
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంతకీ ఎవరు ఈ రాన్యా రావు అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అసలు ఆమె డీజీపీ కూతురు అని చెప్పడంతో పలువురు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలేంటో మీరు చూసేయండి.
రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్‌గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది. 2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్‌కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు.
డీజీపీ కూతురే రాన్యా రావ్..
మరోవైపు రన్యా రావు డీజీపీ కూతురు అని తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా ఉన్న ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment