచ్చని సూచించింది. ఈ మరణాల్లో అధిక భాగం తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోనే నమోదవుతున్నట్టు తెలిపింది. స్మగుల్డ్ ఉత్పత్తులను వినియోగించే పెద్ద మార్కెట్ల లో భారత్ కూడా ఉందంటూ.. దీని వల్ల ఏటా పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోతున్నట్టు వివరించింది. అందుకే ఈ విషయంలో భారత్ ప్రపంచంలో నా యకత్వ పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. అతి పెద్ద వినియోగ దేశమైన భారత్‌దు చిట్ట విరుద్ధమైన ఉత్పత్తుల వల్ల నష్టపోతోందని, అంతర్జాతీయంగా దీనిపై సమన్వయానికి ముందుకు రావాలని కోరింది. ఒక్క పొగాకు ఉత్పత్తుల దొంగ రవాణా వల్ల ప్రపంచ దేశాలు ఏటా 40.5 బిలియన్ డాలర్లు (రూ.3.32 లక్షల కోట్లు) నష్టపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. కలసికట్టుగా పోరాడాలి.. అంతర్జాతీయంగా స్మగుల్డ్ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని థింక్ చేంజ్ ఫోరమ్ సంస్థ సూచించింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వస్తు అక్రమ రవాణా పెద్ద సవాలుగా ఉన్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ బ్రాండ్లు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఉన్నాయని, ఇవి స్మగుల్డ్ కంటే నకిలీ ఉత్పత్తుల సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ‘‘స్మగ్లింగ్ అనేది వినియోగ దేశం ఆదాయ నష్టపోవడానికి కారణమవుతుంది. అంతర్జాతీయ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయి. స్మగుల్డ్ రూపంలో వినియోగదారులకు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. కనుక స్మగ్లింగ్ అంశంపై భారత్ అంతర్జాతీయంగా ఏకాభిప్రాయానికి కృషి చేయాలి’’అని ఈ నివేదిక సూచించింది. అంతర్జాతీయ వేదికపై స్మగ్లింగ్ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారత్ వర్ధమాన దేశాల స్వరాన్ని వినిపించొచ్చని, ప్రపంచ నేతగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. బ్రాండెడ్ ఉత్పత్తులు అక్రమ మార్గాల్లో భారత్‌లోకి వస్తే ఆయా ఉత్పత్తుల కంపెనీల యాజమాన్యాలను బాధ్యులుగా చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఈ ఫోరమ్ సూచించింది. ‘‘ఆయా బ్రాండ్ యజమానాలను కార్పొరేట్ శాఖ శిక్ష విధించాలి. అంతర్జాతీయంగా ఇదొక దురాచారంగా మారింది. పేరొందిన బ్రాండ్లు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో తక్కువ కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయి. సబ్సిడరీ ద్వారా నేరుగా భారత్‌లోకి దిగు మతి చేసుకోకుండా, అవి అంతర్జాతీయ ట్రేడ ర్లు, పంపిణీదారులకు విక్రయిస్తున్నాయి. వారి నుంచి అక్రమ మార్గాల్లో ఉత్పత్తులు అనధికారిక మార్కెట్ల ను చేరుతున్నాయి’’అని నివేదిక పేర్కొంది. -
ఆవు పేడతో కట్టిన ఇళ్లతో అణుధార్మికత నుంచి రక్షణ
వియారా(గుజరాత్): ఆవు పేడతో నిర్మించిన ఇళ్లు అణుధార్మికత నుంచి రక్షణ ఇస్తాయనే విషయం సైన్సు నిరూపించిందని గుజరాత్‌లోని తాపి జిల్లా సెషన్స్ జడ్జి సమీర్ వ్యాస్ పేర్కొన్నారు. గో మూత్ర ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుందని తెలిపారు. అందుకే దేశంలోని గోవులను, వధించడం మానేసి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన ఓ వ్యక్తికి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో ఈ విషయాలను ఆయన పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రపంచంలోని అన్ని సమస్యలకు గోవధే కారణమని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అమిన్ అంజుమ్(20) 2020లో గుజరాత్ నుంచి ఆవులను తరలిస్తూ పట్టుబడ్డాడు. -
వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు..
ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ భారీ స్మగ్లింగ్‌ను నిలువరించారు. ఓ వ్యక్తి నుంచి రూ.28 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను బ్యాగులో దీన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. బ్యాగును చింపి కొకైన్‌ను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #WATCH | Mumbai Airport Customs y'day arrested an Indian pax carrying 2.81 Kg cocaine worth Rs 28.10 Cr, concealed in a duffle bag. Probe shows that pax was lured to carry drugs by persons whom he met only over social media. He was honey trapped to indulge in smuggling: Customs pic.twitter.com/oCxBG5F2CP — ANI (@ANI) January 10, 2023 ఈ వ్యక్తి బ్యాగులో మొత్తం 2.81కిలోల కొకైన్ దొరికింది. దీని విలురు రూ.28.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యక్తి ఓ మహిళ వలపు వలలో చిక్కుకునే స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ, ఇతడ్ని కొకైన్ ఢిల్లీకి తీసుకెళ్లి మరో వ్యక్తికి ఇవ్వమని చెప్పిందని పేర్కొన్నారు. ఆమె మాయలో పడిన ఇతడు స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు వివరించారు. గతవారం కూడా ముంబై విమానాశ్రయంలో రూ.47 కోట్లు విలువ చేసే కొకైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 4.47 కేజీల హెరాయిన్, 1.6 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. చదవండి: ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి -
గంజాయి స్మగ్లింగ్ చేశాను.. పోలీసులకు దొరక్కుండా బోర్డర్ దాటించా: కోన వెంకట్
ప్రముఖ రచయిత కోన వెంకట్‌కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. నిన్నుకోరి, జై లవకుశ సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. ఓ వైపు రైటర్‌గా పనిచేస్తూనే, మరోవైపే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో గంజాయి స్మగ్లింగ్ చేశానంటూ రివీల్ చేశారు. ''ఆర్థికసమస్యల వల్ల అప్పుల్లో కూరుకుపోయిన నా ఫ్రెండ్ ఒకడు దాన్నుంచి బయటపడేందుకు గంజాయి పండించాడు. ఆ మొత్తాన్ని గోవాకి తరలించి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడు. కానీ దారిలో పోలీసులకు దొరికిపోయాడు. ఇంక అంతా అయిపోందనుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. చావుబతుకుల్లో ఉన్నప్పుడు మాకు విషయం తెలిసి ఎలాగైనా వాడి అప్పులు తీర్చాలని డిసైడ్ అయ్యాం. మా నాన్న అప్పుడు డీఎస్పీ కావడంతో ఆయన కారులోనే గంజాయి అమ్మేందుకు గోవా వెళ్లాం. మహబూబ్‌నగర్, కర్ణాటక, గోవా ఇలా 3 చెక్ పోస్టులు పగడ్బందీగా దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకొచ్చాం. దాంతో నా స్నేహితుడి అప్పులన్నీ తీర్చేశాం. కానీ ఒకవేళ దొరికిపోతే మా పరిస్థితి ఏంటి అని చాలాసార్లు ఆలోచిస్తుంటాను. మా రియల్ లైఫ్‌లో జరిగిన ఈ స్టోరీనే సినిమాగా తీయాలని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. స్నేహితుడికి సహాయం చేయడం మంచిదే కానీ ఇలా గంజాయి స్మగ్లింగ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. -
Womens empowerment: ఉక్కు దళం
ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం... పచ్చని అడవి... చల్లని నది ప్రశాంతంగా కనిపిస్తాయి. అయితే చాప కింద నీరులా సంఘవిద్రోహశక్తులు వికటాట్టహాసం చేస్తుంటాయి. తమకు ఎదురు లేదని కొమ్ములు విసురుతుంటాయి. సంఘవిద్రోహశక్తుల అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి ‘ఓన్లీ ఉమెన్’ దళం రంగంలోకి దిగింది. స్త్రీ సాధికారతకు పట్టం కట్టేలా బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో మరో అడుగు పడింది. తాజాగా ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు విధులు నిర్వహించనున్నారు. ప్రసిద్ధ సుందర్ బన్ అడవుల్లో కొంత భాగం మన దేశంలో, కొంత భాగం బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉంది. సరిహద్దును ఆనుకొని ఉన్న అడవులు, చిన్న దీవులు, నదులు అనేవి సంఘ విద్రోహశక్తులకు అడ్డాగా మారాయి. ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరం అయింది. దీనికోసం బీఎస్ఎఫ్ సట్లెజ్, నర్మద, కావేరి, సబర్మతి, క్రిష్ణ, గంగ పేర్లతో బీవోపి (బార్డర్ ఔట్ పోస్ట్) లను ఏర్పాటు చేసింది. ‘బీవోపి’కి చెందిన ‘గంగ’ మహిళా జవానులు తొలిసారిగా సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన నిఘా విధులలో భాగం అవుతున్నారు. మనుషుల అక్రమ చొరబాటు, స్మగ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు దొంగల నుంచి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి జాలర్లను రక్షించే బాధ్యతలు కూడా ‘బీవోపి–గంగ’పై ఉన్నాయి. స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు, స్థానిక ప్రజలను సమన్వయం చేసుకుంటూ అటవీ ప్రాంతాలకు నష్టం జరగకుండా చూడాల్సి ఉంటుంది. ‘బీవోపి–గంగ’కు ఉపయోగించే మోటర్ బోట్‌ను కొచ్చిలో తయారుచేశారు. దీనిలో 35 మంది జవాన్లకు చోటు ఉంటుంది. అత్యాధునిక రాడార్, కమ్యూనికేషన్ సదుపాయాలు ఉన్నాయి. ‘బీవోపీ–గంగ తన సత్తా చాటబోతోంది. పోరాట పటిమ ప్రదర్శించబోతోంది. స్మగ్లింగ్ కార్యకలాపాల్లో కొందరు స్త్రీలు కూడా భాగం అవుతున్నారు. ఇకముందు వారిని అదుపులోకి తీసుకోవడం సులభం అవుతుంది’ అంటున్నారు సౌత్ బెంగాల్ ఫ్రంటియర్ బీఎస్ఎఫ్ డిఐజీ అమ్రిష్ ఆర్యా. -
ప్రతి కదలిక.. తెలిసిపోతుందిక..
సాక్షి, అమరావతి: అక్రమ రవాణాను అరికట్టడం, రహదారి భద్రత దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రయాణ, సరుకు రవాణా వాహనాల గమనాన్ని ట్రాకింగ్ చేసే వ్యవస్థను నెలకొల్పనుంది. అందుకోసం అన్ని వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. వాహనాల ట్రాకింగ్‌ను పర్యవేక్షించేందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో దాదాపు 1.52 కోట్ల వాహనాలున్నాయి. వాటిలో రవాణాయేతర (వ్యక్తిగత) వాహనాలు 1.35 కోట్ల వరకు ఉంటాయని అంచనా. మిగిలిన దాదాపు 17 లక్షల వాహనాలు వాణిజ్య వాహనాలు. వాటిలో ప్రయాణ వాహనాలు, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. ఈ 17 లక్షల వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. కేంద్ర రవాణాశాఖ తాజా మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును 2023 ఏప్రిల్ నుంచి దశలవారీగా అమలు చేయాలని రవాణాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదట ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల బస్సులకు ట్రాకింగ్ పరికరాలు అమరుస్తారు. ట్రాకింగ్ విధానాన్ని పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సరిచేసిన అనంతరం అన్ని ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటుచేస్తారు. 2024 జనవరి నాటికి రాష్ట్రంలో అన్ని వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటు పూర్తిచేయాలని రవాణాశాఖ భావిస్తోంది. 24/7 పర్యవేక్షణ ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేసిన వాహనాల ట్రాకింగ్‌ను 24/7 పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐసీతో రవాణాశాఖ త్వరలో ఒప్పందం చేసుకోనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు రూ.20 కోట్లు వెచ్చించనున్నారు. వాహనాల ట్రాకింగ్‌ను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు అవసరమైన ఆధునిక సమాచార సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు అక్కడ విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఎన్ఐసీ శిక్షణ ఇస్తుంది. అక్రమాలు, నేరాలకు అడ్డుకట్ట అక్రమ రవాణాను అరికట్టడం, రహదారి భద్రత కోసమే ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాకింగ్ పరికరం ఏర్పాటుతో వాహనాలు ఏ మార్గంలో ఏ సమయంలో ఎంతవేగంతో ప్రయాణిస్తోంది పర్యవేక్షించవచ్చు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించి సంబంధిత ప్రాంతంలోని పోలీసు, రవాణాశాఖ అధికారులను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయమై ఆ వాహనాల యజమానులకు సమాచారం ఇస్తారు. దీంతో యజమానులు తమ డ్రైవర్‌కు ఫోన్‌చేసి వేగాన్ని నియంత్రించమని ఆదేశించేందుకు అవకాశం ఉంటుంది. వాహనాల యజమానులు కూడా తమంతట తాముగా ఆ వాహనాల ట్రాకింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఇక అక్రమ రవాణాను సమర్థంగా అరికట్టేందుకు ఈ ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. స్మగ్లింగ్, ఇతర దందాల్లో ఉపయోగించే వాహనాలు ఏయే మార్గాల్లో ప్రయాణించిందీ, అక్రమంగా తరలించే సరుకును ఇతర వాహనాల్లోకి మార్చినా ఇట్టే కనిపెట్టవచ్చు. అక్రమ రవాణా దందాకు కేంద్రస్థానం, వాటి గమ్యస్థానాన్ని కూడా గుర్తించవచ్చు. ఇక కిడ్నాప్‌లు, ఇతర నేరాల్లో నేరస్తులు ఉపయోగించే వాహనాల గమనాన్ని గుర్తించి సంబంధిత ప్రాంతంలో పోలీసులను అప్రమత్తం చేయవచ్చు. కేసు విచారణలో ట్రాకింగ్ రికార్డును సాక్ష్యాధారాలుగా సమర్పించవచ్చు. ఇది దోషులకు శిక్షలు విధించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే విక్రయం రాష్ట్రంలో ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు అవసరమైన ట్రాకింగ్ పరికరాల సరఫరాకు రవాణాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. వాహన యజమానులు తమ వాహనాలకు ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. గుర్తింపు పొందిన డీలర్ల నుంచే ట్రాకింగ్ పరికరాలు కొనుగోలు చేయాలని స్పష్టం చేయనుంది. తగిన నాణ్యత ప్రమాణాలతో ట్రాకింగ్ పరికరాలను సరఫరాచేసే డీలర్లకు రవాణాశాఖ గుర్తింపునిస్తుంది. ఒక ట్రాకింగ్ పరికరం ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలలోపు ఉండేలా చూడాలని భావిస్తోంది. వాహన యజమానులకు పెద్దగా ఆర్థికభారం లేకుండానే ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలన్నది రవాణాశాఖ ఉద్దేశం. -
19 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద మూడునెలల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కార్డుదారులు రేషన్ దుకాణాల వద్ద ప్రతినెల 19వ తేదీ నుంచి 28వ తేదీలోగా బియ్యాన్ని తీసుకోవాలని సూచించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన నిల్వలను కేటాయించిందని, దీన్లో కొంత నాన్ సార్టెక్స్, మరికొంత నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం ఉన్నాయని తెలిపారు. నవంబర్‌లో ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న నిల్వల ఆధారంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, మన్యం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు నాన్ సార్టెక్స్, మిలిగిన 16 జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. 2.68 కోట్ల మంది ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారుల జాబితాను చౌకదుకాణాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల వంతున బియ్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ పోషణ ధ్యేయంగా ఏడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. ఇందులో ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 సమృద్ధిగా ఉంటాయని, వీటివల్ల రక్తహీతన తగ్గి, గర్భస్థ శిశువుకు మేలు జరగడంతోపాటు నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. ఫోర్టిఫైడ్ బియ్యం తేలికగా ఉండి నీటిలో తేలడంతో కొంతమంది ప్లాస్టిక్ బియ్యంగా అపోహపడుతున్నారని పేర్కొన్నారు. రేషన్ అక్రమ రవాణాకు ఆస్కారం లేదు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. 9,260 ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలతో ఇంటివద్దకే బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో బియ్యం బయట మార్కెట్‌కు తరలించే ఆస్కారం లేదని పేర్కొన్నారు. ఎల్లో మీడియా పనిగట్టుకుని విషప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. చౌకదుకాణాలు, ఎండీయూ వాహనాలను నిత్యం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. విజిలెన్సు కమిటీలను నియమించి ప్రజాపంపిణీలో లోపాలు, అక్రమాలు లేకుండా నిఘావ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఫిర్యాదుల కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్‌ను ఎండీయూ వాహనంపై ముద్రించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడేళ్లలో పక్కదారిపట్టిన 31,073 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్‌చేసి సెక్షన్ 6ఏ ప్రకారం 6,979 కేసులతోపాటు 1,603 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. రైస్‌మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ పట్టుబడితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌చేసే అనుమతిని రద్దుచేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల స్టాక్ పాయింట్లో ఇటీవల కొన్ని అవకతవకలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రాథమిక విచారణ అనంతరం స్టాక్ పాయింట్ ఇన్చార్జిని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. -
Hyderabad: విజిటర్‌గా దుబాయ్‌కు వెళ్లి... జల్సాలకు డబ్బంతా ఖర్చు అవ్వడంతో
సాక్షి, హైదరాబాద్: పర్యాటక వీసాపై దుబాయ్ వెళ్లిన గోల్కొండ వాసి చేతిలో ఉన్న డబ్బంతా అక్కడ జల్సాలకు ఖర్చు చేశాడు. తిరిగి రావడానికి ఇతడి వద్ద డబ్బు లేదనే విషయం గమనించిన అక్కడి సూత్రధారులు గోల్డ్ స్మగ్లింగ్‌లో క్యారియర్‌గా మార్చారు. కేజీ బంగారం అక్రమ రవాణా చేస్తూ వచ్చిన ఇతడితో పాటు రిసీవర్‌ను, అతడి సహాయకులైన ఇద్దరినీ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు. బడాబజార్‌కు చెందిన మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ ఇటీవల దుబాయ్‌కు విజిట్ వీసాపై వెళ్లాడు. తన వద్ద ఉన్న నగదు మొత్తం అక్కడే ఖర్చు పెట్టేయడంతో తిరుగు ప్రయాణానికి టిక్కెట్టు, ఖర్చులకు డబ్బు లేని పరిస్థితి నెలకొంది. దీనిని గుర్తించిన ముస్తఖీమ్ అనే దుబాయ్ వాసి అతడికి వల వేశాడు. తాము చెప్పినట్లు కేజీ బంగారం స్మగ్లింగ్ చేస్తే విమాన టిక్కెట్లతో పాటు కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు. అందుకు ఖాజా అంగీకరించడంతో మూడు గోళాలుగా నల్ల కవర్లలో ప్యాక్ చేసిన కేజీ బంగారం, టిక్కెట్టు, డబ్బు ముస్తఖీమ్ అందించాడు. ఆ బంగారాన్ని తీసుకుని విమానాశ్రయంలో దిగిన తర్వాత ఫోన్ ఆన్ చేయాలని, దుబాయ్ నెంబర్ నుంచి కాల్ చేసిన వ్యక్తికి సరుకు అందించాలని సూచించాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఖాజాకు కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన రయీస్ అహ్మద్ సయీద్ హుస్సేన్ లంక అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఎయిర్‌పోర్టులోనే ఉన్నానంటూ రప్పించి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో లంకతో పాటు అదే ప్రాంతానికి చెందిన సరిమ్ హుస్సేన్, ఫౌజాన్ కూడా ఉన్నారు. దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, షేక్ బుర్హాన్, కె.నర్సింహ్ములు తమ బృందంతో దాడి చేసి నలుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి స్వాదీనం చేసుకున్న బంగారంతో సహా కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఖాజా ఈ బంగారాన్ని రిక్టమ్ కన్సీల్మెంట్ విధానంలో తీసుకువచ్చాడు. ఇలా కేజీ బంగారం మలద్వారంలో దాచి తేవడం సాధారణ వ్యక్తులకు సాధ్యం కాదు. తరచు ఈ దందా చేసే స్మగ్లర్లు మాత్రమే ప్రత్యేక శస్త్ర చికిత్స ద్వారా ఇలా చేయగలరు. ఈ కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. -
మద్యం అక్రమ రవాణా చేస్తున్న తెలుగు యువత నేత అరెస్ట్
గుంతకల్లు: కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ తెలుగు యువత గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు బోయ రాము, అదే పార్టీకి చెందిన చంద్ర పోలీసులకు దొరికారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం గుంతకల్లు టూటౌన్ సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ నరేంద్ర వెల్లడించారు. పాత గుంతకల్లుకు చెందిన తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు బోయ రాముతోపాటు అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న చంద్ర ఆదివారం బళ్లారి నుంచి కర్ణాటక మద్యాన్ని కారులో అక్రమంగా తీసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గుంతకల్లు పట్టణ శివారులోని కొనకొండ్ల రోడ్డులో రైల్వే బ్రిడ్జి వద్ద కారు ఆపి తనిఖీ చేశారు. కారులో 19 బాక్సుల్లో 1,824 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలింపు కోసం ముఠా ఏర్పాటు కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన రాము 2010లో అప్పటి గుంతకల్లు రూరల్ సీఐ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఏడాది తర్వాత ఆ పని వదిలేసి, అక్రమ మద్యం రవాణాను ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. గుంతకల్లుతోపాటు గుత్తి, పామిడి పట్టణాలకు కర్ణాటక మద్యాన్ని సరఫరా చేయడానికి ఏకంగా ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. గుంతకల్లులో పేకాట కేంద్రాలను కూడా నిర్వహించేవాడు. తన అక్రమార్జనకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో టీడీపీలో చేరాడు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మనిషిగా, ఆ పార్టీ నాయకుడు కేసీ హరి అనుచరుడిగా ముద్ర వేసుకున్నాడు. గత ఏడాది జూన్‌లో విడపనకల్లు మండలం డొనేకల్లు వద్ద పట్టుబడిన రూ.5 లక్షల విలువైన కర్ణాటక మద్యం తరలింపు కేసులోనూ రాము ప్రధాన నిందితుడు. అప్పుడు రాముతోపాటు గుంతకల్లుకు చెందిన టీడీపీ నాయకులు ఆకుల మల్లేష్, మహేష్, చంద్ర, దూద్‌పీరా, నవీన్ దాదాపు 15 రోజులు రిమాండుకు వెళ్లి వచ్చారు. అయినప్పటికీ రాములో ఏమాత్రం మార్పు రాలేదు. అక్రమార్జనే ధ్యేయంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. -
వామ్మో.. ఈ వాచ్ విలువ ఇన్ని కోట్లా? పోలీసులకు చిక్కడంతో..!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల నుంచి అక్రమంగా విలువైన వస్తువులను తీసుకొస్తుంటే కస్టమ్స్ అధికారులు పసిగట్టి పట్టేస్తుంటారు. అలాంటి సంఘటనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిగింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? పోలీసులు పట్టుకున్న చేతి గడియారాల విలువ తెలిస్తే.. ఆశ్చర్యపోవటం మీ వంతవుతుంది. మొత్తం ఏడు గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వజ్రాలు పొదిగిన వైట్ గోల్డ్ వాచ్ విలువ ఏకంగా రూ.27 కోట్లు ఉంటుందటా.. అత్యంత విలువైన ఏడు చేతి గడియారాలని అక్రమంగా తీసుకొస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టేశారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద విలువైన గడియారాలతో పాటు వజ్రాలు పొదిగిన బ్రెస్లెట్, ఐఫోన్ 14ప్రోను సైతం సీజ్ చేశారు. లగ్జరీ వస్తువులకు పన్నులు, ఇతర సుంకాలు చెల్లించకుండానే దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా జువెలరీ, వాచ్ తయారీ సంస్థ జాకబ్ అండ్ కో.. తయారు చేసిన ఓ వాచ్‌లో విలువైన వజ్రాలు పొదిగారని, అది సంపన్నులు మాత్రమే ధరిస్తారని అధికారులు తెలిపారు. మొత్తం పట్టుబడిన వస్తువుల విలువ రూ.28 కోట్లకుపైగా ఉంటుందని, ఈ స్థాయిలో పట్టుకోవటం ఇదే తొలిసారిగా వెల్లడించారు. 60 కిలోల బంగారంతో సమానమని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఎల్జీ సాబ్ జస్ట్ చిల్.. మీలా నా భార్య సైతం చేయలేదు’.. కేజ్రీవాల్ ట్వీట్ -
స్మగ్లింగ్‌లో ‘పుష్ప’ను మించిపోయాడు..
ఉక్కునగరం(విశాఖపట్నం): స్టీల్‌ప్లాంట్‌లో పుష్ప సినిమా తరహా దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీఐఎస్ఎఫ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి.. స్టీల్‌ప్లాంట్ స్ట్రక్చరల్ మిల్లో 56 మిల్లీమీటర్ వ్యాసం కలిగిన రౌండ్ బార్లు తయారు చేస్తుంటారు. అలా తయారైన వాటిలో పగుళ్లు, సరైన సైజు లేని వాటిని స్క్రాప్ కింద పక్కన పెడతారు. వాటిని ఎస్ఎస్డీ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ ద్వారా స్టీల్ మెల్ట్షాప్కు తరలించి రీ మెల్టింగ్ చేస్తారు. చదవండి: అదే బావి.. నాడు భర్త, నేడు భార్య గురువారం ఉదయం షిఫ్ట్‌లో సుమారు 6.30 ప్రాంతంలో ఒక మినీ వ్యాను మెయిన్ గేటు అవుట్ గేటు ద్వారా బయటకు వెళ్లడానికి వచ్చింది. అక్కడ తనిఖీ చేస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా వెనుక భాగం అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని తనిఖీ చేయగా షీట్ల కింద సుమారు 40 రౌండ్ బార్ ముక్కలు బయటపడ్డాయి. అవాక్కైన సిబ్బంది వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే గుట్టుగా ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా సాగుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన వాహనం నంబర్‌ను చూస్తే అది కూడా ఒరిజినల్ కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఉన్న ముఠా బయటపడితేనే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిందితుడిని, చోరీ సొత్తును స్టీల్‌ప్లాంట్ పోలీసులకు అప్పగించారు. -
విమానంలో కొండ చిలువ పిల్లలు.. షాకైన ప్రయాణికులు
చెన్నై: థాయ్‌ల్యాండ్ దేశం నుంచి చెన్నైకి తీసుకువచ్చిన కొండచిలువలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని తిరిగి ఆ దేశానికి తరలించారు. వాటిని తీసుకువచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి థాయ్‌ల్యాండ్ దేశం నుంచి వచ్చిన విమానంలో విలువైన వస్తువులు తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ప్రయాణికులపై నిఘా పెట్టారు. ఆ సమయంలో థాయ్‌ల్యాండ్‌కు పర్యాటక వీసాలో వెళ్లి చెన్నైకి వచ్చినా దిండుగల్‌కు చెందిన వివేక్ (29) వద్ద తనిఖీ చేయగా, ఐదు కొండ చిలువ పిల్లలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు తిరిగి థాయ్‌ల్యాండ్‌కు పంపించారు. వివేక్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ విషయం ప్రయాణికులకు తెలియడంతో షాకయ్యారు. చదవండి: Flipkart: కొత్త సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఆఫర్లు, డిస్కౌంట్ల విషయంలో తగ్గేదేలే! -
సరిహద్దుల వద్ద 250 మంది ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర శిబిరాల్లో 250 ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. చొరబాట్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి రవాణాతోపాటు సరిహద్దుల ఆవలి నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ ఆందోళన కలిగిస్తోందని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. చలికాలం రానున్నందున 12 వేల అడుగుల ఎత్తులో గస్తీ విధుల నిర్వహణ మరింత కఠిన తరం కానుందన్నారు. నిఘా వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. ఇద్దరు ఉగ్రవాదులు హతం అనంత్‌నాగ్ జిల్లా పొష్‌క్రీరి ప్రాంతంలో భద్రతా బలగాలతో ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని డనిష్ భట్, బషరత్ నబీగా గుర్తించారు. -
ప్యాంటు చెక్ చేస్తే నిండా పాములు, బల్లులు.. అధికారులే షాక్!
వాషింగ్టన్: పాముల వంటి విష జీవులను తాకేందుకే భయంతో వణికిపోతాం. అయితే, ఓ వ్యక్తి తన దుస్తుల్లో దాచిపెట్టి వాటిని స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇటీవలే తన ప్యాంటులో 60 రకాల పాములు, బల్లులు, ఇతర సరిసృపాలను దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా దొరికిపోయాడు. ఈ సంఘటన అమెరికా- మెక్సికో సరిహద్దులో వెలుగు చూసింది. 7,50,000 డాలర్ల విలువైన సరిసృపాల స్మగ్లింగ్‌లో భాగంగా ప్యాంటులో దాచిపెట్టి అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడికి రెండు దశాబ్దాలకిపైగా జైలు శిక్ష పడినట్లు వెల్లడించారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్ మాన్యుయెల్ పెరెజ్ అనే వ్యక్తి ఆరేళ్లలో 1,700 జంతువులను మెక్సికో, హాంకాంగ్‌ల నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేసినట్లు చెప్పారు అధికారులు. నిరాటంకంగా సాగుతున్న అతడి అక్రమ రవాణా ఈ ఏడాది మార్చిలో బట్టబయలైంది. పాములు, బల్లులు వంటి వాటిని ప్యాంటులో దాచి మెక్సికో నుంచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అయితే, ముందు తన పెంపుడు బల్లులను తీసుకెళ్తున్నాని కస్టమ్స్ అధికారులకు తెలిపాడు. కానీ, అతడి దుస్తులు మొత్తం విప్పి పరిశీలించగా ప్యాంటులో 60 పాములు, బల్లుల వంటివి బయపడినట్లు అధికారులు తెలిపారు. కోర్టు విచారణ సందర్భంగా తన స్మగ్లింగ్‌పై ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు నిందితుడు జోస్ పెరెజ్. కొన్నిసార్లు గాడిదలపై తరలించేందుకు డబ్బులు చెల్లించానని, ఇతర సమయాల్లో తానే సరిహద్దులు దాటానని ఒప్పుకున్నాడు. అతడు అక్రమ రవాణా చేసి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తన ఖాతాదారులకు సుమారు 7,39,000 డాలర్లకు సరిసృపాలను విక్రయించినట్లు పత్రాలు సమర్పించారు అధికారులు. అందులో యుకాటాన్ బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్ పూసల బల్లులు సహా ఇతర జంతువులు ఉన్నాయి. రెండు కేసుల్లో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇదీ చదవండి: ప్రపంచం చుట్టేశాడు.. రెండు గిన్నిస్ రికార్డులు పట్టేశాడు -
400 ఏళ్ల నాటి పురాతన రాజ వంశ విగ్రహం కోసం...దొంగలకే టోపీ పెట్టి
చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్(ఐడల్ వింగ్)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ల నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్ వింగ్ బృందం అండర్ కవర్ అపరేషన్ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు. ఈ మేరకు అధికారులు తుత్తకుడి నివాసితులైన ఆరుముగరాజ్, కుమార్వేల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పురాతన విగ్రహాన్ని విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు తమ సిబ్బందిలోని కొంతమంది ధనవంతులైన వ్యక్తులుగా వారిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. ఈ విధంగా ధనవంతులైన వ్యక్తులుగా ఆ విగ్రహానికి కొనుగోలు చేసే నెపంతో వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ముస్తఫ్ అనే వ్యక్తి పురాతన విగ్రహాన్ని తిరుచ్చి - మదురై హైవేపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఐతే పోలీసులు ఆ విగ్రహాన్ని చూడటానికి కోట్లలలో తమ వద్ద డబ్బు ఉందని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఆ స్మగ్లర్లతో బేరసారాలు ఆడుతూ అసలు గుట్టంతా తెలసుకుని ముస్తఫా, ఆరుముగరాజ్, కుమారవేల్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ నిందితులను విచారించగా తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుంచి ఈ విగ్రహాన్ని పొందినట్లు తెలిపాడు. ఐతే సెల్వకుమార్ వద్దే ఈ విగ్రహం 12 ఏళ్లుగా ఉందని, దీన్ని తన తండ్రి నాగరాజన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ విగ్రహం సేతుపతి వంశానికి చెందిన పురాతన మహిళ విగ్రహం. ఆ విగ్రహం ఖరీదు వేల కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు . (చదవండి: కస్టమర్‌కి చేదు అనుభవం... అలా వచ్చాడని టికెట్టు ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్) -
కడుపులో బంగారం మాయం.. భార్య ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి!
సాక్షి,చెన్నై: కస్టమ్స్ వర్గాల కళ్లుగప్పేందుకు కడుపులో దాచి పెట్టుకొచ్చిన బంగారం బిస్కెట్లలో ఒకటి మాయం అయ్యింది. సినీ ఫక్కీలో సాగిన ఈ అక్రమ రవాణాలో ఓ యువకుడిని స్మగ్లర్లు కిడ్నాప్ చేశారు. ఆ బిస్కెట్ కోసం చిత్ర హింసలు పెట్టారు. చివరికి ముంబై పోలీసులు రంగంలోకి దిగి, ఆయువకుడిని రక్షించారు. ఆదివారం తిరువారూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు.. తిరువారూర్‌కు చెందిన హిజాబ్ చెన్నైలో సెల్ ఫోన్ దుకాణం నడుపుతున్నాడు. మిత్రుడు ఔరంగ జేబ్ ద్వారా ముంబై నుంచి చెన్నైకు బంగారం అక్రమంగా తెప్పించుకుంటూ వచ్చాడు. చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్,నిఘా వర్గాల కళ్లు గప్పేందుకు సినీ ఫక్కీలో ఔరంగ జేబు మనుషులు చిన్న చిన్న బంగారం బిస్కెట్లను మింగేసే వారు. చెన్నైకు వచ్చినానంతరం కడుపు శుభ్రం చేయించే మాత్రల ద్వారా వాటిని బయటకు తీసేవారు. ఈ పరిస్థితుల్లో ముంబైకు చెందిన శంకర్ ద్వారా 2 రోజుల క్రితం చెన్నైకు ఇదే తరహాలో బంగారం తీసుకొచ్చారు. అయితే, తీసుకొచ్చిన బంగారంలో ఓ బిస్కెట్ మాయం కావడంతో శంకర్‌ను ఔరంగ జేబు, హిజాబ్, వారి అనుచరుడు విజయ్ కలిసి కిడ్నాప్ చేశారు. తిరువారూర్‌కు తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. కారైక్కాల్‌లోని ఓ స్కాన్ సెంటర్‌కు తీసుకెళ్లి పరిశోధించారు. అయితే, ఆ బంగారం బిస్కెట్ ఏమైందని శంకర్‌ను తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఉదయాన్నే ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. భార్య ఫిర్యాదుతో.. ముంబైలో ఉన్న శంకర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో బంగారం అక్రమ రవాణా గుట్టు వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ వ్యహారాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న ముంబై పోలీసులు స్మగ్లర్ల కోసం చెన్నైకు వచ్చారు. ఇక్కడి పోలీసు సాయంతో శంకర్ సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. తిరువారూర్‌లో శంకర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో కిడ్నాపర్ల చెర నుంచి అతడిని రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఔరంగ జేబు, విజయ్ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నా రు. పరారీలో ఉన్న హిజాబ్ కోసం గాలిస్తున్నారు. చదవండి: ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా? -
గ్రీజు డబ్బా.. గిఫ్ట్ ప్యాక్! ‘పుష్ఫ’ స్టైల్లో హష్ ఆయిల్ రవాణా
సాక్షి, నాగోలు: గంజాయి ప్రాసెసింగ్ ద్వారా తయారు చేసే హష్ ఆయిల్ స్మగ్లింగ్‌లో ఓ ముఠా ‘పుష్ఫ’ పంథాను అనుసరించింది. గ్రీజు డబ్బాతో పాటు గిఫ్ట్ ప్యాక్ రూపంలోనూ నాలుగు లీటర్లు తీసుకువస్తుండగా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, మురళీధర్, ఏసీపీలు వెంకన్న నాయక్, పురుషోత్తం రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ లీటర్ హష్ ఆయిల్ రూ.4 లక్షలు.. ఏపీలోని విశాఖపట్నం జిల్లా జంపెన గ్రామానికి చెందిన కోనశివ (24) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వంట పని కార్మికుడు నూకరాజుతో (25) ఇతడికి స్నేహం ఉంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్‌తో శివకు మూడేళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల శివను కలిసిన సంతోష్ తాను ఇచ్చే హష్ ఆయిల్‌ను హైదరాబాద్‌కు చేరిస్తే రూ.40 వేలు ఇస్తానంటూ చెప్పడంతో అంగీకరించిన శివ తనకు సహకరిస్తే ఆ మొత్తంలో సగం ఇచ్చేలా నూక రాజుతో ఒప్పందం కుదుర్చుకుని వీరిద్దరూ బుధవారం విశాఖలోని లంకెలపాలెం వెళ్లి సంతోష్‌ను కలిశారు. అక్కడ సంతోష్‌తో పాటు అతడి స్నేహితుడైన సంజీవ్‌రావు కూడా ఉన్నాడు. లీటర్ హష్ ఆయిల్‌ను గిఫ్ట్‌కవర్‌లో ప్యాక్ చేసి సంతోష్ వీరికి అప్పగించాడు. గ్రీజు డబ్బా అడుగున మూడు లీటర్ల హష్ ఆయిల్‌ను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఉంచి, దానిపై గ్రీజు నింపిన డబ్బాను సంజీవరావు అప్పగించాడు. వీటిని తీసుకుని శివ, నూక రాజు పోలీసులకు అనుమానం రాకుండా వేర్వేరుగా బయలుదేరారు. గతంలో గంజాయి, హష్ ఆయిల్ పంపే ఏజెన్సీ ముఠాలు హైదరాబాద్‌లో ఎవరికి అందించాలే సరఫరా దారులకు చెప్పేవాళ్లు. ఇలా చేస్తే పోలీసులకు వాళ్లూ చిక్కుతున్నారనే ఉద్దేశంతో ఇటీవల పంథా మార్చారు. తొలుత హైదరాబాద్ చేరుకున్నాక తమకు ఫోన్ చేయాలని, అప్పుడు ఎవరికి అందించాలనేది చెప్తామంటూ శివ, నూకరాజుకు చెప్పారు. వీరి కదలికలపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందటంతో ఇన్స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలోని బృందం హయత్‌నగర్ పోలీసులతో కలిసి దాడి చేసి ఇద్దరినీ పట్టుకుని హష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని సరఫరా దారుల కోసం గాలిస్తున్నారు. హష్ ఆయిల్‌ను నగరంలో లీటర్ రూ.4 లక్షలు లేదా 10 ఎంఎల్ రూ.4 వేలు చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. -
రూ 3.14 కోట్ల మద్యం ధ్వంసం
నెల్లూరు (క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబీ, ఐదు సివిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన రూ 3.14 కోట్ల విలువైన మద్యాన్ని మంగళవారం ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో ఎస్ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మి తన సిబ్బందితో ధ్వంసం చేయించారు. కొత్తూరు సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయ ప్రాంగణంలో రోడ్డు రోలర్ ద్వారా సీసాలను తొక్కించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గడిచిన మూడేళ్లుగా జిల్లాలో మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలపై ఎస్ఈబీ, పోలీసులు దాడులు ముమ్మరం చేశారన్నారు. 2,774 కేసుల్లో పట్టు బడిన రూ.3,14,37,980 విలువజేసే 74,574 మద్యం బాటిళ్లను (15,719 లీటర్లు) ధ్వంసం చేశామన్నారు. జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలు, మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నెల్లూరు ఇన్చార్జి ఏసీ రవికుమార్, ఏఈఎస్ కృష్ణకిశోర్‌రెడ్డి,పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
రూ.68 లక్షల విలువైన మద్యం ధ్వంసం
రేణిగుంట: మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. రేణిగుంట మండలం గాజులమండ్యం చిన్న చెరువు వద్ద మంగళవారం గతంలో పట్టుబడిన మద్యం నిల్వలను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమంగా తీసుకెళుతున్న మద్యం, బెల్ట్ షాపుల్లో సీజ్ చేసిన మద్యం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నేతృత్వంలో నూతన జిల్లా ఏర్పడినప్పటి నుంచి పట్టుకున్న మద్యం నిల్వలను అనంతపురం డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు. మొత్తం 32,341 మద్యం బాటిళ్లులోని 6,800 లీటర్ల మద్యం నిల్వలను ఇక్కడకు తీసుకొచ్చి ధ్వంసం చేశారు. అదనపు ఎస్పీ సుప్రజ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్వాతి సమక్షంలో బాటిళ్లను ధ్వంసం చేశారు. ఇటీవల యువత అక్రమ సంపాదన కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై రానున్న రోజుల్లో పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమ మద్యం తరలిస్తున్నా, బెల్ట్‌షాపులు నడుపుతున్నా, నాటు సారా కాస్తున్నా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని కోరారు. -
నలుగురిని కిడ్నాప్ చేసిన బంగారం స్మగ్లింగ్ గ్యాంగ్
సనత్‌నగర్: దుబాయ్ నుంచి నగరానికి బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ఓ ముఠా నలుగురిని కిడ్నాప్ చేయడంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరు.. నగరానికి చెందిన ఓ ముఠా దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేయిస్తూ అక్రమ సంపాదన చేస్తోంది. ఎవరైనా పర్యటన నిమిత్తం దుబాయ్‌కు వెళితే వారిని గుర్తించే ఈ ముఠా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తే పర్యటన ఖర్చులతో పాటు మరింత డబ్బును అదనంగా ఇస్తామని చెబుతుంది. ఇలాగే పాతబస్తీకి చెందిన సహబాజ్(21) ద్వారా పరిచయం అయిన ఈ ముఠా షహబాజ్‌తో పాటు శ్రీనగర్‌కాలనీకి చెందిన ఆయాజ్(22), అశోక్‌కాలనీకి చెందిన పహద్(23)లను గత 15 రోజుల క్రితం దుబాయ్‌కి పంపించారు. అక్కడ ఈ ముఠాకు చెందిన సభ్యులు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని కాళ్లకు చుట్టుకుని రావలసి ఉంటుంది. దుబాయ్‌కి వెళ్లిన ఆయాజ బంగారాన్ని తీసుకుని హైదరాబాద్‌కు ముందుగానే చేరుకున్నాడు. షహబాజ్, పహద్లు శుక్రవారం నగరానికి రావాల్సి ఉంది. అయితే పహద్ దుబాయ్ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కకుండా అదృశ్యయమయ్యాడు. బంగారంతో పాటు అదృశ్యమైన పహద్ కోసం నగరంతో పాటు దుబాయ్‌లోని స్మగ్లర్లు గాలింపు చేపట్టి వెదుకుతున్నారు. పహద్ ఎక్కడికి వెళ్లాలో చెప్పాలంటూ నగరానికి వచ్చిన అయాజ్, షహబాజ్‌లతో పాటు పహద్ తండ్రి అహ్మద్ షరీఫ్, వారి దగ్గర బంధువు ఆసిమ్‌లను ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేవారు. అలాగే దుబాయ్‌లో ఉండే పహద్ దగ్గరి బంధువు ఆకిబ్‌ను కూడా దుబాయిలో కిడ్నాప్ చేశారు. నగరంలో కిడ్నాప్ చేసిన నలుగురిలో షహబాజ్, ఆయాజ్, ఆసిమ్‌లను విడిచిపెట్టారు. పహద్ తండ్రి అహ్మద్ షరీఫ్‌ను కుటుంబ సభ్యులు బుధవారం సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని గుర్తించిన కిడ్నాపర్లు ఆయనను కూడా వదలిపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు. (చదవండి: కదం తొక్కిన కార్మికులు) -
స్కెచ్ వేశారు... పట్టుకున్నారు
పెందుర్తి: గంజాయి రవాణాపై వరుసగా ‘సెబ్’ దాడులు కొనసాగుతున్నాయి. పెందుర్తి సమీపంలోని సుజాతనగర్‌లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన గంజాయిని సినీ ఫక్కీలో అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 260 కిలోల గంజాయి, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి సెబ్ పోలీస్ స్టేషన్లో అడిషినల్ ఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా, రాజస్థాన్‌కు చెందిన రామ్ హోతాంగి, అనిషా సాబర్, ఆయూబ్‌ఖాన్, మరోవ్యక్తి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి సుజాతనగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరిలో రామ్ హోతాంగి ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి సేకరించి రోడ్డు మార్గంలో సుజాతనగర్ తీసుకొస్తుంటారు. అక్కడి నుంచి వీరంతా వేర్వేరుగా ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒడిశా నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో సీపీ శ్రీకాంత్, సెబ్ అడిషినల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు, ఇంటెలిజెన్స్ టీం సహకారంతో పెందుర్తి సెబ్ అధికారులు సుజాతనగర్ ఆర్చ్ వద్ద కాసు కాశారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అనిషా చిక్కింది. బైక్‌లో ఉన్న 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితురాలిని విచారించారు. ఆమె చెప్పిన వివరాల మేరకు సుజాతనగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేయగా అక్కడ నిల్వ ఉన్న 200 కిలోల గంజాయిని గుర్తించారు. అదే సమయంలో సుజాతనగర్ వీధి చివర నిలిపిన కారులో ఉన్న 50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సెబ్ సిబ్బంది వస్తున్నారన్న సమాచారంతో కారులోని వ్యక్తులు పరారయ్యారు. నిందితుల్లో అనిషా సాబర్‌ను అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. దాడుల్లో పాల్గొన్న సెబ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, పెందుర్తి సీఐ సరోజదేవి, టాస్క్‌ఫోర్స్ సీఐ అప్పలరాజు, ఇంటెలిజెన్స్ టీం సిబ్బందిని నగర సీపీ శ్రీకాంత్ ప్రత్యేకంగా అభినందించారు. (చదవండి: వర్షం కోసం గంగాలమ్మ పండగ) -
సినీఫక్కీలో లారీకి ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసి..
శంషాబాద్(హైదరాబాద్): సినీ ఫక్కీలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు శంషాబాద్ జోన్ ఎస్ఓటీ, చేవెళ్ల పోలీసులు చెక్ పెట్టారు. మహారాష్ట్ర పింప్రి ప్రాంతానికి చెందిన పరుశురాం,అంకుష్ పండులే గంజాయి అక్రమ రవాణాకు పథకం పన్నారు. ఇందులో భాగంగా అహ్మద్‌నగర్‌కు చెందిన ఉమేష్ గైక్వాడ్, ప్రదీప్ కలంగి, దత్తసాకత్, సతీష్ విజయ్ షిండే, విశాల్, అశోక్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. వారిలో కొందరు డ్రైవర్లు ఉన్నారు. వీరు గంజాయి తీసుకువస్తే మరికొందరు వాటిని అవసరమైన వారికి విక్రయించేవారు. ఇందులో భాగంగా ఆరునెలల క్రితం అహ్మద్‌నగర్‌లో లారీకి ప్రత్యేక క్యాబిన్ తయారు చేయించారు. ముందుగా ఎస్కార్ట్.. సుత్రధారులైన పరుశురాం, అంకుష్ పండే గంజాయి సరఫరా చేసే ఖమ్మం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సుభాన్, భాషాలను సంప్రదించారు. కిలో రూ. 2500 చొప్పున 400 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. పథకంలో భాగంగా ఫిబ్రవరి 22 ఖమ్మం ఏజెన్సీలో వారికి లారీని అప్పగించగా గంజాయి లోడ్ చేశారు. 27న లారీతో భద్రాచలం, సూర్యాపేట మీదుగా మహారాష్ట్రకు బయలుదేరారు. లారీని ఎవరు పట్టుకోకుండా ముందు కారులో కొందరు ఎస్కార్ట్‌గా వెళ్లారు. ముందస్తు సమాచారంతో శంషాబాద్ ఎస్ఓటీ, చేవెళ్ల పోలీసులు షాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద వారిని అదుపులో కి తీసుకున్నారు. ఖమ్మం ఏజెన్సీ ప్రాంతానికి సుభాన్, భాషా, అంకుష్ పండులే మినహా మిగతా వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి 400 కేజీల గంజాయి, రూ.15 వేల నగదు, కారు, లారీ, 9 ఫోన్లు, బంగారు, వెండి ఉంగరాలు, గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఓటీ, చెవెళ్ల పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. -
తాబేళ్ల అక్రమ రవాణా గుట్టు రట్టు!
కైకలూరు: కృష్ణాజిల్లా కొల్లేరు పరిసర ప్రాంతాల నుంచి తాబేళ్లను రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వదర్లపాడు గ్రామం వద్ద రూరల్ ఎస్ఐ చల్లా కృష్ణా శనివారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో ఆటో, మినీ వ్యాన్‌ల్లో 25 బస్తాల్లో నాలుగు టన్నుల తాబేళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన పంతగాని నాగభూషణం (48), గరికిముక్కు సందీప్ (30), అదే మండలం కొండూరుకు చెందిన దేవదాసు ఏసుబాబు (27) తాబేళ్లను రవాణా చేస్తుండగా వాహనాలతో సహా అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు ఆదివారం అప్పగించారు. ఇక్కడ కేజీ తాబేలు రూ.15 చొప్పున కొని ఇతర రాష్ట్రాల్లో రూ.50 నుంచి రూ.100కి విక్రయిస్తున్నారు. తాబేళ్ల మాంసానికి గిరాకీ ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. వైల్డ్ లైఫ్ ఏలూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసరు కుమార్ ఆధ్వర్యంలో డెప్యూటీ రేంజ్ ఆఫీసరు జయప్రకాష్, బీటు ఆఫీసరు రాజేష్ నిందితులపై అటవీపర్యావరణ చట్టం 1972 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి కైకలూరు కోర్టుకు తరలించారు. మేజిస్ట్రేటు ఆదేశాలతో పట్టుబడిన తాబేళ్లను కొల్లేరు సరస్సులో విడిచిపెడతామని అధికారులు చెప్పారు. -
దశాబ్దాల దందాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ రకాల స్మగ్లింగ్లు, దందాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. ఉదాశీన చట్టాలను అవకాశంగా చేసుకుని దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ తదితర దందాలపై కఠిన చర్యలకు సమాయత్తమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)కు సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఐపీసీ, సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు అప్పగించింది. ఏళ్ల తరబడి సాగుతున్న దోపిడీ చట్టంలో లొసుగులను అవకాశంగా చేసుకుని రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ దందా దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైంది. ఇంతవరకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై రాష్ట్ర మైనింగ్, మినరల్స్ నియంత్రణ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. ఎవరైనా వరుసగా 2సార్లు పట్టుబడితే ఆ చట్టం ప్రకారం జరిమానా విధించి విడిచిపెట్టేవారు. మూడోసారి దొరికితే కేసు పెట్టేందుకు అవకాశం ఉంది. అది కూడా స్థానిక పోలీసులకు అప్పగించాలి. అంతేగానీ రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారం ఉండదు. అదే ప్రాతిపదికన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020లో ఏర్పాటుచేసిన ‘సెబ్’కు కూడా కేసులు పెట్టేందుకు సాంకేతికంగా అడ్డంకులు తలెత్తాయి. మద్యం అక్రమ రవాణా విషయంలోనూ ఎక్సైజ్ చట్టం ప్రకారం నమోదుచేసే కేసులు ఎలాంటి ప్రభావం చూపించడంలేదు. ఇక మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జీవితాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న ఆన్లైన్ జూదం దందాపై కూడా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదుకూ అవకాశంలేదు. రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కూడా అటవీ చట్టాల కింద పెట్టే కేసులు స్మగ్లర్ల ఆట కట్టించేందుకు సరిపోవడంలేదు. ఇటువంటి వ్యవస్థీకృత లోపాలతో రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్లైన్ గేమింగ్ దందాలు యథేచ్ఛగా సాగుతూ అటు ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతోపాటు ఇటు సామాన్యుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం కూడా స్మగ్లర్లకు ఊతమిచ్చింది. కొరఢా ఝళిపించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని రకాల స్మగ్లింగ్ దందాలను నిర్మూలించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యుక్తమైంది. అందుకోసం ‘సెబ్’కు విశిష్ట అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అందుకే ఆయా దందాల్లోని పాత్రధారులు, సూత్రధారులపై ఐపీసీ, సీఆర్పీసీ తదితర సెక్షన్ల కింద కఠిన శిక్షలు విధించేలా చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు కల్పిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం.. ►రాష్ట్రం ఒక యూనిట్‌గా ‘సెబ్’ కమిషనరేట్‌ను గుర్తించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న ‘సెబ్’ స్టేషన్లను పోలీస్స్టేషన్లుగా గుర్తిస్తూ హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం ‘సెబ్’కు ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసేందుకు అవకాశం కల్పిస్తూ మైనింగ్, ఎక్సైజ్, అటవీ శాఖలు విడివిడిగా కూడా నోటిఫికేషన్లు జారీచేయాల్సి ఉంది. ►ఇప్పటికే గనుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. దాంతో ఇక నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ‘సెబ్’ దాడులు నిర్వహించి నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుంది. ఆ కేసులను స్థానిక పోలీసులకు అప్పగించాల్సిన అవసరంలేదు. జరిమానాలతో కేసులను సరిపెట్టరు. దీంతో.. ప్రజాధనం లూటీ, సహజ వనరుల దోపిడీ కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు సంక్రమించాయి. ► హోం, ఎక్సైజ్ శాఖలు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో అక్రమ మద్యం, గంజాయి దందాలకు పాల్పడే వారిపై కూడా ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది. ►ఇక ఎర్రచందనం స్మగ్లర్లపై ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తూ అటవీ శాఖ కూడా ఉత్తర్వులు జారీచేయనుంది. ► అలాగే, ఆన్లైన్ జూదాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసేందుకు వీలుగా ఐటీ శాఖ త్వరలో నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. ►గుట్కా దందాపై కఠిన చర్యలకు వీలుగా వైద్య–ఆరోగ్య శాఖ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. తదనుగుణంగా త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. -
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో సీబీఐ కేసు నమోదు
-
వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్..
న్యూఢిల్లీ: కడుపులో కొకైన్ దాచుకుని విదేశాల నుంచి వస్తున్న ఒక మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆ మహిళ ఉగాండ దేశస్థురాలిగా గుర్తించారు. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తొలుత అధికారులు.. సదరు మహిళ గర్భవతి కాబోలు అని భావించారు. ఆమెను సహయం చేయడానికి ఆమెవైపు చేరుకున్నారు. అయితే.. ఆ మహిళ మాత్రం అధికారులను చూడగానే భయంతో వణికిపోయింది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు తమదైన శైలీలో విచారించారు. ఆ తర్వాత... మహిళను ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో సదరు మహిళ కడుపులో ఒక కేజీ కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో నుంచి 91 కొకైన్ క్యాప్సుల్స్లను బయటకు తీశారు. వాటి బరువు 993 గ్రాముల వరకు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సంఘటనను చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇప్పటి వరకు 400 గ్రాముల వరకు కొకైన్‌ను రవాణా చేయడం మాత్రమే చూశామన్నారు. ఇంత భారీ ఎత్తున కొకైన్ రవాణా చేయడం చూడలేదన్నారు. ఇది కడుపులో విస్ఫోటనం చెందితే మహిళ ప్రాణాలకే ప్రమాదమన్నారు. బాధిత మహిళ కోలుకోవడానికి మరో నాలుగు రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం ఐడియారా బాబు..’, ‘వీడొక్కడే సినిమా గుర్తొచ్చిందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. Correction: The estimated value of the drug is Rs. 14 crores. This is the 24th case of seizure of NDPS covered drugs at Delhi airport this year. 32 passengers have been arrested so far. The estimated value of drug seizures would go into more than Rs. 845* crores: Customs Dept pic.twitter.com/nSgyZQo79U — ANI (@ANI) December 29, 2021 -
పోలీస్ శాఖలో కలకలం.. గంజాయి కేసులో పట్టుబడ్డ కానిస్టేబుల్
సాక్షి,ఖమ్మం: రెండు నెలల క్రితం గంజాయి రవాణా చేస్తూ జిల్లా పోలీసులకు పట్టుబడి సస్పెండ్ అయిన ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్ల ఉదంతం మరిచిపోకముందే ఇదే దందా సాగిస్తూ ఇంకో ఏఆర్ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. ఈసారి గంజాయి ఆయిల్(హఫీష్ ఆయిల్) రవాణా చేస్తూ హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ పట్టుబడడం పోలీస్‌శాఖలో కలకలం సృష్టించింది. ఖమ్మం ఏఆర్ విభాగానికి చెందిన ముజీబ్ పాషా భద్రాద్రి కొత్తగూడెంలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ముస్తఫానగర్‌కు చెందిన మహ్మద్ అఫ్రోజ్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని నాయకులగూడెంనకు చెందిన గుని వెంకటేష్, చల్లా ఉపేందర్‌తో కలిసి గంజాయి(హపీష్ ఆయిల్)ను ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు నుంచి కారులో హైదరాబాద్‌కు తరలిస్తూ తాజాగా పట్టుబడ్డాడు. విచారణలో ముజీబ్ పాషా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ అని తేలడంతో ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. తాజాగా చేపట్టిన ఉద్యోగుల విభజనలో ఆయనను భద్రాద్రి కొత్తగూడెంకు జిల్లాకు కేటాయించినట్లు సమాచారం. కాగా, విచారణ కోసం హైదరాబాద్‌నుంచి ఎస్ఓటీ పోలీసులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒకటి, రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గంజాయి, ఆయిల్ రవాణాలో కానిస్టేబుల్ ముజీబ్ పాషాతో పాటు ఇంకా ఎవరైనా పోలీస్‌శాఖ ఉద్యోగులకు సంబంధం ఉన్న అంశంపై కూపీ లాగుతున్నారు. ఏది ఏమైనా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో వరుసగా పోలీస్ సిబ్బంది పట్టుబడుతుండడంతో శాఖ ప్రతిష్ట దెబ్బతింటోందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
విచ్చలవిడిగా వన్య ప్రాణుల వేట
సాక్షి, హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో వన్యప్రాణులు, అరుదైన జంతువుల వేట, అక్రమ రవాణా క్రమంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో వీటి శరీర భాగాలకు డిమాండ్ పెరగడంతో అంతర్జాతీయ స్మగ్లింగ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పులులు, చిరుతల చర్మం, గోళ్లు, దంతాలు, ఎముకలు, కొవ్వు, మీసాలు, ఉడుముల జననాంగాలు, పాంగోలిన్ చర్మం, పొలుసులు, ముంగిస జుట్టు, పాములు, తాబేలు చర్మాలు ఇలా వివిధ శరీర అవయవాలకు విదేశాల్లో బాగా డిమాండ్ ఉంది. దీంతో మన అడవుల్లో వీటిని వేటాడేందుకు లేదా అక్రమ రవాణాకు అంతర్జాతీయ సంబంధాలున్న స్మగ్లింగ్ ముఠాలు పనిచేస్తున్నాయి. నిందితులను పట్టుకుంటున్నా ఈ గ్యాంగ్‌ల వెనక ఎవరున్నారు, వీటి తరలింపు అంతిమ లక్ష్యం లేదా గమ్యస్థానం ఏమిటో కనుక్కోవడంలో మాత్రం అటవీ అధికారులు, పోలీసులు విఫలమౌతున్నారు. వన్య ప్రాణుల వేట, తరలింపుపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణలో అటవీ శాఖ 24 గంటలు పనిచేసేలా ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్ కంట్రోల్ రూంను, టోల్‌ఫ్రీ నంబర్‌ను గతంలోనే ఏర్పాటు చేసింది. ఈ నంబర్‌కు 6,500కు పైగా కాల్స్ రాగా వాటిలో నాలుగు వేల దాకా వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా, రక్షణకు సంబంధించినవే ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో అరణ్య భవన్ ప్రధాన కార్యాలయం నుంచే ఈ ఫిర్యాదులపై ఒక ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. మిగతా అన్ని ఫిర్యాదులపై జిల్లాల్లోనే కార్యాచరణ చేపడుతున్నారు. అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో ఒక యాంటీ పోచింగ్ స్క్వాడ్, ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లలో చెరొకటి, మిగతా 8 అటవీ సర్కిళ్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. పొరుగు రాష్ట్రాలతో సమన్వయంతో పాటు అటవీ, పోలీస్, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, రెవెన్యూ ఇంటలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్, రైల్వేస్, సీఐఎస్ఎఫ్, ఫోరెన్సిక్, సీసీఎంబీ, జులాజికల్ సర్వే, బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్, పోస్టల్ తదితర జాతీయ స్థాయి ఏజెన్సీల అధికారుల సంయుక్త కృషితో దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల అరణ్యభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ తిలోత్తమ వర్మ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. -
సముద్రంపై తేలుతున్న ప్యాక్.. విప్పి చూస్తే 7 కోట్ల విలువైన..!!
$1 million worth of cocaine Found Floating on Florida Ocean: నీటిపై తేలియాడుతున్న దాదాపు 7 కోట్ల విలువైన 30 కేజీల కొకైన్‌ను అందజేసిన వ్యక్తిని పోలీసులు ప్రశంసించారు. వివరాల్లోకెళ్తే.. ఫ్లోరిడా కీస్ సమీపంలోని సముద్రంపై తేలియాడుతున్నట్లు కనుగొన్న మిలియన్ డాలర్ల విలువైన కొకైన్‌ను అందజేసిన వ్యక్తిని పోలీసులు ప్రశంసించారు. సముద్రంలో సరదాగా బోటింగ్‌కు వెళ్లిన వ్యక్తికి 30 కిలోల కంటే ఎక్కువ బరువున్న డ్రగ్స్‌ను ప్యాక్ చేసి ఉండటం గమనించాడు. వెంటనే ప్యాకేజీ గురించిన సమాచారాన్ని యూఎస్ బోర్డర్ పెట్రోల్‌కు తెలియజేశాడు. డ్రగ్స్‌ని వెలికి తీయడంలో యూఎస్ కోస్ట్ గార్డ్ సహాయం చేసింది. దీనివిలువ దాదాపు 7 కోట్లు (1 మిలియన్ డాలర్లు) ఉంటుందని అధికారులు తెలిపారు. చీఫ్ పెట్రోల్ ఏజెంట్ థామస్ జి మార్టిన్ 24 ఇటుకల రూపంలో ఉన్న కొకైన్కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ‘వారాంతంలో ఓ సహృదయుడు ఫ్లోరిడా కీస్ సమీపంలో సముద్రంలో తేలుతున్న 1 మిలియన్ డాలర్ల కొకైన్‌ను కనుగొన్నాడని రాసుకొచ్చాడు. ఐతే ఫోరిడాలో గుర్తుతెలియని వ్యక్తులు డ్రగ్స్‌ను భారీ స్థాయిలో రవాణా చేస్తూ దొరికిపోవడం కొత్తేమీ కాదు. ఈ యేడాది ప్రారంభంలో కూడా ఒక స్నార్కెల్లర్ 1.5 మిలియన్ డాలర్ల విలువైన కొకైన్‌ను కనుగొన్నాడు. మరో సంఘటనలో గత ఏడాది ఆగస్టులో ఫ్లోరిడాలోని ఓ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి 30 బిగుతుగా చుట్టిన బ్యాగులు కనిపించాయి. చదవండి: ట్రక్ యాక్సిడెంట్.. 53 మంది దుర్మరణం Over the weekend, a Good Samaritan discovered over 1 million dollars in cocaine floating at sea near the Florida Keys. The package contained nearly 69 lbs. of cocaine. #BorderPatrol agents with support from @USCGSoutheast recovered the drugs. #breakingnews #breaking #monday pic.twitter.com/cC7EKa9lDx — Chief Patrol Agent Thomas G. Martin (@USBPChiefMIP) December 6, 2021 -
ట్రక్ యాక్సిడెంట్.. 53 మంది దుర్మరణం
మెక్సికో: ప్రాణాలను పణంగా పెట్టి యునైటెడ్ స్టేట్స్ సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్నించారా వలసదారులు. కానీ ట్రక్కు తిరగబడటంతో వారిని మృత్యువు కబలించింది. దక్షిణ మెక్సికోలో గురువారం చోటుచేసుకున్న ఈ హృదయవిదారక దుర్ఘటనలో దాదాపు 53 మంది అమెరికన్ వలసదారులు మరణించారు. మృతుల్లో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారని చియాపాస్ సివిల్ ప్రొడక్షన్ తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.చియాపాస్ రాష్ట్రంలోని టక్స్ట్లా గుటిరెజ్ నగరం వెలుపల ఒక పదునైన వంపులో ట్రక్కు క్రాష్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని చియాపాస్ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధిపతి లూయిస్ మాన్యువల్ గార్సియా తెలిపారు. వాహనంలో కనీసం 107 మంది ఉంటారని ప్రాధమిక అంచనా. దక్షిణ మెక్సికోలో వారిని రవాణా చేస్తున్న ట్రక్కు ఓవర్‌లోడ్, అతివేగం కారణంగా ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వలస వెళ్లడం సాధారణంగా జరుగుతుంది. గత నెలలో 652 మందితో అక్రమ వలసదారులతో వెళ్తున్న 6 ట్రక్కులను పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు దేశాల నుంచి మెక్సికో నుంచి అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ట్రక్కు కూడా అలాంటిదే. కాగా మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ట్విటర్ ద్వారా సంఘటనపై సంతాపం తెలిపారు. చదవండి: ప్రేమ వివాహం చేసుకున్నాడు.. బలవంతంగా సూసైడ్‌నోట్ రాయించి.. -
వెలుగులోకి చైనా కుతంత్రాలు.. ఎక్కడి నుంచైనా దాడి చేసేలా
China Hiding Missiles in Shipping Containers Plans to Attack Anywhere in the World: నయానో, భయానో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న చైనా.. అందుకోసం ఎన్నో దుష్టపన్నాగాలను పన్నుతోంది. ఇప్పటికే హంకాంగ్ను ఆక్రమించేందుకు హాంకాంగ్ లా పేరిట కొత్త సెక్యూరిటీ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంపై హాంకాంగ్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికి ఫలితం లేకుండా పోతుంది. ఈ క్రమంలో తాజాగా చైనా దుష్ట పన్నాగం ఒకటి వెలుగులోకి వచ్చింది. (చదవండి: ఏలియన్ల అన్వేషణ! ప్చ్.. ఇలాంటివన్నీ చైనాకే కనిపిస్తాయా?) చైనా షిప్పింగ్ కంటైనర్లలో క్షిపణులని అక్రమంగా తరలిస్తోన్నట్లు సన్ పత్రిక వెల్లడించింది. ఈ మిస్సైల్స్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఓడరేవులకు అక్రమంగా చేరవేస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. వీటిని ప్రయోగించేందుకు చైనా సిద్ధపడుతోన్నట్లు తెలిసింది. ‘ది సన్’ నివేదిక ప్రకారం, ప్రపంచ మహాసముద్రాలలో చైనాకు చెందిన భారీ నౌకలు ఉన్నాయి. కొంతమంది పాశ్చాత్య పరిశీలకులు చైనా ఈ విధంగా క్షిపణులను అక్రమ రవాణా చేయడం.. కొత్త యుద్ధనౌకలను కొనుగోలు చేయడంతో సమానమని భావిస్తున్నారు. ఈ కంటైనర్లు సాధారణ కంటైనర్ల వలె కనిపిస్తాయి, కాబట్టి వాటిని ఇతర కంటైనర్లతో కలిపి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. (చదవండి: దుబాయ్‌లో భారీ పేలుడు; 35 కిమీ దూరం వినపడేలా) అదే సమయంలో, శత్రు దేశ నౌకాశ్రయాలకు ఈ క్షిపణులను చేరవేయడం ద్వారా చైనా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా ఆకస్మిక దాడిని ప్రారంభించగలదు. చైనా వద్ద స్టెల్త్ క్షిపణులు ఉండే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ అసెస్మెంట్ అండ్ స్ట్రాటజీ సెంటర్ రిక్ ఫిషర్ తెలిపింది. అమెరికా, చైనా ఇరు దేశాలు ఆర్థికంగా, సైనిక శక్తి పరంగా ప్రపంచంలోని అగ్రరాజ్యంగా నిలవడానికి తెగ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇక తైవాన్ భవిష్యత్తుపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. తైవాన్ను ఆక్రమించాలనే ఉద్దేశంతో చైనా పావులు కదుపుతుండగా.. డ్రాగన్ నుంచి తైవాన్ను కాపాడతామని అమెరికా ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలో చైనా ఇలా కంటైనర్లలో మిస్సైల్స్‌ని రవాణా చేస్తుందనే వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. (చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!) ఈ కొత్త క్షిపణుల నమూనా 2016 ఆర్మ్స్ ఫెయిర్‌లో కనిపించింది. అప్పటి నుంచి చైనా వీటిని ఎప్పుడైనా ప్రయోగించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తన కోరిక మేరకు అరాచకాలను సృష్టించేందుకు కంటైనర్ క్షిపణులను పూర్తిగా ఉపయోగించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: ఆయుధాల తయారీలో స్వావలంబన దిశగా భారత్ -
గంజాయి అక్రమ రవాణాకు హాట్‌స్పాట్స్‌గా మారుతున్న రైళ్లు
-
US returns 250 antiquities: భారత్‌కు అద్భుత కళాఖండాలు అప్పగింత
న్యూయార్క్: అపహరణకు గురైన పురాతన కళాఖండాల కార్యాచరణ దర్యాప్తులో భాగంగా సుమారు15 మిలియన్ డాలర్లు విలువ చేసే 250 పురాతన వస్తువులను భారత్‌కు యూఎస్ తిరిగి ఇచ్చింది. ఈ పురాతన వస్తువులను న్యూయార్క్ నగరంలోని ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన వేడుకలో భారత్‌కి అందజేసారు. ఈ మేరకు ఈ వస్తువులు మాన్హాటన్ జిల్లా న్యాయవాది కార్యాలయం, యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ జరిపిన సుదీర్ఢ దర్యాప్తులో వెలుగు చూశాయి. ఈ సందర్భంగా యూఎస్ డిస్ట్రిక్ అటార్నీ సైరస్ వాన్స్ జూనియర్ మాట్లాడుతూ.. డీలర్ సుభాష్ కపూర్ యునైటెడ్ స్టేట్స్కు పదివేల పురాతన వస్తువులపై అక్రమంగా తరలించారని ఆరోపణల నేపథ్యంలో విస్తృత దర్యాప్తు పై దృష్టి సారించాం. తమ సుదీర్ఘ దర్యాప్తు ఫలితంగా 143 మిలియన్ల డాలర్ల విలువైన 2,500 కళాఖండాలు తిరిగి సంపాదించగలిగాం. ఈ నేరానికి పాల్పడిన కపూర్ అతని సహ కుట్రదారులు తగిన శిక్ష పడుతంది. అయితే కపూర్ ప్రస్తుతం భారతదేశం జైలులో ఉన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు దర్యాప్తును యూఎస్ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా కపూర్ గ్యాలరీ నుంచి వాటిని సేకరించిన యూఎస్.. భారత్‌కు అప్పగించింది. భారతదేశం, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల నుండి దోచుకున్న నిధులను రవాణా చేయడానికి న్యూయార్క్‌లోని తన ఆర్ట్స్ ఆఫ్ ది పాస్ట్ గ్యాలరీని వినియోగించారు. ఈ క్రమంలో కపూర్ పురాతన వస్తువులను వెతకడానికి ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. దేవాలయాల నుంచి పురాతన వస్తువుల్ని దొంగలిస్తూ వాటిని రహస్యంగా తరలించేవాడు. -
జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు
-
ప్రాణహిత నదిలో కలప అక్రమ రవాణా
-
మొదటిసారి నిందితుడిని చూస్తే అది బలహీనమైన సాక్ష్యమే: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక నేరం జరిగిన సమయంలోనే నిందితుడిని మొదటిసారి చూసి, ఆ తర్వాత కోర్టులో ఆ వ్యక్తిని సాక్షి గుర్తు పట్టడం అనేది అత్యంత బలహీనమైన సాక్ష్యాధారమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందులోనూ నేరం జరిగిన తేదీకి, కోర్టులో విచారణ జరిగే సమయానికి మధ్య కాల వ్యవధి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సాక్ష్యం మరింత బలహీనంగా మారుతుందంది. మద్యం అక్రమ రవాణా కేసులో కేరళ అబ్కారీ చట్టం కింద దోషులుగా నిర్ధారించిన నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్‌ల ధర్మాసనం ఈ∙వ్యాఖ్యలు చేసింది. నలుగురు వ్యక్తులు 6,090 లీటర్ల మద్యాన్ని 174 ప్లాస్టిక్ క్యాన్లలో ఉంచి తప్పుడు రిజిస్టేషన్ ఉన్న వాహనంలో తరలిస్తున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 11 ఏళ్ల నాటి ఘటనలో మొదటిసారి ఆ వ్యక్తుల్ని చూసినందున వారిని గుర్తు పట్టలేకపోతున్నానని సాక్షి పేర్కొన్నారు. అయితే వారిలో ఇద్దరిని మాత్రం ఐడెంటిఫికేషన్ పెరేడ్లో గుర్తు పట్టగలిగారు. దీంతో సుప్రీంకోర్టు ఆ సాక్ష్యం చెల్లదని ప్రకటించింది. నలుగురు నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. -
డ్రగ్స్ దందా: హైదరాబాద్ టు ఆస్ట్రేలియా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా కొనసాగుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. డ్రగ్స్ తయారీకి ముంబై నుంచి ఫండింగ్ చేస్తున్న మాఫియా ఇక్కడి నుంచి ఏకంగా ఆస్ట్రేలియాకే స్మగ్లింగ్ చేసే వరకు వెళ్లిందంటే వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శుక్రవారం ముంబైలో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో మరోసారి హైదరాబాద్ పేరు తెరపైకి రావడం కలకలం రేపుతోంది. త్వరలోనే ఛేదిస్తాం హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారు చేయించిన మాఫియా ఆ డ్రగ్స్‌ను ఏమాత్రం సందేహం రాకుండా మెత్తలు, పరుపుల్లో పెట్టి షిప్పింగ్ ద్వారా ఇక్కడి నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియాకు పంపించే యత్నంచేసి దొరికిపోయింది. ఎన్సీబీ బృందాలు శుక్రవారం ముంబైలోని నార్త్ అం«ధేరీలో సోదాలు నిర్వహించి పలు బాక్స్‌లు గుర్తించాయి. ఇందులో మెత్తల్లో దాచి ఉంచిన 4.6 కేజీల ఎపిడ్రిన్ డ్రగ్స్ ప్యాక్‌లను స్వాధీనం చేసుకుంది. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంకెడే స్పష్టంచేశారు. హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియాకు బుక్ చేశారని వెల్లడించారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉన్న అంధేరీలో ఈ డ్రగ్స్ పట్టుబడటం గమనార్హం. ఎంత మొత్తంలో డ్రగ్స్ విదేశాలకు వెళ్లాయో త్వరలోనే ఛేదిస్తామని సమీర్ వాంకెడే చెప్పారు. సిద్ధిఖ్ అహ్మద్ లింకులతోనేనా? మూడు రోజుల క్రితం గోవాలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన హైదరాబాదీ సిద్ధిఖ్ అహ్మద్ విచారణలో సంచలన వివరాలు వెల్లడించాడు. ముంబై ఎన్సీబీ జోన్ కింద గోవా సబ్‌జోనల్ పనిచేస్తుంది. హైదరాబాద్‌లో భారీగా ఎండీఎంఏ డ్రగ్ తయారీ జరిగి అక్కడి నుంచి ముంబైకి తరలిస్తున్నట్టు సిద్ధిఖ్ తెలిపాడు. పదేపదే హైదరాబాద్ పేరు.. ఇక్కడి పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టి ఈ డ్రగ్స్ తయారు చేయడం హైదరాబాద్‌తోపాటు తెలంగాణ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తయారుచేస్తున్న కంపెనీలను స్థానిక నిఘా విభాగాలు ఎందుకు గుర్తించడంలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోవా, ముంబై, బెంగళూరు డ్రగ్ కేసుల్లో పదేపదే హైదరాబాద్ పేరు బయటకు రావడం ఎన్సీబీతోపాటు స్థానిక పోలీసులు, నిఘా విభాగాలకు తలనొప్పిగా మారింది. కంపెనీలపై ప్రత్యేక నజర్‌తోపాటు దాడులు చేసేందుకు ఎన్సీబీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు తెలిసింది. వరుస దాడులతో ఇప్పటికే ఆయా కంపెనీల్లో డ్రగ్స్ మాయ మైపోయి ఉంటాయని దర్యాప్తు విభాగాలు అనుమానిస్తున్నాయి. అయితే విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సూత్రధారులు, హైదరాబాద్ పాత్రధారులు ఎవరన్నది తేల్చే పనిలో ఎన్సీబీ ఉన్నట్టు సమాచారం. -
దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే!
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి జజీరా ఎయిర్‌లైన్స్ విమానంలో సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడి సామగ్రిలో చాక్లెట్లు, బిస్కెట్లలో 763 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు, నాణేలు బయటపడ్డాయి. వాటి విలువ 32.24 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ -
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం : డీఐజీ రంగనాథ్
-
ఏపీ: మద్యం.. తగ్గుముఖం
అక్రమ మద్యంపై ఉక్కుపాదం బెల్ట్ షాపులు, పర్మిట్ రూములను మూసేయించడం, దుకాణాల సంఖ్యను తగ్గించడంతో పాటు.. విక్రయాల సమయాన్ని కుదించాం. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. ఈ సమయంలో రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలి రాకుండా చూడాలి. ఎక్కడైనా తయారు చేస్తుంటే చర్యలు తీసుకోవాలి. కాలేజీలు, యూనివర్సిటీలకు సమీపంలో గంజాయి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో నిఘా పెట్టాలి. గంజాయి సాగును గుర్తించి, ఎప్పటికప్పుడు ధ్వంసం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అక్రమ మద్యం తయారీ, రవాణాతో పాటు గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దానిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాల ప్రగతిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, 4,379 మద్యం షాపులను 2,975కు కుదించి.. మూడింట ఒక వంతు దుకాణాలను మూసి వేశామని తెలిపారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం 43 వేల బెల్టు షాపులను తీసేయడంతో పాటు 4,379 పర్మిట్ రూమ్‌లను మూసి వేయించడం వల్ల రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఇది వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించే వారని, ఈ సమయాన్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేశామని చెప్పారు. ఈ చర్యలన్నింటితో లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయని వివరించారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం ► గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలి. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేయాలి. పోలీసు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ► డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపై పర్యవేక్షణ ఉండాలి. ► దీనిపై కార్యాచరణ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలి. ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపై దృష్టి పెట్టాలి. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు ► నిర్ధేశించిన రేట్ల కన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలి. ఎస్ఈబీ కాల్ సెంటర్ నంబర్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్ చేసేలా జిల్లాల వారీగా ప్రచారం చేయాలి. ► వచ్చే కాల్స్‌పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆయా జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే.. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలి. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలి. ► ఈ సమీక్షా సమావేశంలో ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ డైరెక్టర్ (స్పెషల్ యూనిట్స్) ఏ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న పోలీసులు (ఫైల్) కేసుల వివరాలు ఇలా.. ► మద్యం అక్రమ రవాణా, తయారీపై నమోదైన కేసులు : 1,20,822 ► అరెస్ట్ అయిన నిందితులు : 1,25,202 ► 2020లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు : 63,310 ► 2021లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు : 57,512 ► ఎస్ఈబీ నమోదు చేసిన కేసులు : 74,311 ► పోలీసులు నమోదు చేసిన కేసులు : 46,511 ► సీజ్ చేసిన అక్రమ మద్యం (లీటర్లు) : 8,30,910 ► స్వాధీనం చేసుకున్న నాటుసారా (లీటర్లు) : 8,07,644 ► ధ్వంసం చేసిన బెల్లం ఊట (లీటర్లు) : 2,30,48,401 ► సీజ్ చేసిన వాహనాలు : 29,491 ► ఇసుక అక్రమ రవాణాపై నమోదైన కేసులు : 12,211 ► అరెస్ట్ అయిన నిందితులు : 22,769 ► స్వాధీనం చేసుకున్న ఇసుక (టన్నులు) : 5,72,372 ► స్వాధీనం చేసుకున్న వాహనాలు : 16,365 ► గంజాయి సాగు, రవాణాపై నమోదైన కేసులు : 220 ► అరెస్ట్ అయిన నిందితులు : 384 ► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 18,686 ► 2021 మార్చి 20 నుంచి 2021 మార్చి 31 వరకు ఆపరేషన్ నయా సవేరా కింద నమోదైన కేసులు : 69 ► అరెస్ట్ అయిన వారు : 174 ► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 2,176 ► అవేర్నెస్ క్యాంపులు : 330 -
అఫ్గాన్ టు గుజరాత్.. వయా విజయవాడ!
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌కు విజయవాడ గేట్వేగా మారిందన్న సమాచారం కలకలం సృష్టిస్తోంది. ఏకంగా రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్‌తో విజయవాడలోని ఓ వ్యాపార సంస్థకు సంబంధాలున్నాయన్న విషయం విస్మయం కలిగిస్తోంది. కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుజరాత్‌లోని ముండ్రా పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో తీగ లాగితే విజయవాడలో డొంక కదలింది. టాల్కం పౌడర్ కాదు..హెరాయిన్ అఫ్గానిస్తాన్ నుంచి గుజరాత్‌లోకి హెరాయిన్‌ను స్మగ్లింగ్ చేశారని కేంద్ర డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. దాంతో గుజరాత్‌లోని ముండ్రా పోర్టులో తనిఖీలు నిర్వహించగా.. భారీ పరిమాణంలో హెరాయిన్‌ను గుర్తించారు. టాల్కం పౌడర్ పేరుతో ఉన్న భారీ కన్సైన్మెంట్ను తెరచి చూడగా.. అందులో భారీస్థాయిలో హెరాయిన్ ఉండటం విస్మయపరిచింది. కాందహార్‌లోని ‘హాసన్ హుస్సేన్ లిమిటెడ్’ అనే వ్యాపార సంస్థ నుంచి ‘టాల్కం పౌడర్’ పేరుతో ఆ హెరాయిన్‌ను దిగుమతి చేసుకున్నారు. తొలుత ఆ హెరాయిన్ విలువ రూ.2,500 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేయగా.. దాని విలువ ఏకంగా రూ.9 వేల కోట్లుగా నిర్ధారించారు. ఇంతకీ ఆ హెరాయిన్‌ను ఎవరు దిగుమతి చేశారని దర్యాప్తు చేయగా... విజయవాడలోని లింకులు బయటపడ్డాయి. పోలీసుల అదుపులో నలుగురు విజయవాడలోని అషీ ట్రేడింగ్ కంపెనీ అఫ్గానిస్తాన్ నుంచి హెరాయిన్‌ను దిగుమతి చేసుకుందని కన్సైన్మెంట్ రికార్డుల్లో ఉంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడలోని గడియారం వీధిలోని అషీ ట్రేడింగ్ కంపెనీని గుర్తించారు. ఆ కంపెనీ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచా రణ చేపట్టారు. కాగా, వారు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. తమది కేవలం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం మాత్రమేనని.. గుజరాత్లో డీఆర్ఐ అధికారులు జప్తు చేసిన హెరాయిన్‌తో తమకు సంబంధంలేదని చెప్పినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాలకు తరలించేందుకే.. ఆ హెరాయిన్‌ను గుజరాత్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు తరలించనున్నారన్నది పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. కాగా, స్మగ్లింగ్ రాకెట్ అసలు ప్రణాళిక ఏమిటన్న దానిపై పోలీసులు ఇతమిత్థంగా ఇంకా ఓ అంచనాకు రాలేదు. గుజరాత్ నుంచి విజయవాడ తీసుకువచ్చి ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తారా లేక విజయవాడతో సంబంధం లేకుండా నేరుగా గుజరాత్ నుంచి చెన్నై తరలించాలన్నది స్మగ్లర్ల ప్రణాళికా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అషీ ట్రేడింగ్ కంపెనీ పేరును మాత్రమే స్మగ్లింగ్ రాకెట్ వాడుకుంటోందా అన్న దాంట్లో వాస్తవం ఎంతన్నది అంతుబట్టడం లేదు. ప్రస్తుతానికి అషీ ట్రేడింగ్ కంపెనీకి చెం దిన ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సింథటిక్ డ్రగ్స్‌ను ఆన్లైన్ ద్వారా తె ప్పించి విక్రయిస్తున్న ముఠాను గుంటూరు పో లీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అం తలోనే రూ.9వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్‌లో విజయవాడ కేంద్ర బిందువుగా ఉందని తెలియడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ దందాపై పోలీస్, డీఆర్ఐ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవ ని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. హెరాయిన్ స్మగ్లింగ్ వ్యవహారంలో విజయవాడ లింకులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇదే అంశంపై విజయవాడలోని కేంద్ర డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ టి.రాజీవ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
సొంత గూటికి అరుదైన తాబేళ్లు
సాక్షి, హైదరాబాద్: అక్రమ రవాణాలో పట్టుబడిన 266 అరుదైన తాబేళ్లు సొంత గూటికి చేరాయి. ఆదివారం హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు ఈ ఇండియన్ టెంట్ టర్టిల్ (పంగ్‌శుర టెంటోరియా సర్కమ్ డాటా), ఇండియన్ రూటెడ్ టర్టిల్ (పంగ్‌శుర టెక్టా)గా పిలిచే తాబేళ్లను సురక్షితంగా పంపించారు. గత ఆగస్టులో లక్నో సమీపంలోని గోమతి నది నుంచి తాబేళ్లను అక్రమంగా తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతుండగా ఇద్దరు నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ తాబేళ్లను జూపార్కుకు తరలించారు. అయితే సహజ సిద్ధఆవాసాల్లో ఎక్కువ సంరక్షణ ఉంటుంది కాబట్టి తాబేళ్లను లక్నోకు తరలించే విషయమై తెలంగాణ అటవీ శాఖను యూపీ పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) పవన్‌కుమార్ శర్మ సంప్రదించారు. దీంతో వాటికి ఆరోగ్య పరీక్షలు చేసి సురక్షిత ప్యాకేజింగ్‌తో ఎయిర్ ఇండియా విమానంలో లక్నో పంపించారు. అక్కడ కూడా పరీక్షలు నిర్వహించి గోమతి నదిలో వదిలేస్తామని యూపీ అధికారులు తెలిపారు. అరుదైన తాబేళ్లు కావడంతో అక్రమ రవాణా బారిన పడుతున్నాయని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని టీఎస్ఏ(టర్టిల్ సర్వైవల్ అలయన్స్) ఇండియా డైరెక్టర్ డా.శైలేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. అక్రమ రవాణాను అడ్డుకుని పట్టుకున్న తాబేళ్లను మళ్లీ సహజసిద్ధ ఆవాసాలకు తిప్పి పంపడం ఇది రెండోసారి. 2015లో మహారాష్ట్రలోని పుణె నుంచి 500 తాబేళ్లను లక్నోకు తరలించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఏ బృందం ఇమ్రాన్ సిద్దిఖీ, సుజిత్, లక్నో సబ్‌డివిజనల్ ఆఫీసర్ అలోక్‌పాండే, బయోలాజిస్ట్ అరుణిమ పాల్గొన్నారు. -
చెప్పులో బంగారం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే–526 విమానంలో గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అతడు ధరించిన చెప్పులకు వెండి రంగులో ఉన్న డిజైన్ పలకలను తొలగించడంతో బంగారం బయటపడింది. అంతేకాకుండా అతడి బ్యాగేజీలో ఉన్న ఫేషియల్ క్రీమ్ బాక్సులో కూడా బంగారం లభించింది. మొత్తం 495 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ 24.14 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. -
బంగారాన్ని పేస్ట్‌గా మార్చి ప్యాంట్లో దాచాడు!
కొచ్చి: కొన్ని ఏళ్లుగా బంగారం చాలా ఖరీదుగా మారడమే గాక విక్రయదారులకు మంచి లాభాలను ఇస్తోంది. దీంతో స్మగ్లర్ల కన్ను బంగారం పై పడింది. ఈ క్రమంలో నిత్యం ఏదో ఓ రూపంలో బంగారాన్ని స్మగ్లర్లు అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు. ఇలా చేస్తున్న వారిలో కొందరు పట్టుబడుతుండగా, మరి కొందరు తప్పించుకుంటున్నారు. దేశంలోని ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు, కస్టమ్స్ ప్రివెంటివ్ యూనిట్లు, ఇతర సిబ్బంది కలిసి స్మగ్లింగ్ అడ్డుకట్టకి ఎంత పకడ్బంది చర్యలు తీసుకున్న నేరస్థులు సరికొత్త దారులను ఎంచుకుంటున్నారు. ఒక్కోసారి వీరి ఐడియాలు చూస్తే ఇలా కూడా చేయచ్చా అని ఆశ్చర్యం వేయకమానదు. తాజాగా అటువంటి ఘటన కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. సోమవారం కన్నూరు విమానాశ్రయంలో ఓ వ్యక్తి 302 గ్రాముల బంగారంతో పట్టుబడ్డాడు. అది కూడా ఎలాగంటే.. ఎవరికీ అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చి రెండు పొరల ప్యాంట్ల మధ్యలో దాచుకుని వచ్చాడు. అయితే ఆ ప్రయాణికుడి కదలికలు కాస్త అనుమానంగా ఉండడంతో అధికారులు గుర్తించి అతడిని తనిఖీ చేయగా అసలు నిజం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. చదవండి: టిప్పర్ చక్రాల కిందపడి.. యువకుడి దుర్మరణం -
చైనాకు తెలుగు రాష్టాల నుంచి వెంట్రుకల స్మగ్లింగ్!
సాక్షి, హైదరాబాద్: చైనా సహా పలు దేశాలకు ‘ఫెమా’నిబంధనలను ఉల్లంఘించి తల వెంట్రుకలు ఎగుమతి చేస్తున్న తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు వ్యాపారులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. హైదరాబాద్, తూర్పు గోదావరి జిల్లాలో 8 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఆయా వ్యాపారులు లెక్కల్లో చూపని రూ. 2.90 కోట్ల నగదును జప్తు చేసింది. అలాగే వారి నుంచి 12 సెల్ఫోన్లు, మూడు లాప్‌టాప్‌లు, ఒక కంప్యూటర్, కొన్ని డైరీలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఈడీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా యాప్స్‌పై దర్యాప్తులో కదిలిన డొంక.. చైనాకు చెందిన పలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌పై నమోదైన ఓ మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన తల వెంట్రుకల ఎగుమతిదారులకు రూ. 16 కోట్ల మేర హవాలా చెల్లింపులు జరిగినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించి వారిపై ‘ఫెమా’నిబంధనల కింద దర్యాప్తు చేపట్టగా అక్రమ చైనీస్ యాప్‌ను ఉపయోగించి హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యాపారస్తులు ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులకు తల వెంట్రుకలు విక్రయించి పేటీఎం ద్వారా రూ. 3.38 కోట్లు ఆర్జించినట్టు గుర్తించామని ఈడీ వివరించింది. ఈ వ్యవహారంలో కొందరు మయన్మార్ జాతీయుల ప్రమేయాన్ని గుర్తించినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో తిష్ట వేసిన పలువురు మయన్మార్ జాతీయలు భారతీయులు/భారతీయ సంస్థల కోసం ఉద్దేశించిన ఇంపోర్ట్–ఎక్స్పోర్ట్ కోడ్‌ను వాడి తల వెంట్రుకల విలువను తక్కువగా చూపి వారి దేశానికి ఎగుమతి చేస్తున్నట్లు తేలిందని ఈడీ వివరించింది. మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రియా తదితర దేశాలకు తక్కువ పరిమాణంలో వెంట్రుకలను చూపి ఎక్కువ పరిమాణంలో వాటిని విక్రయించినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలినట్టు ఈడీ వెల్లడించింది. కొందరు వ్యాపారస్తులు తమ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో విక్రయాల డబ్బులు పొందుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. చైనా వయా మయన్మార్.. హైదరాబాద్, కోల్‌కతా, గువాహటికి చెందిన చాలా మంది వ్యాపారస్తులు విదేశీ వ్యాపారులకు వెంట్రుకలను ఎగుమతి చేస్తున్నట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మోరెహ్ (మణిపూర్), జొఖాతర్ (మిజోరం), ఐజ్వాల్ (మిజోరం) గుండా మండాలె (మయన్మార్)కు, అక్కడి నుంచి చైనాకు వెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. భారత్ నుంచి స్మగ్లింగ్ చేసిన వెంట్రుకలను చైనీస్ వెంట్రుకలుగా అక్కడి వ్యాపారస్తులు పేర్కొని దిగుమతి సమయంలో 28 శాతం సుంకాన్ని ఎగ్గొట్టడంతోపాటు ఎగుమతి సమయంలో 8 శాతం రాయితీలను పొందుతున్నారు. చాలా మంది భారత వ్యాపారవేత్తలు సైతం వెంట్రుకల ఎగుమతి సమయంలో వాటి పరిమాణాన్ని తగ్గించి చూపి ఎగుమతి సుంకాన్ని ఎగ్గొట్టుతున్నట్టు ఈడీ గుర్తించింది. -
అరకు మత్తులో.. యువత చిత్తు..!
అందమైన ప్రకృతి ఒడిలో గంజాయి పెరుగుతోంది. గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరుకు తరలిపోతోంది. ఈ మార్గంలోని చిత్తూరులో పిల్లలను మత్తుకు బానిసలుగా చేస్తోంది. ఇటీవల మైనర్లు గంజాయి తాగుతున్న వీడియోలు వెలుగులోకి రావడంతో పోలీ సులు రంగంలోకి దిగారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. పిల్లలకు హెచ్చరికలు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. చదవండి: బైకుల దొంగ.. 18 మోటార్ సైకిళ్లు స్వాధీనం చిత్తూరు అర్బన్: అరకు.. ఈపేరు వింటేనే ఎత్తయిన కొండలు.. అందమైన లోయలు. ప్రకృతి హొయలు కళ్లముందు కదలాడుతుంటాయి. ఇంత అందమైన వనంలో టన్నుల కొద్దీ గంజాయి సాగు చేసి స్మగ్లింగ్ చేయడంలో ఆరితేరినవారూ ఉన్నారు. ఇటీవల అరకు నుంచి పెద్ద మొత్తంలో జిల్లాకు గంజాయి రవాణా అవుతుండడమే దానికి నిదర్శనం. దీనిమత్తులో యువత చిత్తవుతున్నారు. రవాణా ఇలా.. విశాఖ జిల్లాలోని అరకులో గంజాయి మొక్కల పెంపకం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఈ పంటను నిర్మూలించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒకరూపంలో ఇతర ప్రాంతాలకు చేరుతోంది. ఇక విశాఖలోని అరకు, గాజువాక ప్రాంతాల నుంచి చిత్తూరు జిల్లాకు చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి ఆకులను బాగా ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి 5 కిలోలు, 10 కిలోల సంచుల్లో జిల్లాకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక్కోసారి 20 కేజీల బ్యాగుల రూపంలో కూడా ఇక్కడకు వస్తోంది. వీటి రవాణాలో ఎవరికీ అనుమానం రాకుండా స్మగ్లర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఆర్టీసీ బస్సుల్లోనే లగేజీ రూపంలో తీసుకొస్తుండగా, చాలా వరకు లారీల్లో ఇక్కడకు తరలిస్తున్నా రు. నిత్యావసర సరుకులు, గృహ నిర్మాణ పరికరాలతో పాటు గంజాయి బ్యాగులను లారీ అడుగు భాగంలో దాచి ఉంచి కొనుగో లుదారులకు వీటిని చేరుస్తున్నారు. మారువేషాలతో.. చిత్తూరులోని కొంగారెడ్డిపల్లె ప్రాంతంలో కొందరు మైనర్లు గంజాయి పీలుస్తున్న వీడియాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందాన్ని నియమించి రంగంలోకి దింపారు. మొత్తం 15 మందితో ఉన్న ఈ బృందం అరకు, గాజువాక ప్రాంతాలకు వెళ్లి మధ్యవర్తుల అవతారం ఎత్తింది. వంద కేజీల గంజాయి కావాలంటూ మారువేషాల్లో బేరమాడి అరకుకు చెందిన ప్రధాన స్మగ్లర్లు రమణ, కుడా భాస్కర్, గాజువాకకు చెందిన పోతురాజును ఇటీవల అరెస్టు చేశారు. వీరి నుంచి రాబట్టిన సమాచారంతో పూతలపట్టు బండపల్లె, కల్లూరు, మదనపల్లె, పాకాల, తవణంపల్లె ప్రాంతాలకు చెందిన 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి స్మగ్లింగ్ కేసులో మరో నింది తుడు బెంగళూరుకు చెందిన సిద్ధూ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వయా బెంగళూరు.. విశాఖ జిల్లా నుంచి వస్తున్న గంజాయి తొలుత తిరుపతికి చేరుతోంది. ఇక్కడ రైల్వే స్టేషన్, బస్టాండు సమీప ప్రాంతాల్లో కొందరు చిన్నపాటి పొట్లాలుగా చుట్టి అమ్ముతున్నారు. పది సిగరెట్లలో ఉండే పొగాకు పరిమాణంలో ఉన్న ఒక్కో ప్యాకెట్ ధర రూ.200 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. తిరుపతి తరువాత పశ్చిమ ప్రాంతాలకు పూతలపట్టు మండలంలోని బండపల్లె నుంచి పెద్దమొత్తంలో తరలిస్తున్నారు. పుంగనూరు, పలమనేరు, కల్లూరు, పాకాల, మదనపల్లెతోపాటు కుప్పం వరకు సరుకు బండపల్లె నుంచే వెళుతోంది. ఇంతటితో ఆగని గంజాయి స్మగ్లింగ్ బెంగళూరుకు సైతం పాకింది. బెంగళూరులోని మెజిస్టిక్, రైల్వే స్టేషన్లలో లభించే గంజాయి అరకుదేనని పోలీసులు తేల్చారు. జీవితఖైదు కంటే ఎక్కువ శిక్ష మాదకద్రవ్యా ల వాడకం, అమ్మకం రెండూ నేరమే. ఈ కేసులో పట్టుబడిన వారిపై నేరం రుజువైతే జీవితఖైదు కంటే ఎక్కువ శిక్ష పడుతుంది. గంజాయి కేసులో మూలాలను పట్టుకుని, ప్రధాన స్మగ్లర్లను ఇప్పటికే అరెస్టు చేశాం. మరికొందరిని అరెస్టు చేయడానికి నిఘా పెట్టాం. 18 మందిపై షీట్లు ఓపెన్ చేశాం. గంజాయి మత్తుకు ఎక్కువగా యువత చిత్తవుతోంది. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. – ఎస్.సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు చదవండి: చిన్నారి చికిత్సకు సీఎం రూ.17.5 లక్షల సాయం -
స్మగ్లింగ్ ముఠా: కాసుల ఎర.. అమాయకుల చెర
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్‌కు మూడేళ్ల క్రితం కోరుట్లలో ఉండే జీశాన్, తౌఫిక్, తన్వీర్లతో పరిచయమైంది. ‘దుబాయ్ నుంచి ఓ పార్శిల్ తీసుకురావాలి, విమానం, వీసా ఖర్చులన్నీ మేమే చూసుకుంటం. పార్శిల్ తీసుకొచ్చినందుకు రూ.40 వేలు ఇస్తం’ అన్నారు. డబ్బుల ఆశతో సర్ఫరాజ్ 2018 ఏప్రిల్ 13న దుబాయ్ వెళ్లి, 15న అక్కడ ఓ మనిషిని కలిశాడు. ఆయన ఇచ్చిన పార్శిల్ తీసుకుని నేపాల్ మీదుగా వస్తుండగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ పార్శిల్లో అక్రమంగా తరలిస్తున్న అర కిలో బంగారం ఉండటంతో స్వాధీనం చేసుకుని సర్ఫరాజ్‌పై కేసు పెట్టా రు. ఆ పార్శిల్లో ఏముందో తెలియని సర్ఫరాజ్ మూడేళ్లుగా నేపాల్ జైల్లో మగ్గుతున్నాడు. సర్ఫరాజ్ అరెస్టు కాగానే జీశాన్, తౌఫిక్, తన్వీర్‌లు పరారయ్యారు. అన్యాయంగా ఇరుక్కుని జైల్లో మగ్గుతున్న తన భర్తను ఎలాగైనా విడిపించాలని సర్ఫరాజ్ భార్య అఫ్రిన్ బేగం మంత్రి కేటీఆర్‌ను వేడుకుంటోంది. ఒక్క సర్ఫరాజ్ మాత్రమేకాదు.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఒకరు, కోరుట్లలో ఒకరు, కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరొకరు బంగారం స్మగ్లింగ్ ముఠా కారణంగా నేపాల్ జైల్లో మగ్గుతున్నారు. ఈ ముఠాలు వేల రూపాయలు ఎరగా వేస్తూ వీరిని ఉచ్చులోకి దించుతున్నాయి. కొందరు ఎయిర్‌పోర్టులో అధికారుల కళ్లుగప్పి బయట పడుతుండగా, మరికొందరు కస్టమ్స్‌కు చిక్కి జైలుపాలవుతున్నారు. కోరుట్ల: చిన్నాచితకా పనులు చేసుకుంటూ డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద యువకులను బంగారం స్మగ్లింగ్ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. నాందేడ్‌కు చెందిన కొందరు ముంబై, దుబాయ్ గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు ఏర్పరచుకుని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన యువతకు డబ్బు ఎరవేసి బంగారం స్మగ్లింగ్ కోసం వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. కొందరికి నేరుగా బంగారం తీసుకురావాలని చెబుతుండగా, మరికొందరికి ఓ పార్సిల్ తీసుకురావాలని నమ్మబలుకుతున్నారు. కాసుల ఆశకు దుబాయ్ వెళ్తున్న యువకులు.. దుబాయ్, హైదరాబాద్, నేపాల్ ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దొరికిపోయి జైల్లో మగ్గుతున్నారు. తాము దుబాయ్ పంపిన వారిలో ఎవరైనా కస్టమ్స్ తనిఖీల్లో దొరికిపోతే.. ఆ ముఠా సభ్యులు వెంటనే తమ మకాం వేరే చోటికి మార్చుతున్నారు. కిలోకు రూ.5 లక్షలు తేడా.. మనదేశంలో బంగారం ధరలతో పోల్చితే.. దుబాయ్‌లో తులానికి రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు తక్కువగా ఉంటుంది. ఈ లెక్కన కిలో బంగారం ఇండియాకు చేరవేస్తే రూ.5 లక్షల వరకు గిట్టుబాటు అవుతుంది. ఈ సంపాదనకు ఆశపడ్డ స్మగ్లర్లు అమాయకులకు కాసులు ఎరవేస్తున్నారు. ఈ ముఠాలపై నిఘాపెట్టి అమాయకులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
గుట్టుగా గుట్కా స్మగ్లింగ్
-
అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న దొంగల ముఠా అరెస్ట్
-
వెంట్రుకలపై క్రేజ్: చైనాకు జుట్టు అక్రమ రవాణా
సాక్షి, హైదరాబాద్: నలుపు మినహా ఇతర రకాలైన రంగుల వినియోగం తక్కువ కావడంతో పాటు సిల్కీగా ఉండే దక్షిణాది వారి తల వెంట్రుకలతో తయారయ్యే విగ్గులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న కొన్ని ముఠాలు తల వెంట్రుకల్ని మయన్మార్ మీదుగా చైనాకు అక్రమ రవాణా చేస్తున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అస్సోం రైఫిల్స్ సహకారంతో నిఘా ముమ్మరం చేశారు. ఆ మినహాయింపును అనువుగా మార్చుకుని... లూజ్ హెయిర్ సేకరణకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. దీనిని తమకు అనువుగా మార్చుకుంటున్న స్మగ్లర్లు ఏరియాల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా నడుపుతున్న ఎనిమిది మంది ఏజెంట్లు దక్షిణాదిలోని అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లోని సెలూన్ల నుంచి వెంట్రుకలు సేకరిస్తారు. వీటిని పాత వస్త్రాల పేరుతో ప్యాక్ చేసి బస్సుల్లో హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు. ఎల్బీనగర్ ప్రాంతానికి చేరుకుంటున్న ఈ పార్శిల్స్‌ను ఏజెంట్లు తీసుకుని తమ స్థావరాలకు తరలిస్తున్నారు. ఆడవారి వెంట్రుకలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ మాఫియా పలు దేవాలయాల్లోని క్షురకులతో ఒప్పందాలు చేసుకుని అక్కడి నుంచి మహిళల వెంట్రుకల తస్కరణ, అక్రమ రవాణాను ప్రోత్సహిస్తోంది. ఎయిర్ కార్గో ద్వారా మయన్మార్‌కు... ఈ వెంట్రుకలు చేరాల్సింది చైనాకే అయినప్పటికీ నేరుగా వెళ్లడం లేదు. విదేశాలకు ఎయిర్ కార్గో ద్వారా పంపిస్తే డీఆర్ఐ, కస్టమ్స్ సహా వివిధ ఏజెన్సీల కన్ను పడే అవకాశం ఉండటంతో వీటిని వేర్వేరు పేర్లతో రైళ్లు, బస్సులు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల ద్వారా కోల్‌కతాకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తమ వాహనాల్లోనే మయన్మార్‌కు తీసుకెళ్తున్నారు. . డీఆర్ఐకి లేఖ.. అధికారికంగా తల వెంట్రుకలు ఖరీదు చేయడానికి, వీటిని ప్రాసెస్ చేసి విదేశాలకు పంపడానికి ‘హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రొడక్టŠస్ మ్యాన్‌ఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఓ సంస్థ పని చేస్తోంది. వీరు వేలం పాటల ద్వారా వివిధ ప్రార్థన స్థలాల నుంచి తల వెంట్రుకల్ని ఖరీదు చేసి ప్రాసెసింగ్ అనంతరం నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. వీరు చైనాకు తల వెంట్రుకల్ని పంపినప్పుడు 26 శాతం ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించాల్సి వస్తోంది. స్మగ్లర్ల ద్వారా అడ్డదారిలో చేరుతున్న తల వెంట్రుకలకు ఇలాంటి పన్నులు లేకపోవడంతో తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఫలితంగా వీరి వ్యాపారం తీవ్రంగా దెబ్బతినడంతో పాటు దేశానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ఇదే అంశాన్ని వివరిస్తూ అసోసియేషన్ కొన్నాళ్ల క్రితం డీఆర్ఐకి లేఖ రాసింది. చెల్లింపులన్నీ అక్రమ మార్గంలోనే... చైనాలోని తల వెంట్రుకల్ని ఖరీదు చేసే సంస్థలు నగరంలో ఉన్న తమ ఏజెంట్లకు డబ్బును అక్రమ మార్గంలోనే పంపిస్తున్నాయి. ప్రధానంగా వీరు హవాలా, బిట్‌కాయిన్స్ మార్గాలను అశ్రయిస్తున్నారు. గత ఏడాది వెలుగులోకి వచ్చిన కలర్ ప్రిడెక్షన్ కేసు దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆన్లైన్ గేమింగ్‌ను నిర్వహించిన చైనా సంస్థలు దీని ద్వారా యువత నుంచి దోచుకున్న డబ్బును డాకీ పే అనే పేమెంట్ గేట్ వేకు పంపారు. అక్కడ నుంచి ఈ డబ్బులో రూ.20 కోట్లు ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు జుట్టు వ్యాపారులకు చేరింది. ఈ విషయాన్ని గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని ప్రశ్నించగా... తాము జుట్టును చైనాకు పంపిస్తామని, అందుకు సంబంధించిన నగదు డాకీ పే ద్వారా తమకు చేరిందని చెప్పుకొచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో డీఆర్ఐ, కస్టమ్స్‌తో పాటు సహరిద్దుల్లో పహారా కాసే బలగాలు తల వెంట్రుకల స్మగ్లింగ్‌పై డేగకన్ను వేశాయి. ఫలితంగా మిజోరాం–మయన్మార్ బోర్డర్లో గతేడాది 190 మంది స్మగ్లర్లు చిక్కగా... ఈ ఏడాది ఇప్పటికే 53 మంది పట్టుబడ్డారు. వీరిలో అత్యధికులకు హైదరాబాద్‌లోని డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. చదవండి: బావతో కలిసి భర్తను హత్య చేసిన భార్య -
అప్పు చేసి.. అక్రమ మద్యం తెచ్చి!
అనంతపురం క్రైం: అక్రమ మద్యం ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్న ముగ్గురు స్నేహితులు కటకటాలపాలయ్యారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొస్తున్న వీరిని అనంతపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 152 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడుకు చెందిన గణపతి సుధాకర్, పెదపప్పూరు మండలం సింగనగుట్టపల్లికి చెందిన పుష్పాక త్యాగరాజు, శింగనమల మండలం ఉల్లికల్లుకు చెందిన తలారి కల్యాణ్ కుమార్ అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. ఈ క్రమంలో ముగ్గురూ స్నేహితులయ్యారు. డిగ్రీ పూర్తయ్యాక వివిధ పనులు చేశారు. కానీ డబ్బు అరకొరగానే వస్తుండటంతో.. అసంతృప్తికి గురైన వీరు సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఇందుకు అక్రమ మద్యం విక్రయాలను ఎంచుకున్నారు. అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో ప్రైవేటు ఫైనాన్స్‌లో లోన్ తీసుకున్నారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చి విక్రయించేందుకు అనంతపురం తపోవనంలో ఓ గదిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రెండు కార్లలో తెలంగాణకు వెళ్లి 152 బాటిళ్ల మద్యం కొనుగోలు చేశారు. బోర్డర్లన్నీ దాటించి గురువారం ఉదయం అనంతపురం చేరుకున్నారు. అయితే వీరిపై అప్పటికే కన్నేసిన అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది.. తపోవనంలో ఈ రెండు కార్లను తనిఖీ చేసి 152 మాన్షన్‌హౌస్ ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కార్లలో ప్రయాణిస్తున్న స్నేహితులు ముగ్గుర్నీ అరెస్టు చేశారు. చదవండి: అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని.. ముంచంగిపుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్ -
హైదరాబాద్: కారులో కిలోల కొద్ది బంగారం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. చౌటప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు 12 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని చెన్నైలో డెలివరీ చేయాలని కోల్‌కతా గోల్డ్ మాఫియా ముఠాకు అప్పగించినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీంతో ముందస్తు సమచారం మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారు బానెట్ భాగంలో కింది భాగంలో బంగారం అమర్చి తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. చదవండి : బంజారాహిల్స్‌లో పని మనిషి అరెస్టు ప్రియురాలికి వేధింపులు.. ప్రియుడి అనుమానాస్పద మృతి -
సీఎం విజయన్‌కు తలబొప్పి
కొచ్చి: ఎన్నికల నేపథ్యంలో, బంగారం అక్రమ రవాణా కేసు తాజా పరిణామాలు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఇది పెద్ద తలనొప్పిలా తయారైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, అసెంబ్లీ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్, మరో ముగ్గురు మంత్రులను గురించి ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించినట్టు కస్టమ్స్ చీఫ్ కేరళ హైకోర్టుకి సమర్పించిన రిపోర్టులో తెలిపారు. ముఖ్యమంత్రి, స్పీకర్ సహా మరో ముగ్గురు మంత్రులు అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు స్వప్నా సురేశ్ దర్యాప్తులో వెల్లడించిన విషయం రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు కీలక ప్రచార అస్త్రంగా మారనుంది. అయితే అధికార సీపీఎం మాత్రం రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఎత్తుగడగా ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, స్పీకర్ శ్రీరామకృష్ణన్‌లు యుఏఈ కాన్సుల్ జనరల్ సహాయంతో అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు కీలక నిందితురాలు స్వప్న సురేశ్ స్పష్టం చేశారని, కస్టమ్స్ కమిషనర్ సుమిత్ కుమార్, కేరళ హైకోర్టుకి సమర్పించిన ఒక రిపోర్టులో తెలిపారు. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ మాజీ ఫైనాన్స్ చీఫ్, ఒమన్‌లోని మస్కట్‌కు 1,90,000 అమెరికన్ డాలర్లను(1.30 కోట్ల రూపాయలను) అక్రమ రవాణా చేసినట్లు డాలర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులో సహ నిందితులుగా ఉన్న స్వప్నా సురేశ్, సరిత్ పిఎస్‌లను, డాలర్ కేసుతో సంబంధం ఉన్నదన్న కారణంగా కస్టమ్స్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. విజయన్‌కి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కులేదని, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చెన్నితాల అన్నారు. ఏప్రిల్ 6న జరిగే ఎన్నికల్లో కేరళలో తిరిగి లెఫ్ట్ ప్రభుత్వం వస్తుందని రూఢీ కావడంతోనే బీజేపీ ఆందోళనలో పడిందని సీపీఎం ఆరోపించింది. సీఎం విజయన్, ప్రధాన కార్యదర్శి, ఆయన వ్యక్తిగత సిబ్బందితో తనకు సన్నిహిత సంబంధాలున్నట్టు స్వప్న సురేశ్ పేర్కొన్నట్టు కస్టమ్స్ అధికారి తెలిపారు. ముఖ్యమంత్రి, స్పీకర్ ఆదేశాల మేరకు విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేసిన విషయం తనకు తెలుసునని స్వప్న అంగీకరించినట్లు కస్టమ్స్ కమిషనర్ వెల్లడించారు. ‘‘కాన్సులేట్ సాయంతో, ముఖ్యమంత్రి, స్పీకర్లు, విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేసిన విషయం తెలుసునని ఆమె స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు, స్పీకర్ల అసంబద్ధమైన, అక్రమ కార్యకలాపాలను గురించి ఆమె బహిరంగపరిచారు’’అని కస్టమ్స్ అధికారులు హై కోర్టుకి సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు. గత ఏడాది జూలై 5న తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తోన్న పార్శిల్స్‌లో 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ స్మగ్లింగ్ రాకెట్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత కేసుతో సంబంధం ఉన్న స్వప్నా సురేశ్ సహా 15 మందిని అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
ఏపీలో తెలంగాణ మద్యానికి 'చెక్'..!
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరలను సవరించింది. అంతకు ముందు మూడు బాటిళ్ల రవాణాపైనా నిషేధం విధించి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లకు అనుమతి లేకుండా చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో ఇతర రాష్ట్రాల నుంచి భారీగా స్మగ్లింగ్ జరిగింది. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదయ్యాయి. మరోవైపు పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాలూ పెద్దఎత్తున పెరగడం గమనార్హం. ఇందుకు కారణం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం స్మగ్లింగ్ జరగడమే. మద్యం ధరలు ఇతర రాష్ట్రాల్లో తక్కువగా ఉండటంతో అక్కడ్నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో పోలిస్తే రూ.426 కోట్లు పెరిగిన అమ్మకాలు ► గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు తెలంగాణలో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో రూ.426 కోట్లు పెరిగాయి. ► అదే మద్యం వినియోగాన్ని ఏపీతో పోలిస్తే భారీ వ్యత్యాసం కనపడుతోంది. తెలంగాణలో ఈ ఐదు నెలల వ్యవధిలో మద్యం వినియోగం 142.72 లక్షల కేసులు కాగా, ఏపీలో 49 లక్షల కేసులు మాత్రమే. ► తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో (ఏప్రిల్–ఆగస్ట్)తో ఈ ఏడాది పోల్చి చూస్తే ఆదాయంలో 2.93%, అమ్మకాల విలువలో 4.66% వృద్ధి నమోదైంది. ఏపీలో భారీగా 65% వినియోగం తగ్గింది. ► మద్యం కేసుల వినియోగం కర్ణాటకలో 198.88 లక్షలు కాగా, తమిళనాడులో 172.64 లక్షల కేసులు. ► ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నెల రోజుల వ్యవధిలో అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ నుంచే 630 కేసులు కాగా, కర్ణాటక– 546, ఒడిశా– 24, తమిళనాడు– 11 కేసులు నమోదయ్యాయి. ఐదు నెలల్లో రూ.2,170 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన ఏపీ 1 గతేడాది ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో మద్యం ద్వారా ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.7,638.24 కోట్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో రూ.5,468.17 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గతేడాది కంటే రూ.2,170.07 కోట్ల ఆదాయం కోల్పోయింది. అంటే 28.411% ఆదాయం తగ్గింది. 2 మద్యం, బీరు అమ్మకాల విలువను పరిశీలిస్తే ఈ ఐదు నెలల వ్యవధిలో గతేడాది రూ.8,884.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.5,998.87 కోట్లు. అమ్మకాల విలువ గతం కంటే రూ.2,885.82 కోట్లు తక్కువగా నమోదైంది. -
మద్యం ధరల సవరణ
సాక్షి, అమరావతి: అక్రమ మద్యం, పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్‌ను అరికట్టే లక్ష్యంతో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది. పేద ప్రజలు వినియోగించే మద్యం ధరలను తగ్గిస్తూ గత నెలలోనే ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదాయం కాదు.. ఆరోగ్యమే ముఖ్యం మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులను రద్దు చేసింది. పర్మిట్ రూంలను తొలగించింది. ఆదాయాన్ని పట్టించుకోకుండా రిటైల్ అవుట్లెట్లను 4,380 నుంచి 2,934కి కుదించింది. మద్యం లభ్యతను తగ్గించేందుకే 33 శాతం షాపులను తగ్గించింది. బార్లను 40 శాతం తగ్గించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. మద్యం/మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించేందుకు మద్య నిషేధ ప్రచార కమిటీని నియమించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘పొరుగు’ నుంచి స్మగ్లింగ్.. రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గతేడాది అక్టోబరు 1 నుంచి ధరలు క్రమంగా పెంచుకుంటూ వెళ్లింది. కోవిడ్ సమయంలో మద్యం వినియోగాన్ని నియంత్రించేందుకు ధరలు 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మద్యం వినియోగం రాష్ట్రంలో భారీగా తగ్గింది. అయితే మద్యానికి అలవాటైన కొందరు మిథైల్ ఆల్కహాల్, శానిటైజర్లను ఆశ్రయించారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక నుంచి ఏపీలోకి పెద్ద ఎత్తున మద్యం స్మగ్లింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీటిపై సమీక్షించిన ప్రభుత్వం.. శానిటైజర్లు తాగి పేదలు ప్రాణాలు కోల్పోతుండటం, స్మగ్లింగ్‌ను నిరోధించే దిశగా చీప్ లిక్కర్, బీరు, రెడీ టు డ్రింక్ కేటగిరీల ధరలు తగ్గిస్తూ గత నెల 3న నిర్ణయం తీసుకుంది. ఎస్ఈబీ నివేదికతో ధరల సవరణ.. ఈ ఏడాది మే నుంచి ఏపీలోకి అక్రమ మద్యం ప్రవాహం పెరిగింది. దీని ప్రభావంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనికి ప్రధాన కారణం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉండటమేనని ఎస్ఈబీ నివేదించింది. ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 వరకు నెల రోజుల వ్యవధిలో అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదు కావడం గమనార్హం. తెలంగాణ నుంచి 630, కర్నాటక నుంచి 546 , ఒడిషా నుంచి 24, తమిళనాడు నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా 11 కేసులు నమోదయ్యాయి. గత నెలలో ఏపీలో చీప్ లిక్కర్ ధరలు తగ్గించిన తర్వాత రాష్ట్ర సరిహద్దు మండలాల్లో చౌక మద్యం అక్రమ రవాణా గణనీయంగా తగ్గిందని ఎస్ఈబీ పేర్కొంది. ఇదే సమయంలో ప్రీమియం, మీడియం బ్రాండ్ల స్మగ్లింగ్ భారీగా పెరిగింది. ఈ కేటగిరీల బ్రాండ్ల ధరలను హేతుబద్ధీకరిస్తే అక్రమ రవాణాకు తెర పడుతుందని ఎస్ఈబీ నివేదించింది. ఈ నేపథ్యంలో ఈ బ్రాండ్ల ధరలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన ధరల ప్రకారం మీడియం, ప్రీమియం బ్రాండ్లపై రూ.50 నుంచి రూ.1,350 వరకు ధరలు తగ్గాయి. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకే మద్యం ధరల సవరణ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ, కర్నాటకలో మద్యం ధరలు రెండింతలు తక్కువ కావడంతో అక్కడ నుంచి రాష్ట్రంలోకి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రీమియం, మీడియం బ్రాండ్ల ధరలు సవరించామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) నివేదిక ప్రకారం మద్యం ధరలు సవరించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. -
దావూద్ ప్రమేయంపై ఎన్ఐఏ కూపీ
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దావూద్ ఇబ్రహీం ముఠా ప్రమేయం ఉండచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు వివరించింది. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని జాతి వ్యతిరేక, ఉగ్ర కార్యకలాపాలకు వెచ్చిస్తున్నారని నిఘా వర్గాలు సమాచారం అందించాయని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. దౌత్య మార్గాల ద్వారా గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఈ కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వరాదని న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేసింది. నిందితులకు ఉన్నతస్ధాయి దౌత్య వర్గాలతో ఉన్న సంబంధాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎన్ఐ ప్రత్యేక న్యాయస్దానానికి నివేదించింది. నిందితుల్లో ఒకరైన రమీస్ తాను టాంజానియాలో డైమండ్ వ్యాపారం చేస్తానని, ఆ బంగారాన్ని తాను దుబాయ్‌లో విక్రయించానని తెలిపాడని ఎన్ఐఎ వివరించింది. దావూద్ ఇబ్రహీంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ దావూద్ ఇబ్రహీం ఆగడాలపై వెల్లడించిన వివరాలతో పాటు ఆఫ్రికాలో దావూద్ ముఠా కార్యకలాపాలపై అమెరికా ట్రెజరీ విభాగం ప్రచురించిన ఫ్యాక్ట్ షీట్ వివరాలను ఎన్ఐఎ ప్రత్యేక న్యాయస్ధానానికి వివరించింది. చదవండి : లేటు వయసులో దావూద్ ఘాటు ప్రేమ! -
శివశంకర్‌ను లోతుగా విచారించాలి
కొచ్చి: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో సస్పెండైన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ ఎం శివశంకర్‌ను మరింత లోతుగా విచారించాల్సి ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్‌కు ఒక జాతీయ బ్యాంక్‌లో లాకర్ సౌకర్యం లభించేందుకు శివశంకర్ సహకరించాడని పేర్కొంది. స్మగ్లింగ్ ద్వారా పొందిన లాభాలను ఈ లాకర్లోనే స్వప్న సురేశ్ దాచేవారని ఈడీ తెలిపింది. పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో బుధవారం నగదు అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో మధ్యంతర చార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. అందులో స్వప్న సురేశ్, సరిత్ పీఎస్, సందీప్ నాయర్లను ప్రధాన నిందితులుగా చేర్చింది. శివశంకర్‌కు దగ్గర అయినందువల్లనే ప్రభుత్వ స్పేస్‌పార్క్ ప్రాజెక్ట్‌లో తాను సెలెక్ట్ కాగలిగానని స్వప్న సురేశ్ అంగీకరించారని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. తన అపాయింట్మెంట్ విషయం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు తెలుసని కూడా ఆమె ఒప్పుకున్నారంది. అయితే, ఈ విషయాన్ని సీఎం విజయన్ పలుమార్లు ఖండించారు. సీఎం విజయన్ సమక్షంలోనే శివశంకర్‌ను స్వప్న పలుమార్లు కలిశారని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. తన చార్టర్డ్ అకౌంటెంట్ వేణుగోపాల్‌తో కలిపి స్వప్నకు బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయించానని ఆగస్ట్ 12, ఆగస్ట్ 15 తేదీల్లో ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్ ఒప్పుకున్నారని తెలిపింది. స్వప్న సురేశ్ దగ్గరున్న డబ్బుల నిర్వహణకు గానూ చార్టర్డ్ అకౌంటెంట్ వేణుగోపాల్‌ను ఆమెకు శివశంకర్ పరిచయం చేశారని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. అయితే, స్వప్న సురేశ్ వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న విషయం తనకు తెలియదని విచారణ సందర్భంగా శివశంకర్ చెప్పారని ఈడీ పేర్కొంది. బంగారం స్మగ్లింగ్‌లో స్వప్న సురేశ్ స్వయంగా పాల్గొనేవారని, తద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు శివశంకర్‌ను లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది. ‘2019 ఆగస్ట్‌లో యూఏఈ కాన్సులేట్‌లో ఉద్యోగాన్ని స్వప్న సురేశ్ వదిలేశారు. ఆ తరువాత తనకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా సీఎం విజయన్ వద్ద ప్రిన్స్‌పల్ సెక్రటరీగా ఉన్న శివశంకర్‌ను కోరారు. దాంతో, కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన స్పేస్ పార్క్ ప్రాజెక్ట్‌లో శివశంకర్ ఆమెకు ఉద్యోగం ఇప్పించారు’ అని ఈడీ తెలిపింది. -
అక్రమార్కులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అందుకోసం ఏర్పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) దూకుడు మీద ఉంది. క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం... ప్రత్యేక చెక్‌పోస్టుతో నిఘా... ఆకస్మిక తనిఖీలతో ఎడాపెడా దాడులు చేస్తూ అక్రమ రవాణాదారుల ఆటకట్టిస్తోంది. ఇసుక, మద్యం అక్రమ రవాణాదారులపై గత మూడు నెలల్లోనే రికార్డుస్థాయిలో కేసులు నమోదు చేసి... అరెస్టులు చేసింది. విస్తృతంగా ఎస్ఈబీ దాడులు ఈ ఏడాది మే 16 నుంచి సెప్టెంబరు 7 వరకూ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించింది. రికార్డుస్థాయిలో కేసులు నమోదు, అరెస్టులతో ఇసుక, మద్యం అక్రమరవాణాదారులను గడగడలాడించింది. ► ఎస్ఈబీ ఇసుక అక్రమరవాణాపై దాడులు నిర్వహించి 3,570 కేసులు నమోదు చేసి 6,863 మందిని అరెస్టు చేసింది. 4,765 వాహనాలను, 4,28,127.71టన్నుల ఇసుకను జప్తు చేసింది. ► సారా తయారీ, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్ఈబీ విస్తృతంగా దాడులు నిర్వహించింది. మూడు నెలల్లో 36,895 కేసులు నమోదు చేసింది. 47,695 మందిని అరెస్టు చేసి13,675 వాహనాలను జప్తు చేసింది. 265.22 లీటర్ల అక్రమంగా రవాణా చేస్తున్న 265.22లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. 202.86 లీటర్ల సారాను జప్తు చేయడమే కాకుండా 4,303 లీటర్ల కాపు సారాను ధ్వంసం చేసింది. పటిష్ట నిఘా... ప్రత్యేక బృందాలు ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్ఈబీ వ్యవస్థాగతంగా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయిలో ఐదు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉండనే ఉన్నాయి. ఇక అనంతపురం జిల్లాల్లో ఎస్పీ స్పెషల్ ఆపరేషన్ బృందాలను ఏర్పాటు చేశారు కూడా. ► రాష్ట్రవ్యాప్తంగా 289 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అక్రమ రవాణాపై పూర్తి సమాచారం వచ్చేలా నిఘా వ్యవస్థను పటిష్టపరిచారు. ► ఇంటెలిజెన్స్‌వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ► జిల్లా స్థాయిలో నోడల అధికారి ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ► రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఏపీఎండీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమన్వయం సాంకేతిక అంశాలపరంగా కూడా సమగ్రంగా కేసు నమోదు చేస్తున్నారు. పటిష్ట చర్యలు చేపడుతున్నాం ఇసుక, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. సీబీఐ తరహాలో మూడు నెలలోకోసారి సమీక్షించుకుంటూ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. – వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ కమిషనర్ -
చీఫ్ మినిస్టర్ ఈజ్ విత్ యూ
సాక్షి, అమరావతి: ఇసుక, మద్యం అక్రమాలతో పాటు అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా ఉపేక్షించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇసుక, మద్యం అక్రమాలపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. మద్యం, ఇసుకపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్న సీఎం, వాటిపై జిల్లా ఎస్పీలు, ఎస్ఈబీ సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని ప్రశంసించారు. మద్యం ధరలను తగ్గించడం వల్ల స్మగ్లింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ► ఎవరైనా మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలి. వాటిపై రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు రావు. ► క్రితంసారి కొన్ని విషయాలు ప్రస్తావించాను. కొన్ని సున్నిత అంశాల మీద, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కేసులకు సంబంధించి, పోలీసులు అనుసరించిన విధానం, వ్యవహరించిన తీరు బాగుందని పత్రికల్లో చదివాను. ► వాటికి సంబంధించి సీఐ, ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు స్పష్టమైన మెసేజ్ వెళ్లాలి. లేదంటే మంచి ఫలితాలు రావు. ఆ దిశలో సిబ్బందిని బాగా సెన్సిటైజ్ చేశారు. ఎస్పీలకు అభినందనలు. -
పాక్ చెరలో 19మంది భారతీయులు
లాహోర్: అక్రమంగా సరిహద్దును దాటారన్న ఆరోపణలపై రెండు నెలల క్రితం 19మంది భారతీయులను, ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టేదాకా వీరు జైల్లోనే ఉంటారని తెలిపారు. అక్రమ ప్రవేశం, గూఢచర్యం నేరాలపై 19మంది భారతీయులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచామని చెప్పారు. ఇటీవలే వీరిని ఫెడరల్ రివ్యూబోర్డు ముందు ప్రవేశపెట్టామని, నవంబర్ 9వరకు వీరిని రిమాండ్‌లో ఉంచాలని బోర్డులోని న్యాయమూర్తులు ఆదేశించారని వివరించారు. ఈలోపు జరిపే విచారణ ఆధారంగా నవంబర్ 9న బోర్డు వీరిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. వీరితో పాటు ఒక శ్రీలంక దేశస్తుడిని కూడా అరెస్టు చేశారు. సరైన ఆధారాల్లేవంటూ బోర్డు ఆదేశాల మేరకు విడుదల చేశారు. -
పంగోలిన్ చర్మాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్ : పంగోలిన్ చర్మానికి (అలుగు పొలుసులు) జాతీయ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లలో డిమాండ్ ఉండటంతో వాటిని అక్రమంగా సేకరించి అమ్మకానికి పెట్టిన అంతర్రాష్ట్ర ముఠా కుట్రను తెలంగాణ అటవీ శాఖ ఛేదించింది. సుమారు వారం రోజులపాటు అండర్ కవర్ ఆపరేషన్ చేసిన అటవీ శాఖ అధికారులు, తామే కొనుగోలుదారుల అవతారమెత్తి మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సహా కొత్తగూడెం, భద్రాచలం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లలో అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులకు కొద్ది మొత్తం ఆశ చూపి, ఈ ముఠా అలుగు చర్మాలను సేకరిస్తోంది. ముందుగా సమాచారం అందుకున్న కొత్తగూడెం అటవీ అధికారులు బాదావత్ రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో మూడు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో నిఘాపెట్టి సునీల్, నాగరాజులతో పాటు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని అటవీ, వన్యప్రాణుల సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. ఈ ముఠాలో ఇంకా ముగ్గురు ఉన్నారని, వారు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు. అంతరాష్ట్ర ముఠాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, బెంగాల్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పంగోలిన్ స్కేల్స్ (అలుగు పొలుసుల) వల్ల వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీంతో వాటి పొలుసులకు బ్లాక్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పొలుసులకు లక్షల్లో ధర పలుకుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ముఠా నుంచి సుమారు నాలుగు కేజీల పొలుసులను అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం మూడు నుంచి ఐదు జంతువులను దమ్మపేట అటవీ ప్రాంతంలో (కొత్తగూడెం) చంపిఉంటారని అధికారులు భావిస్తున్నారు. కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు నిందితులను ప్రవేశపెట్టి, రిమాండ్‌కు తరలించారు. విచారణ కొనసాగుతోందని కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి రంజీత్ నాయక్ తెలిపారు. కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ ఎఫ్డీఓ దామోదర్‌రెడ్డి, హైదరాబాద్ విజిలెన్స్ డీఎఫ్ఓ రాజారమణారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అధికారులు, సిబ్బందిని పీసీసీఎఫ్ ఆర్.శోభ ప్రత్యేకంగా ప్రశంసించారు. -
ఎయిర్‌పోర్టులో గంధపు చెక్కల కలకలం..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గంధపు చెక్కల అక్రమ రవాణా కలకలం సృష్టించింది. అక్రమంగా తరలిస్తున్న 114 కిలోల గంధపు చెక్కలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ నుంచి ఖర్టూమ్‌కు అక్రమంగా తరలించేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. సూడాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన ఎయిర్పోర్ట్ అధికారులు.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
జర్నలిస్ట్ అరెస్ట్.. వారి పేర్లు బయటపడతాయనేనా?
గువహటి : అర్థరాత్రి ఓ జర్నలిస్టు ఇంటిపై దాడి, తదనంతరం ఆయన తండ్రి గుండెపోటుతో మరణించడం అస్సాం వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. వివరాల ప్రకారం.. ధూబ్రీ నగర ప్రెస్ క్లబ్ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ ఓ చానల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పశువుల స్మగ్లింగ్ కుంభకోణంపై వరుస కథనాలు రాశారు. దీని వెనుక బడా రాజకీయ నేతల హస్తం ఉందని పలు కథనాలు తెరమీదకి వచ్చాయి. సీన్ కట్ చేస్తే.. ఓ కేసులో జర్నలిస్టు రాజీవ్ శర్మను నిందితుడిగా చేరుస్తూ అతడి ఇంటిపై పోలీసులు దాడి చేసి శర్మను అరెస్టు చేశారు. దీంతో ఆయన తండ్రి తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో కన్నుమూశారు. అదే రోజున రాజీవ్ శర్మకు మధ్యంతర బెయిల్ లభించడంతో స్థానికంగా కొంతమంది జర్నలిస్టులు, బంధువుల సమక్షంలో తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. (పాక్ దుశ్చర్య, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి) ఉద్దేశపూర్వకంగానే జర్నలిస్టు రాజీవ్ శర్మను అరెస్ట్ చేసి అతని తండ్రి చావుకు కారణమయ్యారని గువాహటి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ నాథ్ ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలంటూ ప్రెస్ క్లబ్ కార్యదర్శి సంజయ్‌రే ఒక ప్రకటనలో కోరారు. ఈ కేసు విషయంపై పలు ఆరోపణలు, విమర్శలు వస్తుండటంతో ధూబ్రీ పోలీసు చీఫ్ ను బదిలీ చేశారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి తన ప్రమేయం ఉందన్న వార్తలను ధుబ్రీ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్ఓ) బిస్వాజిత్ రాయ్ ఖండించారు. రాజీవ్ శర్మ తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని, తనను రూ. 8 లక్షలు కూడా డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసును క్రైం డిపార్టుమెంటుకు బదిలీ చేశారు. (రోడ్డుపై తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం) -
‘మద్యం, ఇసుకలో అడ్డగోలుగా అవినీతి’
సాక్షి, విశాఖపట్నం: చట్టం ముందు అందరూ సమానమేనని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, మద్యం విషయంలో అడ్డగోలుగా అవినీతి చేశారని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్షత ఉండదన్నారు. భీమిలిలోని జరిగిన భూ కంభకోణాన్ని ఆధారాలతో సహా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇచ్చామన్నారు. ఆయన దీనిపై ‘సిట్’ విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని, గో సంరక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: సాక్షి ఎఫెక్ట్: డొంక కదులుతుంది!) -
కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ ప్రకంపనలు
-
పట్టుచీరల ముసుగులో మద్యం రవాణా
ధర్మవరం అర్బన్: పార్శిల్ సర్వీస్ ముసుగులో గుట్టుచప్పడు కాకుండా అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠా గుట్టును సెబ్ పోలీసులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెబ్ ఎఎస్పీ రామ్మోహన్రావు వెల్లడించారు. హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి పట్టుచీరలు, చీరల పార్శిల్ బాక్స్‌లతో ఎస్‌బీఆర్‌ఎస్ కార్గో సర్వీస్‌కు చెందిన కేఏ07ఏ 2083 ఐచర్ వాహనం మంగళవారం రాత్రి బయలుదేరింది. 44వ జాతీయ రహదారి మీదుగా నేరుగా ధర్మవరానికి వస్తున్న ఆ వాహనాన్ని పలు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది ఆపి పరిశీలించారు. కార్గో పార్శిల్ సర్వీస్ వే బిల్లులు చూపుతూ.. పట్టుచీరలు, చీరలు తరలిస్తున్నట్లుగా అందులోని వ్యక్తులు చెబుతూ లైన్ క్లియరెన్స్ తీసుకుంటూ వచ్చారు. దీంతో ఎలాంటి అనుమానాలు ఆ వాహనాన్ని చెక్‌పోస్టుల వద్ద వదిలిపెడుతూ వచ్చారు. ముందస్తు సమాచారంతో.. హైదరాబాద్ నుంచి భారీగా మద్యం బాటిళ్లను అక్రమంగా ధర్మవరానికి తరలిస్తున్నట్లుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ఏఎస్పీ రామ్మోహన్‌రావుకు సమాచారం అందింది. దీంతో సిబ్బందిని అప్రమత్తం చేసిన ఆయన... బుధవారం తెల్లవారుజామున ధర్మవరం సమీపంలోని వేల్పుమడుగు వద్ద కాపు కాశారు. వేగంగా దూసుకువస్తున్న ఐచర్ వాహనాన్ని గుర్తించి సెబ్ సీఐలు జయనాథరెడ్డి, నరసానాయుడు, భీమలింగ, ఎస్ఐలు చాంద్‌బాషా సాదిక్ వలీ అడ్డుకున్నారు. ఆ సమయంలో వాహనంలో ఉన్నవారు పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. ‘ఇది ఎస్‌బీఆర్‌ఎస్ పార్శిల్ వాహనమని, ఇందులో పట్టుచీరలు, చీరలు తప్ప మరేమీ లేవంటూ నమ్మబలికారు. అయితే తమకున్న పక్కా సమాచారం మేరకు వాహనాన్ని తనిఖీ చేసి తీరాల్సిందేనంటూ పోలీస్ అధికారులు పట్టుబట్టారు. నిందితులు వీరే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలో భాగంగా దశల వారీగా మద్యనిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం అమ్మకాలపై పలు రకాలుగా నిషేధం విధిస్తూ వచ్చింది. దీనికి తోడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో బహిరంగంగా మద్యం ఎక్కడా లభ్యం కావడం లేదు. దీనిని సొమ్ము చేసుకోవాలని భావించిన పలువురు అక్రమ మార్గాల ద్వారా అధిక ధరలకు మద్యం విక్రయించి తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని భావించారు. ఇందులో భాగంగానే ధర్మవరం పట్టణానికి చెందిన చీరల వ్యాపారి కోనారెడ్డితోపాటు మరో ఆరుగురు సిండికేట్‌గా ఏర్పడి, హైదరాబాద్‌లో భారీగా మద్యం కొనుగోలు చేసి కార్గో పార్శిల్ సర్వీసు ద్వారా రాచమార్గంలో ధర్మవరానికి చేరుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సెబ్ ఎఎస్పీ రామోహ్మన్‌రావు పథకం ప్రకారం ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో కోనారెడ్డితో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు పట్టుబడ్డారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నట్లు సెబ్ ఏఎస్పీ పేర్కొన్నారు. మద్యం బాటిళ్లు, టోబాకో టిన్లతో పాటు ఐచర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. కాగా, మద్యం అక్రమ రవాణా గుట్టును రట్టు చేసిన సీఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్, కానిస్టేబుళ్లు రమేష్‌రెడ్డి, మారుతీప్రసాద్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. రూ. లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు.. పోలీస్ అధికారుల ఒత్తిడికి వాహనం తలుపులు తీసి పట్లు చీరల బాక్స్‌లు చూపించారు. అయితే ఆ బాక్స్‌లు తెరవాలని పోలీసు అధికారులు ఆదేశించడంతో రాజీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయినా పోలీస్ అధికారులు వినలేదు. చివరకు పోలీస్ అధికారులే బాక్స్‌లను తెరవాల్సి వచ్చింది. బాక్స్‌లు తెరిచిన తర్వాత పోలీసులే అవాక్కయ్యారు. అదులో ఏకంగా రూ.1.61 లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లు, పొగాకు డబ్బాలు బయటపడ్డాయి. -
మద్యం అక్రమంగా తరలిస్తే నాన్ బెయిలబుల్ కేసులు
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేసింది. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు. వివరాలిలా ఉన్నాయి.. ► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరోకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ► పోలీస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమలు చేస్తూనే ఎక్సైజ్ చట్టంలో పలు సవరణలు చేశారు. ► తాజాగా సవరించిన ఎక్సైజ్ చట్టం 34 (ఏ) ప్రకారం ఒకే వ్యక్తి పలుమార్లు ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ► సాధారణ కేసుల విషయంలోనూ రెండేళ్లకు తగ్గకుండా శిక్షలు పడే విధంగా చట్టాన్ని పటిష్టం చేశారు. ► ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్థానంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ► ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా, ఏపీలో సారా రూపంలో కల్తీ మద్యం తయారు కాకుండా నిరోధించేందుకు ఎస్ఈబీ స్వతంత్ర వ్యవస్థగా పనిచేస్తుంది. మద్య నియంత్రణకు వేగంగా అడుగులు దశల వారీ మద్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేశారు. ఇప్పుడు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్ఈబీకి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం హర్షణీయం. – వి.లక్ష్మణరెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ -
‘హద్దు’ దాటి.. అక్రమ రవాణా
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: యానాంలోని బంకులకు గోకవరం గుమ్మళ్లదొడ్డిలోని స్టోరేజీ ట్యాంకుల నుంచి ట్యాంకర్ల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతోంది. ఒక్కో బంకు ప్రతి నెలా 2 లక్షల లీటర్ల డీజిల్, లక్ష లీటర్ల పెట్రోలు దిగుమతి చేసుకుంటున్నాయి. దీని ప్రకారం అక్కడున్న మొత్తం 11 బంకుల ద్వారా ప్రతి నెలా సుమారు 22 లక్షల లీటర్ల డీజిల్, 11 లక్షల లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రపాలిత ప్రాంతాల్లో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తక్కువగా ఉంటుంది. దీంతో పొరుగునే ఉన్న మన రాష్ట్రంతో పోలిస్తే యానాంలో పెట్రో ధరలు తక్కువ. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ వ్యాపారులు అక్కడి పెట్రోల్ బంకుల నుంచి పెట్రోలు, డీజిల్‌ను అక్రమ మార్గాల్లో మన జిల్లాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కిళ్లీ కొట్లు, రోడ్డు మార్జిన్లలో.. ఇటీవలి వరకూ యానాంలో పెట్రోలు, డీజి ల్ ధరలు మన జిల్లా కంటే లీటరుకు ఏడెనిమిది రూపాయలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం యానాంలో లీటర్ డీజిల్ రూ.76, పెట్రోలు రూ.80.34గా ఉంది. అదే యానాంకు ఆనుకుని మన జిల్లాలో ఉన్న తాళ్లరేవులో డీజిల్ ధర రూ.78.79, పెట్రోలు రూ.83.63గా ఉంది. కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను దాదాపు ప్రతి రోజూ పెంచుతోంది. ఈ నేపథ్యంలో యానాంలో కూడా పెట్రో ధరలు పెరిగాయి. అయినప్పటికీ మనకంటే రేటు తక్కువగానే ఉండడంతో.. పలువురు వ్యాపారులు అక్క డి బంకుల్లో కొనుగోలు చేసిన పెట్రోలు, డీజిల్‌ను కొంత లాభం వేసుకుని మన జిల్లా లోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ముఖ్యంగా కోనసీమలోని మురమళ్ల, ముమ్మిడివరం, మహిపాల చెరువు, అనాతవరం, క్రాప, భట్నవిల్లి, రామచంద్రపురం, మండపేట, కాకినాడ తదితర ప్రాంతాలకు వీటిని అక్రమంగా తరలించి అమ్ముతున్నారు. సోడా, కిళ్లీ దుకాణాల వద్ద, రోడ్డు మార్జిన్లలోను బహిరంగంగానే అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రతి రోజూ తెల్లవారుజామున అటు కోనసీమ, ఇటు కాకినాడ, మరోపక్క రామచంద్రపురం ప్రాంతాల నుంచి మోటార్ సైకిళ్లపై వచ్చిన రిటైలర్లు పెద్దపెద్ద ప్లాస్టిక్ టిన్నులతో బారులు తీరి యానాంలో దర్శనమిస్తారు. ఒక్కో మోటార్ బైక్‌పై కనీసం 200 లీటర్ల పెట్రోలు తరలిస్తున్నారు. తీరప్రాంతాల్లో ఆక్వా చెరువుల్లో ఉపయోగిస్తున్న ఇంజన్ల కోసం కూడా భారీగా డీజిల్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖాకీలకు కాసులు యానాం నుంచి జిల్లాకు పెట్రో ఉత్పత్తుల అక్రమ రవాణాను కట్టడి చేయడంలో జిల్లా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది పోలీసులు దీనిని కాసులు సంపాదించుకోవడానికి అవకాశంగా కూడా తీసుకుంటున్నారు. చెక్‌పోస్టుల్లో అందిన కాడికి జేబులో వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ అక్రమ రవాణా తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పోలీసులకు కాసులు కురిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్రోలుతో వెళ్తున్న ఒక్కో వాహనదారు వద్ద రూ.200 నుంచి రూ.500 వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. యానాం బైపాస్, నీలపల్లి వంతెన, అరటికాయలంక, బాపనపల్లి సెంటర్, కాపులపాలెం, ఎదుర్లంక, అరటికాయలంక తదితర ప్రాంతాల్లో పోలీసులు ముడుపులు మెక్కి చమురు అక్రమ రవాణాదార్లను వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. 80 శాతం అక్రమంగా తరలింపు! పెట్రోలు బంకుల్లో జరుగుతున్న విక్రయాల ద్వారా ప్రతి నెలా వ్యాట్ రూపంలో యానాంకు రూ.5 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా. వాస్తవానికి యానాం పరి«ధిలోని వినియోగదారులు కొనుగోలు చేసే పెట్రోలు, డీజిల్ 20 శాతం కూడా మించదని చెబుతున్నారు. దీనినిబట్టి ప్రతి నెలా పన్ను రూపంలో వస్తున్న రూ.5 కోట్ల ఆదాయంలో ఆ ప్రాంతం నుంచి వస్తున్నది రూ.కోటి మాత్రమే. దీనిని తీసివేయగా మిగిలిన 80 శాతం అమ్మకాలు అక్రమ వ్యాపారం ద్వారానే జరుగుతున్నట్టు అంచనా. తద్వారా మన జిల్లా ప్రతి నెలా రూ.4 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నట్టు లెక్కలు కడుతున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని యానాం సరి‘హద్దు’ దాటకుండా పెట్రో ఉత్పత్తులకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. తనిఖీలు చేస్తున్నాం యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి పెట్రోలు, డీజిల్‌ను పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న 14 మందిని అరెస్టు చేసి ఐదు కేసులు నమోదు చేశాం. యానాం నుంచి పెట్రోలు, డీజిల్ అక్రమంగా తరలి రాకుండా యానాం చుట్టుపక్కల పకడ్బందీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. గట్టి నిఘా పెట్టి, తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి పెట్రోలు, డీజిల్ తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – కరణం కుమార్, జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) -
వివాదాస్పదంగా పంజాబ్ ప్రభుత్వ నిర్ణయం
చంఢీగఢ్: ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేందుకు 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను కపుర్తాలా జిల్లాలోని ఫగ్వారా చెక్‌పోస్టుల వద్ద కాపలాగా ఉంచనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. ఫగ్వారా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సివిల్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు, కమ్యూనికేషన్ ఎక్సెంజ్లతో పాటు ఉపాధ్యాయులు కూడా రాత్రి 9 గంటల నుంచి 1 గంటల మధ్య చెక్ పాయింట్ల వద్ద డ్యూటీ చేయాలంటూ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటికే గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం 24 మంది పాఠశాల ఉపాధ్యాయులను డిస్టిలరీలకు కాపాలాగా నియమించింది. కానీ దీనిని ఉపసంహరించిన నెల రోజులకే ప్రభుత్వం మరోసారి ఈ ఉత్తర్వును జారీ చేసింది. (వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు) దీనిపై శిరోమణి అకాలీదళ్(ఎస్ఎడీ) పార్టీ ప్రతినిధి, మాజీ మంత్రి డల్జిత్ సింగ్ చీమా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘డిస్టిలరీల తరువాత ఇసుక తవ్వకాలను ఆపడానికి పంజాబ్ ప్రభుత్వం వివిధ పోలీసు చెక్‌పోస్టు వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించింది. ఉపాధ్యాయులను మద్యం, ఇసుక మాఫియా కోసం ఎందుకు నియమిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఒక సిగ్గుమాలిన నిర్ణయం. ప్రభుత్వం వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. కాగా గత నెలలో గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఈ వివాదాస్పద ఉత్తర్వుపై ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంది. మద్యం సరఫరాపై నిఘా పెట్టడానికి 24 మంది ఉపాధ్యాయులను కర్మాగారాల్లో మోహరించింది. అయితే ప్రతిపక్షం ఆందోళనలతో ఆ ఉత్తర్వును ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. (ఎగువసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్) -
సిగరెట్.. చుట్టూ వందల కోట్ల వ్యాపారం
సాక్షి, సిటీబ్యూరో: సిగరెట్..చుట్టూ ఇప్పుడు రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. విదేశాల్లో తయారైన కొన్ని బ్రాండ్లను ఢిల్లీ మీదుగా గుట్టుగా నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ స్మగ్లింగ్ దందా లాక్డౌన్ తదనంతర పరిణామాలతో పెరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా శనివారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు రూ.12.6 లక్షల సరుకుతో చంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ అహ్మద్ చిక్కాడు. ఈ విదేశీ సిగరెట్ల దందాపై దృష్టి పెట్టిన పోలీసు విభాగం లోతుగా ఆరా తీస్తోంది. తయారీ మొత్తం ఆయా దేశాల్లోనే... హైదరాబాద్ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో కొన్ని బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే డజరమ్ బ్లాక్, గుడాన్ గరమ్, మాల్బరో, డన్హిల్, ఎస్సా, విన్, ప్యారిస్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు గుర్తించింది. ఇవి తయారవుతున్నది ఇండోనేషియా, చైనా, మలేషియా,స్విడ్జర్లాండ్, సౌత్ కొరియాల్లో అయినప్పటికీ అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. దుబాయ్ మీదుగానే ఢిల్లీ, ముంబై, చెన్నైలకు చేరి అట్నుంచి సిటీకి వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మహ్మద్ అహ్మద్‌కు సైతం ఢిల్లీలోని సదర్ బజార్ నుంచి రైల్వే కార్గోలో వచ్చిన విషయం ఇప్పటికే గుర్తించారు. అధికారుల కళ్ళు గప్పేందుకు ఈ అక్రమ రవాణా సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువులంటూ జరుగుతోందని నిర్థారిస్తున్నారు. ఓసారి ఓడలు, మరోసారి విమానాలు... సిటీకి సిగరెట్ల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న నగరానికి చెందిన ఓ ముఠాపై గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు డేగకన్ను వేశారు. ఈ గ్యాంగ్ ఓసారి విదేశీ సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా తీసుకువచ్చింది. పిల్లలకు వినియోగించే డైపర్లని చెప్తూ కంటైనర్ ముందు వరుసల్లో వాటినే పెట్టి, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచ్చింది. మూసాపేటలో ఉన్న ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోకు ఇవి చేరుకోవడంతో ఉప్పందిన డీఆర్ఐ అధికారులు దాడి చేసి రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్లను పట్టుకుని నిందితుల్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత పంథా మార్చిన అదే గ్యాంగ్ ఇంజనీరింగ్ వస్తువులు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌కార్గోలో ఉండగా దాడి చేసి రూ.51 లక్షల వలువైనవి స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇలాంటి గ్యాంగ్స్ మరోసారి రెచ్చిపోతున్నట్లు టాస్క్‌ఫోర్స్ అనుమానిస్తోంది. ఒకటికి ఒకటిన్నర డ్యూటీ... ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్ ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూ టీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్ వారి ద్వారా మార్కెట్లోని వెదజల్లుతోంది. ఆరోగ్యానికీ చేటనే అనుమానం... ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసి వ్యాపార లావాదేవీలను గుర్తించాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా మూలాలు కనుగొనడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. విదేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్ళిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయిని పోలీసులుహెచ్చరిస్తున్నారు. -
చైనాకు అక్రమంగా మాస్కులు, పీపీఈ కిట్లు
ఢిల్లీ : చైనాకు పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను కస్టమ్స్ అధికారులు ఢిల్లీలో పట్టుకున్నారు. 5 లక్షల మాస్కులు, 952 పీపీఈ కిట్లు, 57 లీటర్ల శానిటైజర్లను ముఠా అక్రమంగా చైనాకు తరలిస్తున్నట్లు ఇంటలిజెన్స్ అందించిన సమాచారంతో ఢిల్లీలో అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో వీటి వినియోగం బాగా పెరిగింది. దీంతో వెంటిలేటర్లు, మాస్కులు వంటి రక్షణ వస్తు సామాగ్రి ఎగుమతిని ఇతర దేశాలకు నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) మార్చి 19న ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఎగుమతిని ఏప్రిల్ 7న డీజీఎఫ్టీ నిషేధించింది. ఈ నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (మద్యాన్ని తరలిస్తున్న ఎమ్మెల్యే.. కారు సీజ్!) -
మద్యం తరలిస్తున్న ఎమ్మెల్యే.. కారు సీజ్!
పట్నా : మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టుబడ్డారు. బుధవారం రాత్రి సమయంలో పోలీసు తనిఖీ నిర్వహిస్తుండగా బక్సార్ ఎమ్మెల్యే సంజయ్ తివారి కారులో మద్యం బాటిల్స్ లభించాయి. దీనిపై పోలీసులు ప్రశ్నించగా అతను పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మద్యం సరఫరా చేస్తున్నందుకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారికి తాను సహాయం చేస్తున్నా అన్నారు. బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయాలు గత నెల నుంచి పేదలకు పంచుతున్నానని పేర్కొన్నారు. (కరోనా : చివరి చూపైనా దక్కలేదు) అయితే మద్యం బాటిల్స్ తన వాహనంలోకి ఎలా వచ్చాయో తనకు తెలీదని సజయ్ చెప్పారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాహనం సీజ్ చేయడం పట్ల స్థానిక నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కుట్రపూరితంగానే వాహనం సీజ్ చేశారని విమర్శిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1411285105.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హద్దుమీరి మద్యం విక్రయాలు
పశ్చిమగోదావరి, వేలేరుపాడు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం జిల్లాలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ఆదాయానికి గండిపడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు గ్రామాలన్నీ తెలంగాణాణ గ్రామాలకు ఆనుకుని ఉండటంతో దీనిని అవకాశంగా తీసుకుని మద్యం వ్యాపారులు యథేచ్ఛగా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. పట్టించుకోని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దశలవారీ మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలవుతోంది. అయితే ఆశాఖ అధికారుల నిర్లక్ష్యంతో సర్కారు ఆశయానికి తూట్లు పడుతున్నాయి. పొరుగు రాష్ట్రం నుంచి విచ్చలవిడిగా అక్రమ మద్యం రవాణా అవుతున్నా, అరికట్టాల్సిన అధికారులు మామూళ్లమత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడపాదడపా నామమాత్ర దాడులు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు తెలంగాణకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో అనధికార మద్యం విక్రయాలు ఎక్కువయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలానికి పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో సరిహద్దు గ్రామాలు ఆనుకుని ఉన్నాయి. తెలంగాణలోని దమ్మపేట, సత్తుపల్లి, వేంసూరు మండలాలు చింతలపుడి మండలానికి ఆనుకుని ఉండగా బూర్గంపహాడ్, ముల్కలపల్లి మండలం తిమ్మంపేట కుక్కునూరు మండలానికి అత్యంత చేరువలో ఉన్నాయి. ఆయా మండలాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా మద్యం రవాణా అవుతోంది. బూర్గంపహాడ్ నుంచి వయా ఏలేరు మీదుగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు మద్యం సరఫరా చేస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో పోలీసు చెక్ పోస్టులున్నప్పటికీ రవాణాను నియంత్రించలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. యథేచ్ఛగా బెల్ట్‌షాపుల నిర్వహణ ఈ సరిహద్దు గ్రామాల్లో ఏకంగా మూడు నుంచి 12 బెల్ట్ దుకాణాలు వెలిశాయి. ప్రభుత్వం అనుమతించిన దుకాణాల్లోనే మద్యం విక్రయించాలన్న నిబంధనలు అమలు కావడం లేదు. పోలవరం ముంపు ప్రాంత మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోనే వందలాది సంఖ్యలో బెల్ట్ షాపులు వెలిశాయి. ఈ బెల్ట్ షాపుల్లో సిట్టింగ్‌లు కూడా ఏర్పాటు చేశారు. అరకొర దాడులతో సరి : అక్రమ మద్యం నిరంతరం రవాణా అవుతున్నా అరకొర కేసులు నమోదు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం మద్యం పాలసీని ఎంతో పకడ్బందీగా నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్యమే ధ్యేయంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో భాగంగా కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. ఈ క్రమంలో సర్కారు సంకల్పానికి అనుగుణంగా పనిచేయాల్సిన ఎక్సైజ్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కొంతమంది ఇదే వ్యాపారాన్ని ఎంచుకొని లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకొచ్చి జిల్లాలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఇటీవల అధికారులు రూ.4 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. కొంత మంది నాయకుల అండదండలతోనే ఈ అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. 30 కేసులు నమోదు చేశాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఇప్పటి వరకు 30 ఎన్డీపీఎల్ కేసులు నమోదు చేశాం. జిల్లా కేంద్రానికి సరిహద్దు గ్రామాలు దూరం కావడం, దీనికి తోడు ఆరు మండలాలకు ఒకే సీఐ, ఒకే ఎస్సై ఉండటంతో దాడులు చేపట్టడానికి కొంత ఇబ్బంది కలుగుతోంది. ఆయా మండలాల అధికారుల సహకారం తీసుకుని అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో వలంటీర్లు కూడా నిబద్ధతతో వ్యవహరించి అక్రమ మద్యం నివారించేందుకు సహకరించాలి. – అనసూయాదేవి, ఉప కమిషనర్ ఎక్సైజ్ శాఖ -
ఆంధ్రా టు ఆఫ్రికా
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు చేరాల్సిన ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం (పీడీఎస్ బియ్యం) కృష్ణపట్నం పోర్టు ద్వారా ఆఫ్రికాకు భారీ ఎత్తున తరలిస్తున్న గుట్టు రట్టయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. 1,645 టన్నుల బియ్యం కృష్ణపట్నం పోర్టులో అనధికారికంగా నిల్వ ఉంచారంటే.. ఈ స్కామ్‌లో ఎంత పెద్ద నెట్వర్క్ నడిచిందో ఇట్టే అర్థమవుతోంది. ప్రభుత్వ శాఖలు, పోర్టు సిబ్బంది సైతం కుమ్మక్కు అయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎక్స్‌పోర్టర్లకు సంబంధించిన నలుగురు వ్యక్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తే ఆఫ్రికా దేశానికి రవాణా చేసేందుకు తరలిస్తున్నట్లు బయటపడింది. నెల్లూరు (క్రైమ్): కృష్ణపట్నం పోర్టులో సీబార్డ్ గోదాముల్లో భారీ ఎత్తున ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో పట్టుబడిన నేపథ్యంలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. 1,645 టన్నుల బియ్యం అక్రమ నిల్వలు బయట పడిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో బియ్యం నిల్వ చేయడం వెనుక ప్రభుత్వ శాఖల హస్తం ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఈ స్థాయిలో నిల్వ చేయాలంటే సుమారు ఆరు నెలలకు పైగానే సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు బియ్యాన్ని సరఫరా చేసే సప్లయిర్లు నేరుగా ఎక్స్‌పోర్టర్స్‌తో సంబంధాలు పెట్టుకుని ఈ దందా కొనసాగిస్తున్నారని ప్రాథమిక సమాచారం. రేషన్ షాపులకు పంపే బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే నేరుగా లారీల్లో రైస్ మిల్లలకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యం గోతాలను మార్చి అనువైన బ్రాండ్స్‌తో కొత్తగా ప్యాకింగ్ చేసి లారీల్లో పోర్టులోని గోదాములకు తరలిస్తున్నారు. అయితే ఇక్కడకు చేరిన లారీలకు వే బిల్లులు, అధికార పూర్వకంగా ఉండాల్సిన పత్రంలో ఏ వివరాలు లేవని తేలింది. ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ సంబంధిత శాఖల కనుసన్నల్లోనే జరుగుతోందని సమాచారం. పోర్టుకు చేరిన అనంతరం అక్కడ జరగాల్సిన తంతు పోర్టు సిబ్బంది చూసుకుంటారు. షిప్మెంట్ జరిగే సమయంలో మాత్రమే సంబంధిత వే బిల్లులు, క్వాలిటీ, ఎన్ని రోజులు నిల్వ ఉంచారన్న అంశాలపై కస్టమ్స్ అధికారులు పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అక్రమ నిల్వలు బయట పడ్డాయని అధికారులు వెల్లడించారు. అయితే పోర్టు, సంబంధిత ప్రభు త్వ అధికారుల నడుమ ఒప్పందాలు బహిర్గతం కావడంతో అసలు విషయం బయటకు పొక్కిందని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ అనుమతులు తీసుకుని పోర్టులో విజిలెన్స్ అధికారులు దాడులు చేయాల్సి వచ్చింది. బియ్యం సేకరణ ఇలా.. దాడుల్లో ప్రధానంగా బియ్యం తరలించే నలుగురు సప్లయిర్స్, నలుగురు ఎక్స్‌పోర్టర్లను గుర్తించారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉండటం గమనార్హం. సప్లయిర్స్‌లో కర్ణాటకకు చెందిన శ్రీవీరభద్రేశ్వర ఇండస్ట్రీ నుంచి రాధిక బ్రాండ్ పేరుతో 30 టన్నుల బియ్యాన్ని రాజస్థాన్‌కు చెందిన రాధికా ఎంటర్ ప్రైజస్ ఎక్స్పోర్టర్కు సీషల్ లాజిస్టిక్ ద్వారా సరఫరా చేశారు. రైస్ మిల్లర్ల దగ్గర నుంచి పోర్టు సిబ్బంది వరకు భారీ స్థాయిలో సొమ్ము చేతులు మారకపోతే ఇంత పెద్ద రాకెట్ దందాకు ఆస్కారం లేదని తెలుస్తోంది. ►గుంటూరు జిల్లాకు చెందిన సీతారామాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ నుంచి ఓషన్ బ్రాండ్ పేరుతో 1263.50 క్వింటాళ్ల బియ్యాన్ని ఢిల్లీ నవభారత్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్‌పోర్టర్స్ చాకియాత్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేశారు. ఈ నలుగురు సప్లయిర్స్ ఈ–వేబిల్లులు లేకుండా, ఏఎంసీ సెస్‌లు చెల్లించకుండా చేర్చినట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన సీతారామాంజనేయ రైస్ అండ్ఫ్లోర్ మిల్ నుంచి ఈగల్ బ్రాండ్ పేరుతో రెండు దఫాలుగా 63 క్వింటాళ్ల బియ్యాన్ని ఢిల్లీ నవభారత్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్‌పోర్టర్స్ చాకియాత్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేశారు. ►చెన్నైకు చెందిన శివకేశవ ట్రేడర్స్ నుంచి సలోని బ్రాండ్ పేరుతో 3,900 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడకు చెందిన సిస్టర్ కన్సైన్మెంట్ కాకినాడ అండ్ సరలా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్స్ నుంచి ఏవీకే లాజిస్టిక్స్‌కు సరఫరా చేశారు. ►విజయవాడకు చెందిన ఎస్ఎంఆర్ ట్రేడింగ్ కంపెనీ నుంచి సూపర్ టైగర్ బ్రాండ్ పేరుతో 11,225 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడకు చెందిన ఎంఓఐ కమోడిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్స్ సీవేస్ షిపింగ్ అండ్ లాజిస్టిక్ లిమిటెడ్ ద్వారా సరఫరా చేసినట్లు దాడుల్లో అధికారులు గుర్తించారు. సప్లయిర్స్, ఎక్స్‌పోర్టర్స్ వివరాల సేకరణ అసలు ఇలాంటి వ్యవహారాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో అనే వివరాలు సేకరించేందుకు విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందుకు కస్టమ్స్ అధికారుల నుంచి 2016–17 నుంచి 2019–20 వరకు సప్లయిర్స్, ఎక్స్‌పోర్టర్స్, ట్రాన్స్పోర్టర్స్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. బయటపడిందిలా.. బియ్యం బ్యాగ్‌లు మార్చి, పేర్లు మార్చి, బిల్లులు లేకుండా పోర్టు గోదాముకు చేరిన బియ్యం అమ్మిన ధరను తెలిపే బిల్లులు అక్రమాల పుట్టను బయట పెట్టాయి. బియ్యం రూ.25, రూ.20 ఇలా తక్కువ ధరలకు కొని విదేశాలకు ఎగుమతి చేయడం ఎలా సాధ్యమవుతుందని తొలుత కస్టమ్స్ అధికారుల్లో రేగిన ఆలోచనలు అసలు విషయాన్ని బయట పెట్టాయి. శ్రీవీరభద్రా ఇండస్ట్రీస్ కేజీ బియ్యం రూ.25కు కొనుగోలు చేసినట్లు, సీతారామాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్‌మిల్లు కేజీ రూ 21.40లకు కొనుగోలు చేసినట్లు, శివకేశవ ట్రేడర్స్ రూ.25, ఎస్ఎంఆర్ ట్రేడింగ్ కంపెనీ రూ.20.60 కేజీకి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నలుగురు సప్లయిర్స్ ఈ వే బిల్లులు లేకుండా, ఏఎంసీ సెస్ చెల్లించనట్లు అధికారులు గుర్తించారు. ఈ బియ్యం విజయవాడ, కాకినాడ, గుంటూరు, చెన్నై, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 లారీల ద్వారా పోర్టులోని సీబోర్డ్ గోదాముకు తరలినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత కస్టమ్స్ హౌస్ ఏజెంట్లను విజిలెన్స్ అధికారులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి 6ఏ కింద కేసు నమోదు చేశారు. అదే క్రమంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. -
‘గోల్డెన్’ లేడీస్.. బంగారాన్ని లోదుస్తుల్లో దాచి!
సాక్షి, రంగారెడ్డి: అతివలు స్మగ్లర్లకూ టార్గెట్ అవుతున్నారు. ఎన్నో విధాలుగా ఆశలు చూపి వీరిని క్యారియర్లుగా వినియోగిస్తున్నారు. కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. ఒక్క ఆదివారమే జిద్దా నుంచి 2.5 కేజీల బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తీసుకువస్తూ నగరానికి చెందిన నలుగురు మహిళలు చిక్కారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పడానికే.. సాధారణంగా స్మగ్లర్లు వీరి కోసం బంగారాన్ని తీసుకుని వచ్చే క్యారియర్లు అనగానే అందరూ పురుషులు అనే భావిస్తుంటారు. దీనికి తోడు మహిళలూ.. అందునా నిండు గర్భంతో, చంకలో పసి పిల్లలతో వచ్చే వారిని అధికారులు అనుమానించం చాలా తక్కువ. ఈ కారణంగానే దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్ మాట అటుంచితే.. పసిడి తీసుకువచ్చే ఉమెన్ క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే గుర్తిస్తున్న స్మగ్లర్లు వారికి ఇచ్చి పంపిస్తున్నారు. మాదకద్రవ్యాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి బంగారం తదితరాలను అప్పగించి పంపిస్తున్నారు. డీఎఫ్‌ఎమ్‌డీల వద్దా బురిడీ.. వివిధ రూపాల్లో, వివిధ పంథాల్లో ఒంటిపై ఏర్పాటు చేసుకుని బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలను విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్‌లు (డీఎఫ్ఎండీ) కూడా కొంత వరకు పసిగట్టలేకపోతున్నాయి. ఏదైనా అక్రమరవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకరిస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంత వరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం సైతం ఉంటుందనే బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. తప్పించుకుంటున్న కీలక వ్యక్తులు.. ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా.. ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. కేవలం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల ముమ్మర కసరత్తు.. బడా స్మగ్లర్లు మహిళల్ని అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళలను ఆపడం, క్షుణ్ణంగా తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఆఖరిసారిగా ఎప్పుడు వచ్చారు.. ఏ వీసాపై వెళ్లారు.. వారి నేపథ్యం ఏమిటి? తదితరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఇవిగో ఉదాహరణలు.. దుబాయ్ నుంచి ‘గర్భవతిగా’ వచి్చన సౌతాఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది. సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచి్చన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వా«దీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
సిగరెట్లూ ఎగిరొస్తున్నాయ్!
సాక్షి, సిటీబ్యూరో: బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు... మాదకద్రవ్యాలు, ఇవి మాత్రమే కాదు సిగరెట్లు సైతం పెద్ద ఎత్తున సిటీకి అక్రమ రవాణా అవుతున్నాయి. ఈ తరహా స్మగ్లింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటంతో పాటు ప్రజారోగ్యానికి చేటని అధికారులు చెబుతున్నారు. నగరానికి అక్రమంగా వచ్చి చేరిన సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన, పది బ్రాండ్లకు చెందిన 16,380 విదేశీ సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విక్రయంపై నిషేధం కొనసాగుతోందని టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి శుక్రవారం వెల్లడించారు. నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో 23 బ్రాండ్లకు చెందినవి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే బ్లాక్, గరమ్‌లతో పాటు ఎస్సీ, మోండ్ తదితర బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు తెలిపారు. ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. దుబాయ్ మీదుగా ఢిల్లీకి వచ్చి... ఆపై నగరానికి వస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. కస్టమ్స్ సహా వివిధ విభాగాల కళ్లు గప్పేందుకు సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువుల పేరుతో ఈ అక్రమ రవాణా జరుగుతుందన్నారు. ఈ సిగరెట్లను బేగంబజార్‌కు చెందిన వికాస్ కుమార్, కలరామ్మాలి అనే వ్యక్తులు తమ వద్ద స్టాక్ చేసుకుంటున్నారు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా సరఫరా చేస్తూ హోల్‌సేల్‌గా నగర వ్యాప్తంగా ఉన్న రిటైలర్లకు విక్రయిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన వీరు 2016లో వ్యాపార నిమిత్తం సిటీకి వలస వచ్చారు. ప్రారంభంలో వక్కలు, స్వీట్ మసాలాలు, పాన్ షాపు ఉత్పత్తులు విక్రయించారు. ఈ వ్యాపారంలో ఎక్కువ లాభాలు లేకపోవడంతో ఢిల్లీకి చెందిన వ్యక్తులతో ఒప్పందాలు చేసుకుని విదేశీ సిగరెట్ల దందా మొదలెట్టారు. వీరి వ్యవహారాలపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్‌లు తమ బృందంతో శుక్రవారం వీరి సంస్థపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.12 లక్షల విలువైన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీ రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉన్న ప్రధాన సూత్రధారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే ఇలాంటి గ్యాంగ్‌లు వాటిని మార్కెట్లోకి తరలిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇండోనేషియా సహా మరికొన్ని దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్లిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఈ అక్రమ సిగరెట్లపై హెచ్చరిక బొమ్మలు కూడా ఉండవని, ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. -
‘కల్తీ’ కిక్కు!
కృష్ణగిరి మండలం అమకతాడులో ఈ నెల 10న నకిలీ మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరు కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా హల్వహో గ్రామానికి చెందిన వినోద్ కలార్ అనే వ్యక్తి ద్వారా స్పిరిట్, మత్తు ద్రావణాలు కొనుగోలు చేసి కర్నూలు కృష్ణానగర్‌లో నకిలీ మద్యం తయారు చేశారు. ఇది వెలుగులోకి వచ్చిన ఉదంతం. నిజానికి కల్తీ, నకిలీ మద్యం విక్రయాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. బెల్టుషాపులు రద్దు చేయడం, ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు నడుస్తుండటంతో అక్రమ వ్యాపారానికి బ్రేక్ పడినట్లయ్యింది. దీంతో గతంలో మద్యం విక్రయించిన వారంతా కర్ణాటక, తెలంగాణ మద్యంతో పాటు కల్తీ, నకిలీ మద్యాన్ని కూడా తయారు చేస్తున్నారు. వీటిని ఎక్కువగా గ్రామాల్లో బెల్టుషాపుల తరహాలో విక్రయిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాకు సరిహద్దు ప్రాంతంగా కర్ణాటక ఉంది. దీంతో మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లోని సరిహద్దు గ్రామాల మీదుగా జిల్లాలోకి కర్ణాటక మద్యం చేరుతోంది. నిత్యం ఏదో ఒక చోట వందల కేసుల మద్యం పట్టుబడుతోంది. మరోవైపు తెలంగాణ సైతం సరిహద్దు రాష్ట్రం కావడంతో అక్కడి నుంచి కూడా మద్యం వస్తోంది. ఈ వ్యవహారమంతా ఎక్సైజ్ అధికారులకు తెలుసు. కొందరు ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐలు ఆయా ప్రాంతాల్లో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వారి వద్దకు వెళ్లి మామూళ్లు తీసుకుని, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలంఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పుడు మాత్రమే తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. సివిల్ పోలీసులు సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు. కర్ణాటక లిక్కర్‌తో భారీ లాభాలు మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్ఏ (ఎక్స్ట్రా నూట్రల్ ఆల్కహాల్) బేస్డ్గా తయారవుతోంది. కర్ణాటకలో ఆర్ఎస్ (రెక్టిఫై స్పిరిట్) బేస్డ్ మద్యం తయారవుతోంది. ఈఎన్ఏ లిక్కర్ డబుల్ఫిల్టర్, ఆర్ఎస్ సింగిల్ ఫిల్టర్. ఈఎన్ఏ స్పిరిట్ లీటర్ రూ.50–55 ఉండగా.. ఆర్ఎస్ స్పిరిట్ కేవలం రూ.28–30కే లభిస్తోంది. దీంతో ఆర్ఎస్ మద్యం తయారీకి తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో కర్ణాటక మద్యం ఆంధ్రా కంటే తక్కువ ధరకు లభిస్తోంది. ఛీప్ లిక్కర్ 180 ఎంఎల్ క్వార్టరు బాటిళ్లు ఒక్కో కేసులో 48 ఉంటాయి. ఒక క్వార్టర్ బాటిల్ మద్యం విలువ మార్కెట్లో రూ.60. ఛీప్ కంటే కొంచెం మెరుగ్గా ఉండే డిప్ (90 ఎంఎల్ బాటిల్)లు ఒక్కో కేసులో 96 ఉంటాయి. ఒక్కో డిప్ విలువ రూ.45. కర్ణాటకకు చెందిన ఛీప్, మధ్యస్థ రకాల మద్యం జిల్లాలోకి వస్తోంది. తుంగభద్ర నదికి అటువైపు కర్ణాటక, ఇటు వైపు కర్నూలు జిల్లా ప్రాంతాలు ఉన్నాయి. దీంతో కర్ణాటకకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి..తీసుకొస్తున్నారు. మూడో రకంతో ముప్పు బేవరేజెస్ నుంచి తెచ్చుకునేది మొదటి రకందీన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తారు. కర్ణాటకలో కొనుగోలు చేసి విక్రయించే సరుకు రెండో రకం. దీన్ని ‘సెకండ్స్’అంటారు. అసలు ఎలాంటి ఎక్సైజ్ డ్యూటీ చెల్లించకుండా స్పిరిట్, అవసరమైన పదార్థాలతో సొంతంగాతయారు చేసి విక్రయించేది మూడో రకం మద్యం. ప్రస్తుతం ఇలాంటి మద్యం అమ్మకాలు కూడా కర్నూలులో మొదలయ్యాయి. కర్ణాటక నుంచి తెచ్చిన మద్యాన్ని బేసిన్లు, టబ్‌లలో పోసి.. నీళ్లు, రంగు, స్పిరిట్ కలుపుతారు. దీంతో పాటు మత్తు కల్గించేందుకు ఇతర ద్రావణాలు, కొందరు ‘కోరెక్స్’ సిరప్‌ను కూడా కలిపి కల్తీమద్యం తయారు చేస్తున్నారు. వీటిని సీసాల్లో నింపి.. మూత తొడిగి పట్టకారుతో నొక్కితే సహజ మూతలాగా అతుక్కుపోతుంది. దీనికి పలు ఛీప్ లిక్కర్ బ్రాండ్లకు సంబంధించిన నకిలీ స్టిక్కర్లు అతికించి..విక్రయిస్తున్నారు. రోజూ కేసులు నమోదు చేస్తున్నాం కర్ణాటక, తెలంగాణ నుంచి మద్యం వస్తోంది. పత్తికొండ, కోసిగి, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో ఎక్కువగా వస్తోంది. ఇటీవల మంచి కేసులు పట్టాం. తెలంగాణలో ఈ నెల 20 నుంచి మద్యం ధరలు పెరిగాయి. దీంతో అక్కడి నుంచి తగ్గింది. కర్ణాటక నుంచి వస్తోంది. ఆరు చెక్‌పోస్టులను బలోపేతం చేశాం. తుంగభద్ర మీదుగా పుట్టిల ద్వారా మద్యం తెస్తున్నారు. రాత్రిళ్లు కూడా పెట్రోలింగ్ చేస్తున్నాం. కేసు నమోదు కాని రోజే లేదు. రాష్ట్రంలో ఎక్కువ కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి.– చెన్నకేశవరావు, డీసీ, ఎక్సైజ్‌శాఖ -
చెక్‌పోస్టుల అక్రమాలకు చెక్
సాక్షి, జన్నారం: సార్ ఈరోజు చెక్‌పోస్టు వద్ద ఎవరున్నారు... మీరే ఉన్నారా... రాత్రికి నా బండి వస్తది, జర విడిచిపెట్టండి...ఏదన్న ఉంటే చూసుకుంటా... అని ఓ స్మగ్లర్ చెక్‌పోస్టు డ్యూటీ చేసే సిబ్బందితో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని కలప తరలిస్తారు. సార్ ఈ రోజు ఉన్నారా మీరు... లేదు... రేపు నాకు డ్యూటీ ఉంటుంది.. రేపు రా అని ఓ అధికారి తన డ్యూటీని ముందుగానే స్మగ్లర్‌కు సమాచారం ఇస్తాడు. ఇలా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ అక్రమంగా కలప తరలిపోవడానికి సహకరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్‌పెట్టెందుకు అధికారులు సమూల మార్పులు తీసుకొస్తున్నారు. చెక్‌పోస్టులను దాటించిన సంఘటనలు అనేకం: కలమడుగు అటవి చెక్‌పోస్టు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవి డివిజన్లో టైగర్‌జోన్ లో నుంచి కలప తరలిపోకుండా రాత్రి పూట వాహనాల రాకపోకలను జరుపకుండా ముత్యంపేట్, తపాలపూర్, పాడ్వాపూర్, కొత్తగూడం, కలమడుగు లలో అటవి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పగలంతా కలప తరలిపోకుండా చూడటమె కాకుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భారీ వాహానాలను టైగర్‌జోన్ లో పర్యటన నిషేదించారు. చెక్‌పోస్టు డ్యూటీ దినం, తప్పించి దినం ఇద్దరే చేసే వారు. ఇద్దరే ఉండటం వల్ల రాత్రి పూట ఇసుక తరలించే వారి వాహానాల వద్ద ఎంతో కొంత తీసుకుని వాటిని వదిలివేయడం, ముందుగానే కలప తరలించే వ్యక్తులు డ్యూటీ చేసే వారితో మాట్లాడి కలప దాటించడం జరిగేది. ఇటివల అనేక వాహనాలను చెక్‌పోస్టులు దాటి లక్షేట్టిపేట్ వెళ్తుండగా పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇటివల మామిడిపెల్లి నుంచి వ్యాన్‌లో కలప చెక్‌పోస్టులు దాటి వెళుతుండగా లక్షేట్టిపేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అదే విధంగా చెక్‌పోస్టు దాటించెందుకు వెళ్తుండగా జన్నారం అటవి అధికారులు ఒక కారును పట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మార్పులు తీసుకువచ్చారు. ఎవరికి డ్యూటీ ఉంటుందో వారికే తెలియదు డ్యూటీ ఇద్దరికే ఇవ్వడం వల్ల వారితో స్మగ్లర్లు మచ్చిక చేసుకుని కలప తరలిస్తున్నారనే విషయాన్ని గమనించిన అటవిశాఖ ఎఫ్‌డీవో మాధవరావు నూతన డ్యూటీ విధానానికి తెరదించాడు. చెక్‌పోస్టు డ్యూటీ ఇద్దరికే కాకుండా డివిజన్ పరిధిలోని బీట్ అధికారులకు అందరికి వేయాలని యోచించాడు. డివిజన్లోని బీట్ అధికారికి ఒక గంట ముందే సమాచారం ఇచ్చి డ్యూటీ చేయాలనే ఆదేశాలను ఇస్తున్నారు. దీంతో చెక్‌పోస్టు వద్ద ఎవ్వరు డ్యూటీ చేస్తారో అనే విషయం స్మగ్లర్లకు తెలియకుండా ఉంటుంది. తనకు డ్యూటీ ఉంటుందనే విషయం ఆ బీట్ అధికారికే తెలియని పరిస్థితి ఉంటున్నందున అక్రమాలు జరిగే అవకాశం లేదు. అదే విధంగా గతంలో చెక్‌పోస్టు డ్యుటీలు చేసిన వారు కూడ తిరిగి బీట్లలో వెళ్లాల్సి ఉంటుంది. ఒకే రోజు డ్యూటి ఉంటున్నందున తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండదనేది అధికారుల ఆలొచన. సీసీ కెమెరాలతో నిఘా చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలను అమర్చి నిఘా పెట్టారు. గతంలో సీసీ కెమరాలను అమర్చిన వాటి ప్రసారం కేవలం చెక్‌పోస్టు వద్దనే ఉండేది. అయితే ఎఫ్‌డీవో మాధవరావు చెక్‌పోస్టు వద్ద అమర్చిన సీసీ పుటేజీలు తన కార్యాలయంలో, తన మోబైల్లో కనిపించేలా తగు ఏర్పాట్లను చేసుకున్నారు. దీంతో చెక్‌పోస్టుల నిర్వహణపై ప్రతి రోజు, ఖాళీ సమయంలో మోబైల్ లో లేదా, తన కార్యాలయంలోని కంప్యూటర్లో పరిశీలిస్తున్నారు. గతంలో ఏదైన అవకతవకలు జరిగే క్రమంలో సదరు సిబ్బంది చెక్‌పోస్టు వద్ద కెమరాను బందు చేసి వాహనం వెళ్లాక తిరిగి ఆన్ చేసే అవకాశం ఉండేది ఎందుకంటే కెమరాలోని వివరాలు అక్కడే అమర్చిన కంప్యూటర్లో రికార్డు అయ్యేది. వాటిని అధికారులు ఎప్పుడో ఒక్కసారి పరిశీలించేవారు. కాని ఇప్పుడు ఇక కెమరాలను ఆపి వేసే వీలు కూడ ఉండదు. కొన్ని సమయాల్లో వాహానాలను వదిలిపెడితే అప్పుడే ఫోన్ చేసి అడిగి అనుమానం నివృత్తి చేసుకునే వీలుంటుంది. దీంతో భయానికి చెక్‌పోస్టు వద్ద ఉండే సిబ్బంది అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. చెక్‌పోస్టుల వద్ద పని చేసే సిబ్బంది ఒక్కరోజు మాత్రమే ఉండటం వల్ల తనిఖీలలో అక్రమాలు జరిగే అవకాశం లేదు. ఇలాంటి సమూల మార్పుల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాను చెక్‌పోస్టులలో కలప తరలిపొవడమ గమనించాను. సిబ్బందిని పలుమార్లు హెచ్చరించిన అప్పుడప్పుడు ఒకటి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశాము. కొత్త విధానం వల్ల సిబ్బందికి భయం ఉంటుంది. అదే విధంగా డ్యూటీ ఎవ్వరు చేస్తున్నారో తెలియకుండా ఉంటుంది. కేవలం గంట ముందే డ్యూటీ చేసే సిబ్బంది గురించి సంబంధిత రేంజ్ అధికారి వారికి తెలియజేస్తారు. దీంతో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదని ఆశిస్తున్నాం. – మాధవరావు, ఎఫ్‌డీవో -
పట్టువదలని విక్రమార్కుడు
సాక్షి, చెన్నై: పట్టువదలని విక్రమార్కుడిలా విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ప్రత్యేక అధికారి పొన్ మాణిక్య వేల్ ముందుకు సాగుతున్నారు. తనకు అప్పగించిన బాధ్యతల్లో ఏ మాత్రం తగ్గబోనని మరో మారు చాటుకున్నారు. ఆ్రస్టేలియాలో ఉన్న రెండు విగ్రహాలను భారత్‌కు తెప్పించేందుకు సిద్ధం అయ్యారు. తమిళ పాలకుల నుంచి స్పందన కరువు కావడంతో చాకచక్యంగా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఆ విగ్రహాలను ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేశారు. ‘పొన్ మాణిక్య వేల్’ఈ పేరు వింటే చాలువిగ్రహాల స్మగ్లర్ల గుండెల్లో దడ బయలు దేరుతుంది. విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ఐజీగా ఆయన స్మగ్లర్లకు ముచ్చమటలు పట్టించారు. దేశ విదేశాల్లో ఉన్న విగ్రహాలను ఇక్కడికి రప్పించే దిశగా ముందుకు సాగారు. అందుకే పదవీ కాలం ముగిసినా, ఆయన్నే ప్రత్యేక అధికారిగా కోర్టు నియమించింది. ప్రత్యేక అధికారిగా ఆయన నియమితులైనా పాలకుల నుంచి సాయం మాత్రం కరువైంది. అయితే, తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు నిదర్శనం తాజాగా, పాలకుల నుంచి సహకారం లేకపోవడంతో ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించి రూ.నాలుగు కోట్లు విలువగల రెండు విగ్రహాలను భారత్‌కు రప్పించడం విశేషం. ఆ్రస్టేలియా నుంచి.. తిరునల్వేలి జిల్లా వీరనల్లూరు సమీపంలో తిరువడై మరుదూర్ గ్రామం ఉంది. ఇక్కడ పాండ్య రాజుల హయంలో (600 ఏళ్ల క్రితం) మూంగీశ్వర ముడయార్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని రెండు ద్వార పాలకుల విగ్రహాలు 1995లో అపహరణకు గురయ్యాయి. ఈ కేసు విషయంలో పోలీసులు చేతులెత్తేయగా, పొన్ మాణిక్య వేల్ రహస్యంగా విచారణ చేపట్టి, ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో గుర్తించారు. స్మగ్లర్లు లక్ష్మి నరసింహన్, అశోకన్లు తన అనుచరుల ద్వారా ఇండో నేపాల్ ఆర్ట్ గ్యాలరీకి తరలించినట్టు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాలోని ఓ ప్రముఖ గ్యాలరీలో ఉంచినట్టు గుర్తించారు. ఈ విగ్రహాల విలువ రూ.4 కోట్ల 98 లక్షలు. ఈ విగ్రహాలు తమిళనాట చోరీ చేసి, ఆ్రస్టేలియాకు తరలించినట్లు ఆ గ్యాలరీకి హెచ్చరికలతో కూడిన లేఖను ఇటీవల పొన్ మాణిక్య వేల్ పంపించారు. ఆ గ్యాలరీ వర్గాలు స్పందించి, భారత్‌కు తీసుకెళ్లాలని సూచించినా, వాటిని ఇక్కడికి తీసుకు రావడంలో పాలకుల సహాకారం అన్నది పొన్ మాణిక్య వేల్కు కరువైంది. దీంతో వ్యూహాత్మకంగా, పట్టువదలని విక్రమార్కుడిలా మాణిక్య వేల్ వ్యవహరించారు. విదేశీ వ్యవహారాల శాఖ సాయంతో... తమిళనాడులో దోపిడికి గురైన విగ్రహాలు ఆ్రస్టేలియాలోని కొన్ని గ్యాలరీల్లో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేమని పేర్కొంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రెండు ద్వార పాలకులతో పాటుగా అక్కడున్న అన్ని విగ్రహాల విలువ, వాటి గురించిన పూర్తి వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు. ఇందులో రెండు విగ్రహాలను అప్పగించేందుకు సంబంధిత గ్యాలరీ ముందుకు వచ్చినా, ఇక్కడకు తీసుకు రాలేని పరిస్థితి ఉందని, సాయం అందించాలని కోరారు. దీంతో ఆ్రస్టేలియాలోని భారత రాయబార కార్యాలయ వర్గాల ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ సంప్రదింపులు జరిపాయి. దీంతో ఆ విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రధాని ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదికి అప్పగించేందుకు నిర్ణయించారు. జనవరిలో ఆ్రస్టేలియా నుంచి ఈ విగ్రహాలు ఢిల్లీకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించనున్నారు. అనంతరం ఈ విగ్రహాలను పొన్మాణిక్య వేల్ బృందం తిరునల్వేలిలోని ఆలయానికి చేర్చనున్నారు. ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన వెలువడటం విశేషం. ఇక, ఆ్రస్టేలియాలో ఉన్న మిగిలిన విగ్రహాలు, సింగపూర్‌లో ఉన్న 16 విగ్రహాలను మరి కొన్ని నెలల్లో ఇక్కడికి తెప్పిస్తానని పొన్ మాణిక్య వేల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
పాతబస్తీలో ప్రైవేట్ ‘జూ’లు!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో జూ ఎక్కడ? అంటే.. బహదూర్‌పురాలో ఉన్న నెహ్రూ జులాజికల్ పార్కు అని ఠక్కున చెబుతారు. అయితే, ఇప్పటి వరకు రికార్డుల్లోకి ఎక్కకుండా, గుట్టచప్పుడు కాకుండా పాతబస్తీలో ‘ప్రైవేట్ జూ’లు కూడా నడుస్తున్నాయి. గడిచిన పది రోజుల్లో ఏడు వన్యప్రాణులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకోవడమే దీనికి నిదర్శనం. జనాల్లో ఉన్న మూఢ నమ్మకాలు, ఫ్యాషన్, మాంసానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ జూలు ఇలా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వరుసగా చిక్కుతున్న జంతువులు ఈ వన్యప్రాణుల దందా పాతబస్తీ కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. శివారు జిల్లాలు, పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ జంతువుల్ని అక్రమంగా తీసుకువస్తున్నారు. అక్కడి వేటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న అక్రమ వ్యాపారులు వీటిని సమీకరిస్తున్నారు. ఆపై బోనుల్లో బంధించి రోడ్డు మార్గంలో తీసుకొస్తున్నారు. రహదారుల్లో ఉంటున్న చెక్‌పోస్టులు, అటవీ శాఖ తనిఖీ కేంద్రాలనూ వీరు దాటి వచ్చేస్తున్నారంటే మామూళ్ల మత్తులో ఆ సిబ్బంది పరోక్షంగా సహకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. నగరానికి చేరుకున్న తర్వాత తమ ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు, దుకాణాల్లో ఈ జంతువుల్ని కొంతకాలం పెంచి ఆపై అసలు ‘పని’ ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మూడే ప్రధాన కారణాలు ఇతర ప్రాంతాల నుంచి సిటీకి గుట్టుగా, వ్యవస్తీకృతంగా ఈ వన్యప్రాణుల అక్రమ దందా సాగడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. పాతబస్తీకి చెందిన వారి కుటుంబీకులు అనేక మంది దుబాయ్ వంటి దేశాల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వారు తరచు అక్కడకు వెళ్లి వస్తుంటారు. ఆయా దేశాల్లో పులులతో సహా కొన్ని వన్యప్రాణుల్ని ఇళ్లల్లో పెంచుకోవడం సరదా. అక్కడిలాగే ఇక్కడా వన్యప్రాణులను పెంచాలని కొందరు ప్రయతి్నస్తున్నారు. మరికొందరికి ఈ తరహా వన్యప్రాణుల్ని పెంచుకుంటే, సజీవంగా పాతిపెడితే, నిరీ్ణత రోజుల్లో బలి ఇస్తే అదృష్టం వరిస్తుందనే మూఢనమ్మకం ఉంది. దీన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. వీటితో పాటు కొన్ని జంతువుల మాంసానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో వన్యప్రాణుల అక్రమ రవాణా య«థేచ్ఛగా సాగుతోందని పోలీసులు వివరిస్తున్నారు. ‘అంతర్జాతీయ’ ప్రమేయంపై అనుమానాలు వన్యప్రాణుల అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ ముఠాల ప్రమేయం సైతం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా తీసుకెళ్లిన వన్యప్రాణుల్లో నక్షత్ర తాబేళ్లు వంటి వాటిని పాతబస్తీతో పాటు శివార్లలోని ఫామ్‌హౌస్‌ల్లో కొంతకాలం ఉంచుతున్నారని, ఆపై బయటి దేశాలకు తరలించేస్తున్నారని భావిస్తున్నారు. ఈ కోణంలో అటవీ, కస్టమ్స్ అధికారులతో కలిసి ఆరా తీయాలని నిర్ణయించారు. ఈ దందా చేస్తున్న వాళ్లంతా ఏళ్లుగా పక్షులు, కుందేళ్లను విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లు, వేటగాళ్లు, ఇతర వ్యాపారులతో ఏర్పడిన పరిచయాల నేపథ్యంలో వీరంతా వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలోకి దిగారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు నిఘా ముమ్మరం చేయడంతో పాటు అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేయాలని నిర్ణయించారు. స్మగ్లింగ్‌కు ఉదాహరణలు.. పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆరిఫ్ సహా ఐదుగురు నగరవాసులు అరుదైన కరకల్, లెపార్డ్ జాతులకు చెందిన పిల్లులు ఐదింటిని బీహార్ అడవుల్లో పట్టుకున్నారు. వీటిని కారులో ప్రత్యేకంగా రూపొందించిన బోనుల్లో సిటీకి తీసుకువస్తూ 2017 జనవరిలో మీర్జాపూర్ ప్రాంతంలో అక్కడి అటవీ శాఖ అధికారులకు దొరికారు. పాతబస్తీలోని బార్కస్‌కు చెందిన అన్నదమ్ములు సాలెహ్ బిన్ మహ్మద్ బదామ్, అలీ బిన్ మహ్మద్ బదామ్‌లు ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే నాలుగు స్లోలోరిస్‌లు, ఓ స్టార్ తాబేలు, మరో మొత్తడి డొప్ప తాబేలును విక్రయానికి ప్రయతి్నంచారు. ఓ నిందితుడిని ఈ నెల 17న దక్షిణ మండల టాస్‌్కఫోర్స్ పట్టుకుంది. వనసర్తి జిల్లా పెబ్చేర్‌లోని కృష్ణా నది ఒడ్డున పట్టుకున్న కృష్ణ జంకను బహ దూర్‌పురాలోని కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అన్వర్ అలీ, మహ్మద్ జావేద్ సిటీకి తీసుకొచ్చారు. కేజీ రూ.3 వేల చొప్పున దీని మాంసం విక్రయించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ వీరికి చెక్ చెప్పింది. -
గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ
సాక్షి, మిర్యాలగూడ : గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ పట్టణం మారింది. అత్యాశతో తక్కువ కాలంలో ఎక్కువగా సంపాదించాలనే కొందరు యువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అభం శుభం ఎరుగని మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. గత కొద్ది రోజులుగా మిర్యాలగూడ పట్టణంలో గంజాయి విక్రయాలు జోరందుకున్నాయి. విద్యార్థులు, యువకులు సైతం విక్రయాలు సాగిస్తూ దాని మైకంలో జరుగుతున్న దారుణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగాజి మత్తులో యువకులు చేస్తున్న దారిదోపిడీలు, చోరీలు పోలీసులకు సైతం సవాలుగా మారాయి. పోలీసుల విచారణలో మైనర్లు పట్టుబడడం ఆందోళన కలిగించే విషయం. వైజాగ్ నుంచి దిగుమతి.. కొంత మంది యువకులు ముఠాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. చిన్నచిన్న పొట్లాలలో ప్యాకింగ్ చేస్తూ స్థానిక యువకులకు విక్రయాలు సాగిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.200 నుంచి వెయ్యి వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందుతూ జల్సాలు చేస్తున్నారు. గతంలో పట్టుబడి మైనర్లను విచారించిన పోలీసులకు విస్తు గొలిపే వాస్తవాలు తెలియడంతో నివ్వెరపోయారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వారి వైఖరిని ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసుల ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. బైక్‌లకు ప్రత్యేక కోడ్..! మిర్యాలగూడ పట్టణంలో గంజాయిని విక్రయించే సింబల్‌గా కొంతమంది యువకులు తమ బైక్‌లకు గంజాయి ఆకుల గుర్తులు కలిగిన స్టిక్కర్లు వేయించారు. ఈ గుర్తుల ఆధారంగా పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నారు. సరిహద్దులోని దాచేపల్లి, నాగార్జునసాగర్, సూ ర్యాపేట, హాలియా వంటి ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తూ యువకులను మత్తులో చిత్తు చేస్తున్నారు. కాగా పట్టణంలోని శివారు ప్రాం తాలైన రవీంద్రనగర్ కాలనీ, ప్రకాశ్‌నగర్, హనుమాన్‌పేట, నాగార్జుననగర్, రాజీవ్‌చౌక్, బైపాస్ దాబాల వద్ద గంజాయి విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. బైక్‌లపై ఉన్న సిక్కర్ ఆధారంగా గంజాయి కావాలనుకునే వారు ఆ బైక్‌ల వద్దకు వచ్చి గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. దారిదోపిడీలకు పాల్పడుతున్న యువత గంజాయి మత్తుకు అలవాటు పడిన యు వత జల్సాల కోసం దారిదోపిడీలకు సైతం పాల్పడుతుంది. ఇటీవల అద్దంకి– నార్కెట్‌పల్లి బైపాస్ రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తిని అడ్డగించిన కొంతమంది యువకులు దాడిచేసి రూ.2వేల నగదు, బంగారు చైన్‌ను అపహరించారు. పట్టణంలోని పలుచోట్ల బైక్‌లు, ఆటోలను సైతం దొంగిలించారు. తీగలాగితే డొంక కదిలినట్లు పట్టణంలోని శరణ్యగ్రీన్ హోంలో చైన్చోరీ విషయంలో సీసీ పుటేజిని పరిశీలించారు. పోలీసులు నింది తులను పసిగట్టే పనిలో భాగంగా పట్టణంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా గంజాయికి బానిసలుగా మారిన మైనర్లు ఈ దారిదోపిడీకి పాల్పడినట్లు గుర్తించి వారితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమార్జనకు ఆశపడి.. మిర్యాలగూడ అర్బన్ : జల్సాలకు అలవాటు పడి, అక్రమార్జనకు ఆశపడిన యువకులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. చివరకు కటకటాల పాలయ్యారు. గురువారం పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వర్రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం జల్మాల్‌కుంట గ్రామానికి చెందిన నూనవత్ నాగయ్య అలియాస్ నాగరాజు, భూక్యా చందు, దుపాడు గ్రామానికి చెందిన కొప్పోజు సతీష్, న్యూ బంజారాహిల్స్ తండాకు చెందిన నూనావత్ రమేష్ విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే తలంపుతో నునావత్ సుధాకర్, బానోతు సుధాకర్, గూగులోతు సైదా, జర్సుల మస్తాన్, ఆంగోతు నాగరాజు, ధీరావత్ ముని, బానోతు రమేష్‌ల వద్ద గత ఆగస్టు, జూలై నెలలో 70కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఆ గంజాయిని కిలో ఒక్కంటికి వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసిన పై నలుగురు వ్యక్తులు 10నుంచి 15గ్రాములుగా చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నేరేడుచర్ల, నకిరేకల్, నల్లగొండ ప్రాంతాల్లో 52కిలోల గంజాయిని విక్రయించారు. మిగిలిన 18కిలోల గంజాయిని కూడా విక్రయించాలని గురువారం మధ్యాహ్నం స్విప్ట్ కారులో గల సైడ్ డోర్లో పెట్టి పట్టణంలోని రవీంద్రనగర్ గల నాగరాజు ఇంటికి తరలిస్తుండగా చిల్లాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీల్లో పట్టుకున్నట్లు తెలిపారు. కాగా ఈ కేసులో నూనావత్ నాగయ్య అలియాస్ నాగరాజు, భూక్యా చందు, కొప్పోజు సతీష్, నూనావత్ రమేష్‌లను అరెస్టు చేసి వారి నుంచి 18కిలోల గంజాయి, స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురు వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు గంజాయి విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వారిపై నిఘా పెంచుతాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలపై కూడా నిఘా పెంచి విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతాం. మైనర్లు మత్తుకు బానిసలుగా మారకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. వారి తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెట్టాలి ఇతర వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూసుకోవాలి. – వై.వెంకటేశ్వర్రావు, డీఎస్పీ -
500 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, వరంగల్: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 500 కిలోల గంజాయి, రెండు నాటు తుపాకులు, 11 రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తి, బొలెరో వాహనం, ఐదు సెల్ఫోన్లు, రూ.1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. నిందితుల్లో వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన దండెబోయిన సుమన్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అన్నవరానికి చెందిన వంతల విజయ్, గిమ్మెల రంగారావు, వంతల నర్సింగరావు, మరో నిందితుడు బాల నేరస్తుడు ఉన్నాడని చెప్పారు. -
స్మగ్లింగ్‌కు 'రెడ్' సిగ్నల్
సాక్షి, అమరావతి: ఎర్ర చందనాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తే స్మగ్లింగ్ తగ్గుతోంది. ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని కాలంలో మాత్రం అక్రమ రవాణా భారీగా పెరిగిపోతోంది. ఎర్ర చందనంతో తయారుచేసిన వస్తువుల్ని కలిగి ఉండటాన్ని చైనా, జపాన్ దేశాల్లో సంపన్నులు స్టేటస్ సింబల్‌గా, శుభప్రదంగా భావిస్తుంటారు. అందువల్ల ఎర్ర చందనం దుంగలకు ఆ దేశాల్లో డిమాండ్ ఎక్కువ. మన రాష్ట్రం నుంచి ఆ దేశాలకు అధికారికంగా ఎర్ర చందనం ఎగుమతి చేస్తే స్మగ్లర్లను ఆశ్రయించి కొనుగోలు చేయాల్సిన అవసరం అక్కడి వ్యాపారులకు ఉండదు. దీనివల్ల స్మగ్లింగ్ తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కలపను ఎగుమతి చేయని సమయంలో అక్కడి వ్యాపారులు స్మగ్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం చెట్లను నరికించి అక్రమ మార్గాల్లో చైనా, జపాన్ దేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేస్తున్నారు. ఆ సంవత్సరాల్లో భారీగా స్మగ్లింగ్.. 2009–10 నుంచి 2013–14 వరకూ ఎర్రచందనం ఎగుమతి చేయలేదు. దీంతో ఆ కాలంలో చైనా, జపాన్ దేశాలకు భారీగా స్మగ్లింగ్ జరిగింది. ఆ సంవత్సరాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి అధిక పరిమాణంలో ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సంవత్సరాల్లో ఎక్కువ స్మగ్లింగ్ జరిగినందునే దాడుల్లో ఎక్కువ కలప దొరికిందని అటవీ శాఖ అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2005–06 నుంచి గణాంకాలు పరిశీలిస్తే చట్టబద్ధంగా ఎర్రచందనం ఎగుమతులు చేసిన సంవత్సరాల్లో స్మగ్లింగ్ తక్కువగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు ఎర్రచందనం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చింది. అప్పట్లో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకుని అటవీ శాఖ గిడ్డంగుల్లో దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగల్ని 2014–15 నుంచి 2018–19 వరకూ ఏటా అటవీ శాఖ టెండర్ల ద్వారా విక్రయించి విదేశాలకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఆ సంవత్సరాల్లో అక్రమ రవాణా తగ్గిపోయింది. ఆయా సంవత్సరాల్లో అటవీ శాఖ దాడుల్లో దొరికిన కలప, నమోదైన కేసులు తక్కువగా ఉండటం స్మగ్లింగ్ తగ్గిందనడానికి నిదర్శనమని అటవీశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. దేశంలోనే అరుదైనది దేశంలోనే అరుదైన ఎర్ర చందనం వృక్ష సంపద మన రాష్ట్రంలోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 5.83 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. నల్లమల కొండల్లో ఎర్ర చందనం అధికంగా లభ్యమవుతోంది. ఈ వృక్షాల పెరుగుదలకు ఈ ప్రాంతం అనువైనది కావడమే ఇందుకు కారణం. అనుమతి కోసం కేంద్రానికి వినతి చైనా, జపాన్ దేశాలకు ఎర్ర చందనం ఎగుమతి చేసిన కాలంలో స్మగ్లింగ్ తగ్గిపోయింది. స్మగ్లింగ్ కట్టడి కోసం ఏటా వెయ్యి టన్నుల ఎర్ర చందనాన్ని విక్రయించి.. విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి త్వరలో విజ్ఞప్తి చేయనుంది. – ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
పాక్‌కు చివరి హెచ్చరిక
ఇస్లామాబాద్: ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు, ద్రవ్య అక్రమ రవాణా అరికట్టే విషయంలో ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేదంటే బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం ఖాయమని ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌కు చివరి హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో భాగంగా ఉగ్రమూకలకు ఆర్థిక తోడ్పాటుకు ముగింపు పలికేందుకు పాకిస్తాన్‌కు మరో నాలుగునెలల సమయాన్నిచ్చింది. 2020 ఫిబ్రవరి నాటికి 27 అంశాలతో కూడిన ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ఆర్థిక ఆంక్షలు తప్పవని ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు జియాంగ్మిన్ లియూ హెచ్చరించారు. పారిస్‌లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరుగుతున్నాయి. పూర్తిగా విఫలమైంది... పాక్‌ని ప్రస్తుతం ‘గ్రే లిస్ట్’లో కొనసాగించినా, లేక ‘డార్క్ గ్రే లిస్ట్’లో ఉంచినా ఆర్థిక ఆంక్షల చట్రం బిగుసుకుంటుంది. ఐఎంఎఫ్ నుంచి గానీ, యూరోపియన్ యూనియన్ నుంచి గానీ పాక్‌కు ఏవిధమైన ఆర్థిక సాయం ఉండదు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ తీవ్రంగా విఫలమైందని ఎఫ్ఏటీఎఫ్ సభ్యులంతా ముక్తకంఠంతో విమర్శించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అదుపుచేయడం, డబ్బు అక్రమరవాణాకి స్వస్తిపలికేందుకు అదనపు చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ ఆదేశించింది. యాక్షన్ టాస్క్‌ఫోర్స్ నిర్దేశించిన 27 అంశాల్లో కేవలం ఐదంశాలను మాత్రమే పాక్ సరిగ్గా అమలు చేయగలిగిందని తెలిపింది. ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు నిలిపివేయాలంటూ 2018లో పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’ లో పెట్టింది. లక్ష్యాలను చేరుకోవాలి.. అంతర్జాతీయ ఆర్థిక సమర్థత కోసం ఏర్పాటు చేసిన ఎఫ్ఏటీఎఫ్ 1989 నుంచి ప్రభుత్వ అంతర్ సంస్థగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 205 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ ప్లీనరీ సమావేశాల్లో ఐఎంఎఫ్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థలు పాల్గొన్నాయి. లష్కరే తోయిబా వ్యవ స్థాపకుడు హఫీజ్ సయీద్, జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ లాంటి ఉగ్రనేతలను కట్టడి చేయాలని పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించింది. -
కేరళలో 123 కేజీల బంగారం సీజ్
కొచ్చి: కేరళలోని త్రిసూర్ జిల్లాలో రూ.50 కోట్ల విలువ చేసే దాదాపు 123 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్రంలో స్మగ్లింగ్ సిండికేట్‌పై జరిగిన ఆపరేషన్‌లో భాగంగా జిల్లాలో 23 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారాన్ని సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ (ప్రివెంటివ్) సుమిత్ కుమార్ తెలిపారు. స్మగ్లర్లు తమిళనాడులోని వివిధ నగరాల నుంచి బంగారాన్ని సేకరించి, రోడ్డు మార్గం ద్వారా త్రిసూర్‌కు అక్రమంగా రవాణా చేశారని పేర్కొన్నారు. అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న మొత్తం 17 మందిని పట్టుకున్నామని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని తెలిపారు. బంగారంతోపాటు రూ.2 కోట్ల నగదు, రూ.6.40 లక్షల విలువ చేసే అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
ఇండోనేషియా టు హైదరాబాద్ వయా దుబాయ్
సాక్షి, సిటీబ్యూరో: బంగారం... ఎలక్ట్రానిక్ వస్తువులు... మాదకద్రవ్యాలు మాత్రమే కాదు సిగరెట్ల సైతం పెద్ద ఎత్తున నగరానికి అక్రమ రవాణా అవుతున్నాయి. ఈ తరహా స్మగ్లింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటంతో పాటు ప్రజారోగ్యానికి చేటని అధికారులు పేర్కొంటున్నారు. నగరానికి అక్రమంగా వచ్చిన సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న వ్యక్తిని తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.6 లక్షల విలువైన 3300 విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విక్రయంపై నిషేధం కొనసాగుతోందని టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ మంగళవారం వెల్లడించారు. నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో 23 బ్రాండ్లకు చెందినవిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే బ్లాక్, గరమ్‌లతో పాటు ఎస్సీ, మోండ్, మల్‌బొరొ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు తెలిపారు. ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. దుబాయ్ మీదుగానే సిటీకి వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కస్టమ్స్ సహా వివిధ విభాగాల కళ్లు గప్పేందుకు సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువుల పేరుతో అక్రమ రవాణా జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఇలా నగరానికి వచ్చిన సిగరెట్లను సంతోష్ దవే అనే వ్యక్తి తన వద్ద స్టాక్ చేసుకుని హోల్‌సేల్‌గా రిటైలర్లకు విక్రయిస్తున్నాడు. అఫ్జల్‌గంజ్‌కు చెందిన ఇతను ఫీల్ఖానాలో మహాలక్ష్మీ మార్కెటింగ్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం పేరుతో స్మగుల్డ్ సిగరెట్లనూ అమ్ముతున్నాడు. దీనిపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, గోవింద్ స్వామి, జి.శ్రీనివాస్‌రెడ్డి, సి.వెంకటేష్ సదరు సంస్థపై దాడి చేశారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ.6 లక్షల విలువైన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఆరోగ్యానికి చేటు..ఆదాయానికి గండి ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులకు నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవులో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికి ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీ రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. సిటీలోని సంతోష్ లాంటి హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ ముఠాలు వారి ద్వారా సిగరెట్లను మార్కెట్లోని తీసుకెళుతున్నారు. ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇండోనేషియా సహా మరికొన్ని దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేదానిపై స్పష్టత లేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్లిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి హాని చేస్తాయిని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఈ అక్రమ సిగరెట్లపై హెచ్చరిక బొమ్మలు కూడా ఉండవని, ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. -
రూ.37 లక్షల ఎర్రచందనం స్వాధీనం
సాక్షి, చిత్తూరు(కేవీబీపురం) : రెండు వాహనాలతో సహా రూ.37 లక్షలు విలువచేసే 33 ఎర్రచందనం దొంగలను కేబీపురం పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు డీఎస్పీ మురళీధర్ మీడియాకు తెలిపిన వివరాలు..మండలంలోని జ్ఞానమ్మకండ్రిగ, బంగారమ్మ కండ్రిగ గ్రామాల నడుమ మారుమూల ప్రాంతం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ఉంచారు. వేకువ జామున టీఎన్ 07 బీవీ 6699 నంబరు కలిగిన ఇన్నోవా వాహనంపై ఎస్ఐ గోపి తన సిబ్బందితో దాడి చేశారు. ఇన్నోవాను, తమిళనాడుకు చెందిన ఇన్నోవా డ్రైవర్ కార్తీక్ అదుపులోకి తీసుకున్నారు.అలాగే ఆ వాహనానికి పైలెట్లుగా వ్యవహరిస్తున్న కేవీబీపురానికి చెందిన కరుపారెడ్డి బాలా(23), పురుషోత్తం(20) నుంచి రెండు బైక్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవాను పరిశీలించగా అందులో 33 ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు గుర్తించారు. ఎర్ర దుంగల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న మరికొందరి పేర్లను ప్రాథమిక విచారణలో నిందితుల నుంచి తెలుసుకున్నారు. వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడిన యువకులు స్మగ్లర్ల ప్రలోభాలకు లొంగిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, ముఖ్యంగా మండలంలోని కొన్ని గ్రామాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లకు సహకారం అందుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ చెప్పారు. వారిపై ఇప్పటికే నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఎస్ఐతోపాటు పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ జయరామిరెడ్డి, సిబ్బంది నరేష్, రాజా, చిరంజీవి, దాము, గంగాధర్‌ను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సీఐ ఈశ్వర్, ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఎస్ఓ చక్రపాణి, ఎఫ్బీఓ వేణుగోపాల్, బీట్ ఆఫీసర్లు మస్తాన్, కేవీబీపురం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇదలా ఉంచితే, తొలుత డీఎస్పీ, పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. పుత్తూరులో రూ.18లక్షల ‘ఎర్ర’దుంగలు.. పుత్తూరు : ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన పుత్తూరులో చోటుచేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ సుబ్రమణ్యం కథనం... మండలంలో తడుకు ఫారెస్ట్ బీట్ పరిధిలోని మూలకోన నుంచి ఎర్రచందనంను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధమవుతున్నారని సమాచారం అందడంతో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గంగాధరం నేతృత్వంలో అటవీశాఖ అధికారులు నిఘా ఉంచారు. మంగళవారం వేకువజామున మూలకోనలో స్మగ్లర్లపై దాడులు చేశారు. అటవీ అధికారులను గమనించిన స్మగ్లర్లు దుంగలను పడేసి పరారయ్యారు. సంఘటన స్థలంలో 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన నిందితులు మండలంలోని నేసనూరుకు చెందిన టి.గంగాధరం, కే.చెంగా రెడ్డి, ఎం.మునిరత్నం, కే.కృష్ణారెడ్డి, కేబీఆర్ పురం గ్రామానికి చెందిన అన్నా లోకనాథం అని ప్రాథమిక విచారణలో గుర్తించారు. స్వాధీనం చేసుకున్న దుంగల బరువు 570 కిలోలు ఉందని, వీటి విలువ దాదాపు రూ.18లక్షలని రేంజర్ చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. రూ.15లక్షల పైచిలుకు ‘ఎర్ర’దుంగలు... రేణిగుంట : రేణిగుంట మండలం జీవాగ్రం కూడలి వద్ద మంగళవారం తెల్లవారుజామున వాహనం సహా ఎర్రచందనం దుంగలను గాజులమండ్యం పోలీసులు పట్టుకున్నారు. సీఐ అమరనాథరెడ్డి కథనం ... తెల్లవారుజామున 3.30గంటల సమయంలో కూడలి వద్ద వడమాలపేట ఎస్ఐ సునీల్, పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా చెక్‌పోస్ట్ వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ లగేజి ఆటో కొంత దూరంలో ఆగింది. తనిఖీలను గమనించిన ఆటో డ్రైవర్ లగేజి ఆటోను అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో పోలీసు సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ఆటోను పరిశీలించారు. అందులో 44ఎర్రచందనం దుంగలను గుర్తించి వాహనంతో సహా స్వాధీనం చేసుకున్నారు. దుంగలను ఆటోతో సహా ఫారెస్ట్ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేశారు. ఎర్రచందనం విలువ రూ.15లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ‘ఎర్ర’స్మగ్లర్ల అరెస్ట్ పిచ్చాటూరు : ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు పుత్తూరు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. మంగళవారం పిచ్చాటూరు పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు.. గత వారం పిచ్చాటూరు పోలీసులు ముందస్తు సమాచారం మేరకు వెంగళత్తూరులోని కిచ్చా(23) అనే వ్యక్తి ఇంట్లో రవాణాకు సిద్ధంగా ఉంచిన రూ.8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను దాడి చేసి స్వాధీనం చేసుకోవడం విదితమే. ఆ సమయంలో ఇంట్లో కిచ్చా లేడు. ఈ నేపథ్యంలో అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మంగళవారం కిచ్చాతోపాటు మరో స్మగ్లర్ సంగీతరాజు (27) వేలూరు క్రాస్ వద్ద సంచరిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సత్యవేడు కోర్టులో వీరిని హాజరు పరచనున్నట్టు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఈశ్వర్, ఎస్ఐ దస్తగిరి, ఏఎస్ఐ సుబ్రమణ్యం నాయుడు, రైటర్ లోకనాథం, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుళ్లు మురళి, విజయశేఖర్ పాల్గొన్నారు. -
‘ఫ్యాన్సీ’ గా అక్రమ సిగరెట్ల వ్యాపారం
సాక్షి, సిటీబ్యూరో: బేగంబజార్ పరిధిలోని ఫీల్ఖానాలో ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం చేస్తున్న మంగిలాల్ జైన్ దాని ముసుగులో అక్రమ సిగరెట్ల దందా మొదలెట్టారు. బంగ్లాదేశ్ నుంచి మూడు మెట్రో నగరాల మీదుగా సిటీకి వస్తున్న ఈ సరుకును విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. మంగిలాల్‌ను పట్టుకోవడంతో పాటు రూ.2 లక్షల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం తెలిపారు. గోషామహల్ ప్రాంతానికి చెందిన మంగిలాల్ ఫీల్ఖానాలో ప్రియ నావెల్టీస్ పేరుతో ఫ్యాన్సీ వస్తువులు, సౌందర్య సాధనాలు, సుగంధ ద్రవ్యాలు విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం అక్రమ సిగరెట్ల దందా కూడా ఇదే కార్యాలయం నుంచి మొదలెట్టాడు. ఇండోనేషియాలో తయారైనట్లు అనుమానిస్తున్న ప్యారిస్, విన్, మోండ్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు బంగ్లాదేశ్ మీదుగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. వీటిని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కోల్‌కతాలకు చెందిన కొందరు అక్రమ వ్యాపారాలు హోల్‌సేల్‌గా ఖరీదు చేసి హైదరాబాద్‌లోని ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. రైలులో ఇక్కడకు చేరుకున్న ఈ బ్రాండ్లకు చెందిన సిగరెట్లను మంగిలాల్ తన దుకాణంలోనే నిల్వ చేస్తున్నాడు. ఒక్కో సిగరెట్ ప్యాకెట్‌ను రూ.6కు ఖరీదు చేస్తున్న ఇతగాడు వివిధ దుకాణదారులకు రూ.20 నుంచి రూ.25కు విక్రయిస్తున్నాడు. ఇది వినియోగదారుడికి చేరేసరికి రూ.30 నుంచి రూ.40కి చేరుతోంది. తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశంతో అనేక మంది వీటిని కొని కాలుస్తూ బానిసలుగా మారుతున్నారు. ఈ దందా ద్వారా ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడుతోంది. ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. మంగిలాల్ వంటి వ్యాపారులు ఈ అక్రమ దందా చేయడం ద్వారా ఈ డ్యూటీతో పాటు జీఎస్టీ సైతం పరోక్షంగా భారీగా ఎగ్గోడుతున్నారు. ఇతడి దందాపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు తమ బృందాలతో దాడి చేసి పట్టుకున్నారు. ఇతడి నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
అరుదైన అలుగును విక్రయిస్తూ..
సాక్షి, పెద్దదోర్నాల : అరుదైన పంగోలిన్ జాతి జంతువు అలుగును విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు పట్టుకొని జంతువును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పెద్దదోర్నాలలో బుధవారం చోటుచేసుకుంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని కడపరాజుపల్లెకు చెందిన కర్రావుల పెద్దిరాజులు మంగళవారం రాత్రి నల్లమల అటవీ ప్రాంతంలో అలుగును పట్టుకున్నాడు. వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో అంతరించి పోయే జంతువుల జాబితాలో ఉన్న అలుగును రహస్యంగా విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. బుధవారం మధ్యాహ్నం మార్కాపురం పరిసర ప్రాంతంలో అలుగును విక్రయించే ప్రయత్నం చేస్తున్నట్టు గుర్తించి, కొనుగోలుదారులుగా అక్కడికి వెళ్లిన అధికారులు అలుగుతో సహా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో అలుగుకు డిమాండ్.. సాధారణంగా మెత్తటి ఇసుక నెలల్లో బొరియలు చేసుకొని చీకటి వేళల్లో సంచరించే జంతువు అలుగు. ఇది ఎక్కువగా చీమలు, చెదుపురుగులు, చిన్న కీటకాలు తిని జీవిస్తాయి. ఇది సాధారణంగా 10 నుండి 16 కేజీల బరువు వుండి, శరీరంపై 160 నుంచి 200 పొలుసులు కలిగి ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక పిల్లను పెట్టి పాలిచ్చి సాకుతుంది. వీటికి ఇతర దేశలలో డిమాండ్ ఉండటం వలన ఎక్కువ రేటు పలుకుతుంది. దీని పొలుసులను చైనా దేశంలో సంప్రదాయ వైద్యంలో లైంగిక పటుత్వం కోసం, ఆభరణాలు తయారీలో వాడుతారు. దీని చర్మం బూట్లు, చెప్పుల తయారీలో వాడుతారు. ఈ కారణంగా వీటిని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేయటం వలన అవి వేగంగా అంతరించి పోయే దశలో ఉన్నాయి. దీనిని వేటాడితే వన్యప్రాణల సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. -
నందలూరులో రూ.25వేలకే బుల్లెట్!
సాక్షి, రాజంపేట: బుల్లెట్ రూ.25 నుంచి రూ.35వేలకే వస్తోందంటే ఆశ్చర్యమే కదూ... వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో పలువురు యువకుల చేతిలో బుల్లెట్ కనిపిస్తోందంటే ఇదే కారణం అన్న భావన వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే కర్ణాటక నుంచి నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్, పల్సర్ లాంటి బైకులను తీసుకొచ్చి అతి తక్కువ ధర విక్రయించే ముఠా వ్యవహారం నందలూరులో బట్టబయలైంది. రూ.1లక్షకు పైగా ఉన్న బుల్లెట్ ద్విచక్రవాహనం ధర రూ.50 వేలకే లభ్యం కావడంతో యువత ఎగబడి కొన్నారు. నందలూరు పోలీసులకు అనుమానం వచ్చి రెండురోజుల కిందట బుల్లెట్ వాహనాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. వీటిని స్మగ్లింగ్ చేసే అసలు వ్యక్తి కోసం పోలీసులు రంగంలోకి దిగారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను స్టేషన్‌కు తరలించారు. -
గుట్టుగా.. రేషన్ దందా!
నిఘా నిద్రపోతోంది. పేదల బియ్యం పక్కదారి పడుతోంది. నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.కిలో బియ్యం పథకం జిల్లాలో దళారుల పొట్ట నింపుతోంది. జిల్లాకు చెందిన కొందరు దళారులు రోడ్డు మార్గమే రాచమార్గంగా ఈ బియ్యాన్ని గద్వాల మీదుగా గుట్టుగా సరిహద్దు దాటిస్తున్నారు. ఇంకొందరు జిల్లాలోని రైస్ మిల్లులకు తరలిస్తుండగా ఆ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి అదే బియ్యాన్ని మళ్లీ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఇదే బియ్యం కోళ్ల దాణాగా మారుతోంది. నిఘా నిద్రపోతోంది. పేదల బియ్యం పక్కదారి పడుతోంది. నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.కిలో బియ్యం పథకం జిల్లాలో దళారుల పొట్ట నింపుతోంది. జిల్లాకు చెందిన కొందరు దళారులు రోడ్డు మార్గమే రాచమార్గంగా ఈ బియ్యాన్ని గద్వాల మీదుగా గుట్టుగా సరిహద్దు దాటిస్తున్నారు. ఇంకొందరు జిల్లాలోని రైస్ మిల్లులకు తరలిస్తుండగా ఆ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి అదే బియ్యాన్ని మళ్లీ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఇదే బియ్యం కోళ్ల దాణాగా మారుతోంది. సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం దందా బహిరంగ రహస్యంగా సాగుతోంది. గ్రామాల్లో తిరిగి సేకరించిన బియ్యాన్ని నిల్వ ఉంచి రెండ్రోజులకోసారి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఆటోలు, డీసీఎం, ప్యాసింజర్ ఆటోలు, జీపుల్లో తరలిస్తూ ఉమ్మడి జిల్లాలో ఏదో చోటా నిత్యం పట్టుబడుతూనే ఉన్నారు. గడిచిన మూడు నెలల వ్యవధిలో వేలాది క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ దందా మితిమీరగా స్పందించిన పౌరసరఫరాల అధికారి వనజాత ఆరుగురు డీలర్లపై చర్యలు తీసుకున్నారు. ఈ–పాస్ వచ్చినా.. గతంలో కొందరు డీలర్లు తమ దుకాణానికి వచ్చిన కోటా నుంచి కొంత బియ్యం మిగుల్చుకునే వారు. ఇంకొందరు పేదలకు ఇవ్వాల్సిన బియ్యంలో సగం కోటా ఇవ్వకుండా దళారులకు విక్రయించి జేబులు నింపుకునే వారు. దళారు లు ఆ బియ్యాన్ని రైస్ మిల్లర్లకు విక్రయించేవారు. మిల్లర్లు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఎవరికీ చిక్కకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించేవారు. అక్రమంగా తరలుతున్న, నిల్వ ఉంచిన బియ్యం ప్రతీరోజు ఏదో చోటా పట్టుబడేది. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బియ్యం నేరుగా లబ్ధిదారులకే చెందేలా ఈ పాస్ (బయోమెట్రిక్ ) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం లబ్ధిదారులు వేలి ముద్రలు వేసి రేషన్‌షాపుల ద్వారా బియ్యాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో డీలర్లు అందించిన రేషన్‌బియ్యాన్ని దళారులు గ్రామాల్లో తిరిగి సేకరించి కిలోకు రూ. 5 నుంచి రూ.7లకు విక్రయిస్తున్నారు. దళారులు ఆ బియ్యాన్ని కిలోకు రూ. 10ల చొప్పున పలు రైస్‌మిల్లుల యజమానులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మిల్లర్లు అదే బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి, బహిరంగ మార్కెట్లో రూ. 25 నుంచి రూ. 30 చొప్పున అమ్ముతున్నారు. ఇంకొందరు దళారులు బియ్యాన్ని గద్వాల మీదుగా రాయిచూర్‌కు తరలించి అక్కడ రూ.12 నుంచి రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. నిఘా వైఫ్యలమే.. పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పక్షంరోజుల వ్యవధిలో బిజినేపల్లి మండలంలో రెండు సార్లు దాడులు నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బిజినపల్లి కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా పెద్ద ఎత్తున సాగుతున్నా స్ధానిక అధికారులకు సమాచారం లేకపోవడం గమనార్హం. మరోపక్క ఉమ్మడి జిల్లాలో చాలా వరకు బియ్యం వివిధ మార్గాల్లో పోలీసుల తనిఖీల్లోనే పట్టుబడుతుంది. ఇలాంటి సంఘటనలు అక్రమంగా తరలుతున్న బియ్యంపై స్ధానిక అధికారుల నిఘా వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారీ మొత్తంలో బియ్యం ఇతర ప్రాంతానికి తరలుతుంటే అధికారులు మొద్దునిద్ర పోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. -
స్మగ్లింగ్ స్పెషలిస్ట్
సాక్షి, సిటీబ్యూరో: ‘జీరో నెంబర్’ దందా చేసే మైసూర్ వాసి రాజు నాంగ్రే పసిడి, డబ్బు రవాణాలు కారుల్లో ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి డ్రైవర్లుగా పని చేసే వారికి ఓ కీలక విషయంలో తర్ఫీదు కూడా ఇచ్చాడు. వివిధ రాష్ట్రాలకు తిరిగే వీళ్ళు ఏదైనా నేరం బారినపడితే స్థానిక పోలీసులకు ఇచ్చే ఫిర్యాదులో ఎక్కడా బంగారం, డబ్బు విషయం ప్రస్తావించకుండా కౌన్సిలింగ్ చేశాడు. ‘పన్ను’పోటు తప్పించుకోవడానికే ఈ ఎత్తులు వేశాడు. ఫలితంగానే గతంలో కేరళ, కర్ణాటక పోలీసులతో కలిసి మేనేజ్ చేసుకుంటూ తన దందాను రికార్డుల్లోకి ఎక్కించలేదు. ఈసారి నేరం సైబరాబాద్‌లో జరగడంతో అతడికి ఆ చాన్స్ లేకుండా పోయింది. షాద్‌నగర్ ఠాణా పరిధిలోని రాయకల్ టోల్‌ప్లాజా సమీపంలో గత నెల 28న జరిగిన బందిపోటు దొంగతనం కేసులో ఉన్న కీలకాంశమిది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల్ని సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. అక్రమ బంగారంగా అనుమానం... మహారాష్ట్రకు చెందిన రాజు నాంగ్రే మైసూర్లో స్థిరపడ్డారు. అక్కడ ఉంటూనే కేరళ నుంచి తక్కువ ధరకు బంగారం ఖరీదు చేస్తుంటాడు. ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది విదేశాల్లో ఉంటున్నారు. స్థానిక ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న రాజు ఆయా దేశాల నుంచి వాళ్ళు తిరిగి వచ్చేప్పుడు బంగారం అక్రమంగా తీసుకువచ్చేలా చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా దేశంలోని స్మగుల్డ్ అయిన గోల్డ్‌ను తక్కువ ధరకు వారి నుంచి ఖరీదు చేసే వాడు. దీన్ని హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉన్న బంగారం వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రయించేవాడు. వ్యాపారులకు పసిడి డెలివరీ చేయడానికి, వారి నుంచి డబ్బు వసూలు చేసుకు రావడానికి ఏడు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. ఈ వాహనాలను తీసుకువెళ్ళే, తిరిగి తీసుకువచ్చే డ్రైవర్లకు రాజు ఓ విషయం స్పష్టం చేసేవాడు. ఎక్కడైనా నేరం బారినపడితే కారులో ఉండే బంగారం, డబ్బు విషయం బయటకు చెప్పకుండానే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పదేపదే చెప్పేవాడు. తలలు పట్టుకున్న పోలీసులు... ఓ మధ్యస్థాయి కారు కోసం నలుగురు వ్యక్తులు వచ్చి, తుపాకీ చూపించి మరీ ఎత్తుకుపోవడం ఏంటని పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే అనుమానం వచ్చిన అధికారులు ఫిర్యాదుదారుడైన రాహుల్‌ను వివిధ కోణాల్లో, లోతుగా ప్రశ్నించారు. దీంతో ఆ కారులో రహస్య లాకర్ ఉండటం, అందులో రూ.3.67 కోట్ల నగదు ఉన్న విషయం బయటపెట్టక తప్పలేదు. దీంతో అసలు విషయం తెలుసుకున్న అధికారులు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ గాలించారు. చివరకు ఏడుగురు బందిపోటు దొంగల్నీ పట్టుకుని రూ.2.89 కోట్లు, బంగారం రికవరీ చేశారు. యజమాని రాజు ఎంతగా ప్రయత్నించినా నగదును రికార్డుల్లోకి ఎక్కకుండా ఆపలేకపోయాడు. ఇది భారీ మొత్తం కావడంతో ఈ విషయంపై ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాయాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నిర్ణయించారు. డీమానిటైజేషన్ తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు కలిగి ఉండటమూ నేరమే అని పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూసుకుంటారని అంటున్నారు. ఈ బందిపోటు ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు పోలీసు కమిషనర్ ప్రత్యేక రివార్డులు అందించారు. ఆ రెండు చోట్లా సాధ్యమైనా... రాజుకు చెందిన వాహనాలు బంగారం, డబ్బుతో వెళ్ళి వస్తున్నప్పుడు గతంలోనూ మాయమయ్యాయి. కొన్ని ముఠాలు ఆ కారుతో సహా సర్వం దోచుకుపోయాయి. అయినప్పటికీ అప్పట్లో ఆయా వాహనాలకు డ్రైవర్లుగా వ్యవహరించిన వాళ్ళు పోలీసులకు కేవలం వాహనం పోయిందని మాత్రమే ఫిర్యాదు చేశారు.విషయం తెలుసుకున్న ఆ పోలీసుస్టేషన్‌కు చేరుకునే రాజు అధికారులను మేనేజ్ చేయడం ద్వారా తన డబ్బు, బంగారం రికార్డుల్లోకి ఎక్కకుండానే రికవరీ చేయించుకునేవాడు. ఇలా కేరళ, కర్ణాటకల్లోనూ జరిగింది. రాయకల్‌లో బందిపోటు దొంగతనానికి గురైన వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరించిన రాహుల్ కూడా ఇలానే చేశాడు. గత నెల 28న నేరం జరిగిన తర్వాత షాద్‌నగర్ ఠాణాకు వెళ్ళాడు. గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు తనకు పిస్టల్ చూపించి, కారు పట్టుకుపోయారని ఫిర్యాదు చేశాడు. దుండగులు ఎత్తుకుపోయిన కారు మారుతి బ్రిజా అని, కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉందని అందులో పేర్కొన్నాడు. -
అడ్డదారులు తొక్కుతున్న కొందరు మహిళా ఎస్ఐలు!
సాక్షి, గుంటూరు: కొత్తగా పోలీస్ శాఖలోకి ప్రవేశించిన నాలుగో సింహాలు తడబడుతున్నాయి. అనతికాలంలోనే తప్పటడుగులు వేస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది ప్రోత్సాహంతో వసూళ్లకు పాల్పడుతున్నాయి. ప్రజా సేవ చేయాలనే తలంపుతో పోలీస్ శాఖలోకి వచ్చిన యువ ఎస్ఐలను కింది స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారు. దీంతో వారు అవినీతి ముద్ర వేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం గుంటూరు అర్బన్ జిల్లాలో 11, రూరల్ జిల్లాలో 36 మంది ప్రొహిబిషన్ ముగించుకున్న కొత్త ఎస్ఐలకు అప్పటి ఎస్పీలు స్టేషన్ పోస్టింగ్‌లు ఇచ్చారు. వీరిలో కొంత మంది తప్పటడుగులు వేస్తున్నారు. కేసుల్లో రాజీ కుదురుస్తూ నిందితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబంపై కే–ట్యాక్స్, ఉద్యోగాల్లో మోసాలు చేసిన కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కోడెల కుటుంబంపై నమోదైన ఓ కేసులో కొత్తగా నియమితులైన ఓ మహిళా ఎస్ఐ రూ.లక్ష వసూలు చేసినట్టు సమాచారం. సత్తెనపల్లి సబ్ డివిజన్లో పని చేస్తున్న మహిళా ఎస్ఐ కోడెల కుటుంబంపై నమోదైన ఓ కేసులో రాజీ కుదిర్చి రూ.25 లక్షల నగదు ఫిర్యాదుదారునికి వెనక్కి ఇప్పించారు. నగదు వెనక్కు ఇప్పించిన ఎస్ఐ.. కేసు తీసేయాలని యత్నిస్తుండటంతో ఆ విషయం ఉన్నతాధికారికి తెలిసి మందలించారు. కేసులో బాధితునికి డబ్బు తిరిగి ఇప్పించిన ఈమె రూ.లక్ష కోడెల తరఫు వ్యక్తి నుంచి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరో సందర్భంలో తన పట్ల యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై వివాహిత ఫిర్యాదు చేయగా నిందితుడి నుంచి డబ్బు తీసుకుని సదరు మహిళా ఎస్ఐ నామమాత్రపు కేస నమోదు చేసి వదిలేశారు. ఆ మరుసటి రోజే బహిర్భూమికి వెళుతున్న వివాహితపై యువకుడు లైంగికదాడియత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం వివాహిత.. భర్తకు చెప్పడంతో ఆయన తరఫు బంధువులు ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో గుంటూరులోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇదే తరహాలో వెలుగు చూడని మరికొన్ని ఆరోపణలు మహిళా ఎస్ఐపై ఉన్నట్టు తెలుస్తోంది. బియ్యం, గ్రానైట్ లారీలు చూసీచూడనట్టు.. నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని వినుకొండ నియోజకవర్గంలో ప్రొహిబిషన్ పూర్తి చేసుకుని పోస్టింగ్ పొందిన మరో మహిళా ఎస్ఐ బియ్యం, గ్రానైట్, ఇసుక అక్రమ రవాణాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తూ మామూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వినుకొండ టీడీపీకి చెందిన ఓ రేషన్ మాఫియా సభ్యుడు తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న మహిళా ఎస్ఐ అతని నుంచి డబ్బులు తీసుకుని వదిలేసినట్టు విశ్వసనీయ సమాచారం. చిన్న చిన్న ఆటోల్లో తరలిస్తున్న బియ్యాన్ని మాత్రం పట్టుకుంటూ లారీల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మాత్రం ఈమె వదిలేస్తున్నారు. ఇదే తరహాలో ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి అనధికారికంగా గ్రానైట్ తరలిస్తున్న వారి నుంచి, గుండ్లకమ్మ నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేసే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. గురజాల సబ్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న మరో మహిళా ఎస్ఐ సివిల్ వివాదంలో తల దూర్చి తనను బెదిరిస్తున్నారని ఓ బాధితురాలు స్పందనలో రూరల్ ఎస్సీకి ఫిర్యాదు చేసింది. వీరి తరహాలోనే మరి కొందరు కొత్త ఎస్ఐ అడ్డదారులు తొక్కుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రోత్సాహంతోనే.. కొత్తగా స్టేషన్ పోస్టింగ్ పొందిన ఎస్ఐలను క్షేత్ర స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారు. కొందరు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు నిందితుల నుంచి డబ్బు వసూలు చేసి కేసుల్లో రాజీ కుదర్చడం, సివిల్ సెటిల్మెంట్లు చేయించడం వంటి కార్యకలాపాలకు ఎస్ఐలను ప్రోత్సహిస్తున్నారు. వీరే మధ్యవర్తులుగా వ్యవహరించి ఎస్ఐలకు డబ్బులు వసూలు చేసి పెడుతున్నారు. మరి కొన్ని సందర్భాల్లో యువ ఎస్ఐలు దూకుడుగా వ్యవహరిస్తూ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులపై సైతం చేయి చేసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి లాఠీ ఝుళిపిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు తూట్లు పొడుస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీస్ బాస్‌లు దృష్టి సారించి యువ ఎస్ఐలను గాడిలో పెట్టాలన్న ప్రజలు కోరుతున్నారు. -
రిసార్టులు, పార్కుల్లో అలంకరణకు ఈత చెట్లను..
సాక్షి, పాలకొల్లు అర్బన్(పశ్చిమ గోదావరి) : ఈత చెట్లు ప్రకృతి సంపద. డ్రెయిన్ గట్లు, కాలువ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో, బండిదారి పోరంబోకు స్థలాల్లో ఈత చెట్లు సహజ సిద్ధంగా పెరుగుతుంటాయి. వీటిని కొందరు చెట్ల వేళ్లతో సహా తవ్వేసి తరలించుకుపోతున్నారు. కొంతమంది సంపన్నుల గృహాల ముందు, రిసార్టులు, పార్కుల్లో అందంగా అలంకరణ కోసం వీటిని అక్రమంగా తవ్వుకుపోతున్నారు. చెట్టు వేళ్లతో తవ్వేసి పార్కుల్లో తిరిగి పాతడం వల్ల ఈతచెట్టు ఏపుగా పెరిగి కొత్త ఆకులతో అందంగా కనిపిస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఇంటి ముందు ఖర్జూరం చెట్లు అందంగా కనిపిస్తుంటాయి. అదే మాదిరిగా స్వదేశంలో విదేశీ సంస్కృతికి అలవాటు పడిన కొందరు సంపన్నులు వారి గృహాల ముందు ఈత చెట్లను అందంగా అలకరించుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అభివృద్ధి చేసే పార్కుల్లో సైతం ఈత చెట్లను ఆయా కాంట్రాక్టర్లకు విక్రయించి అక్రమార్కులు సొమ్ములు చేసుకుంటున్నారు. ఉపాధికి గండి వేసవికాలంలో ఈత చెట్ల నుంచి కల్లు తీసి గీత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అలాగే యానాదులు, ఉప్పర్లు ఈతచెట్ల కొమ్మలను సేకరించి వాటి ఈనెల ద్వారా తట్టలు, బుట్టలు అల్లుకుని ఉపాధి పొందుతున్నారు. ఈత ఈనెలతో తయారు చేసిన తట్టలు, బుట్టలు రైతాంగానికి ఎంతో ఉపయోగపడే పరికరాలు. కాలువ గట్ల వెంబడి సహజ సిద్ధంగా పెరిగి చూపరులకు కనువిందు చేసే ఈతచెట్లు అక్రమార్కుల కంటపడడంతో అక్రమంగా తవ్వుకుపోతున్నారు. పట్టించుకోని అధికారులు చెట్టు కొట్టాలంటే రెవెన్యూ అధికారి అనుమతి తీసుకోవాలి. అలాగే ఇరిగేషన్ పరిధిలో ఉన్న చెట్లకు ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇది ఇలా ఉండగా గీత కార్మికుల ఉపాధికి ఉపయోగపడే ఈతచెట్టును ఎక్సైజ్ శాఖ అధికారులు పరిరక్షించాలి. అయితే అటు రెవెన్యూ, ఇరిగేషన్, ఎక్సైజ్‌శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల పని సులువుగా సాగిపోతోందన్న విమర్శలు ఉన్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి ఈతచెట్లను కొంతమంది ముఠాగా ఏర్పడి అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో మా ఉపాధికి గండి పడుతోంది. ఈతకల్లులో పోషక విలువలున్నాయి. చాలామంది ఈతకల్లు కావాలని అడుగుతుంటారు. అయితే ఈత చెట్లు అందుబాటులో ఉండక తాటి చెట్ల నుంచే ఎక్కువగా కల్లు తీసి విక్రయిస్తుంటాం. ఈత చెట్లను వేళ్లతో సహా తొలగించి వ్యాపారం చేసుకుంటున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. –జి.నరసింహరావు, గీత కార్మికుడు, ఆగర్రు -
భారీగా ‘హెచ్‌టీ’ పత్తి విత్తనాల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతులను లక్ష్యంగా చేసుకొని అనధికార హెర్బిసైట్ టొలరెంట్(హెచ్‌టీ) పత్తి విత్తనాలను బ్రాండెడ్ పత్తి విత్తనాల కంటే తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధమైన ఇద్దరు వ్యక్తులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. గుజరాత్ నుంచి రైల్వే (కార్గో) సర్వీసు ద్వారా వచ్చిన ఈ అనధికార పత్తి విత్తనాలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుట్వార్డ్ పార్శిల్ కార్యాలయం నుంచి టాటా ఏస్ వాహనంలో తరలించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రూ.32,52,110 విలువైన 2005 కిలోల బీజీ–3 (హెర్బిసైడ్ టొలరెంట్) విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. అగ్రికల్చర్ డిప్లోమో చేసి అడ్డదారి... కరీంనగర్ పట్టణానికి చెందిన రావుల రజినీకాంత్ అగ్రికల్చర్ డిప్లోమోతో పాటు ఎంబీఏ పూర్తి చేశాడు. అనంతరం ఓ పెస్టిసైడ్‌లో కంపెనీలో పనిచేసిన అతను విత్తనాల విక్రయాలు, కొనుగోళ్లపై అవగాహన పెంచుకున్నాడు. ఈ అనుభవంతో 2003లో అబిడ్స్‌లోని లెనిన్ ఎస్టేట్స్‌లో ‘ఓంకార్ అగ్రిటెక్’ పేరుతో సొంతంగా కంపెనీ ప్రారంభించాడు. 2009లో కంపెనీ పేరును ఓంకార్ సీడ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చి కొత్తపేటలోని ఓంకార్ నిలయానికి కార్యాలయాన్ని మార్చాడు. యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం, కీసరమ్ రోడ్డులో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన అతను విత్తనాల ప్రాసెసింగ్, ప్యాకింగ్ సీడ్ స్టోరేజీ యూనిట్‌ను నెలకొల్పాడు. దీంతో పాటు ‘సేద్య పొలం అగ్రికల్చర్’ మేగజైన్ నడుపుతున్నాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్రణాళిక రూపొందించాడు. ఇందులో భాగంగా 2019 ఖరీఫ్ సీజన్ కోసం అనధికారిక హెచ్‌టీ పత్తి విత్తనాలను విక్రయాలు చేపట్టాలని భావించిన అతను గుజరాత్ గాంధీనగర్‌లోని ‘అవిరాట్ అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్వాహకుడు భరత్ పటేల్‌ను సంప్రదించాడు. కిలోకు రూ.500 చొప్పున పత్తి విత్తనాలకు భారీగా కొనుగోలు చేసి అహ్మదాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు రైల్వే కార్గో ద్వారా తెప్పించాడు. అక్కడి నుంచి కీసరం రోడ్డులో ఉన్న తన ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలించి 450 గ్రాముల పత్తి విత్తనాలను ప్యాక్ చేసి సబ్ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్లకు రూ.730 చొప్పునపంపిణీ చేయాలని నిర్ణయించాడు. అయితే అహ్మదాబాద్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఎటువంటి ఇన్వాయిస్ బిల్లులు, డెలివరి చలాన్ లేకుండా సంబంధిత అధికారుల అనుమతి లేకుండా 50 గన్నీ బ్యాగ్‌ల్లో పత్తి విత్తనాలు వచ్చినట్లు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించిన అధికారులు టాటా ఏస్‌లో లోడ్ చేసిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రావుల రజనీకాంత్‌తో పాటు ఆటో డ్రైవర్ బండారి మహేష్‌ను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును గోపాలపురం పోలీసులకు అప్పగించారు. పర్యావరణానికి ప్రమాదకరం... సాగు భూమితో పాటు, పర్యావరణంతో పాటు మానవళికి ప్రమాదకరమైన ఈ హెచ్‌టీ పత్తి విత్తనాలకు జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ అనుమతి ఇవ్వలేదు. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనలను అతిక్రమించారని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారి గీతా రెడ్డి అన్నారు. ఎంఆర్పీ లేకుండా, తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీలు లేకుండా అక్రమంగా రవాణా చేసుకుని ఎక్కువ ధరకు రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులు కూడా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ తరఫున రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజీ–3లో వచ్చే కలుపు నివారణకు గ్లైపోసేట్ అనే ప్రమాదకరమైన పురుగుమందును వాడాల్సి ఉంటుందన్నారు. దీని వల్ల కేన్సర్ వచ్చే ప్రమా దం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్ధారించిందన్నారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేఎస్ రవి, శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర రెడ్డి, గోపాలపురం ఇన్స్పెక్టర్ ఎం.నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇంతకూ ఎవరిదీ అడవి?
అడవులను రక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, స్మగ్లర్లకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో అటవీశాఖ అధికారులు స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే అభియోగాలతో ఇటీవలి కాలంలో 11 మందిని అటవీశాఖ సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ స్థాయి నుంచి గార్డు వరకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మెమో జారీ చేశారు. కానీ అడవి సర్వనాశనం కావడానికి ఎవరు కారణమో ఆ స్మగ్లర్లు, వారి వెనుకవున్న రాజకీయనేతలు మాత్రం హాయిగా ఉన్నారు. వడ్రంగం మీద అధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయి. వారికి చేతి వృత్తి తప్ప మరో జీవనాధారం లేదు. వారి పనిముట్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కార్పెంటర్ లక్ష్మీకాంతం అధికారుల దాడిలో గుండెపోటుతో మరణించాడు. పెద్ద పెద్ద దొంగ వ్యాపారం చేస్తున్న వారిని వదిలి నాగళ్ళూ, ఇతర వ్యవసాయ పరికరాలు, పేద మధ్యతరగతికి అవసరమయ్యే మంచాలు, కుర్చీలు, తలుపులు, కిటికీలు, రోకలిబండ, ఇసుర్రాతి బొడ్దె వంటివి తయారు చేస్తూ బతికే వారిని నేరస్తులుగా చూపించడంకన్న దుర్మార్గం మరోటి ఉండదు. ఇప్పటికే అడవిని ఆదివాసులు నాశనం చేస్తున్నారని పెద్ద గోల చేసిన పాలకులు అవసరమైతే పీడీ చట్టం క్రింద కేసు పెడతామని బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారు. పంట సంరక్షణ కోసమైనా సరే రైతాంగం అడవి జంతువుకు నష్టం కలిగిస్తే ఏడేళ్ల జైలు శిక్ష ఉంటుందని అంటున్నారు. అసలు అటవీ దొంగలు ఎవరూ? ఎవరిని శిక్షించాలని ప్రభుత్వం చూస్తోందనేది ప్రశ్న. ‘‘జంగిల్ బచావో జంగిల్ బడావో’’ నినాదంతో పోలీసు, ఫారెస్టు శాఖలు కలిసి పని చేస్తాయని ఇకమీదట ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగుతాయని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. ప్రభుత్వ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకొన్నట్టు కనిపించినా, అడవిపై పట్టుకోసం శతాబ్దాలుగా పాలకులు చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపే ఇది. అటవీ సంరక్షణ అనేది కేంద్రం అధీనంలో ఉన్న ఉమ్మడి జాబితాలోని అంశం. రాష్ట్రంలోగానీ కేంద్రంలోగానీ ఇప్పటివరకు తీసుకొన్న విధాన నిర్ణయాలు, చేసిన చట్టాలు పరిశీలిస్తే ఏ పేరు మీద చట్టాలు తయారు చేయబడతాయో... చివరికి ఆయా చట్టాలు ఎవరికి వ్యతిరేకంగా పని చేస్తాయో కూడా తెలుస్తుంది. అడవి ప్రకృతి సంపద. పాలకుల దాష్టీకానికి పర్యావరణం బలైపోయింది. కానీ ప్రకృతి సిద్ధంగా రావలసిన ప్రాణవాయువును అడవిలో జీవిస్తున్న వారు అందకుండా చేసే ప్రమాదాన్ని అరికడతామని పాలకులు ప్రకటించడం కన్నా సిగ్గుచేటు మరోటి ఉండదు. చిన్నాచితక పచ్చ మొక్కలను కూడా కీకారణ్యాలుగా తప్పుడు నివేదికలు ఇచ్చే సంస్కృతి దేశ అటవీ శాఖకు ఉంది. అది లంచాలకు, బ్రోకర్లకు పేరు మోసిన అడ్డా. దేశంలోనే అతిపెద్ద చట్టబద్ద భూస్వామి. బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడానికి భూములు ఉంటాయి కానీ పేదల వ్యవసాయ భూమి మాత్రం ఆక్రమిత భూమిగా కనిపిస్తుంది. బంగారు తెలంగాణ భ్రమలో జీవించేది ఎవరన్నది మరిచిపోయి.. ఇక తెలంగాణలో అడవులు పెరిగి పచ్చదనంతో కళకళలాడుతుంది... ప్రకృతిలో పరవశించిపోవచ్చుననే పగటి కల కంటే అది తెలివి తక్కువతనమే అవుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసులు, పేద జనం విచక్షణారహితంగా అడవిని ధ్వంసం చేస్తున్నారనే అబద్ధాల ప్రచారాన్ని మధ్యతరగతి వర్గం ముఖ్యంగా పట్టణవాసులు బాగా నమ్ముతున్నారు. అడవిని నమ్ముకొని జీవిస్తున్న వారిపై అడవిని అమ్ముకుని సంపద పోగు చేసుకునే నేరస్తుల గుంపు పెత్తనం చలాయిస్తోంది. ఇకనుండి అటవీ చట్టాలకు పోలీసు తుపాకీ అండ ఉంటుంది. ఇలాంటి నిరంకుశ చట్టంతో పేద జీవనం కష్టమౌతుంది. హక్కును అనుభవించడం చట్టం ఉల్లంఘన అవుతుంది. అక్కడే పుట్టి, అక్కడే చచ్చే జనం అడవిలోకి వెళితే చాలు.. నేరస్తులు అవుతారు. నల్లధనం మీ బ్యాంక్ ఖాతాలో వేస్తాను అని బూటకపు మాటలు చెప్పినవాడు రేపు అడవికి కూడా చౌకీదార్ అవుతాడు. అడవి జంతువు మాంసం తిని బొర్రపెట్టి తిన్నది అరగక జబ్బున పడ్డవారు. లంచాలు మేసే ప్రభుత్వ అధికారులు, బినామీ కాంట్రాక్టర్లు, కలప స్మగ్లర్లు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, సెలబ్రిటీలు జంగిల్ బచావో.. జంగిల్ బడావో అంటారు. మరి బంగారు తెలం గాణలో ఎవరు నేరస్తులు? నలమాస కృష్ణ వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ప్రజా ఫ్రంట్-98499 96300 -
పాదరక్షల్లో విదేశీ కరెన్సీ
అన్నానగర్: చెన్నై నుంచి గురువారం దుబాయ్‌కి పాదరక్షల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి యత్నించిన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే విమానంలో నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులకు గురువారం రహస్య సమాచారం అందింది. అనంతరం అధికారులు విమానాశ్రయంలో నిఘా ఉంచారు. ఆ సమయంలో దుబాయ్‌కి వెళ్లడానికి చెన్నైకి చెందిన 35 ఏళ్ల యువకుడు వచ్చాడు. అతన్ని అనుమానంతో అధికారులు నిలిపి విచారణ చేశారు. పొంతన లేని సమాధానాలు తెలపడంతో అతని లగేజీలను పరిశీలించగా ఏమీ లభించలేదు. అనంతరం ప్రత్యేక గదికి తీసుకువెళ్లి తనిఖీ చేయగా అతను ధరించిన పాదరక్షల్లో రూ.13.50లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మదురై విమానాశ్రయంలో కరెన్సీ పట్టివేత:యువకుడు అరెస్టు మదురై విమానాశ్రయంలో గురువారం రూ.43.50 లక్షల విలువైన ఇండియన్, విదేశీ కరెన్సీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి యువకుడిని అరెస్టు చేశారు. వివరాలు.. మదురై నుంచి సింగపూర్‌కు వెళ్లే విమానంలో హవాలా నగదు అక్రమంగా తరలిస్తున్నట్లుగా గురువారం మదురై విమానాశ్రయ సహాయ కమిషనర్ వెంకటేష్‌బాబుకి సమాచారం అందింది. వెంటనే విమానాశ్రయ అధికారులు విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను పరిశీలన చేశారు. అప్పుడు పెద్ద సూట్‌కేసుతో వచ్చిన ఓ యువకుడిని అనుమానంతో విచారించారు. అతను తూత్తుకుడి నారాయణన్ వీధికి చెందిన పార్వతినాథన్ (29) అని తెలిసింది. అతని సూట్‌కేసులో కట్టలు కట్టలుగా రూ.45.50 లక్షల ఇండియన్, విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. అధికారులు నగదుని స్వాధీనం చేసుకుని పార్వతినాథన్ను అరెస్టు చేశారు. -
అత్యంత హానికారక సిగరెట్లు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న అత్యంత హానికారక సిగరెట్లను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.6.50 కోట్లు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పేర్కొన్నారు. వివరాలు... దుబాయ్‌లో తయారైన మోండ్ బ్రాండ్, ఇంగ్లాండ్‌లో తయారైన బెన్సన్ అండ్ హెడ్జెస్ సిగరెట్లు సిటీకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్ఐ అధికారులు కన్నేశారు. ఈ గ్యాంగ్ సిగరెట్లను సముద్రమార్గంలో కంటైనర్ల ద్వారా ముంబైకి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. ఆ కంటెయినర్లలో టేపులు ఉన్నట్లు, దుబాయ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు రికార్డు ల్లో పొందుపరిచినట్లు అనుమానించారు. తాజాగా తిమ్మాపూర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో(ఐసీడీ)కి వచ్చిన ఈ కంటెయినర్లను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. 15 లక్షల బెన్సన్ అండ్ హెడ్జెస్, 30.3 లక్షల మోండ్ సిగరెట్లను స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. వీటిలో కొన్ని నకిలీ సిగరెట్లు కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచన మేరకు రాంకీ సంస్థకు చెందిన దుండిగల్ యూనిట్లో కస్టమ్స్ అధికారులు మంగళవారం ఆ సిగరెట్లను ధ్వంసం చేశారు. పన్ను ఎగ్గొట్టడానికే... ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులకు నష్టం కలిగించే ఈ సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం(కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుండే ఈ సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన పన్ను ఉంటుంది. రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై పన్ను రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ పన్నును ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని వీటిని మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఇతర దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా తెలియదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి ధ్రువీకరిస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకుండానే విపణిలోకి వెళ్లిపోతున్నాయని అంటున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. -
నిద్రమాత్రలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
నాగోలు: అనుమతి లేకుండా నిద్ర మాత్రలు విక్రయిస్తున్న వ్యక్తిని రంగారెడ్డి జోన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం అరెస్టు చేసి అతడి నుంచి 358ట్యాబ్లెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జోన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి సమీపంలో చక్రవర్తుల వెంకటాచారి అనే వ్యక్తి నిట్రాజెపం ట్యాబ్లెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించిన పోలీసులు నిందితుడు వెంకటాచారిని అరెస్టు చేసి అతడి నుంచి భారీగా నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ కల్పన, కుమారయ్య, సిబ్బంది కృష్ణ, రవికుమార్, శ్రీశైలం, శంకర్ పాల్గొన్నారు. -
తరలిపోతున్న తాబేళ్లు
ఎవరికీ ఏమాత్రం హాని తలపెట్టని సాధు జీవులు తాబేళ్లు. వేలాది ఏళ్ల చరిత్రకు ఇవి సాక్షిగా నిలుస్తాయి. అందుకేనేమో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. కొల్లేరు కేంద్రంగా తాబేళ్ల స్మగ్లింగ్ య«థేచ్ఛగా సాగుతోంది. ఒడిశా, అసోం, కర్ణాటక రాష్ట్రాలకు కొల్లేరు తాబేళ్లను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి కలిదిండి మండలం మద్వానిగూడెంలో 1,850 తాబేళ్లను అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. అమరావతి ,కైకలూరు: కొల్లేరు కేంద్రంగా ముఠా సభ్యులు తాబేళ్లను గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో తరలించేస్తున్నారు. ఈ ప్రాంతంలో చేపల చెరువుల పట్టుబడి సమయంలో చెరువు అడుగున వందల సంఖ్యలో తాబేళ్లు లభ్యమవుతున్నాయి. అక్రమార్కులు చేపల వలల మేస్త్రీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇవేకాకుండా డ్రెయిన్లు, గోతుల్లో లభ్యమయ్యే తాబేళ్లను ఆయా గ్రామాల్లో ఓ పెద్ద పీపాలో నిల్వ చేస్తున్నారు. వారంలో ఒక రోజు వ్యాన్‌లో అన్నింటినీ సేకరించి రాష్ట్రం దాటించేస్తున్నారు. చేపల ట్రేలలో పైన చేపలు, కింద తాబేళ్లను ఉంచి సరిహద్దులు దాటించేస్తున్నారు. తాబేలు మాంసానికి డిమాండ్ అస్సాం, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో తాబేలు మాంసానికి మంచి డిమాండ్ ఉంది. కొన్ని ఔషధాల్లో ఈ మాంసాన్ని ఉపయోగిస్తారు. కొల్లేరు ప్రాంతంలో కేజీ తాబేలును రూ.300కు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో కేజీ రూ.750కి విక్రయిస్తున్నారు. తాబేళ్లు పొదిగే కాలంలో అక్రమ రవాణాకు గురవడంతో వాటి సంతతి అంతరించిపోతోంది. ఈ ప్రాంతంలో 2014 డిసెంబరు 7న కలిదిండి మండలం వెంకటాపురం వద్ద 13 బస్తాల్లో 700 తాబేళ్లను అప్పటి రేంజర్ సునీల్‌కుమార్ పట్టుకున్నారు. ముదినేపల్లిలో భారీ తాబేళ్ల లోడును గతంలో స్వాధీనం చేసుకున్నారు. కైకలూరు శివారు ఏలూరు రోడ్డు వద్ద తాబేళ్ల మూటలతో ఒకరిని అరెస్టు చేశారు. తాజాగా మద్వానిగూడెం వద్ద ఘటన వెలుగుచూసింది. అటవీ అధికారులు సరైన నిఘాను పెట్టకపోవడంతో తాబేళ్లు సరిహద్దులు దాటుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చట్టం ఏమి చెబుతుందంటే.. అంతరించిపోతున్న తాబేలు జాతిని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు షెడ్యూలు –1 కేటగిరీలో చేర్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేళ్లను వేటాడితే 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించే అవకాశం ఉంది. కొల్లేరు ప్రాంతం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా తాబేళ్లను పట్టుకుని నిల్వ చేస్తే అటవీ అధికారులకు సమాచారం అందిస్తే దాడులు చేసి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సెల్లో కాల్‌డేటా కీలకం.. కలిదిండి మండలం మద్వానిగూడెం వద్ద శుక్రవారం అర్ధరాత్రి పట్టుబడిన పశ్చిమబెంగాల్‌కు చెందిన హరమ్ఘోష్, దివాసిస్దాసుల సెల్ఫోన్లలో అక్రమ తాబేళ్ల ముఠాకు చెందిన స్థానిక నాయకుల సెల్ నెంబర్లను కనుగొన్నారు. పోలీసులు ఆ సెల్ నెంబర్లను విచారణ చేస్తే ఖచ్చితంగా కొల్లేరు ప్రాంతంలో ముఠా సభ్యుల గుట్టురట్టవుతుంది. ఇప్పటికైనా అటవీశాఖాధికారులు పూర్తి స్థాయి విచారణ చేయించి నిందితులను అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నారు. నిఘాను ముమ్మరం చేస్తాం కొల్లేరు పరిసర ప్రాంతాల్లో తాబేళ్ల అక్రమ రవాణాపై నిఘాను ముమ్మరం చేస్తాం. పెద్ద పులి మాదిరిగా షెడ్యూల్ –1 జాబితాలో తాబేలు ఉంది. ఇది అంతరించే జాతుల జాబితాలోకి చేరుతోంది. చేపల చెరువుల పట్టుబడి సమయంలో సిబ్బందితో నిఘా నిర్వహిస్తాం. తాబేళ్లను వేటాడం చట్టరీత్యా నేరం. 7 సంవత్సరాలు కఠినకారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తారు.– బి.విజయ, ఫారెస్టు రేంజర్, కైకలూరు -
అక్రమంగా తరలిస్తున్న అలుగు స్వాధీనం
తూర్పుగోదావరి, వీఆర్‌పురం (రంపచోడవరం): అక్రమంగా తరలిస్తున్న అలుగును అటవీశాఖాధికారులు దాడి చేసి స్వాధీనపరచుకొని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధి పాతరాజుపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొంది. రేంజర్ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. పాతరాజుపేట గ్రామంలోని ఒక ప్రదేశంలో అడవి అలుగును దాచి ఉంచారన్న సమాచారం తెలుసుకున్న రేంజర్ సిబ్బందితో దాడి చేశారు. దీంతో అక్కడున్న నలుగురు దుండగులు ఫారెస్ట్ అధికారులు రావడాన్ని పసిగట్టి అలుగును వదిలేసి ఆ ప్రదేశం నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. సిబ్బంది వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో ముగ్గురు దొరకగా మరో వ్యక్తి పరారయ్యాడు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రేంజర్ చెప్పారు. వాలుగను విశాఖ అటవీ ప్రాంతం నుంచి తీసుకువచ్చినట్టు పొంతనలేని సమాధానాలను నిందితులు చెబుతున్నారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందన్నారు. ఈ దాడిలో డీఆర్ఓ వీరన్నరాజు, ఎఫ్‌ఎస్‌ఓలు జి.భిక్షం, టి.సాయి, దేశయ్య,ఆరీఫ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
విమానంలో చిరుత పులి పిల్ల స్మగ్లింగ్
-
విమానంలో పులి పిల్ల.. పాలు పట్టిన సిబ్బంది
చెన్నై : చిరుత పులి పిల్లను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగేజ్ చెక్ చేస్తున్న సమయంలో నెలన్నర వయసు ఉన్న చిరుత పులి పిల్ల బయటపడింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు ఇంటిలెజిన్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చెన్నైలోని ఆరినగర్ అన్నా జువాలాజికల్ పార్కుకు తరలించారు. కాగా భయంతో వణికిపోతున్న చిరుత పులి పిల్లను ఎయిర్‌పోర్టు సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. అనంతరం దానికి పాలు పట్టించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. -
ఇసుక దొంగలు
సంపాదన కోసం ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలే కాదు చివరకు శ్మశానాలనూ వదల్లేదు. ఎక్కడ ఇసుక కనిపిస్తే అక్కడ తోడేశారు. నిబంధనలను పక్కన పెట్టేసి ఎడాపెడా తవ్వేయడంతో భూగర్భజలాలు అడుగంటాయి. ఎవరైనా అభ్యంతరం తెలిపితే వారిపై దాడులకు సైతం తెగబడ్డారు. ఇసుకను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. అనంతపురం, రాప్తాడు: రాప్తాడు మండలంలోని పండమేరు వంక నుంచి అధికార పార్టీ అండదండలతో కొందరు ఇసుకను అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సిమెంటు ప్లాస్టింగ్‌కు ఉపయోగమయ్యే ఇసుక వంకలో లభించకపోవడంతో ఇసుకాసురుల కన్ను పుల్లలరేవు గ్రామ శ్మశానవాటికపై పడింది. పది రోజుల క్రితం హిటాచీని తెప్పించి రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించుకుపోయారు. ఉదయం ఆరు గంటలకల్లా శ్మశానాన్ని ఖాళీ చేసేశారు. శ్మశానం పైభాగా తోటలు ఉన్న రైతులు రాత్రికి రాత్రి ఇసుక మాయం అవుతోందని, ఎవరో తోలుతున్నారని అనుకునేవారు. రెండు రోజులు కాపలా కాచినా వారికి సదరు వ్యక్తులు తారసపడలేదు. రోజులో నాలుగైదుసార్లు ఇసుకాసురులు 100 టిప్పర్ల ఇసుకును బయటకు తరలించేవారు. శ్మశాన స్థలం మొత్తం గుంతలు పడుతుండటంతో గ్రామస్తులు ఎలాగైనా ఇసుక దొంగలను పట్టుకోవాలని గురువారం రాత్రి శ్మశానం దగ్గర కాపలా కాశారు. అర్ధరాత్రి తర్వాత ఇసుక రవాణా ముందస్తు సమాచారంతో ఇసుకాసురులు అప్రమత్తమయ్యారు. కాపలా కోసం వచ్చిన గ్రామస్తులు అర్ధరాత్రి 12 గంటలకు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన ఇసుకాసురులు హిటాచీతో తవ్వకాలు చేపట్టారు. ఐదు టిప్పర్ల ద్వారా దాదాపు 100 ట్రిప్పుల ఇసుకను బయటకు తరలించేశారు. ఒకోŠక్ టిప్పర్ ఇసుకకు రూ.15 వేలు ధర పలుకుతోంది. రాత్రికి రాత్రే రూ.15 లక్షలు విలువ చేసే ఇసుకను అక్రమంగా రవాణా చేసేశారు. ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో గ్రామస్తులు శ్మశానం దగ్గరకెళ్లి ఇసుక తవ్వుతున్న వారిని అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి ఇసుక తరలించరాదంటూ ఘర్షణకు దిగారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో డ్రైవర్లు టిప్పర్లలో ఉన్న ఇసుకను అన్లోడ్ చేసి అనంతపురం వెళ్లిపోయారు. హిటాచీని, దానిని తీసుకువచ్చిన లారీని గ్రామస్తులు అక్కడి నుంచి కదలనివ్వకుండా అడ్డుపడ్డారు. వీఈర్వోపై దాడి పుల్లలరేవు శ్మశాన వాటికలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్ వరప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వో నాగేంద్రబాబు తలారికి సమాచారం ఇచ్చి ద్విచక్రవాహనంలో ఉదయం పదకొండు గంటలకు పుల్లలరేవుకు చేరుకున్నారు. అప్పటికే తలారి నాగన్న శ్మశానంలోని హిటాచి వద్ద కాపలాగా కూర్చున్నాడు. ఇసుకను ఎవరు తెమ్మన్నారని వీఆర్వో అడిగితే డ్రైవర్లు హిందీలో మాట్లాడారు. వారు చెప్పేది అర్థం కాకపోవడంతో డ్రైవర్లిద్దిరినీ వీఆర్వో, తలారి చెరొక బైక్‌లో ఎక్కించుకుని రాప్తాడుకు బయల్దేరారు. లింగనపల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా మంత్రి పరిటాల సునీత సొదరుడు ధర్మవరపు మురళి అనుచరులు కారులో వచ్చి అడ్డం పెట్టారు. ‘మా మనుషులను ఎందుకు పిలుచుకుని వస్తున్నావ్. మేమెవరో నీకు తెలియదా?’ అంటూ దాడి చేశారు. ఒకేసారి నలుగురు వ్యక్తులు దాడి చేయడంతో వీఆర్వో ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకుని, అనంతపురం చేరుకున్నాడు. -
చిత్తశుద్ధితో చెట్లు పెంచాలి
‘‘రాష్ట్రంలో అడవులను సంరక్షించుకోవాలి. దీనికి సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి’’ అని సీఎం చంద్రశేఖర్‌రావు అన్నారు. సీఎం ప్రకటన అమలు కావాలని కోరుకుందాం. తెలంగాణ రాష్ట్రం అడవులకు ప్రసిద్ధి. వందల ఏళ్ల వయసు కలిగిన అడవులలో అనేక రకాల చెట్లు ఉన్నాయి. అయితే, యథేచ్ఛగా సాగిన స్మగ్లింగ్ కారణంగా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, చెన్నైలకు వేల టన్నుల కలప తరలి పోయింది. అటవీశాఖ అధికారులు కొన్ని కేసులు పెట్టినా, ఏ ఒక్క స్మగ్లర్‌కూ శిక్ష పడలేదు. నేడు అడవులలో 20 శాతం మాత్రమే చెట్లు ఉన్నాయి. అవి కూడా 20, 30 సంవత్సరాల వయసు కలిగినవి మాత్రమే. పరిశోధనలకు ఉపయోగపడటానికి వందల వయసు కలిగిన చెట్లు కానరావు. రాష్ట్రంలో 70.18 లక్షల ఎకరాల అడవులు ఉన్నాయి. ఇందులో 50,45,760 ఎకరాలలో రిజర్వు ఫారెస్టు, 17,92,320 ఎకరాల్లో రక్షిత భూమి , 1.80 లక్షల ఎకరాలు నిర్ధారించని భూమి. ఈ రిజర్వు ఫారెస్టులో కొంతమేర అడవులున్నప్పటికీ మిగిలిన 20 లక్షల ఎకరాలలో ఎలాంటి అడవులు లేవు. రిజర్వు ఫారెస్టులో 20 శాతం కూడా అడవులు లేవని శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించారు. అడవులు లేకపోవడంతో జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయి. లక్షల ఎకరాలలో పంటలను నాశనం చేస్తున్నాయి. నేడు కోతుల బెడద లేని గ్రామం లేదు. చిరుతలు, ఎలుగుబంట్లు కూడా గ్రామాలకు వస్తున్నాయి. వనమహోత్సవాలలో మైదాన భూములలో చెట్లు నాటడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారే తప్ప, అడవులలో చెట్లు పెంచడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. 2016 జూలై నుండి రాష్ట్రంలో రానున్న మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 శాతం నిధులతోపాటు ఉపాధిహామీ పథకం 100 శాతం, 50 లక్షల ఎకరాలలో గ్రీన్ ఇండియా వారు 75 శాతం, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులు సమకూర్చాలి. సామాజిక అడవులపై చూపిన శ్రద్ధలో సగం సాంప్రదాయ అడవుల పెంపకంలో చూపలేకపోయారు. చివరకు పాలకులు అడవులను నేటికీ రక్షిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి, వారి పంటలను నాశనం చేసి, వారి నుండి అక్రమంగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. గిరిజనులను అడవుల నుండి మైదానాలకు పంపించే ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అడవులలో గిరిజనులను లేకుండా చేస్తే 2, 3 సంవత్సరాలలోనే అడవులు అదృశ్యం కావడం ఖాయం. రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల భూమిలో వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ అడవిలో 2.20 లక్షల ఎకరాలు, ప్రాణ హితలో 34 వేల ఎకరాలు, శివ్వారం అభయారణ్యం పేరుతో 7,500 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇదికాక ఏటూరునాగారంలో 2 లక్షలు, పాకాల అడవులలో 2.12 లక్షలు, ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని అడవులలో 1.57 లక్షలు, మంజీరకి 49 వేలు, మెదక్ జిల్లా, పోచారంలో 34 వేలు, మహబూబ్‌నగర్‌లో రాజీవ్ గాంధీ వన్యప్రాణ రక్షణ పేరుతో 5.35 లక్షల ఎకరాల చొప్పున సేకరించబోతున్నారు. అటవీ ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి 500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ, అవినీతి అధికారువల్ల ఈ ఆదాయానికి గండిపడుతున్నది. గతంలో బీడీ ఆకుల వ్యాపారంతో 30 కోట్ల ఆదాయం వచ్చింది. అడవుల పెంపకానికి విదేశీ ఆర్థిక సహాయంతో పాటు ప్రపంచ బ్యాంకు నిధులు కూడా వస్తున్నాయి. ఔషద మొక్కల పెంపకానికి నిధులు ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ మేనేజ్మెంట్ కింద వనసంరక్షణ సమితులు నిర్వహించి, అడవుల పెంపుదలకు ప్రణాళికలు అమలు చేశారు. ఫలితాలు మాత్రం ఆశించినంత రాలేదు. నేడు గృహ నిర్మాణాల సమస్య తీవ్రంగా ముందుకొచ్చింది. పట్టణాల్లో గృహనిర్మాణాలు బాగా జరుగుతున్నాయి. వీటికి కలప వాడకం కూడా పెరుగుతున్నది. చివరికి గ్రామాల్లో తుమ్మ, వేప చెట్లను కూడా గృహ నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. కలపకు ప్రత్యామ్నాయంగా మరో వస్తువు వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం సుబాబులు, జామాయిల్ తోటలు అడవుల్లో వేస్తున్నారు. 3,4 సంవత్సరాలు కాగానే వాటిని నరికివేస్తున్నారు. అడవులు స్థిరంగా పెరగాలి తప్ప, నరికేస్తే తిరిగి పెరుగుదలకు చాలా కాలం పడుతుంది. నేడు కార్పొరేట్ సంస్థలు అడవులలో ఖనిజ సంపదపై కన్నేశాయి. జిందాల్ లాంటి సంస్థలు ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాలను రద్దుచేసి ఖనిజ సంపదను భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవాలి. ముడి ఖనిజం ఎగుమతిని నిషేధించాలి. అటవీశాఖ అధికారులందరికీ అకౌంటబిలిటీ పెట్టి అడవుల పెంపకం బాధ్యతను అప్పగించాలి. అడవి జంతువుల వల్ల మైదానంలో పంటలు దెబ్బతిన్నచో అటవీశాఖ పరిహారం చెల్లించే బాధ్యతను తీసుకునే విధంగా ఉండాలి. అప్పుడే అడవులు వృద్ధి చెందుతాయి. సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94900 98666 -
అటవీ రక్షణకు ఆర్మ్డ్ ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: అటవీ సంపదను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది. స్మగ్లింగ్, అటవీ భూముల ఆక్రమణ, వన్యసంపద పరిరక్షణకు అటవీ శాఖతోపాటు పోలీస్ శాఖ కూడా రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీనితో పోలీస్ ఉన్నతాధికారులు ఆమేరకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. జాయింట్ చెక్‌పోస్టులు.. రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రధానంగా అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉంది. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వధ జరుగుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జాయింట్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు. ఆటవీ శాఖ–పోలీస్ శాఖ సంయుక్తంగా చెక్‌పోస్టులు నిర్వహించేందుకు ప్రణాళిక తయారుచేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న చెక్‌పోస్టుల్లో నిర్వహణ లోపాలు, సిబ్బంది కొరత ఉండటంతో పోలీస్ శాఖ ద్వారా వాటిని మానిటరింగ్ చేయాలని నిర్ణయించారు. వరంగల్, హైదరాబాద్ పోలీస్ జోన్ పరిధిలో 54 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. జాయింట్ చెక్ పోస్టులు ప్రస్తుతం అటవీ శాఖ నేతృత్వంలో ఉన్న చెక్‌పోస్టుల్లో కేవలం ఇద్దరు లేదా ఒకరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. టోల్ విధుల్లో కొన్నిచోట్ల ప్రైవేట్ సిబ్బంది ఉండటంతో స్మగ్లర్లకు అవకాశం కలిసివస్తోంది. అయితే ఇక నుంచి ఆధునీకరించబోతున్న చెక్‌పోస్టుల్లో సాయుధ బలగాల సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. టోల్ వ్యవహారమంతా అటవీ శాఖ పర్యవేక్షించనుండగా, తనిఖీలు చేయడం, స్మగ్లర్లను గుర్తించి అదుపులోకి తీసుకోవడం మాత్రం పోలీస్ శాఖ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రతీ చెక్‌పోస్టుకు ముగ్గురు సాయుధ బలగాల సిబ్బంది కాపలా కాయనున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఇంటర్సెప్టార్ వాహనాలను సైతం రంగంలోకి దించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇలా ప్రతి జిల్లాలో జాయింట్ చెక్‌పోస్టుల భద్రత కోసం 35మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా 400మందిని కేటాయించాలని పోలీస్ శాఖ యోచిస్తోంది. స్మగ్లర్లు ఎంతమంది? ఇప్పటివరకు రాష్ట్రంలో స్మగ్లింగ్ కార్యకలాపాలు చేస్తున్న వారు ఎంతమంది? వారి వివరాలు ఏంటన్న దానిపై అటవీ శాఖ వద్ద వివరాలు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్టు తెలిసింది. కనీసం డేటా బేస్ లేకపోవడం ఏంటన్న దానిపై ప్రభుత్వ వర్గాలు అటవీ శాఖ అధికారులను మందలించినట్టు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా డేటా బేస్ సిద్ధం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల పోలీసులను ఆదేశించారు. అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి గోదావరి నది దాటి రాష్ట్రం మీదుగా కలప స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఆ రెండు రాష్ట్రాల అటవీ, పోలీస్ శాఖల నుంచి కూడా స్మగ్లర్ల వివరాలను కోరుతున్నట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు సాక్షితో అభిప్రాయపడ్డారు. దీని ద్వారా అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ కార్యకలాపాలు సాగించే వారి వివరాలు ఇంటిగ్రేటెడ్ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు. గుర్తించిన స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా పోలీస్ శాఖ ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్టు తెలిసింది. కేవలం స్మగ్లింగ్ మాత్రమే కాకుండా అటవీ భూములను ఆక్రమిస్తున్న వారు, వన్యప్రాణులను వేట పేరుతో వధిస్తున్న వారిపై అటవీ యాక్ట్ కేసులతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఈ ప్రాంతాలే కీలకం... కాగజ్‌నగర్, జిన్నారం, బెల్లంపల్లి, మంథని, నిర్మల్, ఖానాపూర్, మహదేవపూర్, కాళేశ్వరం, భూపాలపల్లి, ములుగు, వాజేడు, కొత్తగూడెం, పాల్వంచ, ఏటూరునాగారం, నాగర్‌కర్నూల్, నర్సాపూర్ డివిజన్లలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేయడం, ఉన్న వాటిని ఆధునీకరించి సీసీటీవీలు, కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. అదే విధంగా ఆయా డివిజన్లలోని అటవీ శాఖ అధికారులతోపాటు స్థానిక సబ్ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు నేరుగా రంగంలోకి దిగేలా ఆదేశాలిస్తున్నట్టు తెలుస్తోంది. అడవుల్లో స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ బృందాలు స్మగ్లర్ల వివరాలను గుర్తించి ఈ బృందాలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థ, ఈ వ్యవస్థను మాని టరింగ్ చేసేందుకు జిల్లా అటవీ శాఖాధికారి, జిల్లా ఎస్పీ పనిచేయనున్నట్టు తెలుస్తోంది.