నెల్లూరు (క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఈబీ, ఐదు సివిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన రూ 3.14 కోట్ల విలువైన మద్యాన్ని మంగళవారం ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో ఎస్‌ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మి తన సిబ్బందితో ధ్వంసం చేయించారు. కొత్తూరు సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయ ప్రాంగణంలో రోడ్డు రోలర్ ద్వారా సీసాలను తొక్కించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గడిచిన మూడేళ్లుగా జిల్లాలో మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలపై ఎస్‌ఈబీ, పోలీసులు దాడులు ముమ్మరం చేశారన్నారు. 2,774 కేసుల్లో పట్టు బడిన రూ.3,14,37,980 విలువజేసే 74,574 మద్యం బాటిళ్లను (15,719 లీటర్లు) ధ్వంసం చేశామన్నారు. జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలు, మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నెల్లూరు ఇన్‌చార్జి ఏసీ రవికుమార్, ఏఈఎస్ కృష్ణకిశోర్‌రెడ్డి,పోలీసు అధికారులు పాల్గొన్నారు.
రూ 3.14 కోట్ల మద్యం ధ్వంసం
Published Wed, Jul 13 2022 5:11 AM | Last Updated on Wed, Jul 13 2022 5:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment