కయ్యాలతో కాలం గడిపిన ఆప్‌ | Delhi left behind as AAP kept fighting with Centre | Sakshi
Sakshi News home page

కయ్యాలతో కాలం గడిపిన ఆప్‌

Published Tue, Feb 4 2025 5:34 AM | Last Updated on Tue, Feb 4 2025 5:34 AM

Delhi left behind as AAP kept fighting with Centre

ఢిల్లీ వెనుకబాటు కారణం అదే: అమిత్‌షా 

న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో డబుల్‌ ఇంజిన్‌ బీజేపీ ప్రభుత్వమున్న కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుండగా, కేంద్ర ప్రభుత్వంతో ఆప్‌ కయ్యాలు పెట్టుకుంటూ ఢిల్లీని వెనుకబాటుకు గురి చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. జంగ్‌పురలో సోమవారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్, ఆ పార్టీ నేత మనీశ్‌ సిసోడియా బడే మియా–చోటే మియా మాదిరిగా ఢిల్లీని దోచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. 

మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవించిన ఏకైక విద్యావంతుడు ఈయన మాత్రమేనంటూ  సిసోడియానుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తరగతిగదుల పేరుతో కుంభకోణానికి పాల్పడిన సిసోడియా ఢిల్లీ చిన్నారుల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. అబద్ధాలతో మభ్యపెడుతున్న కేజ్రీవాల్‌.. చెత్తాచెదారం, విష జలం, అవినీతిని మాత్రమే ఢిల్లీ ప్రజలకిచ్చారన్నారు. ఆప్‌ తరఫున ఎన్నికైన వారిలో ప్రస్తుతం సగం మంది మాత్రమే మిగిలి ఉన్నారని, ఆ పార్టీ మునిగిపోయే ఓడ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా ఢిల్లీ మార్చే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement