శాంతి చర్చలకు సిద్ధం: కేంద్రానికి మావోయిస్టుల లేఖ | Ready For Peace Talks Says Moaists to Centre | Sakshi
Sakshi News home page

శాంతి చర్చలకు సిద్ధం.. కాల్పుల విరమణ పాటిస్తాం: కేంద్రానికి మావోయిస్టుల ప్రతిపాదన

Published Wed, Apr 2 2025 11:49 AM | Last Updated on Wed, Apr 2 2025 12:05 PM

Ready For Peace Talks Says Moaists to Centre

న్యూఢిల్లీ, సాక్షి: మావోయిస్ట్‌ రహిత భారత్‌ నినాదంతో ఆపరేషన్‌ కగార్‌ను దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఈ క్రమంలో గత 100 రోజుల్లో వివిధ ఎన్‌కౌంటర్‌లలో 120 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అదే సమయంలో మరోపక్క భారీగా దళ సభ్యులు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన ఉంచారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే.. కాల్పుల విరమణకు సిద్ధమంటూ మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది. ‘‘ప్రజల కోసం ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి.  ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణలో జరుపుతున్న హత్యాకాండను ఆపాలి.’’ 

.. శాంతి చర్చల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వాతావరణం కల్పించాలి. అప్పుడు మేం వెంటనే కాల్పుల విరమణ పాటిస్తాం’’ అని మావోయిస్ట్‌ కేంద్ర  కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో లేఖ విడుదలైంది. దీనికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement