
ఆంజనేయాసనం అనేది యోగాలో ఒక భంగిమ. దీనిని క్రెసెంట్ మూన్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం హనుమంతుడి తల్లి అంజన చేసే నృత్య భంగిమలోదిగా చెబుతారు. అందుకే ఈ ఆసనానికి ఆంజనేయాసనం అని పేరు.
ఈ ఆసనం ప్రయోజనాలు...
శరీరాన్ని ఒక కాలు మీద స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సమతుల్యత కలుగుతుంది. స్థిరత్వం మెరుగుపడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరానికి– మనసుకు మధ్య సమతుల్యత ఏర్పడుతుంది.
హిప్ భాగం ఫ్లెక్సిబుల్ అవుతుంది. శరీరంపై అవగాహన కలుగుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. కీళ్ల పనితీరును, ఉచ్ఛ్వాస–నిశ్వాసలను మెరుగు పరుస్తుంది. మానసిక, శారీరక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మనస్సును స్థిరంగా ఉంచుతుంది. దిగువ శరీరాన్ని సాగదీయడానికి, ఛాతీని విశాలం చేయడానికి ఈ ఆసనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఎలా చేయాలంటే...
- ఎడమ మోకాలిని ముందుకు చాపి, కుడి కాలిని వెనక్కి వంచి, కుడి కాలి మునివేళ్లమీద ఉండాలి.
- తలను నిటారుగా ఉంచి, రెండు చేతులను కంటికి ఎదురుగా నమస్కార భంగిమలో ఉంచాలి.
- ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి.
- శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనసును స్థిరంగా ఉంచే ఈ ఆసనంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఆసనాన్ని సాధనం చేయడం వల్ల మానసిక వికాసం కూడా మెరుగవుతుంది.
(చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..)