
ఏదైన తెలియని విషయం నేర్చుకోవాలంటే ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్ మాయజాలమే. అందులో ఏ వంటకమైన, తెలియని పనైనా సులభంగా నేర్చుకోవచ్చు..నిమిషాల్లో చేసేయొచ్చు. అయితే అది కొన్నింటికే పరిమితం. ఆరోగ్యానికి సంబంధించినవి చాలామటుకు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకునే చేయాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయితే ఈ వ్యక్తి ఏకంగా యూట్యూబ్ చూసి తనకు తాను సర్జరీ చేసుకున్నాడు. చివరికి అది కాస్త సివియర్ అయ్యి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే వైద్య నిపుణులు ఇదెంత వరకు సబబు అని మండిపడుతున్నారు. మరీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్ వీడియోల సాయంతో నేర్చుకున్న పరిజ్ఞానంతో తనకు తానుగా సర్జీర చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అందుకోసం మార్కెట్ నుంచి సర్జికల్ బ్లేడ్‌లు, కుట్లు వేసే తీగలు, సూదులు వంటివి అన్ని కొనుగోలు చేశాడు. అనుకున్నట్లుగానే అన్నంత పని చేసేశాడు. తనకు తానుగా పొత్తికడుపు కోసుకుని మరీ ఆపరేషన్ చేసుకున్నాడు.
అంత వరకు బాగానే ఉంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా దిగజారడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలింరు అతడి బంధువులు. ఆస్పత్రి వైద్యులు అతడి చేసిన ఘనకార్యం విని కంగుతిన్నారు. వెంటనే పరీక్షించగా..అదృష్టవశాత్తు సదరు వ్యక్తి పొత్తి కడుపు పైపొర మాతమే కోయడంతో త్రటిలో ప్రాణాపయం తప్పిందన్నారు. ఎందుకంటే కాస్త లోతుగా కోసుంటే ఇతర అంతర్గ అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఘటనపై సీరియస్ అవుతున్న వైద్యులు..
ఆన్‌లైన్‌లో చూసిన ప్రతిదాన్ని చేసేయాలని చూడొద్దు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పరాచకాలు వద్దు. నిపుణుల సాయం లేకుండా సర్జరీ లాంటివి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడూ ఒకవేళ అధిక రక్తస్రావం అయితే పరిస్థితి చేజారిపోతుంది.
పైగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. డబ్బు ఆదా చేయాలనో లేదా మాకు చాలా పరిజ్ఞానం వచ్చేసిందన్న అత్యుత్సాహంతోనే ఇలాంటిపనులకు అస్సలు ఒడిగట్టద్దు. ఈ మిడిమిడి జ్ఞానంతో స్వీయంగా లేదా వేరేవాళ్లకి సర్జరీలు చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ముఖ్యంగా ఆన్‌లైన్ హెల్త్ ట్యూటోరియల్స్ లేదా హెల్త్ ట్రెండ్‌లు వంటి వాటిని చాలావరకు వైద్యులు ఆమోదించరిన అన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఇలాంటివి చేయాలి. ఎంబీబిఎస్ చదివి ఎన్నేళ్లో ప్రాక్టీస్ చేసినా వైద్యులే ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది ఏ మాత్రం అనుభవం లేకుండా .. జస్ట్ చూసి ఎలా చేసేస్తారంటూ మండిపడుతున్నారు వైద్య నిపుణులు.
(చదవండి: 'విద్యార్థి భవన్ బెన్నే దోసె'..యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా
..)