
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం.. వినడానికి వింతగా ఉన్నా ఇలాంటి ఒక రోజు ఉంది. శానిటైజేషన్ ప్రాముఖ్యతపై అవగాహనే దీని ఉద్దేశం. నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే జరపాలని అధికారికంగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం..వినడానికి వింతగా ఉన్నా ఇలాంటి ఒక రోజు ఉంది. శానిటైజేషన్ ప్రాముఖ్యతపై అవగాహనే దీని ఉద్దేశం.2001 నవంబర్ 19న సింగపూర్‌కు చెందిన జాక్ సిమ్ నేతృత్వంలోని వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రారంభించింది. తదనంతరం నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే ప్రకటించారు ఆయన. తరువాత నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే జరపాలని అధికారికంగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ మేకు 2013, జూలై 24న యూఎన్ జనరల్ అసెంబ్లీ 67వ సెషన్‌లో 122 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం 2021 థీమ్ “టాయిలెట్‌లకు విలువ ఇవ్వడం”. ఈ సందర్భంగా ఆసక్తికర వీడియో మీ కోసం..