
సాక్షి,మైలవరం, (జమ్మలమడుగు రూరల్): మైలవరం మండలంలోని గంగులనారాయణపల్లె గ్రామానికి చెందిన నాగలక్ష్మీ (24) అనే వివాహిత మహిళ అదశృమైనట్లు ఎస్‌ఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు నాగలక్ష్మీకి 7 సంవత్సకాల క్రిందట కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ తాలూకాలోని దోర్నిపాడు గ్రామానికి చెందిన మహేంద్ర అనే యువకుడితో వివాహమైంది. మహేంద్ర భార్యతో కలసి అత్తగారి గ్రామమైన గంగునారాయణపల్లెలో నివాసం ఉంటున్నారు. (చదవండి: షాకింగ్.. తల్లి చేతి నుంచి ఐదు నెలల బాలుడు జారిపడి.. )
వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. మార్చి 14వ తేదీ రాత్రి భార్య, భర్త, పిల్లలు భోజనం చేసి ఇంటిలో నిద్రపోయారు. తెల్లవారే సరికి నాగలక్ష్మీ కనపించలేదు. మహేంద్ర చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లేదు. వెంటనే అత్త పిల్లి ఈశ్వరమ్మకు తెలిపాడు. ఆమె మైలవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.