కొచ్చి: కొన్ని ఏళ్లుగా బంగారం చాలా ఖరీదుగా మారడమే గాక విక్రయదారులకు మంచి లాభాలను ఇస్తోంది. దీంతో స్మగ్లర్ల కన్ను బంగారం పై పడింది. ఈ క్రమంలో నిత్యం ఏదో ఓ రూపంలో బంగారాన్ని స్మగ్లర్లు అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు. ఇలా చేస్తున్న వారిలో కొందరు పట్టుబడుతుండగా, మరి కొందరు తప్పించుకుంటున్నారు. దేశంలోని ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు, కస్టమ్స్ ప్రివెంటివ్ యూనిట్‌లు, ఇతర సిబ్బంది కలిసి స్మగ్లింగ్ అడ్డుకట్టకి ఎంత పకడ్బంది చర్యలు తీసుకున్న నేరస్థులు సరికొత్త దారులను ఎంచుకుంటున్నారు.
ఒక్కోసారి వీరి ఐడియాలు చూస్తే ఇలా కూడా చేయచ్చా అని ఆశ్చర్యం వేయకమానదు. తాజాగా అటువంటి ఘటన కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. సోమవారం కన్నూరు విమానాశ్రయంలో ఓ వ్యక్తి 302 గ్రాముల బంగారంతో పట్టుబడ్డాడు. అది కూడా ఎలాగంటే.. ఎవరికీ అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చి రెండు పొరల ప్యాంట్ల మధ్యలో దాచుకుని వచ్చాడు. అయితే ఆ ప్రయాణికుడి కదలికలు కాస్త అనుమానంగా ఉండడంతో అధికారులు గుర్తించి అతడిని తనిఖీ చేయగా అసలు నిజం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment