
బాలీవుడ్ భామ షాలిని పాండే తెలుగువారికి సుపరిచితమైన పేరు. విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే సినిమాలతో మెప్పించింది. అయితే గతేడాది మహరాజ్ చిత్రంతో నటించిన ముద్దుగుమ్మ.. ఇటీవల జ్యోతిక ప్రధాన పాత్రలో వచ్చిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనను ఆలియా భట్‌తో పోల్చడంపై కూడా మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని కోరుకుంటానని తెలిపింది. అంతేకానీ మరొకరితో తనను పోల్చడం సరికాదని హితవు పలికారు. మనకు మరో ఆలియా భట్ అవసరం లేదని షాలిని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
షాలిని మాట్లాడుతూ.. "మనకు మరొక అలియా అవసరం లేదు. ఎవరూ మరో ఆలియా భట్ కాకూడదు. ఎందుకంటే ఆమె చాలా అద్భుతంగా ఉంది. కేవలం ఆమె సినిమాల వల్ల మాత్రమే కాదు. తెరపై మాత్రమే కాదు.. నేను వ్యక్తిగతంగా అలియా భట్‌ను అభిమానిస్తాను. అందువల్లే నేను మరో ఆలియా భట్ కావాలనుకోవడం లేదు. నాకంటూ స్వంత వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఎవరైనా నన్ను షాలిని లాగే చూడాలని కోరుకుంటున్నా. అది నాకు చాలు.' అని అన్నారు. కాగా.. రణ్‌వీర్ సింగ్ సరసన జయేష్‌భాయ్ జోర్దార్‌లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన షాలిని.. తెలుగులో అర్జున్ రెడ్డి మూవీతో ఫేమస్ అయింది.