ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వరంగల్: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 500 కిలోల గంజాయి, రెండు నాటు తుపాకులు, 11 రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తి, బొలెరో వాహనం, ఐదు సెల్‌ఫోన్లు, రూ.1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. నిందితుల్లో వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన దండెబోయిన సుమన్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అన్నవరానికి చెందిన వంతల విజయ్, గిమ్మెల రంగారావు, వంతల నర్సింగరావు, మరో నిందితుడు బాల నేరస్తుడు ఉన్నాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment