
ప్రజల ఆహ్లాదం కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృ
● ఎండిపోతున్న వనాలు ● ఆహ్లాదం ఎండమావే..
చెన్నూర్‌రూరల్: శివలింగాపూర్ వద్ద ప్రకృతి వనంలో ఎండిపోయిన మొక్కలు
దండేపల్లి: కళావిహీనంగా నంబాల పల్లెప్రకృతివనం
వేమనపల్లి: ప్రకృతివనంలో ఎండిపోయిన మొక్కలు
భీమిని: వీగాంలో పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా పల్లె ప్రకృతి వనం
దండేపల్లి/చెన్నూర్‌రూరల్/భీమిని/మందమర్రిరూరల్/తాండూర్/వేమనపల్లి: దండేపల్లి మండలం నంబాలలో పల్లె ప్రకృతి వనాన్ని గ్రామానికి దూరంగా ఏర్పాటు చేశారు. అప్పట్లో 2000 మొక్కలు నాటారు. నిర్వహణను పట్టించుకునే వారు కరువయ్యారు. ఫలితంగా నాటిన మొక్కల్లో సగానికిపైగా ఎండిపోవడంతో పచ్చదనం కరువైంది. చెన్నూర్ మండలం శివలింగాపూర్ గ్రామ సమీపంలో గత ప్రభుత్వ హయాంలో రూ.2.50లక్షలతో సుమారు ఐదు వేల మొక్కలు నాటి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. మొక్కలకు నీరందించేందుకు బోరు వేశారు. బోరుకు అమర్చిన విద్యుత్ మోటారు కాలిపోవడంతో మొక్కలకు నీరందక ఎండిపోతున్నాయి. భీమిని మండలం వీగాం గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో కానుగ చెట్లు మినహా ఇతర మొక్కలు కనిపించడం లేదు. ఆహ్లాదం కరువై ప్రజలు అటువైపు వెళ్లకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండి నిరుపయోగంగా మారింది.
● మందమర్రి మండలంలోని పది గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. శంకర్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనే చిర్రకుంట, ఆదిల్‌పేట్, సారంగపల్లి, శంకర్‌పల్లి బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో 20 ఎకరాల్లో ఉపాధి హామీ సిబ్బంది సుమారు 60వేల మొక్కలు నాటారు. రెండేళ్ల తర్వాత ఆడిట్ నిర్వహణ అనంతరం గ్రామ పంచాయతీలకు అప్పగించారు. నిర్వహణ లోపించడంతో మొక్కలన్నీ ఎండిపోయి పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి.
● తాండూర్ మండలం మాదారం(పోచంపల్లి) ప్రకృతి వనం కళావిహీనంగా తయారైంది. తాండూర్, కిష్టంపేట, గోపాల్‌నగర్, మాదారం త్రీ ఇంక్లైన్‌తోపాటు పలు ప్రకృతి వనాల్లో పిచ్చిమొక్కలు పెరిగి, నాటిన మొక్కలు ఎండిపోయి నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. వినియోగానికి వీలు లేకుండా మారి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించలేకపోతున్నాయి.
● వేమనపల్లి మండల కేంద్రంలోని మంగెనపల్లి, ఒడ్డుగూడం ప్రకృతి వనాల్లో పర్యవేక్షణ లోపించింది. గొడ్డలి వేటుకు కొన్ని మొక్కలు నేలకూలగా.. మరికొన్ని నీళ్లు లేక ఎండిపోతున్నాయి. రెండేళ్లు మాత్రమే ఉపాధి హామీ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రకృతి వనాల్లో వసతులు లేక నిరుపయోగంగా ఉన్నాయి. పిచ్చిమొక్కలు, ముళ్లకంపలు పెరిగాయి.
మందమర్రిరూరల్: శంకర్‌పల్లిలో..

ప్రజల ఆహ్లాదం కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృ

ప్రజల ఆహ్లాదం కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృ

ప్రజల ఆహ్లాదం కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృ

ప్రజల ఆహ్లాదం కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృ

ప్రజల ఆహ్లాదం కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృ

ప్రజల ఆహ్లాదం కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృ