
సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలు ప్రతి ఏటా ఈద్(రంజాన్)కి రావడం ఆనవాయితీ. అలా ఈసారి సికందర్ అనే సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చాడు. ఆదివారం దేశవ్యాప్తంగా ఇది రిలీజైంది. ఇది జరగడానికి ముందే మూవీకి భారీ నష్టం కలిగే పని జరిగింది. అదే పైరసీ.
ఈ మధ్య చాలా సినిమాలు రిలీజైన రోజే పైరసీకి గురవుతున్నాయి. రీసెంట్ టైంలో రిలీజైన తండేల్, ఛావా.. ఇలా పైరసీ బారిన పడ్డాయి. కాకపోతే కంటెంట్ కాస్త ఉండటంతో థియేటర్లకు కూడా జనాలు వచ్చారు. ఇప్పుడు సల్మాన్ సికిందర్ మూవీ పరిస్థితి చూస్తుంటే పాపం అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో: సల్మాన్)
రిలీజ్ ఆదివారం ఉందనగా.. శనివారం రాత్రే ఎవరో పైరసీ చేసి ఫుల్ హెచ్ డీ ప్రింట్ ని సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇది తెలిసిన నిర్మాత వెంటనే పోలీసులని ఆశ్రయించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పొచ్చు.
మరోవైపు ఈ సినిమాకు తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికే మూవీ చూసిన పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తున్నారు. సినిమా మరీ నీరసంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.
(ఇదీ చదవండి: 'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..)